నారప్ప` సక్సెస్ మీట్...
విక్టరి వెంకటేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం `నారప్ప`. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఇటీవల అమేజాన్ ప్రైమ్‌వీడియోలో విడుదలై సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో..
నటుడు కార్తిక్ రత్నం మాట్లాడుతూ - ``ముందుగా నన్ను ప్రొత్సహించి, నాకు ధైర్యం ఇచ్చి మునికన్నా క్యారెక్టర్ చేయించిన సురేష్‌బాబుగారికి ధన్యవాదాలు. మునికన్నా పాత్రని ఓన్ చేసుకున్న తెలుగు ప్రేక్షకులకి కృతజ్ఞతలు.``అన్నారు.
ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ - ``మా టీమ్ అందరూ 52రోజులు చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ఆ సమయంలోనే కరోనా ఫస్ట్‌వేవ్ మొదలైంది. ఒక నిర్మాతగా మా టీమ్ అందరిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని పూర్తిచేశాం. మా టీమ్ కూడా బాగా సపోర్ట్ చేసింది. మామూలుగా నేను ఎప్పుడు యాక్టర్స్ బాగా చేశారు అని పొగడను ఎందుకంటే వాళ్లు బాగా చేస్తారనే నా సినిమాలో పెట్టుకుంటాను. శ్రీకాంత్ ఈ సినిమా రష్ చూపించినప్పుడే బాగా నచ్చింది. అమేజాన్ ప్రైమ్ కి ఇండియావైడ్‌గా 4400 గ్రామాల్లో సబ్‌స్క్రైబర్స్ ఉన్నారంట..అందులో 4100 గ్రామాల్లో ఈ సినిమా చూశారని వారు చెప్పారు. అలాగే 240 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తే 180కి పైగా దేశాల్లో ఈ సినిమా చూశారు. అమేజాన్ వారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేసిన మీడియా వారికి థ్యాంక్స్.
హీరోయిన్ ప్రియమణి మాట్లాడుతూ - ``నేను ఎప్పటినుంచో సురేష్ ప్రొడక్షన్స్ లో వర్క్ చేయాలి అనుకున్నారు. ఆ అవకాశం ఇచ్చిన సురేష్‌బాబు గారికి, డైరెక్టర్ శ్రీకాంత్‌గారికి థ్యాంక్స్. వెంకీసార్ నారప్ప పాత్రలో ఒదిగిపొయారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీ. కార్తిక్ రత్నం, రాకీ, బుజ్జమ్మ ఇలా అందరూ చాలా బాగా చేశారు`` అన్నారు.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ - ``మా టీమ్ అందరి కష్టం, ఆ దేవుని అనుగ్రహం వల్ల చాలా గొప్పవిజయం లభించింది. ఓటీటీలో రిలీజైనప్పటికీ మారుమూల గ్రామాల ప్రజలు కూడా చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. మా టీమ్ అందరి సమిష్టికృషి `నారప్ప`. ఆర్టిస్టులు అందరూ తమ పాత్రలలో పరకాయప్రవేశం చేశారు. వెంకటేష్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ సినిమాకి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను`` అన్నారు.
