Latest Post

Silly Monks Turns Profitable after 4 years Announced ESOPs to Employees

లాభాల్లోకి సిల్లీ మాంక్స్ - ఉద్యోగులకు ఈ సాప్స్​ ఇస్తున్నట్టు ప్రకటనస్మాల్ క్యాప్ పబ్లిక్‌ లిస్టెడ్ (ఎన్​ఎస్​ఈ) కంపెనీ,  డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్  కంటెంట్ డిస్ట్రిబ్యూషన్‌లో అగ్రగామి సిల్లీ మాంక్స్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, నాలుగేళ్ల తరువాత లాభాల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా సిల్లీ మాంక్స్ కీలక నిర్ణయాలను ప్రకటించింది. కంపెనీ తన ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ఈసాప్​) ప్లాన్ వివరాలను కూడా వెల్లడించింది. కంటెంట్ పబ్లిషింగ్, డిస్ట్రిబ్యూషన్  మార్కెటింగ్ కంపెనీ అయిన సిల్లీ మాంక్స్ ఆర్థిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి 26.83 లక్షల లాభం (పన్నుకు ముందు) సాధించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో  రూ. 9.46 లక్షల లాభం (పన్నుకు ముందు) సాధించి పెట్టుబడిదారులను ఉత్సాహపరిచింది.  2022–23 ఆర్థిక సంవత్సరం లో సంస్థకు రూ. 552.15 లక్షల నష్టం వచ్చింది.  వ్యూహాత్మక పునర్నిర్మాణం,  వనరుల సమర్థ వినియోగం ద్వారా సిల్లీమాంక్స్​ ఈ విజయాన్ని సాధించింది. ఈ మైలురాయి కంపెనీకి వృద్ధి  స్థిరత్వాన్ని,  కొత్త మార్గాన్ని సూచిస్తుంది. భారతీయ వినోద పరిశ్రమలో కీలక సంస్థగా దాని స్థానాన్ని బలపరుచుకుంది. సోమవారం జరిగిన వారి బోర్డు సమావేశంలో ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా


సిల్లీ మాంక్స్‌ సహ వ్యవస్థాపకుడు, ఎండీ సంజయ్‌రెడ్డి మాట్లాడుతూ - “నాలుగు సంవత్సరాల తర్వాత లాభదాయకంగా మారడం సిల్లీ మాంక్స్​కు గొప్ప విజయం.  మా అంకితభావంతో కూడిన బృందం,  వ్యూహాత్మక కార్యక్రమాల వల్లే  ఈ ఘనత సాధ్యపడింది. మేం మా కార్యకలాపాలను క్రమబద్ధీకరించాం.  స్థిరమైన వృద్ధికి అవసరమైన విభాగాలపై  దృష్టి సారించాం. నిలకడతో కూడిన వృద్ధికి, విజయానికి బాటలు వేశాం. మా ఆర్థికస్థితిని మెరుగ్గా మార్చడంలో క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానం,  వ్యూహాత్మక దృష్టి చాలా కీలకం. బలమైన ప్రణాళికలు  ప్రతిభావంతులైన బృందంతో బలమైన ఆర్థిక పనితీరును కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం” అన్నారు.


కేజీఎఫ్​, కేజీఎఫ్​2, కాంతార, సలార్  వంటి బ్లాక్​బ్లస్టర్​ సినిమాల విజయంలో డిజిటల్​ మార్కెటింగ్ పార్ట్​నర్​గా సిల్లీ మాంక్స్​ కీలకంగా నిలిచింది. ఈ ఏడాది 27 జూన్​లో విడుదల కానున్న కల్కి 2898 – ఏడీకి కూడా డిజిటల్ మార్కెటింగ్ పార్ట్​నర్​.  ఈ అసోసియేషన్స్ వినోద పరిశ్రమలో ప్రీమియర్ కంటెంట్ మార్కెటింగ్  డిస్ట్రిబ్యూటర్‌గా సిల్లీ మాంక్స్ కు మరింత పేరు తీసుకొచ్చాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో సిల్లీ మాంక్స్ తన తన ఉద్యోగులను మరింత శక్తివంతం చేయడానికి,  కస్టమర్ కేంద్రీకృత సంస్కృతిని పెంపొందించడానికి  ఈసాప్​ పథకాన్ని కూడా ప్రారంభించింది. ఈసాప్​ విలువ మొత్తం షేర్ క్యాపిటల్‌లో ఐదుశాతం ఉంటుంది.  దీని నుంచి కంపెనీ ప్రస్తుత ఉద్యోగుల కోసం 70 శాతాన్ని కేటాయించింది. జూన్ 2024 నుంచి రాబోయే 5 సంవత్సరాలలో సమానంగా జారీ చేస్తుంది. ఈ నిర్ణయం వల్ల సిల్లీ మాంక్స్ బృంద సభ్యులు భవిష్యత్తులో కంపెనీ విజయంలో సమగ్ర వాటాదారులు అవుతారు.  ఈ నిర్ణయం వారిని ప్రేరేపిస్తుంది. సిల్లీ మాంక్స్ ఎదుగుదల,  ఆవిష్కరణలను కొనసాగిస్తున్నందున, కంపెనీ తన వాటాదారులకు అద్భుత విలువను అందించడానికి  ఎల్లలు లేని డిజిటల్ వినోదం అందించాలనే సంకల్పంతో ఉంది. 

Kartikeya Gummakonda About Bhaje Vaayu Vegam

"భజే వాయు వేగం" సరికొత్త ఎమోషనల్ డ్రైవ్ తో ఎంగేజ్ చేస్తుంది - కార్తికేయ గుమ్మకొండ
ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా "భజే వాయు వేగం". ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 31న "భజే వాయు వేగం" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా సినిమా హైలైట్స్ తో పాటు తన కెరీర్ విశేషాలను ఇవాళ్టి ఇంటర్వ్యూలో తెలిపారు హీరో కార్తికేయ గుమ్మకొండ.


- లాక్ డౌన్ టైమ్ లో ప్రశాంత్ రెడ్డి కలిసి "భజే వాయు వేగం" కథ వినిపించాడు. కథ చెప్పడం ప్రారంభించిన కొద్దిసేపటికే నేను అందులోని ఎమోషన్స్ కు కనెక్ట్ అయ్యాను. ఈ సినిమా ఖచ్చితంగా చేయాలని నిర్ణయించుకున్నాను. క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు కొంత టైమ్ అడిగాను. "భజే వాయు వేగం" సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత కథ మీద దర్శకుడు ప్రశాంత్ మీద మరింత నమ్మకం పెరిగింది. ముందు త్వరగా ఫినిష్ చేయాలనుకున్న ఈ సినిమాను ఇలా కాదు ఇంకాస్త టైమ్ కేటాయించి ఇంకా బెటర్ గా చేద్దామని అనుకున్నాం. నేను అప్పటికే బెదురులంక స్టార్ట్ చేశాను. ఆ సినిమా పూర్తి చేసి మళ్లీ "భజే వాయు వేగం"కు తిరిగి రావాలని టీమ్ తో డిస్కస్ చేసి వెళ్లాను. అందుకే ఈ సినిమాలో కొన్నిచోట్ల జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నా హెయిర్ స్టైల్ మారినట్లు తెలుస్తుంది.


- "భజే వాయు వేగం" సినిమా ఇప్పుడున్న నా ఇమేజ్ కు సరైన మూవీ. హీరో అంటే మనం పోల్చుకునేలా ఉండాలి. అతనికి ఎదురయ్యే సమస్యలు,  వాటిని సాల్వ్ చేసుకునేందుకు ఎంచుకునే మార్గాలు..ఇవన్నీ ఇన్స్ పైరింగ్ ఉండాలని భావిస్తా. అప్పుడే ఐడియల్ అతన్ని ప్రేక్షకులు హీరోలా చూస్తారు. హీరోగా నాకు కొంచెం సోషల్ కన్సర్న్ ఉంది. అది నేను చేసే పాత్రల మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది. మంచి ఎంటర్ టైన్ మెంట్ కూడా "భజే వాయు వేగం"లో ఉంటుంది.


ఇలాంటి చిత్రంలోనే నేను నటించాలని కోరుకున్నాను. ఇందులో హీరోయిజం, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, లవ్ అన్నీ కుదిరాయి. ఈ కథ దర్శకుడు ప్రశాంత్ చెప్పినప్పుడు కార్తి హీరోగా నటించిన ఖైదీ టైపులో ఊహించుకున్నాను. ఖైదీలో ఉన్నంత యాక్షన్ ఈ మూవీలో ఉండదు కానీ అలాంటి ఎమోషనల్ డ్రైవ్, హీరోకు ఒక ప్రాబ్లమ్, అతనికుండే ధైర్యం ఇలాంటి ఫ్రేమ్ లో కథ ఉంటుంది. సెకండాఫ్ లో రేసీ స్క్రీన్ ప్లేతో మూవీ సాగుతుంది.


- యూవీ క్రియేషన్స్ లో సినిమా చేస్తున్నానంటే హీరోగా నాకొక పెద్ద బ్యానర్ దొరికిందని సంతోషించాను. యూవీలో చేస్తే మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్ అన్నీ సరిగ్గా జరుగుతాయి అనే నమ్మకం ఉంటుంది. యూవీ కాన్సెప్ట్స్ నుంచి మా "భజే వాయు వేగం" టీమ్ కు కంప్లీట్ సపోర్ట్ దొరికింది.


- "భజే వాయు వేగం" సినిమాలో రెగ్యులర్ టైప్ పాటలు ఉండవు. సీరియస్ గా కథ వెళ్తున్న టైమ్ లో పాట వస్తే ఆడియెన్స్ డిస్ట్రబెన్స్ గా ఫీలవుతారు. ఈ సినిమాలో సెట్టయ్యిందే పాట పాపులర్ అయ్యింది. అయితే ఈ పాట మీద మాకు పెద్దగా కాన్సన్ ట్రేషన్ లేదు. ఈ పాట కథను ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది మాత్రమే ప్లాన్ చేసుకున్నాం.


- హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కు సంబంధించిన ట్విస్టులేవీ "భజే వాయు వేగం" సినిమాలో ఉండవు. ఆమెది ఇంపార్టెంట్ రోల్. కథను ముందుకు తీసుకెళ్తుంటుంది. ట్రైలర్ లో ఐశ్వర్య మీనన్ కు సంబంధించిన షాట్స్ తక్కువగా ఉన్నాయంటే కారణం ఆమెకు సంబంధించిన షాట్స్ పెడితే కథ రివీల్ అవుతుంది. ట్రైలర్ హీరో అడాప్ట్ చేసుకున్నకొడుకుగా చూపించాం. అక్కడే కథ మొదలవుతుంది. నా దృష్టిలో ఫైట్స్ చేయడం, విలన్ ను ఎదిరించడం ఎలా హీరోయిజమో. తండ్రి కోసం నిలబడటం, నా అనుకున్న వాళ్ల కోసం ఎక్కడిదాకా అయినా వెళ్లడం, ప్రేమించిన అమ్మాయి కోసం పోరాటం చేయడం కూడా హీరోయిజమే. "భజే వాయు వేగం" ఫస్టాఫ్ లో ఎమోషన్ ఉన్న హీరోను చూస్తారు. సెకండాఫ్ లో ఆ ఎమోషన్ వల్ల ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనేది చూపిస్తున్నాం.


- నేను స్క్రిప్ట్ లో ఇంటర్ ఫియర్ కాను. కానీ నాకు అనిపించిన అంశాలలో డిస్కస్ చేస్తుంటాను. క్యారెక్టర్ కు రెడీ అయ్యేందుకు మాత్రం టైమ్ కావాల్సి వస్తే తీసుకుంటా. "భజే వాయు వేగం" సినిమా క్రెడిట్ అంతా వందశాతం దర్శకుడిదే. రాహుల్ ను స్క్రీన్ మీద హ్యాపీడేస్ సినిమాలో చూశా. ఆ రెస్పెక్ట్ నాకు తన మీద ఇప్పటికీ ఉంది. రాహుల్ ఈ సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు. మేము కలిసి హ్యాపీగా షూటింగ్ చేశాం. రాహుల్ తక్కువ టైమ్ లో నాకు మంచి మిత్రుడు అయ్యారు.  అతని బ్రదర్ రోల్ చేస్తున్నాడు. మా కాంబినేషన్ కొత్తగా ఉండబోతోంది.


- హీరోగా చేస్తున్న టైమ్ లో విలన్ గా గ్యాంగ్ లీడర్, వాలిమై చిత్రాల్లో నటించడం రిగ్రెట్ గా ఫీలవడం లేదు. అప్పటిదాకా నా సినిమాల రేంజ్ వేరు, గ్యాంగ్ లీడర్ సినిమా రేంజ్ వేరు. నేను అమెరికా సహా చాలా మంది ప్రేక్షకులకు గ్యాంగ్ లీడర్ ద్వారా గుర్తుండిపోయాను. అజిత్ తో వలిమై సినిమాలో నటించాక..తమిళనాట గుర్తింపు దక్కింది. ఈ సినిమాల తర్వాతే నేను స్టైలిష్ మేకోవర్ లో సినిమాలు చేయడం ప్రారంభించా. అప్పటిదాకా మాస్ లుక్ లో ఆర్ఎక్స్ 100, గుణ వంటి మూవీస్ లో నటించాను. గ్యాంగ్ లీడర్ లో నటించడం నా కెరీర్ కు ఎంతో అడ్వాంటేజ్ అయ్యింది. ఆ సినిమా తర్వాత విలన్ ఆఫర్స్ తెలుగులో వచ్చినా నాకు నచ్చేలా రాలేదు. తమిళంలో మాత్రం విలన్ గా ఆఫర్స్ వచ్చినా తెలుగులో హీరోగా చేస్తున్నందు వల్ల కమిట్ కాలేదు. దర్శకుడు ప్రశాంత్ తో నెక్ట్ మూవీ కూడా చేయాలనుకుంటున్నా.Hero Anand Deverakonda About Gam Gam Ganesha

 "గం..గం..గణేశా"తో అన్ని వర్గాల ఆడియెన్స్ ఎంటర్ టైన్ అవుతారు - హీరో ఆనంద్ దేవరకొండఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా". ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. "గం..గం..గణేశా" ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. తాజా ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు హీరో ఆనంద్ దేవరకొండ


- మిడిల్ క్లాస్ మెలొడీస్ తర్వాత లాక్ డౌన్ పడింది. ఆ లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అసలు అది పూర్తిగా వెళ్లిపోతుందో లేదో కూడా అర్థం కాలేదు. అలాంటి టైమ్ లో నా నెక్ట్ మూవీ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఆలోచన మొదలైంది. బేబి  కథతో పాటు "గం..గం..గణేశా" స్క్రిప్ట్ కూడా నా దగ్గరకు వచ్చింది. దర్శకుడు ఉదయ్ శెట్టి పంపిన స్క్రిప్ట్ సినాప్సిస్ లో అత్యాశ, భయం, కుట్ర అనే మూడు పదాలు నన్ను అట్రాక్ట్ చేశాయి. ఈ లైన్ ఎగ్జైట్ చేసింది. యూనిక్ గా అనిపించింది. ఎందుకంటే నాకు స్వామి రారా వంటి క్రైమ్ కామెడీస్ చూడటం ఇష్టం. ఆ సినిమా చూసినప్పుడు మన తెలుగులో ఇలాంటివి ఇంకా మరికొన్ని సినిమాలు చేయొచ్చు కదా అనిపించేది.


