Latest Post

Lyca Productions' Bharateeyudu2 (Indian2) in Post Production

 పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘భార‌తీయుడు 2’.. జూన్‌లో వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌
ఇండియ‌న్ సినీ రంగంలో యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ త‌న‌దైన ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. ఇక స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ గురించి చెప్పాలంటే క‌మర్షియ‌ల్‌గా భారీ చిత్రాల‌ను అద్భుతం అని అంద‌రూ మెచ్చుకునేలా తెర‌కెక్కించ‌టంలో సుప్ర‌సిద్ధుడు. ఆయ‌న సినిమాల్లో గొప్ప సామాజిక సందేశం కూడా ఉంటుంది. వీరిద్ద‌రూ చేతులు క‌లిపారంటే అద్భుత‌మైన సినిమా మ‌న ముందుకు వ‌స్తుంద‌న‌టంలో సందేహం లేదు. భార‌తీయుడు (ఇండియ‌న్‌) సినిమాతో అది నిరూపిత‌మైంది. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి ‘భార‌తీయుడు 2’తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై మాయ చేయ‌బోతున్నారు. భార‌తీయుడు బ్లాక్ బస్ట‌ర్ త‌ర్వాత వీరిద్ద‌రూ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. 


అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం చేసిన సేనాప‌తిగా ‘భార‌తీయుడు’ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ తిరుగులేని విజ‌యాన్ని సాధించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘భార‌తీయుడు 2’ రానుండ‌టంతో మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. గ్రిప్పింగ్ క‌థ‌నంతో ఈ మూవీ మ‌రింత‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారంటూ అభిమానులు, సినీ ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు స‌హా అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.  


‘భార‌తీయుడు 2’ సినిమాపై ముందు నుంచి భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. దానికి అనుగుణంగానే ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌తో  సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసిన శంక‌ర్ ఇప్పుడు నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేయ‌టంపై దృష్టి సారించారు. మే నెలాఖ‌రున ప‌వ‌ర్‌ప్యాక్డ్ ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. జూన్‌లో భారీ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 


‘భార‌తీయుడు 2’ సినిమాను అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి, మూవీ ఎలా ఉండ‌బోతుందా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో ‘జీరో టాల‌రెన్స్‌’ లైన్ ఈ అంచ‌నాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 


ర‌వివ‌ర్మ‌న్  సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ క‌ల‌యిక ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంద‌న‌టంలో సందేహం లేదు. 


 లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్  రూపొందిస్తోన్న భారీ బ‌డ్జెట్‌తో ‘భార‌తీయుడు 2’లో క్రియేటివ్ బ్రిలియ‌న్స్  క్రియేట్ చేస్తున్నారు. ఇది సినిమా ప్ర‌పంచంలో ఓ స‌రికొత్త మైలురాయిని క్రియేట్ చేయ‌టానికి సిద్ధంగా ఉంది. సినిమా చూసే ప్రేక్ష‌కుల్లో గొప్ప ఆలోచ‌న రేకెత్తించేలా సినిమాలు చేస్తూ త‌న అభిరుచి చాటుకుంటున్న లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ జూన్‌లో ఇండియన్ 2 పేరుతో త‌మిళంలో, భార‌తీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 


న‌టీన‌టులు:


క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:


క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం:  ఎస్‌.శంక‌ర్‌, స్క్రీన్ ప్లే: ఎస్‌.శంక‌ర్‌, బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ కుమార్‌, మ్యూజిక్ : అనిరుద్ ర‌విచంద్ర‌న్‌, ఎడిటింగ్:  ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ర‌వివ‌ర్మ‌న్‌, ఆర్ట్‌:  ముత్తురాజ్‌, స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, అన్బ‌రివు, రంజాన్ బుల‌ట్‌, పీట‌ర్ హెయిన్స్‌, స్టంట్ సిల్వ‌, డైలాగ్ రైట‌ర్‌:  హ‌నుమాన్ చౌద‌రి, వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌:  వి.శ్రీనివాస్ మోహ‌న్‌, కొరియోగ్ర‌ఫీ:  బాస్కో సీజ‌ర్‌, బాబా భాస్క‌ర్‌, పాట‌లు:  శ్రీమ‌ణి, సౌండ్ డిజైన‌ర్‌:  కునాల్ రాజ‌న్‌, మేక‌ప్ :  లెగ‌సీ ఎఫెక్ట్‌-వాన్స్ హర్ట్‌వెల్‌- ప‌ట్ట‌ణం ర‌షీద్‌, కాస్టూమ్ డిజైన్‌:  రాకీ-గ‌విన్ మ్యూగైల్‌- అమృతా రామ్‌-ఎస్‌బి స‌తీష‌న్‌-ప‌ల్లవి సింగ్-వి.సాయి, ప‌బ్లిసిటీ డిజైన‌ర్: క‌బిల‌న్ చెల్ల‌య్య ,పి.ఆర్‌.ఒ (తెలుగు):  నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  సుంద‌ర్ రాజ్‌, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌:  జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, రెడ్ జైంట్ మూవీస్‌:  సెన్‌బ‌గ మూర్తి, నిర్మాత‌:  సుభాస్క‌ర‌న్‌.


The birthday celebrations of Bigg Boss 7 Solo Boy Hero Gautam Krishna Held Grandly

 సోలో బాయ్ అంటూ మన ముందుకు వస్తున్న బిగ్ బాస్ సెవెన్ గౌతమ్ కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి

బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా వస్తున్న సోలో బాయ్. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా పి. నవీన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సోలో బాయ్. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. జుడా షాండి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. నేడు గౌతమ్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈవెంట్లో హీరో గౌతమ్ కృష్ణ, హీరో ఫాదర్ మనోజ్ గారు, సెవెన్ హిల్స్ సతీష్ గారు, డైరెక్టర్ నవీన్ కుమార్ గారు, అనిత చౌదరి గారు, కమెడియన్ భద్రం, పింగ్ పాంగ్( సూర్య ) పాల్గొన్నారు.


ఈ సందర్భంగా అనిత చౌదరి గారు మాట్లాడుతూ : నన్ను అమ్మగా, అక్కగా, చెల్లిగా, వదినగా అన్ని పాత్రల్లోనూ ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ముందుగా గౌతమ్ కృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సినిమాలో గౌతమ్ కి తల్లి పాత్రలో చేస్తున్నాను. గౌతమ్ చాలా నెమ్మదస్తుడు అందరి గురించి ఆలోచిస్తాడు. సెవెన్ హిల్స్ సతీష్ గారు ఈ సినిమాని ఎంతో పాషన్ తో నిర్మించారు. డి ఓ పి గా త్రిలోక్ పనితీరు చాలా బాగుంది. ప్రతి సినిమాకి ఒక ఫీల్ ఉంటుంది అదేవిధంగా ఈ సోలో బాయ్ సినిమాలో కూడా ఒక మంచి ఫీల్ ఉంది. ప్రేక్షకుల సినిమా ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


డైరెక్టర్ పి. నవీన్ కుమార్ గారు మాట్లాడుతూ : నాకు ఈ అవకాశాన్నిచ్చిన సెవెన్ హిల్స్ సతీష్ గారికి రుణపడి ఉంటాను. ముందుగా గౌతమ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిన్న సినిమా పెద్ద సినిమాను ఉండదు మంచి సినిమా నే ఉంటుంది. సోలో బాయ్ కూడా ఒక మంచి సినిమా. ఈ సినిమాలో నటించిన పోసాని కృష్ణ మురళి గారు, అనిత చౌదరి గారు, భద్రం గారు, సూర్య గారు ఎవరికి పాత్ర కి చాలా బాగా నటించారు. మా హీరో గౌతమ్ కృష్ణ చాలా బాగా నటించాడు. సాంగ్స్ ఫైట్స్ ఎమోషనల్ సీన్స్ అన్నిటిలోనూ తనదైన శైలితో నటించాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.


డిఓపి త్రీలోక్ మాట్లాడుతూ : గౌతమ్ కృష్ణ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశాన్నిచ్చిన ఒక ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ గారికి డైరెక్టర్ నవీన్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ : ముందు నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు. చిన్న సినిమా పెద్ద సినిమా లేకుండా మీడియా అలాగే ప్రేక్షకులు మంచి సినిమా వస్తే ఆదరిస్తారు. ఈ సోలో బాయ్ సినిమా కూడా అలాగే ఒక మంచి సినిమా. ఈ సినిమా కోసం మాకు సపోర్ట్ చేసి కష్టపడి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ కి టెక్నీషియన్ కి కృతజ్ఞతలు. అదేవిధంగా మంచి క్యారెక్టర్స్ అని చెప్పగానే ముందుకు వచ్చి మేము చేస్తాము అని వచ్చిన పోసాని కృష్ణ మురళి గారికి, అనిత చౌదరి గారికి కృతజ్ఞతలు. భద్రం, సూర్య కూడా చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. అదేవిధంగా నా తమ్ముడు గౌతమ్ కృష్ణ. ఈ సినిమాతో నాకు సొంత తమ్ముడిలాగా సపోర్ట్ ఇచ్చాడు. గౌతమ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. డైరెక్టర్ నవీన్ చెప్పిన కథ చాలా బాగా అనిపించింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని అన్నారు.


హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ : నా పుట్టినరోజు పూట మూవీ టీం ఇలా ఈవెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అన్న ఇలా నాకు ఒక టీం ఉంది నవీన్ అనే ఒక కొత్త డైరెక్టర్ ఉన్నాడు అనగానే కథ విని సింగిల్ సిట్టింగ్లో కథను ఓకే చేశారు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ అన్న. ఈ టీమ్ అందరూ కూడా సినిమా మీద ఇష్టంతో పని చేసినవారే. బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంటెంట్‌ ని తీసుకొస్తున్నాం. అదేవిధంగా అనితా చౌదరి గారు, పోసాని కృష్ణ మురళి గారు ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోవడం వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నా ఫస్ట్ సినిమా నుంచి, బిగ్ బాస్ జర్నీ నుంచి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అతి త్వరలో టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మీ ముందుకు వస్తాం. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.


నటీనటులు - గౌతం కృష్ణ, శ్వేతా అవస్థి, రమ్య పసుపులేటి, పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులు


సాంకేతిక బృందం:

కాస్ట్యూమ్స్ - రిషిక, వీణాధరి

సినిమాటోగ్రఫీ - త్రిలోక్ సిద్ధు

సంగీతం - జుడా సంధ్య

కో-డైరెక్టర్ - కినోర్ కుమార్

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - SK నయీమ్

లిరిక్ రైటర్స్ - శ్యామ్ కాసర్ల, పూర్ణా చారి, చైతన్య ప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి

కొరియోగ్రాఫర్: ఆటా సందీప్

బ్యానర్ - సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్

నిర్మాత - సెవెన్ హిల్స్ సతీష్ కుమార్

దర్శకత్వం - పి. నవీన్ కుమార్

పి ఆర్ ఓ : మధు VR

Tenant Release Trailer Launched

'టెనెంట్' రిలీజ్ ట్రైలర్ చాలా నచ్చింది. కాన్సెప్ట్, కంటెంట్ చాలా కొత్తగా వుంది. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది: రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో ప్రియదర్శి'టెనెంట్' సినిమా అద్భుతంగా వచ్చింది. డబ్బింగ్ చెబుతున్నప్పుడు కన్నీళ్లొచ్చాయి. తప్పకుండా సినిమా ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవుతుంది: హీరో సత్యం రాజేష్

'పొలిమేర2' బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ 'టెనెంట్'. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఏప్రిల్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో ప్రియదర్శి ఈ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

సత్యం రాజేష్ ప్రేమకథ, పెళ్లి సన్నివేశాలతో ఫీల్ గుడ్ గా మొదలైన ట్రైలర్ తర్వాత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆద్యంతం కట్టిపడేసింది. ట్రైలర్ లో చూపించిన కంటెంట్ చాలా ఎక్సయిటింగ్ గా వుంది. పోలీస్ అధికారి ఎస్తర్ ''నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని నువ్వే చంపేయడం ఏమిటి? అని ప్రశించగా.. ‘రావణాసురుడు  సీతని చెరబడితే శిక్ష సీతకెందుపడింది?’ అని సత్యం రాజేష్ ఎదురు ప్రశ్నించడం కథ పై మరింత క్యురియాసిటీని పెంచింది. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు సత్యం రాజేష్. ట్రైలర్ లో కనిపించిన మిగతా నటులు కూడా తమ పాత్రలలో ఒదిగిపోయారు. దర్శకుడు  వై. యుగంధర్ ఎంచుకున్న పాయిటింగ్ చాలా ఎమోషనల్, థ్రిల్లింగ్ గా వుంది. నేపధ్య సంగీతం థ్రిల్ మని మరింత ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. మొత్తానికి రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది.

రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. రాజేష్ అన్నకి ముందుగా హ్యాపీ బర్త్ డే. రాజేష్ అన్నకి నేను పెద్ద ఫ్యాన్ ని. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అద్దె కట్టకుండా టెనెంట్ గా ఉంటున్నాడు రాజేష్ అన్న(నవ్వుతూ).  నటుడిగా ఆయన ప్రయాణం, ట్రాన్స్ ఫర్మేషన్ స్ఫూర్తిదాయకం.  ముందు రిలీజ్ చేసిన ట్రైలర్ తో పాటు ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ బాగా నచ్చింది. నిర్మాతలు చంద్రశేఖర్ రెడ్డి, రవీందర్ రెడ్డి గారికి, దర్శకుడు యుగంధర్ గారి టీం అందరికీ ఆల్ ది బెస్ట్. నిర్మాతల కళ్ళలో ఆనందం చూస్తుంటే సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో అర్ధమౌతోంది. సినిమా ఆల్రెడీ హిట్. ఎక్కువ మంది ప్రేక్షకులకు టెనెంట్ సినిమా రీచ్ అవుతుందని నమ్ముతున్నాను. కంటెంట్ చాలా కొత్తగా వుంది. ఏప్రిల్ 19న సినిమా వస్తోంది. తప్పకుండా సినిమాని థియేటర్స్ లో చూడండి' అని కోరారు.  


హీరో సత్యం రాజేష్ మాట్లాడుతూ... దర్శకుడు యుగంధర్ గారు 'టెనెంట్' కథని ఎంత అద్భుతంగా చెప్పారో అంతే అద్భుతంగా సినిమాని తీశారు. డబ్బింగ్ చెబుతున్నప్పుడు క్లైమాక్స్ లో కన్నీళ్లు వచ్చేశాయి. అంత అద్భుతంగా వచ్చింది సినిమా. నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి గారు మంచి చదువరి. ఆయన ఆలోచనలో ఉన్నతంగా నెక్స్ట్ జనరేషన్ గా వుంటాయి. ఈ సినిమాని చాలా ప్రేమించి చేశారు. తప్పకుండా ఇది ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. చందన అద్భుతంగా నటించారు. ఎస్తెర్ గారి పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి మరో ఆకర్షణ. భరత్ చందు అనురాగ్ పోటాపోటీగా నటించారు. సాగర్ గారు చాలా చక్కని సంగీతం అందించారు. ఏప్రిల్ 19న సినిమా విడుదలౌతుంది. ప్రతీ ఒక్కరూ తప్పకుండా సినిమాని ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తారు' అన్నారు.


దర్శకుడు వై.యుగంధర్ మాట్లాడుతూ.. ముందుగా సత్యం రాజేష్ గారికి హ్యాపీ బర్త్ డే. ఏప్రిల్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రతి ఇంట్లో మహిళలకు కనెక్ట్ అయ్యే కథ ఇది. మహిళలు చూస్తే తప్పకుండా చూడాలని అబ్బాయిలకి చెబుతారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం మా నిర్మాత. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. అలాగే మా సహా నిర్మాతలకు ధన్యవాదాలు. కంపోజర్ సాహిత్య సాగర్, డీవోపీ  జెమిన్ జోమ్ సపోర్ట్ వలనే ఈ సినిమా ఇంత బాగా చేయగలిగాను. సాగర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సత్యం రాజేష్ గారు చాలా గొప్పగా సపోర్ట్ చేశారు. ఎస్తర్ గారు చాలా చక్కని సమన్వయంతో ఎంతగానో ప్రోత్సహిస్తూ ఈ సినిమాని చేశారు. భరత్,చందన పాత్రలు కూడా గుర్తుండిపోతాయి. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.  ఏప్రిల్ 19న సినిమా వస్తోంది. తప్పకుండా సినిమాని థియేటర్స్ లో చూడండి. ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా. ఎమోషన్ కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు' అన్నారు.

ఎస్తర్ నోరోన్హా మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో నేను చేసిన మోస్ట్ ఎవైటెడ్ సినిమాలో 'టెనెంట్' ఒకటి. ఎవరడిగినా ఈ సినిమా గురించే చెబుతున్నాను. డైరెక్టర్ గారు ఇందులో నా పాత్రని సరికొత్తగా ప్రజెంట్ చేశారు. ఆయన విజన్ అద్భుతంగా వుంది.  డబ్బింగ్ చెప్పినప్పుడు నా పాత్ర ఇంకా నచ్చింది. మరింత నమ్మకం పెరిగింది.రాజేష్ గారితో కలసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది.టీం అందరికీ పేరుపేరునా థాంక్స్.  ఏప్రిల్ 19న సినిమా వస్తోంది. తప్పకుండా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరిఆశీస్సులు కావాలి' అన్నారు.

చందన మాట్లాడుతూ.. రాజేష్ గారితో కలసి ఈ సినిమా చేయడం, ఎన్నో విషయాలు నేర్చుకోవడం చాలా ఆనందంగా వుంది. 'టెనెంట్' మంచి మెసేజ్ ఒరియంటెడ్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ఏప్రిల్ 19న వస్తోంది. తప్పకుండా థియేటర్స్ లో చూసి మూవీ ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.  

భరత్ మాట్లాడుతూ... 'టెనెంట్'లో ఎమోషన్స్ అద్భుతంగా వుంటాయి. అవి ప్రేక్షకులు కనెక్ట్ అవుతాయి. యూనిట్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. దర్శకుడు చాలా గొప్ప విజన్ తో ఈ సినిమాని చేశారు. సత్యం రాజేష్ అన్నతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా వుంది. చందన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. తప్పకుండా ఈ సినిమాని, మమ్మల్ని సపోర్ట్ చేయండి' అని కోరారు.

నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..  'టెనెంట్'.. బలగం, కాంతార లాంటి సహజత్వంతో కూడుకున్న సినిమా. ఇందులో ఎమోషన్ అద్భుతంగా వుంటాయి. రాజేష్ గారు, ఎస్తర్ గారు నటీనటులంతా చాలా అద్భుతంగా నటించారు. యుగంధర్ గారు నిర్మాతల దర్శకుడు. సినిమా  చాలా అద్భుతంగా వచ్చింది.  మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

నటీనటులు: సత్యం రాజేష్ , మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ , తేజ్ దిలీప్, ఆడుకలం నరేన్, ఎస్తెర్ నొరోన్హ, ధనా బాల, చందు , అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న

స్క్రీన్ ప్లే, డైలాగ్స్ & దర్శకత్వం: వై. యుగంధర్
నిర్మాత: మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి
సహ నిర్మాత : రవీందర్ రెడ్డి .ఎన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: ప్రసూన మండవ
సంగీతం : సాహిత్య సాగర్
DOP: జెమిన్ జోమ్ అయ్యనేత్
ఎడిటర్: విజయ్ ముక్తవరపు
కథ: యస్ శ్రీనివాస వర్మ
 కో-డైరెక్టర్: అనిల్ కడివేటి
స్టంట్స్: రబిన్ సుబ్బు
ఆర్ట్: కరకరల చంద్ర మౌళి, సాయి  
ప్రొడక్షన్ కంట్రోలర్:బి. రాంబాబు  
డిజిటల్ మీడియా : వినీత్-సందీప్
PRO : తేజస్వి సజ్జా 

Pratinidhi 2 Theatrical Rights Bagged by Amogha Entertainments

నారా రోహిత్, మూర్తి దేవగుప్తపు, వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ 'ప్రతినిధి 2' థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్న అమోఘా ఎంటర్‌టైన్‌మెంట్స్- ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్హీరో నారా రోహిత్ 'ప్రతినిధి 2'చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది. నారా రోహిత్ తన ఇంటెన్స్ నటనతో  ఆశ్చర్యపరిచారు. మూర్తి రచన, దర్శకత్వంకు మంచి ప్రశంసలు వచ్చాయి.


తాజాగా 'ప్రతినిధి 2' థియేట్రికల్ రైట్స్ ను డిస్ట్రిబ్యుషన్, ప్రొడక్షన్ సంస్థ అమోఘా ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం  ఏప్రిల్ 25నప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 'ప్రతినిధి' 10 సంవత్సరాల క్రితం 2014లో ఇదే తేదీన విడుదల కావడం విశేషం.

 

'ప్రతినిధి 2' ... ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నారు. సిరీ లెల్లా కథానాయికగా నటిస్తుండగా, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


నాని చమిడిశెట్టి డీవోపీగా చేస్తుండగా, యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.


తారాగణం: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, రఘు కారుమంచి


సాంకేతిక సిబ్బంది:

దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు

నిర్మాతలు: కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని

బ్యానర్లు: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్

సంగీతం: మహతి స్వర సాగర్

ఎడిటర్: రవితేజ గిరిజాల

డీవోపీ: నాని చమిడిశెట్టి

ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె

స్టంట్స్: శివరాజు & పృధ్వి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ పుప్పాల

పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను

పీఆర్వో: వంశీ-శేఖర్

డిజిటల్: ప్రవీణ్ & హౌస్‌ఫుల్ డిజిటల్


Pottel Releasing on April 18th

యువ చంద్ర కృష్ణ, సాహిత్ మోత్ఖూరి, నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ 'పొట్టేల్'  పవర్ ఫుల్ టీజర్ ఏప్రిల్ 18న విడుదలగ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాల్లో ఫ్రెష్ నెస్ , హానెస్టీ ఉంటుంది. పల్లెటూరి వాతావరణంలో జరిగే సినిమాల్లో ఎమోషన్స్ పండితే అద్భుతాలు సృష్టిస్తాయి.యువ చంద్ర కృష్ణ హీరోగా సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహించిన పొట్టేల్  గ్రామీణ నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం . ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన లభించగా, పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి


తాజాగా మేకర్స్ టీజర్ అప్డేట్ తో వచ్చారు. పొట్టేల్ పవర్ ఫుల్ టీజర్ ఈనెల 18న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి.


నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనన్య నాగళ్ల కథానాయిక.


శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్.


తారాగణం: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు.


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం - సాహిత్ మోత్ఖురి

నిర్మాతలు - నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె

బ్యానర్లు - నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్

సంగీతం- శేఖర్ చంద్ర

సినిమాటోగ్రాఫర్ - మోనిష్ భూపతి రాజు

ఎడిటర్ - కార్తీక శ్రీనివాస్

లిరిక్స్  - కాసర్ల శ్యామ్

ఆర్ట్ డైరెక్టర్ - నార్ని శ్రీనివాస్

ఫైట్స్ - పృథ్వీ, రబిన్ సుబ్బు

పీఆర్వో- వంశీ- శేఖర్

డిజిటల్ మీడియా - హ్యాష్‌ట్యాగ్ మనోజ్ 

Director Shiva Turlapati Interview About Geethanjali Malli Vachindhi

అన్నిటికీ సమాధానం గీతాంజ‌లి 3లో ఉంటుంది!

