Latest Post

Nagarjuna, Praveen Sattaru’s Film Second Schedule Commences From August 4 In Hyderabad

 Nagarjuna, Praveen Sattaru’s Film Second Schedule Commences From August 4 In Hyderabad



King Nagarjuna and Director Praveen Sattaru’s high octane action thriller being produced by Narayan Das K Narang, Puskur Ram Mohan Rao, and Sharrath Marar under the Sree Venkateshwara LLP and Northstar Entertainment Banners had completed its first schedule in Goa and a major second schedule will commence from August 4th in Hyderabad.


Key sequences of the film are being planned in various cities in India and abroad. Nagarjuna will be seen in an entertaining and action-packed role. Kajal Aggarawal is the heroine of the  the film. The casting includes Gul Panag and Anikha Surendran.


While Mukesh G is the Cinematographer, Bramha Kadali comes in as the Art Director and Robin Subbu and Nabha Master step in as the Action Directors.


Cast: Nagarjuna, Kajal Aggarwal, Gul Panag, Anikha Surendran


Technical Crew:

Director: Praveen Sattaru

Producers: NarayanDas Narang, Puskur RamMohan Rao, Sharrath Marar

Banners: Sree Venkateshwara LLP and Northstar Entertainment

Cinematography: Mukhesh G.

Action: Robin Subbu and Nabha Master

Art Director: Brahma Kadali

PRO: Vamsi-Shekar, BA Raju


Rakshasudu 2 Will Be A Pan-India Film With 100 Crore Budget: Producer Koneru Satyanarayana

 Rakshasudu 2 Will Be A Pan-India Film With 100 Crore Budget: Producer Koneru Satyanarayana



Producer Koneru Satyanarayana has delivered a blockbuster with his last film, Rakshasudu starring Bellamkonda Sreenivas. The film was directed by Ramesh Varma. The producer is currently making Khiladi with Mass Maharaja Ravi Teja which is again directed by Ramesh Varma. Meanwhile, he recently announced Rakshasudu 2 with Ramesh Varma. The name of the hero of the project is yet to be revealed.


On the occasion of Rakshasudu completing two years, Koneru Satyanarayana divulged some very interesting details of the second part. "Rakshasudu 2 story is more exciting than the first part. It will have more commercial elements than the first part and will be more thrilling," he said.


"Rakshasudu 2 will be on par with Hollywood films. It will be made on Pan-India level and will have a big star playing the lead role. We have earmarked a budget of 100 Crore and it will be entirely shot in London. We will announce the name of the hero at the right time," he added.


Koneru Satyanarayana was supposed to remake Rakshasudu in Bollywood but COVID-19 played a spoilsport. "Akshay Kumar has approached us to give the rights to Pooja Films and we readily gave away the rights as we felt he would be perfect for the role. Since we could not do the film, we gave the rights to Pooja Films. Ramesh Varma will be making his Bollywood debut with the movie," he told.


About Khiladi, he told, "It will be another blockbuster from our banner. Some big heroes from Bollywood are already after us for the movie rights. We will have to take a decision soon".


Koneru Satyanarayana also hinted a big project with his son, Havish. "You are going to see the best movies from Havish in the coming days. I strongly believe that he’s going to be a big star one day," he confidently said.


aha announces its new original, Taragathi Gadhi Daati, the official remake of TVF's hit show FLAMES

 aha announces its new original, Taragathi Gadhi Daati, the official remake of TVF's hit show FLAMES



100% Telugu OTT platform aha, that has redefined the conventions of entertainment in the Telugu digital space housing the biggest blockbusters and pathbreaking web shows, proudly announces its latest web series titled Taragathi Gadhi Daati. The series, presented by Center Fresh, that captures the innocence of teenage romance is the official Telugu remake of the hit TVF original FLAMES. Directed by Mallik Ram, the man behind the popular web series Pelli Gola, the show stars Harshith Reddy, Payal Radhakrishna and Nikhil Devadula in key roles. The first poster of the show brims with innocence and charm in an idyllic setting, with two happy-go-lucky youngsters chatting away as if there's no tomorrow.


Taragathi Gadhi Daati, set amidst the heart of Rajahmundry, has been adapted in Telugu with utmost authenticity. The show that captures the spirit of everyday life in and around the Godavari region in Andhra Pradesh, revolves around Krishna a.k.a Kittu, a young intermediate student, whose parents Shankar and Gauri run a coaching centre. Despite his solid credentials as a student and being a Mathematics-enthusiast, Krishna isn't exactly motivated to study, only until an encounter with a new student in the coaching centre, Jasmine, turns his world topsy turvy. 


The five-episode long show takes viewers through the tender romance unfolding between Krishna and Jasmine and throws light on the sweet little nothings, the chaos of teenage years. The male lead Harshith Reddy has already proved his worth as a performer with the rural comedy Mail earlier this year. His co-star Payal Radhakrishna has established herself as an actress across multiple Kannada, Tamil web shows, namely Bhinna and Singapenne. Nikhil Devadula, a well-known child artiste, part of hit films like Uyyala Jampala and Baahubali, is now geared up to wow audiences as a mature actor with Taragathi Gadhi Daati.


Taragathi Gadhi Daati is the second remake of a TVF original on aha after Commitmental, the regional adaptation of Permanent Roommates. Commitmental had starred Udbhav Raghunandan and Punarnavi Bhupalam in the lead roles. aha is on a high after its mind-bending sci-fi crime thriller Kudi Yedamaithe won the hearts of critics and audiences recently. Directed by Pawan Kumar, Kudi Yedamaithe surprised audiences with riveting twists and turns and featured fantastic performances by its lead cast comprising Amala Paul, Rahul Vijay and Ravi Prakash. Some of aha's popular releases in 2021 include Krack, Naandhi, 11th Hour, Zombie Reddy, Chaavu Kaburu Challaga and In the Name of God.

Ram Karthik Telisinavallu First Look Launched

 హీరో రామ్ కార్తీక్‌ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన "తెలిసిన వాళ్ళు" చిత్ర బృందం



 "తెలిసినవాళ్ళు" టైటిల్ వినగానే తెలుగు ప్రేక్షకులకు ఇట్టే కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం నుండి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు  యుట్యూబ్ లో ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అత్యున్నత ప్రమాణాలతో నిర్మిత మవుతున్న ఈ చిత్రాన్ని సిరెంజ్ సినిమా నిర్మిస్తుంది.. కేఎస్వీ ఫిలిమ్స్ సమర్పణలో సిరెంజ్ సినిమా పతాకంపై రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ నటీ,నటులుగా విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం  'తెలిసినవాళ్లు'. ఈ చిత్రం 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రోస్ట్ ప్రొడక్షన్స్ కు వెళ్ళబోతున్న సందర్భంగా చిత్రంలోని హీరో రామ్ కార్తీక్‌ లుక్ ను విడుదల చేశారు.


 ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...  ఈ చిత్రం నుండి ఇంతకు క్రితం విడుదల చేసిన హెబ్బా పటేల్  ఫస్ట్ లుక్ కి ఎంతటి ఆదరణ లభించిందో.. అలాగే హీరో రామ్ కార్తీక్ లుక్ కూడా మంచి స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు కోవిద్ కారణంగా షూటింగ్ డిలే అయ్యింది మరల ఇప్పుడు హీరో లుక్ కి మంచి స్పందన రావటం తో ఇప్పటి నుంచి విన్నూతనమైన రీతిలో ప్రమోషన్స్ చేయబోతున్నాం. హీరో,హీరోయిన్స్ రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ లు ఇద్దరూ చాలా బాగా నటించారు. సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ తో పాటు మిగిలిన సీనియర్ నటులందరూ కూడా చాలా చక్కగా నటించారు. మా సినిమాకు పనిచేస్తున్న టెక్నీషియన్స్ వారు ఫిలిం స్కూల్  లో గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసుకొని మా సినిమాకు సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతే కాకుండా అత్యున్నత ప్రమాణాలతో నిర్మిత మవుతున్న మా చిత్రం ఒక సాంగ్ మినహా దాదాపుగా 90 శాతం షూటింగ్  పూర్తి చేసుకుంది. మిగిలిన పది శాతం  చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సిద్ధమైంది అని అన్నారు.


