Latest Post

Love Me- If You Dare' is an unique attempt: Ace Producer Dil Raju at the 'Raavaali Raa' song launch event

 ‘లవ్ మీ’ చాలా కొత్త ప్రయత్నం.. ‘రావాలిరా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దిల్ రాజు



టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా నుంచి టీజర్ రీసెంట్ గా విడుదలై మంచి స్పందనను దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి ‘రావాలి రా’ అనే పాటను శనివారం విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో..


దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఐదుగురు సింగర్లతో పాటు వైష్ణవి చేత కీరవాణి గారు ఈ పాటను పాడించారు. నేను కూడా ఇంతలా హమ్ చేశానంటే.. అందరూ ఈ పాటను హమ్ చేస్తూనే ఉంటారు. కీరవాణి గారు ఎంతో మెలోడియస్‌గా ట్యూన్ చేశారు. ఈ స్టోరీ విన్నప్పుడు ఓ కొత్త కథ విన్న ఫీలింగ్ అనిపించింది. చాలా ఎగ్జైటింగ్‌తో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. అన్నీ కొత్త కథలు దొరకవు. కొన్ని సార్లు సేఫ్ గేమ్ ఆడుతుండాలి. ఇది చాలా కొత్త కథ అని మాత్రం నమ్ముతున్నాను. ప్రేక్షకులు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి. సినిమా చూస్తున్నంత సేపు కూడా నెక్ట్స్ సీన్ ఏంటన్నది ఊహించలేరు. సినిమా అంతా అయ్యాకే ఆడియెన్స్‌కు అర్థం అవుతోంది. ఇది చాలా న్యూ అటెంప్ట్. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలున్నారు. కొత్తగా ట్రై చేస్తేనే జనాలు యాక్సెప్ట్ చేశారని ఆశిష్‌కు సలహా ఇచ్చాను. ముందు నటుడిగా ఎదగమని సూచించాను. నా ఆలోచనను ఆశిష్ అర్థం చేసుకున్నారు. ఆశిష్ కోసం ఈ కథను అనుకోలేదు. నాగ, అరుణ్ కథ చెప్పాక.. ఆశిష్ అయితే ఎలా ఉంటుందో చూడండని చెప్పాను. ఓ వారం తరువాత వాళ్లే వచ్చి ఆశిష్ బాగుంటాడని అన్నారు. పీసీ శ్రీరామ్, కీరవాణి గారికి స్క్రిప్ట్ చెప్పి ఒప్పించారు. చాలా కొత్తగా ఉందని వారు అంగీకరించారు. బడ్జెట్ ఎంతో చెప్పండి.. ఆ బడ్జెట్లోనే తీస్తామని నాగ, అరుణ్ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఇదో ఘోస్ట్ లవ్ స్టోరీ. సినిమాను ముందే కొంత మందికి చూపించాలని అనుకున్నాం. కానీ ట్విస్టులు రివీల్ అవుతాయని ముందుగా చూపించడం లేదు’ అని అన్నారు.


ఆశిష్ మాట్లాడుతూ.. ‘ఇంత వరకు ఎన్నో హారర్ కామెడీ చిత్రాలను చూశారు. ఇది డిఫరెంట్ జానర్. డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ లవ్ స్టోరీ. ఇలాంటి కొత్త సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. బేబీ లాంటి పెద్ద హిట్ కొట్టినా కూడా మా లాంటి కొత్త వారికి పక్కన వైష్ణవి నటించింది. మాకు ఇంత మంచి చిత్రాన్ని ఇచ్చిన దిల్ రాజు గారికి థాంక్స్. ఏప్రిల్ 25న మా చిత్రం రాబోతోంది’ అని అన్నారు.


వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘సెల్లార్‌లో అద్భుతమైన సెట్ వేసి ఈ పాటను షూట్ చేశారు. ఆ రోజు బ్యాక్ గ్రౌండ్‌లో సాంగ్ ప్లే అవుతుంటే నాకు ఎంతో భయం వేసింది. ఇంత మంచి పాటను ఇచ్చిన చంద్రబోస్ గారికి థాంక్స్. ఏప్రిల్ 25న మేం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మా సినిమాను థియేటర్లో చూడండి. మీ అభిప్రాయాన్ని చెప్పండిద. మీకు కచ్చితంగా ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది’ అని అన్నారు.


దర్శకుడు అరుణ్ భీమవరపు మాట్లాడుతూ.. ‘ఈ కథను నమ్మిన దిల్ రాజు గారికి థాంక్స్. ఇది నా సొంత కథే. ఘోస్ట్‌ని లవ్ చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ఈ సినిమా కథను రాయడం ప్రారంభించాను. నేను మూడు నవలలు రాశాను. ఈ కథను కూడా నావల్‌గా రాశాను. కానీ సినిమాగా తీశాను. ఇంత వరకు చేయని, రాయని పాత్రను ఆశిష్ పోషించాడు. ఆ కారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది’ అని అన్నారు.

Director Chidambaram S Poduval Interview About Manjummel Boys

 'మంజుమ్మల్ బాయ్స్'ను మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేస్తుండటం గర్వంగా, సంతోషంగా ఉంది. 'మంజుమ్మల్ బాయ్స్' తెలుగు ప్రేక్షకులకు కూడా తప్పకుండా నచ్చుతుంది: డైరెక్టర్ చిదంబరం ఎస్ పొదువల్ ఇంటర్వ్యూ



బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి మలయాళ సినిమాగా ''మంజుమ్మల్ బాయ్స్' చరిత్ర సృష్టించింది. ఇది యాదార్థంగా గుణ కేవ్స్‌లో జరిగిన సంఘటన స్ఫూర్తితో, కొచ్చికి చెందిన కొంత మంది స్నేహితుల కథను అద్భుతంగా చూపించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్. ఈ చిత్రానికి చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్‌ తెలుగు హక్కులు సొంతం చేసుకుంది. ఏప్రిల్ 6న  మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చిదంబరంతో స్పెషల్ ఇంటర్వ్యూ...


కంగ్రాచులేషన్స్ చిదంబరం ఎస్ పొదువల్ గారు... మీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, మలయాళంలో బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాసింది!

-థాంక్యూ అండీ. మలయాళ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అది మా టీం అందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.


సినిమా విడుదలకు ముందు రూ. 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఊహించారా?

-లేదండీ! మేం మంచి సినిమా తీశాం. కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది. అయితే, రూ. 200 కోట్ల కలెక్షన్లు వస్తాయని అసలు ఊహించలేదు. కలెక్షన్స్ కోసం మేం సినిమా తీయలేదు. నేను గానీ, నిర్మాతలు గానీ, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ గానీ కలెక్షన్స్ గురించి అసలు ఆలోచించలేదు.


 'మంజుమ్మెల్ బాయ్స్' తీయాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది?

-నా ఫస్ట్ సినిమా 'జానెమన్' 2021లో విడుదలైంది. ఆ తర్వాత కేరళలో కొందరు స్నేహితులు గుణ కేవ్స్‌కి వెళ్లారని, ఈ సంఘటన జరిగిందని నాకు తెలిసింది. ఆ స్నేహితుల కథ, వాళ్ల స్నేహం నన్ను ఎగ్జైట్ చేసింది. అప్పట్నుంచి వర్క్ స్టార్ట్ చేశాను.


రియల్ 'మంజుమ్మెల్ బాయ్స్'ను మీరు కలిశారా? స్క్రిప్ట్ కోసం ఎటువంటి రీసెర్చ్ చేశారు?

-అవును. నేను వాళ్లను కలిశా. ఆల్రెడీ నేనొక సినిమా చేశానని చెప్పారు. అందరూ తమ తమ జీవితాల్లో ఏం జరిగిందో వివరించారు. సినిమాకు కావాల్సిన మెటీరియల్ ఉందని అర్థమైంది. 'ఇది ప్రజలకు చెప్పాల్సిన కథ. సినిమా తీయాలి' అన్నాను. వాళ్ల కథను సినిమా తీస్తానని చెప్పేసరికి ఎగ్జైట్ అయ్యారు.


మీ ఫస్ట్ సినిమా 'జాన్ ఈ మన్' నవంబర్ 19, 2021లో విడుదల అయితే 'మంజుమ్మెల్ బాయ్స్' ఫిబ్రవరి 22న మలయాళంలో విడుదలైంది. ఈ సినిమా తీయడానికి ఆల్మోస్ట్ మూడేళ్లు పట్టినట్టు ఉంది?

-రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని కథలు రాయడం టఫ్ ప్రాసెస్. 'మంజుమ్మెల్ బాయ్స్' స్క్రిప్ట్ రాయడానికి నాకు ఏడాది, ఏడాదిన్నర పట్టింది. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఆరు నెలలు తీసుకున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం మరో ఆరు నెలలు పట్టింది. సినిమా తీసే ప్రతి ప్రాసెస్ నేను ఎంజాయ్ చేశా.


రియల్ లొకేషన్స్‌లో కొంత, సెట్స్ వేసి కొంత సినిమా తీశారు! ఆ ప్రాసెస్ గురించి...

-'మంజుమ్మెల్ బాయ్స్' గుణ కేవ్స్ వెళ్లే వరకు ఆ కొడైకెనాల్ ట్రిప్, కేప్స్ అవుట్ సైడ్ సీన్స్ అన్నీ రియల్ లొకేషన్స్‌లో తీశాం. కేవ్స్ లోపల సీన్స్ కోసం సెట్స్ వేశాం. ఆ సెట్ వర్క్ కోసం నాలుగు నెలలు పట్టింది. షూటింగ్ ప్రాసెస్ అంతా ఈజీగా ఉంది. మేమంతా కలిసి టూర్ వెళ్లినట్టు రియల్ లొకేషన్స్‌లో ఆడుతూ పాడుతూ సినిమా చేశాం. 


సినిమాలో మీ అన్నయ్య నటించారు కూడా! సో, ఫ్యామిలీ ట్రిప్ అన్నమాట!

-(నవ్వుతూ...) డాక్టర్ ఫైజల్ రోల్ చేసిన గణపతి ఎస్ పొదువల్ నా బ్రదర్. యాక్టర్, ప్రొడ్యూసర్ సౌబిన్ షాహిర్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. షూటింగ్ దగ్గరకు మా ఫ్యామిలీస్ కూడా వచ్చాయి. ప్రతి రోజూ రాత్రి బాన్ ఫైర్ (చలిమంట) వేసేవాళ్ళం. అందరం కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్లం. జీవితంలో మళ్లీ అటువంటి రోజులు వస్తాయో, రావో! మేమంతా అంత ఎంజాయ్ చేశాం. సినిమా ప్రాసెస్ అంతా మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్. గుణ కేవ్స్‌కు తొలిసారి వెళ్లడం కూడా మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్.


'మంజుమ్మెల్ బాయ్స్' టిపికల్ కమర్షియల్ ఫార్మాట్ సినిమా కాదు. సౌబిన్ షాహిర్‌, నిర్మాతలను ఎలా కన్వీన్స్ చేశారు?

-'మంజుమ్మెల్ బాయ్స్' రీసెర్చ్, రైటింగ్ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి సౌబిన్ షాహిర్‌ నాతో ట్రావెల్ అయ్యారు. సో, ఆయన్ను కన్వీన్స్ చేయడం కష్టం ఏమీ కాలేదు. ఆయన ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. కథలో స్పార్క్ ఆయన గుర్తించారు. అయితే మీరు చెప్పినట్టు రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు. కాకపోతే మాది పెద్ద సినిమాయే. 


సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ గురించి...

-కేరళలో బెస్ట్ సినిమాటోగ్రాఫర్లలో షైజు కాలిద్ ఒకరు. ఆయన ఎన్నో బ్యూటిఫుల్ సినిమాలు చేశారు. మా సినిమాకు ఆయన వర్క్ చేయడం మా అదృష్టం. మ్యూజిక్ డైరెక్టర్ సుషిన్ శ్యామ్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఎక్కువ వాడలేదు. సర్వైవల్ థ్రిల్లర్‌కు కావాల్సిన ఆర్ఆర్ ఇచ్చారు.


లోకనాయకుడు కమల్ హాసన్ గారి 'గుణ'లోని 'కన్మణి అన్‌బోతు' పాటకు 'మంజుమ్మెల్ బాయ్స్' ట్రిబ్యూట్ అని చెప్పాలి. సినిమా తీద్దామని అనుకున్నప్పుడు ఆ సాంగ్ యూజ్ చేయాలని అనుకున్నారా?

అవును అండీ. గుణ కేవ్స్ అంటే ముందుగా 'కన్మణి...' సాంగ్ గుర్తొస్తుంది. ఫ్రెండ్షిప్ స్టోరీకి సెట్ అవుతుంది. అందుకే ఉపయోగించాం. 


కమల్ హాసన్ గారు సినిమా చూశారు. మీరు, టీం ఆయన్ను కలిశారు. కమల్  గారు ఏమన్నారు? 

-మా సినిమా టీమ్ అంతా కమల్ సార్ ఫ్యాన్స్. ఆయన్ను కలవడం మాకొక మేజికల్ మూమెంట్. 'నాకు సినిమా బాగా నచ్చింది' అని కమల్ సార్ చెప్పడం ఇంకా ఇంకా సంతోషం. అది పెద్ద అవార్డుతో సమానం. మమ్మల్ని ఆహ్వానించి, మాతో విలువైన సమయాన్ని గడిపిన కమల్ గారికి ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే.


కమల్ హాసన్ గారితో మీరు సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా? 

-కమల్ హాసన్ గారిని డైరెక్ట్ చేయాలనేది ప్రతి ఒక్క డైరెక్టర్ డ్రీం. ఆ అవకాశం వస్తే ఎవరు కాదంటారు?


కమల్ హాసన్ గారితో సినిమాకు మీ దగ్గర ఐడియాస్ ఏమైనా ఉన్నాయా?

-అఫ్ కోర్స్... చాలా ఐడియాస్ ఉన్నాయి. అయితే, రైటింగ్ పార్ట్ టఫ్ ప్రాసెస్. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పలేను.   


పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో 'మంజుమ్మెల్ బాయ్స్' విడుదల చేస్తోంది. వాళ్ళ గురించి...?

-మైత్రీ మూవీ మేకర్స్ గురించి మలయాళంలో కూడా తెలుసు. 'పుష్ప' చేశారు కదా! మైత్రీ రవి గారితో నేను మాట్లాడాను. తెలుగులో ఆ సంస్థ ద్వారా సినిమా విడుదల కావడం నాకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. మా సినిమాకు మంచి సపోర్ట్ దొరికింది. ఇంత కంటే బెస్ట్ నేను ఆశించలేను.


ఏప్రిల్ 5న తెలుగులో సినిమా విడుదల అవుతోంది. తెలుగు ప్రేక్షకులకు మీరేం చెప్పాలని అనుకుంటున్నారు?

-కేరళలో మేం తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తాం. మలయాళీలకు తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్ గారికి కేరళలో పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. మలయాళంలో 'మంజుమ్మెల్ బాయ్స్'కు వచ్చిన స్పందన తెలుగులో కూడా వస్తుందని ఆశిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా సినిమా నచ్చుతుంది.


అవకాశం వస్తే తెలుగులో ఏ హీరోతో సినిమా చేస్తారు?

-తెలుగులో నాకు ఇష్టమైన హీరోలు చాలా మంది ఉన్నారు. ఒక్కరి పేరు చెప్పలేను. చిరంజీవి గారు, బాలయ్య గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు... డిఫరెంట్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్లందరితో సినిమా చేయడానికి ఎగ్జైటెడ్‌గా ఉన్నాను.


మీ నెక్స్ట్ సినిమా?

-ఇంకా డిసైడ్ అవ్వలేదు.


ఆల్ ది బెస్ట్ 

-థాంక్ యూ

"JITHENDER REDDY " Movie Based on Real Events Releasing worldwide on May 3rd

విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న జితేందర్ రెడ్డి సినిమా, పొలిటికల్ డ్రామా - మే 3న



బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల మన్ననలు పొందిన రాకేష్ వర్రే, గతంలో ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమాతో హీరో, నిర్మాతగా మారిన సంగతి అందరికీ తెలిసిందే, రీసెంట్ గా నిర్మాతగా ‘పేకమేడలు’ చిత్రం టీజర్ను లాంచ్ చేసి మంచి కథలు, కొత్త కథలను ప్రేక్షకులకు అందించాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ‘జితేందర్ రెడ్డి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నారు.  గతంలో రిలీజ్ చేసిన ప్రోమోకి, అస్సలు ఎవరు ఈ జితేందర్ రెడ్డి అని ? అని హీరో పేస్ రెవీల్ చెయ్యకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి ఆదరణ పొందాయి.. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ జితేందర్ రెడ్డి సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది. 2024 May 3న ఈ చిత్రం విడుదల కాబోతుంది అని చిత్ర దర్శకుడు విరించి వర్మ చెప్పారు, ఈ సందర్భంగా దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ, ఈ సినిమా 1st లుక్ పోస్టర్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో ఎవరో చూపించకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి క్యూరియాసిటీని పెంచాయి.. రాకేష్ వర్రే ఫ్యామిలీ హీరో గా ఎవ్వరికీ చెప్పొద్దూ లాంటి లవ్ స్టొరీని చేసినప్పటికీ ఇలాంటి ఒక ఆక్షన్ డ్రామా చెయ్యడం చాలా గొప్ప విషయం. ఈ జితేందర్ రెడ్డి జగిత్యాలలో 1980లలో యదార్ధంగా జరిగిన కథ. రియల్ స్టొరీని బాగా తియ్యడానికి చాలా రీసెర్చ్ అవసరమైంది, దాని కోసం నేను మా టీం వర్క్ ఔట్స్ చేసి, రెఫెరెన్సులు తీసుకుని, పెద్ద వారి సలహాలు తీసుకుని చాలా జెన్యూన్ గా చేసిన సినిమా ఇది..  మే 3న రిలీజ్ అయ్యే ఈ సినిమాతో ఆరోజుల్లో విలువలతో కూడిన ఈ పాత్ర, దాని చుట్టూ తిరిగే కథని ఈ తరం ప్రేక్షకులకి అందించాలని చేసే ప్రయత్నమే ఈ జితేందర్ రెడ్డి. 


ముదుగంటి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ఉయ్యాలా జంపాలా, మజ్ను లాంటి ప్రేమకథా చిత్రాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ, మా జితేందర్ రెడ్డి లాంటి ఆక్షన్ స్టొరీని కూడా అద్భుతంగా తెరకెక్కించారు.. ఈ చిత్రం యొక్క పోస్టర్స్, గ్లిమ్స్ ను చాలా మంది అప్ప్రిషిఎట్ చేస్తున్నారు, జితేందర్ రెడ్డి అనే టైటిల్ ఏ చాలా పవర్ఫుల్ టైటిల్. 1980లో నేను చూసిన, నాకు తెలిసిన కథ ఈ జితేందర్ రెడ్డి, అప్పటి లొకేషన్స్ గాని, అప్పటి అంబియన్స్ ని గాని చాలా చక్కగా తెరకేక్కించాము. మా హీరో రాకేష్ వర్రే గురంచి మీకు చెప్పాలి, గతంలో లవ్ స్టొరీ చేసి ఇప్పుడు ఈ ఆక్షన్ డ్రామా ని కూడా చాలా బాగా హేండిల్ చేశాడు, తనకు సొంతగా క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ ఉన్నప్పటికీ, తన సినిమాలే మూడు జరుగుతున్నప్పటికీ కూడా ఈ జితేందర్ రెడ్డిని తన సొంత ప్రాజెక్ట్ లాగా, తన సినిమాల పనులను అడ్జస్ట్ చేసుకుని చాలా శ్రమని ఈ సినిమా కోసం పెట్టారు.. అప్పటి సన్నివేశాలని, జరిగిన కథని యదార్ధంగా చూపించాము తప్ప, ఎవరిని కించ పరిచే విధంగా మాత్రం చెయ్యలేదు. సుబ్బరాజు గారి లాంటి విలక్షణ నటులు కూడా మనసు పెట్టి అధ్బుతంగా ఈ కథ కోసం పని చేశారు. ఈసినిమాకి సంబధించిన updatesను మీకు ఇక నండి ఇస్తూ ఉంటాము, మేము మొదటి సారి సినిమా ఇండస్ట్రీ కి వచ్చి ఈ సినిమా చేస్తున్నాము, మమ్మల్ని ఆశీర్వదించండి.


సాంకేతిక నిపుణులు విషయానికి వస్తే ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలకు (కంచే, NTR కథానాయకుడు, NTR మహానాయకుడు, IB 47) విషువల్స్ అందిచిన వి.ఎస్‌ జ్ఞాన శేఖర్‌ ఈ సినిమాకి కెమెరామెన్‌ గా పని చేశారు. అలాగే ఎన్నో లవ్ స్టోరీస్ కు మ్యూజికల్ హిట్స్ అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్‌ జితేందర్ రెడ్డి సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నాగేంద్రకుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ముదుగంటి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.


నటీ నటులు : రాకేష్ వర్రే, రియా సుమన్,

ఛత్రపతి శేఖర్,

సుబ్బరాజు, రవి ప్రకాష్,

ఛత్రపతి శేఖర్


సాంకేతిక నిపుణులు:

డైరెక్టర్ : విరించి వర్మ.

నిర్మాత :  ముదుగంటి రవీందర్ రెడ్డి.

కో - ప్రొడ్యూసర్ : ఉమ రవీందర్.

ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వాణిశ్రీ పొడుగు

డి. ఓ. పి : వి. ఎస్. జ్ఞాన శేఖర్.

మ్యూజిక్ డైరెక్టర్ : గోపి సుందర్.

ఆర్ట్ డైరెక్టర్: నాగేంద్రకుమార్

పి ఆర్ వో: మదు వి ఆర్

Nithiin’s Birthday Spl Robinhood Poster Released

 Nithiin’s Unbeatable Swag & Style- Birthday Special Poster From Venky Kudumula, Mythri Movie Makers’ Robinhood Released



Hero Nithiin is all set to enthrall as Robinhood in his next release being helmed by Venky Kudumula who previously provided him with the blockbuster Bheeshma. The actor appeared as a robber in the teaser of this humorous action adventure produced by Mythri Movie Makers. Venky Kudumula showed Nithiin’s character in a first-of-its-kind manner.


