Latest Post

Santhana Prapthirasthu Movie Launched

 విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మాణంలో లాంఛనంగా ప్రారంభమైన మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సంతాన ప్రాప్తిరస్తు"
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఇవాళ హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సంతాన ప్రాప్తిరస్తు సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత, వ్యాపారవేత్త అంబికా కృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా...వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట రామరాజు క్లాప్ నిచ్చారు. మధుర శ్రీధర్ రెడ్డి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఇద్దరు ప్రొడ్యూసర్స్ స్క్రిప్ట్ ను దర్శకుడు సంజీవ్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా


దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ - మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. ఇవాళ ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కు రావడం లేదు. వాళ్లను రప్పించేలా మూవీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా ఉంటుంది. ఎంటర్ టైన్ మెంట్ ఉంటూనే ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తున్నాం. వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి మధ్య కథ జరుగుతుంది. కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే ఓ సమస్యను వినోదాత్మకంగా మూవీలో తెరకెక్కిస్తున్నాం. అన్నారు.


నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ - ఈ రోజు మా సినిమా సంతాన ప్రాప్తిరస్తు లాంఛనంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ఛాన్ చేసిన అంబికా కృష్ణ గారికి, క్లాప్ నిచ్చిన వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట రామరాజుకి కృతజ్ఞతలు. మంచి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. సునీల్ కశ్యప్ మా చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. వచ్చే నెల 8వ తేదీ నుంచి మా సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం. అన్నారు.


నటీనటులు - విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి తదితరులు


టెక్నికల్ టీమ్


కాస్ట్యూమ్ డిజైనర్స్ - అశ్వత్ భైరి, కె ప్రతిభ రెడ్డి

ప్రొడక్షన్ డిజైనర్ - శివకుమార్ మచ్చ

సినిమాటోగ్రఫీ -మహి రెడ్డి పండుగుల

మ్యూజిక్ డైరెక్టర్ - సునీల్ కశ్యప్

డైలాగ్స్ - కల్యాణ్ రాఘవ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎ మధుసూదన్ రెడ్డి

స్టోరీ, స్క్రీన్ ప్లే - సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్ జి

పబ్లిసిటీ డిజైన్ - మాయాబజార్

పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

ప్రొడ్యూసర్స్ - మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి

డైరెక్టర్ - సంజీవ్ రెడ్డి

Anand Deverakonda Gam Gam Ganesha Trailer on May20

 ఈ నెల 20న హీరో ఆనంద్ దేవరకొండ "గం..గం..గణేశా" ట్రైలర్ రిలీజ్
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా". ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం. 


ఈ నెల 31న "గం..గం..గణేశా" సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు "గం..గం..గణేశా" సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మంచి క్రైమ్ కామెడీ మూవీగా..ప్రేక్షకులు ఫ్యామిలీస్ తో కలిసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉండబోతోంది.నటీనటులు :

ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.


టెక్నికల్ టీమ్ :


పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

కాస్ట్యూమ్ డిజైనర్ : పూజిత తాడికొండ

ఆర్ట్: కిరణ్ మామిడి

ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి

సంగీతం - చేతన్ భరద్వాజ్

లిరిక్స్ - సురేష్ బనిశెట్టి

బ్యానర్ - హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్

కొరియోగ్రఫీ: పొలాకి విజయ్

కో-ప్రొడ్యూసర్ -అనురాగ్ పర్వతనేని

నిర్మాతలు - కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి

రచన, దర్శకత్వం - ఉదయ్ శెట్టి

Vasishta N Simha in Yevam

 ’యేవమ్' చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’  యుగంధర్రీసెంట్ గా మహిళలను ఉద్దేశించి ‘ఆడపిల్లనే అయితే ఎంటటా’ అనే హుక్ లైన్ తో చాందినీ చౌదరి క్యారక్టర్ పోస్టర్ ను, అలాగే హాట్ లుక్ లో ‘నా బాడీ సూపర్ డీలక్స్’ అంటూ ఆషు రెడ్డి పోస్టర్ ను అలానే అలాగే పోలీస్ ఆఫీసర్ గా ఆక్టర్ భరత్ తో “ఇన్ ఏ క్రైమ్ దేర్ ఆర్ నో కోఇన్సిడెన్సేస్’  అని పోస్టర్ రిలీజ్ చేశారు, ఆ పోస్టర్స్ అన్నింటికీ విశేష స్పందన లభించింది, ఇప్పుడు అదే తరహాలో మరో వైదిధ్యమైన కారక్టర్ పోస్టర్ ను రిలీజ్ చేసారు, కన్నడ రాయల్ స్టార్ వసిష్ఠ ఎన్ సింహ ను ‘యుగంధర్’ లుక్ లో పంచ కట్టులో చేతిలో డమరుకం పట్టుకుని “ఏం? నేను సరిపోనా? అనే హుక్ లైన్ తో మరో పోస్టర్ లాంచ్ చేశారు. యుగంధర్ తెలుగులో ఇప్పటి వరుకు చేసిన అన్ని క్యారెక్టర్ లతో పోలిస్తే ఈ లుక్ చాలా యునీక్ గా ఉంది అని ప్రేక్షకుల నుండి కామెంట్స్ వస్తున్నాయి


పిడిపి, సి స్పేస్ ఉమ్మడి బ్యానర్లులో నవదీప్, పవన్ గోపరాజు నిర్మాణంలో ఈ ‘యేవమ్’  జరుగుతుంది, ప్రకష్ దంతులూరి యేవమ్ కి దర్శకత్వం వహించారు. ఒక పక్క హీరోగా చేస్తూ కూడా మరో పక్క నవదీప్ ఇలా ఈ సినిమా నిర్మాణంలో భాగం అవ్వడం, ఈ ‘యేవమ్’ కథ కి ఉన్న పోటేన్షియాలిటీని చెప్పకనే చెప్తుందా అనేది చూడాలి. 


తారాగణం

చాందిని చౌదరి

వశిష్ట సింహ

జై భరత్ రాజ్

ఆశు రెడ్డి

గోపరాజు రమణ

దేవిప్రసాద్

కల్పలత తదితరులు


సిబ్బంది

నిర్మాతలు: నవదీప్, పవన్ గోపరాజు

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ప్రకాష్ దంతులూరి

సినిమాటోగ్రాఫర్: ఎస్.వి. విశ్వేశ్వర్

సంగీత దర్శకులు: కీర్తన శేష్, నీలేష్ మందలపు

ఎడిటర్: సుజనా అడుసుమిల్లి

ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: రాజు పెనుమత్స

పీ ఆర్ ఓ: ఏలూరుశ్రీను - మాడూరి మధు

Silk Saree Release on the 24th-Pre Release Event Held Grandly

 ఘనంగా "సిల్క్ శారీ" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ నెల 24న రిలీజ్ కు వస్తున్న మూవీ
వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సిల్క్ శారీ". ఈ చిత్రాన్ని చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మిస్తున్నారు. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరితో దర్శకుడు టి. నాగేందర్ రూపొందిస్తున్నారు. "సిల్క్ శారీ" సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు మురళీ మోహన్, హీరో శ్రీకాంత్, నటులు శివాజీ రాజా, ఉత్తేజ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా


నిర్మాత కమలేష్ కుమార్ మాట్లాడుతూ - "సిల్క్ శారీ" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలు మురళీ మోహన్, హీరో శ్రీకాంత్, నటులు శివాజీ రాజా, ఉత్తేజలకు థ్యాంక్స్ చెబుతున్నా. ఒక మంచి మూవీతో టాలీవుడ్ లోకి నిర్మాతగా అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. ఇకపైనా మా చాహత్ బ్యానర్ పై రెగ్యులర్ గా సినిమాలు రూపొందిస్తాం. మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. ఈ నెల 24న థియేటర్స్ లోకి వస్తున్న మా "సిల్క్ శారీ" సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.


