Latest Post

Big Brother Releasing on May 24 on Grand Scale

 "శివ కంఠంనేని "బిగ్ బ్రదర్"

బ్లాక్ బస్టర్ హిట్ కావాలి"

-ప్రముఖ నటులు మురళీమోహన్



"చిన్న సినిమాలదే 

పరిశ్రమ మనుగడలో పెద్ద పాత్ర"

-నిర్మాతల మండలి అధ్యక్షులు

కె.ఎల్.దామోదర ప్రసాద్


రెండు రాష్ట్రాల్లో "బిగ్ బ్రదర్" 

ఈనెల 24 భారీ విడుదల!!


"అక్కడొకడుంటాడు, మధురపూడి గ్రామం అనే నేను, రాఘవరెడ్డి" చిత్రాలతో రివార్డులు, అవార్డులు దండిగా పొందిన బహుముఖ ప్రతిభాశాలి శివ కంఠంనేని టైటిల్ పాత్రలో దర్శక సంచలనం గోసంగి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన "బిగ్ బ్రదర్" ఈనెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి-రిలీజ్ వేడుక నిర్వహించి, చిత్ర విజయంపై పూర్తి నమ్మకం వ్యక్తం చేసింది!!


ఈ వేడుకలో హీరో శివ కంఠంనేని, నిర్మాత ఆర్.వెంకటేశ్వరరావు, దర్శకులు గోసంగి సుబ్బారావు, చిత్ర సమర్పకులు జి.రాంబాబు యాదవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాసరావు, ఈ చిత్రంలో నటించిన గుండు సుదర్శన్, రాజేంద్ర, ప్రముఖ నటులు మురళీమోహన్, అశోక్ కుమార్, నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు పాల్గొన్నారు!!


తెలుగులో పలు చిత్రాలు రూపొందించి భోజపురిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న గోసంగి సుబ్బారావు రీ-ఎంట్రీ ఇస్తూ తెరకెక్కించిన "బిగ్ బ్రదర్"లో సక్సెస్ కళ పుష్కలంగా కనబడుతోందని, హీరో శివ కంఠంనేని ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మురళీమోహన్ పేర్కొన్నారు. "బిగ్ బ్రదర్" లాంటి చిన్న సినిమాల విజయమే చిత్ర పరిశ్రమకు శ్రీరామరక్ష అని దామోదర్ ప్రసాద్, అశోక్ కుమార్ అన్నారు. తను నటించే ప్రతి చిత్రంలో అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో నటుడిగా అద్భుతంగా రాణిస్తున్న శివ కంఠంనేని "బిగ్ బ్రదర్"తో మరింత గుర్తింపు పొందాలని, "బింబిసార" చిత్రానికి ఫైట్స్ డిజైన్ చేసిన రామకృష్ణ "బిగ్ బ్రదర్"కి రూపకల్పన చేసిన పోరాటాలు ప్రత్యేక ఆకర్షణ అని ప్రభు పేర్కొన్నారు!!


"ప్లానింగ్ కి పెట్టింది పేరైన గోసంగి సుబ్బారావు తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ తెరకెక్కించిన "బిగ్ బ్రదర్"లో టైటిల్ రోల్ ప్లే చేయడం గర్వంగా ఉందని" హీరో శివ కంఠంనేని అన్నారు. "యాక్షన్ ఎంటర్టైనర్స్ ను ఇష్టపడేవారిని బిగ్ బ్రదర్ చక్కగా అలరిస్తుందని, ఈనెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో "బిగ్ బ్రదర్"ను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నామని" నిర్మాత ఆర్.వెంకటేశ్వరరావు, సమర్పకులు జి.రాంబాబు యాదవ్ తెలిపారు. ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల విశ్వ కార్తికేయ, గుండు సుదర్శన్, రాజేంద్ర సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర దర్శకులు గోసంగి సుబ్బారావు మాట్లాడుతూ... "అనుకోకుండా భోజపురి పరిశ్రమకు వెళ్లి, ఇప్పటికి 15 సినిమాలు చేశాను. అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. చాలా రోజుల తర్వాత తెలుగులో "బిగ్ బ్రదర్"తో రీ ఎంట్రీ ఇస్తుండడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఇకపై వరసగా తెలుగులో పాన్ ఇండియా సినిమాలు చేస్తాను" అన్నారు!!


లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై జి.రాంబాబు యాదవ్ సమర్పణలో కె. శివశంకర్ రావు - ఆర్.వెంకటేశ్వరరావు "బిగ్ బ్రదర్" చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఘంటా శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో శివ కంఠంనేని సరసన ప్రియా హెగ్డే నటించగా... శ్రీ సూర్య, ప్రీతి శుక్లా ఇంకో జంటగా నటించారు!!


గౌతంరాజు, గుండు సుదర్శన్, రాజేందర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్-అప్పాజీ, డాన్స్: రాజు పైడి, స్టంట్స్: రామకృష్ణ, ఎడిటింగ్: సంతోష్, కెమెరా: ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు, సమర్పణ: జి.రాంబాబు యాదవ్, నిర్మాతలు: కె.శివశంకర్ రావు - ఆర్.వెంకటేశ్వరరావు, రచన - దర్శకత్వం: గోసంగి సుబ్బారావు!!

Welcome Back Rocking Star Manoj Manchu: The Black Sword Rises in the World of MIRAI

 మిరాయ్ మళ్ళీ వెండితెరపైకి రావడం చాలా ఆనందంగా వుంది. 'బ్లాక్ స్వోర్డ్' జస్ట్ గ్లింప్స్ మాత్రమే. మిరాయ్ కథ అదిరిపోతుంది. ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన కథ: మిరాయ్- బ్లాక్ స్వోర్డ్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో రాకింగ్ స్టార్ మనోజ్ మంచు



వెల్ కమ్ బ్యాక్ రాకింగ్ స్టార్ మనోజ్ మంచు: ది బ్లాక్ స్వోర్డ్ రైసెస్ ఇన్ వరల్డ్ ఆఫ్ మిరాయ్


రాకింగ్ స్టార్ మనోజ్ మంచు ఎనిమిదేళ్ల విరామం తర్వాత వెండితెరపై మ్యాసీవ్ గా కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'మిరాయ్‌'లో తన లేటెస్ట్ అవతార్‌తో సూపర్ హీరో యూనివర్స్ ని 'ది బ్లాక్ స్వోర్డ్'గా రిడిఫైన్ చేశారు. తేజ సజ్జా ది సూపర్ యోధగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై TG విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు.


మనోజ్ మంచు పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ రివీల్‌లో, మేకర్స్ మంచు మనోజ్ ది బ్లాక్ స్వోర్డ్‌గా ఫస్ట్ లుక్ గ్లింప్‌ను లాంచ్ చేశారు. ఈ గ్లింప్స్ లో మంచు మనోజ్‌ను మునుపెన్నడూ చూడని ఇంటెన్స్, పవర్ ఫుల్ అవతార్‌లో కనిపించారు, ఒక స్ట్రెంజ్ వెపన్ తో ఊచకోత కోయడం నెక్స్ట్ లెవల్ లో వుంది. తన కమాండింగ్ ప్రజెన్స్, అతని పాత్ర బలం, బ్లాక్ స్వోర్డ్‌గా కథనంలో ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.  పోనీటైల్, స్టైలిష్ గడ్డంతో పొడవాటి జుట్టుతో, మనోజ్ పరిచయ సన్నివేశంలో లాంగ్ కోట్‌లో డెడ్లీగా, అదే సమయంలో అల్ట్రా-ఫ్యాషన్‌గా కనిపించారు. ఆ తర్వాత టీ-షర్ట్‌తో బ్లేజర్‌లో మరొక యాక్షన్-ప్యాక్డ్ సీక్వెన్స్ వచ్చింది. ఈ పాత్ర చిత్రానికి కొత్త కోణాన్ని జోడించి, నటుడిగా అతని వెర్సటాలిటీ, అంకితభావాన్ని చూపించింది. అతని పాత్ర యొక్క ప్రయాణం ప్రేక్షకులని లీనం చేస్తూ, సినిమా మొత్తం ప్రభావాన్ని పెంచుతుంది.


‘‘ఇంతటి పవర్‌ఫుల్, ఇంట్రస్టింగ్ క్యారెక్టర్‌తో మళ్లీ ఇండస్ట్రీకి రావడం చాలెంజింగ్‌గానూ, ఎగ్జైటింగ్‌గానూ ఉంది’’ అని రాకింగ్ స్టార్ మనోజ్ మంచు అన్నారు. "బ్లాక్ స్వోర్డ్  అనేది ప్రతి హీరోకి ఉండాల్సిన బలాన్ని ప్రతిధ్వనించే పాత్ర. నా కమ్ బ్యాక్ కోసం ఓపికగా ఎదురుచూస్తున్న నా అభిమానులతో ఈ ప్రయాణాన్ని పంచుకోవడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను." అన్నారు


మిరాయ్  విజువల్ గా అద్భుతమైన, నెరటివ్ -రిచ్ వరల్డ్ నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకర్షించే హీరోయిక్స్, ఆధునిక కథా కథనాలను మిళితం చేస్తుందని హామీ ఇచ్చింది. ఇది అశోకుని 9 పుస్తకాల రహస్యాలను అన్వేషిస్తుంది. చరిత్ర, పురాణాలతో కూడిన  ఒక ఎపిక్ కథగా వుండబోతుంది.