Nithiin celebrates his birthday today. On this special occasion, the makers of Robinhood have come up with a brand-new poster. Nithiin who sports a trendy look in the movie shows his unbeatable swag and style in the birthday special poster. Talking on a Bluetooth device, and walking elegantly, Nithiin is seen with arms loaded to his pants. He looks like an agent and the name on the t-shirt reads: Agent RH (Robinhood). Sporting black shades and a watch, Nithiin looks graceful in the poster. It’s a pleasant surprise to Nithiin’s fans.


Naveen Yerneni and Y Ravi Shankar are the producers of the movie which will have top-notch technicians taking care of different crafts. The movie has music by National Award Winner GV Prakash Kumar who provided the fascinating score for the glimpse. Sai Sriram handles the cinematography, while Prawin Pudi is the editor and Raam Kumar is the art director.


Nata Kireeti Rajendra Prasad and Vennela Kishore are playing important roles in the movie.


Cast: Nithiin, Rajendra Prasad, Vennela Kishore and others


Technical Crew:

Writer, Director: Venky Kudumula

Banner: Mythri Movie Makers

Producers: Naveen Yerneni and Y Ravi Shankar

CEO: Cherry

Music: GV Prakash Kumar

DOP: Sai Sriram

Art Director: Raam Kumar

Executive Producer: Hari Tummala

Line Producer: Kiran Ballapalli

Fights: Ram-Laxman

Publicity Designer: Gopi Prasanna

PRO: Vamsi-Shekar

Marketing: First Show

VIBE First Look Poster Unveiled

 Sundeep Kishan, Swaroop RSJ, Rahul Yadav Nakka, Swadharm Entertainment’s Production No 5 Titled VIBE Bloody First Look Poster Unveiled, Theatrical Release In Summer 2025



Hero Sundeep Kishan who is on cloud nine with the success of Captain Miller and Ooru Peru Bhairavakona joins hands with the makers of the path-breaking movie Agent Sai Srinivasa Athreya. Swaroop RSJ will direct #SK31, while Rahul Yadav Nakka will produce it on Swadharm Entertainment as Production No 5.


Swaroop RSJ who won accolades for his first movie is coming up with yet another interesting project, whereas Rahul Yadav Nakkina who has good taste in story selection and is known for making content-based movies with good technical and production values is producing this new movie on a high budget. So, there will be a huge anticipation for the movie in this blockbuster combination.


The movie is titled intriguingly VIBE and the title logo is designed as a hand punch, indicating the nature of the movie. No matter how big the battle is, and no matter how difficult it is to win, the only thing that matters is, that there are some friends with you and for you in your fight because you “VIBE” with them.


The first look shows Sundeep Kishan in a wild action avatar. He can be seen along with his group of friends who are involved in riots in the city. Sundeep Kishan holds a bloody sword and a Molotov cocktail. His friends are also seen holding weapons with injuries all over. The first look poster is bloody impressive.


“VIBE” is a college-based Action-Love Story. It’s a tale of a student and his friends from being Novice to becoming Rebel.


The makers will announce the other cast and crew of the movie later. They have announced to release of VIBE in summer 2025.


Cast: Sundeep Kishan


Technical Crew:

Writer, Director Swaroop RSJ

Producer: Rahul Yadav Nakka

Banner: Swadharm Entertainment

PRO: Vamsi-Shekar

Marketing:First Show

Tremendous Response for AAdiParvam

 ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మీస్

"ఆదిపర్వం" ప్రచార చిత్రానికి

అసాధారణ స్పందన!!!!



కన్నడ - హిందీ - తమిళ

మలయాళ భాషల్లోనూ

ట్రెమండస్ రెస్పాన్స్!!


ఫైర్ బ్రాండ్ లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో నటించిన సోషియో ఫాంటసీ మల్టీ లింగ్యుల్ ఫిలిం ''ఆదిపర్వం''. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో... రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్-ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో (తెలుగు - కన్నడ - హిందీ - తమిళ - మలయాళ) ఈ సినిమా రూపుదిద్దుకుంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కి... ఇటీవల ఐదు భాషల్లోనూ విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది.


ఈ సందర్భంగా చిత్ర దర్శకులు సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ... "ఆదిపర్వం" ప్రచార చిత్రానికి లభిస్తున్న అనూహ్య స్పందన... ఈ చిత్రం కోసం మేము పడిన కఠోర శ్రమ మర్చిపోయేలా చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. త్వరలో సెన్సార్ కు వెళ్లనున్నాం. బహు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఇంత బాగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి గారికి స్పెషల్ థాంక్స్" అన్నారు.


ఈ చిత్రంలో నటీనటులు: మంచులక్ష్మీ, శివకంఠంనేని , ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ, యోగికాత్రి, గడ్డం నవీన్, ఢిల్లీ రాజేశ్వరి, జెమినీ సురేష్, బీఎన్ శర్మ, శ్రావణి, జ్యోతి, అయేషా, రావుల వెంకటేశ్వరరావు, సాయి రాకేష్, వనితారెడ్డి, గూడా రామకృష్ణ, రవిరెడ్డి, దేవిశ్రీ ప్రభు, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, రాధాకృష్ణ, స్నేహ, లీలావతి, శ్రీరామ్ రమేష్, శిల్పప్రతాప్ రెడ్డి, చిల్లూరి రామకృష్ణ, జోగిపేట ప్రేమ్ కుమార్ (జాతిరత్నాలు), మృత్యుంజయ శర్మ తదితరులు.


సాంకేతికవర్గం:

సమర్పణ: రావుల వెంకటేశ్వరరావు

సినిమాటోగ్రఫీ: ఎస్ ఎన్ హరీష్

ఆర్ట్ : కేవీ రమణ 

మ్యూజిక్ : మాధవ్ సైబా - సంజీవ్ మేగోటి, బి.సుల్తాన్ వలి, ఓపెన్ బనానా, లుబెక్ లీ మార్విన్. 

సాహిత్యం: సాగర్ నారాయణ్, రాజాపురం శ్రీనాథ్, ఊటుకూరు రంగారావు, మనేకుర్తి మల్లికార్జున, రాజ్ కుమార్ సిరా 

ఎడిటర్: పవన్ శేఖర్ పసుపులేటి, 

ఫైట్స్: నటరాజ్ 

కొరియోగ్రఫీ : సన్ రేస్ మాస్టర్  

పబ్లిసిటీ డిజైనర్ : రమణ బ్రష్

పి.ఆర్.ఓ: ధీరజ్ - అప్పాజీ 

కో డైరెక్టర్: అక్షయ్ సిరిమళ్ళ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: 

ఘంటా శ్రీనివాసరావు

సహ నిర్మాతలు: గోరెంట శ్రావణి- ప్రదీప్ కాటుకూటి- రవి దశిక- రవి మొదలవలస - 

శ్రీరామ్ వేగరాజు. 

నిర్మాత : ఎమ్.ఎస్.కె.

రచన, దర్శకత్వం: సంజీవ్ మేగోటి!!

Suhas new movie 'Oh Bhama Ayyo Rama' launched with a puja ceremony!

సుహాస్ హీరోగా ఓ భామ అయ్యో రామ ప్రారంభం



వైవిధ్య‌మైన చిత్రాల‌తో న‌టుడిగా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న క‌థానాయ‌కుడు సుహాస్. ఆయ‌న హీరోగా న‌టిస్తున్న మ‌రో వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రం ఓ భామ అయ్యో రామ. మాళ‌విక మ‌నోజ్ హీరోయిన్‌. ఈ చిత్రం  షూటింగ్ చిత్రీక‌ర‌ణ పూజా కార్య‌క్ర‌మాలు శ‌నివారం హైద‌రాబాద్‌లోని ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో ప్రారంభ‌మ‌య్యాయి. విఆర్ట్స్అండ్ చిత్ర‌ల‌హ‌రి టాకీస్ ప‌తాకంపై హ‌రీష్ న‌ల్లా, ప్ర‌దీప్ తాళ్లపు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ గోదాల ద‌ర్శ‌కుడు. హీరో, హీరోయిన్‌పై చిత్రీక‌రించిన ముహుర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ నిచ్చారు. ద‌ర్శకుడు వ‌శిష్ట కెమెరా స్విచ్చాన్ చేశారు. మ‌రో ద‌ర్శ‌కుడు కొల‌ను శైలేష్ బౌండెడ్ స్కిప్ట్‌ను ద‌ర్శ‌కుడికి  అంద‌జేశారు. టైటిల్ పోస్ట‌ర్‌ను ద‌ర్శ‌కులు విజయ్ క‌న‌క‌మేడ‌ల‌,కిషోర్ తిరుమ‌ల‌,  నిర్మాత‌ సుద‌ర్శ‌న్ రెడ్డి, ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో క‌థానాయ‌కుడు సుహాస్ మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు మారుతి గారి ద‌గ్గ‌ర డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేస్తున్న‌ప్ప‌టి నుంచి నాకు ద‌ర్శ‌కుడితో ప‌రిచ‌యం వుంది. మంచి క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. నా అభిమాన న‌టుల‌తో న‌టించే అవ‌కాశం నాకు ఈ సినిమాతో దొరికింది. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం షూటింగ్‌కు వెళ‌దామా అని ఎదురుచూస్తున్నాను అన్నారు. ఈ చిత్రంలో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తున్న నువ్వునేను ఫేం   అనితా హస్సానందని మాట్లాడుతూ నా సెకండ్ ఇన్నింగ్స్‌కు ఫ‌ర్ ఫెక్ట్‌గా కుదిరిన చిత్ర‌మిది. న‌న్ను ఎంత‌గానో ఆక‌ర్షించిన క‌థ ఇది అన్నారు. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ఇదొక బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ, సుహాస్ కొత్త‌గా ద‌ర్శ‌క‌త్వం చేసే వాళ్ల‌కు దొరికిన వ‌రం. ఎంతో కంఫ‌ర్ట‌బుల్ ఆర్టిస్ట్‌. చాలా వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో, సెలెక్టివ్ సినిమాలు చేస్తున్నాడు. అలాంటి సుహాస్ సినిమా చేయ‌డం సంతోషంగా వుంది. నిర్మాతలు ఎక్క‌డా రాజీప‌డ‌కుండా మంచి టెక్నిషియ‌న్స్‌ను ఇచ్చాడు. ర‌థ‌న్ సంగీతం చిత్రానికి అద‌న‌పు బలంగా వుంటుంది అన్నారు.  నిర్మాత‌లు మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు రాసుకున్న క‌థ‌కు త‌గిన విధంగా మంచి ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ కుదిరారు. అంతా ఫ్రెండ్లి వాతావ‌ర‌ణంలో ఈసినిమా చేస్తున్నాం. సినిమా ప్రారంభం నుంచే మంచి పాజిటివ్ వైబ్ క‌నిపిస్తుంది అన్నారు. ఈ స‌మావేశంలో ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు అలీ, సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ణికంద‌న్‌, సంగీత దర్శ‌కుడు ర‌థ‌న్‌, ఆర్ట్ ద‌ర్శ‌కుడు బ్ర‌హ్మా క‌డ‌లి, కో ప్రొడ్యూస‌ర్ ఆనంద్ గ‌డ‌గోని త‌దిత‌రులు పాల్గొన్నారు.


