నాని అన్న చెప్పినట్లు సినిమాపై ప్రేమతో థియేటర్స్‌కు వచ్చి ‘తిమ్మరుసు’ను సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్: హీరో సత్యదేవ్
సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ పతాకాలపై శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో మహేశ్ కోనేరు, సృజన్ యరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 30న ఈ సినిమా విడుదలైన సూపర్ హిట్ అయ్యింది. ఈ సందర్భంగా శనివారం ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ‘‘ఇది నా తొలి సక్సెస్‌ఫుల్ సినిమా సక్సెస్ మీట్. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ‘తిమ్మరుసు’ థియేటర్స్‌లో విడుదలవుతుంటే చిన్న టెన్షన్ ఉండింది. అయితే ఆ టెన్షన్‌ను ప్రేక్షకులు ఆదరించి తగ్గించారు. సినిమా విడుదలకు ముందు ఎంత ఎమోషన్ అయ్యానో ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నాను. ఇంత మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిన దర్శకుడు శరణ్‌కు థాంక్స్. పూరిగారు, కొరటాలగారు కూడా మాట్లాడారు. వారితో ఎమోషనల్‌గా మాట్లాడాను. ఓ సినిమాను డైరెక్టర్ అండ్ టీమ్ 39 రోజుల్లో.. సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయడంలో ఎంత కష్టుముంటుందో, అన్ని వసతులను సమకూర్చిన నిర్మాత కూడా అంతే కష్టపడతాడు. ఈ సినిమాకు అండగా నిలబడ్డ నిర్మాతలు మహేశ్ కోనేరు, సృజన్ యరబోలుగారికి థాంక్స్. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా. శ్రీచరణ్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. అంకిత్, ఝాన్సీగారు, అజయ్‌గారు ఇలా అందరూ ఎంతగానో సపోర్ట్ అందించారు. ఇక ఈ సినిమాలో బ్రహ్మాజీగారి రోల్‌కు చాలా మంచి అప్లాజ్ వస్తుంది. ఈ సినిమాకు ఆయనే బిగ్గెస్ట్ ఎసెట్‌గా నిలిచారు. సినిమాలో లుక్ పరంగా నన్ను కొత్తగా చూపించిన సినిమాటోగ్రాఫర్ అప్పూ ప్రభాకర్‌కి థాంక్స్. అలాగే సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే క్రమంలో ట్రైలర్‌ను విడుదల చేసి సపోర్ట్ చేసిన తారకన్నకి, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చి సపోర్ట్ చేసిన నాని అన్నకు స్పెషల్ థాంక్స్. నాని అన్న చెప్పినట్లు .. థియేటర్‌కు వచ్చిన తిమ్మరుసు సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్.
ఈ సినిమా ఇచ్చిన నమ్మకంతో ఇంకా మంచి సినిమాలు చేయాలని బలంగా అనిపించింది. సినిమా సక్సెస్‌లో భాగమైన అందరికీ థాంక్స్’’ అన్నారు.
నిర్మాత మహేశ్ కోనేరు మాట్లాడుతూ ‘‘సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ, సినిమా సక్సెస్‌లో కీలకంగా వ్యవహరించిన అందరికీ మనస్ఫూర్తిగా థాంక్స్. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్‌లోకి మా సినిమాను విడుదల చేస్తుంటే రిస్క్ చేస్తున్నారని చాలా మంది భయపెట్టారు. అయితే ప్రేక్షకులు మా భయాన్ని పోగొట్టి సినిమాను పెద్ద సక్సెస్ చేశారు. మా బ్యానర్‌లో వచ్చిన తిమ్మరుసు, మాస్టర్, విజిల్, 118 చిత్రాలు మంచి హిట్‌ను సాధించడం అనేది మాకు నిర్మాతలుగా ఎంతో సంతోషానిచ్చే విషయం’’ అన్నారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ ‘‘‘తిమ్మరుసు’సినిమా విడుదలవుతుందని, అందరినీ సపోర్ట్ చేయమని సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశాను. ఒకరిద్దరు మినహా అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు.ఇక సినిమాను థియేటర్స్‌కు వచ్చి చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాపై నమ్మకంతో మంచి రోల్ ఇచ్చిన డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టికి, నిర్మాతలు.. మహేశ్ కోనేరు, సృజన్‌గారికి థాంక్స్. హీరో సత్యదేవ్ నటుడిగా ఎంతో ఇష్టం. తనతో కలిసి ఓ మంచి సినిమా చేయడం సంతోషంగా ఉంది. అలాగే హీరోయిన్ ప్రియాంక జవాల్కర్, అంకిత్ అందరూ చక్కగా నటించారు’’ అన్నారు.
దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ ‘‘మా సినిమాను థియేటర్స్‌లో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమాను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సులభమైన విషయమైతే కాదు, కానీ ఎంటైర్ యూనిట్ ఎంతగానో సపోర్ట్ చేసింది. మా కష్టాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. వారిచ్చిన ఈ నమ్మకంతో మరింత ముందుకు వెళదాం’’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ శ్రిచరన్ పాకాల, అంకిత్ తదితరులు పాల్గొన్నారు