 నటీనటులు

రామ్ కార్తీక్, హెబ్బా పటేల్,  సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ తదితరులు


 సాంకేతిక నిపుణులు

మూవీ: "తెలిసినవాళ్ళు"

సమర్పణ: కేఎస్వీ ఫిలిమ్స్

నిర్మాత: సిరెంజ్ సినిమా

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విప్లవ్ కోనేటి

ఛాయాగ్రహణం: అజయ్ వి నాగ్

కూర్పు: ధర్మేంద్ర కాకరాల

సంగీతం: దీపక్ వేణుగోపాలన్

సాహిత్యం: డాక్టర్ జివాగో

కళ: ఉపేందర్ రెడ్డి

కోరియోగ్రఫీ: జావేద్ మాస్టర్, శైలజ మాస్టర్

ఫైట్స్: సీ హెచ్ రామకృష్ణ

లైన్ ప్రొడ్యూసర్ : డాక్టర్ జేకే సిద్ధార్థ

కో డైరెక్టర్ : కటిగళ్ళ సుబ్బారావ్

పీఆర్వో : మధు వీ.ఆర్

We Made '22' Movie Lavishly With Uncompromising Quality - Hero Rupesh Kumar

 We Made '22' Movie Lavishly With Uncompromising Quality - Hero Rupesh Kumar



Rupesh Kumar Choudhary is making his debut as a Hero with Different Action Thriller '22'. ShivaKumar B. is Directing this film along with providing Story, Screenplay and Dialogues. SMT Susheela Devi is Producing this film under Maa Aai Productions banner. Saloni Mishra is the heroine. Hero Rupesh is celebrating his birthday on August 2nd. On this occasion...


Hero Rupesh Kumar Choudhary said, " I came from business family. I am very fond of acting since my childhood. My love for acting brought me to industry. I got excited while Shiva narrating the script. This is an action thriller. '22' number plays a major point in this film.  I played the role of a powerful police officer 'Rudra' in this film. I have completely transformed myself for the character. 'Khaidi No 150' 'Baahubali' 'Saaho' fame Jashua Master has composed terrific action sequences for our film. Though this is the first film for Shiva as a Director, He made '22' with full clarity as he has very good experience in Direction department. We made this film in an uncompromising manner in making and quality.  Saloni Mishra is playing as the heroine. She did a very important role as a CBI officer. Bollywood Actor Vikramjeet Virk did a negative role. We wanted to release our film in theatres only.  Now the situation is getting better and theatres are open. Recently released films are also doing good. We are planning to release our film for Dussehra or Diwali. I listened to some scripts during lockdown and I am currently working on them."


Pushpa First Single Announcement

 ఆగస్టు 13న విడుద‌ల కానున్న‌ ఐదు భాషల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప తొలి సింగిల్ సాంగ్ దాక్కో దాక్కో మేక



ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే చాలు అభిమానులు ఊగిపోతారు. ఈ కాంబినేషన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. ఈ ముగ్గురు పేర్లు ఒక పోస్టర్ పై కనిపిస్తే థియేటర్ బయట జనాలు డాన్స్ చేస్తారు. సుకుమార్, అల్లు అర్జున్, దేవి కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. ఆగస్టు 13న ఐదు భాషల్లో పుష్ప తొలి సింగిల్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ఐదు భాషల్లో 5గురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడబోతున్నారు. తెలుగులో శివం.. హిందీలో విశాల్ దడ్లాని.. కన్నడంలో విజయ్ ప్రకాష్.. మలయాళంలో రాహుల్ నంబియార్.. తమిళంలో బెన్నీ దయాల్.. దాక్కో దాక్కో మేక పాటను ఆలపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. రెండు భాగాలుగా పుష్ప సినిమా రానుంది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.


నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన


టెక్నికల్ టీం:


కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్

నిర్మాతలు: నవీన్ ఎర్నేని వై రవిశంకర్

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు


K Raghavendra Rao to Release Induvadhana Teaser on August 4th



 ఆగస్ట్ 4న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ‘ఇందువదన’ టీజర్ విడుదల.. 


శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై MSR దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు అనూహ్యమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా పోస్టర్ చాలా కళాత్మకంగా ఉంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు ఎమ్మెస్సార్. విడుదలైన క్షణం నుంచే ఈ లుక్‌కు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా టీజర్‌ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 4 ఉదయం 10 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆయన చేతుల మీదుగా టీజర్ విడుదల కార్యక్రమం జరగనుంది. వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.


నటీనటులు: 

వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక (కార్తికదీపం ఫేమ్), జెర్సీ మోహన్ తదితరులు


టెక్నికల్ టీం: 

దర్శకుడు: ఎమ్మెస్సార్

బ్యానర్: శ్రీ బాలాజీ పిక్చర్స్

నిర్మాత: శ్రీమతి మాధవి ఆదుర్తి

కో ప్రొడ్యూసర్: గిరిధర్

కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సతీష్ ఆకేటి 

సంగీతం: శివ కాకాని

కో డైరెక్టర్: ఉదయ్ రాజ్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

ఆర్ట్: వై నాగు

లిరిక్స్: భాస్కరబట్ల, తిరుపతి జావన

లైన్ ప్రొడ్యూసర్స్: సూర్యతేజ ఉగ్గిరాలా, వర్మ

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Ishq Success Meet

 ‘ఇష్క్’ వంటి ఓ ఎక్స్‌పెరిమెంట‌ల్ మూవీని ఆద‌రిస్తోన్న తెలుగు ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు:  నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి




యంగ్ హీరో తేజ స‌జ్జ‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోహీరోయిన్లుగా య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తూ దక్షిణాదిలోని సుప్ర‌సిద్ద నిర్మాణ ‌సంస్థ‌ల్లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన‌ చిత్రం `ఇష్క్‌`. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన‌ ఈ చిత్రం జులై30న గ్రాండ్‌గా థియేట‌ర్స్‌లో విడుద‌లైంది. డిఫ‌రెంట్ అటెంప్ట్‌తో  హిట్ టాక్ తెచ్చుకుని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోన్న ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించింది. అందులో భాగంగా కేక్ కట్ చేసి యూనిట్ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా...


నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి మాట్లాడుతూ ‘‘ఇష్క్’ సినిమా ఓ ఎక్స్‌పెరిమెంట‌ల్ మూవీ. ముందుగా పాండమిక్ ప‌రిస్థితుల్లో సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని అనుకున్నాం. కానీ.. మా సూప‌ర్ గుడ్ ఫిలింస్‌లో వ‌చ్చిన సినిమాల‌న్నీ థియేట‌ర్స్‌లోనే విడుద‌ల‌య్యాయి. అందువ‌ల్ల ఇష్క్ సినిమాను కూడా థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయాల‌ని వెయిట్ చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాం. మా న‌మ్మ‌కం నిజ‌మైంది. ప్రేక్ష‌కులు సినిమాను చ‌క్క‌గా ఆద‌రించారు. మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. నిర్మాత‌లుగా మేం హ్యాపీ. మా డైరెక్ట‌ర్ రాజుగారికి, హీరో తేజా స‌జ్జా, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌కి, టీమ్‌కి అభినంద‌న‌లు’’ అన్నారు.


