‘మృత్యుంజయ్’ సినిమా చూసిన వాళ్లంతా గొప్పగా ఉందని ప్రశంసిస్తున్నారు.. థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో హీరో శ్రీ విష్ణు
కంటెంట్ కింగ్ శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ చిత్రంతో మరోసారి అలరించారు. మార్చి 6న ఈ మూవీ విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే శనివారం నాడు చిత్రయూనిట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో..
శ్రీ విష్ణు మాట్లాడుతూ ..‘సందీప్ గారు, పవన్ గారు, నేను కలిసి ఓ సినిమా చేయాలని అనుకున్నాం. ఆ టైంలో నాకు హుస్సేన్ షాని సందీప్ గారు పరిచయం చేశారు. కేవలం కంటెంట్‌తోనే సినిమాని తీయాలని సందీప్ గారు అనుకున్నారు. సెట్‌లో రమ్య గారే ఎక్కువగా ఉండేవారు. ఆమె మా అందరినీ చక్కగా చూసుకున్నారు. చిన్నా గారు, సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్పశర్మ గారు, రెబా గారు, పాప ఊహా ఇలా అందరూ అద్భుతంగా నటించారు. ఈ మూవీని ఆడియెన్స్ చాలా ఫ్రెష్‌గా ఫీల్ అవుతున్నారు. సాగర్ గారు మా అందరినీ చాలా కొత్తగా చూపించారు. హుస్సేన్ రైటింగ్, ట్విస్ట్‌లు అద్భుతంగా అనిపించాయి. కాళ భైరవ ఆర్ఆర్ చూసి నేను కూడా షాక్ అయ్యాను. ఆయన ఆర్ఆర్ వల్లే సినిమా స్థాయి పెరిగింది. ఈ చిత్రానికి ఆయనే నిజమైన హీరో. సినిమా చూసిన వాళ్లంతా గొప్పగా ఉందని ప్రశంసిస్తున్నారు. ఇంకా చూడని వాళ్లుంటే వెంటనే మా మూవీని చూడండి. తెలుగులో చాలా అరుదుగా వచ్చే థ్రిల్లర్‌లో ఇదొక మంచి సినిమా అవుతుంది. ఈ మంచి థ్రిల్లర్ అందరికీ నచ్చుతుంది తప్పకుండా చూడండి. ఇంకా మా మూవీని ఇలానే చూసి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ .. ‘‘మృత్యుంజయ్’ని ప్రమోట్ చేసేందుకు పాటలు, కామెడీ సీన్లు కూడా లేవు. మేం రిలీజ్ సినిమాలోని కంటెంట్‌తోనే ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు. మూవీ చూసిన తరువాత ఆడియెన్స్ సోషల్ మీడియాలో చెబుతున్న రివ్యూలు చూసి ఎంతో ఆనందమేసింది. మా సినిమాని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్. ఈ ప్రయాణంలో రమ్య గారు, వినయ్ గారు, సందీప్ గారు నన్నెంతో సపోర్ట్ చేశారు. బేబీ ఊహ ఈ చిత్రంలో ఎంతో అద్భుతంగా నటించింది. రచ్చ రవి, సుదర్శన్ ఇలా అందరూ చక్కగా నటించారు. కాళ భైరవ తన ఆర్ఆర్‌తో సినిమా స్థాయిని పెంచేశాడు. నా సిస్టర్ మనీషా వేసిన సెట్స్‌కి మంచి పేరు వస్తోంది. చిన్నా గారు మా సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. ఇదంతా కూడా శ్రీ విష్ణు గారి వల్లే సాధ్యమైంది. ఆయన కథను అంగీకరించడం వల్లే మేమంతా ఒక చోటకు వచ్చాం. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము చేయలేదని భావిస్తున్నాను. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన నా కుటుంబానికి థాంక్స్. మా సినిమాని ఇంకా ఇలానే ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
సందీప్ గుణ్ణం మాట్లాడుతూ .. ‘మీడియా నుంచి మా ‘మృత్యుంజయ్’కి చాలా మంచి సపోర్ట్ లభించింది. డే వన్ నుంచి మా మూవీకి మంచి రెస్పాన్స్ లభించింది. మీడియా రివ్యూలు, ఆడియెన్స్ మౌత్ టాక్ బాగా కలిసి వచ్చింది. నా సినిమాను తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లంతా హ్యాపీగా ఉన్నారు. నాకు అదే చాలా పెద్ద సక్సెస్. వినయ్‌తో కలిసి మంచి సినిమాలు తీయాలని జర్నీ స్టార్ట్ చేశాను. వినయ్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇలా వచ్చేది కాదు. హుస్సేన్ చెప్పే ప్రతీ కథను శ్రీ విష్ణుకి పంపించేవాడ్ని. అలా ఈ ‘మృత్యుంజయ్’ని తీశాం. కామెడీ కాకుండా కథనే చెబుదామని ముందే ఫిక్స్ అయ్యాం. సాగర్ విజువల్స్, మనీషా క్రియేట్ చేసిన ప్రపంచానికి అందరూ ఫిదా అవుతున్నారు. కాళ భైరవ స్కోర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రెబా అద్భుతంగా నటించారు. శ్రీ విష్ణుకి చాలా మొహమాటం. ఆయనకు కథలు, సినిమాలు అంటే ప్రాణం. మా రెండేళ్ల ప్రయాణం తరువాత ఈ ‘మృత్యుంజయ్’ కథ ఓకే అయింది. మేం మా ప్రొడక్ట్ చూసి బాగుందని అనుకున్నాం. కానీ ఆడియెన్స్ మాత్రం అద్భుతంగా ఉందని చెబుతున్నారు. నన్ను నమ్మి ఈ మూవీని చేసిన శ్రీ విష్ణు గారికి థాంక్స్. సండే ఫైనల్ మ్యాచ్‌లో మనం గెలుస్తాం. ఆ తరువాత మండే నుంచి మా సినిమాని చూడండి’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కాళ భైరవ మాట్లాడుతూ .. ‘‘మృత్యుంజయ్’ స్కోర్‌కి చాలా మంచి పేరు వస్తోంది. దీనికి నా టీం మెంబర్స్ హర్ష వర్దన్, సిద్దార్థ్, ఎబినజర్ పాల్, విశాల్ భరద్వాజ్ కారణం. అందరిలోనూ హర్ష వర్దన్ ఎక్కువగా పని చేశాడు. నా టీం అందరికీ థాంక్స్. ఇదంతా టీం ఎఫర్ట్. అందుకే అవుట్ పుట్ ఇంత బాగా వచ్చింది. శ్రీ విష్ణు అన్న యాక్టింగ్ వల్ల నా పని ఇంకా సులభంగా మారింది. హుస్సేన్ అన్న నాకు ఫ్యామిలీ మెంబర్‌లాంటి వారు. ఆయనతో మళ్లీ మళ్లీ పని చేయాలని ఉంది. సందీప్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ మూవీని ఇంకా ఇలానే సపోర్ట్ చేయాలని ఆడియెన్స్‌ని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


Post a Comment