‘ఇష్క్’ వంటి ఓ ఎక్స్‌పెరిమెంటల్ మూవీని ఆదరిస్తోన్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు: నిర్మాత ఆర్.బి.చౌదరి
యంగ్ హీరో తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోహీరోయిన్లుగా యస్.యస్. రాజుని దర్శకుడిగా పరిచయం చేస్తూ దక్షిణాదిలోని సుప్రసిద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం `ఇష్క్`. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జులై30న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. డిఫరెంట్ అటెంప్ట్‌తో హిట్ టాక్ తెచ్చుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించింది. అందులో భాగంగా కేక్ కట్ చేసి యూనిట్ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా...
నిర్మాత ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ ‘‘ఇష్క్’ సినిమా ఓ ఎక్స్‌పెరిమెంటల్ మూవీ. ముందుగా పాండమిక్ పరిస్థితుల్లో సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నాం. కానీ.. మా సూపర్ గుడ్ ఫిలింస్‌లో వచ్చిన సినిమాలన్నీ థియేటర్స్‌లోనే విడుదలయ్యాయి. అందువల్ల ఇష్క్ సినిమాను కూడా థియేటర్స్‌లో విడుదల చేయాలని వెయిట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. మా నమ్మకం నిజమైంది. ప్రేక్షకులు సినిమాను చక్కగా ఆదరించారు. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నిర్మాతలుగా మేం హ్యాపీ. మా డైరెక్టర్ రాజుగారికి, హీరో తేజా సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్‌కి, టీమ్‌కి అభినందనలు’’ అన్నారు.
హీరో తేజా సజ్జా మాట్లాడుతూ ‘‘సినిమా కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్‌లో విడుదలవుతుంటే భయపడ్డాను. అసలు థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయో లేవోననే సంగతి ప్రేక్షకులకు తెలుసో తెలియదోనని టెన్షన్ పడ్డాను. కానీ ప్రేక్షకులు మా టెన్షన్‌ను దూరం చేశారు. అన్ని షోస్‌కు ప్రేక్షకుల ఆదరణ లభించింది. నా పెర్ఫామెన్స్‌కు మంచి అప్లాజ్ దక్కింది. ఇంతకు ముందు సినిమాలు చేసినప్పటికీ ఇంత బరువైన పాత్ర, హీరో క్యారెక్టర్ మీదనే సినిమా నడిచే పాత్ర చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్. చాలా సంతోషంగా ఉంది. ఇదొక ఎక్స్‌పెరిమెంటల్ మూవీ. రొటీన్‌కు భిన్నమైన సినిమా అని ముందు నుంచి చెబుతున్నాం. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాజు, నిర్మాత వాకాడ అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.