Latest Post

Surya Teja Aelay Bharathanatyam Releasing On April 5

 సూర్య తేజ ఏలే, కేవీఆర్ మహేంద్ర, పాయల్ సరాఫ్, పీఆర్ ఫిలిమ్స్ 'భరతనాట్యం' ఏప్రిల్ 5న గ్రాండ్ గా విడుదల



సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ 'భరతనాట్యం'. దొరసాని ఫేమ్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో  పీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, టెంపర్ వంశీ వంటి అనేక మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


లీడ్ పెయిర్ పై చిత్రీకరించిన రొమాంటిక్ నంబర్ చేసావు ఎదో మాయను విడుదల చేసిన మేకర్స్ సినిమా విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 5న వేసవిలో 'భరతనాట్యం' ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉంది. సమ్మర్ హాలిడేస్ ను సినిమా క్యాష్ చేసుకోబోతోంది.


తన కథలో హీరోలా జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొనే ఔత్సాహిక ఫిల్మ్ మేకర్ గా ఇందులో సూర్య తేజ కనిపించబోతున్నారు. ప్రోమోల్లో సూర్యతేజ తన నటనతో ఆకట్టుకున్నాడు.


ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా, వెంకట్ ఆర్ శాకమూరి డీవోపీగా పని చేస్తున్నారు. రవితేజ గిరిజాల ఈ చిత్రానికి ఎడిటర్.


నటీనటులు: సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్ వంశీ, నాగ మహేష్, టార్జాన్, మాణిక్ రెడ్డి, శివన్నారాయణ, సత్తన్న, సంతోష్ బాలకృష్ణ


సాంకేతిక సిబ్బంది:

దర్శకత్వం: కేవీఆర్ మహేంద్ర

నిర్మాత: పాయల్ సరాఫ్

కథ: సూర్య తేజ ఏలే

స్క్రీన్ ప్లే: సూర్య తేజ ఏలే, కేవీఆర్ మహేంద్ర

సంగీతం: వివేక్ సాగర్

డీవోపీ: వెంకట్ ఆర్ శాకమూరి

ఎడిటింగ్: రవితేజ గిరిజాల

ఆర్ట్: సురేష్ భీమగాని

పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే


Mythri Movie Makers prestigiously present Ajith Kumar - Adhik Ravichandran’s ‘GOOD BAD UGLY’, Filming Starts June 2024, Pongal Release 2025

 మైత్రీ మూవీ మేకర్స్ ప్రౌడ్లీ ప్రజెంట్స్- అజిత్ కుమార్-అధిక్ రవిచంద్రన్ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' - 2024 జూన్ లో షూటింగ్ ప్రారంభం, 2025 పొంగల్ కు విడుదల



భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్, స్టార్ హీరో అజిత్ కుమార్‌తో తమ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేయడంపై ఆనందంగా ఉంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్‌తో రూపొందే ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.  


మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ''దిగ్గజ స్టార్ అజిత్ కుమార్ సర్‌తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ స్క్రిప్ట్, కథనం అద్భుతంగా వున్నాయి. అభిమానులు, సినిమా ప్రేమికులకు గ్రిప్పింగ్, ఆకట్టుకునే సినిమాటిక్ అనుభవాన్నిఅందించడానికి మేము సంతోషిస్తున్నాము. ”


నిర్మాత వై రవిశంకర్‌ మాట్లాడుతూ..''అజిత్‌ కుమార్‌ సర్‌తో జట్టుకట్టడం ఆనందంగా ఉంది. అధిక్ అద్భుత దర్శకత్వ ప్రతిభ అతని మునపటి చిత్రాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కొత్త చిత్రం నెక్స్ట్ లెవల్ లో వుండబోతుంది.' అన్నారు


దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మాట్లాడుతూ ''ప్రతి ఒక్కరి జీవితంలోనూ, కెరీర్‌లోనూ అమూల్యమైన క్షణాలు ఉంటాయి, ఇది నా జీవితంలో అద్భుతమైన క్షణం. నా మ్యాట్నీ ఐడల్ ఎకె సర్‌తో కలిసి పనిచేయడం చాలా నా చిరకాల కల. ఈ సినిమాతో ఆ  కలగా నేరవేరడం ఆనందంగా వుంది. ఈ అవకాశం కల్పించిన నిర్మాతలు నవీన్‌ యెర్నేని సర్‌, రవిశంకర్‌ సర్‌లకు కృతజ్ఞతలు’’ తెలిపారు.


ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా రూపొందనున్న ఈ చిత్రానికి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.


'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రీకరణ జూన్ 2024లో ప్రారంభం అవుతుంది.  ఈ చిత్రం 2025 పొంగల్‌కు విడుదల కానుంది.


సాంకేతిక సిబ్బంది

రచన, దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్

డీవోపీ: అభినందన్ రామానుజం

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

ఎడిటర్: విజయ్ వేలుకుట్టి

స్టంట్స్ : సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్

స్టైలిస్ట్: అను వర్ధన్

పీఆర్వో: సురేష్ చంద్ర

పీఆర్వో (తెలుగు) : వంశీ శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

సౌండ్ డిజైన్: సురేన్

పబ్లిసిటీ డిజైన్: ADFX అంబానీ

చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ నరసింహన్

CEO: చెర్రీ

నిర్మాతలు: నవీన్ యెర్నేని-వై రవిశంకర్

Ulaganayagan Kamal Haasan Produces Music Video Inimel Starring Lokesh Kanagaraj With Music By Shruti Haasan

 ఉలగనాయగన్ కమల్ హాసన్ నిర్మాణంలో శ్రుతి హాసన్ సంగీతంలో లోకేష్ కనగరాజ్ నటిస్తున్న "ఇనిమెల్" మ్యూజిక్ వీడియో




ఉలగనాయగన్ కమల్ హాసన్ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న మ్యూజిక్ వీడియో 'ఇనిమెల్'తో లోకేష్ కనగరాజ్ ను నటుడిగా పరిచయం చేస్తున్నారు. ఆర్‌కెఎఫ్‌ఐ బ్యానర్‌ పై కమల్‌హాసన్‌, ఆర్‌ మహేంద్రన్‌ సంయుక్తంగా ఈ మ్యూజిక్‌ వీడియోను నిర్మిస్తున్నారు.


మ్యూజిక్ వీడియో ఇనిమెల్‌ను వెరీ ట్యాలెంటెడ్ శృతి హాసన్ స్వరపరిచి, కాన్సెప్ట్ చేశారు. ఈ వీడియోలో లోకేష్ కనగరాజ్‌తో పాటు కనిపించనున్నారు. కమల్ హాసన్ ఇనిమెల్ కు లిరిక్ రైటర్ కూడా.


కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ గతంలో 'విక్రమ్' అనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందించారు. ద్వారకేష్ ప్రబాకర్ దర్శకత్వం వహించిన ఈ మ్యూజిక్ వీడియో కోసం వారు మళ్లీ చేతులు కలిపారు. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్. శ్రీరామ్ అయ్యంగార్ ప్రొడక్షన్ డిజైనర్.


ఇనిమెల్ మ్యూజిక్ వీడియో త్వరలో విడుదల కానుంది.


Naveen Chandra's web series "Inspector Rishi" will be streaming on Amazon Prime from March 29th

ఈ నెల 29 నుంచి అమోజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న నవీన్ చంద్ర వెబ్ సిరీస్ "ఇన్స్ పెక్టర్






హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్...ఇలా పాత్ర ఏదైనా నటుడిగా మెప్పిస్తుంటారు నవీన్ చంద్ర. సినిమాలతో పాటు వెబ్  సిరీస్ ల్లోనూ ఆయన పేరు తెచ్చుకుంటున్నారు. తెలుగులో మంచి గుర్తింపు అందుకున్న నవీన్ చంద్ర..ఇటీవల జిగర్తాండ డబుల్ ఎక్స్ ఎల్ సినిమాతో తమిళ ప్రేక్షకులకూ బాగా దగ్గరయ్యారు. దీంతో నేరుగా ఆయన లీడ్ రోల్ లో కోలీవుడ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. ఈ క్రమంలో వస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఇన్స్ పెక్టర్ రిషి. అమోజాన్ తమిళ్ ఒరిజినల్స్ గా ఈ సిరీస్ ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది. 