ది బ్లాక్ స్వోర్డ్  లాంచ్ ఈవెంట్ లో రాకింగ్ స్టార్ మనోజ్ మంచు మాట్లాడుతూ.. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ వెడితెరకి వస్తున్నాను. సోషల్ మీడియా ద్వారా, ఏవైనా వేడుకల ద్వారా ఇన్నాళ్ళు ఎదో రూపంలో మీకు దగ్గరగా ఉంటున్నాను. కానీ సినిమా అనేదే ప్రధానం. సినిమా అనేదే అమ్మ. మీరంతా ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే అది సినిమా వల్లే. ఎప్పుడూ ఏదైనా కొత్తగా డిఫరెంట్ గా చేయాలనేది నా ప్రయత్నం. కేవలం డబ్బు కోసమే కాకుండా కథ నచ్చి పాత్ర నచ్చిన సినిమాలనే వెతుక్కుంటూ వెళ్లాను. మళ్ళీ సినిమాలు చేయాలనుకున్నప్పుడు చాలా కథలు విన్నాను. ఓపికగా ఎదురుచూశాను. ఇలాంటి సమయంలో దర్శకుడు కార్తిక్ నా జీవితంలోకి వచ్చారు. ముందుగా తేజ సజ్జాకి థాంక్స్ చెప్పాలి . 'ఈ సినిమాలో నివ్వు నేను చేయాలి అన్న. కథ వినాలి' అని చెప్పడం జరిగింది. ఇది అదిరిపోయే స్క్రిప్ట్. ఇది రెండు పార్టులుగా వస్తుంది. తొలి పార్ట్ ఏప్రిల్ 18,2025 లో వస్తుంది. అశోకుని తొమ్మిది రహస్య పుస్తకాల గురించిన అద్భుతమైన కథ ఇది. ప్రతిఒక్కరూ ఈ కథ తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. దర్శకుడు అద్భుతంగా తీశాడు, మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు అందరూ ఇరగదీశారు. నిర్మాతలు విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, మిరాయ్ టీం అందరికీ ధన్యవాదాలు. ఇది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. మిత్రుడు తారక్ పుట్టినరోజు శుభాకాంక్షలు. నా బర్త్ డే సందర్భంగా భక్త కన్నప్ప టీం కూడా టీజర్ లాంచ్ చేస్తున్నారు. అన్నకి, టీంకి ఆల్ ది బెస్ట్. సిరివెన్నెల గారి పుట్టిన రోజు కూడా ఈ రోజే. ఆయన్ని చాలా మిస్ అవుతున్నాను. ఆయన చల్లని దీవెనలు మాపై వుండాలని కోరుకుంటున్నాను. అందరికీ శివుని ఆశీస్సులు వుండాలి. అందరికీ ధన్యవాదాలు. వందేమాతరం.' అన్నారు


దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ.. సినిమాల గురించి తెలుసుకుంటున్న రోజుల్లో ఎక్కువగా మనోజ్ అన్న సినిమాలే చూశాను.  మిరాయ్ లో మనోజ్ అన్న భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే మనోజ్ అన్న. వెల్ కమ్ బ్యాక్ టు సినిమా' అన్నారు.


ఇప్పటికే విడుదలైన  సూపర్ హీరో తేజ సజ్జ గ్లింప్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు రాకింగ్ స్టార్ మనోజ్ మంచు అతని పుట్టినరోజున వంతు వచ్చింది. అతను కేవలం కమ్ బ్యాక్ మాత్రమే కాదు; తెలుగు చలనచిత్ర పరిశ్రమ, బౌండరీలని దాటి ప్రతిధ్వనించే స్టేట్మెంట్.


ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన రితికా నాయక్ కథానాయిక. డైలాగ్స్ అందిస్తున్న మణిబాబు కరణంతో కలసి కార్తీక్ ఘట్టమనేని స్క్రీన్ ప్లే రాశారు. గౌర హర సంగీత దర్శకుడు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర తంగాల కాగా, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల. కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ కాగా, సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.


మిరాయ్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ,  మలయాళం భాషలలో ఏప్రిల్ 18న వేసవిలో 2D, 3D వెర్షన్లలో విడుదల కానుంది.


సాంకేతిక సిబ్బంది:

దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని

నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి

సంగీతం: గౌర హర

ఆర్ట్ డైరెక్టర్: శ్రీ నాగేంద్ర తంగాల

రైటర్: మణిబాబు కరణం

పీఆర్వో: వంశీ-శేఖర్


Man of Masses NTR NTRNeel Movie shoot begins in August 2024

 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌, బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కాంబినేష‌న్‌లో భారీ యాక్ష‌న్ మూవీ ‘ఎన్టీఆర్ నీల్‌’ ... ఆగ‌స్ట్ నుంచి షూటింగ్ ప్రారంభం



ప్ర‌పంచ వ్యాప్తంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు ఉండే క్రేజ్, ఫ్యాన్ బేస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అంచ‌నాల‌కు అనుగుణంగానే తార‌క్ భారీ, క్రేజీ సినిమాల‌ను లైన‌ప్ చేస్తున్నారు. అందులో భాగంగా కె.జి.య‌ఫ్‌, స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన‌ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు. ‘ఎన్టీఆర్ నీల్’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడో వ‌చ్చేసింది. దీనిపై ఫ్యాన్స్ స‌హా అంద‌రిలోనూ భారీ అంచ‌నాలున్నాయి.

 

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా  మేక‌ర్స్ ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్‌ను ఆగ‌స్ట్ 2024 నుంచి ప్రారంభించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తార‌క్ బ‌ర్త్ డే రోజున ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్‌నిస్తూ మేక‌ర్స్ ఇచ్చిన ఈ అప్‌డేట్ అంద‌రికీ థ్రిల్లింగ్‌గా అనిపించింది. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను ఫైన‌ల్ చేస్తున్నారు. అభిమానులు, సినీ ప్రేమికులు అంచ‌నాల‌ను మించేలా సినిమాను రూపొందించ‌నున్నారు.


ఎన్టీఆర్‌కున్న మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆన్ స్క్రీన్‌పై ప్రెజంట్ చేస్తూ యూనిక్ మాస్ క్రేజ్ క్రియేట్ చేసి దాన్ని మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రాబోతున్న ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ సినీ ఇండ‌స్ట్రీలో స‌రికొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తుంద‌ని అభిమానులు, ప్రేక్ష‌కులు భావిస్తున్నారు. దీంతో సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి.


ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై ఈ సినిమా రూపొంద‌నుంది. కె.జి.య‌ఫ్ సినిమాకు ధీటుగా భారీ స్కేల్‌తో అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా సినిమాను తెర‌కెక్కించ‌టానికి ప్లానింగ్ జ‌రుగుతోంది. ఎన్టీఆర్ స్టార్ ప‌వ‌ర్‌, ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ విజ‌న‌రీతో రూపొంద‌నున్న ఎన్టీఆర్‌నీల్ మూవీ ఇండియ‌న్ సినిమాలోనే స‌రికొత్త మైల్ స్టోన్‌ను క్రియేట్ చేస్తుంద‌న‌టంలో సందేహం లేదు. ఆగ‌స్ట్ నెల‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. అంటే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. దీంతో సినిమా ఎలా ఉండ‌బోతుందో చూడాల‌నే కుతూహ‌లం  అభిమానులతో పాటు అంద‌రిలోనూ పెరిగిపోతుంది.


ఎన్టీఆర్ ప్ర‌స్తుతం దేవ‌ర‌, వార్ 2 సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టుల‌ను పూర్తి చేసుకున్న త‌ర్వాత ఆయ‌న ప్ర‌శాంత్ నీల్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.


Honoring the Legacy of Renowned Producer and Film Journalist BA Raju on His 3rd Death Anniversary

 ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి.ఎ.రాజు 3వ వ‌ర్ధంతి 



బి.ఎ.రాజు...సినీ జర్నలిస్టుగా, పి ఆర్ ఓ గా, పత్రిక..వెబ్సైట్ అధినేతగా,నిర్మాతగా త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న వ్య‌క్తి. తెలుగు సినీ పరిశ్రమలో 40 ఏళ్ళ పాటు నెంబర్ వన్ స్థానంలో చ‌క్రం తిప్ప‌టం ఆయ‌న‌కే సాధ్యమైంది. సూప‌ర్‌స్టార్ కృష్ణ నుంచి అందరి అగ్ర హీరోల‌తో ప‌ని చేసిన అనుభ‌వం ఆయ‌నకే సొంతం. అంద‌రినీ క‌లుపుకునిపోతూ వివాదాల‌కు దూరంగా ఉంటూ అజాత శ‌త్రువ‌గా త‌న‌దైన మార్క్ క్రియేట్ చేశారు బి.ఎ.రాజు. 


సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలను చూసే  పి ఆర్ ఓ గా సినీ కేరీర్ ని ఆరంభించిన  బి.ఏ.రాజు ఆ తరువాత ఆయన ప్రోత్సహంతోనే సినీ పాత్రికేయుడిగా రాణించారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని, వంటి దిన వార పత్రికలలో వివిధ హోదాలలో పనిచేసిన పిమ్మట తన సతీమణి బి జయ సహచర్యంతో 1994 లో సూపర్ హిట్ వార పత్రిక స్థాపించి, తెలుగు సినీ వార్తాపత్రికలలో సంచలనం సృష్టించారు. ఆయన మరణం వరకు ఒక్క సంచిక మిస్సవకుండా  27 సంవత్సరాలపాటు పత్రికను దిగ్విజయంగా నిర్వహించారు. అంతే కాకుండా క్రేజీ వరల్డ్ అనే మరో మ్యాగజైన్‌ను కూడా ద‌శాబ్ద‌కాలం పాటు స‌క్సెస్‌ఫుల్‌గా న‌డిపిన ఘ‌న‌త ఆయ‌న‌కే సొంతం. కేవలం సినీ జర్నలిస్టుగానే కాకుండా అగ్ర దర్శకులకు, హీరోలకు, హీరోయిన్లకు గైడ్ లైన్స్ ఇస్తూ వారి సినీ కెరీర్ కి మార్గదర్శకుడిగా నిలిచారు. సుమారు 1500 చిత్రాలకు పైగా పబ్లిసిటీ ఇంఛార్జిగా పని చేసిన బి.ఎ.రాజు ఆయా చిత్రాల విజయాలకు దోహదపడ్డారు. చిత్ర పరిశ్రమలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పర్చుకున్న అజాత శత్రువు బి.ఏ.రాజు. తెలుగు సినీ రంగం హైదరాబాద్ బదిలీ కావడంతో 2001 లో సూపర్ హిట్ అడ్మిస్ట్రేషన్ ఆఫీస్ కూడా హైదరాబాద్ కు షిఫ్ట్ చేసారు. ఈ ఏడాదే అయన నిర్మాతగా, ఆయన భార్య బి జయ దర్శకురాలిగా 'ప్రేమలో పావని కళ్యాణ్' అనే చిత్రంతో సూప‌ర్‌హిట్ ఫ్రెండ్స్‌ బ్యానర్ మీద నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, సవాల్, ఆర్‌.జె.సినిమాస్ బ్యాన‌ర్‌పై లవ్లీ, వైశాఖం వంటి విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. రాజు గారు ప్రారంభించిన ఇండస్ట్రీ హిట్ వెబ్ సైట్ ద్వారా, 6.5 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ కలిగిన ఎంతో పాపులర్ అయిన ఆయన (ట్విట్టర్) ఎక్స్ అకౌంట్ ద్వారా పరిశ్రమకు సంబంధించిన వార్తా విశేషాలు ఎప్పటికప్పుడు ఆయన బృందం, BA Raju's Team ద్వారా అందిస్తున్నారు. 



చిత్ర పరిశ్రమ ప్రముఖులందరితో అత్యంత  సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ... ముఖ్యంగా ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు లతో మంచి అనుబంధం ఉండేది. ఆయన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేసారు. సినీ పాత్రికేయులకు ఈ కష్టం వచ్చినా నేనున్నాని, ఆర్ధిక, హార్దిక భరోసా ఇచ్చేవారు. ఏ దర్శకుడు ఏ  హీరోతో ఎన్ని సినిమాలు నిర్మించాడో? బ్యానర్ పేరు, విడుదల తేదీ ఆ మూవీ ఎన్ని రోజు ఈ సెంటర్లలో ఆడిందో వంటి వివరాలను తడుముకోకుండా టక్కున చెప్పేవారు. అంతటి సినిమా పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు. 24 గంటలు సినిమా గురించే ఆలోచించే బి.ఏ.రాజు మన మధ్యన లేకపోవడం బాధాకరం. మే 21న ఆయ‌న 3వ వ‌ర్ధంతి. ఈ సంద‌ర్భంగా ఏ లోకాన వున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని  నివాళులు అర్పిస్తున్నాం.


"Devara" first single "Fear Song" by Anirudh Ravichander is out now

 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ రవిచందర్ సంగీత సారథ్యంలో తొలి పాటగా ‘ఫియర్ సాంగ్’విడుదల



మాన్‌ ఆఫ్‌ మాసెస్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.  ప్రపంచస్థాయిలో బజ్‌ క్రియేట్‌ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండ‌గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్ కీల‌క పాత్ర‌లో మెప్పించ‌నున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతోంది దేవర. ఫస్ట్ పార్టు షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. 


మే 20న ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘దేవర’ చిత్రం నుంచి తొలి పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ‘ఫియ‌ర్ సాంగ్‌’ అంటూ రిలీజైన ఈ పాట‌ను స‌ర‌స్వ‌తీపుత్ర రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాశారు. పాట‌లో లైన్స్ ఎన్టీఆర్ పోషించిన ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లోని గ‌ర్జ‌న‌ను తెలియ‌జేస్తున్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద‌ర్ సంగీత సార‌థ్యం వ‌హించ‌ట‌మే కాకుండా పాట‌ను అద్భుతంగా పాడారు. దేవ‌ర‌-లార్డ్ ఆఫ్ ఫియ‌ర్‌గా పాట నెక్ట్స్ లెవ‌ల్ ఎలివేష‌న్ ఇస్తోంది. అలాగే పాట‌లోని ఎన్టీఆర్ గ్లింప్స్ అభిమానుల‌కు, సినీ ప్రేక్ష‌కుల‌కు మంచి కిక్‌ను ఇస్తున్నాయి. 


తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో భాష‌ల్లోనూ ఈ పాట విడుద‌లవ‌గా అన్నీ లాంగ్వేజెస్‌లో పాట విన‌టానికి అద్భుతంగా ఉంది. అనిరుద్ ర‌విచంద‌ర్ తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో పాట‌ను పాడారు. క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సంతోష్ వెంకీ  పాట‌ను ఆల‌పించారు. తార‌క్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌లైన దేవ‌ర ఫియ‌ర్ సాంగ్ మంచి ట్రీట్‌లా అంద‌రినీ అల‌రిస్తోంది. పాట‌లోని నిర్మాణ విలువ‌లు, గ్రిప్పింగ్ విజువ‌ల్స్‌, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజ‌న్స్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. 


‘దేవర’గా టైటిల్ పాత్ర‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై  మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్‌, ఆర్‌.ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ, సాబు శిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

GOOD BAD UGLY First Look Out Now

 Mythri Movie Makers prestigiously present Ajith Kumar - Adhik Ravichandran’s ‘GOOD BAD UGLY’, Striking First Look Out Now, Shoot In Progress, In Cinemas Pongal 2025





The Pan India Production House Mythri Movie Makers is making some high-budget entertainers with top stars across different industries. They are bringing back Kollywood superstar Ajith Kumar to Telugu cinema with a multi-lingual movie written and directed by Adhik Ravichandran. The movie titled ‘Good Bad Ugly’ went on floors recently in Hyderabad.


The previously released title poster got a superb response. The makers today unveiled the first look poster of the movie. It presents Ajith in a stylish best avatar with three different expressions, hinting at his role with three different shades. Wore a green printed flashy shirt with dragon shapes on it, Ajith sports a salt and pepper look. We can see dragon tattoos on his hand and a dragon-shaped bracelet. There are many deadly weapons on the table, and we can observe two golden dragons in the background. The first look poster truly lives up to all the expectations.


Adhik Ravichandran who delivered a super hit with his last movie Mark Antony is making Good Bad Ugly as a stylish action thriller with another intriguing story. He is presenting Ajith Kumar in a role with multiple shades. The movie is going to offer a gripping and engrossing cinematic experience for fans and film lovers.


The film produced by Naveen Yerneni and Y Ravi Shankar has a seasoned technical crew bringing in their expertise to one of the biggest projects of Indian Cinema. It features a musical score by Rockstar Devi Sri Prasad, while Abinandhan Ramanujam is taking care of the cinematography. Vijay Velukutty is the editor, while G M Sekhar is the production designer.


The movie will have a Pongal release in 2025.


Cast: Ajith Kumar


Technical Crew 


Writer & Director : Adhik Ravichandran 

DOP : Abinandhan Ramanujam

Music : Devi Sri Prasad 

Editor : Vijay Velukutty

Production Designer : G M Sekhar 

Stunts : Supreme Sundar, Kaloian Vodenicharov

Stylist : Anu Vardhan / Rajesh Kamarsu

PRO : Suresh Chandra 

PRO (Telugu) : Vamsi Shekar

Marketing : First Show

Marketing (Tamil) : D'one

Sound design : Suren 

Stills : G Anand Kumar 

Publicity designs : ADFX Studio

Chief Executive Producer : Dinesh Narasimhan 

CEO : Cherry 

Producers : NAVEEN YERNENI-Y RAVI SHANKAR

Megastar Chiranjeevi Appreciated Raju Yadav Getup Sreenu

 'రాజు యాదవ్‌' చిత్రం అందరినీ అలరిస్తుంది. గెటప్ శ్రీను హీరోగా మీ మన్ననలను అందుకుంటాడని ఆశిస్తున్నాను: పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి



బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ 'రాజు యాదవ్' తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. మే 24న రాజు యాదవ్ విడుదల కానుంది.  


