అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం – తెలంగాణలో 5 జిల్లా కమిటీల ఏర్పాటు
Allu Arjun ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్వహించిన సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం ద్వారా తెలంగాణలో సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
AAFA తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ గారు నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలోని 5 జిల్లాలకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ జిల్లాలు:
•కరీంనగర్ , ఖమ్మం , ఆదిలాబాద్,
•వరంగల్ , నిజామాబాద్
ఈ కమిటీల ఏర్పాటు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల కార్యక్రమాలను సమన్వయం చేయడం, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఇచ్చిన “One Good Deed Every Year” అనే సందేశాన్ని అనుసరిస్తూ, ప్రతి సంవత్సరం కనీసం ఒక మంచి పని చేసి సమాజానికి సేవ చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు.
సమావేశానికి సంబంధిత జిల్లాల ప్రతినిధులు, అభిమానులు హాజరై రాష్ట్ర నాయకత్వం మార్గదర్శకత్వంలో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని సంకల్పించారు.


Post a Comment