హారర్ క్రైమ్ కథతో ఇన్ స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ ను రూపొందించారు డైరెక్టర్ నందిని జె.ఎస్. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. ఎలాంటి క్లూ లేకుండా జరుగుతున్న హత్యలను ఇన్వెస్టిగేట్ చేసే పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నవీన్ చంద్ర ఈ వెబ్ సిరీస్ లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అంతు చిక్కని ఈ హత్యల వెనుక ఎవరున్నారు అనేది సస్పెన్స్, హారర్ అంశాలతో ఆసక్తికరంగా ఇన్స్ పెక్టర్ రిషిలో తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ లో సునైన, కన్నా రవి, మాలిని జీవరత్నం, శ్రీకాంత్ దయాల్, కుమార్ వేల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో నవీన్ చంద్ర ఏలెవన్, సత్యభామ వంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు

Hero Kiran Abbavaram and Heroine Rahasya Gorak's Engagement was a grand affair

ఘనంగా హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య నిశ్చితార్థం




హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్ గండిపేట్ లోని ఓ రిసార్ట్ లో మిత్రులు, కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కిరణ్ అబ్బవరం, రహస్య నిశ్చితార్థం ఫొటోస్ తో కూడిన పోస్టులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ కొత్త జంటకు సెలబ్రిటీలు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ విశెస్ చెబుతున్నారు.

ఆగస్టులో కిరణ్ అబ్బవరం, రహస్య పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి తేదీని త్వరలో ప్రకటించబోతున్నారు. కిరణ్ అబ్బవరం, రహస్య కలిసి రాజా వారు రాణి గారు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ టైమ్ నుంచే కిరణ్ అబ్బవరం, రహస్య ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు పెద్దల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

Raju Gari Ammayi Naidu Gari Abbayi Review

 


Check out the Review of Raju Gari Ammayi Naidu Gari Abbayi, a rural entertainer,  Actor Ravi Teja Nunna, who is also one of the co-producers, is making his debut with this film alongside popular Hindi serial actress Neha Jurel in the film directed by Satya Raj. Produced by Kumari Nunna and Mutyala Ram Das under Venkata Siva Sai Films and Tanvika and Mokshika Creations, it is presented by Manikonda Ranjith and has music by Roshan Saluri, son of popular composer Koti


Story 

Raju Gari Ammayi Naidu Gari Abbayi unfolds in an idyllic village revolving around a happy-go-lucky, free-spirited youngster who falls for a feisty woman. However, rural factions threaten their future together. Suddenly, all fingers point towards the protagonist for the murder of a woman. How far will the protagonist go to prove his innocence? Forms the rest of the story ? 


Performances

In this Segment We must appreciate all the actors for their brilliant performances even though many are new to Tfi their performances are good hero Ravi Teja Nunna has done an excellent Job. He mesmerized the audience with his boy-next-door performance. 


Neha Jurel as the heroine is impressive. Senior actor  Naginidu has done decent job Pramodini, Yogi Khatri, Jabardast Babi, Jabardast Ashok, Adabala Durgaji Naga Mohan  and rest of the team has done as per the requirement 


Technical Aspects 

In this Segment we must appreciate producers for their production values each and every Frame is so Rich and Grandeur Director Satya Raj tried his best to Entertain audiences with his gripping Narration and amazing twists have made the film exciting. Cinematography is very good Music is one of the added asset Bgm has taken Music to next level. Editing Is crisp 


Verdict 

On whole Raju Gari Ammayi Naidu Gari Abbayi Is a decent film with Engaging Elements 


Telugucinemas.in Rating 3.25/5



Hero Sairam Shankar Interview About Vey Daruvey

 ‘వెయ్ దరువెయ్’ చిత్రం 80 శాతం కామెడీ, చిన్న ఫ్యామిలీ ఎమోషనల్ టచ్‌, మెసేజ్‌తో ప్రేక్షకులను మెప్పిస్తుంది : హీరో సాయిరామ్ శంకర్



సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. మార్చి 15న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరో సాయిరామ్ శంకర్ సినిమా గురించిన విశేషాలను తెలియజేశారు..


 దర్శక నిర్మాతలు కలిసి సినిమా చేయాలనుకున్నారు. స్క్రిప్ట్ అంతా రెడీ కూడా అయ్యింది. నేను కూడా సినిమా చేయాలనుకుంటున్నాను. అప్పుడు కార్తీక్ అనే కామన్ ఫ్రెండ్ మమ్నల్ని కలిపాడు. అలా సినిమా ట్రాక్ ఎక్కింది.


 ‘వెయ్ దరువెయ్’ అనేది కమర్షియల్ టైటిల్ అయినప్పటికీ దానికి జస్టిఫికేషన్ ఉంటుంది. అలాగే హీరో క్యారెక్టర్ జోవియల్‌గా ఉంటుంది. సమాజంలో ఓ సమస్యపై హీరో చేసే చిన్నపాటి పోరాటమే ఈ చిత్రం.


 ‘బంపర్ ఆఫర్’ మూవీ నా బాడీలాంగ్వేజ్‌కి తగ్గట్లు ఉండే చిత్రం. ఆ తర్వాత ఈ కథ నాకు అలా అనిపించింది. కామెడీ నాకు బాగా ఇష్టం. ‘వెయ్ దరువెయ్’ విషయానికి వస్తే ఇందులో 80 శాతం కామెడీ, చిన్న ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ ఉంటుంది.


నేను వరుస సినిమాలు చేస్తున్నాను. అయితే అవన్నీ రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. మార్చి 15న ‘వెయ్ దరువెయ్’ రిలీజ్ అయితే వచ్చే నెలలో ఒక పథకం ప్రకారం, మే నెలలో రీసౌండ్ రిలీజ్ అవుతుంది. ఈ మూడు మూవీస్ చేయటానికి ఐదేళ్ల సమయం పట్టింది. అందుకు కారణం మధ్యలో కోవిడ్ చాలా బాగా డిస్ట్రబ్ చేసేసింది. అలా కొన్ని పరిస్థితులతో కాస్త గ్యాప్ కనిపిస్తుంది.


 ‘వెయ్ దరువెయ్’ మూవీని 35 రోజుల్లో పూర్తి చేశాం. అందుకు కారణం దర్శకుడు నవీన్ రెడ్డి, నిర్మాత దేవరాజ్ పోతూరుగారి ప్లానింగ్. ఇందులో నాలుగు పాటలు, ఫైట్స్ ఉన్నప్పటికీ అంత త్వరగా పూర్తి చేయటానికి వారు ముందు చేసుకున్న ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు అందరూ ఇచ్చిన సపోర్ట్ అనే చెప్పాలి.


 ఆడియెన్స్‌ను సినిమా ఎంగేజ్ చేస్తే చాలు. సినిమా సక్సెస్‌ను వాళ్లు డిసైడ్ చేస్తారు. ఫార్మేట్‌లతో వాళ్లకు సంబంధం ఉండదు.

 నాతో పాటు చాలా మంది స్టార్ యాక్టర్స్ నటించారు. సత్యం రాజేష్, సునీల్, చమ్మక్ చంద్ర, థర్టీ ఇయర్స్ పృథ్వీ, పోసాని, అదుర్స్ రఘు, కాశీ విశ్వనాథ్ అందరూ తమదైన నటనతో మెప్పిస్తారు.


 దర్శకుడు నవీన్ గారు ఏ కథనైతే అనుకున్నారో అదే సినిమాగా తెరకెక్కించారు. నాకు బాడీలాంగ్వేజ్‌కి సూట్ అయ్యే క్యారెక్టర్ లో మెప్పిస్తాను. నాకు టేకాఫ్‌కి ఉపయోగపడే సినిమా అవుతుందనిపిస్తుంది.


 నిర్మాత దేవరాజ్‌గారు ఇతర వ్యాపారంలో ఉన్నప్పటికీ సినిమాలంటే ఆసక్తి. సినిమాను ఇంత త్వరగా పూర్తి చేశామంటే ముందు దేవరాజ్ గారు తీసుకున్న చొరవే. దర్శకుడితో కలిసి ముందుగానే మంచిగా ప్లాన్ చేసుకున్నారు.


 సునీల్ గారు మెయిన్ విలన్. ఆయన బిజీగా ఉన్నప్పటికీ నేను స్పెషల్ గా వెళ్లి కలవటంతో డేట్స్ అడ్జస్ట్ చేసిచ్చారు. హీరోయిన్ యశ ఇందులో మంచి రోల్ చేసింది. ఇద్దరూ అట్యిట్యూడ్  ఉన్న పాత్రల్లో కనిపిస్తాం. హెబ్బా పటేల్ గారు ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తారు.