సుహాస్‌, మాళ‌విక మ‌నోజ్‌, అనిత హ‌స్సా నంద‌ని, అలీ, త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌: మ‌ణికంద‌న్‌, సంగీతం: ర‌థ‌న్‌, ఆర్ట్ :  బ్ర‌హ్మా క‌డ‌లి, కో ప్రొడ్యూస‌ర్ ఆనంద్ గ‌డ‌గోని, ఎడిట‌ర్‌: భ‌వీన్ ఎమ్‌.షా, కాస్ట్యూమ్ డిజైన‌ర్స్‌: అశ్వ‌త్ అండ్ ప్ర‌తిభ‌, పీఆర్ ఓ : ఏలూరు శ్రీ‌ను, మ‌డూరి మ‌ధు, నిర్మాత‌లు: హ‌రీష్ న‌ల్లా, ప్ర‌దీప్ తాళ్లపు రెడ్డి, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: రామ్ గోదాల

Hero Nithiin Thammudu First Look Poster And Title Logo Unveiled

హీరో నితిన్, డైరెక్టర్ శ్రీరామ్ వేణు, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఎంటర్‌టైనర్ ‘తమ్ముడు’.. ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లోగో విడుదల



టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టకుున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యానర్ నుంచి క్రేజీ కాంబినేషన్‌లో ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. యూత్ స్టార్ నితిన్, ఎంసీఏ, వకీల్ సాబ్ చిత్రాల డైరెక్టర్ శ్రీరామ్ వేణు కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘తమ్ముడు’. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 


శనివారం యంగ్ టాలెంటెడ్ హఈరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా ‘తమ్ముడు’ సినిమా నుంచి మేకర్స్ టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. టైటిల్ లోగో, పోస్టర్ చూస్తుంటే చాలా క్రియేటివ్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్పెషల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అన్నీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను మెప్పించటానికి యూనిక్‌గా రూపొందుతోంది. 


‘తమ్ముడు’ చిత్రంలో నితిన్ లుక్ చాలా కొత్తగా ఉంది. పోస్టర్‌ను గమనిస్తే ఓ బస్సు మీద చిన్నిపాటి గడ్డంతో నితిన్ కూర్చుని ఉన్నారు. ఆయన చేతిలో సుబ్రహ్మణ్యస్వామి ఆయుధమైన శూలం ఉంది. ఆయన చూపులు చాలా తీక్షణంగా ఉన్నాయి. బస్సును ఓ మహిళ డ్రైవ్ చేస్తోంది. బస్సులో సీనియర్ నటి లయ కనిపిస్తున్నారు.  


టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. గత చిత్రాలకు భిన్నంగా నితిన్ ఈ చిత్రంతో మెప్పించబోతున్నారని తెలుస్తుంది. అలాగే డైరెక్టర్ శ్రీరామ్ వేణు రొటీన్‌కు భిన్నంగా ఎంటర్‌టైనర్‌తో మెప్పించనున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాపర్‌గా వర్క్ చేస్తున్నారు. కాంతార, విరూపాక్ష చిత్రాల సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తుండగా ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. 


దిల్, శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాల తర్వాత శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నితిన్ చేస్తోన్న మూడో సినిమా ‘తమ్ముడు’. అలాగే నానితో ఎంసీఏ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ చిత్రాల తర్వాత దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ బ్యానర్‌లో చేస్తున్న మూడో చిత్రమిది. ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌తో రాబోతున్న సినిమా  కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


నటీనటులు - నితిన్


సాంకేతిక వర్గం:

బ్యానర్ -  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్

నిర్మాతలు - దిల్ రాజు, శిరీష్

రచన, దర్శకత్వం - శ్రీరామ్ వేణు

సినిమాటోగ్రఫీ - సమీర్ రెడ్డి

మ్యూజిక్ - బి.అజనీష్ లోక్‌నాథ్

ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి

పి.ఆర్.ఒ -వంశీ కాకా, జి.ఎస్.కె మీడియా

డిజిటల్ - విష్ణు తేజ్ పుట్ట

Aditya Papagari Renowned Realtor, Ventures into the Film Industry




ఆదిత్య పాపగారి రియల్టర్ నుంచి సినిమా రంగంలోకి

రియల్ ఎస్టేట్ రంగంలో అంబరాన్ని తాకే విజయాలను అందుకున్నప్రముఖ రియల్టర్, మూన్ స్కేప్ రియాలిటీ వ్యవస్థాపకుడు సీఈఓ ఆదిత్య పాపగారి గురించి ఆ రంగంలో ఉన్నవారికి బాగా తెలుసు. పట్టువదలని విక్రమార్కుడు, కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు ప్రణాళికలు రూపొందించే పరాక్రముడు ఆదిత్య పాపగారి. కేవలం లావాదేవీలపై మాత్రమే దృష్టి పెట్టకుండా కస్టమర్ సంతృప్తిపై పనిచేస్తాడు కాబట్టే రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అంత పెద్ద స్థాయిలో ఉన్నా కస్టమర్లతో సామాన్యుడిలా కలిసిపోతాడు. సాదకబాధకాలు తెలుసుకుంటాడు. 

ఆయన ఎప్పుడూ ధీర్ఘకాలిక విజయాల వైపే అడుగులు వేస్తాడు అనడానికి నిదర్శనం మూన్ స్కేప్ రియాలిటి. మూన్ స్కేప్ రియాలిటిని స్థాపించి ఎంతో మంది కలలను నిజం చేశారు. 2017లో స్థాపించిన ఆ వెంచర్ ఇప్పుడు అంచలంచెలుగా ఎదిగింది. ఒక రియల్ ఎస్టేట్ ఏజెన్సీ స్థాయినుంచి ఒక వ్వవస్థను నడిపించే స్థాయికి ఎదిగారంటే ఆయన పట్టుదల, దూరదృష్టి ఎలాంటివో అర్థం చేసుకొవచ్చు. కరోనా టైమ్ లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో అందరికీ తెలిసిందే. అలాంటి గడ్డు పరిస్థితులను తట్టుకొని నిలబడి మార్కెట్‌ ను శాసిస్తున్నారు ఆదిత్య పాపగారి. అలాంటి ఘనుడు ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. 

సినిమా పరిశ్రమలో రాణించాలని, మంచి సినిమాలు అందించాలనే ఉద్దేశంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన ఎంచుకున్న ఏ రంగంలోనైనా సరే అనుకున్న విజయాలు సాధించడం ఆయనకు సర్వసాధారణం. అందుకే క్లిష్టమైన సినిమా రంగంలో ఇష్టంగా అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే షేక్ స్పియర్ డ్రీమ్స్ ఎల్ఎల్ పీ బ్యానర్ తో, ప్రముఖ దర్శకుడు, నిర్మాత స్వప్నేష్ చింతల తో కలిసి సంయుక్తంగా చిత్రాలు నిర్మించబోతున్నారు. మంచి సినిమాలతో పాటు కొత్తవాళ్లను, ఔత్సాహిక నటీనటులను, రచయితలను, దర్శకులను ప్రొత్సహించాలనేది ఆదిత్య పాపగారి మోటో అని తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తులే సినిమా రంగానికి కావలి. ఆదిత్య పాప స్థాపించే ప్రొడక్షన్ సంస్థ నుంచి మంచి సినిమాలు రావాలని, సినిమా పరిశ్రమలో మంచి విజయాలు అందుకోవాలని కోరుకుందాం. ఆయన ప్రొడక్షన్ సంస్థకు సంబంధించిన వివరాలు, బ్యానర్ తదితర అంశాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Suhas -Dil Raju Productions Production No4 in Dubbing Works

 డబ్బింగ్ కార్యక్రమాల్లో సుహాస్ హీరోగా దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.4 చిత్రం... మే 24న మూవీ గ్రాండ్ రిలీజ్



గ‌త ఏడాది బ‌ల‌గం వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని నిర్మించిన ప్రెస్టీజియ‌స్ బ్యాన‌ర్ దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ ఇప్పుడు క్రేజీ చిత్రాల‌ను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ సినిమాల‌ను రూపొందిస్తోన్న ఈ నిర్మాణ సంస్థ‌లో డిప‌రెంట్ రోల్స్‌తో మెప్పిస్తూ వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న సుహాస్ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు.


దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.4గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మే 24న విడుదల చేస్తున్నారు. సుహాస్ జ‌త‌గా సంకీర్త‌న విపిన్ న‌టిస్తుంది. నిర్మాత శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స‌లార్ చిత్రానికి డైలాగ్ రైట‌ర్‌గా వ‌ర్క్ చేసిన సందీప్ రెడ్డి బండ్ల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 


 ఈ సినిమా ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న‌ ఒక ఫ‌న్నీ కోర్టు డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం టైటిల్‌ను ప్ర‌క‌టిస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. బేబి వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రానికి సంగీతాన్ని అందించిన‌ విజ‌య్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు. బ‌ల‌గం వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ ఆకాశం దాటి వ‌స్తావా సినిమాను రూపొందిస్తోంది. అలాగే ఇటీవ‌ల ఈ బ్యాన‌ర్ ఆశిష్ హీరోగా మూడో ప్రాజెక్ట్‌ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఇప్పుడు సుహాస్ హీరోగా నాలుగో సినిమా సిద్ధ‌మ‌వుతుంది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌నున్నారు. 


న‌టీన‌టులు: 

సుహాస్‌, సంకీర్త‌న విపిన్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, గోప‌రాజు, ర‌ఘుబాబు, పృథ్వీ, శివ‌న్నారాయ‌ణ‌, రూప‌ల‌క్ష్మి, విజ‌య‌లక్ష్మి త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:


ద‌ర్శ‌క‌త్వం: సందీప్ రెడ్డి బండ్ల‌

స‌మ‌ర్ప‌ణ‌:  శిరీష్‌

బ్యాన‌ర్ :  దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌

నిర్మాత‌లు : హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత‌

సినిమాటోగ్ర‌ఫీ:  సాయిశ్రీరామ్‌

సంగీతం:  విజ‌య్ బుల్గానిన్‌

ఆర్ట్:  రామ్ అర‌స‌విల్లి

పి.ఆర్.ఒ:  వంశీ కాకా

Banita Sandhu to shoot in Bhuj for her Pan India film G2 with Adivi Sesh



అడివి శేష్‌ పాన్ ఇండియా ఫిల్మ్ 'G2' కోసం గుజరాత్‌లోని భుజ్‌ షూట్ లో జాయిన్ అయిన బనితా సంధు

అడివి శేష్ 'G2' చిత్రంలో బనితా సంధు హీరోయిన్ కనిపించనుంది. ఈ చిత్రం అద్భుతమైన యాక్షన్‌గా ఉంటుంది, ఇది బనితాకు మొదటి పాన్ ఇండియా చిత్రం. ఇంతకుముందు అక్టోబర్, సర్దార్ ఉదం, తమిళ చిత్రం ఆదిత్య వర్మ వంటి చిత్రాలలో నటించింది బనిత.

గుజరాత్‌లోని భుజ్‌ లో జరుగుతున్న 'G2' షూటింగ్ లో బనితా సంధు ఈ రోజు జాయిన్ అయ్యింది. ఈ షెడ్యూల్‌ లో అడివి శేష్, బనిత పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అడివి శేష్‌, బనితా సంధు తెరపై గొప్ప కెమిస్ట్రీని పంచుకోబోతున్నారు. ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించాలనే లక్ష్యంగా పని చేస్తున్నారు.