దర్శకుడు టి.నాగేందర్ మాట్లాడుతూ - "సిల్క్ శారీ" సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదొక సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాం. హీరో వాసుదేవ్ రావు కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది. ప్రొడ్యూసర్ గా కమలేష్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. మా టీమ్ సహకారంతో సినిమాను ఈ నెల 24న గ్రాండ్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. థియేటర్స్ కు వచ్చి మా మూవీని చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నా. అన్నారు.


హీరో వాసుదేవ్ రావు మాట్లాడుతూ - హీరో శ్రీకాంత్ గారు మా ఈ‌వెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. ఆయన నేను కలిసి ఖడ్గం సినిమాలో నటించాం. ఆ సినిమా నాకు నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆయన గెస్ట్ గా వచ్చి బ్లెస్ చేసిన మా "సిల్క్ శారీ" సినిమా కూడా మంచి ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. నాకు ఈ సినిమాతో మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత కమలేష్, దర్శకుడు నాగేందర్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.


హీరోయిన్ రీవా చౌదరి మాట్లాడుతూ - "సిల్క్ శారీ" సినిమాతో మీ ముందుకు హీరోయిన్ గా వస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాకు పర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఆయనకు, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. రొమాంటిక్ లవ్ స్టోరీస్ కు ఎప్పుడూ మీ ఆదరణ ఉంటుంది. అలాగే మా "సిల్క్ శారీ" సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.


హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ - "సిల్క్ శారీ" సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వాసుదేవ్ కు ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. కొత్తగా ప్రయత్నం చేసే ప్రతి సినిమాకు మన తెలుగు ఆడియెన్స్ సపోర్ట్ ఉంటుంది. అది చిన్న సినిమా అయినా పెద్ద విజయాన్ని అందిస్తారు. ఈ సినిమాకు కూడా అలాంటి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. దర్శకుడు నాగేందర్, నిర్మాత కమలేష్, ఇతర టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

నటీనటులు: వాసుదేవ్ రావు , రీవా చౌదరి , ప్రీతీ గోస్వామి , ఓంకార్ నాథ్ శ్రీశైలం , కోటేష్ మానవ తదితరులు.

టెక్నికల్ టీమ్

డైరెక్టర్ :టి . నాగేందర్

నిర్మాతలు : కమలేష్ కుమార్ , రాహుల్ అగర్వాల్ హరీష్  చండక్

బ్యానర్: చాహత్ ప్రొడక్షన్స్

సంగీత దర్శకుడు: వరికుప్పల యాదగిరి

కెమెరా : సనక రాజశేఖర్

పీఆర్ఓ: శ్రీపాల్ చొల్లేటి

Arun Viswa Of Shanthi Talkies Presents, Siddarth’s ‘Siddarth 40’ With Director Sri Ganesh Announced

 సిద్ధార్థ్ హీరోగా అరుణ్ విశ్వ శాంతి టాకీస్ సమర్పణలో శ్రీ గణేష్‌ దర్శకత్వంలో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘సిద్దార్థ్ 40’ అనౌన్స్ మెంట్సక్సెస్ ఫుల్ పాన్-ఇండియన్ యాక్టర్ సిద్ధార్థ్ చిత్ర పరిశ్రమలో 21 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రతి పరిశ్రమలో శాశ్వత ప్రభావాన్ని చూపారు. అతను ఎంచుకునే కథలు, పాత్రల, అసాధారణమైన పెర్ఫార్మెన్స్ తో అద్భుతంగా అలరిస్తున్నాయి. బాలీవుడ్‌లో 'రంగ్ దే బసంతి'తో చెరగని ముద్ర వేశారు. తెలుగులో 'బొమ్మరిల్లు'తో ప్రేక్షకుల మన్ననలు పొందారు. తమిళ పరిశ్రమలో పలు జోనర్‌లలో మెరిసి.. సినిమా, నటనపై తనకున్న గొప్ప అభిరుచిని చూపించారు సిద్ధార్థ్. ఆయన లేటెస్ట్ ప్రాజెక్ట్ 'చిత' ప్రేక్షకుల హృదయాల్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇప్పుడు, సిద్ధార్థ్  'సిద్ధార్థ్ 40'( వర్కింగ్ టైటిల్) పేరుతో మరో ఎక్సయిటింగ్ మూవీ కోసం కోసం మంచి యూనిట్ తో చేతులు కలిపారు. ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌ను '8 తొట్టక్కల్'తో పేరుపొందిన శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ 'మావీరన్' నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ “యూనివర్సల్ ఆడియన్స్ అభిరుచులను ఆస్వాదించే మంచి కంటెంట్‌ను అందించాలనే దృక్పథాన్ని కలిగి ఉన్న మన పరిశ్రమలోని యంగ్ టీంతో కలిసి పని చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. సినిమా ఔత్సాహికులు, ఫ్యామిలీస్ 'చిత్త'పై తమ ప్రేమను  కురిపించారు ఇది వారి భావాలను హత్తుకుని, మంచి కథలను ఎంచుకోవడానికి నాలో మరింత బాధ్యతను నింపింది. నేను చాలా స్క్రిప్ట్‌లు విన్నాను, శ్రీ గణేష్ చెప్పిన కథ నాకు ఎంతగానో నచ్చింది. ప్రేక్షకులపై ప్రభావం చూపే సినిమాలను తీయడమే నిర్మాతల ఆనందం. అలాంటి మంచి నిర్మాత అరుణ్ విశ్వతో పని చేయడం ఆనందంగా వుంది. ఆయన మంచి సినిమాతో పరిశ్రమను ఉన్నతంగా తీర్చిదిద్దాలని కలలు కనే నిర్మాత. మా అంకితభావం, పాషన్ తో ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించే అద్భుతమైన సినిమాని అందిస్తాయనే నమ్మకం నాకుంది” అన్నారు.


దర్శకుడు శ్రీ గణేష్ మాట్లాడుతూ, “నేను స్క్రిప్ట్ వర్క్ చేయడం ప్రారంభించినప్పుడు, యూత్ తో పాటు పరిణతి గల నటుడు కావాలని భావించాను. అప్పుడే  సిద్దార్థ్ గారిని అనుకున్నాను. కథ చెప్పడానికి ఆయన్ని కలిసినప్పుడు, తను పూర్తిగా ఎంగేజైఉన్నప్పటికీ చాలా విలువైన సూచనలను కూడా పంచుకున్నారు. ఇది చాలా ప్రశంసనీయం. మంచి పాషన్ వున్న నిర్మాత అరుణ్ విశ్వతో కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా వుంది' అన్నారు.