- "గం..గం..గణేశా" ఒప్పుకున్న తర్వాత షూటింగ్ డిలే అయ్యింది. నేను బేబి మూవీ కోసం ఆ క్యారెక్టర్ మేకోవర్ లో ఉండిపోయాను. అందులో నుంచి బయటకు వచ్చేందుకు కొన్ని నెలల టైమ్ పట్టింది. కోవిడ్ సెకండ్ వేవ్, ఫిల్మ్ యూనియన్ స్ట్రైక్స్ జరగడం..ఇలాంటి వాటి వల్ల డిలేస్ అవుతూ వచ్చాయి. సెకండాఫ్ లో వినాయకుడి మండపం నేపథ్యంలో సీన్స్ ఉంటాయి. వాటికోసం ఒక సెట్ వేశాం. భారీ వర్షాలకు ఆ సెట్ పడిపోయింది. మళ్లీ ఆ సెట్ ను పునర్నిర్మించి షూటింగ్ చేశాం. దానికి కొంత టైమ్ పట్టింది.


- ప్రతి ఇంటర్వ్యూలో మీరు హీరో సెంట్రిక్ మూవీస్ ఎందుకు చేయరు అని అడుగుతుంటారు. ఎందుకు చేయకూడదు అని నాకూ అనిపించింది. "గం..గం..గణేశా" కథతో ఆ ప్రయత్నం చేయొచ్చనే నమ్మకం కలిగింది. నేను గతంలో కనిపించినట్లు ఇందులో పక్కింటి కుర్రాడిలా కనిపించను. ఎనర్జిటిక్ గా ఉంటా, కామెడీ చేస్తా, ఏడవాలనిపిస్తే ఏడుస్తా...హైపర్ గా ఉంటాను. తనను తాను హీరో అనుకుంటాడు గానీ హీరోలా ప్రవర్తించడు.


- నేను పెట్టుకున్న నమ్మకానికి తగినట్లు మా డైరెక్టర్ ఉదయ్ కథను అందరికీ నచ్చేలా స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు. కథలో ఒక పదిహేను కీలకమైన పాత్రలు ఉంటాయి. ఇంతమందితో పర్ ఫార్మ్ చేయించుకోవడంలో ఒక డెబ్యూ డైరెక్టర్ గా ఉదయ్ సక్సెస్ అయ్యాడు. అతనికి మరో రెండు మూడు సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. నేను "గం..గం..గణేశా" పట్ల హ్యాపీగా, కాన్ఫిడెంట్ గా ఉన్నాను.


- ఇటీవల ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ కోసం "గం..గం..గణేశా" స్పెషల్ షోస్ వేశాం. వాళ్లు సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్ టైన్ అవుతూ ఎంజాయ్ చేశారు. వాళ్ల రెస్పాన్స్ చూసి మాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది.  వందలసార్లు మేము షూటింగ్ ఫుటేజ్ చూస్తుంటాం అయినా కొత్తగానే అనిపించేది. సాధారణంగా ఈ యాక్షన్ కామెడీస్ థియేటర్ లో చూస్తేనే ఎంజాయ్ చేయగలరు. ఓటీటీలో ఆ కిక్ రాదు


- "గం..గం..గణేశా" కథ విన్నాక ఇందులోని కామెడీ టైమింగ్ నేను పర్పెక్ట్ గా చేయగలనా అని భయమేసింది. కొన్ని వర్క్ షాప్స్ చేశాం. ఎలాంటి టైమింగ్ ఉండాలో ఫిక్స్ చేసుకున్నాం. నేను గతంలో మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానంలో కూడా కామెడీ చేశా. అది నాచురల్ గా ఉంటుంది. "గం..గం..గణేశా"లో కొంచెం హైపర్ గా పర్ ఫార్మ్ చేయాల్సివచ్చింది.


- వినాయకుడి విగ్రహం చుట్టూ జరిగే కథ ఇది. ఆ విగ్రహం  దక్కించుకోవడం కోసం కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్లంతా బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నవాళ్లు. ఆ విగ్రహంలో అంత విలువైనది ఏముంది. ఎవరికి విగ్రహం దక్కింది అనేది కథాంశం. మనలోనూ భయం, అత్యాశ, కుట్ర అనే లక్షణాలు ఉంటాయి. అవి కొందరి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం.


- నేను పాటలు వింటూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటా. ఇంట్లో  ఖాలీగా ఉంటే అన్న విజయ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయి అంటాడు. మా నాన్న కూడా నీలో గ్రేస్ ఉందిరా డ్యాన్స్ నేర్చుకో అనేవారు. బేబిలో ఓ ఆరు నిమిషాల పాట చేశాం. కానీ సినిమా నిడివికి ఎక్కువవుతుందని కట్ చేశాం. ఈ సినిమాలో డ్యాన్స్ లు చేసే అవకాశం దక్కింది.


- నా సినిమాల్లోనే కాదు అన్నయ్య విజయ్ చిత్రాల్లోనూ రిచ్ కంటెంట్ ఉంటుంది. క్యారెక్టర్ డ్రివైన్ మూవీస్ చేశాడు. అందుకే అర్జున్ రెడ్డి సినిమాతో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. "గం..గం..గణేశా" నా ఇమేజ్ మార్చుకోవడం కోసం చేసిన సినిమా కాదు. కథ కొత్తగా అనిపించింది ఇలాంటి స్క్రిప్ట్, క్యారెక్టర్ ట్రై చేయొచ్చు కదా అనిపించి చేశా. మా సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక. ఇద్దరికీ మంచి పర్ ఫార్మెన్స్ చేసే స్కోప్ ఉంది. వాళ్లు బాగా నటించారు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా "గం..గం..గణేశా" ట్రయాంగిల్ లవ్ స్టోరి కాదు.


- హీరోగా నా మూవీస్ స్పాన్ ఒక్కసారిగా పెరిగేది కాదు. బేబితో వంద కోట్ల గ్రాసర్ అందుకున్నానని నా నెక్ట్ మూవీ అంతకంటే ఎక్కువ వసూళు చేయాలని అనుకోను. లవ్ సబ్జెక్ట్స్ యూనివర్సల్ కాబట్టి అంత రీచ్ వచ్చింది. మేము "గం..గం..గణేశా"కు ఆరేడు కోట్లు ఖర్చు పెట్టాం. ప్రమోషన్ అన్నీ కలుపుకుని పెట్టిన డబ్బులు తిరిగి వచ్చి బ్రేక్ ఈవెన్ అయ్యి, మీరంతా మంచి రివ్యూస్ ఇస్తే అదే మాకు ఎంతో స్ట్రెంత్, సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. ఈ సమ్మర్ లో ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు రాలేదు. "గం..గం..గణేశా" ఆ కొరత తీర్చుతుంది.


- రశ్మిక మా  ఫ్యామిలీ ఫ్రెండ్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఛిట్ ఛాట్ వైరల్ కావాలనే చేశాం. "గం..గం..గణేశా"కు చేతన్ భరద్వాజ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. బీజీఎం కూడా ఆకట్టుకుంటుంది.  హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ నా హోమ్ బ్యానర్ లాంటిది. కేదార్, వంశీ నా ఫ్రెండ్స్. ఈ సినిమా కోసం వాళ్లు ఎంతో సపోర్ట్ చేశారు. షూటింగ్ డిలేస్, సెట్ పాడయినప్పుడు మళ్లీ ఖర్చు పెట్టి సినిమా కంప్లీట్ చేశారు.


- నాకు రా యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం. ధనుష్ కర్ణన్, అసురన్ మూవీస్ లా సినిమాలు చేయాలనే కోరిక ఉండేది. ఇప్పుడు వినోద్ అనంతోజు  సితార ఎంటర్ టైన్ మెంట్స్ కాంబోలో చేస్తున్న మూవీ అలాంటి ఫార్మేట్ లోనే ఉంటుంది. డైరెక్టర్ సాయి రాజేశ్, ఎస్ కేఎన్, వైష్ణవి, నేను కలిసి బేబి కాంబోలో ఓ మూవీ చేస్తున్నాం. వీటితో పాటు స్టూడియో గ్రీన్ వారి డ్యూయెట్ సినిమాలో నటిస్తున్నా. ఈ సినిమా 50 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.


‘Non-Violence’ Releasing Soon!

 ఫిల్మ్ మేకర్ ఆనంద కృష్ణన్, మెట్రో శిరీష్, బాబీ సింహా, యోగి బాబు ‘నాన్ వయొలెన్స్’ త్వరలో విడుదల'మెట్రో' ఫేమ్ ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో ఎకె పిక్చర్స్ లేఖ నిర్మిస్తున్న చిత్రం "నాన్ వయొలెన్స్". మెట్రో శిరీష్, బాబీ సింహా, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం యూనిక్ కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.


సినిమా కథనం 90వ దశకంలో మదురై నగరంలో జరుగుతుంది. దర్శకుడు ఆనంద కృష్ణన్ ఆ కాలంలో మధురై జైలులో జరిగే సంఘటనల చుట్టూ ప్రధానంగా తిరిగే అద్భుతమైన స్క్రీన్‌ప్లేను రూపొందించారు. 'మెట్రో', 'కొడియిల్ ఒరువన్' చిత్రాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు ఆనంద కృష్ణన్ కు ఈ సినిమా హ్యాట్రిక్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.


1990లలో జరిగే కథనం కావడంతో ఆ కాలాన్ని తెరపై యథార్థంగా రిక్రిఎట్ చేయడానికి ప్రొడక్షన్ టీం స్పెషల్ కేర్ తీసుకుంది. ప్రాప్‌లు, వార్డ్‌రోబ్ నుండి షూటింగ్ లొకేషన్‌ల వరకు ప్రతిది ప్రేక్షకులని తిరిగి ఆ కాలానికి తీసుకెళ్ళేలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినిమా అనుభూతిని అందిస్తుంది.


మెట్రో శిరీష్, బాబీ సింహా, & యోగి బాబు టైటిల్ క్యారెక్టర్స్‌లో నటిస్తుండగా, అదితి బాలన్, గరుడ రామ్, ఆదిత్య కత్తిర్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.


ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వర‌లోనే ఈ చిత్ర టీజ‌ర్, ట్రైల‌ర్ వివ‌రాల‌ను అధికారికంగా ప్రక‌టించ‌నున్నారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.


సాంకేతిక సిబ్బంది

రచన & దర్శకత్వం: ఆనంద కృష్ణన్ 

సంగీతం - యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫీ - ఎన్ ఎస్ ఉదయకుమార్

ఎడిటర్ - శ్రీకాంత్ ఎన్ బి

నిర్మాత - లేఖ (ఎకె పిక్చర్స్)

పీఆర్వో: వంశీ- శేఖర్

"Bharateeyudu 2" - Chengaluva Lyric Video Unveiled

 యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, లైకా ప్రొడ‌క్ష‌న్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘భార‌తీయుడు 2’ నుంచి ల‌వ్ మెలోడీ సాంగ్ ‘చెంగల్వ..’ రిలీజ్ జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతున్న ‘భార‌తీయుడు 2’ చిత్రం యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.


1996లో క‌మ‌ల్ మాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌ విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘భార‌తీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా  ‘ భార‌తీయుడు 2’ రూపొందుతోంది. అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆతృత‌తో ఎదురు చూస్తోన్న ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో వేగం పుంజుకున్నాయి. అందులో భాగంగా ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఇండియ‌న్ 2 ఇంట్రో వీడియోతో పాటు రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘శౌర..’ అనే పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్ర‌మంలో బుధ‌వారం మేక‌ర్స్ ‘చెంగల్వ చేయందేనా..’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు.

అనిరుద్ రవిచందర్ సంగీత సార‌థ్యంలో రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాట‌ను అబ్బి, శ్రుతికా స‌ముద్రాల పాడారు.


క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌వివ‌ర్మ‌న్  సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.


‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.


న‌టీన‌టులు:

క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం:  ఎస్‌.శంక‌ర్‌, స్క్రీన్ ప్లే: ఎస్‌.శంక‌ర్‌, బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ కుమార్‌, మ్యూజిక్ : అనిరుద్ ర‌విచంద్ర‌న్‌, ఎడిటింగ్:  ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ర‌వివ‌ర్మ‌న్‌, ఆర్ట్‌:  ముత్తురాజ్‌, స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, అన్బ‌రివు, రంజాన్ బుల‌ట్‌, పీట‌ర్ హెయిన్స్‌, స్టంట్ సిల్వ‌, డైలాగ్ రైట‌ర్‌:  హ‌నుమాన్ చౌద‌రి, వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌:  వి.శ్రీనివాస్ మోహ‌న్‌, కొరియోగ్ర‌ఫీ:  బాస్కో సీజ‌ర్‌, బాబా భాస్క‌ర్‌, పాట‌లు:  శ్రీమ‌ణి, సౌండ్ డిజైన‌ర్‌:  కునాల్ రాజ‌న్‌, మేక‌ప్ :  లెగ‌సీ ఎఫెక్ట్‌-వాన్స్ హర్ట్‌వెల్‌- ప‌ట్ట‌ణం ర‌షీద్‌, కాస్టూమ్ డిజైన్‌:  రాకీ-గ‌విన్ మ్యూగైల్‌- అమృతా రామ్‌-ఎస్‌బి స‌తీష‌న్‌-ప‌ల్లవి సింగ్-వి.సాయి, ప‌బ్లిసిటీ డిజైన‌ర్: క‌బిల‌న్ చెల్ల‌య్య ,పి.ఆర్‌.ఒ (తెలుగు):  నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  సుంద‌ర్ రాజ్‌, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌:  జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, రెడ్ జైంట్ మూవీస్‌:  సెన్‌బ‌గ మూర్తి, నిర్మాత‌:  సుభాస్క‌ర‌న్‌.