హీరో తేజా స‌జ్జా మాట్లాడుతూ ‘‘సినిమా కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతుంటే భ‌య‌ప‌డ్డాను. అస‌లు థియేట‌ర్స్ ఓపెన్ అవుతున్నాయో లేవోన‌నే సంగ‌తి ప్రేక్ష‌కుల‌కు తెలుసో తెలియ‌దోన‌ని టెన్ష‌న్ ప‌డ్డాను. కానీ ప్రేక్ష‌కులు మా టెన్ష‌న్‌ను దూరం చేశారు. అన్ని షోస్‌కు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ల‌భించింది. నా పెర్ఫామెన్స్‌కు మంచి అప్లాజ్ ద‌క్కింది. ఇంత‌కు ముందు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ఇంత బ‌రువైన పాత్ర‌, హీరో క్యారెక్ట‌ర్ మీద‌నే సినిమా న‌డిచే పాత్ర చేయ‌లేదు. ఇదే ఫ‌స్ట్ టైమ్‌. చాలా సంతోషంగా ఉంది. ఇదొక ఎక్స్‌పెరిమెంటల్ మూవీ. రొటీన్‌కు భిన్న‌మైన సినిమా అని ముందు నుంచి చెబుతున్నాం. ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌’’ అన్నారు.


ఈ కార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్ రాజు, నిర్మాత వాకాడ అంజ‌న్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


Timmarusu Success Meet

 నాని అన్న చెప్పిన‌ట్లు సినిమాపై ప్రేమ‌తో థియేట‌ర్స్‌కు వ‌చ్చి  ‘తిమ్మ‌రుసు’ను సూప‌ర్ హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌:  హీరో స‌త్య‌దేవ్‌



స‌త్య‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘తిమ్మ‌రుసు’. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై శ‌ర‌ణ్ కొప్పిశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ కోనేరు, సృజ‌న్ య‌ర‌బోలు  ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 30న ఈ సినిమా విడుద‌లైన సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా శనివారం ఈ సినిమా స‌క్సెస్‌మీట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు. 


హీరో స‌త్య‌దేవ్ మాట్లాడుతూ ‘‘ఇది నా తొలి స‌క్సెస్‌ఫుల్ సినిమా స‌క్సెస్ మీట్‌. కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత ‘తిమ్మ‌రుసు’  థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతుంటే చిన్న టెన్ష‌న్ ఉండింది. అయితే ఆ టెన్ష‌న్‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించి త‌గ్గించారు. సినిమా విడుద‌ల‌కు ముందు ఎంత ఎమోష‌న్ అయ్యానో ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నాను. ఇంత మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్‌కు థాంక్స్‌. పూరిగారు, కొర‌టాల‌గారు కూడా మాట్లాడారు. వారితో ఎమోష‌న‌ల్‌గా మాట్లాడాను. ఓ సినిమాను డైరెక్ట‌ర్ అండ్ టీమ్ 39 రోజుల్లో.. సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయ‌డంలో ఎంత క‌ష్టుముంటుందో, అన్ని వ‌స‌తుల‌ను స‌మ‌కూర్చిన నిర్మాత కూడా అంతే క‌ష్ట‌ప‌డ‌తాడు. ఈ సినిమాకు అండ‌గా నిల‌బ‌డ్డ నిర్మాత‌లు మ‌హేశ్ కోనేరు, సృజ‌న్ య‌ర‌బోలుగారికి థాంక్స్‌. కంఫ‌ర్ట్ జోన్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి చేసిన సినిమా. శ్రీచ‌ర‌ణ్ అద్భుత‌మైన నేప‌థ్య సంగీతాన్ని అందించాడు. అంకిత్‌, ఝాన్సీగారు, అజ‌య్‌గారు ఇలా అంద‌రూ ఎంత‌గానో స‌పోర్ట్ అందించారు. ఇక ఈ సినిమాలో బ్ర‌హ్మాజీగారి రోల్‌కు చాలా మంచి అప్లాజ్ వ‌స్తుంది. ఈ సినిమాకు ఆయ‌నే బిగ్గెస్ట్ ఎసెట్‌గా నిలిచారు. సినిమాలో లుక్ ప‌రంగా నన్ను కొత్త‌గా చూపించిన సినిమాటోగ్రాఫ‌ర్ అప్పూ ప్ర‌భాక‌ర్‌కి థాంక్స్‌. అలాగే సినిమాను ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్లే క్ర‌మంలో ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి స‌పోర్ట్ చేసిన తార‌క‌న్న‌కి, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చి స‌పోర్ట్ చేసిన నాని అన్న‌కు స్పెషల్ థాంక్స్‌. నాని అన్న చెప్పినట్లు .. థియేట‌ర్‌కు వ‌చ్చిన తిమ్మ‌రుసు సినిమాను సూప‌ర్ హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. 

ఈ సినిమా ఇచ్చిన న‌మ్మ‌కంతో ఇంకా మంచి సినిమాలు చేయాల‌ని బ‌లంగా అనిపించింది. సినిమా స‌క్సెస్‌లో భాగ‌మైన అందరికీ థాంక్స్‌’’ అన్నారు. 


నిర్మాత మ‌హేశ్ కోనేరు మాట్లాడుతూ ‘‘సినిమాను స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కులంద‌రికీ, సినిమా స‌క్సెస్‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన అంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా థాంక్స్‌. కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్స్‌లోకి మా సినిమాను విడుద‌ల చేస్తుంటే రిస్క్ చేస్తున్నార‌ని చాలా మంది భ‌య‌పెట్టారు. అయితే ప్రేక్ష‌కులు మా భ‌యాన్ని పోగొట్టి సినిమాను పెద్ద స‌క్సెస్ చేశారు. మా బ్యాన‌ర్‌లో వ‌చ్చిన తిమ్మ‌రుసు, మాస్ట‌ర్‌, విజిల్‌, 118 చిత్రాలు మంచి హిట్‌ను సాధించ‌డం అనేది మాకు నిర్మాత‌లుగా ఎంతో సంతోషానిచ్చే విషయం’’ అన్నారు. 


బ్ర‌హ్మాజీ మాట్లాడుతూ ‘‘‘తిమ్మ‌రుసు’సినిమా విడుదలవుతుందని, అందరినీ సపోర్ట్ చేయమని సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశాను. ఒక‌రిద్ద‌రు మిన‌హా అంద‌రూ చాలా బాగా స‌పోర్ట్ చేశారు.ఇక సినిమాను థియేట‌ర్స్‌కు వ‌చ్చి చూస్తున్న ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. నాపై న‌మ్మ‌కంతో మంచి రోల్ ఇచ్చిన డైరెక్ట‌ర్ శ‌ర‌ణ్ కొప్పిశెట్టికి, నిర్మాత‌లు.. మ‌హేశ్ కోనేరు, సృజ‌న్‌గారికి థాంక్స్‌. హీరో స‌త్య‌దేవ్ నటుడిగా ఎంతో ఇష్టం. త‌న‌తో క‌లిసి ఓ మంచి సినిమా చేయ‌డం సంతోషంగా ఉంది. అలాగే హీరోయిన్ ప్రియాంక‌ జ‌వాల్క‌ర్‌, అంకిత్ అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు’’ అన్నారు. 


ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ ‘‘మా సినిమాను థియేటర్స్‌లో ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. సినిమాను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయ‌డం అంటే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అంత సుల‌భ‌మైన విష‌య‌మైతే కాదు, కానీ ఎంటైర్ యూనిట్ ఎంత‌గానో స‌పోర్ట్ చేసింది. మా కష్టాన్ని ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఆద‌రించారు. వారిచ్చిన ఈ న‌మ్మ‌కంతో మ‌రింత ముందుకు వెళ‌దాం’’ అన్నారు. 


ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రిచరన్ పాకాల, అంకిత్ త‌దిత‌రులు పాల్గొన్నారు

Rama Krishna And Monica On Board For Nandamuri Kalyan Ram Most anticipated periodic Film- Devil- The British Secret Agent

 Rama Krishna And Monica On Board For Nandamuri Kalyan Ram Most anticipated periodic Film- Devil- The British Secret Agent



Rama Krishna and Mounica who worked for films like Pushpa , Rangasthalam, Uppena, Thalaivi, Antariksham 9000 kmph etc. which had prominence for art work come on board as production designer and art director for this periodic venture.


Nandamuri Kalyan Ram will be working with yet another young director Naveen Medaram and the unique story set in British Era bowled him to give his nod for the project Devil to be produced by Abhishek Nama under Abhishek Pictures banner. The film comes with the tagline- The British Secret Agent.


Set in Madras presidency Of British India in 1945, Devil is the story of a British secret agent who takes up the job of solving a dark mystery. This mystery is deeper than he could fathom and this leads him into a web of love, deceit and betrayal. His success and failure, both have serious repercussions and this mystery has the potential to change the course of history.


Well-known actors and top-notch technicians will be working for this magnum opus. Srikanth Vissa, the writer of Pushpa, has provided story for the film that will have music by Harshavardhan Rameshwar.


Devil’s first look was released for Kalyan Ram’s birthday and it got overwhelming response. Kalyan Ram appeared in a never-seen-before avatar as a secret British agent.


Films of these kinds require huge sets depicting culture and milieu during pre-independence and it’s a tough task to made audience to believe the story actually happens during the period.


Currently working for high-budget entertainers such as Ram Charan-Shankar’s untitled flick and Allu Arjun-Sukumar’s Pushpa, Rama Krishna and Monica accept the challenge to take us back to pre-independence time.


Devansh Nama is presenting the film which will disclose an unwritten chapter in history.


Devil will be made as a Pan India project on lavish budget with high technical standards in Telugu, Hindi, Tamil and Kannada languages.


In coming days, there are few other surprising announcements coming from the makers.


Cast: Nandamuri Kalyan Ram


Technical Crew: 


Screenplay & Direction: Naveen Medaram

Producer: Abhishek Nama

Banner: Abhishek Pictures 

Presents: Devansh Nama

Story: Srikanth Vissa

Music: Harshavardhan Rameshawar

Production Designer & Art Director: Rama Krishna & Monica

Pro: Vamsi-Shekar, Vamsi Kaka

Naarappa Success Meet

 నార‌ప్ప` స‌క్సెస్ మీట్...



విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన  చిత్రం `నార‌ప్ప‌`. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఇటీవ‌ల అమేజాన్ ప్రైమ్‌వీడియోలో విడుద‌లై స‌క్సెస్‌ఫుల్‌గా స్ట్రీమ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో..


న‌టుడు కార్తిక్‌ ర‌త్నం మాట్లాడుతూ - ``ముందుగా న‌న్ను ప్రొత్స‌హించి, నాకు ధైర్యం ఇచ్చి మునిక‌న్నా క్యారెక్ట‌ర్ చేయించిన సురేష్‌బాబుగారికి ధ‌న్య‌వాదాలు. మునిక‌న్నా పాత్ర‌ని ఓన్ చేసుకున్న తెలుగు ప్రేక్ష‌కుల‌కి కృత‌జ్ఞ‌త‌లు.``అన్నారు.


ప్ర‌ముఖ నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ  -  ``మా టీమ్ అంద‌రూ 52రోజులు చాలా క‌ష్ట‌ప‌డి ఈ సినిమా తీశారు. ఆ స‌మ‌యంలోనే క‌రోనా ఫ‌స్ట్‌వేవ్ మొద‌లైంది. ఒక నిర్మాత‌గా మా టీమ్ అంద‌రిని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సిన బాధ్య‌త నా మీద ఉంది కాబ‌ట్టి ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుని ఈ చిత్రాన్ని పూర్తిచేశాం. మా టీమ్ కూడా బాగా స‌పోర్ట్ చేసింది. మామూలుగా నేను ఎప్పుడు యాక్ట‌ర్స్ బాగా చేశారు అని పొగ‌డ‌ను ఎందుకంటే వాళ్లు బాగా చేస్తార‌నే నా సినిమాలో పెట్టుకుంటాను. శ్రీ‌కాంత్ ఈ సినిమా ర‌ష్ చూపించిన‌ప్పుడే బాగా న‌చ్చింది. అమేజాన్ ప్రైమ్ కి ఇండియావైడ్‌గా 4400 గ్రామాల్లో స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉన్నారంట‌..అందులో 4100 గ్రామాల్లో ఈ సినిమా చూశార‌ని వారు చెప్పారు. అలాగే 240 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తే 180కి పైగా దేశాల్లో ఈ సినిమా చూశారు. అమేజాన్ వారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాని ఇంత బాగా ప్ర‌మోట్ చేసిన మీడియా వారికి థ్యాంక్స్‌.


హీరోయిన్ ప్రియ‌మ‌ణి మాట్లాడుతూ  -  ``నేను ఎప్ప‌టినుంచో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో వ‌ర్క్ చేయాలి అనుకున్నారు. ఆ అవ‌కాశం ఇచ్చిన సురేష్‌బాబు గారికి, డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్‌గారికి థ్యాంక్స్‌. వెంకీసార్ నార‌ప్ప పాత్ర‌లో ఒదిగిపొయారు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా హ్యాపీ. కార్తిక్ రత్నం, రాకీ, బుజ్జ‌మ్మ ఇలా అంద‌రూ  చాలా బాగా చేశారు`` అన్నారు.


ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల మాట్లాడుతూ - ``మా టీమ్ అంద‌రి క‌ష్టం, ఆ దేవుని అనుగ్ర‌హం వ‌ల్ల చాలా గొప్ప‌విజ‌యం ల‌భించింది. ఓటీటీలో రిలీజైన‌ప్ప‌టికీ మారుమూల గ్రామాల ప్ర‌జ‌లు కూడా చూసిన త‌ర్వాత చాలా సంతోషంగా ఉంది. మా టీమ్ అంద‌రి స‌మిష్టికృషి `నార‌ప్ప‌`. ఆర్టిస్టులు అంద‌రూ త‌మ పాత్ర‌ల‌లో ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేశారు. వెంక‌టేష్ గారితో వ‌ర్క్ చేస్తున్న‌ప్పుడు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త విష‌యాలు తెలుస్తాయి. ఈ సినిమాకి క‌ష్ట‌ప‌డ్డ ప్ర‌తి ఒక్క‌రికి ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను`` అన్నారు.