- శివ తుర్ల‌పాటిఅంజలి 50వ సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శక‌త్వంలో  MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. హారర్‌ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రాన్ని  ఏప్రిల్ 11న విడుదల చేశారు. సినిమాకు వ‌స్తున్న స్పంద‌న గురించి, త‌న గురించి, గీతాంజ‌లి 3 గురించి శివ తుర్ల‌పాటి మీడియాతో మాటా మంతీ...

 సినిమాకు వ‌స్తున్న స్పంద‌న గురించి చెప్పండి?

- రెస్పాన్స్ జెన్యుయ‌న్‌గా బావుంది. రివ్యూలను కూడా చూశాను. రివ్యూల్లో చెప్పే విష‌యాల‌ను నేనెప్పుడూ పాజిటివ్‌గా తీసుకుంటాను. సినిమాలో చాలా వాటికి ఆన్స‌ర్ చేయ‌కుండా వ‌దిలేశార‌ని కొంద‌రు రాశారు. అయితే, ఆ లాజిక్కుల‌న్నిటికీ స‌మాధానం చెబుతూ పోతే, యానిమ‌ల్ సినిమాలాగా మూడు గంట‌ల నిడివి వ‌స్తుంది. నేను చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది అది కాదు. ఇది ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ సినిమా. కాంజూరింగ్ టైప్ హార‌ర్ ఇందులో చేయాల‌నే థాట్ మాకు లేదు. ఎంట‌ర్‌టైనింగ్ సినిమాగానే చేశాం. కోనగారి మార్కు రైటింగ్‌ని ఆస్వాదించేవారికి చాలా బాగా న‌చ్చుతోంది. సినిమా చూసిన వారు నాకు మెసేజ్‌లు పెడుతున్నారు. వీకెండ్ కాబ‌ట్టి, యుఎస్‌లో ఇప్పుడు అంద‌రూ సినిమా చూస్తున్నారు. చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది అక్క‌డి నుంచి. సునీల్‌, స‌త్య కామెడీ సెకండాఫ్ లో పేలింది. క్లైమాక్స్ ని కొంద‌రు ఎక్స్ ట్రార్డిన‌రీ అని మెచ్చుకుంటున్నారు. కొంద‌రు స‌డ‌న్‌గా పూర్త‌యింది అని అన్నారు. మ‌రికొంద‌రు అదేంట‌ని అన్నారు. ఇలాంటి అనుమానాలు అన్నిటికీ థ‌ర్డ్ పార్ట్ లో స‌మాధానం ఉంటుంది. ఈ విష‌యాల‌న్నిటినీ నేను కోన‌గారితోనూ డిస్క‌స్ చేశాను.


 పార్ట్ 2 చేస్తున్న‌ప్పుడే థ‌ర్డ్ చాప్ట‌ర్ గురించి అనుకున్నారా?

 - పార్ట్ 2 చేస్తున్న లాస్ట్ మూమెంట్‌లో పార్ట్ 3 కోసం మంచి ఐడియా వ‌చ్చింది. అలా దాని గురించి ఓ డిస్క‌ష‌న్ జ‌రిగింది. దాని గురించి మ‌ళ్లీ మాట్లాడుదాం...

 పార్ట్ 3 అవ‌స‌రం ఉందా?

- పార్ట్ 2 లో పార్ట్ 3కి లీడ్ ఇచ్చాం. రావు ర‌మేష్ ఆత్మ‌ని అమ్మాయి బొమ్మ‌లో కేప్చ‌ర్ చేస్తుంది. అత‌ను వెళ్ల‌లేదు. ఆమెనే వెళ్లింది. తండ్రికోసం వ‌స్తాడు ఆ కొడుకు,  ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకు చ‌నిపోయాడు. అలాంట‌ప్పుడు అత‌నేం చేస్తాడు? ఈ పాయింట్ పార్ట్ 3లో అద్భుతంగా పేలుతుంది.

 మీరిందులో చిన్న కేమియో చేసిన‌ట్టున్నారు?

- నాకు న‌టించాల‌నే ఉద్దేశం లేదు. ఊటీలో కొంత‌మందిని ఆడిష‌న్ చేశాం. కానీ క‌రెక్ట్ ఆర్టిస్ట్ దొర‌క‌లేదు. అక్క‌డ మేం చాలా స్పీడ్‌గా షూటింగ్ చేశాం. ఎక్కువ టేకులు తీసుకునే వారిని మేం భ‌రించే సీన్ లేదు. డేట్లు, టైమింగ్‌... ఇలాంటివ‌న్నీ దృష్టిలో పెట్టుకుని టూరిస్ట్ కేర‌క్ట‌ర్ నేను  చేస్తాను సార్‌ అని కోన‌గారికి మెసేజ్ పెట్టాను. బెస్ట్ అని రిప్లై ఇచ్చారు ఆయ‌న‌. అలా జ‌రిగిపోయింది అది. ఆ సినిమాలో న‌న్ను గుర్తించారు.. సంతోషం

 డైర‌క్ట‌ర్‌గా శాటిస్‌ఫై అయ్యారా?

- శాటిస్‌ఫై అయ్యానండీ. ఇంకా బాగా చేసి ఉండొచ్చేమో అనే త‌ప‌న ఎప్పుడూ ఉంటుంది. కాక‌పోతే ఈ సినిమా నాకు చాలా చాలా నేర్పింది. నెక్స్ట్ సినిమాకు ఇంకా బాగా చేస్తానేమో.

 మోస్ట్ అన్ ఎక్స్ పెక్టెడ్ కాంప్లిమెంట్ ఎవ‌రి నుంచి వ‌చ్చింది?

- అంద‌రూ నా మంచిని కోరుకునేవారే. 20 - 25 ఏళ్ల నుంచి ఇండ‌స్ట్రీలో ఉన్నా. నా క‌ష్టాల‌ను ఎవ‌రూ చూడ‌లేదు. ఇప్పుడు చూస్తున్న శివ‌, ఆ శివ వేరు. అందుకే నేను స‌క్సెస్ కావాల‌ని అంద‌రూ కోరుకున్నారు.

 కోన‌గారి కోస‌మే సినిమా చేశారా?  లేకుంటే డైర‌క్ష‌న్ చేయాల‌ని ముందే అనుకున్నారా?

- డైర‌క్ష‌న్ చేయాల‌న్న‌ది నా క‌ల‌. అందుకోస‌మే కోన‌గారికి కొన్ని స్క్రిప్టులు చెప్పా. ఈ సినిమాకు ముందు కూడా ఓ క‌థ చెప్పా. ఆయ‌న బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. మ‌ధ్య‌లో ర‌మ్మంటే నాకు కుద‌ర‌లేదు. కాక‌పోతే ఈ సినిమా డైర‌క్ష‌న్ నాకు ఇస్తార‌ని నేను ఊహించ‌లేదు. ఈ సినిమా చేస్తే లాంచ్ బావుంటుంద‌ని నాకు చెప్పారు. స‌రేన‌ని చేశాను.

 సీక్వెల్ అన‌గానే భ‌యం ఉంటుంది క‌దా...

- నిజ‌మేనండీ. ఫ‌స్ట్ పార్టు కూడా డైర‌క్ట‌ర్  బ్ల‌డ్ పెట్టి చేశారు. చాలా పెద్ద స‌క్సెస్ అయింది. అందుకే ఆ ప్రెజ‌ర్‌ని నేను తీసుకోలేదు. అలాగే అంజ‌లిగారికి 50వ సినిమా అని కూడా నాకు తెలియ‌దు. సినిమాను సినిమాగా చేశాం

 మీరు కొరియోగ్రాఫ‌ర్ క‌దా.. అది ఈ సినిమాకు ప్ల‌స్ అయిందా?

- బిగ్ టైమ్ ప్ల‌స్ అయింది. నేను చేసిన పాట‌లు చాలా మందికి తెలియ‌దు. నేను క‌నిపించ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ను కాబ‌ట్టి తెలిసే ఛాన్సే లేదు. తేజ‌గారి ద‌ర్శ‌క‌త్వంలో న‌వ‌దీప్ జైకి కొరియోగ్ర‌ఫీ చేశా. బ్ర‌హ్మాస్త్రం చేశా. శంక‌రాభ‌ర‌ణం చేశా... ఇంకా చాలా చాలా సినిమాలు... ప‌దివేల‌కు, ఐదు వేల‌కు సాంగ్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగులు నాకు పెద్ద‌గా రాలేదు. కానీ, నేను చేసిన ప్ర‌తి పాట‌లోనూ క‌థ చెప్పేవాడిని. కోన‌గారికి నాలో న‌చ్చిందే అది.

 అప్‌క‌మింగ్ సినిమాలు ఏమున్నాయి?

- చెప్తాను. నా ద‌గ్గ‌ర చాలా క‌థ‌లున్నాయి. నేను బాగా ఇష్ట‌ప‌డేది సెంటిమెంట్‌, ఎమోష‌న‌ల్ జోన‌ర్‌. ఏ సినిమా అయినా ఎమోష‌న్‌, సెంటిమెంట్ లేనిదే వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని నేను అనుకోను. సో.. ఇప్పుడు ఇమీడియేట్‌గా ఏది సెట్స్ మీద‌కు వెళ్తుందో చూడాలి.

 గీతాంజ‌లి3కి మీరే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా?

- ఇంకా తెలియ‌దండీ. కానీ, ఎవ‌రైనా త్వ‌ర‌లోనే మొద‌లవుతుంది.

 మీ గురించి చెప్పండి?

- చిన్నప్ప‌టి నుంచీ చిరంజీవిగారి సినిమాలు చూసి డ్యాన్సులు నేర్చుకున్నా. కోటిలో శ్రీను మాస్ట‌ర్ అని గురువుగారి ద‌గ్గ‌ర డ్యాన్సు నేర్చుకున్నా. అప్ప‌ట్లో ఆయ‌న బ్యాక్ గ్రౌండ్ డ్యాన్స‌ర్ కార్డు ఇప్పించారు. బ‌ద్రిలోబ్యాక్ గ్రౌండ్ డ్యాన్స‌ర్‌గా ఫ‌స్ట్ టైమ్ చేశాను. రాకేష్ మాస్ట‌ర్‌, హ‌రీష్ మాస్ట‌ర్ ఎంక‌రేజ్ చేశారు. అప్పుడే తేజ‌గారు పిలిచి కొరియోగ్రాఫ‌ర్‌గా చేయ‌మ‌న్నారు. నేను డ్యాన్స్ మాస్ట‌ర్ కార్డు తెచ్చుకున్నా. మాస్ట‌ర్ అయ్యాక బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్స‌ర్‌గా చేయ‌డానికి లేదు. అప్పుడు త‌మిళ్ డ్యాన్స్ మాస్ట‌ర్ల హ‌వా ఉండేది. ఆ టైమ్‌లో నేను ముంబైకి వెళ్లా. అక్క‌డ డ్యాన్స‌ర్‌గా చేసుకోవ‌చ్చ‌నే వెళ్లా. భ‌రున్ ముఖ‌ర్జీ అని.. మ‌న వీయ‌స్ ఆర్ స్వామి గారికి గురువుగారున్నారు. ఆయ‌న్ని క‌లిశాను. ఆయ‌న‌తో ఏడు యాడ్ ఫిల్స్మ్ చేశా. ఆయ‌నరెమోసార్ ద‌గ్గ‌రికి పంపారు. ఆ త‌ర్వాత ఫైన‌ల్‌గా అమెరికాకి వెళ్లా. అప్పుడు నా గ‌ర్ల్ ఫ్రెండ్ అమెరికాలో ఉండేది. నాకూ వీసా రావ‌డంతో పెళ్లి చేసుకుని వెళ్లిపోయా. నేన‌లా వెళ్లానో లేదో... ఇలా  స్టార్‌వార్‌, ఢీలు మొద‌ల‌య్యాయి. ఫిల్మ్ సిటీలో నేను నాలుగేళ్లు ప‌నిచేశా. కానీ అప్పుడు లేని షోలు.. ఇప్పుడు మొద‌ల‌య్యాయే అనిపించింది. కొన్నాళ్ల‌కు మ‌ళ్లీ నేను డ్యాన్స్ స్కూలు పెట్టుకున్నా. హైద‌రాబాద్‌లో సెటిల‌య్యా. మా డ్యాన్స్ఇన్‌స్టిట్యూట్‌లో ఇప్పుడు కూడా 500 - 600 మంది ఉన్నారు. నీ ఇంటికి ముందో గేటు.. అనే పాట‌కు మా స్టూడెంట్స్ తో క‌లిసే క‌వ‌ర్‌సాంగ్ చేశా. అస‌లు క‌వ‌ర్ సాంగ్స్ ఉంటాయ‌ని కూడా నాకు తెలియ‌దు. అది చూసి కోన‌గారికి న‌చ్చి మ‌ళ్లీ పిలిచారు. ఇలా ఇప్పుడు మీముందున్నా.