Satyadev's Krishnamma is streaming in India and Over 240 countries

 ఇండియా స‌హా 240కి పైగా దేశాల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న‌ స‌త్య‌దేవ్ ‘కృష్ణ‌మ్మ‌’వెర్స‌టైల్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ కంచ‌ర్ల తాజా చిత్రం ‘కృష్ణ‌మ్మ‌’. ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాను వి.వి.గోపాలకృష్ణ తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ బూరుగుల‌, ల‌క్ష్మ‌ణ్ మీసాల‌, నంద గోపాల్‌, హ‌రిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌స్తుతం 240దేశాల‌కు పైగా అమెజాన్ ప్రైమ్‌లో ‘కృష్ణ‌మ్మ‌’ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.


కృష్ణా న‌ది ఒడ్డున ఉండే విజ‌య‌వాడ ప‌ట్టణంలో ముగ్గురు అనాథ‌లు శివ(కృష్ణ‌), భ‌ద్ర (స‌త్య‌దేవ్‌), కోటి (ల‌క్ష్మ‌ణ్ మీసాల‌) పెరిగి పెద్ద‌వుతారు. వీరి మ‌ధ్య చ‌క్క‌టి అనుబంధం ఉంటుంది. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితాల్లో ఓ ఘ‌ట‌న కార‌ణంగా అనుకోని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. జీవితాలు ఎన్నో ఒడిదొడుకుల‌ను ఎదుర్కొంటాయి. చిన్న‌త‌నంలో జైలుకి వెళ్లిన శివ, అక్క‌డి నుంచి వ‌చ్చాక నిజాయ‌తీగా జీవితాన్ని వెల్ల‌దీయాల‌నుకుంటాడు. ముగ్గురి స్నేహితుల్లో భ‌ద్ర‌, కోటిల‌కు డ‌బ్బులు అవ‌స‌రం అవుతాయి. దాంతో వాళ్లు గంజాయి స్మ‌గ్లింగ్ చేయాల‌నుకుని పోలీసుల‌కు చిక్కుతారు. అదే స‌మ‌యంలో ఓ ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌ని చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతారు. దీని కార‌ణంగా వాళ్ల జీవితాల్లో ఊహించ‌ని ఘ‌ట‌న‌లు ఎదుర‌వుతాయి. ఆ ప‌ర్యావ‌సానాల‌ను వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు.. చివ‌ర‌కు ఏమైంద‌నేదే కృష్ణ‌మ్మ సినిమా.


 మే నెల‌లో థియేట‌ర్స్‌లో విడుద‌లైన ‘కృష్ణ‌మ్మ‌’ చిత్రానికి అభిమానుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియా స‌హా 240కి పైగా దేశాల్లో సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంది. ప్రేక్ష‌కులు ఈ ర‌స్టిక్ అండ్ రా యాక్ష‌న్ ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Rap Song from 'Yevam' unveiled by creative director Tharun Bhascker

 యేవ‌మ్ చిత్రం నుంచి  ర్యాప్ సాంగ్ విడుద‌లరొటిన్ భిన్నంగా, కొత్త కంటెంట్‌తో  చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. డిఫరెంట్‌ అండ్‌ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాపై అందుకే పూర్తి విశ్వాసంతో వున్నాం అంటున్నారు దర్శకుడు  ప్రకాష్‌ దంతులూరి . ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'యేవమ్‌' చాందిని చైద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి  ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు.  ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రానికి సంబంధించి విడుద‌ల చేసిన ప్ర‌తి ప్ర‌చార చిత్రానికి మంచి స్పంద‌న వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఏది మంచి..ఏది కాదు అనే ర్యాప్ సాంగ్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, న‌టుడు త‌రుణ్‌భాస్క‌ర్ విడుదల చేశారు. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ

 మ‌హిళ సాధికారికతను చాటి చెప్పే నేప‌థ్యంలో ఈ సినిమా వుంటుంది. చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఎంతో మినింగ్‌ఫుల్‌గా, కొత్త‌గా వుంటుంది. ఈ చిత్రంలో  ప్ర‌తి పాత్ర‌కు ఒక మార్క్ వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది' అన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌క్ష్మ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 


'Pushpa: The Rule' Second Single: 'Sooseki' Unveiled

ఐ ఫీస్ట్..  ‘పుష్ప 2: ది రూల్’ నుంచి కపుల్ సాంగ్.. ‘సూసేకి  అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ’ విడుదల‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే’ అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గడ్డం కింద చెయ్యి పెట్టి అడ్డంగా తిప్పితే.. వరల్డే షేకయింది.

‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అంటే స్టార్స్ అందరూ ఫైర్ లెక్క ఫీలయ్యారు..

ఇలా ఒక్కటేమిటి పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్, ఆ పుష్పరాజ్‌ని క్రియేట్ చేసిన క్రియేటర్‌గా సుకుమార్ ఒక హిస్టరీనే క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ ‘పుష్ప’కు కంటిన్యూగా రాబోతోన్న ‘పుష్ప 2: ది రూల్’పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయంటే.. ‘పుష్ప’ ఎలా ప్రేక్షక హృదయాలను దోచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే విడుదలైన ‘గ్లింప్స్, టీజర్, పుష్ప పుష్ప సాంగ్’ యూట్యూబ్‌లో ఆల్ టైమ్ రికార్డులను నెలకొల్పగా.. ఇప్పుడు మరో ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ‘పుష్ప 2: ది రూల్’ నుంచి కపుల్ సాంగ్ ‘సూసేకి  అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ వదిలారు. ఈ పాటకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన చిన్న ప్రోమో ఎలా వైరల్ అయిందో తెలిసిందే. మేకింగ్ విజువల్స్‌తో వచ్చిన ఈ కపుల్ సాంగ్.. ‘నా సామి’ పాటను బీట్ చేసేలా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. అంతకుమించి అనేలా ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించారు.


‘‘వీడు మొరటోడు

అని వాళ్లు వీళ్లు.. ఎన్నెన్ని అన్న

పసిపిల్లవాడు నా వాడు..


వీడు మొండోడు

అని ఊరు వాడ అనుకున్నగానీ

మహరాజు నాకు నా వాడు..


ఓ.. మాట పెలుసైనా.. మనసులా వెన్న

రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నా.. కన్నా..


సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ..

మెత్తానీ పత్తిపువ్వులామరి సంటోడే నా సామీ


ఓ.. ఎర్రబడ్డ కళ్లలోన కోపమే మీకు తెలుసు..

కళ్లలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు..

కోరమీసం రువ్వుతున్న రోషమే మీకు తెలుసు..

మీసమెనుక ముసురుకున్న మూసి నవ్వు నాకు తెలుసు

అడవిలో పులిలా సరసర సరసర చెలరేగడమే మీకు తెలుసు

అలసిన రాతిరి ఒడిలో చేరి తలవాల్చడమే శ్రీ.. వల్లికి తెలుసు


సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ..

మెత్తానీ పత్తిపువ్వులామరి సంటోడే నా సామీ


ఓ.. గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చివేసే నవాబు..

నన్ను మాత్రం చిన్ని చిన్న ముద్దులడిగే గరీబు..

పెద్ద పెద్ద పనులు ఇట్టే చక్కబెట్టే మగాడు..

వాడి చొక్కా ఎక్కడుందో.. వెతకమంటాడు చూడు..

బయిటికి వెళ్లి ఎందరెందరినో ఎదురించేటి దొరగారు

నేనే తనకి ఎదురెళ్లకుండా బయటికి వెళ్లరు శ్రీ..వా..రు


సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామే..

ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిల్లైనా మహరా..ణే’’ వంటి అద్భుతమైన సాహిత్యంతో వచ్చిన ఈ పాటను 5 భాషల్లోనూ ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ పాడటం మరో విశేషం. ఈ పాట మేకింగ్ విజువల్స్ చూస్తుంటే.. ఐ ఫీస్ట్ అన్నట్లుగా ఉంది. అల్లు అర్జున్, రష్మికా మందన్నా మరోసారి తమ డ్యాన్స్‌తో దుమ్మురేపారనేది అర్థమవుతోంది. ఈ పాటతో ‘పుష్ప 2: ది రూల్’పై క్రేజ్ డబులైంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ‘పుష్ప ది రైజ్’ చిత్రంలో త‌న న‌ట‌న‌తో

మొట్ట‌మొద‌టిసారిగా తెలుగు క‌థానాయ‌కుడు జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు తీసుకోవ‌డం, అలాగే మొట్టమొదటిసారిగా దుబాయ్ మ్యాడ‌మ్ టుసార్ట్స్‌లో ద‌క్షిణ భార‌తదేశ న‌టుడి స్టాట్యూని, గ్యాల‌రీ‌ని ఏర్పాటు చేయ‌టం తెలుగు వారంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం. ఇలాంటి ప్ర‌త్యేక‌త‌లు ‘పుష్ప’ చిత్రంతోనే సంత‌రించుకున్నాయి. ఇక త్వ‌ర‌లో

‘పుష్ఫ 2: ది రూల్’తో మ‌రోసారి ప్ర‌పంచంలోని సినిమా అభిమానులంతా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌ట‌విశ్వ‌రూపాన్ని చూడ‌బోతున్నారు. 90 సంవ‌త్ప‌రాల తెలుగు సినిమా చ‌రిత్రలో మొద‌టిసారి తెలుగు న‌టుడి న‌ట‌న చూసేందుకు ప్ర‌పంచ దేశాల‌న్నీ ఎదురుచూస్తున్నాయంటే.. ‘పుష్ప’ ఇంపాక్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.


అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి

నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్

సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే

లిరిసిస్ట్: చంద్రబోస్

సీఈఓ: చెర్రీ

బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్

Lucky Baskhar to release on 27th September

 

దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న 'లక్కీ భాస్కర్' సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల

ప్రఖ్యాత నటుడు, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా కెరీర్‌ను ప్రారంభించిన దుల్కర్ సల్మాన్ అనతి కాలంలోనే తన ప్రత్యేకతను చాటుకొని, వివిధ భాషల ప్రేక్షకుల మనసు గెలుచుకొని తనకంటూ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. మలయాళ చిత్ర సీమకే పరిమితం కాకుండా పాన్ ఇండియా నటుడిగా ఎదిగారు. తన వ్యక్తిత్వం, అణుకువతో కూడిన నటనా నైపుణ్యాలతో దుల్కర్ మలయాళం, తెలుగు, తమిళం అలాగే హిందీ భాషలలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరిగా మారారు. ఇప్పుడు దుల్కర్ "లక్కీ భాస్కర్" అనే సాధారణ మనిషికి చెందిన అసాధారణ కథతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. 

ఈ "లక్కీ భాస్కర్" సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి, మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లను విడుదల చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా "లక్కీ భాస్కర్" చిత్రం సెప్టెంబర్ 27, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.

తొలిప్రేమ, సార్/వాతి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల రచయిత-దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ స్వరకర్త జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి మెస్మరైజింగ్ విజువల్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ నూలి పనిచేస్తున్నారు. 

1980- 1990 పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  నాటి బొంబాయి(ముంబై) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ తెలిపారు. సాధారణ బ్యాంకు క్యాషియర్ లక్కీ భాస్కర్ యొక్క ఆసక్తికరమైన, అసాధారణమైన జీవిత ప్రయాణాన్ని వివరిస్తుంది. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఇక ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, హిందీ మరియు తమిళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. విభిన్న కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

తారాగణం: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌
సమర్పణ: శ్రీకర స్టూడియోస్ 
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
ఛాయాగ్రాహకుడు: నిమిష్ రవి
కూర్పు: నవీన్ నూలి
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్


 

Director Krishna Chaitanya Interview About Gangs of Godavari

"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది : చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి". శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు విశేష స్పందన లభించింది. భారీ అంచనాలతో మే 31వ తేదీన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు కృష్ణ చైతన్య సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.


"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" ప్రయాణం ఎలా మొదలైంది?

దర్శకుడిగా ప్లానింగ్ లో ఉన్న చిత్రాలు ఆలస్యం అవటం, మరీ గ్యాప్ ఎక్కువైపోతోంది అనే భయం నాలో మొదలైంది. అదే విషయాన్ని త్రివిక్రమ్ గారితో పంచుకున్నాను. ఆయన సూచనతో విశ్వక్ కి కథ చెప్పాను. విశ్వక్ కి కథ నచ్చడంతో అలా ఈ సినిమా ప్రయాణం మొదలైంది.


ఈ సినిమా ఎలా ఉండబోతుంది?

గోదావరి అనగానే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా చూపిస్తారు. కానీ నిజానికి మా ప్రాంతంలో కూడా నేరాలు జరుగుతాయి. ప్రాంతాలను బట్టి కాకుండా మనుషులను బట్టి నేరాలు జరుగుతాయి. ఆ ఆలోచన నుంచి పుట్టినదే ఈ కథ. అయితే ఇది కల్పిత కథనే. దీనిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే.. దీని ద్వారా ఒక మంచి కథను చూపించవచ్చు, ఒక మంచి ఎమోషన్ ను చూపించవచ్చు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ విజువల్ ని చూపించవచ్చు అని భావించాను. నా ఆలోచనకు తగ్గట్టుగా సితార లాంటి మంచి నిర్మాణ సంస్థ దొరికింది. కొందరు ఇది గ్యాంగ్ స్టర్ మూవీ అనుకుంటున్నారు. కానీ ఇది గ్యాంగ్ స్టర్ మూవీ కాదు.