దర్శకుడు అనిల్‌రావిపూడి మాట్లాడుతూ – ‘‘‘ఎఫ్‌ 3’ సినిమా షూటింగ్‌ సమయంలో వెంకటేశ్‌గారు ‘నారప్ప’ సినిమా రీమేక్‌ గురించి చెప్పారు. ఆయన్ను ఆ పాత్రలో చూడాలని నేను చాలా ఎగ్జ‌యిట్‌ అయ్యాను. ‘నారప్ప’ చిత్రంలో వెంకటేశ్‌గారి ఇంటెన్స్‌ యాక్టింగ్‌ చూశాను. వెంకటేష్‌గారు ప్రతి సినిమాతో సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు డిఫరెంట్‌ రోల్స్‌ చేస్తుంటారు. వరుస యాక్షన్‌ సినిమాలు చేస్తూ, సడన్‌గా ‘చంటి’లాంటి ఓ సినిమా చేస్తారు. ‘అబ్బాయిగారు’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేసి ఆ వెంటనే ‘గణేశ్‌’లాంటి మాస్‌ యాక్షన్‌ మేసేజ్‌ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ చేస్తారు. ప్రతి సినిమాకు ఆర్టిస్టుగా ఏదో ఒకటి చేయాలని ట్రై చేస్తూనే ఉంటారు. ఆర్టిస్టుగా వెంకటేశ్‌గారు చేయని పాత్ర లేదు. ఈ సినిమాలోని క్లోజప్‌ షాట్స్‌ను వెంకటేష్‌గారిని గమనించాను. అద్భుతంగా చేశారు. క్రికెట్‌ భాషలో చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమలో వెంకటేశ్‌గారు క్లాస్‌ యాక్టర్‌. ఆయనతో కలిసి వర్క్‌ చేస్తున్నట్లు చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. ‘నారప్ప’ సినిమాలో వెంకటేష్‌ గారు, ప్రియమణిగారు, కార్తీక్‌రామ్‌ యాక్ట్‌ చేసినట్లు అనిపించలేదు. వారు వారి పాత్రల్లో జీవించినట్లు అనిపించింది. ప్రియమణి గొప్ప నటి. ప్రియమణిగారు తన నటనకు తగ్గ పాత్రలు చేసిన ప్రతిసారి ఆ సినిమా హిట్టే. ఈ సినిమాలో నాకు నటీనటులు, సాంకేతికనిపుణులు బాగా కష్టపడ్డారు. ఇలాంటి సినిమాలు చేసినప్పుడు వస్తే అప్రిషియేషన్‌ కిక్‌ వేరు. నారప్ప లాంటి సినిమానుల ఎగ్జిక్యూట్‌ చేయాలంటే డి.సురేష్‌బాబుగారే చేయాలి. దర్శకులు శ్రీకాంత్‌ అడ్డాల గారు ‘నారప్ప’ సినిమాను ఎలా డైరెక్ట్‌ చేస్తారా? అనిపించింది. ఎందుకంటే ఆయన ఇది వరకు చేసిన సినిమాలు వేరు. శ్రీకాంత్‌ అడ్డాల గారిలో అద్భుతమైన కమర్షియల్‌ యాంగిల్‌ ఉందని తెలిసింది. శ్రీకాంత్‌ అడ్డాల గారికి కంగ్రాట్స్‌.  ‘ఎఫ్‌ 3’ సినిమా రైట్‌ ప్లేస్‌లో రైట్‌ టైమ్‌లో వస్తుంది. ఎఫ్‌ 3లో ఎఫ్‌ 2కు మించిన వినోదం ఉంది.


హీరో విక్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ– ‘‘ ‘నారప్ప’ సినిమాను పెద్ద సక్సెస్‌ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రేక్షకుల రెస్పాన్స్‌కు థ్యాంక్స్‌. నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. మరెన్నో ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేశాను. కానీ ‘అసురన్‌’ చిత్రం నాకు డిఫరెంట్‌గా అనిపించి, ‘నారప్ప’ చేయాలని వెంటనే ఒప్పుకున్నాను. ‘అసురన్‌’లాంటి ఓ సినిమాను ఇచ్చిన దర్శకుడు వెట్రీమారన్, యాక్టర్‌ ధనుష్, నిర్మాత థానుగారికి థ్యాంక్స్‌. ‘అసురన్‌’ లేకపోతే నారప్ప ఉండేది కాదు. తెలుగు ఆడియన్స్‌కు నారప్ప కొత్తగా అనిపిస్తుంది. నారప్ప క్యారెక్టర్‌ను చాలెంజింగ్‌గా తీసుకున్నాను. ఈ చాలెంజ్‌లో నేను సక్సెస్‌ కావడానికి మా టీమ్‌ నాలో నింపిన ఎనర్జీ కూడా కారణం. షూటింగ్‌ సమయంలో ‘నారప్ప’ క్యారెక్టర్‌లో చాలా కాలం ఉండిపోయాను. ‘నారప్ప’ మంచి ఎక్స్‌పీ రియన్స్‌. నారప్ప సినిమాలోని ‘రా..నరకరా’ పాట లిరిక్‌ను అనంతశ్రీరామ్‌ బాగా రాశారు. ఈ లిరిక్‌ వినప్పుడు షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్‌ చేస్తామా? అనిపించింది. ముఖ్యంగా నా అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నాను. నారప్ప ఓటీటీలో వచ్చిన వారు ఆదరించారు. ఫ్యామిలీస్‌తో కలిసి నారప్ప సినిమా చూస్తున్నారు. ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. వారికి థ్యాంక్స్‌. మళ్లీ ‘ఎఫ్‌ 3’వస్తుంది. సంక్రాంతికి వస్తుంది. మళ్లీ ప్రేక్షకులను నవ్విస్తుంది`` అన్నారు.

Kiara Advani in Shankar -Ramcharan RC15

 



Kiara Advani joins the stellar team of Director Shankar, Ram Charan, and producer Dil Raju for the next big ticket film!


On the ocassion of Kiara Advani's birthday, Team RC 15 made a special announcement of their Pan India film. The gorgeous actress joins the cast as the leading lady.


Kiara who is excited about this collaboration says, "It's definitely one of the best birthday presents I have gotten so far. I am excited as well as nervous to work with renowned and experienced names of our film fraternity. I am eagerly waiting to begin the shoot and hoping that this incredible opportunity is translated wonderfully on screen!"


RC 15 will release in 3 languages – Telugu, Tamil, Hindi.


Directed by Shankar, the film is jointly produced by Dil Raju and Shirish Garu under the banner of Sri Venkateswara Creations for a PAN India release.


Jacqueline Fernandez Is Gadang Rakkamma in Kichcha Sudeepa starrer Vikrant Rona

 Jacqueline Fernandez Is Gadang Rakkamma in Kichcha Sudeepa starrer Vikrant Rona 



In line with the grand revelations that have been announced about the upcoming Kichcha Sudeepa-starrer Vikrant Rona. After announcing that the film will be made in 3D, its makers now unveil the first look of Jacqueline Fernandez, who will be seen essaying an interesting role in it. Displayed on billboards across Mumbai, and other cities of the country. The first glimpse reveals the Bollywood star's character Raquel D’Costa Aka Gadang Rakkamma in the pan-Indian 3D film and her look as well. 




Her look in the film will have a fusion of multiple ethnicities. She plays ‘Gadang Rakkamma’ who runs a tavern in a fictional place. She will be seen matching wits with Vikrant Rona, essayed by Baadshah Kichcha Sudeep 




Jacqueline inspired headlines as the word about her stepping aboard the Vikrant Rona universe spread like fire. Not only will the stunning actress be seen portraying a pivotal character, she will also be seen shaking a leg with Sudeepa in the film. 




Producer Jack Manjunath says, "The story of the world's new hero gets all the more exciting with the entry of Jacqueline. We're happy to share a glimpse of what she brings to the movie. We're on our way to creating an extravagant piece of cinema that will be remembered by generations to come and we're thrilled about the growing anticipation surrounding it." 




Director Anup Bhandari says, “It feels amazing to be able to bring an element of surprise with each announcement. Jacqueline's poster reveal was planned to convey the scale of the film yet again and how invested we are in fulfilling the promise of offering the audience a movie that will make their time in theatres worth it."




Jacqueline says, "The team of the film has been very welcoming and every moment that's going into its making has been exciting for me. I thank the producers for such a grand poster reveal from the bottom of my heart. This film is going to be super special and memorable for me."




Vikrant Rona is a multilingual action adventure that will see a 3-D release in 14 languages and 55 countries. Directed by Anup Bhandari, produced by Jack Manjunath and Shalini Manjunath, co-produced by Alankar Pandian, music by B Ajaneesh Loknath, the film features sets designed by DOPs William David and Award winning art director Shivkumar. It stars Kichcha Sudeepa, Nirup Bhandari and Jacqueline Fernandez.


Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Notice Out, Superstar’s Birthday Blaster On August 9th

 Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Notice Out, Superstar’s Birthday Blaster On August 9th



The makers of Superstar Mahesh Babu’s highly anticipated flick Sarkaru Vaari Paatabeing directed by the Parasuram directorial have come up with rejoicing updates. While they have released First Notice poster, Superstar’s Birthday Blaster is announced to be out on August 9th.


The First Notice looks kick-ass and different from regular first look posters. Mahesh Babu appears at stylish best and he is seen coming out of a luxury red-colour car. Sports a tiny round earring, long hair and a one-rupee coin tattoo behind ear, Mahesh Babu is super cool here in trendy outfit.


We can also see three men leaving the place on bikes. This all hints at Mahesh Babu going to take on them. The poster is striking and sets bar high for Superstar’s Birthday Blaster to be out in another nine days.


The poster also shows January 13th as the film’s release date. It’s an ideal date, as the next day will be Bhogi, followed by Sankranthi and Kanuma. The extended weekend will favour the film to rake in record collections.


On the other hand, Sankranthi is a lucky season for Mahesh Babu who enjoyed several hits for the festival. Particularly, his last movie Sarkaru Vaari Paata ended up as highest grosser for the actor.


Sarkaru Vaari Paata is produced by Mythri Movie Makers, GMB Entertainment and 14 Reels Plus banners. Star heroine Keerthy Suresh is essaying Mahesh Babu’s love interest in the film being produced jointly by Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta.


Music sensation Thaman SS is providing music for the film, while R Madhi is the cinematographer. Marthand K Venkatesh is the editor, while AS Prakash is art director.


Sarkaru Vaari Paata’s shooting is currently progressing in Hyderabad.


Cast: Mahesh Babu, Keerthy Suresh, Vennela Kishore, Subbaraju and others.


Technical Crew:


Written and directed by: Parasuram Petla

Producers: Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta

Banners: Mythri Movie Makers, GMB Entertainment, 14 Reels Plus

Music Director: Thaman SS

Cinematography: R Madhi

Editor: Marthand K Venkatesh

Art Director: AS Prakash

Fights: Ram - Laxman

Line Producer: Raj Kumar

Co-Director: Vijaya Ram Prasad

CEO: Cherry

VFX Supervisor – Yugandhar

Kadambari Kiran Manam Saitham Contribution For Education

 


చదువుల తల్లికి అండగా నిలిచిన 'మనం సైతం' కాదంబరి కిరణ్

పేదలను ఆదుకోవడంలో అలుపు లేక శ్రమిస్తున్నారు 'మనం సైతం' కాదంబరి కిరణ్. సాటివారికి సాయం చేయడంలో యోధుడై పోరాటం సాగిస్తున్నారు. ఈ సాయం కొన్నిసార్లు తన శక్తికి మించినా వెనకడగు వేయక అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. వేలాది మందికి ప్రత్యక్షంగా మరెన్నో రెట్ల పేదలకు పరోక్షంగా సాయం అందించిన కాదంబరి కిరణ్ తాజాగా ఓ చదువుల తల్లి ఉన్నత విద్య కోసం అండగా నిలబడ్డారు.


తేజస్వి తల్వ అమెరికా లోని అలబామాలో సైబర్ సెక్యూరిటీ లో ఎంఎస్ చేద్దామని ఆశపడింది. కానీ ఆర్ధిక బలం లేదు, తండ్రి చనిపోయాడు, దిక్కుతోచని స్థితిలో 'మనం సైతం' ని ఆశ్రయించింది. ఆ పాపను ఎలాగైనా ఉన్నత చదువులు చదివించాలని దృఢ సంకల్పం తీసుకున్న కాదంబరి కిరణ్...తన మిత్రుల సహకారాన్ని కోరారు. అమెరికాలోని అట్లాంటలో ఉండే డాక్టర్ ఈశ్వర్ గౌడ్ కమలాపురం సాయిశశాంక్ కమలాపురం 1 లక్షా 60 వేల రూపాయలు, బోయినపల్లి రమేష్ రూ. 10 వేలు, బోయినపల్లి సతీష్ రూ. 10 వేలు, వేముల రామ్మోహన్ రూ. 10 వేలు, వద్ది వెంకటేశ్వరరావు రూ. 10 వేలు ఆర్థిక సహాయం చేశారు. మనం సైతం కుటుంబంతో కలసి మొత్తం రూ.2 లక్షల 19 వేల రూపాయలను దర్శకులు త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా అందించారు.


ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.....'మనం సైతం' ద్వారా ఇవాళ మరో పెద్ద సాయం చేయగలిగాను. చదువులో అద్భుత ప్రతిభ గల తేజస్వి తల్వ తండ్రి చనిపోయి ఆర్థిక కారణాలతో ఉన్నత విద్యను చదువుకోలేకపోతోంది. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసే అవకాశం వచ్చినా డబ్బులు లేక అక్కడికి వెళ్లలేకపోతోంది. 'మనం సైతం' దగ్గరకు ఆ బిడ్డ వచ్చిన వెంటనే ఆమెకు సహాయం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాను. అమెరికాలోని అట్లాంటలో ఉండే డాక్టర్ ఈశ్వర్ గౌడ్ కమలాపురం సాయిశశాంక్ కమలాపురం 1 లక్షా 60 వేల రూపాయలు అందించారు. ఇతర మిత్రులు కూడా వీలైనంత సాయం చేశారు. మొత్తం రూ.2 లక్షల 19 వేల రూపాయలను దర్శకులు త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా అందించాను. ఇప్పుడు నా మనసుకు హాయిగా ఉంది. ఆ దేవుడి దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా 'మనం సైతం' ముందుంటుంది. అన్నారు.


తేజస్వి తల్వ మాట్లాడుతూ...నేను ఇంజినీరింగ్ పూర్తయ్యాక మాస్టర్స్ చేయాలన్నది నా కల. మా నాన్నగారు అకస్మాత్తుగా చనిపోవడంతో నా కలలన్నీ చెదిరిపోయాయి. ఆర్థికంగా మా కుటుంబం ఇబ్బందుల్లో పడింది. ఇక నేను మాస్టర్స్ చేద్దామనే కలను వదిలేసుకున్నాను. ఇలాంటి టైమ్ లో అమెరికా అలబామాలోని యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ కు అడ్మిషన్ ఆఫర్ వచ్చింది. అక్కడికి వెళ్లి చదువుకోవాలంటే చాలా ఖర్చవుతుంది. ఎన్నో ఛారిటీ సంస్థలను సంప్రదించాం, మా బంధువులను అడిగాం. ఎవరూ సాయం చేయలేదు. ఈ చదువు ఆపేద్దాం అనుకునే సమయంలో చివరి ప్రయత్నంగా మనం సైతం కాదంబరి కిరణ్ గారి దగ్గరకు వెళ్లాం. ఆయన ఎంతో ధైర్యం చెప్పి నా చదువుకు సాయం చేశారు. తండ్రి లేని లోటు తీర్చారు. మా అమ్మ నాకు ఇన్నాళ్లూ తోడుగా ఉంది. ఇప్పుడు తల్లిలాంటి 'మనం సైతం' అండ దొరికింది. కిరణ్ గారికి మా నేను, మా కుటుంబం రుణపడి ఉంటాం. ఒక మనిషి కోసం మరో మనిషి నిలబడగలడు అనే నమ్మకం కిరణ్ గారిని చూశాక ఏర్పడింది. అన్నారు.


