ఆగస్ట్ 4న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ‘ఇందువదన’ టీజర్ విడుదల..
శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై MSR దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు అనూహ్యమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా పోస్టర్ చాలా కళాత్మకంగా ఉంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు ఎమ్మెస్సార్. విడుదలైన క్షణం నుంచే ఈ లుక్‌కు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా టీజర్‌ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 4 ఉదయం 10 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆయన చేతుల మీదుగా టీజర్ విడుదల కార్యక్రమం జరగనుంది. వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.
నటీనటులు:
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక (కార్తికదీపం ఫేమ్), జెర్సీ మోహన్ తదితరులు
టెక్నికల్ టీం:
దర్శకుడు: ఎమ్మెస్సార్
బ్యానర్: శ్రీ బాలాజీ పిక్చర్స్
నిర్మాత: శ్రీమతి మాధవి ఆదుర్తి
కో ప్రొడ్యూసర్: గిరిధర్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సతీష్ ఆకేటి
సంగీతం: శివ కాకాని
కో డైరెక్టర్: ఉదయ్ రాజ్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్: వై నాగు
లిరిక్స్: భాస్కరబట్ల, తిరుపతి జావన
లైన్ ప్రొడ్యూసర్స్: సూర్యతేజ ఉగ్గిరాలా, వర్మ
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్