 భీమ్స్ గారు మంచి సాంగ్సే కాదు.. మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ను అందించారు. ఫస్ట్ కాపీ చూడగానే అర్థమైంది.


 ‘బంపర్ ఆఫర్ 2’ను ఎప్పుడో అనౌన్స్ చేస్తాం. తప్పకుండా సినిమా ఉంటుంది. కరోనా వేవ్స్ సమయంలో సినిమాను ఆపాం. త్రివిక్రమ్ గారి దగ్గర వర్క్ చేసే అశోక్ గారు కథను తయారు చేశారు. దాన్ని ఆయన ఇంకెవరికీ ఇవ్వను మీకే ఇస్తానని అన్నారు.


 అన్నయ్యను నాతో సినిమా చేయాలని ఇబ్బంది పెట్టాను. వీడికి ఇది అవసరం అనుకుంటే ఆయనే చేస్తారు. ప్రమోషన్స్ విషయంలోనూ అంతే


Producer Ashok Kumar launched the teaser of ‘Yamadheera’ movie

 యమధీర మూవీ టీజర్ లాంచ్ చేసిన ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు


కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ గారు తొలి చిత్రం గా వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో నాగబాబు గారు, ఆలీ గారు, సత్య ప్రకాష్ గారు, మధు సూధన్ గారు తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా టీజర్ ప్రముఖ నటులు & ప్రొడ్యూసర్ అయినటువంటి అశోక్ కుమార్ గారు లాంచ్ చేయడం జరిగింది.


ప్రొడ్యూసర్ వేదాల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ...ఇది తన మొదటి చిత్రం అని, సినిమాల మీద ప్యాషన్ తో శ్రీమందిరం ప్రొడక్షన్స్ స్టార్ట్ చేశానని, ప్రేక్షకులు తమని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చి యమధీర సినిమా టీజర్ లాంచ్ చేసిన తన స్నేహితుడు యాక్టర్, ప్రొడ్యూసర్ అయినటువంటి అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే యమధీర సినిమా థియేటర్లో రిలీజ్ కానుంది అని వేదాల శ్రీనివాస్ గారు తెలిపారు.


ఈ సందర్భంగా అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ... తన స్నేహితులు వేదాల శ్రీనివాస్ గారు కొత్తగా శ్రీమందిరం ప్రొడక్షన్స్ మొదలుపెట్టడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో తొలి చిత్రంగా వస్తున్న యమధీర చాలా బాగా ఆడాలని అలాగే మరెన్నో చిత్రాలు శ్రీ మందిరం ప్రొడక్షన్స్ లో రావాలని ఆయన అన్నారు. కన్నడలో 90కు పైగా సినిమాలలో నటించిన కోమల్ కుమార్ గారు ఈ సినిమా లో కథానాయకుడిగా నటించడం విశేషం అని అన్నారు. క్రికెటర్ శ్రీశాంత్ ఫాస్ట్ బౌలర్ గా మైదానం లో చూపే   దూకుడు ని   ప్రతినాయకుడిగా చూపించే అవకాశం ఉంది అన్నారు. ఆలాగే ఈ చిత్రం అజర్ బైజాన్, శ్రీలంక వంటి దేశాలతో పాటు మన దేశంలోని మైసూర్, చెన్నై, బెంగళూరు ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరగడం విశేషం అని తెలిపారు.


ప్రొడ్యూసర్ : వేదాల శ్రీనివాస్


తారాగణం :

కోమల్ కుమార్, శ్రీశాంత్ (క్రికెటర్), రిషీక శర్మ, నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూదన్, తదితరులు.


టెక్నికల్ టీం :  

కెమెరామెన్ : రోష్ మోహన్ కార్తీక్

మాటలు & పాటలు : వరదరాజ్ చిక్కబళ్ళపుర

ఎడిటింగ్ : సి రవిచంద్రన్

సంగీతం : వరుణ్ ఉన్ని

కథ & దర్శకత్వం : శంకర్ ఆర్

పిఆర్ఓ : మధు విఆర్


Former Vice President Of India Venkaiah Naidu Launched First Look & Motion Poster Of THE 100

 'ది 100' చిత్రం మంచి సందేశంతో చాలా అద్భుతంగా వుంది. సినిమా చూసిన తర్వాత పోలీస్ అధికారి అంటే సాగర్ లా ఫిట్ గా హుందాగా వుండాలనిపించింది. తప్పకుండా సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే విశ్వాసం వుంది: ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్‌ లాంచ్ ఈవెంట్ లో మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు



ఆర్కే సాగర్‌ని విక్రాంత్ ఐపీఎస్ గా పరిచయం చేస్తూ 'ది 100' ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేసిన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు


మొగలిరేకులు ఫేమ్ ఆర్కే సాగర్, రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో 'ది 100' అనే కొత్త చిత్రంతో రాబోతున్నారు. క్రియా ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె తారక్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంచ్ చేశారు. మోషన్‌ పోస్టర్‌ లాంచ్ కు ముందు ఈ సినిమాని వెంకయ్యనాయుడు గారు వీక్షించారు.  


ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్‌ లో ఆర్కే సాగర్  విక్రాంత్ ఐపీఎస్ గా పరిచయం అయ్యారు. ఖాకీ దుస్తులు ధరించి, చేతిలో తుపాకీతో కనిపించారు. స్పోర్టింగ్ షేడ్స్, అతని ముఖంలో ఇంటన్సిటీ ని గమనించవచ్చు. మోషన్ పోస్టర్ నెంబర్ 100 యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. "ఇది కేవలం ఒక నెంబర్ కాదు, ఇది ఒక ఆయుధం" అని క్లిప్‌లో చూపబడింది. మిషా నారంగ్ కథానాయికగా నటిస్తుండగా, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ టెక్నీషియన్లు ఈ సినిమాలో పని చేస్తున్నారు. శ్యామ్ కె నాయుడు డీవోపీ గా పని చేస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్. చిన్నా ప్రొడక్షన్‌ డిజైనర్‌. ఆర్కే సాగర్ ఇంటెన్స్ పోలీస్ గా కనిపించనున్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ పేరిచర్ల డైలాగ్స్ రాస్తున్నారు.


మోషన్ పోస్టర్‌ లాంచింగ్ ఈవెంట్ లో మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సినిమా అంటే నాకు చాలా ఇష్టం. సినిమా అనేది శక్తివంతమైన ఆయుధం. సినిమా ప్రభావం సమాజంపై వుంటుంది. 'ది 100' చిత్ర ఇతివృత్తం చాలా బావుంది. సినిమా చిత్రీకరణ కూడా చాలా బావుంది. సినిమాలో చాలా మంచి సందేశం వుంది. ఇంత చక్కటి సినిమాని రూపొందించిన నిర్మాతలకు, దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ కు, కథానాయకుడు సాగర్ కు అభినందనలు. ఈ సినిమా విజయవంతగా నడుస్తుంది. ప్రేక్షకులు తప్పనిసరిగా ఆదరిస్తారనే విశ్వాసం వుంది. నటుడిగా సాగర్ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత పోలీస్ అధికారి సాగర్ లానే వుండాలానే అభిప్రాయం కలుగుతుంది. పాత్రలో లీనమై చాలా హుందాగా కనిపించారు. ఇందులో వున్న సందేశం నాకు చాలా నచ్చింది.  సినిమా ఎప్పుడూ సందేశాన్ని అందించాలి. ఆ సందేశం మంచిదైతే ప్రేక్షకులు ఇంకా ఎక్కువ ఆదరిస్తారు. ఎలాంటి అసభ్యత లేకుండా చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా అన్ని విధాలా విజయవంతం కావాలని కోరుకుంటూ సినిమా బృందానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను'' అన్నారు.  


