‘పెళ్లి సందD’లో వశిష్టగా వెండితెరపై సందడి చేయనున్న దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు
దర్శకేంద్రుడు, శతాధిక చిత్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు .. తెలుగు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమాను కమర్షియల్ పంథాను మరో మెట్టు ఎక్కించిన ఈ స్టార్ డైరెక్టర్ విక్టరీ వెంకటేశ్, సూపర్‌స్టార్ మహేశ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి, శిల్పాశెట్టి, ఖుష్బూ, టబు, తాప్సీ వంటి ఎందరో స్టార్స్‌ను వెండితెరకు తన గోల్డెన్ హ్యాండ్‌తో పరిచయం చేసి సూపర్ డూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. శతాధిక చిత్ర దర్శకుడిగా తనదైన తెలుగు సినిమా చరిత్రలో తనదైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న రాఘవేంద్రరావు, తొలిసారి వెండితెరపై నటుడిగా మెప్పించనున్నారు.
రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో, దర్శకేంద్రుడి శిష్యురాలు గౌరి రోణంకి దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పెళ్లి సందD’. ఈ చిత్రంలో రాఘవేంద్రరావు తొలిసారి నటిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో రాఘవేంద్రరావు వశిష్ఠ అనే పాత్రలో నటించారు. వశిష్ఠ పాత్రకు సంబంధించిన స్పెషల్ ప్రోమోను శుక్రవారం రోజున రాఘవేంద్రరావు శిష్యుడు.. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ‘వంద సినిమాలను డైరెక్ట్ చేసిన తర్వాత మా మౌన ముని కెమెరా ముందుకు వస్తున్నారు.‘పెళ్లి సందD’లో వశిష్ఠ పాత్రధారిగా రాఘవేంద్రరావుగారి ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నాం’’ అంటూ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
ఈ స్పెషల్ ప్రోమోలో కె.రాఘవేంద్రరావు సరికొత్త లుక్, ఎనర్జీతో కనిపిస్తున్నారు. పిల్లలతో ఆటలాడటం, రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి పాత్రలతో మాట్లాడేలా ఉండటం, చివరల్లో రోషన్‌తో కలిసి నడిచే సీన్ ఇలాంటి వాటిని ప్రోమోలో చూడొచ్చు. మరి వశిష్ఠగా రాఘవేంద్రరావు ఎలా మెప్పించారో తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు డైరెక్టర్ గౌరి రోణంకి. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ‘పెళ్లి సందD’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాటి `పెళ్లిసందడి`లో శ్రీకాంత్ హీరో అయితే నేటి ‘పెళ్లిసందD’లో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో అవడం విశేషం. శ్రీలీల హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
నటీనటులు:
రోషన్, శ్రీలీల, ప్రకాశ్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, సత్యంరాజేష్, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, అన్నపూర్ణ, జాన్సి, ప్రగతి, హేమ, కౌముది, భద్రం, కిరీటి తదితరులు..
సాంకేతిక వర్గం:
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్త, చంద్రబోస్
సినిమాటోగ్రఫి: సునీల్ కుమార్ నామ
ఎడిటర్: తమ్మిరాజు
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె,
మాటలు: శ్రీధర్ సీపాన
ఫైట్స్: వెంకట్
కొరియోగ్రఫి: శేఖర్ వీజే
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వి. మోహన్ రావు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిబాబా కోవెలమూడి
సమర్పణ: కె. కృష్ణమోహన్ రావు
నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
దర్శకత్వ పర్యవేక్షణ: కె. రాఘవేంద్రరావు బి.ఎ
దర్శకత్వం: గౌరీ రోణంకి.