Rajasaab Extended Cut to Stream on JioHotstar from Feb 6

జియో స్టార్‌లో ఫిబ్ర‌వ‌రి 6 నుంచి ఇండియా బిగ్గెస్ట్ సూప‌ర్‌స్టార్ ప్ర‌భాస్ న‌టించిన మూవీ ‘ది రాజా సాబ్’ స్ట్రీమింగ్‌.. ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సినిమా

 హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 5: ప‌్ర‌ముఖ ఓటీటీ మాధ్య‌మం జియో స్టార్‌లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్ర‌వ‌రి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంద‌ని సోష‌ల్ మీడియాలో జియో స్టార్ అనౌన్స్ చేసింది.

భార‌త‌దేశంలో బిగ్గెస్ట్ సూప‌ర్‌స్టార్‌గా పేరున్న ప్ర‌భాస్ ఈ చిత్రంలో న‌టించారు. దీంతో ప్రేక్ష‌కుల్లో సినిమాపై ఆస‌క్తి ఏర్ప‌డింది. ఫిబ్ర‌వ‌రి 6న స్ట్రీమింగ్ అవుతుంద‌నే అధికారిక ప్ర‌క‌ట‌న‌తో పాటు, జియో హాట్ స్టార్ కొత్త ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. హిప్నాటిక్ థ్రిల్ల‌ర్‌గా ఉత్కంఠ‌త‌ను పెంచే క‌థ‌తో సినిమా ప్రేక్ష‌కులను అంచ‌నాల‌ను పెంచుతోంది.

ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో ది రాజా సాబ్‌ను రిలీజ్ చేస్త‌న్నామ‌నే ప్ర‌క‌ట‌న‌తో పాటు, ట్రైల‌ర్‌కు అభిమానుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ అనౌన్స్‌మెంట్ త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించిన డిస్క‌ష‌న్స్ సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో ఊపందుకున్నాయి.

 జియో హాట్ స్టార్స్‌లో ది రాజా సాబ్ మూవీ ఫిబ్ర‌వ‌రి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది

Post a Comment

Previous Post Next Post