హీరో ఆర్కే సాగర్‌ మాట్లాడుతూ.. ఒక సినిమా చేస్తే సంతోషం కాదు గర్వం వుంటుంది. అలాంటి గౌరవాన్ని ఇచ్చిన సినిమా 'ది 100'. ఈ వేడుకు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు రావడం మా అదృష్టం. చాలా గర్వంగా వుంది. ఆయనకి  సినిమా చూపించి నాలుగు మాటలు ఆ సినిమా గురించి మాట్లాడించం నా కల. ఆ కల నిజంగా నెరవేరింది. ఆయనకు రణపడి వుంటాను. నిర్మాతలు  రమేష్ కరుటూరి, వెంకీ పూషడపు, తారక్ రామ్ ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మించారు. దర్శకుడు శశి నేను మంచి స్నేహితులం. తను అద్భుతమైన దర్శకుడు. భవిష్యత్ లో ఇంకా మంచిమంచి చిత్రాలు తీస్తాడని కోరుకుంటున్నాను. సుదీర్ వర్మ గారి డైలాగ్స్ చాలా బావున్నాయి. 'ది 100' అనేది ప్రతి మనిషి జీవితంలో ఈ ఆయుధం అవసరం వస్తుంది. ఇది ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీస్ ఖచ్చితంగా చుస్తారనే నమ్మకం వుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మంచి నేపధ్య సంగీతం ఇచ్చారు. నటీనటులంతా చక్కగా నటించారు. తప్పకుండా సినిమా అందరినీ అలరిస్తుంది'' అన్నారు.


దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ.. ఈ వేడుకు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు రావడం మా అదృష్టం. ఆయన ప్రోత్సాహం మాకు ఎల్లవేళలా వుండాలని కోరుకుంటున్నాం. 'ది 100' ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. సహజంగా ఉంటూనే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక సోషల్ ఇష్యూని చెప్పడం జరిగింది. అందరూ చూడదగ్గ సినిమా ఇది. అందరూ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.  నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన సాగర్ గారికి ధన్యవాదాలు. నిర్మాతలకు కృతజ్ఞతలు.  'ది 100' అనేది వెపన్. అది పూర్తిగా తెలియాలంటే అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూడాలి. తప్పకుండా సినిమా అందరినీ అలరిస్తుంది' అన్నారు,


నిర్మాత రమేష్ కరుటూరి మాట్లాడుతూ.. శ్రీ వెంకయ్య నాయుడు గారు లాంటి మహావ్యక్తి మా సినిమా చూడటానికి రావడం చాలా ఆనందంగా వుంది. ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ ధన్యవాదాలు' తెలిపారు . చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది.


తారాగణం: ఆర్కే సాగర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, గిరిధర్, ఆనంద్, లక్ష్మీ గోపాల్ స్వామి, కళ్యాణి నటరాజన్, బాల కృష్ణ, జయంత్, విష్ణు ప్రియ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్

నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ పూషడపు, జె తారక్ రామ్

బ్యానర్లు: క్రియా ఫిల్మ్ కార్ప్ , ధమ్మ ప్రొడక్షన్స్

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

డీవోపీ: శ్యామ్ కె నాయుడు

ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల

ప్రొడక్షన్ డిజైన్: చిన్నా

డైలాగ్స్: సుధీర్ వర్మ పేరిచర్ల

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో


Simhadwani Censor Completed

"సింహధ్వని "సెన్సార్ పూర్తి



శ్రీ లక్ష్మీ భవాని ఫిలింస్ పతా కంపై  హీరో వశిష్ట హీరోయిన్ పావని అండ్ త్రివేణి ముఖ్య  పాత్రలుగా ఎస్ ఎస్ స్వామి దర్శకత్వంలో నిర్మాత సోమశేఖర్ నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్  "సింహద్వని." సెన్సార్  కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం ఏప్రిల్ రెండో వారం లో  ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు ఎస్ ఎస్ స్వామి మాట్లాడుతూ,"ఇదొక  డిఫరెంట్ యాక్షన్  మూవీ. సునీల్ పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా నటించారు. మరియు నిడదవోలు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే పాత్ర చాలా అద్భుతంగా నటించారు ఇలా ఎన్నెన్నో పాత్రలు వస్తూ ఉంటాయి ఈ చిత్రం యొక్క సారాంశం ఏమిటంటే పెడదారి పడుతున్న యువత గంజాయి మత్తుమందు కు అలవాటు పడి విచక్షణ జ్ఞానం కోల్పోయి, దొంగతనాలు దోపిడీలు హత్యలు మానభంగాలు ఇలా ఎన్నెన్నో సంఘవిద్రోహులుగా అవుతున్నారు వీటన్నిటికీ కారుకులెవరు అన్నదే మా సినిమా సింహద్వని. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని ఏప్రిల్ రెండో వారంలో  ప్రేక్షకుల ముందుకు  తీసుకు రానున్నము, అని అన్నారు.

ఈ చిత్రానికి సమర్పణ :భలగం, సోమలింగాచారి ,ఎడిటింగ్: దాసరి రవికుమార్ ,సంగీతం: రవికుమార్ మంద, కో ప్రొడ్యూసర్ :జి మహేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చెరుకూరి శ్రీనివాస నాయుడు, నిర్మాత :ఎస్ సోమశేఖర్ ,కథ స్కిన్ ప్లే ,డైరెక్షన్: ఎస్ ఎస్ స్వామి

 పిఆర్ ఓ: బాశిoశెట్టి వీరబాబు

Ananya Pre Release Event Held Grandly

అతిరథ మహారధుల సమక్షంలో

"అనన్య" ప్రి - రిలీజ్ వేడుక!!



'అనన్య' అద్భుత విజయం

సాధించాలని అభిలాష


ఈనెల 22 న భారీ విడుదల


జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ ముఖ్య తారాగణంగా ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వంలో... శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ పతాకం ప్రారంభ చిత్రంగా జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మించిన విభిన్న కథా చిత్రం "అనన్య". హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 22న విడుదల కానుంది. 


ఈ నేపధ్యంలో "అనన్య" ప్రి రిలీజ్ వేడుకను హైద్రాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు సుమన్, యువ కథానాయకుడు సందీప్ మాధవ్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ప్రముఖ దర్శకనిర్మాత సాయి వెంకట్, విశ్రాంత న్యాయమూర్తి మాల్యాద్రి, శ్రీనివాస్ బోగిరెడ్డి, యువ దర్శకుడు అఫ్జల్ తోపాటు యూనిట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. "అనన్య" అద్భుత విజయం సాధించాలని ఈ సందర్భంగా అతిధులు అభిలషించారు. 


ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న "అనన్య" అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరించి తమ "శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్"కు శుభారంభాన్నిస్తుందని నిర్మాత జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ పేర్కొన్నారు. సెన్సార్ సభ్యుల ప్రశంసలు దండిగా అందుకుని, ఈనెల 22న వస్తున్న "అనన్య" ప్రేక్షకుల ఆదరాభిమానాలు సైతం పుష్కలంగా పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు ప్రసాద్ రాజు బొమ్మిడీ తెలిపారు. తమ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసి, ఆల్ ది బెస్ట్ చెప్పిన హీరో శ్రీకాంత్ కు దర్శకనిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు.


సీతా శ్రీనివాస్, శివాని శర్మ, చక్రవర్తి, జబర్దస్త్ అప్పారావు, పొట్టి చిట్టిబాబు, సుజాత, క్రాక్ శ్రీమణి ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ - అప్పాజీ, డాన్స్: బ్రదర్ ఆనంద్ - బాలు, మాటలు: హరికృష్ణ - వెంకట రమణ బొమ్మిన, ఫైట్స్: దేవరాజ్, పాటలు: త్రినాధ్ మంతెన - నవీన్ విల్లూరి, మ్యూజిక్: త్రినాద్ మంతెన, కెమెరా: ఎ.ఎస్.రత్నం, ఎడిటింగ్: నందమూరి హరి, సహ నిర్మాత: బుద్ధాల సత్యనారాయణ, సమర్పణ; శ్రీమతి జంధ్యాల రత్న మణికుమారి, నిర్మాత: జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ప్రసాద్ రాజు బొమ్మిడి!!

Ashish Gandhi and Kalyanji Gogana's 'Kalingaraju' First look Impressive

 ఆకట్టుకునేలా ఆశిష్ గాంధీ, కళ్యాణ్ జీ గోగణ ‘కళింగరాజు’ ఫస్ట్ లుక్ విడుదల



నాటకం సినిమాతో హీరోగా ఆశిష్ గాంధీ, దర్శకుడిగా కళ్యాణ్ జీ గోగణకు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్‌ను చేయడం విశేషం. ఆశిష్ గాంధీ, కళ్యాణ్ జీ గోగణ కాంబోలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ స్పెక్ట్రమ్ స్టూడియోస్, సుందరకాండ మోషన్ పిక్చర్స్, కళ్యాణ్ జీ కంటెంట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ‘కళింగరాజు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్‌తో పాటుగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కళ్యాణ్‌జీ గోగణ, ఆశిష్ గాంధీ కాంబోలో వస్తున్న ‘కళింగరాజు’ చిత్రాన్ని రిజ్వాన్, శ్రీ సాయి దీప్ చాట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


‘కళింగరాజు’ మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను బుధవారం నాడు లాంచ్ చేశారు. ఈ మేరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఊరి వాతావరణం కనిపిస్తోంది. ఇక ఆశిష్ గాంధీ కుర్చీ మీద కూర్చున్న తీరు, రక్తంతో తడిచిన ఆ కత్తి, రక్తపు మరకలతో కూడిన ఆ పాల క్యాన్ ఇదంతా  చూస్తుంటే సినిమా అంతా రా అండ్ రస్టిక్‌గా ఉండేలా కనిపిస్తోంది.


ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. 90s వెబ్ సిరీస్‌తో సురేష్ బొబ్బిలి ఈ మధ్య ఎంతగా ట్రెండ్ అయ్యారో అందరికీ తెలిసిందే.  చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కెమెరామెన్, దర్శకుడిగానూ సత్తా చాటుతున్న గరుడవేగ అంజి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండటం విశేషం. రాకేందు మౌళి పాటలు రచించారు.


సాంకేతిక బృందం

బ్యానర్లు  : రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ స్పెక్ట్రమ్ స్టూడియోస్, సుందరకాండ మోషన్ పిక్చర్స్, కళ్యాణ్ జీ కంటెంట్ పిక్చర్స్

నిర్మాత : రిజ్వాన్, శ్రీ సాయి దీప్ చాట్ల

కథ, మాటలు, దర్శకత్వం  : కళ్యాణ్‌జీ గోగణ

సంగీతం  : సురేష్ బొబ్బిలి

కెమెరామెన్  : గరుడవేగ అంజి

ఎడిటర్  : చోటా కే ప్రసాద్

పీఆర్వో  : సాయి సతీష్

Union Home Minister Amit Shah Heaps Praises On Team Hanu-Man

 హను-మాన్ టీమ్‌పై ప్రశంసలు కురిపించిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా



క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం 'హను-మాన్', తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. రీసెంట్‌గా 50 రోజుల రన్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ వేడుకను ఘనంగా జరుపుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత కె నిరంజన్ రెడ్డికి, అన్ని ఏరియాల్లో బయ్యర్‌లకు  భారీ లాభాలను తెచ్చిపెట్టింది. కమర్షియల్ హిట్ అయిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.


భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సంప్రదాయాలను, వాటి నుంచి ఉద్భవించిన సూపర్‌హీరోలను అద్భుతంగా చూపించడంలో విజయం సాధించిన 'హను-మాన్' టీంపై తాజాగా ప్రశంసలు కురిపించారు కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా.  వారి భవిష్యత్ ప్రాజెక్ట్‌ల కోసం యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.


పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు హోంమంత్రి హైదరాబాద్‌కు వచ్చిన నేపధ్యంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా, నిర్మాత కె.నిరంజన్ రెడ్డి హైదరాబాద్‌లో అమిత్ షాను కలిశారు. హను-మాన్ బృందం అమిత్ షాకు హనుమంతుడి షీల్డ్‌ను బహుకరించింది.


అమిత్ షా ఈ సమావేశానికి సంబధించిన ఫోటోలు పంచుకున్నారు.“ఇటీవలి సూపర్‌హిట్ చిత్రం హనుమాన్ లోని ప్రతిభావంతులైన నటుడు శ్రీ తేజాసజ్జా, చిత్ర దర్శకుడు శ్రీ ప్రశాంత్ వర్మను కలవడం జరిగింది. భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సంప్రదాయాలను,  వాటి నుండి ఉద్భవించిన సూపర్ హీరోలను చిత్ర యూనిట్ అద్భుతంగా చూపించింది. హనుమాన్ టీమ్‌కి వారి భవిష్యత్ ప్రాజెక్ట్‌లకు శుభాకాంక్షలు”అని రాశారు అమిత్ షా. ఈ ఫోటోలో మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా చూడవచ్చు.


అమిత్ షా ప్రశంసలకు హను-మాన్ టీమ్ చాలా థ్రిల్ అయ్యింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆనందం వ్యక్తం చేస్తూ, “మిమ్మల్ని కలవడం ఒక గొప్ప అదృష్టం సార్ 🤗మీ మంచి మాటలు, ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయి” అన్నారు


హీరో తేజ సజ్జా ఆనందం వ్యక్తం చేస్తూ “@అమిత్‌షా సార్‌ని కలవడం మాకు గర్వకారణం. మీ మంచి మాటలకు ధన్యవాదాలు సార్ 🙏🏻😊” అని రాశారు


ఈ సినిమా త్వరలో ఓటీటీ విడుదల కానుంది. మరోవైపు, ప్రశాంత్ వర్మ హను-మాన్ సీక్వెల్ 'జై హనుమాన్' ప్రీ-ప్రొడక్షన్‌లో నిమగ్నమై వున్నారు.

Kubera New Shooting Schedule Begins In Bangkok

Dhanush, 'King' Nagarjuna, Sekhar Kammula, Sree Venkateswara Cinemas LLP,  Amigos Creations Pvt Ltd Kubera New Shooting Schedule Begins In Bangkok



The first look of Kubera in the combination of National Award-winning actor Dhanush, King Nagarjuna Akkineni, and National Award-winning director Sekhar Kammula was revealed for Maha Shivaratri to a superb response. Dhanush’s unkempt avatar surprised one and all. Suniel Narang and Puskur Ram Mohan Rao are producing the film, with the blessings of Shri Narayan Das K Narang, under their banner Sree Venkateswara Cinemas LLP (A Unit Of Asian Group), in association with Amigos Creations Pvt Ltd. Sonali Narang presents the movie.


Meanwhile, the team begins a new shooting schedule in Bangkok. Nagarjuna and a few other actors are taking part in the schedule where some talkie and action parts will be canned. The movie is being made on a grand scale and the shoot is happening in some scenic locations that nobody explored before. The makers have released a couple of working stills. While one picture shows Sekhar Kammula discussing a scene with Nagarjuna, the other picture shows the stunt team making arrangements for an action block.


Rashmika Mandanna is the female lead in the movie. This highly anticipated film is being mounted with lavish production and technical standards.


National award-winning composer Rockstar Devi Sri Prasad scores the music, while Niketh Bommi handles the cinematography. Ramakrishna Sabbani and Monika Nigotre are the production designers.


Cast: Dhanush, Nagarjuna Akkineni, Rashmika Mandana, Jim Sarbh and others


Technical Crew:

Director: Sekhar Kammula

Presents: Sonali Narang

Banner: Sree Venkateswara Cinemas LLP, Amigos Creations Pvt Ltd

Producers: Suniel Narang and Puskur Ram Mohan Rao

Music Director: Devi Sri Prasad

Director of Photography: Niketh Bommi

Production Design: Ramakrishna Sabbani, Monika Nigotre

Co-Writer: Chaithanya Pingali

PRO: Vamsi-Shekar

Marketing: Walls And Trends

Fighter Raja Movie Launched In Grand Scale

 రామ్జ్, మాయా కృష్ణన్, కృష్ణ ప్రసాద్, రన్‌వే ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం 2 'ఫైటర్ రాజా' గ్రాండ్ గా ప్రారంభం- ఫస్ట్ లుక్ లాంచ్



రామ్జ్, మాయా కృష్ణన్ ప్రధాన పాత్రలలో కృష్ణ ప్రసాద్ దర్శకత్వంలో రన్‌వే ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం 2 పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. దినేష్ యాదవ్ బొల్లెబోయిన, పుష్పక్ జైన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'ఫైటర్ రాజా' అనే క్యాచి టైటిల్ ఖరారు చేశారు. రామ్జ్, మాయా కృష్ణన్, తనికెళ్ళ భరణి ఇలా ప్రధాన తారాగణంపై గన్స్ తో డిజైన్ చేసిన ఫైటర్ రాజా ఫస్ట్ లుక్ చాలా క్రేజీగా వుంది. టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ కు 'ఓం భీమ్ బుష్' టీం హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హాజరయ్యారు.  


ఫస్ట్ లుక్ లాంచింగ్ ఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. రామ్జ్ అండ్ టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా టీం అందరికీ కూడా మంచి పేరుతీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ' తెలిపారు.


తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. ఇందులో చాలా రోజుల తర్వాత చాలా భిన్నమైన పాత్ర చేస్తున్నాను. దర్శకుడు కృష్ణ ప్రసాద్ ఈ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. సినిమా తీస్తున్నపుడు తనలో చాలా ప్రతిభ వుందని తెలుసుకున్నాను. ఈ సినిమా చాలా రియలిస్టిక్ గా వుంటుంది. యూత్ ని ఆకట్టుకునే సినిమా అవుతుంది. సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.


ప్రియదర్శి మాట్లాడుతూ.. ఈ కథ గురించి నాకు తెలుసు. చాలా మంచి కథ. సినిమాలో పనిచేసే స్టంట్ మెన్ కి మంచి ట్రిబ్యుట్ లాంటి కథ. రామ్జ్ కి ఆల్ ది బెస్ట్. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. పోస్టర్ లో తనికెళ్ళ భరణి గారిని చూసినప్పుడు శివ సినిమా గుర్తుకు వచ్చింది'' అన్నారు.


రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. రామ్జ్ ఎప్పటినుంచో పరిచయం. ఇప్పుడు ఫైటర్ రాజా రో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పోస్టర్ చాలా బావుంది. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్'' తెలిపారు.


దర్శకుడు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. నన్ను నమ్మి  నా వెంటే వున్న రామ్జ్, దినేష్ కి ధన్యవాదాలు. చాలా మంచి నటీనటులుతో చేస్తున్న సినిమా ఇది. మంచి సినిమా ఇది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది.


మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. రామ్జ్ ఇంతకుముందు పచ్చీస్ అనే సినిమా చేశాడు. ఇప్పుడు ఫైటర్ రాజాతో వస్తున్నాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి తనకు, టీంకు మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నారు.


దినేష్ యాదవ్ బొల్లెబోయిన మాట్లాడుతూ.. చాలా యంగ్ టీంతో నిజాయితీగా ఈ సినిమా తీశాం. అందరం చాలా హార్డ్ వర్క్ చేశాం. ఈ వేడుకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది’’అన్నారు.


హీరో రామ్జ్ మాట్లాడుతూ.. ప్యాషన్ డిజైనర్ గా పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాను. పచ్చీస్ నటుడిగా నా మొదటి సినిమా. కోవిడ్ కారణంగా ఓటీటీలో విడుదలైయింది. కానీ  ఫైటర్ రాజా థియేటర్స్ లో సందడి  చేస్తుంది. ఇందులో అన్ని ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ వున్నాయి. తప్పకుండా విజల్స్ పడతాయి. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూసే సినిమా. చాలా మంచి యంగ్ టీంతో పని చేశాం. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ గారు ఈ వేడుకకు వచ్చి సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా వుంది. తనికెళ్ళ భరణి గారి పని చేయడం చాలా మంచి అనుభవం. ఇందులో ఆయన లుక్ నేనే క్రియేట్ చేశాను. పుష్పక్ జైన్ ని నా జీవితంలో మర్చిపోలేను, ఆయన వలనే సినిమా మొదలైయింది. దినేష్ కూడా చాలా పాషన్ తో సినిమా చేశారు. చాలా క్యాలిటీగా సినిమా చేశాం. విక్రమ్ ఫేం మాయ మా ప్రాజెక్ట్ లో నటించడం ఆనందంగా వుంది. ఈ నెలలోనే టీజర్ లాంచ్ చేస్తున్నాం'' అని తెలిపారు.


మాయా మాట్లాడుతూ.. ఫైటర్ రాజాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. చాలా మంచి కథ ఇది. ఇందులో నేను చేసిన లక్కీ పాత్ర చాలా ప్రత్యేకంగా వుంటుంది. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది'' అన్నారు.  


తారాగణం: రామ్జ్, మాయా కృష్ణన్, తనికెళ్ల భరణి,  చక్రధర్,  శివనందు, రోషన్,  తాగుబోతు రమేష్, సత్య ప్రకాష్, కృష్ణ తేజ, శశిధర్, రాము, పవన్ రమేష్ , లక్ష్మణ్ తదితరులు


రచన, దర్శకత్వం: కృష్ణ ప్రసాద్

బ్యానర్: రన్‌వే ఫిల్మ్స్

నిర్మాతలు: దినేష్ యాదవ్ బొల్లెబోయిన, పుష్పక్ జైన్

సంగీతం: సమ్రన్ సాయి

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - శ్రీధర్ కాకిలేటి

ఎడిటర్: హరి శంకర్,అవంతి రుయా

ప్రొడక్షన్ డిజైనర్ : రోహన్ సింగ్

కొరియోగ్రఫర్: విజయ్ బిన్నీ  

యాక్షన్: పృథ్వీ

పీఆర్వో: వంశీ శేఖర్


Siva Karthikeyan AR Murugadoss Movie in second Schedule

శివకార్తికేయన్-ఏఆర్ మురుగదాస్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ రెండో కీలక షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం



శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఉత్తమ తారాగణం,టెక్నీషియన్స్ తో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది


తాజాగా యూనిట్ రెండో షెడ్యూల్ షూటింగ్ ని మొదలుపెట్టారు. ఈ కీలక షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలని చిత్రికరిస్తున్నారు


దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన పాపులర్ స్టొరీ టెల్లింగ్ స్టయిల్ లో, యునిక్ సెట్టింగ్‌తో చిత్రాన్ని రూపొందిస్తున్నారు . ఈ చిత్రం హై యాక్షన్-ప్యాక్డ్ అనుభూతిని అందిస్తుంది.


వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందజేస్తున్న హీరో శివకార్తికేయన్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్, గ్రాండియస్ట్ చిత్రం కానుంది. శివకార్తికేయన్ ఇంతకు ముందు చూసినట్లుగా కాకుండా పూర్తిగా ప్రత్యేకమైన, స్టైలిష్  అవతార్ లో కనిపిస్తారు. ట్యాలెంటెడ్ కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు


శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ్యూజిక్ కంపోజర్ రాక్‌స్టార్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అరుణ్ వెంజరమూడు ఆర్ట్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ కొరియోగ్రాఫ్ చేయనున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.

Chaitanya Rao's Sharathulu Varthisthai Censor completed and received Clean "U" certificate

 చైత‌న్య రావ్ "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి" మూవీకి సెన్సార్ ప్రశంసలు, క్లీన్ యు సర్టిఫికెట్ జారీ



చైత‌న్య రావ్, భూమి శెట్టి జంట‌గా న‌టించిన "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి" సినిమాకు సెన్సార్ ప్రశంసలు దక్కాయి. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై శ్రీలత - నాగార్జున సామ‌ల‌, శారదా - శ్రీష్ కుమార్ గుండా, విజయ - డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి"ఈ నెల 15న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి" సినిమాకు సెన్సార్ సభ్యులు క్లీ యు సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సందర్భంగా మానవీయ విలువలు ఉన్న ఒక మంచి సినిమా రూపొందించారంటూ దర్శకుడు కుమారస్వామికి ప్రశంసలు అందజేశారు. ఈ చిత్ర దర్శకుడు కుమారస్వామి కూడా సెన్సార్ బోర్డ్ సభ్యుడు అన్న విషయం తెలియకుండానే బోర్డ్ మెంబర్స్ సినిమాను చూశారు. తర్వాత తమ సభ్యుడే ఇంత గొప్ప సినిమా తీయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.


సెన్సార్ బృందం స్పందిస్తూ - తెలంగాణ సినిమా అనగానే కొన్నాళ్లుగా కనిపిస్తోన్న విపరీతమైన మద్యం సన్నివేశాలు, నిర్లక్ష్యపు ధోరణులకు భిన్నంగా "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి"లో ఒక గొప్ప మానవీయ విలువలు చూపించారు. మానవ సంబంధాలతో నిండి ఉన్న ఇలాంటి సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని, తెలంగాణ నేపథ్యంలోనే కనిపించినా.. ఒక యూనిక్ కంటెంట్ ఈ చిత్రంలో ఉంది. అని పేర్కొన్నారు.


"ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి" సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా పన్నెండు గుంజలా పెళ్లి పందిరి అనే పాట ప్రస్తుతం తెలంగాణలోని అన్ని పెళ్లి వేడుకల్లోనూ వినిపిస్తోంది. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ నుంచి ప్రశంసలు దక్కడం సినిమా విజయం పట్ల మరింత నమ్మకాన్ని పెంచుతోంది.



