Vijay Deverakonda Family Star 2nd single "Kalyani Vaccha Vacchaa" lyrical song out now

 విజయ్ దేవరకొండ "ఫ్యామిలీ స్టార్" సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'కళ్యాణి వచ్చా వచ్చా..' లిరికల్ సాంగ్ విడుదల




స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా నుంచి సెకండ్ సింగిల్  'కళ్యాణి వచ్చా వచ్చా..' రిలీజైంది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా వచ్చే ఈ పాటకు అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించగా...మంగ్లి, కార్తీక్ ఎనర్జిటిక్ గా పాడారు. గోపీ సుందర్ మంచి డ్యాన్స్ నెంబర్ కంపోజ్ చేశారు. ఈ పాటలో విజయ్, మృణాల్ మేకోవర్, అప్పీయరెన్స్, బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది.


'కళ్యాణి వచ్చా వచ్చా..' లిరికల్ సాంగ్ ఎలా ఉందో చూస్తే..' కల్యాణి వచ్చా వచ్చా పంచ కల్యాణి తెచ్చా తెచ్చా..సింగారీ చెయ్యందించా, ఏనుగంబారీ సిద్ధంగుంచా..ధమకు ధమా ధమారి, ఛమకు ఛమా ఛమారి, సయ్యారి సరాసరి మొదలుపెట్టే సవారి, డుమకు డుమా డుమారి, జమకు జమా జమారి, ముస్తాభై ఉన్నామని అదరగొట్టేయ్ కచేరి....' అంటూ పెళ్లి సందడిని రెట్టింపు చేసేలా సాగిందీ పాట. "ఫ్యామిలీ స్టార్" సినిమాలో ఈ పాట కలర్ ఫుల్ గా ఉండబోతోంది.  


"ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. "ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.



నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు


 టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్

సంగీతం : గోపీసుందర్

ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా, వంశీ కాక

క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ

నిర్మాతలు : రాజు - శిరీష్

రచన, దర్శకత్వం - పరశురామ్ పెట్ల





Post a Comment

Previous Post Next Post