Danny First look Launched

వాలెంటైన్స్ డే సందర్భంగా కళ్యాణ్‌జి గోగణ, ఆశీష్ గాంధీ కాంబోలో తెరకెక్కిన ‘డానీ’ ఫస్ట్ లుక్ విడుదల

కొల్లి గోపాల కృష్ణ సమర్పణలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జి గోగణ పిక్చర్స్ బ్యానర్ల మీద కళ్యాణ్‌జి గోగణ తెరకెక్కించిన చిత్రం ‘డానీ’. ఉపశీర్షిక వెల్కమ్ టు లవ్ జంగిల్. ఈ సినిమాలో ఆశీష్ గాంధీ హీరోగా నటించాడు. ఈ చిత్రాన్ని రిజ్వాన్, కుషి సంయుక్తంగా నిర్మించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను ఇచ్చారు. అందరూ ఆశ్చర్యపోయేలా టైటిల్‌తో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలారు. రా అండ్ రస్టిక్ సినిమాల్ని ఎక్కువగా ఆదరిస్తున్న ఈ తరుణంలో ‘డానీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

డానీ’ ఫస్ట్ లుక్‌ను గమనిస్తే సినిమా ఎంతలా ఉండబోతోందో అర్థం అవుతోంది. 

హీరో రగ్డ్ లుక్, జుట్టు, గడ్డం, బాడీ, మెడలో మాల ఇవన్నీ చూస్తుంటే మాస్ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే పాత్రలా కనిపిస్తోంది. ఇక ఆ సిగరెట్ తాగే విధానం, హీరోయిన్ కాళ్లతో సిగరెట్ పట్టుకోవడం డిఫరెంట్‌గా ఉంది. ఇక పోస్టర్‌లోనే ఇంత వైవిధ్యం కనిపిస్తుంటే సినిమా ఇంకెంత విభిన్నంగా ఉంటుందో అని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని ఫినిష్ చేసి జూన్ 26న సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రాకేందు మౌళి పాటల్ని రాయడమే కాకుండా సంగీతాన్ని అందించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర అప్డేట్‌లను ప్రకటించనున్నారు.

Post a Comment

Previous Post Next Post