దర్శకుడు అనిల్‌రావిపూడి మాట్లాడుతూ – ‘‘‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ సమయంలో వెంకటేశ్‌గారు ‘నారప్ప’ సినిమా రీమేక్ గురించి చెప్పారు. ఆయన్ను ఆ పాత్రలో చూడాలని నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. ‘నారప్ప’ చిత్రంలో వెంకటేశ్‌గారి ఇంటెన్స్ యాక్టింగ్ చూశాను. వెంకటేష్‌గారు ప్రతి సినిమాతో సర్‌ప్రైజ్ చేస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ రోల్స్ చేస్తుంటారు. వరుస యాక్షన్ సినిమాలు చేస్తూ, సడన్‌గా ‘చంటి’లాంటి ఓ సినిమా చేస్తారు. ‘అబ్బాయిగారు’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేసి ఆ వెంటనే ‘గణేశ్’లాంటి మాస్ యాక్షన్ మేసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ చేస్తారు. ప్రతి సినిమాకు ఆర్టిస్టుగా ఏదో ఒకటి చేయాలని ట్రై చేస్తూనే ఉంటారు. ఆర్టిస్టుగా వెంకటేశ్‌గారు చేయని పాత్ర లేదు. ఈ సినిమాలోని క్లోజప్ షాట్స్‌ను వెంకటేష్‌గారిని గమనించాను. అద్భుతంగా చేశారు. క్రికెట్ భాషలో చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమలో వెంకటేశ్‌గారు క్లాస్ యాక్టర్. ఆయనతో కలిసి వర్క్ చేస్తున్నట్లు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ‘నారప్ప’ సినిమాలో వెంకటేష్ గారు, ప్రియమణిగారు, కార్తీక్‌రామ్ యాక్ట్ చేసినట్లు అనిపించలేదు. వారు వారి పాత్రల్లో జీవించినట్లు అనిపించింది. ప్రియమణి గొప్ప నటి. ప్రియమణిగారు తన నటనకు తగ్గ పాత్రలు చేసిన ప్రతిసారి ఆ సినిమా హిట్టే. ఈ సినిమాలో నాకు నటీనటులు, సాంకేతికనిపుణులు బాగా కష్టపడ్డారు. ఇలాంటి సినిమాలు చేసినప్పుడు వస్తే అప్రిషియేషన్ కిక్ వేరు. నారప్ప లాంటి సినిమానుల ఎగ్జిక్యూట్ చేయాలంటే డి.సురేష్‌బాబుగారే చేయాలి. దర్శకులు శ్రీకాంత్ అడ్డాల గారు ‘నారప్ప’ సినిమాను ఎలా డైరెక్ట్ చేస్తారా? అనిపించింది. ఎందుకంటే ఆయన ఇది వరకు చేసిన సినిమాలు వేరు. శ్రీకాంత్ అడ్డాల గారిలో అద్భుతమైన కమర్షియల్ యాంగిల్ ఉందని తెలిసింది. శ్రీకాంత్ అడ్డాల గారికి కంగ్రాట్స్. ‘ఎఫ్ 3’ సినిమా రైట్ ప్లేస్‌లో రైట్ టైమ్‌లో వస్తుంది. ఎఫ్ 3లో ఎఫ్ 2కు మించిన వినోదం ఉంది.
హీరో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘ ‘నారప్ప’ సినిమాను పెద్ద సక్సెస్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రేక్షకుల రెస్పాన్స్‌కు థ్యాంక్స్. నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. మరెన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేశాను. కానీ ‘అసురన్’ చిత్రం నాకు డిఫరెంట్‌గా అనిపించి, ‘నారప్ప’ చేయాలని వెంటనే ఒప్పుకున్నాను. ‘అసురన్’లాంటి ఓ సినిమాను ఇచ్చిన దర్శకుడు వెట్రీమారన్, యాక్టర్ ధనుష్, నిర్మాత థానుగారికి థ్యాంక్స్. ‘అసురన్’ లేకపోతే నారప్ప ఉండేది కాదు. తెలుగు ఆడియన్స్‌కు నారప్ప కొత్తగా అనిపిస్తుంది. నారప్ప క్యారెక్టర్‌ను చాలెంజింగ్‌గా తీసుకున్నాను. ఈ చాలెంజ్‌లో నేను సక్సెస్ కావడానికి మా టీమ్ నాలో నింపిన ఎనర్జీ కూడా కారణం. షూటింగ్ సమయంలో ‘నారప్ప’ క్యారెక్టర్‌లో చాలా కాలం ఉండిపోయాను. ‘నారప్ప’ మంచి ఎక్స్‌పీ రియన్స్. నారప్ప సినిమాలోని ‘రా..నరకరా’ పాట లిరిక్‌ను అనంతశ్రీరామ్ బాగా రాశారు. ఈ లిరిక్ వినప్పుడు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామా? అనిపించింది. ముఖ్యంగా నా అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నాను. నారప్ప ఓటీటీలో వచ్చిన వారు ఆదరించారు. ఫ్యామిలీస్‌తో కలిసి నారప్ప సినిమా చూస్తున్నారు. ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. వారికి థ్యాంక్స్. మళ్లీ ‘ఎఫ్ 3’వస్తుంది. సంక్రాంతికి వస్తుంది. మళ్లీ ప్రేక్షకులను నవ్విస్తుంది`` అన్నారు.