Konchem Hatke Releasing on April 26th

 ‘కొంచెం హట్కే’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను : ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డిగురు చరణ్, కృష్ణ మంజూష ప్రధాన పాత్రల్లో అభిమాన థియేటర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మాణంలో అవినాష్ కుమార్ తీసిన చిత్రం ‘కొంచెం హట్కే’. ఈ సినిమాకు కృష్ణ రావూరి కథను అందించారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు.  ఏప్రిల్ 26న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌కు ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా...


నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూసి చాలా నవ్వుకున్నాను. ఇంతలా నవ్వుకుని చాలా రోజులైంది. పదమూడేళ్ల క్రితం నేను కూడా చిన్న సినిమాను తీశాను. ఎవ్వరికీ అంతగా తెలియని ఆర్టిస్టులతో సినిమా తీశాను. మీడియా సహకారంతో ఆ సినిమా ఆడియెన్స్‌లోకి వెళ్లింది. ఈ మూవీని కూడా మీడియా అలానే ప్రజల్లోకి తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. అలా మొదలైంది టైంలో మా సినిమా ఈవెంట్‌కు గెస్టులుగా ఎవరిని పిలుద్దామని అనుకున్నాం. ఆ టైంలో కళ్యాణీ మాలిక్ వల్ల రాజమౌళి గారు, కీరవాణి గారు వచ్చారు. నేను ఓ దర్శకురాలిని అయితే.. ఎవరైనా పిలిస్తే తప్పకుండా వెళ్లాలని ఆ టైంలోనే ఫిక్స్ అయ్యాను. చిత్ర దర్శకుడు అవినాష్ విజన్ కనిపిస్తోంది. కృష్ణ రైటింగ్ బాగుంది. కేఎం రాధాకృష్ణ గారు ఈ సినిమా వెనకాల ఉండటం అదృష్టం. మంచి కంటెంట్‌తో సినిమా వస్తే తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


దర్శకుడు అవినాష్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నందినీ రెడ్డి గారు నాకు ఇష్టమైన దర్శకురాలు. కళాతపస్వీ విశ్వనాథ్ గారి వల్లే కొత్త కథ, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమా తీయాలని అనుకున్నాను. అందుకే టైటిల్ కూడా కొత్తగా పెట్టాం. ఇందులో హీరో హీరోయిన్లుండరు. పాత్రలే ఉంటాయి. వేరే వేరే ప్రపంచాల్లోంచి వచ్చిన మనుషులంతా కలిసి సినిమా తీసే కాన్సెప్ట్‌తో ఈ మూవీ సాగుతుంది. ఎంతో వినోదాత్మకంగా ఉండేలా సినిమాను తీశాం. మా చిత్రానికి మీడియా సహకారం కావాలి’ అని అన్నారు.


రచయిత కృష్ణ రావూరి మాట్లాడుతూ.. ‘కష్టపడితే సక్సెస్ వచ్చిందని కొందరు, లక్ వల్లే సక్సెస్ వచ్చిందని ఇంకొందరు అనుకుంటూ ఉంటారు. కానీ టైం వల్లే అంతా జరుగుతుంది. అన్నీ కలిసి వస్తేనే సక్సెస్ వస్తుంది. కష్టపడితేనే విజయం వరిస్తుంది. ఏప్రిల్ 26న ఈ చిత్రం రాబోతోంది. బయటి ప్రపంచాన్ని చూస్తే కొత్త పాత్రలు, కొత్త కథలు వస్తాయి. సినిమా ఆద్యంతం నవ్విస్తూనే ఉంటుంది. జనాల వరకు సినిమా వెళ్లేందుకు మీడియా సహకారం కావాలి’ అని అన్నారు.


గురు చరణ్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో మాధవ్ పాత్రను పోషించాను. నటుడిగా ఎదగాలనే ప్రయత్నాలు చేసే కారెక్టర్‌లో కనిపిస్తాను. సినిమాలో సినిమా తీయడం బాగుంటుంది. అందరినీ నవ్వించేలా ఈ మూవీ ఉంటుంది. రెగ్యులర్‌గా కాకుండా చాలా కొత్తగా ఉంటుంది. ఈ మూవీలో పాటలు థియేటర్లో బాగా ఎక్స్‌పీరియెన్స్ చేస్తారు. ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. మీ మీ గ్రూపులతో ఈ సినిమాను చూస్తే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. అందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించండి’ అని అన్నారు.


కృష్ణ మంజూష మాట్లాడుతూ.. ‘ఈ మూవీలో నేను ప్రియాంక రెడ్డి పాత్రను పోషించాను. ఎంతో స్వేచ్చగా జీవించే కారెక్టర్‌లో కనిపిస్తాను. తనని తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సినిమా డైరెక్టర్ అవ్వాలని అనుకుంటుంది. తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంది అనేది బాగుంటుంది. సినిమా ట్రైలర్ చూసి అందరూ హాయిగా నవ్వుకుంటున్నారు. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మీడియా సహకారం అందించాల’ని కోరారు.


నటీనటులు గురు చరణ్, కృష్ణ మంజూష తదితరులు


బ్యానర్ :  అభిమాన థియేటర్ పిక్చర్స్

దర్శకత్వం : అవినాష్ కుమార్

నిర్మాణం : అభిమాన థియేటర్ పిక్చర్స్

రచయిత : కృష్ణ రావూరి

సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్

ఎడిటర్ : మంజు కే రెడ్డి

కెమెరామెన్ : అనిల్ మల్లెల

లైన్ ప్రొడ్యూసర్ : నవ్య  పొట్ల

పీఆర్వో  : వంశీ కాకా

Addressing Social Media Misinformation: TFJA Takes Action

తెలంగాణ డిజిపి రవిగుప్తా, సిపి. కొత్తకోట. శ్రీనివాసరెడ్డిగార్లను కలిసిన టిఎఫ్‌జెఎ ప్రతినిధులు...

సోషల్‌ మీడియాలో పిచ్చిరాతలు రాసేవారి ఆటకట్టుతెలుగు సినిమా పరిశ్రమలో సోషల్‌ మీడియా వేదికగా ఈ మధ్య రకరకాలైన వ్యక్తులు తమ స్వార్ధం కోసం అనేక విధాలుగా మీడియాలో విషం చిమ్ముతున్నారు. వీరంతా వ్యక్తిగతమైన ధూషణలు చేస్తూ తెలుగు సినిమా మీడియాలో కీలకంగా ఉన్నవారిని టార్గెట్‌ చేస్తూ మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి అనేక చర్యలకు పాల్పడటంతో సినిమా నిర్మాణంలో కీలకంగా ఉన్న కొంతమంది నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా వీరికి బాధితులే. అందుకే తెలుగు ఫిలిమ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (టి.ఎఫ్‌.జె.ఎ) ప్రెసిడెంట్‌ వి.లక్ష్మీనారాయణ, జనరల్‌ సెక్రటరీ వై.జె రాంబాబులు  తమ అనుబంధ సంస్థ అయిన తెలుగు ఫిల్మ్‌ డిజిటల్‌ మీడియా అసోసియేషన్‌లోని (టి.ఎఫ్‌.డి.ఎ) ప్రెసిడెంట్‌ ప్రేమ, ట్రెజరర్‌ శివమల్లాలతో కలిసి డిజిపి రవిగుప్తా,  హైదరాబాద్‌ సిపి. కొత్తకోట. శ్రీనివాసరెడ్డిగార్లను కలిసి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వివరించారు. పరిస్థితిని విన్న అధికారులు నిజంగానే కొన్నివార్తలు మా దృష్టికి వచ్చాయని మీరు కూడా కరెక్ట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌తో ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని కలిస్తే సోషల్‌ మీడియాని వెబ్‌సైట్లలో, యూట్యూబ్‌ల్లో  విచ్చలవిడి రాతలు రాసే వారిని తీసుకువచ్చి తగుచర్చలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా (టి.ఎఫ్‌.జె.ఎ),  (టి.ఎఫ్‌.డి.ఎ)  అసోసియేషన్‌లో జరిగే మంచి పనులను ఎలా చేస్తున్నామో వివరించారు మీడియా ప్రతినిధులు . మరో రెండు రోజుల్లో రూమర్లు పుట్టించి తమ పబ్బం గడుపుకునే వారిని పట్టుకుని విచారిస్తామని హామి ఇచ్చారు. మరో రెండురోజుల్లో పోలీస్‌ ప్రతినిధులతో కీలకమై సమావేశాన్ని నిర్వహించనున్నారు యూనియన్‌ ప్రతినిధులు. 

Global Star Ram Charan conferred doctorate by the Prestigious Vels University in Chennai

 వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోవటం మరచిపోలేని అనుభూతి..నాకు ద‌క్కిన ఈ గౌర‌వం నా ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, తోటి న‌టీన‌టులు, నా అభిమానుల‌కే ద‌క్కుతుంది : గ‌్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌అద్భుత‌మైన సినిమాలు చేస్తూ త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీర్తి కిరీటంలో మ‌రో డైమండ్ చేరింది. చెన్నైకు చెందిన ప్ర‌ముఖ వేల్స్ యూనివ‌ర్సిటీ ఆయ‌న‌కు గౌర‌వ డాక్ట‌రేట్‌ను అందించింది. వివిధ రంగాల్లో విశిష్ట వ్య‌క్తుల‌ను గుర్తించి వారికి గౌర‌వ డాక్ట‌రేట్స్ ఇవ్వ‌టంలో వేల్స్ యూనివ‌ర్సిటీ ప్ర‌సిద్ధి చెందింది. ఈ ఏడాదికిగానూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలో ఎంట‌ర్‌ప్రెన్యూర‌ర్‌గా రామ్ చరణ్ చేసిన సేవ‌ల‌కు వేల్స్ యూనిర్సిటీ 14వ వార్షికోత్స‌వ వేడుక‌ల్లో ఆయ‌న‌కు గౌర‌వ డాక్ట‌రేట్‌ను అందించింది. అందులో రామ్ చ‌ర‌ణ్‌తో పాటు డా.పి.వీర‌ముత్తువేల్ (ప్రాజెక్ట్ కో ఆర్డినేట‌ర్ చంద్ర‌యాన్‌, ఇస్రో), డా.జి.ఎస్‌.కెవేలు (ఫౌండ‌ర్‌, సీఎండి ట్రివిట్రోన్ హెల్త్ కేర్‌), అచంట శ‌ర‌త్ క‌మ‌ల్ (ప‌ద్మ‌శ్రీ అవార్డ్ గ్ర‌హీత‌, ప్ర‌ముఖ టేబుల్ టెన్నిల్ ప్లేయ‌ర్‌)ల‌ను కూడా గౌర‌వించారు. ఈ సంద‌ర్భంగా.... 


గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ ‘‘నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపించి గౌర‌వంతో డాక్ట‌రేట్ బ‌హుక‌రించిన వేల్స్ యూనివ‌ర్సిటీ వారికి మ‌నస్ఫూర్తిగా ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసుకుంటున్నాను. 45వేల‌కు పైగా స్టూడెంట్స్ ఉన్నారు. 38 సంవత్స‌రాల‌కు పైగా ఈ యూనివ‌ర్సిటీని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేస్తున్నారు. అలాంటి యూనివ‌ర్సిటీ నుంచి  నాకు గౌర‌వ డాక్ట‌రేట్ ఇస్తున్నార‌నే విష‌యం తెలియ‌గానే మా అమ్మ‌గారు న‌మ్మ‌లేదు. ఆర్మీలాంటి గ్రాడ్యుయేష‌న్స్ మ‌ధ్య‌లో నేను ఈరోజు ఇలా ఉండ‌టం ఊహిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నిజానికి నాకు ద‌క్కిన గౌర‌వం నాది కాదు.. నా అభిమానుల‌ది, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, నా తోటి న‌టీన‌టుల‌ది. వేల్స్ యూనివ‌ర్సిటీని ఇంత విజ‌య‌వంతంగా ముందుకు తీసుకెళుతున్న యాజ‌మాన్యానికి, టీచింగ్ సిబ్బందికి, విద్యార్థులుకు మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు తెలియజేస్తున్నాను. 


చెన్నై నాకెంతో ఇచ్చింది. నాకే కాదు, మా నాన్న‌గారు త‌న ప్ర‌యాణాన్ని ఇక్క‌డ నుంచే ప్రారంభించారు. నా సతీమ‌ణి ఉపాస‌న వాళ్లు అపోలో హాస్పిట‌ల్స్‌ను కూడా ఇక్క‌డ నుంచే మొద‌లు పెట్టారు. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఎన‌బై శాతం మందికి చెన్నైతో మంచి అనుబంధం ఉంది. ఏదైనా సాధించాల‌ని క‌ల‌లు క‌ని చెన్నైకి వ‌స్తే అది నేర‌వేరుతుంది. అది ఈ ప్రాంతం గొప్ప‌త‌నం. అన్ని రంగాల వారికి ఈ భూమి క‌ల‌ల‌ను నేరవేర్చేదిగా ఉంటూ వ‌స్తుంది. నేను ఇక్క‌డ విజ‌య హాస్పిట‌ల్‌లోనే పుట్టి పెరిగాను. 


సినిమాల విష‌యానికి వస్తే ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ శంక‌ర్‌గారితో గేమ్ ఛేంజ‌ర్ సినిమా చేస్తున్నాను. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయాల‌ని చాలా మంది అనుకుంటారు. నేను ఇప్పుడు ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌టం మంచి ఎక్స్‌పీరియెన్స్‌. శంక‌ర్‌గారు ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. డిఫ‌రెంట్ స్టోరీతో ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతుంది. ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్-అక్టోబ‌ర్ నెల‌ల్లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం’’ అన్నారు.

Trailer of "CAP" movie released in Tirumala

 శ్రీనివాసుడు కొలువై వున్న తిరుమలలో వైభవంగా రిలీజ్ అయిన  "కాప్" మూవీ ట్రైలర్ !!ప్రముఖ నటుడు రవిశంకర్ ప్రధాన పాత్రలో, నిఖిల్, రాజశేఖర్, తేజ  హీరోలుగా శ్రీమతి రాధా సురేష్ సమర్పణలో స్వశ్రీ క్రియేషన్స్- వాయుపుత్ర ఆర్ట్స్ బ్యానర్స్ పై యువ వ్యాపార వేత్త మాధవన్ సురేష్ నిర్మిస్తోన్న చిత్రం "కాప్". శత్రుపురం, 'మన్యం రాజు' చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకొన్న దర్శకుడు  బి. సోముసుందరం ఈ "కాప్" చిత్రానికి దర్శకత్వం వహించారు. పొలిటికల్ సెటైర్స్ తో పాటు కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో సమాజానికి ఉపయోగపడే  ఒక మంచి సందేశం వుంటుంది.. అందర్నీ  ఆలోచింపజేసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సోము.. కాగా ఈ చిత్రం ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం ఏప్రిల్ 12న తిరుపతి ఎస్ వి ఇంజినీరింగ్ కాలేజ్ లో వందలాదిమంది స్టూడెంట్స్ మధ్య వైభవంగా జరిగింది. జ్యోతి ప్రజ్వలనంతరం ఎస్వీ కాలేజ్ డైరక్టర్ డా. యన్. సుధాకర్ రెడ్డి స్వశ్రీ బ్యానర్ లోగోనీ ఆవిష్కరించారు. 


 అనంతరం డా. యన్. సుధాకర్ రెడ్డి మట్లాడుతూ.. "* ఎస్వీ కాలేజ్ లోనే చదువుకొని జాబ్ చేస్తూ.. యుయస్ వెళ్లి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ సినిమా తీసే స్థాయికి ఎదిగాడు.. మాధవన్ సురేష్. టెక్నికల్ గానే కాకుండా బిజినెస్ సైడ్ కూడా మంచి పట్టు వున్న వ్యక్తి సురేష్. అలాగే ఈ మూవీలో యాక్ట్ చేసిన నితిన్ కూడా మన కాలేజ్ కుర్రాడే. అతను కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.. కానీ సరైన గుర్తింపు రాలేదు.. ఈ కాప్ సినిమా మంచి సక్సెస్ అయి నితిన్ కి మంచి బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నాను.. అలాగే దర్శకుడు సోముకి సినిమా అంటే పిచ్చి. మన తిరుపతి లో వున్న ఆర్టిస్టులకు ఛాన్స్ ఇస్తూ ఈ కాప్ సినిమా తీశారు. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం వుంది.. అన్నారు. 


 చిత్ర దర్శకుడు సోముసుందరం మట్లాడుతూ.. " శత్రుపురం, మన్యం రాజు, చిత్రాల తర్వాత నేను డైరక్ట్ చేస్తున్న మూడవ చిత్రం ఇది. చాలా కష్టపడి ఈ సినిమా చేశాను. ముఖ్యంగా మా రాధా మేడం గారు లేకపోతే ఈ సినిమా లేదు. కథ విని ఎంతో ఇంప్రెస్ అయి మా నిర్మాత మాధవన్ సురేష్ గారు ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. ఆయనకి నా స్పెషల్ థాంక్స్. మా టీమ్ అందరూ నాకు ఎంతగానో సపోర్ట్ చేసి  సినిమా బాగా రావడానికి సహకరించారు. ట్రైలర్ అందరికీ నచ్చుతుంది. సినిమా కూడా ప్రతి ఒక్కరికీ నచ్చేలా వుంటుంది.. ఈ సమ్మర్లోనే సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు. 


 సమర్పకురాలు రాధా సురేష్ మాట్లాడుతూ.. "మూడేళ్లుగా డైరక్టర్ సోముతో ట్రావెల్ అవుతున్నాను. సోము కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. అప్పటినుండీ ఎవరూ ప్రొడ్యూస్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాను. ఫైనల్ గా మా అబ్బాయి మాధవన్ సురేష్ ఈ సినిమా నేను తీస్తాను అని ముందుకు వచ్చాడు.. అలా సినిమా స్టార్ట్ అయింది. సినిమా అంటే ఎంతో ప్యాషన్ వున్న వ్యక్తి సోము. చాలా కష్టపడి ఈ చిత్రం తెరకెక్కించాడు. ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది.. మేము అంతా చాలా హ్యాపీగా ఉన్నాం.. డెఫినెట్ గా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడు సోము. మా "కాప్" సినిమాని ఆదరించి పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను.. అన్నారు. 


 చిత్ర నిర్మాత మాధవన్ సురేష్ మాట్లాడుతూ.. " మా పేరెంట్స్ లేకపోతే నేను లేను.. వాళ్ళు ఎంతో కష్టపడి నన్ను చదివించి ఇంతవాడ్ని చేశారు. నేను ఎస్వీ కాలేజ్ లోనే చదువుకున్నా.. ఇక్కడ ఎంతో నేర్చుకున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే.. మా అమ్మ ఈ కథ నాకు ఎక్స్ ప్లెయిన్ చేసింది. నేను చాలా ఎక్సైట్ అయి మనమే ఈ సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అని చెప్పాను. దర్శకుడు సోము చాలా ప్రాపర్ గా ప్లాన్ చేసి  ఈ చిత్రాన్ని ముప్పై రోజుల్లో పూర్తి చేశాడు. ట్రైలర్ అధ్భుతంగా వుంది. సినిమా కూడా అదే రేంజ్ లో వుంటుంది. ఖచ్చితంగా అందరికీ నచ్చేలా ఈ చిత్రం వుంటుంది.. అన్నారు. 


 ఈ చిత్రంలో నటించిన హీరోలు నిఖిల్, రాజశేఖర్ మాట్లాడుతూ.. " కాప్" చిత్రంలో మంచి క్యారెక్టర్స్ చేశాం.. యూత్ అందరికీ కనెక్ట్ అయ్యేలా డైరక్టర్ సోము గారు ఈ సినిమాని ఎక్స్ లెంట్ గా రూపొందించారు. ఈ సినిమాతో మా అందరికీ మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాం.. అన్నారు. 


ఇంకా ఈ కార్యక్రమంలో నటులు కేజియఫ్ ఫేం హరీష్ రాయ్, క్రేన్ మనోహర్, జయచంద్ర, మ్యూజిక్ డెరైక్టర్ మిలన్ జోషి,  ఫైట్ మాస్టర్ కుంగ్ ఫు సెంథిల్, కో- ప్రొడ్యూసర్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.


 రవిశంకర్, తేజ, నిఖిల్, రాజశేఖర్, కెజియఫ్ హరీష్ రాయ్, క్రేన్ మనోహర్, జయచంద్ర, సోనీ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా; అల్లి కట్టి, మ్యూజిక్; మిలన్ జోషి, ఎడిటర్; వెంకటేష్, ఫైట్స్; కుంగ్ ఫు సెంథిల్, కొరియో గ్రాఫర్; పవన్ విక్కీ, పి.ఆర్.ఓ; జిల్లా సురేష్, కో-ప్రొడ్యూసర్; పుష్పలత, నిర్మాత; మాధవన్ సురేష్, కథ-మాటలు- పాటలు- స్క్రీన్ ప్లే- దర్శకత్వం; బి. సోమసుందరం.


MAKE UP MAN Movie Launched

 అంగరంగ వైభవంగా మేకప్ మ్యాన్ చిత్ర ప్రారంభోత్సవంఅభిరామ్ మూవీస్ బ్యానర్ పై సీనియర్ మేకప్ మ్యాన్

 కుమార్ మెట్టుపల్లి నిర్మాతగా, దివాకర్ యడ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం మ్యాకప్ మ్యాన్. దివంగత ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి మేనల్లుడు శ్రీకాంత్ అవుటూరి ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. పోలూరు ఘటిక చలం డైలాగ్స్, ఎం ఎం శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు.

శనివారం ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  దర్శకుడు రవి కుమార్ చౌదరి, నిర్మాతలు లయన్ సాయి వెంకట్, భరత్ పారేపల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


దర్శకుడు రవి కుమార్ చౌదరి క్లాప్ కొట్టారు. లయన్ సాయి వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, భరత్ పారేపల్లి తొలి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు.


ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో... అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకులు రవి కుమార్ చౌదరి మాట్లాడుతూ.."నేను దర్శకుడిగా పరిచయం అయినప్పుడు మా గురువు  సాగర్ గారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఇప్పుడు కూడా నేను అంతే ఆనందం గా ఉన్నాను. నా దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన దివాకర్ మంచి స్టోరీ టెల్లర్. చాలా ప్యాషన్ తో పని చేస్తాడు. ఈ కథను చాలా అద్భుతంగా రాశాడు. తనతో పాటు చిత్ర యూనిట్ అందరికీ ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ.."ప్రతి చిత్రానికి మేకప్ మ్యాన్ పాత్ర చాలా కీలకం గా ఉంటుంది. అలాంటి  మేకప్ మ్యాన్ ప్రాముఖ్యతను ఈ  చిత్రంలో  చూపించడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని భగవంతుని ప్రార్థిస్తున్నా" అని అన్నారు.