నటీనటులు - చైతన్య రావ్, భూమి శెట్టి, నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత తదితరులు


టెక్నికల్ టీమ్


ఆర్ట్ డైరెక్టర్ - గాంధీ నడికుడికర్

ఎడిటింగ్ - సీహెచ్ వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్

సినిమాటోగ్రఫీ - ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ - ప్రిన్స్ హెన్రీ

మ్యూజిక్ - అరుణ్ చిలువేరు, సరేష్ బొబ్బిలి (పన్నెండు గుంజల)

డైలాగ్స్ - పెద్దింటి అశోక్ కుమార్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - రాజేశ్ స్వర్ణ, సంపత్ భీమారి, అశ్వత్థామ

పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా

బ్యానర్ - స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్

ప్రొడ్యూసర్స్ - శ్రీలత, నాగార్జున సామల, శారద, శ్రీష్ కుమార్ గుండా, విజయ, డా.కృష్ణకాంత్ చిత్తజల్లు

రచన దర్శకత్వం - కుమారస్వామి (అక్షర

Top Hashtags on X in India: Rebel Star Prabhas stands No 1

 ట్విట్టర్ టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియా లిస్టులో ఏకైక హీరోగా నిలిచిన రెబెల్ స్టార్ ప్రభాస్




స్టార్ హీరోలు ఎందరున్నా తాను ప్రత్యేకమని ఎన్నో రికార్డులు, ఘనతల ద్వారా నిరూపించుకుంటున్నారు రెబెల్ స్టార్ ప్రభాస్.  రేర్ కాంబినేషన్స్, రికార్డు స్థాయి బాక్సాఫీస్ నెంబర్స్, భారీ పాన్ వరల్డ్ మూవీ లైనప్స్...ఇలా ఏ అంశంలో చూసినా రేసులో ఆయనెప్పుడూ మిగతా స్టార్స్ అందుకోలేనంత దూరంలోనే ఉంటారు. అందుకే ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్ ను దాటి పాన్ ఇండియా స్థాయికి చేరుకుని చాలాకాలమవుతోంది. ఈ క్రేజ్ తాజాగా ఎక్స్(ట్విట్టర్) టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియాలో లిస్టులోనూ కనిపించింది. ఎక్స్(ట్విట్టర్) టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియాలో లిస్టులో ఏకైక హీరోగా నిలిచారు ప్రభాస్.


ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో టాప్ 10 మోస్ట్ యూజ్డ్ హ్యాష్ ట్యాగ్స్ లో ప్రభాస్ మాత్రమే చోటు దక్కించుకున్నారు. ట్విట్టర్ ఇండియా ఈ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇది ప్రభాస్ స్టార్ డమ్ కు సోషల్ మీడియాలో కనిపించిన రిఫ్లెక్షన్ అనుకోవచ్చు. ప్రభాస్ సాధించిన ఈ క్రెడిట్ తో రెబెల్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. అభిమానుల సంతోషాలను రెట్టింపు చేసేందుకు కల్కి 2898 ఎడి, రాజా సాబ్ వంటి బిగ్ టికెట్ మూవీస్ తో త్వరలో ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ మీదకు రాబోతున్నాడు.


RC Trendsetters Clothing brand Fashion store launched by Akash Puri in Moosapet, HYD

 నగరంలోని మూసపెట్ లో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ఫ్యాషన్ స్టోర్ ను ప్రారంభించిన యంగ్ హీరో ఆకాష్ పూరి



హైదరాబాద్: యంగ్ హీరో ఆకాష్ పూరి బ్రాండ్ అంబాసిడర్ ఉన్న  ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్ ఫ్యాషన్ స్టోర్ ను ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ వ్యవస్థాపకులు రమేష్, రోమన్ తో కలిసి ఆకాష్ పూరి ప్రారంభించారు. ఈ స్టోర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్ గా పేరు తో అందుబాటులో ఉన్నాయి. ఈ క్లాతింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం హ్యాపీగా ఉంది అని ఆకాష్ పూరి అన్నారు ఫ్యాషన్ రంగంలో హైదరాబాద్ ముందుంది ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ స్టోర్ ఫ్యాషన్ ప్రియులను ఎంతో ఆకట్టుకుటాయి. యూత్ ను ట్రెండ్ సెట్టర్స్ చెసేవిధంగా ఇక్కడ డిజైన్లు ఉన్నాయి అని తెలిపారు.


ఆకాష్ పూరి - నేను ఈ బ్రాండింగ్ కు ప్రచారకర్తగా చేయడం కరెక్టేనా అని ఆలోచించాను. ఎందుకంటే నేను చాలా క్యాజువల్ డ్రెస్ లో బయటకు వెళ్తుంటాను. వీళ్లు అనేక రకాల మెన్స్ వేర్ బ్రాండ్స్ నాకు చూపించారు. అయితే క్లోతింగ్ రంగంలో వీళ్ల ప్లానింగ్, లక్ష్యం గురించి తెలుసుకున్న తర్వాత ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కావడం హ్యాపీగా ఉంది.



Vey Daruvey Pre Release Event Held Grandly

మార్చి 15న రిలీజ్ అవుతోన్న ‘వెయ్ దరువెయ్’ సినిమా సాయిరామ్ శంకర్‌కి పెద్ద మాస్ హిట్ కావాలని కోరుకుంటున్నాను  - పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి



సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. మార్చి 15న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు...ఈ కార్యక్రమంలో బిగ్ టికెట్‌ను పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, దర్శకుడు త్రినాథరావు నక్కిన లాంచ్ చేశారు...


ఎడిటర్ ఉద్ధవ్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ నవీన్ రెడ్డిగారు ఈ సినిమా కోసం ముందుగానే పక్కా ప్లానింగ్ సిద్ధం చేసుకున్నారు. అందుకనే నాకు ఎక్కువ పని పడలేదు. ఎక్కడా లెంగ్త్ ఎక్కువ కాకుండా, రీషూట్స్ వంటివి చేయకుండా అన్నీ ప్రణాళిక ప్రకారం చేసుకున్నారు. అదే ఈ సినిమాకు సక్సెస్. మంచి కథ కుదిరింది. సాయిరామ్ శంకర్ నాకు మంచి స్నేహితుడు. తను మంచి టాలెంటెడ్. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుంది’’ అన్నారు.


ఎడిటర్ ఉద్ధవ్ మాట్లాడుతూ ‘‘నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ దేవరాజ్‌గారికి, దర్శకుడు నవీన్ గారికి థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


సత్యం రాజేష్ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో సాయిరామ్ శంకర్ ఫ్రెండ్‌గా నటించాను. భీమ్స్ సిసిరోలియో సంగీతం సూపర్బ్ గా ఉంది. నిర్మాత, దర్శకులకు మంచి సక్సెస్ కావాలి’’ అన్నారు.


రైటర్ బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ ‘‘పూరి ఎంత ఎనర్జిటిక్ గా ఉంటారో అంతే ఎనర్జిటిక్ గా సాయిరామ్ ఉంటాడంటూ నాకు మ్యూజిక్ డైరెక్టర్ చక్రిగారు సాయిరామ్ శంకర్ గురించి చెప్పారు. ఓ సందర్భంలో తనతో సిినిమా చేయాలనుందంటూ కూడా పూరిగారికి చెప్పాను. సాయిరామ్ కి కమిట్ మెంట్, డిసిప్లెయిన్ ఉన్న యాక్టర్. తనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నవీన్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. అయితే తను మంచి టాలెంటెడ్ అని బెక్కెంగారు చెప్పారు. అలాగే భీమ్స్ గారు ఆయుధం సినిమా సమయం నుంచి నాకు పరిచయం. ఎన్.శంకర్ గారు పరిచయం చేశారు. అదే ఏడాది నేను వర్క్ చేసిన సత్యం సినిమా రిలీజైంది. ఆ సినిమా సమయంలో సత్యం రాజేష్, భాస్కరభట్ల రవికుమార్ పరిచయం అయ్యారు. నన్ను, సత్యం రాజేష్ ను సూర్య కిరణ్ గారు పరిచయం చేశారు. అలా మా జర్నీ ఇక్కడి వరకు వచ్చింది. వెయ్ దరువెయ్ సినిమా విషయానికి వస్తే.. సినిమా పెద్ద సక్సెస్ సాధించి నిర్మాతకు మంచి లాభాలను తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