విశ్వక్ సేన్ కోసం కథలో ఏమైనా మార్పులు చేశారా?

విశ్వక్ కోసం ఎటువంటి మార్పులు చేయలేదు. మొదట ఏదైతే కథ రాసుకున్నామో.. అదే విశ్వక్ తో చేయడం జరిగింది. అయితే విశ్వక్ తెలంగాణలో పెరిగిన వ్యక్తి కాబట్టి.. గోదావరి మాండలికాన్ని సరిగ్గా చెప్పగలడా అని కొంచెం సందేహం కలిగింది. కనీసం రెండు మూడు నెలలు ట్రైనింగ్ అవసరమవుతుంది అనుకున్నాను. కానీ నెల రోజుల లోపులోనే నేర్చుకొని ఆశ్చర్యపరిచాడు.


ట్రైలర్ లో కొన్ని సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయి.. దీనిపై మీ అభిప్రాయం?

మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. సంభాషణల పరంగా రెండు చోట్ల మాత్రమే మ్యూట్ వేశారు. అవే మీరు ట్రైలర్ లో చూశారు. ట్రైలర్ కి సెన్సార్ అభ్యంతరాలు ఉండవు. అందుకే ఆ సన్నివేశాల్లోని భావోద్వేగాన్ని బాగా అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆ సంభాషణలను ట్రైలర్ లో అలాగే ఉంచడం జరిగింది. సినిమాలో మాత్రం ఆ రెండు అభ్యంతరకర పదాలు వినిపించవు.


షూటింగ్ ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు?

గతేడాది మే 8 మొదలై, ఈ ఏడాది మే 8 తో సినిమా పూర్తయింది. సినిమా పూర్తవ్వడానికి సరిగ్గా ఏడాది పట్టింది. ఇందులో షూటింగ్ చేసినవి 103 రోజులు.


సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా గురించి?

యువన్ శంకర్ రాజా లాంటి ప్రముఖ సంగీత దర్శకుడితో పని చేయాలంటే మొదట భయపడ్డాను. ఆయన స్థాయికి నా మాట వింటారా అనుకున్నా. కానీ ఆయన మాత్రం తన అనుభవంతో.. నేను కోరుకున్నట్టుగా, సినిమాకి కావాల్సిన అద్భుతమైన సంగీతాన్ని అందించారు.


దర్శకుడిగా సినిమా చూసి సంతృప్తి చెందారా?

ఇది నాకు చాలా చాలా ఇష్టమైన కథ. ఆ ఇష్టంతోనే ఈ సినిమా చేశాను. నేను అనుకున్న భావోద్వేగాలు తెరమీద చక్కగా పలికాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మాత్రం హృదయాన్ని హత్తుకుంటాయి.


'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..?

మహా భారతంలోని "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాట నాకు చాలా ఇష్టం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాటే చెబుతాను.


సితార బ్యానర్ గురించి?

చినబాబు గారు, నాగవంశీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆలస్యమైనా పరవాలేదు.. ప్రేక్షకులకు మంచి సినిమాని అందించాలని భావించే నిర్మాతలు వారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాకి ఏం కావాలో అవన్నీ సమకూరుస్తారు.


మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ను ఎవరితో చేయాలని ఉంది?

నాకు పవన్ కళ్యాణ్ గారంటే ఎప్పటి నుంచో అభిమానం. ఆ అభిమానం మాటల్లో చెప్పలేనిది. ఆయనతో సినిమా చేసే అవకాశం రావాలని కోరుకుంటాను.


Gangs Of Godavari Pre Release Event Held Grandly

 "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" లాంటి కొత్తదనమున్న చిత్రాలను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు - చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి"లోని రత్న పాత్ర మీ హృదయాల్లో నిలిచిపోతుంది - కథానాయకుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్


మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి". శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు విశేష స్పందన లభించింది. భారీ అంచనాలతో మే 31వ తేదీన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మే 28వ తేదీన సాయంత్రం హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారు. మే 28న యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారి జయంతి. గతేడాది ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" ఫస్ట్ లుక్ విడుదల చేసిన నిర్మాతలు, ఈ ఏడాది ఎన్టీఆర్ 101వ జయంతికి ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడం విశేషం. ఇక ఈ కార్యక్రమానికి 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేయడం మరో విశేషం. ఈ కార్యక్రమంలో "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" నుంచి "గిరి గిరి" అనే మాస్ సాంగ్ ను బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు.


'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ముందుగా నాకు జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు, దైవాంశ సంభూతుడు, విశ్వానికే నటవిశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణజన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, కళాప్రపూర్ణ శ్రీ నందమూరి తారక రామారావు గారికి, ఆయన 101వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇప్పటికీ ఒక సినిమాలో డైలాగ్ చెప్పాలంటే టెన్షన్ పడతాను. అదే కాపాడుతుంది అనుకుంటా. సినిమా అంటే అంత పాషన్. ఈ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నిర్మాతలు నాగవంశీ గారికి, సాయి సౌజన్య గారికి ఆల్ ది బెస్ట్. నాన్నగారి 101వ జయంతి సందర్భంగా ఈ సినిమా వేడుక జరగడం సంతోషంగా ఉంది. మనకి సంక్రాంతి, ఉగాది ఎలాగో.. ప్రతి సంవత్సరం మే 28న కులాలకు, మతాలకు అతీతంగా అందరూ జరుపునే పండుగ రామారావు గారి జయంతి. అలాంటి రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా మా సోదరుడు విశ్వక్ సేన్ గురించి చెప్పాలి. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. బయట చూస్తే ఎవరైనా మమ్మల్ని కవలలే అంటారు. సినీ పరిశ్రమలో కొంతమందితోనే నేను చాలా సన్నిహితంగా ఉంటాను. విశ్వక్ కి సినిమా అంటే పాషన్. విశ్వక్ సినీ ప్రయాణాన్ని మొదటి నుంచి చూస్తున్నాను. తను కూడా నాలాగే సినిమా సినిమాకి, పాత్ర పాత్రకి కొత్తదనం చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే ఉడుకు రక్తం, నాలాగే దూకుడుతనం కూడా ఉంది. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్ విభిన్నంగా ఉంది. టైటిల్ తోనే సినిమా పట్ల ఆసక్తి కలుగుతోంది. ట్రైలర్ చాలా బాగుంది. గోదావరి అందాలతో పాటు, మంచి ఎమోషనల్ గా ఉంది. మంచి కిక్కిచ్చే సినిమాలా ఉంది. నిర్మాత నాగవంశీ, సోదరుడు విశ్వక్ సేన్ కలయికలో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది. మనం ఎప్పుడూ కొత్తదనం ఇవ్వాలి. అది నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. మనం కొత్తదనం ఇస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఈ సినిమాలో ఆ కొత్తదనం కనిపిస్తుంది. అలాగే దర్శకుడు కృష్ణ చైతన్య. నేను బాలకృష్ణుడిని, ఈయన కృష్ణచైతన్య.. అదీ తేడా. అంతకముందు మా నారా రోహిత్ తో 'రౌడీ ఫెలో', నితిన్ తో 'ఛల్ మోహన్ రంగ' చేశారు. ఆ రెండు సినిమాలు ఆదరణ పొందాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. ఈ సినిమలో ఇద్దరు ముద్దుగుమ్మలు ఉన్నారు నారి నారి నడుమ మురారిలా. అంజలితో కలిసి 'డిక్టేటర్' సినిమా చేశాను. మంచి మనిషి. అలాగే నేహా శెట్టి కూడా డీజే టిల్లు తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. విశ్వక్ సేన్ ని అతని తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అలాగే నా తనయుడు మోక్షజ్ఞ కూడా సినీ రంగంలోకి వస్తాడు. వాడికి ఈ తరం హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెబుతుంటాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్." అన్నారు.


మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. "ముందుగా నందమూరి బాలకృష్ణకి ధన్యవాదాలు. మీ అందరికీ ఒక ఇన్సిడెంట్ చెబుతాను. నేను ఈ సినిమాకి ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లారీ మీద నుంచి కిందకి పడిపోయా, మోకాలికి దెబ్బ తగిలింది. ఆల్మోస్ట్ మోకాలు చిప్ప విరిగిపోయింది. రెండేళ్లు మంచానికే పరిమితం అవ్వాలి అనుకున్నాను. అయితే దేవుడి దయవల్ల ఏమీ జరగలేదు. ఇంతమంది దీవెనలు, ప్రేమ అనుకుంటా. ఆ సమయంలో నాకు ఏమైందో అని చాలామంది వాకబు చేశారు. చాలామంది ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసి 15 నిమిషాల పాటు నా ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు ఫోన్ లో కనిపించలేదు కానీ నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఏడ్చాను.. ఆయన గొంతులో ఎప్పుడూ ఒక గాంబీర్యం ఉంటుంది కానీ నేను పడిపోయాను అని తెలిసి ఆయన ఎక్కువ బాధపడ్డారు. నీ గురించి చాలా బాధపడుతున్నాను అని ఆయన అంటుంటే వెంటనే ఏడ్చేశాను. నిజానికి కుటుంబ సభ్యుల తర్వాత అంత ప్రేమ చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు బాలకృష్ణ గారి ఆ వాత్సల్యం దక్కింది. నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు కానీ ఈరోజు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా జోహార్ ఎన్టీఆర్ అని మొదలు పెడుతున్నాను. నిజానికి అన్నగారి పోస్టర్ తోనే మా సినిమా ప్రయాణం, ఇదే జయంతి రోజున మొదలైంది. ఇప్పుడు ఇదే రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. నిన్న రాత్రి ఐదేళ్లలో ఏం జరిగింది అని ఆలోచిస్తుంటే సరిగ్గా మార్చి 31వ తేదీనే ఫలక్‌నుమా దాస్  రిలీజ్ అయింది. నేను ఇక్కడ నిలుచున్నాను అన్నా, నా ఐదేళ్లు నోట్లోకి వెళుతున్నాయి అన్నా, నాకు ఏం జరిగిందన్నా.. ఫలక్‌నుమా దాస్ అనే సినిమా నేను రిస్క్ తీసుకుని, మా నాన్న రిస్క్ తీసుకుని, నా స్నేహితులు రిస్క్ తీసుకుని ఆ సినిమా తీసినందుకే. ఆ సినిమాని ఆదరించిన ప్రేక్షకుల వల్లనే. అర్థం కాకుండానే ఐదు సంవత్సరాలు అయిపోయింది. ఐదు సంవత్సరాలు నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యూ సో మచ్, ముఖ్యంగా ఫ్యాన్స్ కి. చాలాసార్లు జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. మీ వల్లనే నిలబడ్డాను. ఇక మా డైరెక్టర్ కి నాకు ఒకరినొకరు పొగుడుకోవడం ఇష్టం ఉండదు. కానీ నన్ను ఎలా ఊహించుకున్నాడో కానీ.. నాకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక పాత్ర దొరికినట్లు అయింది. వెంటనే వంశీ అన్నకి ఫోన్ చేసి "నువ్వు నేను వెతుకుతున్న కత్తి దొరికేసింది అది దింపుదామని" చెప్పి రెడీ చేసిన కత్తి ఈ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. మా ఈ సినిమా కొత్త అప్రోచ్ తో వస్తున్న ఒక కమర్షియల్ సినిమా. బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసి ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇది కొత్త సీసాలో ఉన్న పాత వైన్ అన్నారు. ఇదే ఆ కొత్త సీసా. నాగ వంశీ గారికి థాంక్యూ సో మచ్. రెండు మూడు సినిమాలు చేయడానికి రెడీ అయి కూడా చివరికి ఇది ఫిక్స్ అయ్యాం. నేను పని చేసిన తొమ్మిది సినిమాల బ్యానర్లలో ఇది బెస్ట్ బ్యానర్. నాగ వంశీ గారు నేను పనిచేసిన అందరిలో బెస్ట్ ప్రొడ్యూసర్. మా కో ప్రొడ్యూసర్స్ వెంకట్, గోపీచంద్ కూడా మొదటి రోజు నుంచి చాలా సహకరిస్తూ వచ్చారు. నన్ను, చైతన్యని భరించినందుకు థాంక్యూ సార్. మా నటీనటులు అందరు అద్భుతంగా నటించారు. నేను ఈ సినిమా అయిపోయిందని మొన్న రియలైజ్ అయ్యి రత్నాకి ఉన్నట్టే నేను కూడా చెవికి పోగు కుట్టించుకున్నాను. నాకు రత్న అనే వాడు నా జీవితంలో ఉండిపోవాలని కుట్టించుకున్నాను. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. చాలా మంచి సినిమా తీశాం, చాలా నిజాయితీగా పని చేశాం. ఖచ్చితంగా మే 31న థియేటర్ కి ఫ్యామిలీ మొత్తం కలిసి రావచ్చు. సెన్సార్ కూడా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. వైలెన్స్ కూడా కావాలని పెట్టింది కాదు.. ఒక కారణంతోనే ఉంటుంది. రత్న అనే వాడు ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, తిట్టించుకుంటాడు కానీ చివరికి మీతో పాటు ఇంటికి వస్తాడు. చూసిన రెండు మూడు రోజులపాటు వెంటాడుతూనే ఉంటాడు. యువన్ శంకర్ రాజా గారి అభిమానిగా పెరిగాను, ఆయనతో సినిమా చేస్తున్నానని తెలిసి ఆనందపడ్డాను. మా కథానాయకుల గురించి చెప్పాలంటే ముందు రత్నమాల అనే క్యారెక్టర్ చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ అంజలి చేయాలని ఒక నిమిషం కూడా గ్యాప్ తీసుకోకుండా చెప్పేశాను. ఒక తమిళ్ సినిమా చూసి ఈమెతో ఎప్పటికైనా పని చేయాలనుకున్నాను. అది ఈ సినిమాతోనే కుదిరింది. ఈ పాత్రకి నువ్వు తప్ప ఎవరు న్యాయం చేయలేరు అంజలి. నేహా నువ్వు ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు అయినా చేయి ఇప్పటివరకు నిన్ను రాధిక అంటున్నారు కానీ ఇకమీదట బుజ్జి అని గుర్తుపెట్టుకుంటారు. రమ్యకృష్ణ గారి నీలాంబరి క్యారెక్టర్ లాగా ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ని గుర్తు పెట్టుకుంటారు. మే 31న ధియేటర్లలో కలుద్దాం." అన్నారు