ఇంతకుముందు ఈ చిత్రం గురించి బనిత మాట్లాడుతూ.. G2 లో భాగం కావడం తనకు క్రియేటివ్ గా గొప్ప ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. ఈ సినిమాలో ఆమె పాత్ర ఇంతకు ముందు చేయని విధంగా చాలా కొత్తగా ఉంటుంది.

జి2లో ఇమ్రాన్ హష్మీ కూడా చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. 2018లో వచ్చిన గూఢచారి చిత్రానికి హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెల్ గా ఆరేళ్ల తర్వాత మళ్లీ సెల్యులాయిడ్‌లోకి వస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు.

 

#VS12 Titled Fascinatingly Laila

 Mass Ka Das Vishwaksen, Ram Narayan, Sahu Garapati, Shine Screens’ #VS12 Titled Fascinatingly Laila



Mass Ka Das Vishwaksen who is enjoying the blockbuster success of Gaami has signed some interesting projects. For his 12th movie, Vishwaksen will be joining hands with director Ram Narayan. The film #VS12 will be produced by Sahu Garapati of Shine Screens whose last production venture Bhagavanth Kesari was a massive blockbuster and was a Sankranthi winner, this year.


Billed to be a romantic action entertainer, Ram Narayan has prepared a powerful script to present Vishwak Sen in a never-before character.


Extending birthday wishes to Vishwaksen, the makers of the movie revealed its title through a captivating poster. The movie is titled fascinatingly Laila and the title poster is totally colorful.


The poster is a right balance of pleasant and violent objects. It has flowers, butterflies, a mirror, a candle, a make-up kit, a radio, Charminar, and also a gun, a bloody knife, a goat head, etc. The title poster surely creates curiosity to know more about the movie. The motion poster shows all the elements shown in the poster separately and the animation part is impressive, so is the background score.


The title and the motion poster indicate that the movie has scope for the lead actress as well. Her name will be revealed later. The movie that will be high on technical and production standards will have a team of well-known craftsmen working for it.


Vasudeva Murthy is the writer for the movie with Richard Prasad as the lensman. Tanishk Bagchi provides the music for the movie, while Anwar Ali is the editor. Brahma Kadali is the art director.


More details are awaited.


Cast: Vishwaksen 


Technical Crew: 

Banner: Shine Screens

Producer: Sahu Garapati

Director: Ram Narayan

Writer: Vasudeva Murthy

Music Director: Tanishk Bagchi

Cinematographer: Richard Prasad

Art Director: Brahma Kadali

Editor: Anwar Ali

PRO: Vamsi-Shekar

Marketing: First Show

Sri Ranga Neethulu Trailer unveiled movie Release on April 11


 శ్రీ‌రంగ‌నీతులు ట్రైల‌ర్ విడుద‌ల


సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం,రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌  ముఖ్య‌తార‌లుగా రూపొందుతున్న చిత్రం శ్రీ‌రంగనీతులు. ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడు. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి  ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 11న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ పంపిణీదారుడు, నిర్మాత ధీర‌జ్ మొగిలినేని ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్ర‌యిల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో

 అజ‌య్ అర‌సాడ‌, శ‌శాంక్‌, వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి, రుహాని శ‌ర్మ‌, ప్ర‌వీణ్‌కుమార్, విరాజ్ అశ్విన్‌, కార్తీక్ రత్నం, సుహాస్, కిర‌ణ్  

త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా నిర్మాత వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి  మాట్లాడుతూ,  చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ కుమార్ నా స్నేహితుడు,  ద‌ర్శ‌కుడు అన్ని విభాగాల‌ను ద‌గ్గ‌రుండి చూసుకున్నాడు. మంచి అవుట్ ఇచ్చాడు. చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు అజ‌య్ అర‌సాడ మాట్లాడుతూ  శ్రీ‌రంగ‌నీతులు చిత్రం

 క్లోజ్ టు మైహార్ట్‌. త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు. ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ కుమార్ మాట్లాడుతూ  నాకు అవ‌కాశం ఇచ్చి స‌పోర్ట్ చేసిన నిర్మాత‌కు థ్యాంక్స్‌. త‌ప్ప‌కుండా ఇది అంద‌రికి న‌చ్చే సినిమా. అంద‌రూ క‌నెక్ట్ అవుతారు.

కార్తీక్ ర‌త్నం మాట్లాడుతూ నాకు న‌చ్చిన పాత్ర‌ను ఇందులో చేశాను. నాకు న‌చ్చిన ఆర్టిస్టుల‌తో ప‌నిచేశాను. సినిమా చాలా బాగుంది. అంద‌రూ థియేటర్‌లో త‌ప్ప‌కుండా చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


రుహాని శ‌ర్మ మాట్లాడుతూ చాలా రోజులుగా ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నాను.

 వెయిట్ చేస్తున్నాను. ఇంత మంచి సినిమాలో  నేను న‌టించినందుకు హ్య‌పీగా వుంది. ఇది అంద‌రిక‌థ. అన్ని పాత్ర‌ల‌తో అంద‌రూ క‌నెక్ట్ అవుతారు. సినిమా చూస్తున్న‌ప్పుడు చాలా మంది వాళ్ల‌ను వాళ్లు అద్దంలో చూసుకంటున్న‌ట్లుగా వుంటుంది. ఎంతో ప్ర‌తిభ గ‌ల ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్‌. ఇలాంటి సినిమాల‌ను స‌పోర్ట్ చేస్తే మ‌రిన్ని మంచి సినిమాలు వ‌స్తాయి అన్నారు.


విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ  ఈసినిమాకు క‌థే హీరో. ప్ర‌వీణ్ మంచి ద‌ర్శ‌కుడితో పాటు మంచి ర‌చ‌యిత‌. చాలా మంచి క‌థ‌. ఇందులో నేను న‌టించినందుకు ఆనందంగా వుంది. సినిమాలో వున్న అన్ని విభిన్న పాత్ర‌లు ఈ సినిమా ద్వారా చూడ‌బోతున్నారు. బ‌స్తీ నుంచి బంగాళా లో వున్న అంద‌రికి క‌నెక్ట్ అయ్యే క‌థ ఇది.


సుహాస్ మాట్లాడుతూ మాట్లాడుతూ ప్ర‌వీణ్ చాలా క‌ష్ట‌ప‌డి చేశాడు. త‌న జ‌ర్నీ నాకు తెలుసు. ఇదొక ఆంథాల‌జి సినిమా. మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. అంద‌రూ  మా ప్ర‌య‌త్నాన్ని ఆద‌రిస్తార‌ని అనుకున్నాను. నిర్మాత ఎంతో అభిరుచి గల వ్య‌క్తి. మంచి సినిమాను నిర్మించాడు అన్నారు.

Director Parashuram Petla is Confident on Family Star Success

"ఫ్యామిలీ స్టార్" సక్సెస్ పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న డైరెక్టర్ పరశురామ్ పెట్ల



సకుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమాలు రూపొందించడం కొందరు దర్శకులకే సాధ్యమవుతుంది. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి కుటుంబ కథా చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారీ డైరెక్టర్. విజయ్ దేవరకొండ హీరోగా ఆయన రూపొందించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ఫ్యామిలీ స్టార్". ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజై సినిమా మీద మరింత హైప్ పెంచుతోంది. 


ట్రైలర్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పరశురామ్ పెట్ల తనదైన హీరో క్యారెక్టరైజేషన్, మేకింగ్ స్టైల్ ను "ఫ్యామిలీ స్టార్"లో మరోసారి చూపించారు. ఈ సినిమా సక్సెస్ పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు పరశురామ్ పెట్ల. అందుకే ఆయన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ' ఐ ఫీస్ట్ లాంటి "ఫ్యామిలీ స్టార్" సినిమాను, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను ప్రతి తెలుగు ప్రేక్షకుడు, ప్రతి తెలుగు కుటుంబం కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటారు.' అని చెప్పారు. సమ్మర్ లో సకుటుంబంగా ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసే మూవీ "ఫ్యామిలీ స్టార్" అని ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది.


"ఫ్యామిలీ స్టార్"  సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. "ఫ్యామిలీ స్టార్" సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.


నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు


 టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్

సంగీతం : గోపీసుందర్

ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా, వంశీ కాక

క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ

నిర్మాతలు : రాజు - శిరీష్

రచన, దర్శకత్వం - పరశురామ్ పెట్ల 

Tillu Square Collects 100crs Says Producer :Suryadevara Naga Vamsi

మొదటి షో నుంచే 'టిల్లు స్క్వేర్' సినిమాకి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు: చిత్ర బృందం 

'టిల్లు స్క్వేర్' వంద కోట్లు వసూలు చేస్తుంది : చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ



2022లో విడుదలై ఘన విజయం సాధించిన 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం 'టిల్లు స్క్వేర్'. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భారీ అంచనాలతో 'టిల్లు స్క్వేర్' సినిమా నేడు(మార్చి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తూ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ తెచ్చుకున్న ఈ సినిమా సంచలన వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఈ విజయానందంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం తమ సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. " ముందుగా నేను నిర్మాత నాగవంశీ గారికి, చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి థాంక్స్ చెప్పాలి. నన్ను నమ్మి, ఇలాంటి సబ్జెక్టుని నమ్మి, మంచి బడ్జెట్ తో 'డీజీ టిల్లు' చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత సీక్వెల్ అవకాశం కూడా ఇచ్చారు. టిల్లు స్క్వేర్ కి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుండటం ఆనందం కలిగిస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమా అదిరిపోతుంది అని నాకు తెలుసు. కానీ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఆ మాట వినాలని ఆగాను. ఇప్పుడు చెబుతున్నాను ఈ సినిమా అదిరిపోయింది. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు." అన్నారు.

కథానాయిక అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. "ఆనందంలో మాటలు కూడా రావడంలేదు. ఈ సినిమా ప్రయాణాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ చిత్రం చేసే సమయంలో ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను. ఇప్పుడు సినిమాకి మంచి స్పందన లభిస్తోంది. నా పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. నేను మొదటిసారి ఇలాంటి పాత్ర పోషించాను. అయినప్పటికీ నేను పోషించిన లిల్లీ పాత్ర నాకు మొదటి నుంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకం నిజమై, ఇప్పుడు నా పాత్రకు వస్తున్న స్పందన చూసి సంతోషంగా ఉంది" అన్నారు.

దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ.. "మొదటి షోకే అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మేము ముందు నుంచి అనుకున్నట్టుగానే.. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు." అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందనే నమ్మకం ఉంది. సినిమాకి మంచి టాక్ వస్తోంది. మార్నింగ్ షోకి, మ్యాట్నీకి వసూళ్లలో గ్రోత్ కనిపిస్తుంది. ఉగాది, రంజాన్ పండగలు, వేసవి సెలవులు ఉండటంతో ఈ సినిమా వంద కోట్లు వసూలు చేస్తుందనేని నమ్ముతున్నాను." అన్నారు.

ఈ కార్యక్రమంలో కళ్యాణ్ శంకర్, రవి ఆంథోనీ, ప్రణీత్ రెడ్డి తదితరులు పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.

