“Sancharame” First Song from Epic – First Semester Touches Hearts

 హృదయాలను తాకుతున్న ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ తొలి గీతం 'సంచారమే'

‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ సినిమా నుంచి తొలి గీతంగా 'సంచారమే'ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మనోహరమైన పాట ప్రధాన పాత్రల భావోద్వేగ ప్రయాణాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించింది.

ప్రఖ్యాత గీత రచయిత గోరేటి వెంకన్న రచించిన ఈ పాట స్వచ్ఛమైన తెలుగు కవిత్వంతో పాటు హృదయాన్ని తాకే భావాలతో ప్రత్యేకంగా నిలుస్తోంది. దేశీ మూలాలు, విదేశీ జీవితానికి మధ్య ఉన్న విరుద్ధ భావాలను సున్నితంగా ప్రతిబింబిస్తూ సినిమా కథనానికి అనుగుణంగా ఈ పాట సాగుతుంది. ఈ గీతానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఆ కూర్పుకు మరింత గాఢతను జోడిస్తూ హేషమ్ అబ్దుల్ వహాబ్, గోరేటి వెంకన్న కలిసి శ్రావ్యంగా పాటను ఆలపించారు.

దృశ్యపరంగా ఈ పాట లండన్ యొక్క అద్భుతమైన దృశ్యాలను ప్రదర్శిస్తుంది. అంతర్జాతీయ ప్రకృతి దృశ్యాలను, తెలుగు స్వరాల మాధుర్యాన్ని మిళితం చేస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఈ గీతముంది. బ్లాక్‌బస్టర్ “బేబీ” తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడి తెరపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

90s' వెబ్ సిరీస్ తో అందరి మనసులు దోచుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా అద్భుతమైన తారాగణం, ప్రతిభగల సాంకేతిక బృందాన్ని ఒకచోట చేర్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. వెంకట్ ఉప్పుటూరి, వి.ఎం.ఆర్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'ను భావోద్వేగాలతో కూడిన మృదువైన ప్రేమకథగా నిర్మాతలు అభివర్ణించారు. యువ హృదయాల అమాయకత్వం, సంఘర్షణలు, మౌన భావాలను ప్రతిబింబించే సరికొత్త, మధురమైన ప్రేమకథకు ఈ చిత్రం హామీ ఇస్తుంది.

ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య

రచన, దర్శకత్వం: ఆదిత్య హాసన్

సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్

ఛాయాగ్రహణం: అజీమ్ మహమ్మద్

కూర్పు: నవీన్ నూలి

ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె వర్మ

సహ నిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, వీఎంఆర్

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య

నిర్మాణ సంస్థలు: సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్

సమర్పణ: శ్రీకర స్టూడియోస్

పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Post a Comment

Previous Post Next Post