Heroine Priyanka Jawalkar Interview

 "తిమ్మరుసు" హిట్ తో జోరు మీదున్న ప్రియాంక జవాల్కర్




లేటెస్ట్ ఫిల్మ్ "తిమ్మరుసు" హిట్ తో మరో విజయాన్ని ఖాతాలో  వేసుకుంది

బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్

చేసిన లాయర్ అను క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. "తిమ్మరుసు"

లో ప్రియాంక అందంగా కనిపిస్తూనే, కంప్లీట్ పర్మార్మెన్స్ ఇచ్చిందని

ఆడియెన్స్ అంటున్నారు. ఈ సినిమాలో ప్రియాంక కాంట్రిబ్యూషన్ ను అటు ఫిల్మ్

యూనిట్ కూడా ప్రశంసిస్తోంది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్

చేసుకున్న ప్రియాంక.. "తిమ్మరుసు" హిట్ తో టాలీవుడ్ లో మరింత జోరు

పెరిగేలా కనిపిస్తోంది. ఆగస్టు 6న ప్రియాంక జవాల్కర్ నటించిన మరో కొత్త

సినిమా "ఎస్ఆర్ కళ్యాణమండపం" విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ష్యూర్

హిట్ అనే టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దీంతో బ్యాక్ టు

బ్యాక్ హిట్స్ ఈ సుందరి దక్కించుకున్నట్లే.


"టాక్సీవాలా" మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ తెలుగు నాయిక...తొలి

చిత్రంతోనే తన గ్లామర్, పర్మార్మెన్స్ తో గుర్తింపు తెచ్చుకుంది.

టాలెంటెడ్ యాక్ట్రెస్ గా యంగ్ హీరోలకు, దర్శకులకు ఫస్ట్ ఛాయిస్ అయ్యింది.

ప్రస్తుతం ఆమె బ్యాక్ టు బ్యాక్ మూవీ రిలీజ్ లతో ఆడియెన్స్ ముందుకు

వస్తోంది. ఈ మధ్య సన్నబడిన ప్రియాంక జవాల్కర్ మరింత అందంగా, అట్రాక్టివ్

గా కనిపిస్తూ ఇండస్ట్రీని ఆకర్షిస్తోంది. ఆమె నటించిన మరో కొత్త సినిమా

"గమనం" కూడా విడుదలకు సిద్ధమవుతోంది.


యాక్టింగ్ కు స్కోప్ ఉంటూ క్రేజీ ఫిల్మ్స్ తో కెరీర్ ప్లాన్ చేసుకుంటోంది

ప్రియాంక జవాల్కర్. నాని, శర్వానంద్ లాంటి నెక్ట్ లెవెల్ హీరోలతో తను

మూవీస్ చేస్తాననే కాన్ఫిడెన్స్ తో ఉందీ బ్యూటీ. అందంగా ఉండి హార్డ్

వర్కింగ్ చేసే టాలెంటెడ్ హీరోయిన్స్ ఎంతోమంది టాలీవుడ్ లో సక్సెస్

అయ్యారు. అలా చూస్తే ప్రియాంక జవాల్కర్ కు త్వరలోనే మరింత స్టార్ డమ్

వచ్చే అవకాశం ఉంది. అందులోనూ తెలుగు అమ్మాయి కాబట్టి మన ప్రేక్షకులకు ఈ

హీరోయిన్ ఎప్పుడూ స్పెషలే.


"MAD" movie Director Lakshman Meneni Interview

 



"మ్యాడ్" యువతకు బాగా నచ్చే సినిమా అవుతుంది - దర్శకుడు లక్ష్మణ్ మేనేని


ప్రేమ, పెళ్లి, స్నేహం..ఇలా ఏ బంధానికైనా కొంత టైమ్ ఇవ్వాలి అంటున్నారు

దర్శకుడు లక్ష్మణ్ మేనేని. ఎదుటివారిపై త్వరగా అభిప్రాయానికి వచ్చి

విడిపోవడం ఇవాళ్టి యువతలో ఎక్కువగా జరుగుతోందని ఆయన చెబుతున్నారు. ప్రేమ,

పెళ్లి, సహజీవనం వంటి అంశాల నేపథ్యంతో దర్శకుడు లక్ష్మణ్ మేనేని "మ్యాడ్"

అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి,

రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. మోదెల టాకీస్

బ్యాన‌ర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు  మిత్రులు ఈ

చిత్రాన్ని నిర్మించారు. "మ్యాడ్" మూవీ ఆగస్టు 6న థియేటర్ లలో విడుదల

అయ్యేందుకు రెడీ అవుతోంది.


ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ...నేనొక ఇంజినీరింగ్

గ్రాడ్యుయేట్ ను. 2002 నుంచి ఓ కంపెనీ నడుపుతుంటాను. సినిమాకు దర్శకత్వం

వహించాలనేది నా కోరిక. అందుకే ఈ రంగలోకి వచ్చాను. నేటి యువత రిలేషన్స్ కు

టైమ్ ఇవ్వడం లేదు. త్వరగా ఒకరి మీద ఒకరు అభిప్రాయాలు

ఏర్పర్చుకుంటున్నారు. చెట్టు మీద కాయ పండు కావడానికి కూడా ఒక టైమ్

ఉంటుంది. అలాగే ఏ బంధానికైనా కొంత సమయం ఇవ్వాలి. నేను గత కొంతకాలంగా

పెళ్లిళ్లు జరుగుతున్న తీరును గమనిస్తున్నా. ఏడాది గడిచేలోపు ఆ జంటలు

విడిపోయి, మరొకరితో వివాహం జరుపుకుంటున్నారు. ముందు తరం చూస్తే చాలా

జంటలు పెళ్లయ్యాక జీవితాంతం కలిసే ఉండేవారు. ఇప్పుడంత ఓపిక యువ జంటలకు

ఉండటం లేదు. ఆ అంశాలే మ్యాడ్ సినిమా రూపొందించేందుకు కారణం అయ్యాయి.

ఘనంగా జరిగే పెళ్లిళ్లలో కొత్త జంట ఆ హడావుడిని ఎంజాయ్ చేస్తున్నారు గానీ

వాళ్ల మధ్య ఒక అనుబంధం ఏర్పడటం లేదు. ఫిజికల్ గా కలిసి మాట్లాడుకునే

స్నేహాలు ఇవాళ తగ్గిపోయాయి, ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు. మనలో చాలా

మందికి ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రెండ్స్ పేర్లు కూడా సరిగా తెలిసి ఉండవు.

ప్రేమ, పెళ్లిలో కూడా అటెన్షన్ గ్రాబింగ్ ఎక్కువయ్యింది. వాస్తవమైన

ప్రేమలు తగ్గిపోయాయి. పెళ్లి చేసుకుంటే మీ భాగస్వామికి ఏడాది టైమ్

ఇవ్వండి, ఆ ఏడాదిలో మంచి ఉంటుంది, చెడూ ఉంటుంది. కూర్చొని మాట్లాడుకుని

పరిష్కారం చేసుకోండి గానీ ఇవాళ గొడవైతే రేపు విడిపోవడం కరెక్ట్ కాదు అని

మా మూవీలో చెబుతున్నాం. డివోర్స్ కు రెడీ అయిన ఒక జంట, లివ్ ఇన్ రిలేషన్

లో ఉన్న మరో జంట..ఇలా రెండు జంటల ద్వారా ఈ కథను చూపించాను. ఈ కథలో

హీరోలకు జీవితంలో ఏ లక్ష్యం ఉండదు. హీరోయిన్స్ మాత్రం ఒకరు ఆర్టిటెక్చర్

ఉద్యోగిగా, మరొక హీరోయిన్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తారు. ఇలా భిన్న

ధృవాల్లాంటి అమ్మాయిలు, అబ్బాయిలు కలిస్తే వాళ్ల రిలేషన్స్ లో ఎలాంటి

మార్పులు వస్తాయి అనేది ఆసక్తికరంగా రూపొందించాము. నేను స్వతహాగా

మ్యూజిక్ లవర్ ను. మ్యాడ్ మూవీలో లవ్ అండ్ రొమాంటిక్ అంశాలతో పాటు మంచి

మ్యూజిక్ ఉంటుంది. కైలాష్ ఖేర్, హేమచంద్ర, ఉన్నికృష్ణన్ లాంటి సింగర్స్

పాటలు పాడారు. మోహిత్ రెహ్మానియాక్ కంపోజ్ చేసిన ఆరు పాటలు హిట్ అయ్యాయి.

