Bhava Rasa Natyotsavam – Season 2 on February 28

 ఫిబ్రవరి 28న భావ రస నాట్యోత్సవం - సీజన్ 2

మదాలస - స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్' ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన 'భావ రస నాట్యోత్సవం - సీజన్ 1', అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరి 4న హైదరాబాద్‌లోని ఫీనిక్స్ అరేనాలో కన్నులపండువగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత శాస్త్రీయ నృత్య కళాకారులు సౌజన్య శ్రీనివాస్ గారు, మంజు వి. నాయర్ గారు, స్వప్న రాజేంద్రకుమార్ గారు తమ అసాధారణ నృత్య ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. 

ఇప్పుడు 'భావ రస నాట్యోత్సవం - సీజన్ 2'కు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 28, 2026 సాయంత్రం 6:30 గంటల నుండి హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రఖ్యాత శాస్త్రీయ నృత్య కళాకారులచే భరతనాట్యం, కూచిపూడి ప్రత్యేక ప్రదర్శనలకు ఈ కార్యక్రమం వేదిక కానుంది.

ప్రదర్శనల వివరాలు:

కళారత్న సౌజన్య శ్రీనివాస్ గారు – భరతనాట్యం, కూచిపూడి (హైదరాబాద్)

 ప్రమోద్ రెడ్డి గారు & అభినేత్రి ఎన్‌సెంబుల్ – భరతనాట్యం (హైదరాబాద్)

 ఎం. సురేంద్ర నాథ్ గారు (ఎస్‌ఎన్‌ఏ యువ పురస్కార్ అవార్డు గ్రహీత) & డా. బిజినా సురేంద్ర నాథ్ గారు – కూచిపూడి (హైదరాబాద్)

వేదిక:

రవీంద్ర భారతి, లక్డీకాపూల్, 

హైదరాబాద్, తెలంగాణ – 500004

తేదీ & సమయం:

ఫిబ్రవరి 28, 2026 | శనివారం 

సాయంత్రం 06:30 గంటల నుండి

ప్రత్యేక అతిథులు:

రవి పాడి గారు 

IRTS, చీఫ్ కమర్షియల్ మేనేజర్, దక్షిణ మధ్య రైల్వే

 శ్రీ అనుగు నర్సింహా రెడ్డి గారు

డైరెక్టర్, భాషా మరియు సాంస్కృతిక శాఖ

 వీర్నాల బాలాజీ గారు

చైర్మన్ - వీర్నాల ఫౌండేషన్

వ్యాఖ్యాత

వాచస్పతి శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ గారు

ప్రముఖ తెలుగు యాంకర్, ప్రసిద్ధ వక్త మరియు సాంస్కృతిక వ్యాఖ్యాత

శాస్త్రీయ కళా వైభవానికి అద్దం పట్టేలా ఘనంగా ఈ కార్యక్రమం జరగనుంది.

Post a Comment

Previous Post Next Post