తాజాగా గెటప్ శ్రీను, పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు. ఈ సందర్భంగా 'రాజు యాదవ్‌' టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.


''గెటప్ శ్రీను.. ఈ పేరు తలచుకోగానే జబర్దస్త్ లో రకరకాల గెటప్పులు, హావభావాలు, గొంతులు, యాస మార్చి నటిస్తూ నవ్వించే నటుడు మన కళ్ళముందు కనబడతాడు. ఈ తరం కామెడీ నటుల్లో నాకు ఇష్టమైన నటుడు గెటప్ శ్రీను. ఇప్పుడు తను హీరోగా వస్తున్న సినిమా రాజు యాదవ్. ట్రైలర్ చూశాను. చాలా బావుంది. కొత్తదనం కనిపించింది. శ్రీను చూపించిన అభినయం మనల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, వినోదం పంచుతుంది. శ్రీనుని చూస్తుంటే నాకు గతంలో కామెడీ హీరో చలం గారు గుర్తుకువస్తారు. చలం గారిని ఆంధ్ర దిలీప్ కుమార్ అని పిలిచేవారు. మన గెటప్ శ్రీను కూడా నాకు అలానే అనిపిస్తారు. గెటప్ శ్రీను ప్రతిభకు హద్దులు లేవని అనిపిస్తుంటుంది. మే 24న విడుదలయ్యే రాజు యాదవ్ చిత్రం మీ మెప్పు పొందుతుందని, తను హీరోగా మీ మన్ననలని అందుకుంటాడని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నిర్మాతలకు, దర్శకుడు కృష్ణమాచారికి, యూనిట్ అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. శ్రీను ఆల్ ది వెరీ బెస్ట్'అని తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి.        


ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.  


స్టార్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్  ఈ చిత్రానికి అద్భుతమైన ఆల్బమ్ అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.  


రాజు యాదవ్.. లవ్, కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో అలరించనుంది.  


సాయిరామ్ ఉదయ్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్.  

 

నటీనటులు: గెటప్ శ్రీను, అంకిత ఖరత్, ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచెర్ల, శ్రీరామ్, కళ్యాణ్ భూషణ్, శ్రీమణి, పవన్ రమేష్, ఉత్తర ప్రశాంత్, తదితరులు..


సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: కృష్ణమాచారి. కె

నిర్మాతలు: ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి

ఏపీ, తెలంగాణ రిలీజ్: బన్నీ వాస్

బ్యానర్లు: సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

డీవోపీ: సాయిరామ్ ఉదయ్ D.F.Tech

సాహిత్యం: చంద్రబోస్, కాసర్ల శ్యామ్

ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి

ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగేళా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విప్లవ్

గాయకులు: చంద్రబోస్, రామ్ మిరియాల, రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, యసస్వి కొండేపూడి

కొరియోగ్రఫీ: జిత్తు మాస్టర్

పీఆర్వో:  వంశీ - శేఖర్

సోషల్ మీడియా: హ్యాష్‌ట్యాగ్ మీడియా


Countdown Begins: Meet Bujji and Bhairava’s Trusted Friend from Kalki 2898 AD, on 22nd May 2024

 కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' నుంచి మే22న రివిల్ కానున్న 5వ సూపర్‌స్టార్ & భైరవ కు నమ్మకమైన స్నేహితుడు 'బుజ్జి'    



మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' చుట్టూవున్న ఎక్సయిట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా సినీ ఔత్సాహికులలో నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. మే 22, 2024న ఐదవ సూపర్‌స్టార్, భైరవ ప్రాణ స్నేహితుడైన బుజ్జి ని రివల్ చేయనున్నారనే ఎనౌన్స్మెంట్ తో ఎక్సయిట్మెంట్ అవధులు లేని ఆనందాన్ని తాకింది.


'ఫ్రమ్ స్క్రాచ్ EP4: బిల్డింగ్ ఎ సూపర్‌స్టార్' అనే పేరుతో బిహైండ్ ది స్క్రీన్ గ్లింప్స్ తో, జూన్ 2020లో దర్శకుడు నాగ్ అశ్విన్ గొప్ప విజన్ తో ప్రారంభించినప్పటి నుంచి "సూపర్‌హీరో", "భైరవ'గా ప్రజెంట్ చేసిన వీడియోతో క్రియేటర్‌లు ప్రేక్షులుని అద్భుతమైన ప్రయాణంలో తీసుకెళ్తారు. 'బెస్ట్ ఫ్రెండ్," "బెస్ట్ కంపానియన్" బుజ్జి నెటిజన్లను గెస్సింగ్ లో వుంచడంతో పాటు 5వ సూపర్‌స్టార్ గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తిని కలిగిస్తుంది.





2 నిమిషాల 22 సెకన్ల వీడియో గ్యారేజ్ సెట్టింగ్‌లో ప్రభాస్‌తో ఒక మిస్టీరియస్ ఎన్‌కౌంటర్‌తో సహా టీసింగ్ గ్లింప్స్ ని అందిస్తూ, మే 22న బుజ్జి గ్రాండ్ డెబ్యు కోసం ఆసక్తిని పెంచుతుంది.


ఇటీవల కల్కి 2898 AD నుంచి విడుదలైన అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర ప్రేక్షకులని మంత్రుముగ్దులని చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లీషు భాషలలో రివిల్ టీజర్, ట్రూ పాన్-ఇండియన్ టీజర్‌గా సెలబ్రేట్ చేసుకుంది.


విజనరీ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD ఈ సంవత్సరం సినిమాటిక్ ఈవెంట్‌గా నిలుస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటాని వంటి సూపర్ స్టార్స్ కూడిన సమిష్టి తారాగణంతో, ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మాణంలో, 27 జూన్ 2024న 'కల్కి 2898 AD' వరల్డ్ వైడ్ మ్యాసీవ్ గా విడుదల కానుంది.

Hero Anand Deverakonda six-pack look in "Gam Gam Ganesha"

"గం..గం..గణేశా"లో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్న హీరో ఆనంద్ దేవరకొండ



తన ప్రతి సినిమాకు కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ వస్తున్నారు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఈసారి "గం..గం..గణేశా" కోసం తన లుక్ కూడా మార్చేశారు. ఆయన ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నారు. సిక్స్ ప్యాక్ తో తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆనంద్ దేవరకొండ. "గం..గం..గణేశా" యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా ఈ నెల 31న థియేటర్స్ లోకి రాబోతోంది.


ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. "గం..గం..గణేశా" ట్రైలర్ ను రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ మంత్ ఎండ్ లో వస్తున్న చిత్రాల్లో ఒక కొత్త ప్రయత్నంగా "గం..గం..గణేశా" ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది. 

Bharateeyudu 2 (Indian 2) Audio Launch on June 1st

 జూలైలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, లైకా ప్రొడ‌క్ష‌న్ భారీ చిత్రం ‘భార‌తీయుడు 2’... ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో ప్రమోషన్స్ షురూ

జూన్ 1న చెన్నైలో గ్రాండ్ లెవల్లో ఆడియో లాంచ్


https://www.instagram.com/reel/C7ID-1qIq0u

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ భార‌తీయుడు 2’. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో 1996లో విడుద‌లైన బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘ఇండియన్’ చిత్రాన్ని ‘భార‌తీయుడు’గా విడుదల చేసింది.  ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘ భార‌తీయుడు 2’ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే .

https://www.instagram.com/reel/C7I-vy0BuyJ

భార‌తీయుడు సీక్వెల్ అంటే ఎలాంటి అంచ‌నాలుంటాయో వాటిని మించేలా డైరెక్ట‌ర్ శంక‌ర్ భార‌తీయుడు 2ను విజువ‌ల్ వండ‌ర్‌గా ఆవిష్క‌రిస్తున్నారు. అవినీతికి వ్య‌తిరేకంగా పోరాడే స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సేనాప‌తిగా క‌మ‌ల్ హాస‌న్ ప‌వ‌ర్‌ఫుల్ పెర్ఫామెన్స్ ఇవ్వ‌టానికి రెడీ అయ్యారు. ఈ సినిమా శ‌ర‌వేగంగా రూపొందుతోంది. జూలై సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

https://twitter.com/StarSportsTamil/status/1792034950952399146


లేటెస్ట్‌గా ముంబైలోని స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో ‘భారతీయుడు 2’ ప్రమోషన్స్ ను వినూత్నంగా ప్రారంభించటం విశేషం. అలాగే జూన్ 1న చెన్నైలో ఈ మూవీ ఆడియో వేడుకల ప్రముఖుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు.  మ‌న దేశాన్ని అవినీతి క్యాన్స‌ర్‌లా ప‌ట్టి పీడిస్తోంది. దీన్ని రూపుమాపటానికి సేనాపతి ఈ సీక్వెల్‌లో ఏం చేశారనేది  అందరిలో ఆసక్తిని పెంచుతోంది.  


https://twitter.com/StarSportsTamil/status/1792082807457726875


క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌వివ‌ర్మ‌న్  సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.


