Home » » Director Sree Harsha Konuganti Interview About Om Bheem Bush

Director Sree Harsha Konuganti Interview About Om Bheem Bush

'ఓం భీమ్ బుష్' క్రేజీ ఫన్ రైడ్ లా వుంటుంది. ఇలాంటి కథ ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ పై రాలేదు. కామిక్ టైమింగ్ లో శ్రీవిష్ణు విశ్వరూపం చూస్తారు: డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి      హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ 'ఓం భీమ్ బుష్' తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 'ఓం భీమ్ బుష్'  మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


టీజర్ చూపించిన గుప్తనిధుల అన్వేషణ ఎలా వుంటుంది ? అసలు 'ఓం భీమ్ బుష్' అంటే ఏమిటి ?  

ఒకప్పుడు బ్యాంకులు లేనప్పుడు మన దగ్గర వున్న డబ్బు,బంగారం ఒక బిందెలో పెట్టి భూమిలో దాచేవారు. ఈ కథలో యూనిర్సిటీలో చదువుకున్న ముగ్గురు ఓ గ్రామంలో అలాంటి గుప్తనిధుల కోసం చేసిన అన్వేషణ ఎలా జరిగిందనేది చాలా క్రేజీగా చూపించడం జరిగింది. 'ఓం భీమ్ బుష్' అనేది ఓ మ్యాజికల్ ఫ్రేజ్. చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు కూడా సరదా ఆ మాట వాడుతుంటారు. ఈ కథలో కూడా చాలా మ్యాజిక్ వుంటుంది. పారానార్మల్ యాక్టివిటీస్, ఆత్మలు, లంకె బిందెలు ఇలాంటి మిస్టీరియస్ ఎలిమెంట్స్ వుంటాయి. ఈ కథకు 'ఓం భీమ్ బుష్' అనేది యాప్ట్ టైటిల్.


మీ కథ సినిమాల్లో స్టూడెంట్, కాలేజీ నేపధ్యంలో వుంటాయి.. ఇందులో ఎలా ఉండబోతుంది?

'ఓం భీమ్ బుష్' లో కూడా కొంచెం స్టూడెంట్ ఎపిసోడ్ వుంటుంది. పెద్ద యూనిర్సిటీలలో ముఫ్ఫై ఏళ్లకు దాటిన వారు కూడా ఏదో పీహెచ్డీ చేస్తూ అక్కడే వుంటారు. ఇందులో ముగ్గురు కూడా అలా యూనివర్సిటీలో రిలాక్స్ గా వుండేవారే. అలాంటి ముగ్గురు బయటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారనేది కథ.


నో లాజిక్ అంటున్నారు.. ఈ కథలో లాజిక్ ఉండదా ?

ఈ కథలో చాలా లాజిక్ వుంటుంది. ప్రతి సన్నివేశం లాజిక్ తో ముడిపడి వుంటుంది. ఇందులో చాలా బలమైన కథ వుంది. కానీ ఇప్పుడు రివిల్ చేయడం లేదు. ఈ సినిమాకి కథే హైలెట్. ఇందులో మంచి ఎమోషన్ కూడా వుంది. అది చాలా కొత్తగా వుంటుంది. ఆ కొత్త పాయింటే సినిమాకి యూఎస్పీ. ఇలాంటి పాయింట్ ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకూ రాలేదు. ఏ భాషలో చూసిన నచ్చుతుంది. ఇందులో హ్యూమన్ ఎమోషన్ కూడా ఆకట్టుకుంటుంది. చాలా క్లీన్ సినిమా ఇది. పిల్లలతో కలసి హాయిగా చూడొచ్చు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురిని ద్రుష్టిలో పెట్టుకునే ఈ కథ రాశాను. ఇందులో వారి పాత్రలు చాలా హిలేరియస్ గా వుంటాయి. ఫిక్షన్ తో పాటు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో ఈ కథని చేశాం.


హీరోయిన్స్ గురించి ?

ప్రీతి ముకుందన్, ఆయేషా ఖాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రియ వడ్లమాని స్పెషల్ అప్పీరియన్స్ వుంటుంది. కామాక్షి భాస్కర్ల మరో ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు.


శ్రీవిష్ణు సామజవరగమన ప్రేక్షకులని చాలా నవ్వించింది.. ఈ చిత్రం ఎలా వుంటుంది ?

సామజవరగమన కు నవ్వారంటే దానికి పదిరెట్లు ఈ చిత్రానికి నవ్వుతారు. ఇందులో శ్రీవిష్ణు విశ్వరూపం చూస్తారు. కామిక్ టైమింగ్ లో నెక్స్ట్ లెవల్ వుంటుంది. ఇంత ఫుల్ లెంత్ కామెడీ ఆయన ఇప్పటివరకూ చేయలేదు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పాత్రలని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. మొదటి షాట్ నుంచి చివరి వరకూ ఓ లాఫ్ రైడ్ గా ప్రేక్షకులు నవ్వుతూనే వుంటారు.


మ్యూజిక్ గురించి ?

సన్నీ ఎంఆర్ గతంలో స్వామిరారా ఉయ్యాల జంపాలతో పాటు నా హుషారు సినిమాకి కూడా చేశాడు. అర్జిత్ సింగ్ ఇందులో రెండు పాటలు పాడారు. హంగేరిలో రికార్డ్ చేశాం. ఈ పాటలు వుండిపోరాదే పాట స్థాయిలో హిట్ అవుతుందని అనుకుంటున్నాం


నిర్మాతల గురించి ?

వంశీ, విక్రమ్, సునీల్ గారు కలసి సినిమా చేశారు. హుషారు సినిమా వంశీ అన్నకి చాలా నచ్చింది, అప్పటి నుంచే వంశీ అన్నతో అనుబంధం వుంది. ఈ కథ చెప్పగానే ఓకే చెప్పారు. వంశీ అన్న బెస్ట్ ప్రొడ్యూసర్. చాలా స్వేఛ్చ ఇచ్చారు. అలాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం. వారి సపోర్ట్ వలనే ఇంత డిఫరెంట్ క్రేజీ మూవీ చేయగలిగాం.


పబ్లిక్ లో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారు ?

ఇప్పటివరకూ సినిమా చూసినవారంతా చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. బిజినెస్ కూడా పెద్ద  రేంజ్ లోనే జరిగింది. తప్పకుండా మ్యాజిక్ క్రియేట్ అవుతుందనే అనుకుంటున్నాం.


ఆల్ ది బెస్ట్

థాంక్ యూShare this article :