భరత్ పారేపల్లి మాట్లాడుతూ.."దర్శకుడు దివాకర్ మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మంచి విజయం సాధించి దర్శకుడుగా మరిన్ని చిత్రాలు తెరకెక్కించాలని కోరుతున్నా" అని అన్నారు.


చిత్ర హీరో శ్రీకాంత్ కవుటూరి మాట్లాడుతూ.. "నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పట్నుంచీ మామయ్యను చూసి పెరగడం తో సినిమాలపై ఆసక్తి కలిగింది. ఇలాంటి మంచి కాన్సెప్ట్ తో హీరోగా పరిచయం అవడం చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు.


చిత్ర దర్శకుడు దివాకర్ యడ్ల మాట్లాడుతూ.."చిత్ర పరిశ్రమలో మేకప్ మ్యాన్ ప్రాముఖ్యత చాలా కీలకంగా ఉంటుంది. అలాంటి మేకప్ మ్యాన్ ల జీవితాలను ఇందులో చూపిస్తాము. వాళ్ళ లైఫ్ స్టైల్,  వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో చూపించబోతున్నాం. త్వరలో షూటింగ్ మొదలు పెడుతున్నాం" అని చెప్పారు.


చిత్ర నిర్మాత కుమార్ మెట్టుపల్లి మాట్లాడుతూ.."సినిమా నిర్మించాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నా.  ఇన్నాళ్లకు మంచి కథతో ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం హ్యాపీ గా ఉంది" అని చెప్పారు.


సీనియర్ రచయిత ఘటిక చలం, నటులు కట్టా రంజిత్ ఆనంద్ భారతి చిట్టిబాబు, రచయిత నాగరాజు చిత్ర యూనిట్ కు తమ అభినందనలు తెలియజేశారు.


తారాగణం : శ్రీకాంత్ కవుటూరి, కట్టా రంజిత్, ఆనంద్ భారతి, చిట్టిబాబు తదితరులు..


బ్యానర్:: అభిరామ్ మూవీస్

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ : దివాకర్ యడ్ల

డైలాగ్స్ : ఘటక చలం

నిర్మాత : కుమార్ మెట్టుపల్లి

డిఓపి, ఎడిటర్ : వాసు వర్మ

సంగీతం : ఎం ఎం శ్రీలేఖ

రచనా సహకారం : శ్రీను గ్రంధి

వి ఎఫ్ ఎక్స్ : సూర్య, వంశీ, విజయ్

వీఆర్వో : జీకే మీడియా.


Manoj Kumar Manchu and Mounika Bhuma Manchu are Blessed with a Baby Girl

Manoj Kumar Manchu and Mounika Bhuma Manchu are Blessed with a Baby GirlManoj Kumar Manchu is married to Mounika Bhuma Manchu. The couple recently announced that they were expecting a baby. Manoj Kumar and Mounika have been blessed with a baby girl, as officially announced by Manoj's sister, Lakshmi Manchu, on Twitter and Instagram. The child is nicknamed MM Puli.


The official statement reads: "🌟 And just like that, they are four! Blessed by the Gods, a little Goddess has arrived! We are thrilled to announce that Manoj Kumar and Mounika have welcomed their much-awaited baby girl. Dhairav is overjoyed to be her big brother. Cherishing her nickname, we all lovingly call her 'MM Puli' 🐯. May Lord Shiva's blessings always be upon this complete family. Bless them with all your love! 🌸🙌 #MMPuli #AthaGoals #celebratinglife #littleGoddess #babyannouncement #unlimitedjoy #MM"


On the work front, Manoj Kumar has returned to acting. He has several projects in the pre-production phase, and one unannounced crazy action film has already started shooting in full swing. It's heard that a glimpse of this high-octane action film will be released on Manoj Kumar Manchu's birthday on May 20th. 

Chimata productions' "NENU - KEERTHANA" Teaser getting Tremendous Response

"నేను-కీర్తన" టీజర్ కి

ట్రెమండస్ రెస్పాన్స్!!త్వరలో విడుదల తేది ప్రకటన


చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన చిత్రం "నేను-కీర్తన". ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టీజర్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. 


మల్టీ జోనర్ ఫిల్మ్ గా తెరకెక్క సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న "నేను కీర్తన" చిత్రానికి బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ ఏర్పడింది.  కులుమనాలిలో చిత్రీకరించిన పాటలు, ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రం విడుదల తేది అతి త్వరలో ప్రకటించనున్నారు.


సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, డి.ఐ: భాను ప్రకాష్, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి, పోరాటాలు: నూనె దేవరాజ్, నృత్యాలు: అమిత్ కుమార్ - సి.హెచ్.ఆర్, సంగీతం: ఎం.ఎల్.రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ, కూర్పు: వినయ్ రెడ్డి బండారపు, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), నిర్మాత: చిమటా లక్ష్మికుమారి, రచన - దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.)!! 

Bhimaa Streaming From April 25 In Disney HotStar

 డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు వస్తున్న గోపీచంద్ యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా
గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 25వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. తాజాగా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఈ అనౌన్స్ మెంట్ చేసింది. మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు భీమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు. దర్శకుడు ఎ హర్ష రూపొందించారు. 


భీమా చిత్రంలో ప్రియ భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. పవర్ ఫుల్ పోలీస్ కథతో తెరకెక్కిన భీమా సినిమా గత నెల 8వ తేదీన థియేటర్స్ లోకి వచ్చింది. మాస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది భీమా. ముఖ్యంగా బి, సి సెంటర్స్ ఆడియెన్స్ ఈ సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లోనూ భీమా సినిమాకు మంచి రెస్పాన్స్ రాబోతోంది.

Sharapanjaram Pre Release Event Held Grandly

 ఘనంగా ‘శరపంజరం’ ప్రీ రిలీజ్‌ వేడుక

గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఎం జరిగింది. ఆఊరి దొర మరియు గ్రామ ప్రజలు వీరిపై ఎలాంటి  వ్యతిరేకత కనపరచారు అనే  పల్లెటూరు నేపధ్యంలో సాగే కథాంశంతో వస్తున్న జీరో బడ్జెట్‌ చిత్రమే ‘శరపంజరం’. దోస్తాన్‌ ఫిలింస్‌, అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లపై టి. గణపతిరెడ్డి సహకారంతో, మామిడి హరికృష్ణ ఆశీస్సులతో నవీన్‌కుమార్‌ గట్టు, లయ జంటగా, నవీన్‌కుమార్‌ గట్టు  దర్శకత్వంలో తెరకెక్కించారు. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల, ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. 


ఈ సందర్భంగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ...

ఇది మట్టి మనుషుల కథ. మన సమాజంలో అత్యంత దుర్మార్గమైన జోగిని వ్యవస్థ, చావులకు గంగిరెద్దులను ఆడిరచే సంచార జాతుల వెతలు నేపథ్యంగా తీసిన ఇలాంటి చిత్రాలు కోట్లాది మందికి చేరతాయి. తద్వారా సమాజంలో మార్పు వస్తుంది. మట్టి మనుషుల జీవితాలను తీసుకుని, తొలి సినిమానే సామాజిక చైతన్యం కోసం పాటుపడే చిత్రాన్ని ఎంచుకున్న దర్శకుడు నవీన్‌ గట్టుకు నా అభినందనలు. అలాగే గణపతిరెడ్డి గారికి, ఈ సినిమా నిర్మాణంలో సహకరించిన అందరికీ నా శుభాకాంక్షలు అన్నారు.


టి. గణపతిరెడ్డి మాట్లాడుతూ... 

సంగీత దర్శకుడు మల్లిక్‌ ద్వారా ఈ సినిమా గురించి నాకు తెలిసింది. ఎన్నో కష్టాలకు ఓర్చి వీరంతా కష్టపడుతుంటే నాకు చాలా సంతోషం వేసింది. నేను గతంలో నిర్మించిన చిత్రాల షూటింగ్‌ల సమయంలో కేరవాన్‌లు, ఇతరిత్రా అనేక హంగామాలు చూశాను. కానీ ఈ సినిమా లొకేషన్‌కు వెళితే ఎవరి టిఫిన్‌లు, భోజనాలు వారే తెచ్చుకుని తింటూ పనిచేయడం చూసినప్పుడు అనిపించింది. కడుపునిండిన వాడికి అన్నం పెడితే తిని పడుకుంటాడు.. అదే ఆకలితో ఉన్న వాడికి పెడితే మనల్ని జీవితాంతం గుర్తుంచుకుంటాడు అని. తప్పకుండా ఇలాంటి చిత్రాలు మరిన్ని వస్తేనే అనేక వర్గాలు, జాతుల ప్రజల నిజజీవితాలు ప్రపంచానికి తెలుస్తాయి. అందరూ ఆదరించాలని కోరుతున్నాను అన్నారు. 


హీరో, దర్శకుడు నవీన్‌ గట్టు మాట్లాడుతూ...

ఈ సినిమా కోసం నేనే చాలా కష్టపడ్డాను. మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ సినిమానే ప్రేక్షకులకు చేర్చడమే లక్ష్యంగా బతికాను. ఈ విషయంలో నాకు ఎంతోమంది స్నేహితులు సహకరించారు. అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. గణపతిరెడ్డి గారి రూపంలో ఆదేవుడే మాకు సహకరించినట్లు అనిపించింది. జీరో బడ్జెట్‌తో, కేవలం స్నేహితుల సహకారంతో మొదలు పెట్టిన ఈ యజ్ఞం ఇప్పుడు విడుదలకు రావడం మేం సక్సెస్‌ అయ్యామనే అనిపిస్తోంది. మల్లిక్‌ గారు సినిమాను తన భుజాలపై వేసుకుని మాతో కలిసి నడిచారు. నాకు సహకరించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరికీ పాదాభివందనాలు. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను అన్నారు. 


సంగీత దర్శకుడు మల్లిక్‌ ఎం.వి.వి. మాట్లాడుతూ...

నిజంగా ఇది మట్టి మనుషుల కథే. సమాజంలో ఉన్న కొన్ని రుగ్మతలను రూపుమాపాలనే చక్కని ఆశయంతో మొదలు పెట్టిన ఈ చిత్రం ఈనెల 19న విడుదల అవుతోంది. యూనిట్‌ మొత్తం తమ స్వంత చిత్రంగా భావించి పనిచేశారు. జీరో బడ్జెట్‌తో సినిమా తీయడం అంటే మాటలు కాదు. దానికి దేవుని సహకారం కావాలి. గణపతిరెడ్డి రూపంలో ఆ దేవుడే మాకు సహకరించారు అనిపిస్తోంది. నవీన్‌ దర్శకత్వం ప్రతిభ ఇప్పుడు ట్రైలర్‌లో చూశాము. ఆయన కష్టం వృధాకాదు. తప్పకుండా సినిమా ఘన విజయం సాధిస్తుంది అన్నారు. 


ఇంకా ఈ వేడుకలో పాల్గొన్న చిత్ర యూనిట్‌, ఇతర ఆహ్వానితులు సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ ప్రసంగించారు. 

ఈ కార్యక్రమంలో రజనీ సాయిచంద్‌, భోలే షావలి, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి భవానీరెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ రaాన్సీరాజేందర్‌రెడ్డి, మెట్టపల్లి సురేందర్‌, తురుమ్‌ఖాన్‌ దర్శకుడు శివ, మౌనశ్రీ మల్లిక్‌, జబర్‌దస్త్‌ నటులు, జీవన్‌, వెంకీ, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.