నిర్మాత అరుణ్‌విశ్వ మాట్లాడుతూ “శాంతి టాకీస్‌కి మా అమ్మ పేరు పెట్టాం. మా అమ్మ థియేటర్లలో చూసి ఆనందించ గలిగే ప్రాజెక్ట్‌లనే ఎంచుకోవాలని భావిస్తాను. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించే కమర్షియల్ చిత్రాలని రూపొందించడమే శాంతి టాకీస్ లక్ష్యం. శ్రీ గణేష్ అద్భుతమైన రచన చాలా ఆకట్టుకుంటుంది, అతను స్క్రిప్ట్ వివరించినప్పుడు, ఇది అన్ని వయసుల ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా, భాష సరిహద్దులకు అతీతంగా ఆకర్షించే చిత్రం అని నేను బలంగా నమ్మాను. సినిమాపై సిద్దార్థ్‌కు ఉన్న ప్యాషన్‌ అద్భుతం. నేను అతనితో పని చేయడానికి చాలా సంతోషిస్తున్నాను. మేము త్వరలో సర్ ప్రైజింగ్ అనౌన్స్ మెంట్స్ చేస్తాం' అన్నారు.  


'సిద్ధార్థ్ 40' షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సిబ్బందికి సంబంధించిన వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.


Honeymoon Express Third single Launched by Adivi Sesh

 హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం లోని మూడో పాటను విడుదల చేసిన యాక్షన్  హీరో అడివి శేష్ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd) పతాకం పై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్". తనికెళ్ల భరణి మరియు సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని రచయిత దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించగా కె కె ఆర్ మరియు బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ ని నిర్మించారు.


ఇప్పటికే హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం నుంచి సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ స్వరపరిచిన రెండు రొమాంటిక్ మెలోడీ పాటలు విడుదలై ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో నిలిచాయి. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మూడో పాటను యాక్షన్ హీరో అడివి శేష్ చేతుల మీదుగా విడుదల చేశారు చిత్ర యూనిట్.


గూఢచారి 2 మరియు డెకాయిట్ చిత్రాలతో బిజీగా ఉన్నా అడివి శేష్, దర్శకుడు బాల గారి చిరకాల పరిచయం వలన అన్నపూర్ణ 7 ఎకరాల ప్రాంగణంలో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ లో క్యూట్ గా స్వీట్ గా అనే అందమైన లిరికల్ పాటను వీక్షించి విడుదల చేశారు.


అనంతరం అడివి శేష్ మాట్లాడుతూ "క్యూట్ గా స్వీట్ గా పాట చాలా స్వీట్ గా ఉంది, సాహిత్యం చాలా బాగుంది అని కొనియాడారు. చిత్రం మంచి విజయం సాధించాలి" అని కోరుకున్నారు.


దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ "ఎంతో బిజీ గా ఉన్నప్పటికీ, క్యూట్ గా స్వీట్ గా అనే అందమైన పాటను విడుదల చేసిన అడివి శేష్ గారికి నా కృతజ్ఞతలు. అడివి శేష్ తన మొదటి చిత్రం అమెరికా లో విడుదల చేయడానికి నన్ను సంప్రదించారు. తనకు మంచి టాలెంట్ ఉంది అని అప్పుడే గమనించాను. మా హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం మంచి మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. మా చిత్రంలోని ప్రతి పాట చాలా బాగుంటుంది. మంచి పాటలు స్వరపరిచిన కళ్యాణి మాలిక్ గారికి కృతజ్ఞతలు. ఈ క్యూట్ గా స్వీట్ గా పాటకు కిట్టూ విస్సాప్రగడ లిరిక్స్ అందించగా బాహుబలి ఫేమ్ దీపు తన గాత్రంతో ప్రాణం పోశారు.


త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేసి, చిత్రాన్ని ఈ సమ్మర్ లో విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నాం" అని తెలిపారుసమర్పణ : ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA))

బ్యానర్ : న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd)

చిత్రం పేరు : హనీమూన్ ఎక్స్‌ప్రెస్


నటీనటులు : చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు


సంగీతం : కళ్యాణి మాలిక్  

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఆర్ పి పట్నాయక్

లిరిక్స్ : కిట్టూ విస్సాప్రగడ

ఆర్ట్, సినిమాటోగ్రఫీ : శిష్ట్లా  వి ఎమ్ కె

ఎడిటింగ్ : ఉమా శంకర్ జి (యు ఎస్ ఎ), శ్రీ కృష్ణ అత్తలూరి

ఆడియో : టి సిరీస్

పి ఆర్ ఓ : పాల్ పవన్

డిజిటల్ పి ఆర్ ఓ : వంశి కృష్ణ (సినీ డిజిటల్)

రచన, దర్శకత్వం : బాల రాజశేఖరుని

Naa Uchvasam Kavanam Curtain Raiser Event Held Grandly

 ఘనంగా దిగ్గజ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రాబోతున్న నా ఉచ్ఛ్వాసం కవనం ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం
దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రూపొందిన కార్యక్రమం నా ఉచ్ఛ్వాసం కవనం. శృతిలయ ఫౌండేషన్ నిర్వహణలో  ఈ కార్యక్రమానికి రామ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సిరివెన్నెల పాటల అంతరంగాన్ని ఆవిష్కరించే ఈ కార్యక్రమం ఈటీవీలో ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రసారం కానుంది. తాజాగా నా ఉచ్ఛ్వాసం కవనం ప్రోగ్రాం కర్టెన్ రైజర్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఈ కార్యక్రమానికి హాజరై టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగాఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ రామ్ చెరువు మాట్లాడుతూ - విశ్వనాథ్ గారితో విశ్వనాథామృతం అనే కార్యక్రమం చేస్తున్నప్పుడు 2011లో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కలిశాం. ఆయన దగ్గరకు ఎవరు వెళ్లినా ముందు తన పాట ఒకటి పాడి వినిపిస్తుంటారు. అలా మాకు కొన్ని పాటలు వినిపించారు. అవి సూపర్ హిట్ సాంగ్స్ కాదు కానీ సాహిత్యపరంగా ఎంతో విలువైన పాటలు. ఆ పాటలు , ఆ పాటల వెనక సీతారామశాస్త్రి గారు చేసిన కృషి గురించి తెలుసుకున్న తర్వాత ఈ మాటలు మాకే కాదు అందరికీ తెలియాలనే ఆలోచన కలిగింది. సిరివెన్నెల అంతరంగం పేరుతో నాలుగు ఎపిసోడ్స్ చేశాం. సీతారామశాస్త్రి గారు తన పాట గురించి వివరించిన తర్వాత ఆ పాటను సింగర్స్ పాడేవారు. కొన్ని రోజుల తర్వాత మ్యూజిక్ లేకుండా సింగర్స్ తో కేవలం లిరిక్స్ పాడించాం. మూడు ఎపిసోడ్స్ అనుకున్నది 13 ఎపిసోడ్స్ చేశాం. దీన్ని టీవీ, ఇతర మాధ్యమాల ద్వారా బహుళ ప్రచారంలోకి తీసుకురావాలని అనుకున్నప్పుడు ఇతర పనులతో బిజీగా ఉండి శాస్త్రి గారు ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. కొన్ని రోజులకు సీతారామశాస్త్రి గారు మనకు దూరమయ్యారు. ఆ తర్వాత ఈ ప్రోగ్రాంను ఎలా ప్రేక్షకులకు చేర్చాలి అనుకుంటున్నప్పుడు త్రివిక్రమ్ గారు మాకు సపోర్ట్ చేశారు. ఈటీవీలో ప్రసారం గురించి బాపినీడు గారు ఎంతో సపోర్ట్ చేశారు. నాతో పాటు మా టీమ్ లోని వాళ్లంతా శాస్త్రి గారి అభిమానులే. సీతారామశాస్త్రి గారి మాట అందరికీ చేరాలని చేసిందే ఈ చిన్న ప్రయత్నం. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.


సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు శ్రీరామ్ శాస్త్రి మాట్లాడుతూ - మనమంతా ఒక కారణంతో ఈ భూమ్మీదకు వస్తాం. అలా ఒక బృహత్తరమైన బాధ్యతతో పుట్టారు అన్నయ్య సీతారామశాస్త్రి. తన కర్తవ్యాన్ని ముగించి వెళ్లిపోయారు. ఉన్నంతకాలం శ్రమ చేస్తూనే ఉన్నారు. ఎన్నో విలువైన పాటలను మనకు అందించారు. ఆ పాటలతో సమాజాన్ని మేల్కొలిపారు. అన్నయ్య సినిమా పాటల రచయిత కాకుండా ఇంకా గొప్ప స్థాయిలో ఉండేవారని కొందరు అంటారు కానీ అన్నయ్య ఆ మాట ఒప్పుకోడు. సినిమా మాధ్యమం వల్లే ఇంత విస్తృతంగా తన పాట ప్రజల్లోకి వెళ్లిందని అనేవారు. అన్నారు.


సింగర్ పార్థసారధి మాట్లాడుతూ - సీతారామశాస్త్రి గారి లాంటి గొప్ప గేయ రచయిత ఉండటం తెలుగు సినిమా అదృష్టం. ఆయన పాటలు పాడే గొప్ప అవకాశం నాకు రావడం గర్వంగా భావిస్తున్నా. నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఇది పూర్తి చేయగలమా అనే భయం ఉండేది. నేను చేయగలనా అనే సందేహం కలిగినప్పుడు శ్రీరామ్ ధైర్యం చెప్పేవారు. ఇవాళ ఎంతోమంది శాస్త్రి గారి అభిమానులు, గొప్ప స్థాయిలో ఉన్నవాళ్లు మాకు సపోర్ట్ చేశారు. సిరి డెవలపర్స్ మూర్తిగారు, సిలికానాంధ్ర, డాక్టర్ గురువారెడ్డి గారు, వీళ్లందరి సపోర్ట్ తో ముందుకెళ్లాం. శాస్త్రి గారి పాటలను, మాటలను చిరకాలం నిక్షిప్తం చేయాలనేది మా ప్రయత్నం. అన్నారు.


డాక్టర్ గురువారెడ్డి మాట్లాడుతూ - నేను కోట్ల రూపాయలు సంపాదించుకున్నందుకు కాదు సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి గొప్ప వ్యక్తుల మధ్య గడిపినందుకు గర్విస్తున్నాను. మా పాపతో మేము నిర్మించిన లిటిల్ సోల్జర్స్ సినిమాలో మొత్తం పాటలు శాస్త్రి గారే రాశారు. మనం మాట్లాడుకునే చిన్న చిన్న మాటలతోనే గొప్ప పాటలు రాసిన గ్రేట్ రైటర్ శాస్త్రి గారు. కృష్ణవంశీ గారు, శాస్త్రి గారి కాంబోలో చాలా మంచి పాటలు వచ్చాయి. మా సన్ షైన్ ఆస్పత్రి ఆడిటోరియంలో సెట్ వేసి నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. అన్నారు.


దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ - నాకు సీతారామశాస్త్రి గారు చాలా కాలంగా తెలుసు. ఆయన పరిచయం ఒక అదృష్టంగా భావిస్తా.

నేను ఏ సినిమా మొదలుపెట్టినా ముందు సీతారామశాస్త్రి గారి దగ్గరకు వెళ్లి పాటల గురించి డిస్కస్ చేస్తుండేవాడిని. నా కొత్త సినిమా మొదలుపెట్టాలని ఆరేడు నెలల నుంచి ప్రయత్నిస్తున్నా. కానీ పాటలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. శాస్త్రి గారు లేకపోవడం వల్ల అనాథగా మారిన భావన కలుగుతోంది. శాస్త్రి గారి గురించి ఇంత మంచి ఈ కార్యక్రమం  శ్రీరామ్ కు , పార్థసారధి నా కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.


సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ - సీతారామశాస్త్రి ప్రోగ్రాం మీరు మీడియా కార్యక్రమం నిర్వహించాలని అడిగినప్పుడు అది అదృష్టంగా భావించా. సీతారామశాస్త్రి గారు గొప్ప సినీ రచయిత. దర్శకుల మనసు తెలుసుకుని, వారికి ఏం కావాలో అది రాసిచ్చే లిరిసిస్ట్. కృష్ణవంశీ గారికి ఆయన చిరకాలం గుర్తుండే పాటలు రాశారు. శాస్త్రి గారు మనకు దూరమైనప్పుడు వచ్చిన అశేష జనాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ కార్యక్రమంతో శాస్త్రి గారి పాట, మాట ప్రేక్షకులకు విస్తృతంగా చేరాలని కోరుకుంటున్నా. అన్నారు.

Nee Dhaarey Nee Katha hits theatres worldwide on June 14

 నీ దారే నీ కథ  జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. అద్భుతమైన సంగీతం మరియు ఎమోషన్స్ తో నిండిన మరపురాని ప్రయాణం ఈ సినిమావంశీ జొన్నలగడ్డ దర్శకత్వం వహించిన, ఈ సంగీత ఆధారిత కథ ఆకర్షణీయమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది, యువత మరియు ఆకర్షణీయమైన కథాంశంతో మనసును కదిలించే సంగీతాన్ని మిళితం చేస్తుంది. ఈ చిత్రం అభిరుచి, స్నేహం, మన కలలను సాధించాలనే సంకల్పం మరియు తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బంధం వంటి ఇతివృత్తాలను కలిగి ఉంది. ప్రేక్షకులు భావోద్వేగాల రోలర్‌కోస్టర్‌ లా ఫీల్ అవుతారు. సంగీతం స్వరాన్ని సెట్ చేస్తుంది, ఈ చిత్రం యొక్క ముఖ్య విషయం జీవిత సవాళ్ల మధ్య పట్టుదల తో కూడి ఉంది.


ప్రతిభావంతులైన తారాగణం మరియు అన్ని వయసుల  ప్రేక్షకులను అలరించేలా రూపొందించిన స్క్రీన్‌ప్లే "నీ దారే నీ కథ" ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసినదిగా చిత్రం.


నటీనటులు :

ప్రియతమ్ మంతిని, విజయ విక్రాంత్, అనంత పద్మశాల, అంజన బాలాజీ, వేద్.