న‌టీన‌టులు:


క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:


క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం:  ఎస్‌.శంక‌ర్‌, స్క్రీన్ ప్లే: ఎస్‌.శంక‌ర్‌, బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ కుమార్‌, మ్యూజిక్ : అనిరుద్ ర‌విచంద్ర‌న్‌, ఎడిటింగ్:  ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ర‌వివ‌ర్మ‌న్‌, ఆర్ట్‌:  ముత్తురాజ్‌, స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, అన్బ‌రివు, రంజాన్ బుల‌ట్‌, పీట‌ర్ హెయిన్స్‌, స్టంట్ సిల్వ‌, డైలాగ్ రైట‌ర్‌:  హ‌నుమాన్ చౌద‌రి, వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌:  వి.శ్రీనివాస్ మోహ‌న్‌, కొరియోగ్ర‌ఫీ:  బాస్కో సీజ‌ర్‌, బాబా భాస్క‌ర్‌, పాట‌లు:  శ్రీమ‌ణి, సౌండ్ డిజైన‌ర్‌:  కునాల్ రాజ‌న్‌, మేక‌ప్ :  లెగ‌సీ ఎఫెక్ట్‌-వాన్స్ హర్ట్‌వెల్‌- ప‌ట్ట‌ణం ర‌షీద్‌, కాస్టూమ్ డిజైన్‌:  రాకీ-గ‌విన్ మ్యూగైల్‌- అమృతా రామ్‌-ఎస్‌బి స‌తీష‌న్‌-ప‌ల్లవి సింగ్-వి.సాయి, ప‌బ్లిసిటీ డిజైన‌ర్: క‌బిల‌న్ చెల్ల‌య్య ,పి.ఆర్‌.ఒ (తెలుగు):  నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  సుంద‌ర్ రాజ్‌, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌:  జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, రెడ్ జైంట్ మూవీస్‌:  సెన్‌బ‌గ మూర్తి, నిర్మాత‌:  సుభాస్క‌ర‌న్‌.

Santhana Prapthirasthu Movie Launched

 విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మాణంలో లాంఛనంగా ప్రారంభమైన మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సంతాన ప్రాప్తిరస్తు"




విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఇవాళ హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సంతాన ప్రాప్తిరస్తు సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత, వ్యాపారవేత్త అంబికా కృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా...వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట రామరాజు క్లాప్ నిచ్చారు. మధుర శ్రీధర్ రెడ్డి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఇద్దరు ప్రొడ్యూసర్స్ స్క్రిప్ట్ ను దర్శకుడు సంజీవ్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా


దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ - మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. ఇవాళ ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కు రావడం లేదు. వాళ్లను రప్పించేలా మూవీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా ఉంటుంది. ఎంటర్ టైన్ మెంట్ ఉంటూనే ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తున్నాం. వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి మధ్య కథ జరుగుతుంది. కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే ఓ సమస్యను వినోదాత్మకంగా మూవీలో తెరకెక్కిస్తున్నాం. అన్నారు.


నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ - ఈ రోజు మా సినిమా సంతాన ప్రాప్తిరస్తు లాంఛనంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ఛాన్ చేసిన అంబికా కృష్ణ గారికి, క్లాప్ నిచ్చిన వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట రామరాజుకి కృతజ్ఞతలు. మంచి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. సునీల్ కశ్యప్ మా చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. వచ్చే నెల 8వ తేదీ నుంచి మా సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం. అన్నారు.


నటీనటులు - విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి తదితరులు


టెక్నికల్ టీమ్


కాస్ట్యూమ్ డిజైనర్స్ - అశ్వత్ భైరి, కె ప్రతిభ రెడ్డి

ప్రొడక్షన్ డిజైనర్ - శివకుమార్ మచ్చ

సినిమాటోగ్రఫీ -మహి రెడ్డి పండుగుల

మ్యూజిక్ డైరెక్టర్ - సునీల్ కశ్యప్

డైలాగ్స్ - కల్యాణ్ రాఘవ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎ మధుసూదన్ రెడ్డి

స్టోరీ, స్క్రీన్ ప్లే - సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్ జి

పబ్లిసిటీ డిజైన్ - మాయాబజార్

పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

ప్రొడ్యూసర్స్ - మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి

డైరెక్టర్ - సంజీవ్ రెడ్డి

Anand Deverakonda Gam Gam Ganesha Trailer on May20

 ఈ నెల 20న హీరో ఆనంద్ దేవరకొండ "గం..గం..గణేశా" ట్రైలర్ రిలీజ్




యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా". ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం. 


ఈ నెల 31న "గం..గం..గణేశా" సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు "గం..గం..గణేశా" సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మంచి క్రైమ్ కామెడీ మూవీగా..ప్రేక్షకులు ఫ్యామిలీస్ తో కలిసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉండబోతోంది.



నటీనటులు :

ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.


టెక్నికల్ టీమ్ :


పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

కాస్ట్యూమ్ డిజైనర్ : పూజిత తాడికొండ

ఆర్ట్: కిరణ్ మామిడి

ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి

సంగీతం - చేతన్ భరద్వాజ్

లిరిక్స్ - సురేష్ బనిశెట్టి

బ్యానర్ - హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్

కొరియోగ్రఫీ: పొలాకి విజయ్

కో-ప్రొడ్యూసర్ -అనురాగ్ పర్వతనేని

నిర్మాతలు - కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి

రచన, దర్శకత్వం - ఉదయ్ శెట్టి

Vasishta N Simha in Yevam

 ’యేవమ్' చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’  యుగంధర్



రీసెంట్ గా మహిళలను ఉద్దేశించి ‘ఆడపిల్లనే అయితే ఎంటటా’ అనే హుక్ లైన్ తో చాందినీ చౌదరి క్యారక్టర్ పోస్టర్ ను, అలాగే హాట్ లుక్ లో ‘నా బాడీ సూపర్ డీలక్స్’ అంటూ ఆషు రెడ్డి పోస్టర్ ను అలానే అలాగే పోలీస్ ఆఫీసర్ గా ఆక్టర్ భరత్ తో “ఇన్ ఏ క్రైమ్ దేర్ ఆర్ నో కోఇన్సిడెన్సేస్’  అని పోస్టర్ రిలీజ్ చేశారు, ఆ పోస్టర్స్ అన్నింటికీ విశేష స్పందన లభించింది, ఇప్పుడు అదే తరహాలో మరో వైదిధ్యమైన కారక్టర్ పోస్టర్ ను రిలీజ్ చేసారు, కన్నడ రాయల్ స్టార్ వసిష్ఠ ఎన్ సింహ ను ‘యుగంధర్’ లుక్ లో పంచ కట్టులో చేతిలో డమరుకం పట్టుకుని “ఏం? నేను సరిపోనా? అనే హుక్ లైన్ తో మరో పోస్టర్ లాంచ్ చేశారు. యుగంధర్ తెలుగులో ఇప్పటి వరుకు చేసిన అన్ని క్యారెక్టర్ లతో పోలిస్తే ఈ లుక్ చాలా యునీక్ గా ఉంది అని ప్రేక్షకుల నుండి కామెంట్స్ వస్తున్నాయి


పిడిపి, సి స్పేస్ ఉమ్మడి బ్యానర్లులో నవదీప్, పవన్ గోపరాజు నిర్మాణంలో ఈ ‘యేవమ్’  జరుగుతుంది, ప్రకష్ దంతులూరి యేవమ్ కి దర్శకత్వం వహించారు. ఒక పక్క హీరోగా చేస్తూ కూడా మరో పక్క నవదీప్ ఇలా ఈ సినిమా నిర్మాణంలో భాగం అవ్వడం, ఈ ‘యేవమ్’ కథ కి ఉన్న పోటేన్షియాలిటీని చెప్పకనే చెప్తుందా అనేది చూడాలి. 