మంచి కంటెంట్ ఉన్న సినిమా మ్యాడ్. ప్రేక్షకులు ఆదరిస్తారని

కోరుకుంటున్నా. యువతకు బాగా నచ్చే సినిమా అవుతుంది. అన్నారు.


Darsakendra K Raghavendra Rao As Vasista in PelliSandaD

 ‘పెళ్లి సంద‌D’లో వ‌శిష్ట‌గా వెండితెర‌పై సంద‌డి చేయ‌నున్న‌ ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు



ద‌ర్శ‌కేంద్రుడు, శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్రరావు .. తెలుగు సినీ ప్రేక్ష‌కుడికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. తెలుగు సినిమాను క‌మ‌ర్షియ‌ల్ పంథాను మ‌రో మెట్టు ఎక్కించిన ఈ స్టార్ డైరెక్ట‌ర్ విక్ట‌రీ వెంక‌టేశ్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, లేడీ సూప‌ర్‌స్టార్ శ్రీదేవి, శిల్పాశెట్టి, ఖుష్బూ, ట‌బు, తాప్సీ వంటి ఎంద‌రో స్టార్స్‌ను వెండితెర‌కు త‌న గోల్డెన్ హ్యాండ్‌తో ప‌రిచ‌యం చేసి సూప‌ర్ డూప‌ర్ హిట్స్‌, బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించారు. శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన తెలుగు సినిమా చ‌రిత్ర‌లో త‌నదైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న రాఘ‌వేంద్ర‌రావు, తొలిసారి వెండితెర‌పై న‌టుడిగా మెప్పించ‌నున్నారు. 


రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ద‌ర్శ‌కేంద్రుడి శిష్యురాలు గౌరి రోణంకి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘పెళ్లి సంద‌D’. ఈ చిత్రంలో రాఘవేంద్ర‌రావు తొలిసారి న‌టిస్తుండ‌టం విశేషం. ఈ చిత్రంలో రాఘ‌వేంద్ర‌రావు వ‌శిష్ఠ అనే పాత్ర‌లో న‌టించారు. వ‌శిష్ఠ పాత్ర‌కు సంబంధించిన స్పెష‌ల్ ప్రోమోను శుక్ర‌వారం రోజున రాఘవేంద్ర‌రావు శిష్యుడు.. పాన్ ఇండియా స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ‘వంద సినిమాలను డైరెక్ట్ చేసిన తర్వాత మా మౌన ముని కెమెరా ముందుకు వస్తున్నారు.‘పెళ్లి సంద‌D’లో వశిష్ఠ పాత్రధారిగా రాఘవేంద్రరావుగారి ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నాం’’ అంటూ  త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. 


ఈ స్పెషల్ ప్రోమోలో కె.రాఘవేంద్రరావు సరికొత్త లుక్, ఎన‌ర్జీతో క‌నిపిస్తున్నారు. పిల్ల‌ల‌తో ఆట‌లాడ‌టం, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, శ్రీనివాస్ రెడ్డి పాత్ర‌ల‌తో మాట్లాడేలా ఉండ‌టం, చివ‌ర‌ల్లో రోష‌న్‌తో క‌లిసి న‌డిచే సీన్ ఇలాంటి వాటిని ప్రోమోలో  చూడొచ్చు. మ‌రి వ‌శిష్ఠ‌గా రాఘ‌వేంద్ర‌రావు ఎలా మెప్పించారో తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు డైరెక్ట‌ర్ గౌరి రోణంకి. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ‘పెళ్లి సంద‌D’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాటి `పెళ్లిసంద‌డి`లో శ్రీ‌కాంత్ హీరో అయితే నేటి ‘పెళ్లిసంద‌D’లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం. శ్రీలీల హీరోయిన్‌. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.  


నటీనటులు:


రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు.. 


సాంకేతిక వ‌ర్గం: 


సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి

సాహిత్యం: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్

సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ

ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు

ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె,

‌మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌

ఫైట్స్‌: వెంక‌ట్

కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: వి. మోహ‌న్ రావు,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సాయిబాబా  కోవెల‌మూడి

స‌మ‌ర్ప‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌

నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని

ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ

ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోణంకి.


Naga Shaurya's 'LAKSHYA' Friday Special Poster Out

 

Naga Shaurya's 'LAKSHYA' Friday Special Poster Out



Talented actor Naga Shaurya’s milestone 20th film ‘Lakshya’, India’s first movie based on ancient archery, is being directed by Dheerendra Santhossh Jagarlapudi. The sports drama promises to be entertaining and exciting. The movie shows Naga Shaurya in a never before look.


Presented by Sonali Narang, the film is produced by Narayan Das K. Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar in Sri Venkateswara Cinemas LLP, and Northstar Entertainment Pvt Ltd banners. Ketika Sharma is playing as heroine in this film while versatile actor Jagapathi Babu will be seen in a crucial role.


Promotions of the movie kick-start, as the makers recently announced to come up with a fresh update every week on Friday. They will unveil updates using the hashtag #LAKSHYASFRIDAY


Today, they have come up with a Friday special update and it is a romantic poster of the lead pair. Ketika Sharma kisses Naga Shaurya on his forehead and this picture states the kind of chemistry both shared in the film.


The film's shooting is nearing completion and post-production works are also progressing simultaneously.


Cast: Naga Shaurya, Ketika Sharma, Jagapathi Babu, Sachin Khedekar etc.


Technical Crew:

Story, Screenplay, Direction: Dheerendra Santhossh Jagarlapudi

Producers: Narang Das K Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar

Cinematographer: Raam Reddy

Music Director: Kaala Bhairava

Editor: Junaid

PRO: Vamsi-Shekar, BA Raju

Powerstar Pawan Kalyan Best wishes to Darsakendra K Raghavendra Rao






 శ్రీ కె.రాఘవేంద్ర రావు గారికి, 
నమస్సులు 
తెలుగు సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన శతాధిక చిత్రాల దర్శకుడిగా సినీ చరిత్రలో మీకంటూ ప్రత్యేక స్థానం ఉంది. అగ్రశ్రేణి తారల నుంచి నవతరం నటుల వరకూ అన్ని తరాలవారితోనూ హావభావాలు పలికించి వెండి తెరపై మెరిసేలా చేసిన దర్శకేంద్రులు మీరు.
కెమెరా వెనక నుంచే ‘స్టార్ట్... కెమెరా... యాక్షన్...’ అనే మీరు ఇప్పుడు కెమెరా ముందుకు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ‘పెళ్లి సందడి’ చిత్రంతో దర్శకులు రాఘవేంద్ర రావు గారు నటులు రాఘవేంద్ర రావు గారు కావడం ఈ సినీ ప్రయాణంలో ఓ కొత్త మైలురాయి. దర్శకుడిగా నాలుగున్నర దశాబ్దాల అనుభవం మీ నటనలో కచ్చితంగా ప్రతిఫలిస్తుంది. మీ దర్శకత్వంలో సినిమాలు చేయాలని నటులు ఎలా ఉవ్విళ్లూరారో... ఇకపై తమ దర్శకత్వంలో మీరు నటించాలని దర్శకులు ఉత్సాహం చూపుతారు.
ఈ ప్రస్థానంలోనూ మీదైన ముద్రను వేయగలరు. కెప్టెన్ ఆఫ్ ద షిప్ గా ఘన విజయాలను సొంతం చేసుకున్న మీరు నటుడిగానూ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. 
విష్ యూ ఆల్ ద బెస్ట్