నటీనటులు: నవీన్‌ కుమార్‌ గట్టు, లయ, వరంగల్‌ బాషన్న, ఆనంద్‌ భారతి, జబర్దస్త్‌ వెంకీ, జబర్దస్త్‌ జీవన్‌, జబర్దస్త్‌ రాజమౌళి, జబర్దస్త్‌ మీల్కీ, అలువాల సోమయ్య, మౌనశ్రీ మల్లిక్‌, మేరుగు మల్లేశం గౌడ్‌, కళ్యాణ్‌ మేజిషియన్‌ మానుకోట ప్రసాద్‌, కృష్ణ వేణీ, ఉదయశ్రీ ,రజీయ, ఉషా, సకేత, రాజేష్‌, సుదర్శన్‌, నరేందర్‌, దయ, భరత్‌ కామరాజు, ప్రసాద్‌, ప్రశాంత్‌, అఖిల్‌ (బంటి) 

సాంకేతిక నిపుణులు : సంగీతం: మల్లిక్‌ ఎం.వి.కె., కెమెరా: మస్తాన్‌ సిరిపాటి, ఎడిటింగ్‌: యాదగిరి కంజర్ల, డి.ఐ: రాజు సిందం. పాటలు: మౌనశ్రీ మల్లిక్‌,గిద్దె రాం నర్సయ్య,కిరణ్‌ రాజ్‌ ధర్మారాపు,అద్వ్కెత్‌ రాజ్‌,రాంమూర్తి పొలపల్లి, ఉమా మహేశ్వరి రావుల, పి.ఆర్‌.ఓ: ఆర్‌.కె.చౌదరి, సహకారం: టి. గణపతిరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నవీన్‌కుమార్‌ గట్టు.

Youthful Lyrical Song From Jitender Reddy Movie ‘A Aa E Ee U Uu’ lurical song Released

 జితేందర్ రెడ్డి మూవీ నుంచి అ ఆ ఇ ఈ ఉ ఊ  అంటూ సాగే యూత్ ఫుల్ లిరికల్ సాంగ్ విడుదల

ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లింప్స్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. ఇప్పుడు ఈ సినిమాలో అ ఆ ఇ ఈ ఉ ఊ అంటూ సాగే యూత్ ఫుల్ లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు.


ఆర్ట్స్ సైన్స్ ఇంగ్లీష్ కంటే ముందు ఎన్నో విషయాలు జరిగాయి అవి తెలుసుకోవాలి. ఐన్స్టీన్, న్యూటన్ ఏ కాదు మనదేశంలో కూడా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటూ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ గా ఈ సాంగ్ ని తెరకెక్కించారు. ఈ పాటకి గోపి సుందర్ మ్యూజిక్ అందించగా రాంబాబు గోసాల లిరిక్స్ రాశారు మరియు రాహుల్ సిప్లిగంజ్ పాటని చాలా బాగా పాడారు. కాలేజీలో జరిగే ఎలక్షన్స్ గ్యాంగ్స్ మధ్య ఉండే రైవలరీస్ ఈ లిరికల్ సాంగ్ లో చూపించారు. 1980' లో జితేందర్ రెడ్డి అనే వ్యక్తి గురించి అందరూ తెలుసుకోవాలి అని ఈ సినిమాని తెరకెక్కించారు. కాలేజ్ స్టూడెంట్ లీడర్ గా అదేవిధంగా ఆ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనే నాయకుడిగా జితేందర్ రెడ్డి చేసిన సేవలను ఈ సినిమాలో చూపిస్తున్నారు.


ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ముదిగంటి రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ : ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే సినిమా పైన అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటా ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ ద్వారా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని అన్నారు.


నటీ నటులు : రాకేష్ వర్రే, వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్


టెక్నికల్ టీం :

డైరెక్టర్ : విరించి వర్మ

నిర్మాత :  ముదుగంటి రవీందర్ రెడ్డి

కో - ప్రొడ్యూసర్ : ఉమ రవీందర్

ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వాణిశ్రీ పొడుగు

డి ఓ పి : వి. ఎస్. జ్ఞాన శేఖర్

మ్యూజిక్ డైరెక్టర్ : గోపి సుందర్

పి ఆర్ ఓ : మధు VR

FNCC Sports Tournament Prize Distribution Event Held Grandly

 ఎఫ్ ఎన్ సి సి ఆల్ ఇండియా మెన్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో గెలిచిన విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమం ఘనంగా జరిగిందిక్రికెట్‌కు ఉన్న ఆధరణ ఇతర క్రీడలకు లేకపోవడం బాధాకరం

– ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌

మన దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆధరణ ఇతర క్రీడలకు లేకపోవడం బాధాకరమని రాష్ట్ర అవినీతి నిరోదక శాఖ సీవీ ఆనంద్‌ అన్నారు. ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో సీబీ రాజు మెమోరియల్‌ పురుషుల విభాగం టెన్నిస్‌ టోర్నమెంట్‌ బహుమతి ప్రధాన కార్యక్రమంలో ఆయన టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ ఉన్నప్పటికీ చాలా మంది టెన్నిస్, ఇతర క్రీడల్లో ఆర్ధిక స్థోమత లేక రాణించలేకపోతున్నారని దురదృష్టవశాత్తు చాలా మంది స్పాన్సర్లు క్రికెట్‌ క్రీడకు స్పందించినట్లు ఇతర క్రీడలకు స్పందించడం లేదని ఆయన అన్నారు. ఫుట్‌బాల్, టెన్నిస్‌ ఇలా పలు రకాల క్రీడలను,  క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంత పెద్ద టోర్నమెంట్‌ నిర్వహించిన ఎఫ్‌ఎన్‌సీసీ నిర్వాహకులతో పాటు దాతలను ఆయన అభినందించారు. క్రీడాకారులకు ఆర్ధిక భరోసా లేకపోతే చాలా క్రీడలు మరుగునపడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పెద్ద టోర్నమెంట్లు నిర్వహంచాలని ఆయన కోరారు. అనంతరం సానియా మీర్జా మాట్లాడుతూ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేందుకు డబ్బులు లేక కూడా చాలా మంది క్రీడాకారులు క్రీడలకు దూరమవుతున్నారని దీని వల్ల విలువైన క్రీడాకారులు దేశానికి దూరమవుతున్నారని అన్నారు. వారం రోజుల పాటు జరిగిన పురుషుల విభాగంలో డబుల్స్‌ విభాగంలో రన్నరప్‌గా ఢిల్లీకి చెందిన రిక్కీ చౌదరి, ఒడిషాకు చెందిన కబీర్‌ హన్స్‌ గెలుపొందగా, సింగిల్స్‌ విభాగంలో రన్నరప్‌గా జె. విష్ణువర్ధన్, విన్నర్‌గా గుజరాత్‌కు చెందిన దేవ్‌ జాబియా గెలుపొందారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు ఆదిశేషగిరిరావు, స్పోర్స్‌ కమిటీ చైర్మన్‌ చాముండేశ్వరినాథ్, సెక్రటరి  ముళ్ళపుడి మోహన్, మాజీ అధ్యక్షుడు కేఎల్‌.నారాయణ, కాజా సూర్యనారాయణ, ఎఫ్‌ఎన్‌సీసీ వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు గారు, జాయింట్ సెక్రెటరీ వివిఎస్ఎస్ పెద్దిరాజు గారు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి గారు, జే. బాలరాజు గారు, శైలజ జుజల గారు, కె. మురళీమోహన్ రావు గారు, ఏ. గోపాల్ రావు గారు, సామా ఇంద్రపాల్ రెడ్డి గారు, టెన్నిస్ మెంబర్స్ ఆర్. జగదీష్ గారు, మధుసూదన్ రెడ్డి గారు స్పాన్సర్లు అయిన సువెన్‌ లైఫ్‌ సైన్సెస్, హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ConnectMoviesLLP Production No.1 launched Grandly

 రాజ్ తరుణ్, రమేష్ కడుములు, కనెక్ట్ మూవీస్ ఎల్.ఎల్. పి ప్రొడక్షన్ నెంబర్ 1 గ్రాండ్ గా ప్రారంభంయంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా గోవిందరాజు సమర్పణలో కనెక్ట్ మూవీస్ ఎల్.ఎల్. పి ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా ప్రారంభ పూజ ఈరోజు రామానాయుడు వీడియోస్ లో ఘనంగా జరిగింది. నూతన దర్శకుడు రమేష్ కడుములు ని పరిచయం చేస్తూ రాబోతున్న ఈ సినిమాని మురళీధర్ రెడ్డి, కేఐటిఎన్ శ్రీనివాస్  నిర్మిస్తున్నారు. రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు.


ఈ సినిమా పూజ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్. కె. ఎన్ , నక్కిన త్రినాధ రావు , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక కూచిబొట్ల  తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాకు డైరెక్టర్ మారుతి క్లాస్ చేయగా ప్రవీణ్ సత్తార్  కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నక్కిని త్రినాధరావు  ఫస్ట్ షార్ట్ డైరెక్ట్ చేయగా ధీరజ్ మొగిలినేని, వంశీ స్క్రిప్ట్ అందజేశారు.  


మూవీ లాంచింగ్ సందర్భంగా దర్శకుడు రమేష్ కడుముల మాట్లాడుతూ... ఈ సినిమా షూటింగ్ ఈనెల 15 నుండి ప్రారంభమవుతుంది. కంటిన్యూ షూటింగ్ వుంటుంది. అక్టోబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇది  క్రైమ్ కామెడీ. స్వామిరారా, అంధధూన్  తరహాలో వుంటుంది. కథ చాలా అద్భుతంగా వుంటుంది. అందరికీ నచ్చుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు ఎస్ కే ఎన్ గారికి, మారుతి గారికి, నక్కిన త్రినాధరావు రావు గారికి, వంశీ గారికి, అలాగే ధీరజ్ మొగలినేని గారికి ఆయన ధన్యవాదాలు' తెలిపారు.


ప్రొడ్యూసర్ కేఐటిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ... కథ చాలా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది. ఏప్రిల్ 15 నుంచి షూటింగ్ కి వెళ్తున్నాం.  ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులకు అలాగే ముఖ్య అతిథులకు పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.  


మాధవి అద్దంకి మాట్లాడుతూ.... దర్శకులు రమేష్ చాలా ప్రతిభావంతుడు. ఈ సినిమా కథ, కథనం చాలా అద్భుతంగా వుంటుంది. ఈ సినిమా ప్లాట్ చాలా కొత్తగా వుంటుంది. ఈ సినిమాకు హీరోగా రాజ్ తరుణ్, హీరోయిన్ రాశి ఆప్ట్. ఈ  కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు' తెలిపారు.


హీరోయిన్ రాశీ సింగ్ సినిమా మాట్లాడుతూ... ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. కథ విన్నప్పుడు నా పాత్ర చాలా నచ్చింది. రాజ్ తరుణ్ తో కలసి నటించడం ఆనందంగా వుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు' తెలిపారు.


హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. పూజాకార్యక్రమానికి విచ్చేసిన అతిధులందరికీ ధన్యవాదాలు. ఏప్రిల్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. ఇది చాలా మంచి కథ. క్రైమ్ కామెడీ జోనర్. నా ఫేవరట్ జోనర్. మీ అందరికీ ఆశీర్వాదం కావాలి' అన్నారు


ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్  శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, ఆదిత్య జవ్వాడి డీవోపీగా పని చేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్ కాగా, 'బేబీ' సురేష్ బీమగాని ఆర్ట్ డైరెక్టర్.


తారాగణం : రాజ్ తరుణ్, రాశి సింగ్

సాంకేతిక నిపుణులు :

బ్యానర్ : కనెక్ట్ మూవీస్ ఎల్.ఎల్. పి

రచన & దర్శకత్వం : రమేష్ కడుముల

ప్రొడ్యూసర్ : మురళీధర్ రెడ్డి, కేఐటిఎన్ శ్రీనివాస్

డిఓపి : ఆదిత్య జవ్వాడి

సంగీతం : శేఖర్ చంద్ర

ఎడిటర్ : ప్రవీణ్ పూడి

ఆర్ట్ : బేబీ సురేష్ బీమగాని

వీఆర్వో : వంశీ-శేఖర్

పబ్లిసిటీ డిజైనర్ : సుధీర్


Victory Venkatesh Launched Teaser Of Aadhi Pinisetty Sabdham Teaser

విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన ఆది పినిశెట్టి, అరివళగన్, 7G ఫిల్మ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'శబ్దం' టీజర్‌హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ 'వైశాలి'తో సెన్సేషనల్ హిట్ అందించిన తర్వాత, మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌ 'శబ్దం' చిత్రం కోసం కలిసి పని చేస్తున్నారు. 7G ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్ బానుప్రియ శివ సహ నిర్మాత.