కథానాయిక అంజలి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. బాలకృష్ణ గారు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేడుకను వచ్చినందుకు థాంక్యూ సో మచ్ సర్. మీ గురించి నేను మాట్లాడే అంత స్థాయి లేకపోయినా మీ గురించి కొన్ని మాటలు చెప్పగలను. బాలకృష్ణ గారితో డిక్టేటర్ లో కలిసి చేస్తున్నప్పుడు నాకు ఆయనతో కలిసి పనిచేయటమే టెన్షన్ గా అనిపించింది. కానీ ఆయన ఎంతో స్వీట్ పర్సన్. అలాంటి పెద్ద స్టార్ తో పని చేస్తున్నప్పుడు నాకు కంఫర్ట్ అనిపించిందంటే.. అది కేవలం ఆయనతో కలిసి పనిచేయడం వల్లే. నేను ఇప్పటికీ అది గుర్తుపెట్టుకుంటాను. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి చెప్పాలంటే నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పినట్టు ఇది నాకు ప్రత్యేక చిత్రం. రత్నమాల అనే పాత్ర ఇంకా ప్రత్యేకం. ఎందుకంటే నేను చేసిన సినిమాలలో, పాత్రలలో రత్నమాల చాలా విభిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు నాకే టఫ్ గా అనిపించింది. ఆ బాడీ లాంగ్వేజ్, ఆమె మాట్లాడే విధానం, డైలాగ్ డెలివరీ, ఇంతకుముందు ఎక్కడ నేను వాడని పద్ధతులు వాడాల్సి వచ్చింది. ఇది మీరందరూ ట్రైలర్ లోనే చూసి ఉంటారు. నాకు రత్న అనే క్యారెక్టర్ ఇచ్చినందుకు మా దర్శకుడికి థాంక్స్. నా సహనటుడు విశ్వక్ సేన్ టైగర్. విశ్వక్ గురించి చెప్పాలంటే ఆయన స్వీట్ హార్ట్. బేసిక్ గా తనతో వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఆయన పక్కన చేసే వాళ్ళకి చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఈ సినిమాలో రత్న రూపంలో విశ్వక్ కి చాలా రోజులు గుర్తుండిపోయే ఒక పాత్ర దొరికింది. నేహాతో కలిసి కొన్ని సీన్స్ చేశాను కానీ ఆ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంది. మేము మళ్లీ కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. మా కెమెరామెన్ పనితనం అద్భుతం. మీరు చూసిన ఫ్రేమ్స్ అన్ని ఆయన వల్లే సాధ్యమయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా నా మొదటి సినిమా నుంచి నాతో పని చేస్తున్నారు. ఈ సినిమా ఆయనకి చాలా స్పెషల్. ఎందుకంటే ఆయన అద్భుతమైన నేపథ్య సంగీతంతో పాటు సాంగ్స్ కూడా ఇచ్చారు. నాతో పాటు నటించిన ఆది, ఆనంద్, మధు అలాగే నాతో పాటు నటించిన ఇతర నటీనటులు అందరికీ ఒక స్పెషల్ మూవీ ఎక్స్పీరియన్స్ లా ఉండబోతుందని నేను ఆశిస్తున్నాను. 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి'ని ఇంత పెద్ద సినిమాగా చేయడానికి సిద్ధమైనందుకు మా నిర్మాతలు నాగ వంశీ గారు, చిన్న బాబు గారికి చాలా థాంక్స్. 31వ తేదీన సినిమా విడుదలవుతుంది. అందరూ థియేటర్లో సినిమా చూడండి. ఇప్పుడు మీరు ఎంత అరుస్తున్నారో అంతకుమించి థియేటర్స్ లో అరుస్తారని మేము ఆశిస్తున్నాము. ఇది ఒక మాస్ మూవీ.. మీరు కచ్చితంగా ఎంటర్టైన్ అవుతారని భావిస్తున్నాను." అన్నారు.


కథానాయిక నేహశెట్టి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. జై బాలయ్య. బాలకృష్ణ గారు ఎప్పుడూ యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈరోజు మా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చినందుకు బాలకృష్ణ గారికి కృతఙ్ఞతలు. ఈ వేడుకకు వచ్చిన రాధిక ఫ్యాన్స్ కి, మాస్ కా దాస్ ఫ్యాన్స్ కి, మరీ మఖ్యంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి ధన్యవాదాలు. సితార అనేది నా హోమ్ ప్రొడక్షన్. నాకు మరో ఇల్లు లాంటిది. నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. నన్ను నమ్మి 'రాధిక', 'బుజ్జి' లాంటి అద్భుతమైన పాత్రలలో నటించే అవకాశమిచ్చిన నిర్మాత నాగవంశీ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. దర్శకుడు కృష్ణ చైతన్య గారు.. నా జీవితంలో కలిసిన గొప్ప వ్యక్తుల్లో ఒకరు. "మాటలు కంటే చర్యలు చాలా బిగ్గరగా మాట్లాడతాయి" అని ఆయన నమ్ముతారు. ఈ సినిమా విషయంలో అదే జరగబోతుంది. సినిమా అంతా నాతో ఎంతో ఓపికగా ఉంటూ, నన్ను ఎంతగానో ప్రోత్సహించిన చైతన్యకి బిగ్ థాంక్స్. మీ మాస్ కా దాస్, నా సహనటుడు విశ్వక్ సేన్. ఈ సినిమాలో విశ్వక్ తో నాది అద్భుతమైన ప్రయాణం. కొన్ని సందర్భాల్లో డైలాగుల విషయంలో ఇబ్బంది ఎదురైతే.. విశ్వక్ ఎంతో ఓపికగా నాకు హెల్ప్ చేశాడు. అందరికీ ఇలాంటి కో యాక్టర్ దొరకాలని కోరుకుంటున్నాను. నేను, అంజలి కలిసి కొన్ని సన్నివేశాల్లో నటించాము. త్వరలోనే మళ్ళీ కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో భాగమైన నటీనటులు, సాంకేతిక సిబ్బంది అందరికీ కృతఙ్ఞతలు. గతేడాది వేసవి నుంచి ఈ ఏడాది వేసవి వరకు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మే 31న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'తో వస్తున్నాం. మా సినిమాపై మీ ప్రేమని కురిపించి, మాకు విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను." అన్నారు.


దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. "ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నందమూరి బాలకృష్ణ హృదయపూర్వక ధన్యవాదాలు. కారణజన్ములు ఎప్పుడూ మన వెన్నంటే ఉండి నడిపిస్తారని పెద్దవారు చెబుతుంటారు. సరిగ్గా సంవత్సరం క్రితం మే 28న 'జోహార్ ఎన్టీఆర్' అనే ఫస్ట్ పోస్టర్ తో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మొదలైంది. ఆరోజు నుంచి ఈరోజు వరకు వెనకాల ఎన్టీఆర్ గారే ఉండి నడిపిస్తున్నారు అనిపిస్తుంది. ఏ కంటెంట్ రిలీజ్ చేసినా.. గ్లింప్స్ రిలీజ్ చేసినా, టీజర్ రిలీజ్ చేసినా, సాంగ్స్ రిలీజ్ చేసినా, ట్రైలర్ రిలీజ్ చేసినా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. జీవితంలో తల్లి, తండ్రి, గురువు చాలా ముఖ్యం. మా అమ్మగారు, నాన్నగారి ఆశీస్సుల వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను. అలాగే మా గురువుగారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు.. ఈ సినిమాకి మూలం, ఆద్యం.. ఆయనే వల్లే మొదలైంది. అక్కడి నుంచి చినబాబు గారు, నాగవంశీ గారు, సాయి సౌజన్య గారు మమ్మల్ని నమ్మి, మా వెనకాల నిలబడి.. మమ్మల్ని నడిపించారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. చినబాబు గారు స్క్రిప్ట్ దగ్గర నుంచి, చివరి రీల్ పంపించేవరకు వరకు కూడా మాతో కూర్చున్నారు. చినబాబు గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. యువన్ శంకర్ రాజా గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఎడిటర్ నవీన్ నూలి గారు నాకు వెన్నెముకలా నిలబడి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. మా డీఓపీ అనిత్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. విశ్వక్ సేన్ గురించి చెప్పాలంటే.. నా మాస్ కా దాస్.. నా బ్రదర్. మా బంధం మాటల్లో చెప్పలేనిది. ఒక్కటి మాత్రం చెప్పగలను. విశ్వక్ పోషించిన లంకల రత్న పాత్ర మిమ్మల్ని నవ్విస్తుంది, మిమ్మల్ని ఏడిపిస్తుంది, మిమ్మల్ని భయపెడుతుంది. అలాగే, ఈ సినిమాలో రత్న జీవితంలో ఇద్దరు బలమైన అమ్మాయిలు ఉన్నారు. బుజ్జిగా నేహా శెట్టి, రత్నమాలగా అంజలి పాత్రలు గుర్తుండిపోతాయి. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పేరుపేరునా కృతఙ్ఞతలు. అలాగే మా దర్శక విభాగంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతఙ్ఞతలు. బాలకృష్ణ గారి గురించి మాట్లాడే అంత స్థాయి నాకు లేదు. ఆయన ఇక్కడికి రావడం మా అదృష్టం. బాలకృష్ణ గారి ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను." అన్నారు.


ఈ వేడుక అభిమానుల ఆనందోత్సాహాల నడుమ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఈ కార్యక్రమంలో నటులు హైపర్ ఆది, మధునందన్, ఆనంద్, నృత్య దర్శకులు భాను మాస్టర్, యశ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

Gam Gam Ganesha Rap Song Unveiled

ఆనంద్ దేవరకొండ "గం..గం..గణేశా" ర్యాప్ సాంగ్ రిలీజ్ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా". ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. "గం..గం..గణేశా" ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. 


ఈ రోజు "గం..గం..గణేశా" నుంచి ర్యాప్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ ర్యాప్ సాంగ్ ను కంపోజ్ చేసి ప్రణవ్ చాగంటితో కలిసి పాడారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. ప్రణవ్ చాగంటి లిరిక్స్ అందించారు. ఒకడిది ఘాటు ప్రేమికుడి బాధ, గడగడలాడె గాథ ఇదిరా, ఒకడిది మాట దాటలేని బాట..గెలుపసలు ఎవడిదో..అంటూ కథలోని సోల్ ను రిఫ్లెక్ట్ చేస్తూ ఈ ర్యాప్ సాంగ్ సాగింది. పర్పెక్ట్ లిరిక్స్, బీట్ తో "గం..గం..గణేశా" ర్యాప్ సాంగ్ ఆకట్టుకుంటోంది.


నటీనటులు :

ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.


టెక్నికల్ టీమ్ :


పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

కాస్ట్యూమ్ డిజైనర్ : పూజిత తాడికొండ

ఆర్ట్: కిరణ్ మామిడి

ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి

సంగీతం - చేతన్ భరద్వాజ్

లిరిక్స్ - సురేష్ బనిశెట్టి

బ్యానర్ - హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్

కొరియోగ్రఫీ: పొలాకి విజయ్

కో-ప్రొడ్యూసర్ -అనురాగ్ పర్వతనేని

నిర్మాతలు - కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి

రచన, దర్శకత్వం - ఉదయ్ శెట్టి 

Ntr 101 Jayanthi Celebrations Held Grandly at FNCC

 పత్రికా ప్రకటన

స్వర్గీయ ఎన్టీఆర్ కు కొత్త ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలి

టి. డి. జనార్థన్ మాజీ ఎమ్మెల్సీ చైర్మన్, ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీకేంద్రంలో ఏర్పడే నూతన ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారత రత్న పురస్కారం అందించాలని మాజీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ చైర్మన్ శ్రీ టి. డి. జనార్థన్ డిమాండ్ చేస్తూ ఆమేరకు తమ కమిటీ తీర్మానం చేస్తోందని తెలిపారు. 


ఎన్టీఆర్ 101 వ జయంతి పురస్కరించుకొని ఫిల్మ్ నగర్ కల్చరర్ సెంటర్ (ఎఫ్.ఎన్.సి.సి) లో ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జీవించి ఉండగా ఆయనకు వ్యక్తిగతంగా సేవలు అందించిన ఎన్టీఆర్ వ్యక్తిగత వైద్యులు డా సోమరాజు, డా బి. ఎన్. ప్రసాద్, డా డి ఎన్ కుమార్ లతో పాటు ఎన్టీఆర్ వ్యక్తిగత సహాయకులు పి.ఏ శివరామ్, వంటమనిషి బీరయ్య, సహాయ మేకప్ మెన్ అంజయ్య, డ్రైవర్ రమేష్, ఆఫీస్ అటెండెంట్ చంద్రశేఖర్ యాదవ్, ఎన్టీఆర్ అభిమానులు మన్నే సోమేశ్వర రావు, బొప్పన ప్రవీణ్, ఎన్టీఆర్ నఫీజ్, కొడాలి ప్రసాద్, ఈదర చంద్ర వాసులకు కమిటీ చైర్మన్ శ్రీ టి. డి. జనార్థన్ సారధ్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. 


ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ కుమారుడు శ్రీ నందమూరి రామకృష్ణ, తెలుగు దేశం నాయకులు శ్రీ కనుమూరి రామకృష్ణం రాజు (ఆర్ ఆర్ ఆర్),  ప్రముఖ నిర్మాత శ్రీ ఘట్టమనేని ఆదిశేషగిరి రావు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, ప్రముఖ నిర్మాత  శ్రీ కె. ఎస్ రామారావు, పుండరీ కాంక్షయ్య గారి తనయులు శ్రీ అట్లూరి నాగేశ్వర రావు పాల్గొని శ్రీ ఎన్. టి. రామారావు గారితో తమకున్న అనుబంధాన్ని, సాన్నిహిత్యాన్ని, ఆయనలోని విశిష్ట లక్షణాలను గుర్తు చేస్తూ మాట్లాడారు. 