టెక్నికల్ టీం :

బ్యానర్ : జె వి ప్రొడక్షన్స్

నిర్మాతలు : వంశీ జొన్నలగడ్డ, తేజేష్ వీర, శైలజ జొన్నలగడ్డ

రచయితలు : మురళి కాంత్, వంశీ జొన్నలగడ్డ

సంగీతం : ఆల్బర్ట్టో గురియోలి

సినిమాటోగ్రాఫర్ : ఎలెక్స్ కావు

కాస్ట్యూమ్ డిజైనర్ : హర్షిత తోట

ఎడిటర్ : విపిన్ సామ్యూల్

దర్శకుడు : వంశీ జొన్నలగడ్డ

పి ఆర్ ఓ : మధు VR

I-20 Audio Launched Grandly

 యమసందడిగా "ఐ-20"

పాటలు - ప్రచారచిత్రం విడుదల!!పి.ఎన్.ఆర్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ పతాకంపై సూగూరి రవీంద్ర దర్శకత్వంలో పి.బి.మహేంద్ర నిర్మించిన న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ "ఐ - 20". బివేర్ ఆఫ్ గర్ల్స్ (అమ్మాయిలతో జాగ్రత్త) అనేది ఉప శీర్షిక. కొమ్ము మనోహర దేవి సహ నిర్మాత. సూర్యరాజ్ - మెరీనా సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం పాటలు, ప్రచారచిత్రం ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు.ప్రముఖ ఆడియో సంస్థ మధుర ఆడియో ద్వారా ఈ చిత్రం పాటలు లభ్యం కానున్నాయి!! తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, ప్రముఖ దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, ప్రముఖ దర్శకులు వి.సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రూపొందించిన "ఐ - 20" అందరికీ నచ్చుతుందనే ఆశాభావాన్ని దర్శకనిర్మాతలు వ్యక్తం చేశారు!!


మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ యెలెందర్, గీత రచయిత దేవకరణ్, సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్, కొరియోగ్రాఫర్స్ శైలజ- శ్యామ్ తదితర చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. రాగిణి, లీరిషా (సూపర్ ఉమెన్), చిత్రం శ్రీను, జోష్ రవి, పొట్టి చిట్టిబాబు, సద్దాం హుస్సేన్, రియాజ్, పర్శ, పల్లెమోని శ్రీనివాస్, వినోద్ నాయక్ తదితరులు ఈ చిత్రంలో ఇతర కీలకపాత్రలు పోషించారు!!

Siva Kantamaneni Big Brother Releasing on May 24th

 శివ కంఠంనేని తాజా చిత్రం

"బిగ్ బ్రదర్" ఈనెల 24 విడుదల!!"రాజమౌళి ఆఫ్ భోజపురి"

గోసంగి సుబ్బారావు రీ-ఎంట్రీ


"అక్కడొకడుంటాడు, మధురపూడి గ్రామం అనే నేను, రాఘవరెడ్డి" చిత్రాలతో రివార్డులు, అవార్డులు దండిగా పొందిన బహుముఖ ప్రతిభాశాలి శివ కంఠంనేని టైటిల్ రోల్ ప్లే చేసిన "బిగ్ బ్రదర్" సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. 


భోజపురిలో అపజయం అనేది లేకుండా దూసుకుపోతూ "రాజమౌళి ఆఫ్ భోజపురి"గా నీరాజనాలు అందుకుంటున్న ప్రముఖ దర్శకులు గోసంగి సుబ్బారావు చాలా విరామం అనంతరం తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ రూపొందించిన "బిగ్ బ్రదర్" చిత్రాన్ని లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై జి.రాంబాబు యాదవ్ సమర్పణలో కె. శివశంకర్ రావు - ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. ఘంటా శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో శివ కంఠంనేని సరసన ప్రియా హెగ్డే నటించగా... శ్రీ సూర్య, ప్రీతి శుక్లా ఇంకో జంటగా నటించారు!!


చిత్రం విడుదల సందర్భంగా దర్శకసంచలనం గోసంగి సుబ్బారావు మాట్లాడుతూ... "అన్నదమ్ముల అనుబంధం నేపధ్యంలో... ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్ దట్టించి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం "బిగ్ బ్రదర్". శివ కంఠంనేని మరోసారి ఇందులో అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ కనబరిచారు. నందమూరి కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ చిత్రం "బింబిసార"కు యాక్షన్ కొరియోగ్రఫి చేసిన ఫైట్ మాస్టర్ రామకృష్ణ డిజైన్ చేసిన రొమాంఛిత పోరాటాలు "బిగ్ బ్రదర్" చిత్రానికి బిగ్ ఎట్రాక్షన్. ఈనెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంతో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఇకపై తెలుగులో వరసగా సినిమాలు చేస్తాను" అన్నారు!!


గౌతంరాజు, గుండు సుదర్శన్, రాజేందర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్-అప్పాజీ, డాన్స్: రాజు పైడి, స్టంట్స్: రామకృష్ణ, ఎడిటింగ్: సంతోష్, కెమెరా: ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు, సమర్పణ: జి.రాంబాబు యాదవ్, నిర్మాతలు: కె.శివశంకర్ రావు - ఆర్.వెంకటేశ్వరరావు, రచన - దర్శకత్వం: గోసంగి సుబ్బారావు!!

TFDA invited TG CM For Directors Day Event

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రేపు జరగబోయే డైరెక్టర్స్ డే ఈవెంట్ కు ఆహ్వానించిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్
రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించబోతోంది తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్. ఈ వేడుక రావాల్సిందిగా అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్, వైస్ ప్రెసిడెంట్ వశిష్ట, దర్శకులు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానాన్ని అందజేశారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి వస్తానని చెప్పినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి విజన్ ఉందని, ప్రపంచ సినిమాకు టాలీవుడ్ హబ్ గా మారేలా చేద్దామని సీఎం చెప్పినట్లు టీఎఫ్ డీఏ అధ్యక్షుడు వీరశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా 


టీఎఫ్ డీఏ ప్రెసిడెంట్ వీర శంకర్ మాట్లాడుతూ - నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, వశిష్ట మరికొందరు వెళ్లి కలిశాం. ఐదు నిమిషాలు మాట్లాడాలని వెళ్తే సుమారు గంట సేపు మాతో సినిమా ఇండస్ట్రీ గురించి సీఎం మాట్లాడటం హ్యాపీగా అనిపించింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి సీఎం గారి విజన్ కు ఆశ్చర్యం వేసింది. ప్రపంచ సినిమా హబ్ గా టాలీవుడ్ మారాలని, ఆ దిశగా ప్రభుత్వం సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వరల్డ్ క్లాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించాం. డైరెక్టర్స్ డే ను ప్రపంచమంతా గుర్తుపెట్టుకునేలా ఈ ఈవెంట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు తప్పకుండా వస్తామని మాటిచ్చారు. అని చెప్పారు.

Makkal Selvan’ Vijay Sethupathi’s ‘ACE’ grabs the spotlights!

 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

 


విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ లీడ్ రోల్స్ లో ఆరుముగ కుమార్ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. యోగి బాబు, పి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లూ, రాజ్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  కరణ్ బహదూర్ రావత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనింగ్ ఎ.కె. ముత్తు,  ఆర్. గోవిందరాజ్ ఎడిటింగ్.  'ఏసీఈ' అనే డిఫరెంట్ టైటిల్ తో రూపొందుతున్న ఈ కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 7Cs ఎంటర్‌టైన్‌మెంట్ గ్రాండ్ గా నిర్మిస్తుంది.


సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో రివీల్ చేసిన ఫస్ట్ లుక్ లో విజయ్ సేతుపతి యూత్‌ఫుల్ లుక్, స్మోకింగ్ పైప్, డైస్ వేస్తూ కనిపించి అందరినీ ఆకర్షించారు. ఇది సినిమా గురించి అభిమానులలో క్యురియాసిటీని పెంచింది. స్టార్ కాస్ట్, ఆకట్టుకునే నేపథ్య సంగీతం, విజయ్ సేతుపతి ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని ప్రజెంట్ చేసిన ఈ సినిమా టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. జూదం, తుపాకులు, పేలుళ్లు, రాబరీస్, బైక్ ఛేజింగ్ వంటి అంశాలు అలరించాయి. టీజర్‌లో యోగి బాబు కామిక్ రియాక్షన్ హ్యుమర్ రేకెత్తిస్తుంది.  ఇది సినిమా హిలేరియస్  క్రైమ్-కామెడీ థ్రిల్లర్‌గా ఉంటుందని తెలియజేస్తుంది.  ఈ విజువల్ గ్లింప్స్, టైటిల్ ప్రివ్యూ, జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు యానిమేటెడ్ ఫార్మాట్‌లో పాత్రల యొక్క ముఖ్యమైన అంశాలు రివిల్ చేయడం వల్ల ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. సినిమా సింగిల్ ట్రాక్,  టీజర్‌ని అభిమానులందరూ ఆస్వాదించేలా త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రొడక్షన్ టీమ్ అనౌన్స్ చేసింది.

 

ఈ ఏడాది ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతికి ‘ఏసీఈ’ రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.

Classic Movie Manam 10Years Celebrations With Special Shows

 లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, అన్నపూర్ణ స్టూడియోస్ క్లాసిక్ 'మనం' పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు  లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మనం'.  మే23, 2014న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాదించడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ క్లాసిక్‌ మూవీ గా నిలిచింది.


'మనం' విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ క్లాసిక్ ఎంటర్‌టైనర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. మే23న రెండు తెలుగు రాష్ట్రాలలో 'మనం' స్పెషల్ షోలని ప్రదర్శించబోతున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేశారు.    


ఈ మ్యాజికల్ అప్డేట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియాలో పంచుకుంటూ #మనం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం. థియేటర్లలో మరోసారి సెలబ్రేట్ చేసుకుందాం' అని ట్వీట్ చేశారు.


#మనం నా మనసులో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. 10 సంవత్సరాల వేడుకలను జరుపుకోవడానికి తిరిగి థియేటర్లలోకి తీసుకువస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది #ANRLivesOn'' అని  హీరో నాగ చైతన్య ట్వీట్ చేశారు.


అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మక నిర్మాణంలో, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని మూడు తరాల హీరోలు కలసి తెరపై కనిపించడం ప్రేక్షకుల మనసులో చేరగని ముద్ర వేసింది.


ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందించిన ఆల్బమ్ ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు, ప్రేక్షకులని మరోసారి మెస్మరైజ్ చేయబోతోంది.

Average Student Nani First Look Unveiled

ఆకట్టుకునేలా పవన్ కుమార్ కొత్తూరి ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ ఇంటెన్స్, బోల్డ్ ఫస్ట్ లుక్మెరిసే మెరిసే చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియెన్స్ ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఈ యూత్‌ఫుల్ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రమోషన్స్‌ను చిత్రయూనిట్ ప్రారంభించింది. ఈ రోజు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ బోల్డ్ అండ్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉంటుందో అర్థమవుతోంది. స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్‌, వివియా సంత్‌లు హీరోయిన్లుగా నటించారు.


ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. ఉద్ధవ్ ఎస్ బి ఈ చిత్రానికి ఎడిటర్.


సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.


తారాగణం: పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ, సాహిబా భాసిన్, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి తదితరులు


సాంకేతిక సిబ్బంది:

రచయిత, దర్శకుడు: పవన్ కుమార్ కొత్తూరి

నిర్మాతలు: పవన్ కుమార్ కె, బిషాలి గోయెల్

సంగీతం: కార్తీక్ బి కొడకండ్ల

DOP: సజీష్ రాజేంద్రన్

ఎడిటర్: ఉద్ధవ్ SB

సాంగ్స్ కొరియోగ్రఫీ : రాజు మాస్టర్

ఫైట్స్: నందు

PRO: ఎస్ ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్

Kajal Aggarwal In A Significant Role In Vishnu Manchu’s Kannappa

 విష్ణు మంచు ‘కన్నప్ప’లో కాజల్ అగర్వాల్డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ అంచనాలు పెంచేస్తోంది. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ముగించేసుకోవడం, ఆ తరువాత డార్లింగ్ ప్రభాస్‌ సెట్‌లోకి రావడం.. ఇలా ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూనే వస్తోంది. తాజాగా కన్నప్పకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట్లో వైరల్ కాసాగింది.


కన్నప్ప చిత్రంలోని ఓ కీలక పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ మేరకు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఆల్రెడీ విష్ణు మంచు, కాజల్ కలిసి ఇది వరకు మోసగాళ్లు మూవీని చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలా మంచు విష్ణు టైటిల్ రోల్‌లో చేస్తోన్న కన్నప్ప చిత్రంలో కాజల్ ఓ కీ రోల్‌ను పోషిస్తున్నారు.


కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఎక్కువగా న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైద్రాబాద‌లో జరుగుతోంది. మే 20న కేన్స్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్నప్ప టీజర్‌ను లాంచ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే.

Vadakkan Makes Historic Debut at Cannes Film Festival's Marché du Film Fantastic Pavilion

అంతర్జాతీయ వేదికపై మలయాళీ మూవీ ‘వడక్కన్’కిషోర్, శ్రుతి మీనన్ నటించిన వడక్కన్ మూవీ ప్రపంచ స్థాయి వేదికపై మెరిసింది. రసూల్ పూకుట్టి, కీకో నకహరా, బిజిబాల్, ఉన్నిఆర్ సంయుక్తంగా నిర్మించగా.. సాజీద్ ఎ దర్శకత్వంలో ఈ మూవీ వచ్చింది. బ్రస్సెల్స్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ (BIFFF )లో స్థానం సంపాదించుకుంది. ఆఫ్‌బీట్ మీడియా గ్రూప్ అనుబంధ సంస్థ ఆఫ్‌బీట్‌స్టూడియోస్ బ్యానర్‌పై వడక్కన్‌ను నిర్మించారు. ఈ చిత్రం ప్రాచీన ఉత్తర మలబార్ జానపద కథల నేపథ్యంలో సాగుతుంది.


మస్యాత్మకమైన వస్త్రాన్ని నేయడం ద్వారా అతీంద్రియ థ్రిల్లర్ రంగాల్లోకి లోతుగా పరిశోధిస్తుంది. తమ సినిమాకు ఇంతటి గుర్తింపు రావడంతో భ్రమయుగం, భూతకాలం దర్శకుడు రాహుల్ సదాశివన్ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఇలా పేర్కొన్నాడు. ‘వడక్కన్‌కి లభించిన అంతర్జాతీయ గుర్తింపు చాలా సంతోషకరమైనది. మలయాళ చిత్రసీమను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టడం ఎంతో గర్వంగా ఉంది’ అని అన్నారు.