ప్రొడ్యూసర్ బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు నవీన్ ఈ మూవీ గురించి చెప్పారు. సాయిరామ్ శంకర్ తో సినిమా చేస్తున్నానని చెప్పాను. తను డిస్ట్రిబ్యూటర్ గా నాకు పరిచయం. సినిమాలపై మంచి జడ్జిమెంట్ ఉంది. ఇప్పుడు వెయ్ దరువెయ్ సినిమాతో దర్శకుడిగా మారి పక్కా ప్లానింగ్ తో సినిమా చేశారు. నిర్మాత దేవరాజ్ గారికి అభినందనలు. సాయిరామ్ శంకర్ పట్టుదలతో చేసిన ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ ‘‘వెయ్ దరువెయ్ సినిమాతో నాకు అవకాశం ఇచ్చిన నవీన్ రెడ్డిగారికి థాంక్స్. చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనే నాకు అండగా నిలబడ్డారు. ట్రైలర్ చూసినప్పుడు రెగ్యులర్ సినిమాలాగా అందరికీ అనిపిస్తుంది. సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు మనకు మన బంధువులు అందరూ గుర్తుకొస్తారు. మన చుట్టూ ఉన్నవారితో బాగుండాలని భావిస్తాం. మంచి సామాజిక దృక్పథంతో ఎవరూ టచ్ చేయని పాయింట్ తో సినిమాను తెరకెక్కించారు. సాయిరామ్ శంకర్ గారు మంచి మనసున్న మనిషి. ఆయన హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 15న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు.


నిర్మాత దేవరాజ్ పోతూరు మాట్లాడుతూ ‘‘భీమ్స్‌గారితో చాలా రోజులు ఈ సినిమా కోసం వర్క్ చేశారు. చక్కటి మ్యూజిక్ అందించారు. అలాగే ఎడిటర్ ఉద్ధవ్ గారికి, కాసర్ల శ్యామ్, భాస్కరభట్ల సహా టీమ్ కు థాంక్స్. సాయిరామ్ గారు ఈ మూవీ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. డౌన్ టు వర్త్ పర్సన్. ప్రీ ప్రొడక్షన్ నుంచి మాతోనే ఉన్నారు. నిర్మాతగా నాకు ‘వెయ్ దరువెయ్’ రెండో చిత్రం. మార్చి 15న రిలీజ్ అవుతుంది. కచ్చితంగా సినిమాను చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


చిత్ర దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా నిర్మాత దేవరాజ్ గారు చాలా సపోర్ట్ చేశారు. 34 రోజుల్లోనే సినిమా షూటింగ్ ను పూర్తి చేశాం. సాయిరామ్ గారు లేకపోతే ఈ మూవీ లేదు. భీమ్స్ గారు చాలా మంచి ఫ్రెండ్. ఒక్కో పాటకు మూడు నాలుగు ట్యూన్స్ ఇచ్చారు. ధమాకాను మించి రీరికార్డింగ్ ఇచ్చారు. మా హీరోయిన్ చాలా సపోర్ట్ అందించారు. సత్యం రాజేష్, సునీల్, రఘన్న సహా అందరూ సపోర్ట్ చేశారు. మూడు వందలకు పైగా థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.


హీరోయిన్ యషా శివకుమార్ మాట్లాడుతూ ‘‘తెలుగులో ఇది నా తొలి సినిమా. వెయ్ దరువెయ్ సినిమాలో మంచి రోల్ చేశాను. అందరూ చాలా సపోర్ట్ చేశారు. తప్పకుండా సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. మార్చి 15న సినిమా రిలీజ్ అవుతుంది’’ అన్నారు.


త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘‘తెలుగులో నాకు ఇష్టమైన దర్శకుడు పూరిగారు. ఆయన సోదరుడు సాయిరామ్ శంకర్‌గారి గురించి చెప్పాలంటే తన 143 మూవీ చూసి ఎనర్జిటిక్ హీరో అనుకున్నాను. బంపర్ ఆఫర్ సినిమా షూటింగ్ సమయంలో లొకేషన్‌కి వెళ్లి కలిశాను. తనతో అనుబంధం అప్పటి నుంచి ఉంది. నవీన్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్ గా పరిచయం. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. తనకు సినిమాల గురించి బాగా తెలుసు. తను చేసిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


ఆకాష్ పూరి మాట్లాడుతూ ‘‘వెయ్ దరువెయ్’ టైటిల్ పెట్టి సగం హిట్ కొట్టేశారు డైరెక్టర్ నవీన్. ఈ సినిమా ఫస్ట్ నుంచి పాజిటివ్ బజ్ ఇస్తుంది. సినిమా చూడాలని ఎగ్జయిటెడ్ గా ఉన్నాను. భీమ్స్ గారు పక్కాగా ఈ సిినిమాకు సరిపోయే మ్యూజిక్ డైరెక్టర్ అని నా అభిప్రాయం. సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. రీరికార్డింగ్ కూడా అదరగొట్టేసుంటారు. మా బాబాయ్ సాయిరామ్ గురించి చెప్పాలంటే, తనలోని ఎనర్జీ ఎక్కడా చూడలేదు. బంపర్ ఆఫర్ లో ఎనర్జీని చక్కగా చూపించారు. దానికి డబుల్ ఎనర్జీని ఈ సినిమాలో చూస్తారు. సినిమా చాలా పెద్ద హిట్ కావాలి. దేవరాజ్ గారికి ఇది బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ కావాలి’’ అన్నారు.


హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు నవీన్ కథ చెప్పగానే నచ్చింది. నాకు కమ్ బ్యాక్ మూవీ అవుతుందనిపించింది. నా బాడీ లాంగ్వేజ్‌కి సూట్ అవుతూనే మంచి పాయింట్ తో కథ రాసుకున్నారనిపించింది. అందుకనే చేయటానికి ఓకే చెప్పేశాను. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించిన దేవరాజ్‌గారికి థాంక్స్. భీమ్స్ గారు మంచి సాంగ్స్ తో పాటు అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, ఉద్ధవ్ లతో మంచి అనుబంధం ఉంది. నాకోసం ఎంటైర్ టీమ్ ఎంతో సపోర్ట్ చేసింది. చాలా మంచి టీమ్ వర్క్ చేసింది. కామెడీతో పాటు మంచి ఎమోషన్, ఆలోచనతో తెరకెక్కిన సినిమా ఇది. మార్చి 15న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.


ముఖ్య అతిథి పీపుల్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో సాయిరామ్ శంకర్‌గారు ఫికర్ మత్ కరో అనే డైలాగ్ చెబుతుంటారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ గారు తగ్గేదే లే అని ఎలా అందరితో అనిపించారో.. ఈ వెయ్ దరువెయ్ సినిమాలో సాయిరామ్ అందరినోట ఫికర్ మత్ కరోఅనిపిస్తారని, సినిమా పెద్ద హిట్ అయ్యి, సాయిరామ్‌కి పెద్ద మాస్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. దర్శకుడు నవీన్ చాలా మంచి టైటిల్ పెట్టారు. సినిమాకు దర్శకుడు తండ్రిలాంటి వ్యక్తి. నవీన్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాను 35 రోజుల్లో పూర్తి చేయటం గొప్ప విషయం. నిర్మాత దేవరాజ్ బాగుండాలనే ఉద్దేశంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ బాగా చేసి తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేసిన నవీన్ గారికి థాంక్స్. నిర్మాత దేవరాజ్ పోతూరుగారికి ఆల్ ది బెస్ట్. కె.జి.యఫ్ తో యష్ ఎంత పెద్ద స్టార్ అయ్యారో, ఈ సినిమాతో హీరోయిన్ యష పెద్ద స్టార్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు భీమ్స్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. తను ప్రతీ సినిమాకు దుమ్ము రేపుతున్నాడు. తనకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, మంచి వ్యక్తి పూరి జగన్నాథ్ అనే పేరుంది. కొత్త హీరోని పూరి చేతిలో పెడితే చాలు అనే పేరు తెచ్చుకున్నారు. ఆయన తమ్ముడైన సాయిరామ్ శంకర్ నటించిన వెయ్ దరువెయ్ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. నేటి రాజకీయ నాయకులు డబ్బులు పంచి ఓట్లు కొంటున్నారు. అలాంటి వారిపై వెయ్ దరువెయ్ అంటూ ఈ సినిమా చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారిపై వెయ్ దరువెయ్ అని దర్శకుడు అన్నారు. సమాజంలో చైతన్యం నింపేలా మంచి మెసేజ్‌తో సినిమా చేసిన టీమ్‌కి థాంక్స్’’ అన్నారు.