'వరల్డ్స్ అపార్ట్: ఎ స్టోరీ ఆఫ్ లీడర్‌షిప్, మెంటర్‌షిప్, అండ్ హ్యూమన్ కనెక్షన్' పుస్తకానికి ముందుమాట రాసి, సపోర్ట్ చేసిన హీరో అరవింద్ కృష్ణ
నటుడు, అంతర్జాతీయ అథ్లెట్ అరవింద్ కృష్ణ 'వరల్డ్స్ అపార్ట్' అనే పుస్తకానికి తనవంతు సహకారాన్ని అందించారు. ఎడ్ కోహెన్, నూతన రచయిత్రి దేవి బొడ్డు కలిసి రాసిన ఈ పుస్తకాన్ని 'ఓం బుక్స్ ఇంటర్నేషనల్' ప్రచురించించింది. ఇదొక నాన్-ఫిక్షన్ రచన. ఈ పుస్తకం ఎడ్ కోహెన్ నుంచి వచ్చిన ఐదో పుస్తకం. దేవి బొడ్డు ఈ పుస్తకంతోనే సాహిత్య రంగంలోకి ప్రవేశించారు. ఈ పుస్తకంతో రెండు విభిన్న దృక్పథాలను కలిగిన మనుషుల్ని ఏకం చేసినట్టు అయింది.
అరవింద్ కృష్ణకు ఈ పుస్తకం, ఆ రచయితలతో ఉండే అనుబంధం ఎంతో వ్యక్తిగతమైనది. అరవింద్ కృష్ణ తన కెరీర్ ఆరంభంలో సత్యం స్కూల్ ఆఫ్ లీడర్‌షిప్‌లో శిక్షణ తీసుకున్నాడు. అక్కడ అతను ఎడ్ కోహెన్, అప్పటి అక్కడ చీఫ్ లెర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పనిచేశాడు. టీంలోని అందరి కంటే చిన్నవాడైన అరవింద్ కృష్ణ తన టాలెంట్‌తో అందరినీ అబ్బురపరిచాడు.
వరల్డ్స్ అపార్ట్ పుస్తకంలో భారతదేశ విలువలు, సంస్కృతి, సాంకేతికతలోని పరిణామక్రమం గురించి ఇలా ఎన్నో విషయాల్ని పొందుపరిచారు. ఇక ఈ పుస్తకానికి అరవింద్ కృష్ణ.. “నాయకత్వం అంటే గదిలో అత్యంత గట్టిగా మాట్లాడడం కాదు, స్పష్టంగా మాట్లాడటం. అధికారాన్ని ప్రయోగించడం కాదు.. నిజాయితీగా ఉండటమే నాయకత్వం’ అని ముందుమాట రాశాడు.
అరవింద్ కృష్ణ, ఎడ్ కోహెన్ ఇటీవల బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ : ఇండియా ఎపిసోడ్ రైడింగ్ ది టైగర్‌లో కూడా కనిపించారు. అరవింద్ ఇప్పుడు పూర్తిగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. "ఎ మాస్టర్ పీస్" పోస్ట్-ప్రొడక్షన్‌లో ఉంది.
వరల్డ్స్ అపార్ట్ ఇప్పుడు భారతదేశంలోని మెయిన్ బుక్స్ షాప్స్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.
పుస్తక వివరాలు
శీర్షిక : వరల్డ్స్ అపార్ట్
రచయితలు : ఎడ్ కోహెన్ (5వ పుస్తకం), దేవి బొడ్డు (అరంగేట్రం)
ముందుమాట : అరవింద్ కృష్ణ
ప్రచురణకర్త : ఓం బుక్స్ ఇంటర్నేషనల్


Post a Comment