గతంలో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన మేకర్స్ ఈరోజు టీజర్‌ను రివిల్ చేశారు. విక్టరీ వెంకటేష్ టీజర్ లాంచ్ చేశారు. టీజర్‌తో సినిమాలోని అదిరిపోయే సెటప్‌ని పరిచయం చేయడంతో పాటు ఉత్కంఠమైన అనుభూతిని అందించింది.  


హీరో ఆది పినిశెట్టి ఒక హాంటెడ్ హౌస్ వద్ద కొన్ని వింత సంఘటనలు జరిగేటప్పుడు కొన్ని విచిత్రమైన శబ్దాలను రికార్డ్ చేయడం కనిపిస్తుంది.  టీజర్‌లో సినిమాలోని ప్రముఖ నటీనటులందరినీ చూపించారు. టీజర్ ఖచ్చితంగా అంచనాలను అందుకుంది.


ఆది పినిశెట్టి తన పాత్రలో అద్భుతంగా నటించారు. దర్శకుడు అరివళగన్ ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో టీజర్ ని టెర్రిఫిక్ గా ప్రజెంట్ చేసారు  


అరుణ్ బత్మనాభన్ కెమెరా యాంగిల్స్ ప్రతి బ్లాక్‌లోఉత్కంఠతని క్రియేట్ చేసింది,  సంగీత దర్శకుడు థమన్ ఎస్ తన అసాధారణమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఫియర్ ఫ్యాక్టర్ ని పెంచారు.  


వైశాలిలో చాలా రైన్ బేస్డ్ సన్నివేశాలు ఉండగా, శబ్దం సినిమాలో చాలా సన్నివేశాలు పర్వతాలు, పర్యాటక ప్రదేశాలలో చిత్రీకరించబడ్డాయి అలాగే ఈ సినిమాలో సౌండ్‌కి సంబంధించి ప్రత్యేక సన్నివేశాలు ఉండబోతున్నాయి.


ముంబై, మున్నార్,  చెన్నైలోని అనేక ప్రదేశాలలో ఈ సినిమా చిత్రీకరించారు. సినిమా కోసం 120 ఏళ్ల నాటి లైబ్రరీని నిర్మించారు.


సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లీ, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సాబు జోసెఫ్ ఎడిటింగ్ చేస్తున్నారు. మనోజ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.


తారాగణం: ఆది పినిశెట్టి, సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లీ, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం, లైన్ ప్రొడ్యూసర్: అరివళగన్

నిర్మాత: 7G శివ

బ్యానర్లు: 7G ఫిల్మ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్

సహ నిర్మాత: భానుప్రియ శివ

సంగీతం: థమన్ ఎస్

డీవోపీ: అరుణ్ బత్మనాభన్

ఎడిటర్: సాబు జోసెఫ్

ఆర్ట్ డైరెక్టర్: మనోజ్ కుమార్

స్టంట్స్: స్టన్నర్ సామ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్ బాలకుమార్

పీఆర్వో: వంశీ-శేఖర్

Varalaxmi Sarathkumar Sabari Trailer Launched

 తెలుగులో ఫస్ట్ టైమ్ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేశా. 'హనుమాన్' తరహాలో 'శబరి'ని ప్రేక్షకులు ప్రమోట్ చేస్తారని నమ్ముతున్నా - వరలక్ష్మీ శరత్ కుమార్

 


వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి'. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. శుక్రవారం ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వరుణ్ సందేశ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఆయన తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. తమిళ ట్రైలర్ నిర్మాత మహేంద్రనాథ్ విడుదల చేశారు.


వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ... ''తెలుగులో ఫస్ట్ టైమ్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశా. తన క్యారెక్టర్ చుట్టూ నడిచే సినిమా చేయడం ఏ నటి అయినా సరే ఎగ్జైట్ అవుతుంది. ఇప్పుడు ప్రేక్షకులు మంచి టాక్ వస్తే సినిమాలు చూస్తున్నారు. గుడ్ కంటెంట్ ఉంటే చూస్తున్నారు. 'శబరి' ట్రైలర్ చూడటం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్. లీడ్ రోల్ చేశా కనుక కథ నాకు తెలుసు. ట్విస్ట్స్, టర్న్స్ పెట్టి ప్రజెంట్ చేశారు. నాకు ట్రైలర్ నచ్చింది. ఈ సినిమా గురించి చెప్పే ముందు నిర్మాత మహేంద్రనాథ్ గారి గురించి చెప్పాలి. నేను ఈ సినిమాకు సంతకం చేసేటప్పటికి నాకు ఇన్ని విజయాలు లేవు. ఇంత పెద్ద పేరు రాలేదు. సినిమాలు చేస్తున్నాను. నిర్మాతగా తొలి ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా ఫిమేల్ ఓరియెంటెడ్ కథను నమ్మి రాజీ పడకుండా సినిమా చేశారు. బడ్జెట్ ఎక్కువైనా బాక్సాఫీస్ రెవెన్యూ వస్తుందా? మార్కెట్ ఎంత? అని ఆలోచించకుండా సినిమా బాగా రావాలని ఖర్చు చేశారు. వండర్ ఫుల్ స్క్రిప్ట్ నా దగ్గరకు తీసుకు వచ్చిన దర్శకుడు అనిల్ గారికి థాంక్స్. తన బిడ్డను కాపాడడం కోసం తల్లి ఏం చేసిందనేది కథ. సినిమా బావుంటే చూసే తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. 'హనుమాన్' సినిమాను అంత పెద్ద హిట్ చేసింది తెలుగు ప్రేక్షకులే. ఈ 'శబరి'ని కచ్చితంగా ప్రమోట్ చేస్తారని నమ్మకం ఉంది. ఇది స్ట్రెయిట్ ఫార్వార్డ్ థ్రిల్లర్. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్ ఇస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో డ్యాన్స్ చేశా. ఈ సినిమా మహేంద్రనాథ్ గారి కోసం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆయనకు విజయాలు వస్తే కొత్తవాళ్లకు అవకాశాలు ఇస్తారు. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూడాలని కోరుతున్నాను'' అని అన్నారు.  


వరుణ్ సందేశ్ మాట్లాడుతూ... ''నిర్మాత మహేంద్రనాథ్ గారి కోసం ఇక్కడికి వచ్చాను. నేను చాలా సినిమాలు చేశా. చాలా మంది దర్శక నిర్మాతలతో ట్రావెల్ అయ్యాను. మహేంద్ర గారు ఇతరులకు ఇచ్చే గౌరవం చూసి, ఆయన వ్యక్తిత్వానికి నేను ఫిదా అయ్యా. ఆయనతో నేను ఓ సినిమా చేస్తున్నా. 'మైఖేల్' సినిమాలో నేను, వరలక్ష్మి గారు నటించాం. అయితే, మా కాంబినేషన్ సీన్స్ లేవు. ఆవిడతో కలిసి నటించాలని కోరుకుంటున్నాను. 'శబరి' ట్రైలర్ బావుంది. మే 3న సినిమా విడుదల అవుతోంది. ప్రేక్షకులు అందరూ థియేటర్లలో చూసి సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుతున్నాను'' అని అన్నారు.    


నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ... ''ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వరుణ్ సందేశ్ గారికి థాంక్స్. నా రెండో సినిమా ఆయనతో చేస్తున్నా. ఆ తర్వాత మూడో సినిమా అమర్ దీప్ హీరోగా చేస్తున్నాను. ఆయనకూ థాంక్స్. ఈ 'శబరి'కి వస్తే... వరలక్ష్మీ శరత్ కుమార్ గారి పెర్ఫార్మన్స్ గురించి అందరూ చెబుతారు. ఆవిడ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ గురించి చెబుతా. మేం కొడైకెనాల్ షెడ్యూల్ చేశాం. వంద మందితో 15 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశాం. రెండో రోజు వర్షంలో ఒక సీన్ తీయాలని ప్లాన్ చేశాం. ఆ రోజు ఆవిడ రెయిన్ సీన్ చేయనని చెప్పారని కో డైరెక్టర్ వంశీ చెప్పారు. నేను అప్ సెట్ అయ్యాను. అరగంట తర్వాత మళ్లీ వచ్చారు. 'వంద మందితో ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారు. రెండో రోజు ఈ సీన్ చేయడం వల్ల నేను సిక్ అయితే నిర్మాతకు ఎంత లాస్? ఆయన ఏమైపోతారు? ఆలోచించారా? లాస్ట్ డే ఈ సీన్ పెట్టండి. నేను చేస్తాను' అని మేడం చెప్పారని చెప్పాడు. నిర్మాత గురించి ఆలోచించే ఆరిస్టులు ఉండాలి. నిర్మాత బతికి ఉంటేనే ఆర్టిస్టులు ఉంటారు. సినిమా ఉంటేనే ఆర్టిస్టులు ఉంటారు. మే 3న ఈ సినిమా విడుదల అవుతోంది. నిర్మాతగా నా తొలి సినిమా ఇది. మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.


నటుడు శశాంక్ మాట్లాడుతూ... ''చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. ఆనందంగా ఉంది. నాకు ఏప్రిల్ 11 మెమరబుల్ డే. నా తొలి సినిమా 'ఐతే' 21 ఏళ్ల క్రితం ఈ రోజే విడుదల అయింది. అదే రోజు 'శబరి' ట్రైలర్ విడుదల అయింది. సో, నాకు డబుల్ స్పెషల్. నేను కూడా ట్రైలర్ ఇప్పుడే చూశా. స్టన్నింగ్ ట్రైలర్. ఇంత అద్భుతంగా ఉంటుందని ఊహించలేదు. సినిమాలో నేను నటించా కాబట్టి విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాలో లాయర్‌ రోల్‌ చేశా. మే 3న థియేటర్లకు వెళ్లి చూడండి. నిర్మాత మహేంద్రనాథ్ కోసం సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ సాధించాలి. వరలక్ష్మీ శరత్ కుమార్ పవర్ హౌస్ పెర్ఫార్మర్. ఆవిడ పెర్ఫార్మన్స్ చూసి స్టన్ అవుతారు'' అని అన్నారు.


అమర్ దీప్ మాట్లాడుతూ... ''మా కాలేజ్ డేస్ లో వరుణ్ సందేశ్ అన్న అంటే 'హ్యాపీ డేస్', 'కొత్త బంగారు లోకం' సినిమాలు గుర్తొస్తాయి. శశాంక్ అన్న అంటే 'సై'. ఫణి గారి కామెడీ టైమింగ్ సూపర్. నేను చూసిన వరలక్ష్మి గారి మొదటి సినిమా 'తారై తప్పటి'. ఆ సినిమా చూశాక ఏ హీరోయిన్ అయినా సరే ఇటువంటి పెర్ఫార్మన్స్ చేస్తారా అనేలా ఉంటుంది. ఆవిడ నటించిన 'శబరి' పెద్ద హిట్ కావాలి. నిర్మాత మహేంద్రనాథ్ గారిది గోల్డెన్ హార్ట్. హడావిడిగా ఏదీ చేయనివ్వరు. ప్రతిదీ చక్కగా చేసే వరకు టైం ఇస్తారు. 'శబరి' టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' అని అన్నారు.    


నటుడు ప్రభు మాట్లాడుతూ... ''సినిమా మొదలైనప్పుడు నాకు చిన్న కథ చెప్పారు. ఆ కథకు, ఇప్పుడు చూసిన ట్రైలర్ కు పొంతన లేదు. ట్రైలర్ బీభత్సంగా ఉంది. వండర్ ఫుల్ ట్రైలర్. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశా. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ విజయం సాధించాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు. 


ఈ కార్యక్రమంలో నటుడు ఫణి, నటి సునయన , సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్ ఆశిష్ తేజ్, కాస్ట్యూమ్ డిజైనర్ మానస నున్న, కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.