Allu Arjun wax statue at Madame Tussaud’s in Dubai

దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో వాక్స్ స్టాట్యూని ఏర్పాటు చేసిన సౌత్ ఇండియాలో తొలి నటుడు అల్లు అర్జున్



దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: దుబాయ్ లోని బ్లూ వాటర్స్ దగ్గర ఉన్న మేడమ్ టుస్సాడ్స్  ప్రపంచంలో ప్రఖ్యాతి చందిన వారి మైనపు విగ్రహాలని షో కేస్ చేసే మ్యుసీయం. వారు ఇప్పుడు మన తెలుగు స్టైలిష్ స్టార్ గా మొదలై ప్రపంచ వ్యాప్తంగా ఐకాన్ స్టార్ పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ వాక్స్ స్టాట్యూ మేడమ్ టుస్సాడ్స్ మ్యుసీయంలో పెట్టారు, మీడియా మరియు ఇన్ఫ్లుఎంసర్స్ ఎంతో మంది అల్లు అర్జున్ వాక్స్ స్టాట్యూని చూడడానికి వచ్చారు.. 



తన నటనతో, డాన్స్ తో, ఆరు సార్లు ఫిలిం ఫేర్ అవార్డ్స్ గెలుచుకుని, భారతదేశాలోనే ప్రఖ్యాత ఫిలిం అవార్డు అయిన నేషనల్ అవార్డుని సాధించి, ఇప్పుడు ఐకాన్ స్టార్ వాక్స్ స్టాట్యూ రూపంలో చిరస్థాయిగా నిలిచిపోయి, మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు, ఈ వాక్స్ స్టాట్యూ పర్ఫెక్ట్ గా రావడం కోసం 200 రకాల మెషర్మెంట్స్ ని అల్లు అర్జున్ నుండి, తను చేసే డాన్స్ మూవ్స్ నుండి సేకరించడం జరిగింది. మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్ జనరల్ మననేర్ అయిన Sanaz Kollsrud అన్నారు. 



ఇప్పటి వరుకు సౌంత్ ఇండియా నుండి ఏ ఒక్క ఆక్టర్ వాక్స్ స్టాట్యూ కూడా దుబాయ్ లో పెట్టలేదు అని, అల్లు అర్జున్ ఏ మొట్ట మొదటి సౌత్ ఇండియన్ ఆక్టర్ అని చెప్పారు.. అయితే దుబాయ్ లో ఉండే సౌంత్ ఇండియాన్స్ అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఫాన్స్ ఈ వాక్స్ స్టాట్యూని చూడడానికి వస్తారని వారు భావిస్తున్నట్టు తెలిపారు. 



ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన వాక్స్ స్టాట్యూని తాను చూసుకుని, నిజంగా తనని తానూ అద్దంలో చూసుకుంటున్నట్టు ఉంది అని, చాలా రియలిస్టిగా చేశారు అని ప్రశంసించారు.. 

Dear Rights brought by Asian Cinemas and Annapurna Studios

 GV Prakash Kumar, Aishwarya Rajesh’s Dear Andhra Rights By Annapurna Studios, Telangana Rights By Asian Cinemas, Theatrical Release On April 12th



GV Prakash and Aishwarya Rajesh starrer Dear is a quirky family comedy-drama directed by Anand Ravichandran and produced by Varun Tripuraneni, Abhishek Ramisetty, and G Pruthviraj of Nutmeg Productions Pvt. Ltd.


There will be one one-day gap between the release of the movie in Telugu and Tamil. While the Tamil version will be released on April 11th, the Telugu version of the film will be released on the 12th of April.


While the Andhra theatrical rights of the movie are bagged by Annapurna Studios, Asian Cinemas acquired the Telangana theatrical rights. Surely, the production and distribution houses with huge theatrical chain businesses will give the movie a bigger release in Telugu states.


The music of the film is scored by GV Prakash Kumar whose recent chartbuster song "Mastaaru Mastaaru" is still ruling the charts. 


The two songs released in Tamil are ruling the charts and will soon be released in Telugu.


Dear also stars Kaali Venkat, Ilavarasu, Rohini, Thalaivasal Vijay, Geetha Kailasam and Nandini.


Jagadeesh Sundaramurthy is handling the cinematography.

Vishwak Sen Mechanic Rocky First Look Poster Unveiled

 Vishwak Sen, Ravi Teja Mullapudi, Ram Talluri, SRT Entertainments’ #VS10 Titled Powerfully Mechanic Rocky, First Look Poster Unveiled



Young and talented hero Vishwak Sen who is riding high with the success of Gaami celebrates his birthday today. On the occasion, the makers of his milestone 10th movie #VS10 have revealed its title and also its first look poster. The movie is directed by debutant Ravi Teja Mullapudi with popular producer Ram Talluri of SRT Entertainments banner producing it on a grand scale has Meenakshi Chaudhary playing the leading lady opposite Vishwak Sen.


The movie is titled powerfully Mechanic Rocky. The title poster is designed creatively. It is given a feel of speed with Mechanic designed as a wrench. We can also see an image of Vishwak in Rocky. The first look poster presents Vishwak Sen in a mass and powerful avatar as he is seen smoking a cigarette with a big wrench in his hand with a mischievous expression on face. He sports a light beard and wears a stylish outfit. We can see mechanic shed in the background. The title logo and first look poster are remarkable.


Billed to be a comedy and action entertainer, the movie features some noted technicians working for it. The film has music by Jakes Bejoy. While Manojh Katasani cranks the camera, Anwar Ali is the editor and Kranthi Priyam is the production designer. Satyam Rajesh and Vidya Sagar J are the executive producers.


Cast: Vishwak Sen, Meenakshi Chaudhary, Naresh, Viva Harsha, Harshavardhan, Roadies Raghu Ram


Technical Crew:

Director: Ravi Teja Mullapudi

Producer: Ram Talluri

Production Banner: SRT Entertainments

Music: Jakes Bejoy

DOP : Manojh katasani

Production Designer : Kranthi Priyam

Editor : Anwar Ali

Executive producers: Satyam Rajesh, Vidya Sagar J

Costume Designer : Kalyani, Preethi Jukalker

Megastar Chiranjeevi Launched Intense Teaser Of Nara Rohith Prathinidhi 2

 Megastar Chiranjeevi Launched Intense Teaser Of Nara Rohith, Murthy Devagupthapu, Vanara Entertainments, Rana Arts’ Prathinidhi 2



Hero Nara Rohith’’s comeback film Prathinidhi 2 with popular journalist Murthy Devagupthapu on his directorial debut is getting ready for release. KumarRaza Bathula, Anjaneyulu Sri Thota, and Surendranath Bollineni are producing the movie under the banners of Vanara Entertainments and Rana Arts. Prathinidhi 2, the second franchise from the Prathinidhi series, had its teaser launched today. Megastar Chiranjeevi did the honors of unveiling the teaser.


The protagonist is an honest news reporter working on a TV channel. In his interview with a top politician, he enquires about the debts of the state, to which the latter replies, 5 lakh crores. The politician suggests the debts will be cleared if development is done in the state. Then, the protagonist quizzes are there really development works happening in the state. The last episode shows the protagonist cautioning people to cast their votes or else leave the country. The teaser also introduced other prominent characters such as Sachin Khedekar, Raghu Babu, Jisshu Sengupta, Udaya Bhanu, Ajay Gosh, Shree, etc.


This intense teaser makes a lasting impression. Nara Rohith looked apt in the role of a news reporter and he brought intensity with his strong portrayal of the character. Murthy Devagupthapu impresses with his writing and taking. The interview episode and the last sequence about voter rights and responsibilities are bang on.


Nani Chamidishetty’s camera work is neat, whereas young sensation Mahati Swara Sagar strengthened the narrative with his superb score. Raviteja Girijala is the editor and Kiran Kumar Manne is the art director. The production design looked grand.


As announced by the makers, Prathinidhi 2 will grace the cinemas in April, this year.


Cast: Nara Rohithh, Siree Lella, Dinesh Tej, Sapthagiri, Jisshu Sengupta, Sachin Khedekar, Thanikella Bharani, Indraja, Udaya Bhanu, Ajay Gosh, Ajay, Praveen, Prudhvi Raj, Raghu Babu, Raghu Karumanchi


Technical Crew:

Director: Murthy Devagupthapu

Producers: KumarRaza Bathula, Anjaneyulu Sri Thota, Surendranath Bollineni

Banners: Vanara Entertainments, Rana Arts

Music: Mahati Swara Sagar

Editor: Raviteja Girijala

DOP: Nani Chamidisetty

Art: Kiran Kumar Manne

Stunts: Siva Raju & Prudhvi

Executive Producer: Karthik Puppala

Publicity Designs: Anil&Bhanu

PRO: Vamsi-Sekhar

Digital: Praveen & Housefull Digital 

Legend Blockbuster 10years Celebrations -Re Releasing on March 30

లెజెండ్’ చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం. రీ-రిలీజ్ లో మరోసారి విజయాన్ని అందించబోతున్న అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు: లెజెండ్ బ్లాక్ బస్టర్ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ



లెజెండ్ అంటే చరిత్ర సృష్టించే వాడు.. తిరగరాసేవాడు. ఈ సినిమా అదే చేసింది: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను


గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి మూడు బ్లాక్ బస్టర్స్ అందించారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలనచిత్రం బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించిన  'లెజెండ్' వారి సెకండ్ కొలాబరేషన్ లో 2014 మార్చి 28న విడుదలై ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. లెజెండ్ 10 ఇయర్స్ పురస్కరించుకుని, మేకర్స్ మార్చి 30న సెన్సేషనల్ హిట్‌ని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ లెజెండ్ బ్లాక్ బస్టర్ 10 ఇయర్స్ వేడుకలని ఘనంగా నిర్వహించారు.