తారాగణం

చాందిని చౌదరి

వశిష్ట సింహ

జై భరత్ రాజ్

ఆశు రెడ్డి

గోపరాజు రమణ

దేవిప్రసాద్

కల్పలత తదితరులు


సిబ్బంది

నిర్మాతలు: నవదీప్, పవన్ గోపరాజు

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ప్రకాష్ దంతులూరి

సినిమాటోగ్రాఫర్: ఎస్.వి. విశ్వేశ్వర్

సంగీత దర్శకులు: కీర్తన శేష్, నీలేష్ మందలపు

ఎడిటర్: సుజనా అడుసుమిల్లి

ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: రాజు పెనుమత్స

పీ ఆర్ ఓ: ఏలూరుశ్రీను - మాడూరి మధు

Silk Saree Release on the 24th-Pre Release Event Held Grandly

 ఘనంగా "సిల్క్ శారీ" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ నెల 24న రిలీజ్ కు వస్తున్న మూవీ




వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సిల్క్ శారీ". ఈ చిత్రాన్ని చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మిస్తున్నారు. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరితో దర్శకుడు టి. నాగేందర్ రూపొందిస్తున్నారు. "సిల్క్ శారీ" సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు మురళీ మోహన్, హీరో శ్రీకాంత్, నటులు శివాజీ రాజా, ఉత్తేజ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా


నిర్మాత కమలేష్ కుమార్ మాట్లాడుతూ - "సిల్క్ శారీ" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలు మురళీ మోహన్, హీరో శ్రీకాంత్, నటులు శివాజీ రాజా, ఉత్తేజలకు థ్యాంక్స్ చెబుతున్నా. ఒక మంచి మూవీతో టాలీవుడ్ లోకి నిర్మాతగా అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. ఇకపైనా మా చాహత్ బ్యానర్ పై రెగ్యులర్ గా సినిమాలు రూపొందిస్తాం. మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. ఈ నెల 24న థియేటర్స్ లోకి వస్తున్న మా "సిల్క్ శారీ" సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.


దర్శకుడు టి.నాగేందర్ మాట్లాడుతూ - "సిల్క్ శారీ" సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదొక సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాం. హీరో వాసుదేవ్ రావు కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది. ప్రొడ్యూసర్ గా కమలేష్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. మా టీమ్ సహకారంతో సినిమాను ఈ నెల 24న గ్రాండ్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. థియేటర్స్ కు వచ్చి మా మూవీని చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నా. అన్నారు.


హీరో వాసుదేవ్ రావు మాట్లాడుతూ - హీరో శ్రీకాంత్ గారు మా ఈ‌వెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. ఆయన నేను కలిసి ఖడ్గం సినిమాలో నటించాం. ఆ సినిమా నాకు నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆయన గెస్ట్ గా వచ్చి బ్లెస్ చేసిన మా "సిల్క్ శారీ" సినిమా కూడా మంచి ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. నాకు ఈ సినిమాతో మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత కమలేష్, దర్శకుడు నాగేందర్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.


హీరోయిన్ రీవా చౌదరి మాట్లాడుతూ - "సిల్క్ శారీ" సినిమాతో మీ ముందుకు హీరోయిన్ గా వస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాకు పర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఆయనకు, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. రొమాంటిక్ లవ్ స్టోరీస్ కు ఎప్పుడూ మీ ఆదరణ ఉంటుంది. అలాగే మా "సిల్క్ శారీ" సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.


హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ - "సిల్క్ శారీ" సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వాసుదేవ్ కు ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. కొత్తగా ప్రయత్నం చేసే ప్రతి సినిమాకు మన తెలుగు ఆడియెన్స్ సపోర్ట్ ఉంటుంది. అది చిన్న సినిమా అయినా పెద్ద విజయాన్ని అందిస్తారు. ఈ సినిమాకు కూడా అలాంటి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. దర్శకుడు నాగేందర్, నిర్మాత కమలేష్, ఇతర టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

నటీనటులు: వాసుదేవ్ రావు , రీవా చౌదరి , ప్రీతీ గోస్వామి , ఓంకార్ నాథ్ శ్రీశైలం , కోటేష్ మానవ తదితరులు.

టెక్నికల్ టీమ్

డైరెక్టర్ :టి . నాగేందర్

నిర్మాతలు : కమలేష్ కుమార్ , రాహుల్ అగర్వాల్ హరీష్  చండక్

బ్యానర్: చాహత్ ప్రొడక్షన్స్

సంగీత దర్శకుడు: వరికుప్పల యాదగిరి

కెమెరా : సనక రాజశేఖర్

పీఆర్ఓ: శ్రీపాల్ చొల్లేటి

Arun Viswa Of Shanthi Talkies Presents, Siddarth’s ‘Siddarth 40’ With Director Sri Ganesh Announced

 సిద్ధార్థ్ హీరోగా అరుణ్ విశ్వ శాంతి టాకీస్ సమర్పణలో శ్రీ గణేష్‌ దర్శకత్వంలో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘సిద్దార్థ్ 40’ అనౌన్స్ మెంట్



సక్సెస్ ఫుల్ పాన్-ఇండియన్ యాక్టర్ సిద్ధార్థ్ చిత్ర పరిశ్రమలో 21 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రతి పరిశ్రమలో శాశ్వత ప్రభావాన్ని చూపారు. అతను ఎంచుకునే కథలు, పాత్రల, అసాధారణమైన పెర్ఫార్మెన్స్ తో అద్భుతంగా అలరిస్తున్నాయి. బాలీవుడ్‌లో 'రంగ్ దే బసంతి'తో చెరగని ముద్ర వేశారు. తెలుగులో 'బొమ్మరిల్లు'తో ప్రేక్షకుల మన్ననలు పొందారు. తమిళ పరిశ్రమలో పలు జోనర్‌లలో మెరిసి.. సినిమా, నటనపై తనకున్న గొప్ప అభిరుచిని చూపించారు సిద్ధార్థ్. ఆయన లేటెస్ట్ ప్రాజెక్ట్ 'చిత' ప్రేక్షకుల హృదయాల్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇప్పుడు, సిద్ధార్థ్  'సిద్ధార్థ్ 40'( వర్కింగ్ టైటిల్) పేరుతో మరో ఎక్సయిటింగ్ మూవీ కోసం కోసం మంచి యూనిట్ తో చేతులు కలిపారు. ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌ను '8 తొట్టక్కల్'తో పేరుపొందిన శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ 'మావీరన్' నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్ లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ “యూనివర్సల్ ఆడియన్స్ అభిరుచులను ఆస్వాదించే మంచి కంటెంట్‌ను అందించాలనే దృక్పథాన్ని కలిగి ఉన్న మన పరిశ్రమలోని యంగ్ టీంతో కలిసి పని చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. సినిమా ఔత్సాహికులు, ఫ్యామిలీస్ 'చిత్త'పై తమ ప్రేమను  కురిపించారు ఇది వారి భావాలను హత్తుకుని, మంచి కథలను ఎంచుకోవడానికి నాలో మరింత బాధ్యతను నింపింది. నేను చాలా స్క్రిప్ట్‌లు విన్నాను, శ్రీ గణేష్ చెప్పిన కథ నాకు ఎంతగానో నచ్చింది. ప్రేక్షకులపై ప్రభావం చూపే సినిమాలను తీయడమే నిర్మాతల ఆనందం. అలాంటి మంచి నిర్మాత అరుణ్ విశ్వతో పని చేయడం ఆనందంగా వుంది. ఆయన మంచి సినిమాతో పరిశ్రమను ఉన్నతంగా తీర్చిదిద్దాలని కలలు కనే నిర్మాత. మా అంకితభావం, పాషన్ తో ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించే అద్భుతమైన సినిమాని అందిస్తాయనే నమ్మకం నాకుంది” అన్నారు.


దర్శకుడు శ్రీ గణేష్ మాట్లాడుతూ, “నేను స్క్రిప్ట్ వర్క్ చేయడం ప్రారంభించినప్పుడు, యూత్ తో పాటు పరిణతి గల నటుడు కావాలని భావించాను. అప్పుడే  సిద్దార్థ్ గారిని అనుకున్నాను. కథ చెప్పడానికి ఆయన్ని కలిసినప్పుడు, తను పూర్తిగా ఎంగేజైఉన్నప్పటికీ చాలా విలువైన సూచనలను కూడా పంచుకున్నారు. ఇది చాలా ప్రశంసనీయం. మంచి పాషన్ వున్న నిర్మాత అరుణ్ విశ్వతో కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా వుంది' అన్నారు.


నిర్మాత అరుణ్‌విశ్వ మాట్లాడుతూ “శాంతి టాకీస్‌కి మా అమ్మ పేరు పెట్టాం. మా అమ్మ థియేటర్లలో చూసి ఆనందించ గలిగే ప్రాజెక్ట్‌లనే ఎంచుకోవాలని భావిస్తాను. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించే కమర్షియల్ చిత్రాలని రూపొందించడమే శాంతి టాకీస్ లక్ష్యం. శ్రీ గణేష్ అద్భుతమైన రచన చాలా ఆకట్టుకుంటుంది, అతను స్క్రిప్ట్ వివరించినప్పుడు, ఇది అన్ని వయసుల ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా, భాష సరిహద్దులకు అతీతంగా ఆకర్షించే చిత్రం అని నేను బలంగా నమ్మాను. సినిమాపై సిద్దార్థ్‌కు ఉన్న ప్యాషన్‌ అద్భుతం. నేను అతనితో పని చేయడానికి చాలా సంతోషిస్తున్నాను. మేము త్వరలో సర్ ప్రైజింగ్ అనౌన్స్ మెంట్స్ చేస్తాం' అన్నారు.  


'సిద్ధార్థ్ 40' షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సిబ్బందికి సంబంధించిన వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.


