Repu Udayam 10 Gantalaku First Look Unveiled

 సినిమా పేరే 'రేపు ఉదయం 10 గంటలకు'... :

చెందు ముద్దు దర్శకత్వంలో మ్యాంగో మాస్ మీడియా వారి 

సస్పెన్స్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్ విడుదల



సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. 'ఓ పిట్ట కథ', 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' సినిమాలకు దర్శకత్వం వహించిన చెందు ముద్దు నుంచి వస్తున్న తాజా సస్పెన్స్‌ థ్రిల్లర్ 'రేపు ఉదయం 10 గంటలకు'. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో విడుదలవుతోన్న చిత్రమిది. మార్చి 3, మంగళవారం ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. 

'రేపు ఉదయం పది గంటలకు' సినిమాలో అభినవ్ గోమటం, హెబా పటేల్, చైతన్య రావు, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ ప్రధాన తారాగణం. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... గడియారాన్ని హైలైట్ చేశారు. టైటిల్ వెనుక ఒక క్లాక్, నటీనటులు అందరి వెనుక మరొక క్లాక్ ఉన్నాయి. టైటిల్ వెనుక గడియారంలో పది గంటలు చూపిస్తే... ఆర్టిస్టుల వెనుక గడియారంలో రెండు గంటల సమయాన్ని చూపించారు. వీటి వెనుక కథ తెలియాలంటే టీజర్, ట్రైలర్ విడుదల వరకు వెయిట్ చేయాలి. 

చెందు ముద్దు దర్శకత్వం వహించిన 'రేపు ఉదయం పది గంటలకు' సినిమాను రామ్ వీరపనేని నిర్మిస్తున్నారు. త్వరలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో చిత్ర బృందం బిజీగా ఉంది. త్వరలో విడుదల తేదీని వెల్లడించనున్నారు.

అభినవ్ గోమటం, హెబా పటేల్, చైతన్య రావు, కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ తదితరులు నటించిన 'రేపు ఉదయం పది గంటలకు' చిత్రానికి సమర్పకులు: మాంగో మాస్ మీడియా, సినిమాటోగ్రాఫర్: సునీల్ కుమార్ నామా, సంగీత దర్శకుడు: ప్రిన్స్ హెన్రీ, ఎడిటర్: డి. వెంకట ప్రభు, పీఆర్వో: పులగం చిన్నారాయణ, నిర్మాత: రామ్ వీరపనేని, దర్శకుడు: చెందు ముద్దు.

Post a Comment

Previous Post Next Post