*టీడీపీ నేత టి.డి. జనార్థన్ మాట్లాడుతూ -* ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకల్లో పాల్గొన్న అతిథులందరికీ ఆహ్వానం, కృతజ్ఞతలు.  నందమూరి తారక రామారావు గారి వ్యక్తిత్వాన్ని, సినీ, సామాజిక , రాజకీయ రంగాలలో ఆయన అందించిన విశిష్ట సేవలను భావి తరాలవారికి తెలియజెప్పాలనే ఆలోచనతో మేము ఈ కమిటీ ని ఏర్పాటు చేసాము. క్రిందటేడాది ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్ని ఘనంగా విజయవాడ, హైదరాబాద్ లలో నిర్వహించి ఆ సందర్భంగా 3 అపూర్వ గ్రంథాలుగా.. ఎన్టీఆర్ అసెంబ్లీ ప్రసంగాలు, ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు, శక పురుషుడు సావనీర్ లను వెలువరించాం. విజయవాడ కార్యక్రమానికి శ్రీ రజనీకాంత్, శ్రీ చంద్రబాబు నాయుడు, శ్రీ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్రా లో జరిగిని కార్యక్రమం లో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన మరికొన్ని గ్రంథాలను వెలువరించబోతున్నాం. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు సేవలు అందించిన వారిని పిలిచి సన్మానించడం ఎంతో సంతోషంగా ఉంది.  రామారావు గారు సినిమాల్లో చేసిన కృష్ణుడి క్యారెక్టర్ ను నాటకరంగం మీద పద్యాలతో పాడి నటించి అలరించిన నటుడు గుమ్మడి గోపాలకృష్ణ గారిని ఈ వేదిక మీద ఘనంగా సన్మానించుకుంటున్నాం. అలాగే అమెరికాలో ఉండి ఇక్కడ తెలుగు దేశం పార్టీ విజయాన్నికాంక్షిస్తూ మన కమిటీ మెంబర్ అట్లూరి అశ్విన్ ఒక వీడియోను రూపొందించారు. ఆ వీడియోను మనందరి ముందు ప్రదర్శిస్తున్నాం. రేపు మన పార్టీ సాధించబోయో విజయానికి ఈ వీడియో గుర్తుగా ఉంటుంది. రాబోయో కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గారికి భారతరత్న పురస్కారం ఇచ్చి ఆయనను సముచితంగా గౌరవించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాం అన్నారు.  


*నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ -* నాన్నగారి 101వ జయంతి కార్యక్రమానికి వచ్చిన సోదర సోదరీమణులందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. నాన్నగారు సినిమాల్లో అన్ని రకాల పాత్రలు పోషించి అశేష ప్రేక్షకాభిమానం పొందారు. రాముడు, కృష్ణుడు అయనే అనేంత పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. రైతులకు అండగా నిలబడ్డారు. కార్మిక, యువత, బీసీ వర్గాలకు చేయూతనిచ్చారు. తిరుమలలో ఉచిత అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యుగ పురుషుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1982 డిసెంబర్ 9, 10 తేదీలలో తన అన్న బాలకృష్ణ, తన వివాహాలు తిరుపతి లో జరిగినప్పుడు.. నాన్న గారు రాలేక పోయారు. ఫోన్ లో మాతో మాట్లాడుతూ... 'ఐయాం సారీ.. మేము మీ పెళ్ళికి రాలేక పోయాం. ఇప్పుడు మీరే కాదు.. ఆరు కోట్ల మంది తెలుగు ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే' అని చెప్పారంటూ ఆయన ఒకింత భావోద్వేగం తో ఆ సంఘటన మననం చేసుకొన్నారు. 


*శ్రీ ఘట్టమనేని ఆదిశేషగిరి రావు గారు మాట్లాడుతూ -* తమ పద్మాలయ బ్యానర్ పై నిర్మించిన 'దేవుడు చేసిన మనుషులు' సినిమా షూటింగ్ మచిలీపట్నం లో జరిగినపుడు ఎన్టీఆర్ 'నిమ్మకూరు' లోనే నివాసం ఉన్నారని చెబుతూ.. తనకు ప్రత్యేక సదుపాయాలు అవసరం లేదని అనడమేకాక తామందర్నీ నిమ్మకూరుకు పిలిచి ఎంతో ఆప్యాయంగా భోజనం పెట్టారంటూ ఎన్టీఆర్ ఆదరణను గుర్తు చేసుకొన్నారు.  


*ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ -* ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఆయన యుగపురుషుడు. ఆయనకు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలి. ఎన్టీఆర్ కు భారతరత్న అవసరం లేదు. కానీ భారతరత్నకు ఎన్టీఆర్ అవసరం ఏర్పడుతోంది. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన జనార్థన్ గారికి అభినందనలు తెలుపుతున్నా అన్నారు.

నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ - భారతదేశమే కాదు ప్రపంచమంతా గర్వించదగిన వ్యక్తి రామారావు గారు. ఆయనతో సహాయ దర్శకుడిగా నా కెరీర్ మొదలైంది. నా మిత్రుడు అశ్వనీదత్ రామారావు గారితో సినిమాలు నిర్మిస్తున్నప్పుడు నాకూ నిర్మాతగా అలాంటి అవకాశం వస్తుందేమోనని ఆశించాను. ఆయన అగ్నిపర్వతం సినిమా చేస్తున్నప్పుడే సడెన్ గా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించాడు. మా అందరినీ హైదరాబాద్ రమ్మన్నారు. ఆయనతో పాటు వచ్చాం. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఎన్టీఆర్. ఈ ఫిలింనగర్ క్లబ్ కూడా ఆయన మంజూరు చేసిందే. ఆ తర్వాత చంద్రబాబు గారు చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకుడు రామారావు గారు.  


ఎన్టీఆర్ వ్యక్తిగత వైద్యులు డా సోమరాజు,డా బి. ఎన్. ప్రసాద్, డా డి ఎన్ కుమార్ లు ఎన్టీఆర్ తో తమ అనుబంధాన్ని వివరించారు. తమ మధ్య ఆరోగ్య అంశాలతో పాటు హాస్య స్ఫోరక సంభాషణలు చోటుచేసుకునేవని, తాము కొన్ని సందర్భాలలో చేసిన వ్యాఖ్యలను ఎంతో స్పోర్టివ్ గా తీసుకునేవారని చెప్పారు. అటువంటి వ్యక్తిని మళ్ళీ చూడలేమని, ఆయనతో గడిపిన క్షణాలన్నీ ఎంతో మధురమైనవిగా, ఎప్పటికీ గుర్తుండిపోతాయని వారు మననం చేసుకొన్నారు. మాజీ ఎంపీ శ్రీ యలమంచిలి శివాజీ.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితుల్ని వివరించారు.  


కాగా, వందలాది మంది ఎన్టీఆర్ అభిమానులు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఉభయ రాష్ట్రాల నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. అభిమానుల కోలాహలం మధ్య శ్రీ నందమూరి రామకృష్ణ గారు, శ్రీ టి. డి. జనార్థన్ గారు తదితరులు ఎన్టీఆర్ బర్తడే కేక్ కట్ చేశారు.  ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం కమిటీ కన్వీనర్ శ్రీ అట్లూరి నారాయణ రావు హృద్యంగా నడిపించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు. 


ఎన్టీఆర్ అభిమానులు శ్రీ నందమూరి రామకృష్ణ, శ్రీ టి. డి. జనార్థన్ లతో ఫోటోలు దిగి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

#NKR21 The Fist Of Flame Unveiled

 నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ చిలుకూరి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్, #NKR21 ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్ విడుదల, శరవేగంగా జరుగుతున్న షూటింగ్తన తాతగారు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు ప్రదీప్ చిలుకూరితో చేస్తున్న తన 21 వ చిత్రం గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు #NKR21 ని నిర్మిస్తున్నారు.


ది ఫిస్ట్ ఆఫ్ ఫ్రేమ్ అనే గ్లింప్స్ కళ్యాణ్ రామ్‌ని యాక్షన్-ప్యాక్డ్ గా సరికొత్త గెటప్ లో ప్రజెంట్ చేసింది.  వీడియోలో కళ్యాణ్ రామ్ తన పిడికిలిని చూపించడం తన క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా వుంటుందో తెలియజేసింది. వీడియోలో పవర్ ఫుల్ గా కనిపించారు కళ్యాణ్ రామ్. ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ విజువల్స్ గ్రాండ్ గా వున్నాయి. ఈ గ్లింప్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.  


ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్‌ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించిన విజయశాంతి చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాకి సైన్ చేశారు. ఇది కర్తవ్యం పాత్ర తరహలో పవర్ ఫుల్ డైనమిక్ పాత్ర కానుంది. ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్,  శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.


ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. వారి టాప్ క్లాస్ పనితనం గ్లింప్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.


సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు,


తారాగణం: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి

నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు

సంగీతం: అజనీష్ లోక్‌నాథ్

డీవోపీ : రామ్ ప్రసాద్

బ్యానర్లు: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్

ఎడిటర్: తమ్మిరాజు

సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి

స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా

పీఆర్వో : వంశీ-శేఖర్, వంశీ కాకా

మార్కెటింగ్: ఫస్ట్ షో


Allari Naresh Bachchala Malli Ferocious First Look Unveiled

 అల్లరి నరేష్, సుబ్బు మంగదేవి, రాజేష్ దండా, బాలాజీ గుత్తా, హాస్య మూవీస్ బచ్చల మల్లి ఫెరోషియస్ ఫస్ట్ లుక్ విడుదలహీరో అల్లరి నరేష్ తన అప్ కమింగ్ మూవీ 'బచ్చల మల్లి'లో ఇంటెన్స్ రోల్ లో కనిపించబోతున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు.


అల్లరి నరేష్ మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో మ్యాసీ హెయిర్, గడ్డంతో కనిపించారు. నరేష్ ఇంటెన్స్ సీరియస్ లుక్ లో రిక్షా మీద కూర్చుని సిగరెట్ తాగుతూ కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో బాణసంచా కాల్చడం, ఫెరోషియస్ దేవుళ్ల గెటప్‌లతో కూడిన కార్నివాల్‌ను గమనించవచ్చు. హై-వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్‌లోని ఈ అద్భుతమైన ఫస్ట్‌లుక్ పోస్టర్, బచ్చల మల్లి ఇంటెన్స్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని సూచిస్తుంది.


ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న బచ్చల మల్లిలో టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సీతా రామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, మానాడు, రంగం, మట్టి కుస్తి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ డివోపీగా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.


కథ, సంభాషణలు సుబ్బు స్వయంగా అందించగా, విప్పర్తి మధు స్క్రీన్‌ప్లే, ఎడిషనల్ స్క్రీన్‌ప్లే విశ్వనేత్ర అందించారు.


హీరో ఎమోషనల్ జర్నీ 1990 బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది. ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.


తారాగణం: అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు.


సాంకేతిక సిబ్బంది:

కథ, మాటలు, దర్శకత్వం - సుబ్బు మంగదేవి

నిర్మాతలు - రాజేష్ దండా, బాలాజీ గుత్తా

బ్యానర్: హాస్య మూవీస్

స్క్రీన్ ప్లే: విప్పర్తి మధు

ఎడిషనల్  స్క్రీన్ ప్లే: విశ్వనేత్ర

సంగీతం- విశాల్ చంద్రశేఖర్

డీవోపీ- రిచర్డ్ M నాథన్

ఎడిటింగ్- ఛోటా కె ప్రసాద్

ప్రొడక్షన్ డిజైన్- బ్రహ్మ కడలి.

పీఆర్వో - వంశీ-శేఖర్

మార్కెటింగ్-ఫస్ట్ షో

First Look Poster of 'Pani' is Unveiled

 నటుడు జోజు జార్జ్ దర్శకుడిగా డెబ్యూ చిత్రం 'పణి' ఫస్ట్ లుక్ విడుదల !!! జోజు జార్జ్ ప్రతి ఒక్కరికి సుపరిచయమైన నటుడు. ఎన్నో చిత్రాల్లో మెమొరబుల్ రోల్స్ పోషించారు. అద్భుతమైన నటన కనబరిచారు. నటుడిగా కొనసాగుతూనే జోజు జార్జ్ డెబ్యూ డైరెక్టర్ గా 'పణి  ' అనే చిత్రంతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. పణి  చిత్ర యూనిట్ తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. జోజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మాస్ కథాంశం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ , రివేంజ్ డ్రామాగా అలరించబోతోంది. 


జోజు ఈ చిత్రానికి దర్శకుడు మాత్రమే కాదు.. ఈ చిత్ర కథానాయకుడు కూడా ఆయనే. జోజు నుంచి చిత్రాలు కోరుకునే వారు ఈ ఫస్ట్ లుక్ తో సూపర్ హ్యాపీగా ఉన్నారు. అభినయ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ ఇప్పుడే రిలీజ్ చేశారు. మూవీ 100 రోజుల షూటింగ్ పూర్తయ్యాక థియేటర్స్ లోకి రానుంది. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ సాగర్, జునైస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

తన 28 ఏళ్ళ సినీ కెరీర్ లో జోజు తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. జోజు జూనియర్ ఆర్టిస్ట్ గా,  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా నటించారు. ఇప్పుడు ఆయన పేరు ముందు డైరెక్టర్ అనే పదం చేరబోతోంది. జోజు నటుడిగా కార్తీక్ సుబ్బరాజ్, సూర్య చిత్రంతో పాటు బాలీవుడ్ లో అనురాగ్ కశ్యప్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న అనురాగ్ కశ్యప్ చిత్రాన్ని జోజు స్వయంగా నిర్మిస్తున్నారు.