Honeymoon Express Third single Launched by Adivi Sesh

 హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం లోని మూడో పాటను విడుదల చేసిన యాక్షన్  హీరో అడివి శేష్



ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd) పతాకం పై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్". తనికెళ్ల భరణి మరియు సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని రచయిత దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించగా కె కె ఆర్ మరియు బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ ని నిర్మించారు.


ఇప్పటికే హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం నుంచి సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ స్వరపరిచిన రెండు రొమాంటిక్ మెలోడీ పాటలు విడుదలై ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో నిలిచాయి. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మూడో పాటను యాక్షన్ హీరో అడివి శేష్ చేతుల మీదుగా విడుదల చేశారు చిత్ర యూనిట్.


గూఢచారి 2 మరియు డెకాయిట్ చిత్రాలతో బిజీగా ఉన్నా అడివి శేష్, దర్శకుడు బాల గారి చిరకాల పరిచయం వలన అన్నపూర్ణ 7 ఎకరాల ప్రాంగణంలో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ లో క్యూట్ గా స్వీట్ గా అనే అందమైన లిరికల్ పాటను వీక్షించి విడుదల చేశారు.


అనంతరం అడివి శేష్ మాట్లాడుతూ "క్యూట్ గా స్వీట్ గా పాట చాలా స్వీట్ గా ఉంది, సాహిత్యం చాలా బాగుంది అని కొనియాడారు. చిత్రం మంచి విజయం సాధించాలి" అని కోరుకున్నారు.


దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ "ఎంతో బిజీ గా ఉన్నప్పటికీ, క్యూట్ గా స్వీట్ గా అనే అందమైన పాటను విడుదల చేసిన అడివి శేష్ గారికి నా కృతజ్ఞతలు. అడివి శేష్ తన మొదటి చిత్రం అమెరికా లో విడుదల చేయడానికి నన్ను సంప్రదించారు. తనకు మంచి టాలెంట్ ఉంది అని అప్పుడే గమనించాను. మా హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం మంచి మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. మా చిత్రంలోని ప్రతి పాట చాలా బాగుంటుంది. మంచి పాటలు స్వరపరిచిన కళ్యాణి మాలిక్ గారికి కృతజ్ఞతలు. ఈ క్యూట్ గా స్వీట్ గా పాటకు కిట్టూ విస్సాప్రగడ లిరిక్స్ అందించగా బాహుబలి ఫేమ్ దీపు తన గాత్రంతో ప్రాణం పోశారు.


త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేసి, చిత్రాన్ని ఈ సమ్మర్ లో విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నాం" అని తెలిపారు



సమర్పణ : ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA))

బ్యానర్ : న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd)

చిత్రం పేరు : హనీమూన్ ఎక్స్‌ప్రెస్


నటీనటులు : చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు


సంగీతం : కళ్యాణి మాలిక్  

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఆర్ పి పట్నాయక్

లిరిక్స్ : కిట్టూ విస్సాప్రగడ

ఆర్ట్, సినిమాటోగ్రఫీ : శిష్ట్లా  వి ఎమ్ కె

ఎడిటింగ్ : ఉమా శంకర్ జి (యు ఎస్ ఎ), శ్రీ కృష్ణ అత్తలూరి

ఆడియో : టి సిరీస్

పి ఆర్ ఓ : పాల్ పవన్

డిజిటల్ పి ఆర్ ఓ : వంశి కృష్ణ (సినీ డిజిటల్)

రచన, దర్శకత్వం : బాల రాజశేఖరుని

Naa Uchvasam Kavanam Curtain Raiser Event Held Grandly

 ఘనంగా దిగ్గజ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రాబోతున్న నా ఉచ్ఛ్వాసం కవనం ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం




దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రూపొందిన కార్యక్రమం నా ఉచ్ఛ్వాసం కవనం. శృతిలయ ఫౌండేషన్ నిర్వహణలో  ఈ కార్యక్రమానికి రామ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సిరివెన్నెల పాటల అంతరంగాన్ని ఆవిష్కరించే ఈ కార్యక్రమం ఈటీవీలో ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రసారం కానుంది. తాజాగా నా ఉచ్ఛ్వాసం కవనం ప్రోగ్రాం కర్టెన్ రైజర్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఈ కార్యక్రమానికి హాజరై టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా



ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ రామ్ చెరువు మాట్లాడుతూ - విశ్వనాథ్ గారితో విశ్వనాథామృతం అనే కార్యక్రమం చేస్తున్నప్పుడు 2011లో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కలిశాం. ఆయన దగ్గరకు ఎవరు వెళ్లినా ముందు తన పాట ఒకటి పాడి వినిపిస్తుంటారు. అలా మాకు కొన్ని పాటలు వినిపించారు. అవి సూపర్ హిట్ సాంగ్స్ కాదు కానీ సాహిత్యపరంగా ఎంతో విలువైన పాటలు. ఆ పాటలు , ఆ పాటల వెనక సీతారామశాస్త్రి గారు చేసిన కృషి గురించి తెలుసుకున్న తర్వాత ఈ మాటలు మాకే కాదు అందరికీ తెలియాలనే ఆలోచన కలిగింది. సిరివెన్నెల అంతరంగం పేరుతో నాలుగు ఎపిసోడ్స్ చేశాం. సీతారామశాస్త్రి గారు తన పాట గురించి వివరించిన తర్వాత ఆ పాటను సింగర్స్ పాడేవారు. కొన్ని రోజుల తర్వాత మ్యూజిక్ లేకుండా సింగర్స్ తో కేవలం లిరిక్స్ పాడించాం. మూడు ఎపిసోడ్స్ అనుకున్నది 13 ఎపిసోడ్స్ చేశాం. దీన్ని టీవీ, ఇతర మాధ్యమాల ద్వారా బహుళ ప్రచారంలోకి తీసుకురావాలని అనుకున్నప్పుడు ఇతర పనులతో బిజీగా ఉండి శాస్త్రి గారు ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. కొన్ని రోజులకు సీతారామశాస్త్రి గారు మనకు దూరమయ్యారు. ఆ తర్వాత ఈ ప్రోగ్రాంను ఎలా ప్రేక్షకులకు చేర్చాలి అనుకుంటున్నప్పుడు త్రివిక్రమ్ గారు మాకు సపోర్ట్ చేశారు. ఈటీవీలో ప్రసారం గురించి బాపినీడు గారు ఎంతో సపోర్ట్ చేశారు. నాతో పాటు మా టీమ్ లోని వాళ్లంతా శాస్త్రి గారి అభిమానులే. సీతారామశాస్త్రి గారి మాట అందరికీ చేరాలని చేసిందే ఈ చిన్న ప్రయత్నం. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.


సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు శ్రీరామ్ శాస్త్రి మాట్లాడుతూ - మనమంతా ఒక కారణంతో ఈ భూమ్మీదకు వస్తాం. అలా ఒక బృహత్తరమైన బాధ్యతతో పుట్టారు అన్నయ్య సీతారామశాస్త్రి. తన కర్తవ్యాన్ని ముగించి వెళ్లిపోయారు. ఉన్నంతకాలం శ్రమ చేస్తూనే ఉన్నారు. ఎన్నో విలువైన పాటలను మనకు అందించారు. ఆ పాటలతో సమాజాన్ని మేల్కొలిపారు. అన్నయ్య సినిమా పాటల రచయిత కాకుండా ఇంకా గొప్ప స్థాయిలో ఉండేవారని కొందరు అంటారు కానీ అన్నయ్య ఆ మాట ఒప్పుకోడు. సినిమా మాధ్యమం వల్లే ఇంత విస్తృతంగా తన పాట ప్రజల్లోకి వెళ్లిందని అనేవారు. అన్నారు.


సింగర్ పార్థసారధి మాట్లాడుతూ - సీతారామశాస్త్రి గారి లాంటి గొప్ప గేయ రచయిత ఉండటం తెలుగు సినిమా అదృష్టం. ఆయన పాటలు పాడే గొప్ప అవకాశం నాకు రావడం గర్వంగా భావిస్తున్నా. నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఇది పూర్తి చేయగలమా అనే భయం ఉండేది. నేను చేయగలనా అనే సందేహం కలిగినప్పుడు శ్రీరామ్ ధైర్యం చెప్పేవారు. ఇవాళ ఎంతోమంది శాస్త్రి గారి అభిమానులు, గొప్ప స్థాయిలో ఉన్నవాళ్లు మాకు సపోర్ట్ చేశారు. సిరి డెవలపర్స్ మూర్తిగారు, సిలికానాంధ్ర, డాక్టర్ గురువారెడ్డి గారు, వీళ్లందరి సపోర్ట్ తో ముందుకెళ్లాం. శాస్త్రి గారి పాటలను, మాటలను చిరకాలం నిక్షిప్తం చేయాలనేది మా ప్రయత్నం. అన్నారు.