లెజెండ్ బ్లాక్ బస్టర్ 10 ఇయర్స్ వేడుకలో గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, కారణజన్ముడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నా గురువు, నా దైవం, నా కన్నతండ్రికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈ వేడుకు సినిమా విడుదలకు ముందు జరుపుకునే పండగలాంటి అనుభూతిని ఇస్తుంది. ఎల్లుండి ఈ సినిమా రీరిలీజ్ అవుతుంది. మళ్ళీ వందరోజుల పండగ జరుపుకుంటాం. నిర్మాతలు  రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి గారికి శుభాకాంక్షలు అభిమానులకు, తోటికళాకారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మంచి ఉద్దేశంతో సినిమాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరిస్తారు. వెన్నుతట్టి ఇంకా ఇలాంటి మంచి సినిమాలు చేయాలని ప్రోత్సహిస్తారు. తెలుగు సినిమాల ప్రభావం యావత్ దేశానికి పాకిందంటే దాని ప్రభావం ఎంత వుందో కళ్ళముందు కనిపిస్తోంది. సినిమా రికార్డులు నాకు కొత్త కాదు. రికార్డులు సృష్టించాలన్నా నేనే. వాటిని తిరగరాయాలన్నా నేనే. నా దర్శకులు, కథ ఎంపిక, తోటి నటులు, సాంకేతిక నిపుణులు మీద నాకు గట్టి నమ్మకం. సమరసింహా రెడ్డి 30 కేంద్రాలలో సిల్వర్ జుబ్లీ చేసుకొని దేశంలో కొత్త రికార్డులు సృష్టించింది. 105 కేంద్రాలలో  వందరోజులు ఆడిన సినిమా నరసింహ నాయుడు. 400 రోజులు నాలుగు ఆటలతో  రెండు కేంద్రాలలో ఆడి ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డ్ గా నిలిచిన సినిమా లెజెండ్.  అలాగే నాలుగు ఆటలతో 1116 రోజులు ఆడి నాలుగు అంకెల రోజులుని దాటిన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా లెజెండ్. సినిమా కేవలం వినోదానికే కాదు సినిమా అంటే ఒక బాధ్యత. నా ప్రతి సినిమాలో ఆ బాధ్యత తీసుకుంటాను. సినిమా అంటే సమాజం పట్ల స్పృహ, ఒక చైతన్యం కలిగించాలనే  ఆలోచనతోనే కథలు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. లెజెండ్ లో మహిళలు ఉద్దేశించి ఇచ్చిన అద్భుతమైన సందేశం వుంది. ఇటివలే వచ్చిన నేలకొండ భగవంత్ కేసరిలో కూడా చాలా చక్కని సందేశం ఇచ్చాం.  కళామతల్లి, నా తల్లితండ్రుల, అభిమానుల ఆశీస్సులు వుండబట్టే ఇలాంటి మంచి సినిమాలు చేయగలుతున్నానని భావిస్తున్నాను. చలన చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రాల్లో చెప్పుకోదగ్గ సినిమా లెజండ్. సింహ, లెజెండ్, అఖండ, నేలకొండ భగవంత్ కేసరి...ఈ చిత్రాలన్నీ తృప్తిని ఇవ్వడంతో పాటు ఇంకా మంచి సినిమాలు చేయాలనే కసి పెంచాయి. 2014 ఎలక్షన్స్ కి ముందు లెజెండ్ విడుదలైయింది. దాని ప్రభావం ఎన్నికలపై ఎంత వుందో మనకి తెలుసు. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. యాదృచ్ఛికంగా సినిమా మళ్ళీ విడుదల కాబోతుంది. సినిమా ఎంత ప్రభావం వుంటుందో రేపు ఎన్నికల్లో చూడబోతున్నారు. జయం మనదే. దర్శకులు బోయపాటి గారు, నేను ఒక సినిమా చేస్తున్నపుడు మరో సినిమా గురించి అలోచించము. రేపు జరబోయే సినిమా గురించి కూడా మాట్లాడుకోం. మేము మాటల మనుషులం కాదు. చేసి చూపిస్తాం. మా ఆలోచనలు ఒకటే. రామ్ ప్రసాద్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. దేవిశ్రీ  ప్రసాద్ ఆణిముత్యాలు లాంటి పాటలు సమకూర్చారు. సాంకేతిక నిపుణులంతా అద్భుతంగా పని చేశారు. సోనాల్ చౌహాన్ అందం అభినయంతో ఆకట్టుకున్నారు. అలాగే రాధిక ఆప్టే గారు కూడా చక్కని అభినయం కనబరిచారు. జగపతి బాబు గారు తన పాత్రలో చాలా అద్భుతంగా రాణించారు.  మిగతానటీనటులంతా వారి పాత్రలలో ఒదిగిపోయారు. లెజెండ్ మళ్ళీ విడుదల కావడం చాలా సంతోషంగా వుంది. మా అబ్బాయి తరమే కాదు నా మనవడి తరంకు కూడా నేను కనెక్ట్ అయినందుకు, నాకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన కళామాతల్లికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హిందూపూర్ ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు చైర్మన్ గా.. ఇలా ఇన్ని పాత్రలు పోషిస్తూ వాటికి న్యాయం చేస్తున్నాని నాతో పాటు నా సినిమాలని విజయం చేస్తున్న అభిమానులకు , ప్రేక్షకులు, ప్రజలందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు. మన అనుబంధం అన్ని రంగాల్లో ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. లెజెండ్ ని అప్పుడు అంత  విజయం చేసినందుకు, రేపు చేయబోతునందుకు అభిమానులకు, ప్రేక్షకులకు, తెలుగు చిత్ర పరిశ్రమకు ధన్యవాదాలు’’ తెలిపారు


బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. లెజెండ్ ని ఇంత పెద్ద  హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారికి అంకితం చేస్తూ ఈ సినిమాని మొదలుపెట్టాం. ఆయన ఆశీస్సులతోనే పదేళ్ళ వేడుక జరుపుకుంటున్నాం. ఆ తరానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ గారు ఆ తరానికి లెజెండ్. ఈ తరానికి సినిమా రూపంలో మేము చూపించిన లెజెండ్ బాలయ్య గారు. ఒక లెజెండరీ సినిమా మీ ముందుకు తీసుకొచ్చినందుకు దర్శకుడిగా గర్వపడుతున్నాను. లెజెండ్ అంటే చరిత్ర సృష్టించే వాడు తిరగరాసేవాడు. ఈ సినిమా అదే చేసింది. మూడేళ్ళు ఆడి ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించింది. పదేళ్ళు గడిచినా ఈ వేడుక చూస్తుంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లా అనిపిస్తోంది. లెజెండ్ మా పై బాద్యత పెంచింది. ఆ భాద్యతతో కసితో చేసిన సినిమా అఖండ. ఇకపై మేము చేసే ఏ సినిమానైనా ఇంతే భాద్యతతో ఒక యజ్ఞంలా చేసి మీ ముందుకు తీసుకొస్తాం. బాలయ్య గారి నమ్మకమే.. సింహ లెజెండ్ అఖండ. మేము చేసే ప్రతి సినిమా ఇలానే పదేళ్ళు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పని చేసిన నటీనటులందరికీ పేరుపేరున ధన్యవాదాలు. జగపతిబాబు గారు అద్భుతమైన పాత్ర చేశారు. చలపతి రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి. కెమరామెన్ రామ్ ప్రసాద్ గారు, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్,.. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నిర్మాతలు  రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. లెజెండ్ మార్చి 30న రీరిలీజ్ చేస్తున్నాం. అభిమానులు, ప్రేక్షకులు మళ్ళీ అదే తరహలో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇకపై మా కాంబినేషన్ లో ఇంతకంటే మంచి సినిమా చేస్తానని మాటిస్తూ... అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు  


హీరోయిన్ సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ.. ఇది రోజు చాలా ప్రత్యేకమైనది. లెజెండ్ పదేళ్ళ పండగ జరుపుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. లెజెండ్ నా కెరీర్ లో చాలా ముఖ్యమైన సినిమా. బాలకృష్ణ గారికి ప్రత్యేకత కృతజ్ఞతలు. ఆయన చాలా గొప్పగా ప్రోత్సహించారు. దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. లెజెండ్ మళ్ళీ విడుదలౌతుంది. అందరూ వెళ్ళి థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలి’ అని కోరారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. 

Tremendous Response For Family Star Trailer

"ఫ్యామిలీ స్టార్" సినిమా చూస్తూ సమ్మర్ మొత్తం ఎంజాయ్ చేస్తారు - ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు పరశురామ్ పెట్ల



స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ మూసాపేటలోని శ్రీరాములు థియేటర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దిల్ రాజు. దర్శకుడు పరశురామ్ పెట్ల పాల్గొన్నారు. ప్రేక్షకుల సందడి మధ్య "ఫ్యామిలీ స్టార్" సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా


దర్శకుడు పరశురామ్ పెట్ల మాట్లాడుతూ - "ఫ్యామిలీ స్టార్" సినిమా గురించి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను. ఈ సినిమాను, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను ప్రతి తెలుగు ప్రేక్షకుడు, ప్రతి తెలుగు కుటుంబం కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటారు. ఈ సినిమాను ఏప్రిల్ 5న థియేటర్స్ లో హాయిగా చూడండి. ఐ ఫీస్ట్ లాంటి సినిమా ఇది. విజయ్, మృణాల్ క్యారెక్టర్స్, విజువల్స్, మ్యూజిక్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ ..వంటి అన్ని అంశాలు మీకు నచ్చేలా ఉంటాయి. థియేటర్ లో మిమ్మల్ని కలుస్తాను. అన్నారు.


నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి ఈ మధ్య చిన్న హింట్ ఇచ్చాను. తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీ స్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం. మీలోనూ ఫ్యామిలీ స్టార్స్ ఉంటారు. లేకపోతే ఈ సినిమా చూశాక ఫ్యామిలీ స్టార్ అవ్వాలని కోరుకుంటారు. ఇంకా ఏడు రోజులు మాత్రమే ఉన్నాయి సినిమా రిలీజ్ కు మేము ఇదే శ్రీరాములు థియేటర్ లో మార్నింగ్ షో చూసేందుకు ఏప్రిల్ 5న వస్తాం. ఆ రోజు థియేటర్ లో మీ అందరూ నవ్వుతూ సినిమా చూస్తుంటారు. గీత గోవిందం తర్వాత పరశురామ్, విజయ్ కలిసి వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ క్యారెక్టర్ ను క్లాస్, మాస్, యూత్ ఫుల్, ఎంటర్ టైనింగ్, ఎమోషన్ తో పరశురామ్ డిజైన్ చేశాడు. విజయ్ క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుంది. పరశురామ్ సినిమాల్లో లైటర్ వేన్ కామెడీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ సినిమాలోనూ అదే తరహాలో నవ్విస్తాడు. సమ్మర్ లో ఫ్యామిలీ స్టార్ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. 21 ఏళ్ల కిందట ఏప్రిల్ 5న దిల్ సినిమాతో నేను నిర్మాతగా దిల్ రాజుగా మారాను. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత అదే రోజున ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అవుతోంది. మిమ్మల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుందీ సినిమా. మాస్, క్లాస్, యూత్ అ, ఫ్యామిలీ అనే తేడాలు లేకుండా యూనివర్సల్ గా అందరికీ నచ్చే కథ ఫ్యామిలీ స్టార్ లో ఉంది. ఒక సూపర్ హిట్ సినిమాతో థియేటర్స్ లోకి వస్తున్నాం. అన్నారు.


ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ చూస్తే - ట్రైలర్ కూల్ ఫ్యామిలీ, లవ్ ఎంటర్ టైనర్ గా ఉండి ఆకట్టుకుంటోంది. హీరోయిజం, ఫ్యామిలీ ఎలిమెంట్స్, లవ్, హ్యూమర్, యాక్షన్ ..అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా "ఫ్యామిలీ స్టార్" సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. సివిల్ ఇంజినీర్ గోవర్థన్ క్యారెక్టర్ లో  విజయ్ దేవరకొండ, ఇందుగా మృణాల్ ఠాకూర్ తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్నారు. విజయ్, మృణాల్ జంట మధ్య కెమిస్ట్రీ బాగుంది. డైరెక్టర్ పరశురామ్ పెట్ల హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందించడంలో తన ప్రత్యేకతను మరోసారి చూపించారు. "ఫ్యామిలీ స్టార్" ష్యూర్ సమ్మర్ బ్లాక్ బస్టర్ అనే ఇంప్రెషన్ ట్రైలర్ కలిగించింది. "ఫ్యామిలీ స్టార్" సినిమా మీదున్న హైప్ కు తగినట్లు ట్రైలర్ కట్ చేశారు. కథను ఏమాత్రం మిస్ లీడ్ చేయకుండా ట్రైలర్ ఉండటం మరో విశేషం. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ వంటి టెక్నికల్ అంశాల్లో "ఫ్యామిలీ స్టార్" ట్రైలర్ టాప్ క్వాలిటీతో కనిపిస్తోంది.


"ఫ్యామిలీ స్టార్"  సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాను హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. "ఫ్యామిలీ స్టార్" సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.


నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు


 టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్

సంగీతం : గోపీసుందర్

ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా, వంశీ కాక

క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ

నిర్మాతలు : రాజు - శిరీష్

రచన, దర్శకత్వం - పరశురామ్ పెట్ 

Global Star Ram Charan Birthday Celebrations Held by his Fans in Dallas, Texas.

 డల్లాస్ మెగా ఫాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు




RRR చిత్రంతో రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు సంపాదించుకుని గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ హీరోల్లో రామ్ చరణ్ టాప్ లీగ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆయన హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. దీంతో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా, సుకుమార్ దర్శకత్వంలోనూ ఓ సినిమాను అనౌన్స్ చేయటం విశేషం. 


ఈ బర్త్ డే రామ్ చరణ్‌కు ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. దీంతో మెగాభిమానులు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు.  అందులో భాగంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల బృందం ప్లానో (డల్లాస్)లోని స్పైస్ రాక్ రెస్టారెంట్‌లో అతని పుట్టినరోజును పురస్కరించుకొని ఘనంగా జరుపుకున్నారు.


‘‘మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లెజెండ్‌గా తనదైన ముద్ర వేశారు. ఆయన వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి వారసత్వాన్ని కొనసాగించటం అంత సులభమైన విషయం కాదు. అయితే చరణ్ ఎంతో బాధ్యతతో తనపై ఉన్న నమ్మకాన్ని నిజం చేస్తూ అగ్ర తారగా దూసుకెళ్తున్నారు. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల్లో నటించి నటుడిగా తన నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా తండ్రి బాటలోనే నడుస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ తరం యువ కథానాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు’’ అని రామ్ చరణ్ బర్త్ డే వేడుకలకు హాజరైన అందరూ ఆయన ఎదుగుదలను ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. 


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చిట్టి ముత్యాల, ఏపీటీఏ మాజీ అధ్యక్షుడు నటరాజ్ యెల్లూరి, డల్లాస్ బాబీ మరియు రాజేష్ కళ్లేపల్లిలతో పాటు శ్రీరామ్ మత్తి, సురేశ్ లింగినేని, కిషోర్ అనిశెట్టి, కిషోర్ గుగ్గిలపు, నరసింహ సత్తి తదితరులు హాజరయ్యారు.  వెల్నాటి, సునీల్ తోట, సుధాకర్ అందే ఆప్త, నాగేశ్వర్ చందన, రత్నాకర్ జొన్నకూటి, అనిల్ చలమలశెట్టి తదితరులు కేక్ కటింగ్ కార్యక్రమాలను నిర్వహించారు.

Sasidavane: Godari Atu Vaipo song Unveiled

 శశివదనే’ చిత్రం నుంచి ‘గోదారి అటు వైపో..’  సాంగ్ రిలీజ్.. ఏప్రిల్ 19న సినిమా భారీ విడుదల



Godari Atu Vaipo Lyrical Song




‘‘గోదారి అటు వైపో

నాదారి ఇటు వైపో

అమ్మాయి నీదారెటువైపో...’’


అంటూ అమ్మాయిని చూసి మన హీరో పాట పాడేస్తున్నాడు. మనసు పడ్డ అమ్మాయి కనిపించకపోతే అబ్బాయి మనసు ఎలా ప్రశ్నలతో నిండిపోతుందో.. ఈ పాట వింటే అర్థమవుతుంది. అమ్మాయి కోసం వెతికే అబ్బాయి అన్వేషణ తెలుసుకోవాలంటే శశివదనే సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.


‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ,  ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు.  గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హించారు. ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.


ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన మూవీ టైటిల్ సాంగ్ ‘శశివదనే..’, ‘డీజే పిల్లా..’ అనే సాంగ్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘గోదారి అటు వైపో...’ పాటను మేకర్స్ విడుదల చేశారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తూ పాడిన ఈ పాటను కిట్టు విస్సా ప్రగడ రాశారు.


శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా గ్యారీ బి.హెచ్ వర్క్ చేస్తున్నారు.


నటీనటులు:

రక్షిత్ అట్లూరి, కోమలీ, శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు


సాంకేతిక వర్గం:

సమర్పణ - గౌరీ నాయుడు, బ్యానర్స్ - ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్, నిర్మాతలు - అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల, రచన-దర్శకత్వం - సాయి మోహన్ ఉబ్బర, సినిమాటోగ్రాఫర్ - శ్రీసాయి కుమార్ దారా, సంగీతం - శరవణ వాసుదేవన్, బ్యాగ్రౌండ్ స్కోర్ - అనుదీప్ దేవ్, ఎడిటర్- గ్యారీ బి.హెచ్, కొరియోగ్రాఫర్ - జేడీ, సి.ఇ.ఒ - ఆశిష్ పేరి, పి.ఆర్.ఒ - సురేంద్ర నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా).


Mass Ka Das Vishwak Sen Launched A Thrilling Teaser Of Raamz, Krishna Prasad Vathyam, Runway Films’ Fighter Raja

 'ఫైటర్ రాజా' టీజర్ చాలా ఇంపాక్ట్ ఫుల్ గా వుంది. తప్పకుండా సినిమా పెద్ద విజయం సాధిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్



మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లాంచ్ చేసిన రామ్జ్, కృష్ణ ప్రసాద్ వథ్యం, రన్‌వే ఫిల్మ్స్ 'ఫైటర్ రాజా'  థ్రిల్లింగ్ టీజర్‌


పచ్చీస్ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన పాపులర్ స్టైలిస్ట్ రామ్జ్ తన రెండవ సినిమా 'ఫైటర్ రాజా'ని  కృష్ణ ప్రసాద్ వత్యం దర్శకత్వంలో చేస్తున్నారు. రన్‌వే ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం.2గా దినేష్ యాదవ్, పుష్పక్ జైన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన మేకర్స్, ఇప్పుడు టీజర్‌ను విడుదల చేశారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ టీజ‌ర్ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు.


హిరో తన తండ్రి అడుగుజాడలను అనుసరిస్తూ స్క్రాప్ అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తుంటాడు. కానీ తన ఆసక్తి ఫైటింగ్ చేయడమే. అతను సినిమాల్లో ఫైటర్‌గా పనిచేస్తాడు. అతనికి అదే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. అతను వివిధ సమస్యలకు పరిష్కారాలను ఇవ్వడానికి సెటిల్మెంట్ వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. రామ్జ్  తన సొంత్ బిజినెస్ ని నిర్వహించే ఫైటర్  పాత్రలో అద్భుతంగా నటించాడు. యూనిక్ కామిక్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అతని క్యారెక్టర్ సీరియస్ గా కనిపించినా ఫన్ జనరేట్ చేసింది. అయితే, దర్శకుడు సినిమాలోని కోర్ ఎలిమెంట్‌ను ఇంకా రివిల్ చేయలేదు.


తనికెళ్ల భరణి, శివ నందు, రోషన్, తాగుబోతు రమేష్, సత్య ప్రకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో మాయ కృష్ణన్ కథానాయిక. శ్రీధర్ కాకిలేటి కెమెరా పనితనం, స్మరన్ సాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. హరిశంకర్, అవంతి రుయా ఎడిటర్స్ గా పని చేస్తున్నారు.


టీజర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. రామ్జ్ నాకు ఈ నగరానికి ఏమయింది చిత్రం నుంచి తెలుసు. తను సెలబ్రెటీలకు చాలా చక్కని స్టయిలింగ్ చేస్తారు. మొదటి సారి నాకు షూట్ వేయించింది కూడా తనే. తను ఈ వేడుకు రమ్మని పిలవగానే నాకు అదే జ్ఞాపకం గుర్తు వచ్చింది. మనస్పూర్తిగా ఈ వేడుకకు రావాలనిపించింది. ఈ సినిమాకి సంబధించిన ప్రతిది చాలా ప్రామెసింగ్ గా వుంది. పోస్టర్ డిజైన్, కలర్ గ్రేడింగ్, విజువల్స్ అన్నీ బావున్నాయి. టీజర్ చాలా ఆసక్తికరంగా వుంది. చాలా రోజుల తర్వాత చంద్రశేఖర్ యేలేటి గారి సినిమా వైబ్ ఈ టీజర్ లో కనిపించింది. టీజర్ చాలా ఇంపాక్ట్ ఫుల్ గా వుంది. రామ్జ్ లోని ప్రతిభ సర్ ప్రైజ్ చేసింది. తప్పకుండా అందరూ సినిమా థియేటర్స్ లో చూడండి. ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందనే నమ్మకం వుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు


హీరో రామ్జ్ మాట్లాడుతూ.. లవ్, మనీ, ఫ్యామిలీ ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం ఫైటర్ రాజా. విశ్వక్ సేన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి సపోర్ట్ మాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. చాలా యంగ్ టీంతో చాలా హార్డ్ వర్క్ చేసి చేశాం. దర్శకుడు  కృష్ణ ప్రసాద్  నిర్మాతలు – దినేష్, పుష్పక్ జైన్. టీం అంతా కలసి చాలా పాషన్ తో పని చేశాం. తప్పకుండా సినిమా మీ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.


దర్శకుడు వేణు ఎల్దండి మాట్లాడుతూ.. రామ్జ్ చాలా కష్టపడి తనని తాను నిరూపించుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. టీజర్ చాలా నేచురల్ గా వుంది. స్మరన్ మ్యూజిక్ చాలా బావుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రేక్షకులు తప్పకుండా సినిమాని సపోర్ట్ చేయాలి’ అన్నారు.


హీరోయిన్ మాయా కృష్ణన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన విశ్వక్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చి , తెలుగులో పరిచయం చేస్తున్న దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. టీజర్ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మా సినిమాకు సపోర్ట్ చేయండి’ అని కోరారు.

 

దర్శకుడు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. టీజర్ ని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. విశ్వక్ గారికి ధన్యవాదాలు. స్మరన్ చాలా మంచి మ్యూజిక్  ఇచ్చారు. చాలా అద్భుతమైన సినిమా ఇది. తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.


నిర్మాత దినేష్ యాదవ్ మాట్లాడుతూ.. విశ్వక్ గారికి, వేణు గారికి ధన్యవాదాలు. టీజర్ లాంచ్ కి మీరంతా రావడం చూస్తుంటే ఇదే ఒక విజయంలా అనిపిస్తుంది. మీ సపోర్ట్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూడాలి. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరపేరునా ధన్యవాదాలు’ తెలిపారు.


నటీనటులు: రామ్జ్, మాయా కృష్ణన్, తనికెళ్ల భరణి, చక్రధర్, శివ నందు, రోషన్, తాగుబోతు రమేష్, సత్య ప్రకాష్, విజయ్, కృష్ణ తేజ, శశిధర్, రాము, లక్ష్మణ్ తదితరులు.


సాంకేతిక సిబ్బంది:

దర్శకత్వం: కృష్ణ ప్రసాద్ వత్యం

నిర్మాతలు - దినేష్ యాదవ్ & పుష్పక్ జైన్

బ్యానర్ - రన్‌వే ఫిల్మ్స్  

సంగీతం - స్మరన్ సాయి

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - శ్రీధర్ కాకిలేటి

ఎడిటర్ - హరిశంకర్ & అవంతి రుయా

లైన్ ప్రొడ్యూసర్ - ప్రదీప్

ప్రొడక్షన్ డిజైనర్ - రోహన్ సింగ్

ఆర్ట్ డైరెక్టర్ - బాల కృష్ణ

పీఆర్వో - వంశీ-శేఖర్