ఆఫ్‌బీట్ మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు & నిర్మాత, జైదీప్ సింగ్ మాట్లాడుతూ.. ‘వడక్కన్‌తో ప్రపంచ స్థాయి కాస్ట్ & క్రూ మద్దతు ఉన్న గ్లోబల్ సెన్సిబిలిటీలతో హైపర్‌ లోకల్ కథనాలను చెప్పడం ద్వారా భారతీయ సినిమాని పునర్నిర్వచించడమే మా లక్ష్యం’ అని అన్నారు. వడక్కన్ ని ఈ సంవత్సరం కేన్స్‌లో మే నెలలో ప్రదర్శించనున్నారు. వడక్కన్ ని కన్నడ, తమిళం, తెలుగు భాషల్లోకి డబ్ చేయనున్నారు.

Viswambhara Director Vasishta Launched Dirty Fellow Trailer

డర్టీ ఫెలో మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠమే 24న డర్టీ ఫెలో మూవీ గ్రాండ్ రిలీజ్


 శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో  రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్  పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి  హిరో హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించిన చిత్రం  "డర్టీ ఫెలో".

ఈ సినిమా మే 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. సంస్థ కార్యాలయంలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ దర్శకులు మల్లిడి వశిష్ఠ ట్రైలర్ ను రిలీజ్ చేసారుర. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో శాంతిచంద్ర చిత్ర దర్శకులు మూర్తి సాయి అడారి మరియు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 

ఈ సినిమా సాంగ్స్ మధుర ఆడియో ద్వారా మార్కెట్లో రిలీజ్ అయ్యాయి. 


దర్శకులు మల్లిడి వశిష్ఠ మాట్లాడుతూ: శాంతిచంద్ర హీరోగా నటించిన డర్టీఫెలో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడం జరిగింది మే 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మూవీ టిమ్ సభ్యులందరికీ అభినందనలు అని అన్నారు.


చిత్ర హీరో శాంతిచంద్ర మాట్లాడుతూ: మా డర్టీఫెలో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి టిమ్ ని అభినందించిన మల్లిడి వశిష్ఠ గారికి ధన్యవాదములు. మే 24న డర్టీ ఫెలో సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఇటీవల మధుర ఆడియో ద్వారా రిలీజ్ అయిన అన్ని పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది అని అన్నారు.


చిత్ర దర్శకులు మూర్తి సాయి ఆడారి మాట్లాడుతూ : డర్టీ ఫెలో ట్రైలర్ ను దర్శకులు వశిష్ఠ ఆవిష్కరించడం చాలా హ్యాపీగా ఉంది. మే 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉంటాయి అని అన్నారు.


నటి నటులు:

శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ వాలా హిరో హీరోయిన్లుగా నటించగా సత్యప్రకాస్, నాగి నిడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులు


సాంకేతిక నిపుణులు 

సమర్పణ : శ్రీమతి గుడూరు భద్ర కాళీ

బ్యానర్ : రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్

నిర్మాత : జి.యస్. బాబు.

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : ఆడారి మూర్తి సాయి

డి. ఓ. పి : రామకృష్ణ. యస్.

మ్యూజిక్: డాక్టర్. సతీష్ కుమార్.పి.

ఎడిటర్ : జేపీ

ఫైట్స్ : శంకర్

కొరియోగ్రఫీ : కపిల్ & ఈశ్వర్

Dubbing Commences for 'Laggam' Movie Directed by Ramesh Cheppala

 'లగ్గం' డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం !!!సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల 

రచన -దర్శకత్వం వహిస్తున్నారు.  పెళ్లిలో ఉండే సంభరాన్ని, విందుని, చిందుని, కన్నుల విందుగా చూపించబోతున్నారు. ఇది పెళ్లి కల్చర్ ఫ్యామిలీ డ్రామా

ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు, కొత్త ఎక్స్పీరియన్స్ కళ్ళముందు ఉంచే ఈ చిత్రం  కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని దర్శకుడు రమేష్ చెప్పాల తెలిపారు.


ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రసాద్ ల్యాబ్ లో ప్రారంభం అయ్యాయి. నటకిరీటి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా స్టార్ట్ అయిన ఈ కార్యక్రమంలో సాయి రోనక్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.


 సీనియర్ ఆర్టిస్టులు రోహిణి,  ఎల్.బి శ్రీరామ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ - మాటలు స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల, సంగీతం:చరణ్ అర్జున్.ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి. కెమెరామెన్: బాల్ రెడ్డి. ఆర్ట్:కృష్ణ సాహిత్యం: కాసర్ల శ్యామ్. సంజయ్ మహేశ్ వర్మ కొరియోగ్రఫీ. అజయ్ శివశంకర్.


నటీనటులు:

సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగుణ ,లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, సత్తన్న తదితరులు.


Producer Prathani Ramakrishna Goud Birthday Special Interview

 ఇకపై వరుస చిత్రాలు చేస్తాను : బర్త్‌డే స్పెషల్‌ ఇంటర్వ్యూలో దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ప్రతాని రామకృష్ణగౌడ్‌... నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, తెలంగాణ ఫిలిం చాంబర్‌ అధ్యక్షుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అక్కర్లేని పేరు. చిత్ర పరిశ్రమకు సంబంధించి ముఖ్యంగా చిన్న నిర్మాతలపాలిట వరంగా మారిన వ్యక్తి. 1992లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన 36 సినిమాలను నిర్మించి, 7చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇటీవలకాలంలో దర్శకత్వాన్ని పక్కనపెట్టి, పూర్తిగా తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ కార్యకలాపాల్లో మునిగిపోయిన ఆయన మరల మెగాఫోన్‌ పట్టి ‘దీక్ష’ పేరుతో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం (మే 18) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ వివరాలు పాఠకుల కోసం..


పరిశ్రమకు రావాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు?

నాకు చదువుకునే రోజుల నుంచే నటన అంటే పిచ్చి. మా కాలేజీలో ‘లంబాడోళ్ల రాందాస్‌’ అనే నాటకం వేశాము. అది నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచే మిత్రులు నేను నటుణ్ణి కావాలని ప్రోత్సహిస్తూ వచ్చారు. దాంతో నాకు కూడా చిత్రపరిశ్రమలో నిలబడాలనే కోరిక కలిగింది. దాంతో 1992లో పరిశ్రమలోకి అడుగుపెట్టాను.


చాలాకాలం తర్వాత మెగాఫోన్‌ పట్టినట్టున్నారు?