డాక్టర్ గురువారెడ్డి మాట్లాడుతూ - నేను కోట్ల రూపాయలు సంపాదించుకున్నందుకు కాదు సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి గొప్ప వ్యక్తుల మధ్య గడిపినందుకు గర్విస్తున్నాను. మా పాపతో మేము నిర్మించిన లిటిల్ సోల్జర్స్ సినిమాలో మొత్తం పాటలు శాస్త్రి గారే రాశారు. మనం మాట్లాడుకునే చిన్న చిన్న మాటలతోనే గొప్ప పాటలు రాసిన గ్రేట్ రైటర్ శాస్త్రి గారు. కృష్ణవంశీ గారు, శాస్త్రి గారి కాంబోలో చాలా మంచి పాటలు వచ్చాయి. మా సన్ షైన్ ఆస్పత్రి ఆడిటోరియంలో సెట్ వేసి నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. అన్నారు.


దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ - నాకు సీతారామశాస్త్రి గారు చాలా కాలంగా తెలుసు. ఆయన పరిచయం ఒక అదృష్టంగా భావిస్తా.

నేను ఏ సినిమా మొదలుపెట్టినా ముందు సీతారామశాస్త్రి గారి దగ్గరకు వెళ్లి పాటల గురించి డిస్కస్ చేస్తుండేవాడిని. నా కొత్త సినిమా మొదలుపెట్టాలని ఆరేడు నెలల నుంచి ప్రయత్నిస్తున్నా. కానీ పాటలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. శాస్త్రి గారు లేకపోవడం వల్ల అనాథగా మారిన భావన కలుగుతోంది. శాస్త్రి గారి గురించి ఇంత మంచి ఈ కార్యక్రమం  శ్రీరామ్ కు , పార్థసారధి నా కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.


సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ - సీతారామశాస్త్రి ప్రోగ్రాం మీరు మీడియా కార్యక్రమం నిర్వహించాలని అడిగినప్పుడు అది అదృష్టంగా భావించా. సీతారామశాస్త్రి గారు గొప్ప సినీ రచయిత. దర్శకుల మనసు తెలుసుకుని, వారికి ఏం కావాలో అది రాసిచ్చే లిరిసిస్ట్. కృష్ణవంశీ గారికి ఆయన చిరకాలం గుర్తుండే పాటలు రాశారు. శాస్త్రి గారు మనకు దూరమైనప్పుడు వచ్చిన అశేష జనాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ కార్యక్రమంతో శాస్త్రి గారి పాట, మాట ప్రేక్షకులకు విస్తృతంగా చేరాలని కోరుకుంటున్నా. అన్నారు.

Nee Dhaarey Nee Katha hits theatres worldwide on June 14

 నీ దారే నీ కథ  జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. అద్భుతమైన సంగీతం మరియు ఎమోషన్స్ తో నిండిన మరపురాని ప్రయాణం ఈ సినిమా



వంశీ జొన్నలగడ్డ దర్శకత్వం వహించిన, ఈ సంగీత ఆధారిత కథ ఆకర్షణీయమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది, యువత మరియు ఆకర్షణీయమైన కథాంశంతో మనసును కదిలించే సంగీతాన్ని మిళితం చేస్తుంది. ఈ చిత్రం అభిరుచి, స్నేహం, మన కలలను సాధించాలనే సంకల్పం మరియు తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బంధం వంటి ఇతివృత్తాలను కలిగి ఉంది. ప్రేక్షకులు భావోద్వేగాల రోలర్‌కోస్టర్‌ లా ఫీల్ అవుతారు. సంగీతం స్వరాన్ని సెట్ చేస్తుంది, ఈ చిత్రం యొక్క ముఖ్య విషయం జీవిత సవాళ్ల మధ్య పట్టుదల తో కూడి ఉంది.


ప్రతిభావంతులైన తారాగణం మరియు అన్ని వయసుల  ప్రేక్షకులను అలరించేలా రూపొందించిన స్క్రీన్‌ప్లే "నీ దారే నీ కథ" ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసినదిగా చిత్రం.


నటీనటులు :

ప్రియతమ్ మంతిని, విజయ విక్రాంత్, అనంత పద్మశాల, అంజన బాలాజీ, వేద్.


టెక్నికల్ టీం :

బ్యానర్ : జె వి ప్రొడక్షన్స్

నిర్మాతలు : వంశీ జొన్నలగడ్డ, తేజేష్ వీర, శైలజ జొన్నలగడ్డ

రచయితలు : మురళి కాంత్, వంశీ జొన్నలగడ్డ

సంగీతం : ఆల్బర్ట్టో గురియోలి

సినిమాటోగ్రాఫర్ : ఎలెక్స్ కావు

కాస్ట్యూమ్ డిజైనర్ : హర్షిత తోట

ఎడిటర్ : విపిన్ సామ్యూల్

దర్శకుడు : వంశీ జొన్నలగడ్డ

పి ఆర్ ఓ : మధు VR

I-20 Audio Launched Grandly

 యమసందడిగా "ఐ-20"

పాటలు - ప్రచారచిత్రం విడుదల!!



పి.ఎన్.ఆర్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ పతాకంపై సూగూరి రవీంద్ర దర్శకత్వంలో పి.బి.మహేంద్ర నిర్మించిన న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ "ఐ - 20". బివేర్ ఆఫ్ గర్ల్స్ (అమ్మాయిలతో జాగ్రత్త) అనేది ఉప శీర్షిక. కొమ్ము మనోహర దేవి సహ నిర్మాత. సూర్యరాజ్ - మెరీనా సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం పాటలు, ప్రచారచిత్రం ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు.ప్రముఖ ఆడియో సంస్థ మధుర ఆడియో ద్వారా ఈ చిత్రం పాటలు లభ్యం కానున్నాయి!! 



తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, ప్రముఖ దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, ప్రముఖ దర్శకులు వి.సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రూపొందించిన "ఐ - 20" అందరికీ నచ్చుతుందనే ఆశాభావాన్ని దర్శకనిర్మాతలు వ్యక్తం చేశారు!!


మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ యెలెందర్, గీత రచయిత దేవకరణ్, సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్, కొరియోగ్రాఫర్స్ శైలజ- శ్యామ్ తదితర చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. రాగిణి, లీరిషా (సూపర్ ఉమెన్), చిత్రం శ్రీను, జోష్ రవి, పొట్టి చిట్టిబాబు, సద్దాం హుస్సేన్, రియాజ్, పర్శ, పల్లెమోని శ్రీనివాస్, వినోద్ నాయక్ తదితరులు ఈ చిత్రంలో ఇతర కీలకపాత్రలు పోషించారు!!

Siva Kantamaneni Big Brother Releasing on May 24th

 శివ కంఠంనేని తాజా చిత్రం

"బిగ్ బ్రదర్" ఈనెల 24 విడుదల!!



"రాజమౌళి ఆఫ్ భోజపురి"

గోసంగి సుబ్బారావు రీ-ఎంట్రీ


"అక్కడొకడుంటాడు, మధురపూడి గ్రామం అనే నేను, రాఘవరెడ్డి" చిత్రాలతో రివార్డులు, అవార్డులు దండిగా పొందిన బహుముఖ ప్రతిభాశాలి శివ కంఠంనేని టైటిల్ రోల్ ప్లే చేసిన "బిగ్ బ్రదర్" సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. 


భోజపురిలో అపజయం అనేది లేకుండా దూసుకుపోతూ "రాజమౌళి ఆఫ్ భోజపురి"గా నీరాజనాలు అందుకుంటున్న ప్రముఖ దర్శకులు గోసంగి సుబ్బారావు చాలా విరామం అనంతరం తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ రూపొందించిన "బిగ్ బ్రదర్" చిత్రాన్ని లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై జి.రాంబాబు యాదవ్ సమర్పణలో కె. శివశంకర్ రావు - ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. ఘంటా శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో శివ కంఠంనేని సరసన ప్రియా హెగ్డే నటించగా... శ్రీ సూర్య, ప్రీతి శుక్లా ఇంకో జంటగా నటించారు!!


చిత్రం విడుదల సందర్భంగా దర్శకసంచలనం గోసంగి సుబ్బారావు మాట్లాడుతూ... "అన్నదమ్ముల అనుబంధం నేపధ్యంలో... ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్ దట్టించి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం "బిగ్ బ్రదర్". శివ కంఠంనేని మరోసారి ఇందులో అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ కనబరిచారు. నందమూరి కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ చిత్రం "బింబిసార"కు యాక్షన్ కొరియోగ్రఫి చేసిన ఫైట్ మాస్టర్ రామకృష్ణ డిజైన్ చేసిన రొమాంఛిత పోరాటాలు "బిగ్ బ్రదర్" చిత్రానికి బిగ్ ఎట్రాక్షన్. ఈనెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంతో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఇకపై తెలుగులో వరసగా సినిమాలు చేస్తాను" అన్నారు!!


గౌతంరాజు, గుండు సుదర్శన్, రాజేందర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్-అప్పాజీ, డాన్స్: రాజు పైడి, స్టంట్స్: రామకృష్ణ, ఎడిటింగ్: సంతోష్, కెమెరా: ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు, సమర్పణ: జి.రాంబాబు యాదవ్, నిర్మాతలు: కె.శివశంకర్ రావు - ఆర్.వెంకటేశ్వరరావు, రచన - దర్శకత్వం: గోసంగి సుబ్బారావు!!