Director Prashanth Reddy About Bhaje Vaayu Vegam

 ప్రేక్షకులు చూపు తిప్పుకోలేనంత ఎంగేజింగ్ గా "భజే వాయు వేగం" ఉంటుంది  - దర్శకుడు ప్రశాంత్ రెడ్డి
ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా "భజే వాయు వేగం". ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 31న "భజే వాయు వేగం" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా సినిమా హైలైట్స్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు ప్రశాంత్ రెడ్డి


- రన్ రాజా రన్ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేశాను. ఆ తర్వాత సాహోకు కంటిన్యూ అయ్యాను. కోవిడ్ కు ముందు ఈ సబ్జెక్ట్ ఓకే అయ్యింది. కార్తికేయ అప్పడు చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క చేస్తున్నాడు. కోవిడ్ వల్ల ఏడాదిన్నర టైమ్ వేస్టయింది. "భజే వాయు వేగం" సినిమా షూటింగ్ మొదలుపెట్టి 70 పర్సెంట్ కంప్లీట్ చేసిన తర్వాత కార్తికేయ బెదురులంక షూటింగ్ కు వెళ్లాడు. అది ఫినిష్ చేసి వచ్చాక మా "భజే వాయు వేగం" కంప్లీట్ చేశాం.


- "భజే వాయు వేగం" కథ ప్రకారం ఫస్టాఫ్ కు ఒక పర్ ఫార్మర్ కావాలి. సెకండాఫ్ లో హీరోయిజం ఎలివేట్ కావాలి. అలా చూస్తే కార్తికేయ నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించాడు. అతను పర్ ఫార్మెన్స్ చేస్తాడు, హీరో పర్సనాలిటీ ఉంటుంది. కార్తికేయను ఎంచుకోవడానికి కారణమిదే. అలాగే హీరోయిన్ ఒక మిడిల్ క్లాస్ లొకాలిటీలో పెరిగే సంప్రదాయబద్దమైన అమ్మాయి. ఐశ్వర్య మీనన్ ప్రొఫైల్ చూస్తుంటే మొత్తం హాఫ శారీ, చీరకట్టులో ఫొటోస్ తో కనిపించింది. ఆమె ఈ మూవీలో ఇందు క్యారెక్టర్ కు కరెక్ట్ ఆప్షన్ గా భావించా. 


- "భజే వాయు వేగం" సినిమా కొంత డిలే కావడానికి కారణాలు ఉన్నాయి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎడిట్ చేసిన వెర్షన్ ఫుటేజ్ పోయింది. మళ్లీ ఆ ఎడిటింగ్ కోసం మూడు నెలల టైమ్ అదనంగా పట్టింది. పోస్ట్ ప్రొడక్షన్ లో క్వాలిటీ కోసం కొంత టైమ్ అదనంగా తీసుకున్నాం. ఫస్ట్ సినిమాకు ఇలా కొంత డిలే కావడం ప్రెజర్ గానే ఉండేది.


- ట్రైలర్ లో ఫాదర్ సెంటిమెంట్ అనేది రివీల్ చేశాం. అయితే ఫాదర్ సెంటిమెంట్ అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఓల్డ్ కాదు. ట్రైలర్ చివరలో మీ నాన్న కాదు మా నాన్న అని రాహుల్ కార్తికేయతో చెప్పడం కూడా కథ తెలిసిపోయిందని కొందరు కామెంట్ చేశారు. కానీ మీకు ట్రైలర్ చూపించింది రేపు థియేటర్ లో చూడబోయే కథకు చాలా వేరియేషన్స్ ఉంటాయి. కథను రివీల్ చేయకూడదనే ట్రైలర్ లో ఎలాంటి ట్విస్ట్ లు చూపించలేదు. హీరో క్రికెటర్ గా తన గోల్ అఛీవ్ చేశాడా లేదా అనేది ట్రైలర్ లో ఎక్కడా హింట్ ఇవ్వలేదు. ట్రైలర్ లో రాహుల్ చెప్పిన డైలాగ్ వాస్తవానికి సినిమా ప్రారంభంలోనే వస్తుంది. సినిమా మీద మేమంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం.

- కథలో హీరోకు బ్రదర్ క్యారెక్టర్ ఉంటుంది. ఇది చాలా కీ రోల్. హీరో తర్వాత హీరో లాంటి క్యారెక్టర్. ఈ పాత్ర కోసం ఎవర్ని తీసుకుందాం అని ఆలోచిస్తున్న టైమ్ లో యూవీ వాళ్లు రాహుల్ టైసన్ ను సజెస్ట్ చేశారు. అతను ఈ మధ్య గ్యాప్ తీసుకున్నాడు. కార్తికేయకు బ్రదర్ అంటే ఫ్రెష్ గా ఉంటుందని నాకూ అనిపించింది. అలా రాహుల్ మూవీలోకి వచ్చాడు.

- ఊరి నుంచి పట్టణానికి మనమంతా ఏదో ఒకటి సాధించాలని వస్తాం. అలా వచ్చిన క్రమంలో ఇక్కడ కొన్ని పోగొట్టుకుంటాం. కొన్ని సంపాదిస్తాం. చివరకు మన గోల్ రీచ్ అయ్యామా లేదా అనేది చూసుకుంటాం. అనుకున్నది సాధించని వాళ్లూ ఉంటారు. హీరో అలా ఒక గోల్ మీద సిటీకి వస్తాడు. అతను తన గోల్ గురించి ప్రయత్నిస్తున్న టైమ్ లో వేరే సమస్యలు చుట్టుముడతాయి. తన లక్ష్యం వదిలేసి వీటిని సాల్వ్ చేసేందుకు వెళ్తుంటాడు. ప్రేక్షకులకు మాత్రం అతని గోల్ వేరు కదా అనిపిస్తుంటుంది.


- మాది మెదక్ జిల్లా. మా ఊరిలో రాజమౌళి గారి సై సినిమా షూటింగ్ జరిగింది. ఆ టైమ్ నుంచి నాకూ ఇండస్ట్రీకి రావాలనే కోరిక ఏర్పడింది. రాజమౌళి గారిని చూసి ఇన్స్ పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చానని చెప్పేందుకు ఇప్పుడు నాకున్న అర్హత సరిపోదు. సినిమా రిలీజ్ అయ్యాక మీ అందరికీ నచ్చాక ఆయన పేరు చెబుతా.

- సినిమా సెకండాఫ్ లో ఛేజింగ్ లా స్క్రీన్ ప్లే ఉంటుంది. సెకండాఫ్ లో మీరు ఫోన్ వైపు చూడరనే నమ్మకం ఉంది. అంత గ్రిప్పింగ్ గా ఉంటుంది. స్పీడ్ లాంటి టైటిల్ మా మూవీకి పెట్టుకోవచ్చు. అయితే ఇంగ్లీష్ టైటిల్ ఎందుకని భజే వాయు వేగం అని పెట్టాం. మా యూవీ వారికి కూడా బాగా నచ్చింది. వెంటనే రిజిస్టర్ చేయించాం. అఖిల్ తో యూవీలో సినిమా చేయబోతున్న డైరెక్టర్ అనిల్ ఈ సినిమా చూసి టైటిల్ సజెస్ట్ చేశాడు.

- డైరెక్టర్ సుజీత్ కు ఎడిటింగ్ అంటే ఇష్టం. "భజే వాయు వేగం" సినిమా చూసి నచ్చి మా టీమ్ తో ఇంటర్వ్యూ ఇచ్చాడు. సాధారణంగా సూజీత్ ఇంటర్వ్యూస్ చేయడు. ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ గారి ఓజీ గురించి సుజీత్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. వాళ్ల ఫ్యాన్స్ అంతా నాకు థ్యాంక్స్ చెబుతున్నారు. ఈ అభిమానులు థియేటర్స్ కు వచ్చి మా "భజే వాయు వేగం" సినిమా చూడమని కోరుతున్నా.

- ఈ సినిమా బీజీఎం కోసం స్పెషల్ కేర్ తీసుకున్నా. దాదాపు మూడు నెలలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసమే టైమ్ కేటాయించా. కపిల్ అని కొత్త అతను బీజీఎం ఇచ్చాడు. రాధన్ సాంగ్ చేశాడు. అతను చెన్నైలో ఉంటే నేను అక్కడికి ఇక్కడికి తిరగడానికి టైమ్ ఉండదని రాధన్ తో బీజీఎం చేయించలేదు. సెకండాఫ్ లో ఒక్క సాంగ్ ఉండదు.  స్క్రీన్ ప్లే రేసీగా వెళ్తుంటుంది. కథ స్పీడ్ గా వెళ్తే ఆడియెన్స్ ఎవరూ అక్కడ పాట ఉండాలని కోరుకోరు. పైగా దాన్నో స్పీడ్ బ్రేకర్ లా భావిస్తారు. 

- ఆడియెన్స్ రీల్స్ చూసే ట్రెండ్ లోకి వచ్చారు. ఒక్క క్షణం బోర్ కొట్టినా రీల్ మార్చేస్తారు. ఇలాంటి టైమ్ లో సినిమా చిన్న గ్యాప్ ఇవ్వకుండా ఆడియెన్ ను ఎంగేజ్ చేయాలనేది నా ఆలోచన. "భజే వాయు వేగం" సినిమాకు అదే ఫాలో అయ్యి రూపొందించాం. మనం అతన్ని హీరో అని పిలుస్తున్నాం కాబట్టి హీరో ఒక పెద్ద లక్ష్యంతో ఉండాలని నేను అనుకుంటా. ప్రేక్షకులకు హీరోకు కనెక్ట్ అవుతారు. వాళ్లకు స్ఫూర్తినిచ్చేలా హీరో క్యారెక్టర్ ఉండాలి.

- అసిస్టెంట్ డైరెక్టర్ గా నేర్చుకున్న దానికంటే ఓ సినిమాకు డైరెక్షన్ చేస్తే వెయ్యింతలు పని నేర్చుకోవచ్చు. సినిమాను అనేక దశల్లో బెటర్ మెంట్ చేసుకోవచ్చు. మిగతా ఏ క్రియేటివ్ జాబ్ లోనూ ఇలాంటి అవకాశం ఉండకపోవచ్చు. 

- రాజమౌళి గారి సినిమాల్లో హీరో క్యారెక్టర్స్ చాలా సాధారణంగా ఉంటాయి. కానీ అవి అసాధారణ సమస్యలను ఎదుర్కొంటాయి. నా సినిమాలోనూ హీరో అలా ఉండాలని భావిస్తా. ఆడియెన్ ఎన్నో సమస్యలు ఉండగా సినిమాకు వస్తాడు అతన్ని థియేటర్ లో ఇరిటేట్ చేయకుండా కాసేపు ఎంటర్ టైన్ చేయాలని నేను అనుకుంటా.

- ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్స్ నా దగ్గర ఉన్నాయి. భజే వాయు వేగం సినిమా రిలీజ్ అయ్యాక నా కొత్త మూవీ అనౌన్స్ చేస్తా.

Gam..Gam..Ganesha Pre Release Event Held Grandly

 "గం..గం..గణేశా" సక్సెస్ తో ఆనంద్ మొహంలో నవ్వు చూడాలని కోరుకుంటున్నా - ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేషనల్ క్రష్ రశ్మిక మందన్న
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా". ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. "గం..గం..గణేశా" ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. నేషనల్ క్రష్ రశ్మిక మందన్న అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో


నటుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ - ఒక కొత్త టీమ్ తమని తాము ప్రూవ్ చేసుకునేందుకు చేసిన సినిమాలా "గం..గం..గణేశా" ఉంటుంది. కేవలం హీరోయిక్ గా ఉండే కథ కాదిది. అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమాలో దాదాపు 35 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆనంద్ దేవరకొండకు ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది. అన్నారు.


లిరిసిస్ట్ సురేష్ బనిశెట్టి మాట్లాడుతూ - "గం..గం..గణేశా"  సినిమాలో నేను పిచ్చిగా నచ్చాశావే అనే పాట రాశాను. ఈ పాటకు చేతన్ భరద్వాజ్ మంచి ట్యూన్ చేశారు. అనురాగ్ కులకర్ణి పాడారు. ఈ పాటకు లిరిక్స్ ఇవ్వడాన్ని ఎంజాయ్ చేశా. రశ్మిక మందన్న ఈ కార్యక్రమానికి గెస్ట్ గా రావడం హ్యాపీగా ఉంది. అన్నారు.


డ్యాన్స్ మాస్టర్ విజయ్ పొలాకీ మాట్లాడుతూ - ఆనంద్ అన్నతో వర్క్ చేయడం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. ఆయనతో ఇలాగే కలిసి వర్క్ చేయాలని కోరుకుంటున్నా. డైరెక్టర్ ఉదయ్ ఈ సినిమాతో హిట్ మూవీ అందుకోబోతున్నావు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా.


నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ - వినాయకుడి శిల్పాన్ని ఎంత అందంగా తయారు చేస్తారో ఈ సినిమాను కూడా మా డైరెక్టర్ ఉదయ్ అంతే అందంగా రూపొందించారు. ప్రతి సీన్ చెక్ చేసుకుంటూ రీ షూట్ చేస్తూ పర్పెక్ట్ గా తను అనుకున్నట్లు తెరకెక్కించాడు.  ఉదయ్ ఖచ్చితంగా మంచి డైరెక్టర్ అవుతాడు. హీరో ఆనంద్, ఇద్దరు హీరోయిన్స్, ఇతర కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. "గం..గం..గణేశా" పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.


నటుడు యావర్ మాట్లాడుతూ - సినిమాల్లో నటించాలనే నా కలను నిజం చేసింది "గం..గం..గణేశా" మూవీ. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన ఆనంద్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ నెల 31న మూవీ రిలీజ్ అవుతుంది. మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.


హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ - "గం..గం..గణేశా" సినిమా స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వరకు మా డైరెక్టర్ ఉదయ్ చాలా కష్టపడ్డాడు. ఆనంద్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాలో ఆనంద్ ను ఇప్పటిదాకా చూడని కొత్త తరహా క్యారెక్టర్ లో మీరంతా చూస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ బీజీఎంతో మూవీకి లైఫ్ ఇచ్చారు. పిచ్చిగా నచ్చాశావే నా ఫేవరేట్ సాంగ్. హీరోయిన్ ప్రగతి బ్యూటిఫుల్ అమ్మాయి. తనతో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. తన పర్ ఫార్మెన్స్ చూశాను చాలా బాగుంది. ఈ సినిమాకు మా టీమ్ పడిన కష్టానికి ఫలితం ఉంటుందని ఆశిస్తున్నాను. అన్నారు.


