Seetha Payanam Trailer Unveiled

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా పయనం’ ట్రైలర్ రిలీజ్.. ఫిబ్రవరి 14న చిత్రం నాలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా బారి ఎత్తున విడుదల

మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు వదిలిన కంటెంట్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ట్రైలర్ అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేస్తోంది. ‘అతను లిఫ్ట్ అడిగితే ఓకే అన్నాను.. ఇప్పుడు అతను నా పక్కనే కూర్చున్నాడు’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ను ఓపెన్ చేశారు. బ్యూటీఫుల్ విజువల్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. కారులో హీరో, హీరోయిన్లు చేసే ప్రయాణం.. వారిద్దరి మధ్య వచ్చే సీన్లు చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ పవర్ ఫుల్ ఎంట్రీ అదిరిపోయింది. యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రంలో మెయిన్ అస్సెట్‌గా నిలిచేట్టున్నాయి. ఈ ట్రైలర్‌లో యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా చేసిన పోరాట సన్నివేశాలు మరింత అట్రాక్షన్‌గా నిలిచాయి. 

మాస్ యాక్షన్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని రకాల అంశాల్ని ఈ ట్రైలర్‌లో జోడించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని ‘సీతా పయనం’ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ చిత్రానికి జి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాయగా అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. చిత్రంలోని స్టంట్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ అందించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14న తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. 

నటీనటులు : నిరంజన్, ఐశ్వర్య అర్జున్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ, యాక్షన్ కింగ్ అర్జున్, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా తదితరులు

సాంకేతిక బృందం:

బ్యానర్: శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్

స్టోరీ - స్క్రీన్ ప్లే - ప్రొడ్యూసర్, డైరెక్టర్: యాక్షన్ కింగ్ అర్జున్

డైలాగ్స్: Dr. సాయి మాధవ్ బుర్ర

మ్యూజిక్: మెలోడీ కింగ్ అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ: G. బాల మురుగన్

ఎడిటర్: అయూబ్ ఖాన్

ఆర్ట్ డైరెక్టర్స్: మోహన్ బి కేరీ, శివ కామేష్ డి, CH కృష్ణ

ఫైట్స్ : కిక్ యాస్ కాళీ 

లైన్ ప్రొడ్యూసర్: UL. మూర్తి

PRO: సాయి సతీష్

డిజిటల్ మార్కెటింగ్: స్టార్ సర్కిల్

Post a Comment

Previous Post Next Post