మూడు దశాబ్దాలకు పైగా దర్శక, నిర్మాతగా ఇటీవల కాలంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడిగా ఊపిరి సలపని బాధ్యతల వల్ల దర్శకత్వానికి కొంత గ్యాప్‌ వచ్చిన మాట వాస్తవమే. ఆ గ్యాప్‌కు బ్రేక్‌ ఇస్తూ.. కొద్ది రోజుల క్రితమే ‘దీక్ష’ అనే సినిమాను ప్రారంభించాను. మంచి సబ్జెక్ట్‌. అలాగే ఈ సినిమా తర్వాత ‘లేడీ కబడ్డీ జట్టు’ సినిమా చేయబోతున్నాను. దీన్ని 18 లాంగ్వేజ్‌ల్లో చేయాలని, భారీ ప్లాన్‌ వేస్తున్నాం. దీనికి సంబంధించిన సాంగ్స్‌ రికార్డింగ్‌ కూడా పూర్తయ్యింది. మంగ్లీ 2 పాటలు, మధుప్రియ 1 పాట పాడారు. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.


దర్శక, నిర్మాత ` తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ ఈ రెండిరలో మీకు ఇష్టమైనది?

దర్శక, నిర్మాత అన్న ట్యాగ్‌ నా పేరు ముందు ఉండటమే నాకు ఇష్టం. అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు అన్నది అత్యున్నత గౌరవం.


తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ను ఎందుకు స్థాపించారు? ఆ లక్ష్యం నెరవేరిందా?

తెలంగాణకు సంబంధించిన కళాకారులు, నిర్మాతలు, దర్శకులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో దీన్ని స్థాపించాము. అయితే ప్రాంతాలతో సంబంధం లేకుండా ఇప్పటికి దాదాపు 16 వేలకు పైగా కళాకారులు, టెక్నీషియన్స్‌ మా సంస్థలో సభ్యులుగా చేరారు. ఇది చాలా గర్వంగా అనిపిస్తుంది. మా సంస్థ ద్వారా అనేక మందికి సినిమాల పట్ల, నిర్మాణం పట్ల అవగాహన కల్పిస్తూ వారికి మార్గనిర్దేశం చేస్తున్నాం. అది మంచి ఫలితాలు ఇస్తోంది.


గతంలో థియేటర్స్‌ సమస్యపై ఆమరణ దీక్ష చేశారు కదా.. ప్రస్తుతం సింగిల్‌ స్క్రీన్స్‌ తాత్కాలికంగా మూసేస్తాం అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం?

అసలు సమస్య అంతా థియేటర్స్‌ లీజ్‌ విధానం వచ్చినప్పుడే మొదలైంది. అదే పర్సంటేజ్‌ విధానం ఉంటే అన్ని సినిమాలకు థియేటర్స్‌ దొరికేవి. థియేటర్స్‌ ఫీడిరగ్‌ కూడా బాగుండేది. ఎప్పుడైతే లీజ్‌ విధానం వచ్చిందో.. ఆ లీజ్‌ ఎవరి చేతిలో ఉంటే వారికి సంబంధించిన సినిమాలు వారే వేసుకుంటున్నారు. మిగిలిన థియేటర్స్‌కు ఇవ్వడం లేదు. ఇక్కడే సమస్య మొదలవుతోంది. దీనికి పరిష్కారం చూపుతూ... చిన్న సినిమాలను బతికించుకోవాలనే ఉద్దేశంతో రోజుకు ఒక షో చిన్న సినిమాలకు ఇవ్వాలని గత ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒప్పించాము. కానీ దాన్ని కొందరు అడ్డుకుని అమలు కాకుండా చేశారు.


తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ తరపున నంది అవార్డులు ఇస్తున్నట్టున్నారు?

అవును. సినీ కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ఛాంబర్‌ తరపున నంది అవార్డులను ఇవ్వబోతున్నాం. ఆగస్ట్‌ నెలలో దుబాబ్‌లో ఈ ఈవెంట్‌ను ఘనంగా జరపటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఈ నంది అవార్డులను ఇస్తాం.


దర్శక, నిర్మాతగా మీకు మంచి అనుభూతిని ఇచ్చిన విషయం?

నేను నిర్మించిన, దర్శకత్వం వహించిన ప్రతి సినిమా నాకు మంచి అనుభూతిని ఇచ్చాయి. అయితే సూపర్‌ కృష్ణగారితో ‘సర్దార్‌ సర్వాయి పాపన్న’ చిత్రానికి దర్శకత్వం వహించటం ఎప్పటికీ మర్చిపోలేని స్వీట్‌ మెమరీ.


ఈ నూతన పుట్టినరోజు సందర్భంగా ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నారా?

కొత్త నిర్ణయం అని కాదుగానీ.. ఇక నుంచి పూర్తి స్థాయిలో నిర్మాణం, దర్శకత్వంపై దృష్టి పెట్టాలని డిసైడ్‌ అయ్యాను. అందుకే రాబోయే రోజుల్లో బిజీ షెడ్యూల్‌ ప్లాన్‌ చేసుకుంటున్నా. ప్రస్తుతం నేను దర్శకత్వం వహిస్తున్న  ‘దీక్ష’ ఒక షెడ్యూల్‌ పూర్తి చేశాము. వచ్చేవారంలో మరో షెడ్యూల్‌ స్టార్ట్‌ అవుతుంది. ఆ తర్వాత ‘లేడీ కబడ్డీ జట్టు’.. ఇలా వరుసగా సినిమాలు చేస్తాను.


అడ్వాన్స్‌ హ్యాపీ బర్త్‌డే టు యు

థ్యాంక్యూ...


Hero Surya Launched Hit List Movie Teaser

 వెర్సటైల్ హీరో సూర్య చేతుల మీదగా హిట్ లిస్ట్ మూవీ టీజర్ లాంచ్తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా హిట్ లిస్ట్. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ గారు నిర్మిస్తున్న సినిమా. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచగా. నేడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వెర్సటైల్ హీరో సూర్య చేతుల మీదగా లాంచ్ చేశారు.


యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ చాలా బాగుంది. ప్రెసెంట్ ఆడియన్స్ ని ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్ జానర్ మూవీస్ అట్రాక్ట్ చేస్తున్నాయి ఇది కూడా ఆ జానర్ లోకి రావడం అదే విధంగా టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేస్తోంది.


టీజర్ చూసిన అనంతరం హీరో సూర్య మాట్లాడుతూ : టీజర్ చాలా బాగుంది సినిమా ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా విజయ్ కనిష్క కి ఈ టీం కి మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


నటీనటులు :

విజయ్ కనిష్క, శరత్ కుమార్, సముద్రఖని, గౌతమ్ వాసుదేవ మీనన్, మునిష్కాంత్ కింగ్స్ లే, సితార, స్మృతి వెంకట్, రామచంద్ర రాజు (కే జి ఎఫ్ గరుడ), రామచంద్రన్, ఐశ్వర్య దత్త, అభి నక్షత్రం.


టెక్నీషియన్స్ :

నిర్మాణం : ఆర్. కె. సెల్లులాయిడ్స్

నిర్మాత : కె. ఎస్  రవికుమార్

ఎడిటర్ : జాన్ అబ్రహం

మ్యూజిక్ : సి. సత్య

డి ఓ పి : కే. రామ్ చరణ్

కథ : ఎస్. దేవరాజ్

దర్శకత్వం : సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్

తెలుగు రాష్ట్రాల రిలీజ్ : శ్రీ శ్రీనివాస స్క్రీన్స్, శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా, బెక్కం ప్రొడక్షన్స్

డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

పి ఆర్ ఓ : మధు VR