హీరోయిన్ ప్రగతి శ్రీవాస్తవ మాట్లాడుతూ - "గం..గం..గణేశా" నా కెరీర్ లో ఒక స్పెషల్ మూవీ. ఆనంద్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. అతను సపోర్టివ్ కోస్టార్. ఇలాంటి మంచి ప్రాజెక్ట్ లో అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ ఉదయ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. "గం..గం..గణేశా" హోల్ సమ్ ఎంటర్ టైనర్. సిధ్ శ్రీరామ్ నా ఫేవరేట్ సింగర్. మా మూవీలో బృందావనివే సాంగ్ ఆయన పాడినప్పుడు హ్యాపీగా ఫీలయ్యా. చేతన్ భరద్వాజ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా మూవీని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.


జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ - "గం..గం..గణేశా" సినిమాను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాలో ఆనంద్ అన్న ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా కీలకమైంది. ఇలాంటి కీ రోల్ నేను చేయగలను అని నమ్మిన మా డైరెక్టర్ ఉదయ్ కు థ్యాంక్స్. ఈ సినిమాకు ఆయన చాలా మంచి స్క్రిప్ట్ చేశాడు. సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియెన్స్ కు మూవీలోని చాలా క్యారెక్టర్స్ పేర్లు గుర్తుంటాయి. ఆనంద్ అన్న నన్ను నమ్మి వీడు ఈ క్యారెక్టర్ చేయగలడు అని సపోర్ట్ చేశారు. పరిచయం ఉన్న అందరికీ ఆనంద్ అన్న ఎంత మంచి పర్సన్ అనేది తెలుసు. "గం..గం..గణేశా" మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.


దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - రెండు రోజుల క్రితం "గం..గం..గణేశా" చూశాను. ఆద్యంతం ఎంటర్ టైన్ చేసింది. ఎక్కడా చూపు తిప్పుకోకుండా చూసే సినిమా ఇది. ఈ హాట్ సమ్మర్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది. ఆనంద్ పర్ ఫార్మెన్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. దొరసారి, మిడిల్ క్లాస్ మెలొడీస్, బేబి ఇప్పుడు "గం..గం..గణేశా"..ఆనంద్ లైనప్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ప్రతి సినిమా కొత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సినిమా చూశా కాబట్టి రిలీజ్ ముందే ఈ టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.


ఆస్ట్రలాజర్ ఆర్ఎంపీ శెట్టి మాట్లాడుతూ - "గం..గం..గణేశా" పేరులోనే సక్సెస్ ఉంది. గణేశుడి పేరు పెట్టుకున్న వారికి ఏ విఘ్నాలూ ఉండవు. ఈ సినిమా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేరు, డబ్బు తీసుకొస్తుంది. బేబిలో ఆనంద్ నటన నాకు బాగా నచ్చింది. ఈ సినిమాను మూవీ టీమ్ అంతా కష్టపడి కాకుండా ఇష్టపడి చేసినట్లు తెలుస్తోంది. అన్నారు.


డైరెక్టర్ అనుదీప్ కె.వి. మాట్లాడుతూ - డైరెక్టర్ ఉదయ్ నా స్నేహితుడు. అతనికి "గం..గం..గణేశా" మంచి సక్సెస్ ఇవ్వాలి. ఆనంద్ కు గుర్తుండిపోయే సినిమాలో "గం..గం..గణేశా" ఉండాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.


డైరెక్టర్  సాయి రాజేశ్ మాట్లాడుతూ - "బేబి" ఎమోషనల్ మూవీ, "గం..గం..గణేశా" ఎంటర్ టైనింగ్ సినిమా. మా "బేబి" సినిమా చేసి "గం..గం..గణేశా"కు ఆనంద్ వెళ్లినప్పుడు నేను అడిగాను రెండు సినిమాల ఎక్సీపిరియన్స్ ఎలా ఉందని. ఆనంద్ చెప్పాడు బేబిలో ఎమోషనల్ గా స్ట్రెస్ అయి "గం..గం..గణేశా" సెట్ కు వెళ్లినప్పుడు చాలా ఫన్, రిలాక్స్ గా ఫీలయ్యానని. ఆనంద్ పుష్పక విమానం సినిమా ఎక్కువమంది చూడలేదు గానీ ఆయన కామెడీ టైమింగ్ పర్పెక్ట్ గా ఉంటుంది. "గం..గం..గణేశా" సినిమా మంచి ఎంటర్ టైన్ మెంట్ తో మిమ్మల్ని నవ్విస్తుందని గట్టిగా చెప్పగలను. అని అన్నారు.


నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ - "గం..గం..గణేశా" కు నాకు, కేదార్ కు సపోర్ట్ గా నిలిచిన వ్యక్తి విజయ్ మద్దూరి గారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. ఆనంద్ స్మైల్ తో ఉంటాడు. మూవీకి 10, 12 గంటలు కష్టపడినా ఎప్పుడూ చిరాకు అనేది కనిపించదు. ఆనంద్ ను ఇప్పటిదాకా మిడిల్ క్లాస్ అబ్బాయిగా, మిడిల్ క్లాస్ హజ్బెండ్ గా చూశారు. కానీ ఈ సినిమాతో ఒక ఫంకీ క్యారెక్టర్ లో చూస్తారు. ఆనంద్ ఎమోషన్ బాగా చేయగలడు అంటారు కానీ ఈ మూవీతో కామెడీతో కూడా మెప్పించగలడు అనే పేరొస్తుంది. "గం..గం..గణేశా" ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అన్నారు.


నిర్మాత కేదార్ సెలగంశెట్టి మాట్లాడుతూ - మా ఈవెంట్ కు వచ్చిన రశ్మిక గారికి, ఇతర గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్. ఆనంద్, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఆనంద్ ఇవ్వడం హ్యాపీగా అనిపించింది. ఆనంద్ ను కొత్తగా తెరపై చూపించే మూవీ ఇది. మా ఫస్ట్ మూవీ అందరికీ నచ్చేలా రూపుదిద్దుకోవడం సంతృప్తినిచ్చింది. అన్నారు.


కో-ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ - రశ్మిక గారిది లక్కీ హ్యాండ్. మా ఈవెంట్ కు వచ్చినందుకు ఆ లక్ మాకు కూడా వస్తుందని అనుకుంటున్నాం. రెగ్యులర్ మూవీ లవర్స్ తో పాటు ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ అందరికీ నచ్చేలా "గం..గం..గణేశా" ఉంటుంది. అన్నారు.


డైరెక్టర్ ఉదయ్ శెట్టి మాట్లాడుతూ - "గం..గం..గణేశా" కథ చెప్పినప్పటి నుంచి మా ప్రొడ్యూసర్స్ ఎంతో సపోర్ట్ ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ ఆదిత్య నాకు స్ట్రెంత్ అని చెప్పాలి. కొరియోగ్రఫీ, మ్యూజిక్, ఆర్ట్ వర్క్..ఇలా ప్రతి క్రాఫ్ట్ మూవీలో మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాయి. ఆనంద్ లాంటి హీరో నా ఫస్ట్ సినిమాకు దొరకడం అదృష్టం. ఆయన షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్లాక కూడా కాల్ చేసేవారు. నీకు నచ్చినట్లు సీన్ వచ్చిందా లేదా లేకుంటే మళ్లీ చేద్దాం టెన్షన్ పడకు అనేవారు. అలాంటి సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. "గం..గం..గణేశా" కామెడీ మూవీ అనుకుంటే థ్రిల్ చేస్తుంది, థ్రిల్లర్ అనుకుంటే నవ్విస్తుంది, రెగ్యులర్ యాక్షన్ కామెడీ అనుకుంటే సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ ఉంది. ఆ రోల్ థియేటర్ లో చూసి షాక్ అయ్యేందుకు రెడీగా ఉండండి. "గం..గం..గణేశా" ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ అందరూ ఇష్టపడే సినిమా అవుతుంది. అన్నారు.


నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ - ఆనంద్, విజయ్ ఫ్యామిలీ సర్కిల్ నుంచి కేదార్, వంశీ, అనురాగ్ ముగ్గురు ప్రొడ్యూసర్స్ గా రావడం సంతోషంగా ఉంది. నయన్ సారిక మా ఆయ్ సినిమాలోనూ నటిస్తోంది. ఆనంద్ కు బేబి తర్వాత వస్తున్న "గం..గం..గణేశా" మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. మా శ్రీవల్లి రశ్మిక ఈ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. డైరెక్టర్ ఉదయ్ అండ్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.


నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ - "గం..గం..గణేశా" ప్రొడ్యూసర్స్ వంశీ, కేదార్ వారికి సపోర్ట్ చేసిన విజయ్ నాకు మంచి ఫ్రెండ్స్. కో ప్రొడ్యూసర్ అనురాగ్ కూడా మంచి మిత్రుడు. ఆనంద్ గురించి చెప్పాలంటే నేను పనిచేసివారిలో మోస్ట్ ప్యాషనేట్ హీరో. సినిమా పట్ల డెడికేషన్ ఉన్న హీరో. ఆయనకు బేబిని మించిన సక్సెస్ "గం..గం..గణేశా" ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.


హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ - "గం..గం..గణేశా" ఎందుకు చేశారని ఇంటర్వ్యూస్ లో కొందరు అడిగారు. నాకు వై అనే బదులు వై నాట్ అనే ప్రశ్న మొదలవుతుంటుంది. క్రైమ్ కామెడీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపి ఫంకీ క్యారెక్టర్ తో ఒక కథ దొరికితే వదుకోవాలని అనిపించదు. నేను ఇప్పటిదాకా ఈ సినిమాలో కనిపించనంత ఎనర్జిటిక్ గా మరే మూవీలో కనిపించలేదు. నాలో ఆ ఎనర్జీని డైరెక్టర్ ఉదయ్ చూపించాడు. ఇలాంటి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన ఉదయ్ కు థ్యాంక్స్. బేబి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ గా ఎస్ కేఎన్, సాయి రాజేశ్, ధీరజ్, మారుతి గారికి కాల్ చేసేవాడిని. సినిమా బాగా వస్తుందా అని. నాకు కాన్ఫిడెన్స్ తక్కువ. నా చుట్టూ ఉన్న వాళ్ల దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ తీసుకుంటా. మారుతి చెప్పారు మీరు చేసిన సినిమా ఎంటో తెలుసా. బేబి రిలీజ్ అయ్యాక మీ కెరీర్ మారిపోతుందని. ఆయన చెప్పినట్లే జరిగింది. తన మాటలతో నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు మారుతి. "గం..గం..గణేశా" టైమ్ లో కూడా ఉదయ్ కు ఫోన్ చేసి ఎలా వస్తుంది మూవీ బాగుందా అని విసిగించేవాడిని. నిన్న మా మూవీకి సంబంధం లేని యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ వందమందికి సినిమా చూపించాం. వాళ్లంతా మూవీలో వచ్చే ట్విస్ట్స్, టర్న్స్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమ్మర్ కు పర్పెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "గం..గం..గణేశా".  ఈ 31కి మాతో పాటు మరో రెండు సినిమాలు వస్తున్నాయి. హెల్దీ కాంపిటేషన్ ఉండాలి. అన్ని సినిమాలు ప్రేక్షకాదరణ పొందాలని కోరుకుంటున్నా. ఈ సమ్మర్ అంతా డ్రైగా ఉంది. నెలకు కనీసం రెండు మీడియం, చిన్న సినిమాలు ఆదరణ పొందితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అందరికీ ఉపాధి దక్కుతుంది.  "గం..గం..గణేశా" తో మేమొక మంచి సినిమా చేశాం. ఔట్ పుట్ తో హ్యాపీగా ఉన్నాం. మీరు థియేటర్ కు వెళ్లి సినిమా చూడండి. నచ్చితే మిగతా వారికి చెప్పండి. ఇది నా ఒక్కడి సినిమా కాదు ఎన్నో క్యారెక్టర్స్ బాగుంటాయి. యూనిక్ ప్రెజెంటేషన్ తో మూవీ ఉంటుంది. రశ్మిక గారితో పాటు మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.


నేషనల్ క్రష్ రశ్మిక మందన్న మాట్లాడుతూ - "గం..గం..గణేశా" ఈ టీమ్ అందరికీ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. మనకంటూ ఒకరి సపోర్ట్ ఉండాలి. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక నేను అది ఫీలయ్యాను. ఆనంద్ నాకు ఒక బ్రదర్. అతనికి తెలియదు అతని మీద నేను చాలా డిపెండ్ అవుతుంటా. ఈ సినిమా సక్సెస్ అందుకుంటే ఆనంద్ మొహంలో నవ్వు ఉంటుంది. ఆ నవ్వు చూడాలని కోరుకుంటున్నా. "గం..గం..గణేశా" సాంగ్స్ కు నేను డ్యాన్సులు చేశా. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్టర్ ఉదయ్ కు ఈ సినిమా బిగ్ సక్సెస్ ఇవ్వాలి. "గం..గం..గణేశా" లో రుద్ర, ఇమ్మాన్యుయేల్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ఇమ్మాన్యుయేల్ వీడియోస్ చూస్తే నవ్వు ఆగదు. ప్రొడ్యూసర్స్ వంశీ, కేదార్, అనురాగ్ కు ఈ సినిమా లాభాలు తీసుకురావాలి. బేబి మూవీ చూశాక సాయి రాజేశ్ గారి డైరెక్షన్ లో తప్పకుండా నటించాలని అనిపించింది. అన్నారు.


నటీనటులు :

ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.


టెక్నికల్ టీమ్ :


పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

కాస్ట్యూమ్ డిజైనర్ : పూజిత తాడికొండ

ఆర్ట్: కిరణ్ మామిడి

ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి

సంగీతం - చేతన్ భరద్వాజ్

లిరిక్స్ - సురేష్ బనిశెట్టి

బ్యానర్ - హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్

కొరియోగ్రఫీ: పొలాకి విజయ్

కో-ప్రొడ్యూసర్ -అనురాగ్ పర్వతనేని

నిర్మాతలు - కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి

రచన, దర్శకత్వం - ఉదయ్ శెట్టి