Home » » ChorBazaar is colour Ful Movie -Chor Bazaar Team

ChorBazaar is colour Ful Movie -Chor Bazaar Team

 ‘చోర్ బజార్’’ ఒక కలర్ ఫుల్ సినిమా - చోర్ బజార్ టీం
ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దర్శకుడు జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన "చోర్ బజార్" సినిమా ప్రెస్ మీట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా


నిర్మాత వీఎస్ రాజు మాట్లాడుతూ..దర్శకుడు జీవన్ రెడ్డి, నేను మంచి మిత్రులం. పదిహేనేళ్లు కలిసి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశాం. తను సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్నప్పుడు ముందు కమర్షియిల్ సినిమాలు తెరకెక్కించు అని చెప్పేవాడిని. జీవన్ రెడ్డి చెప్పిన కథ నచ్చి ఒక మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ చేద్దామని ఈ సినిమా నిర్మించాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. అన్నారు.


దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ...మా స్నేహితుడు వీఎస్ రాజు నా సినిమాకు నిర్మాత కావడం సంతోషంగా ఉంది. ఒక కలర్ పుల్ సినిమా చేద్దామని ఆయన అనేవారు. అన్నట్లుగానే మంచి కమర్షియల్, కలర్ ఫుల్ సినిమా చేశాం. నాతో పాటు నా టెక్నికల్ టీమ్ వందశాతం ఎఫర్ట్ పెట్టి పనిచేశారు. ఈ సినిమా బాగుందంటే ఆ క్రెడిట్ నా టీమ్ కు ఇస్తాను. ఒక యువ హీరో ఈ కథకు కావాలి అనుకున్నప్పుడు ఆకాష్ నా మనసులో మెదిలారు. ఆయన బచ్చన్ సాబ్ అనే ఈ క్యారెక్టర్ లో పర్పెక్ట్ గా నటించారు. అని అన్నారు.హీరోయిన్ గెహనా సిప్పీ మాట్లాడుతూ..చోర్ బజార్ సినిమాలో లవ్ యాక్షన్ డ్రామా రొమాన్స్ అన్నీ ఉన్నాయి. మీకు తప్పకుండా సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ సినిమాకు టీమ్ ఎంతో కష్టపడి పనిచేశారు. నాకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. అని చెప్పింది.


ఆకాష్ పూరి మాట్లాడుతూ...సినిమా మొదలైనప్పటి నుంచి ఎప్పుడు థియేటర్ లో ప్రేక్షకులకు చూపిద్దామా అని ఎదురుచూస్తున్నాం. మా టీమ్ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతాను. మా చిత్రంలోని తొలి పాట విడుదలైన ప్పటి నుంచి నుంచి మొన్న ట్రైలర్ రిలీజ్ వరకు ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా ట్రైలర్ కు మూడున్న మిలియన్ వ్యూస్ వచ్చాయి. జడ పాటకు సోషల్ మీడియాలో వేల కొద్దీ రీల్స్ చేస్తున్నారు. మేము చేస్తున్న ప్రయత్నానికి తోడు యూవీ క్రియేషన్స్ కలవడం మా సినిమా స్థాయిని పెంచేసింది. వంశీ, ప్రమోద్ గారికి థాంక్స్. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. మీ కుటుంబంతో వచ్చి సినిమాను ఎంజాయ్ చేయండి. అన్నారు. 


సాంకేతిక నిపుణులు - సినిమాటోగ్రఫీ - జగదీష్ చీకటి, సంగీతం - సురేష్

బొబ్బిలి, 

ఎడిటింగ్ - అన్వర్ అలీ, 

ఆర్ట్ - గాంధీ నడికుడికర్,

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం

సౌండ్ డిజైనర్ : సాయి మనీందర్ రెడ్డి, 

ఆడియో - లహరి, 

కాస్ట్యూమ్స్

డిజైనర్ - ప్రసన్న దంతులూరి ఫైట్స్ - ఫృథ్వీ శేఖర్,

కొరియోగ్రఫీ - భాను,

పబ్లిసిటీ డిజైనర్ - అనిల్ భాను ,  స్టిల్స్ : వికాస్ సీగు, 

పి.ఆర్.వో -

జీఎస్కే మీడియా,  

మేకప్ - శివ, 

కాస్ట్యూమ్ చీఫ్ - లోకేష్, 

డిజిటల్ మీడియా- వాల్స్ అండ్ ట్రెండ్స్, 

సహ నిర్మాత - అల్లూరి సురేష్ వర్మ, 

బ్యానర్ -ఐ.వి ప్రొడక్షన్స్, 

నిర్మాత - వీ.ఎస్ రాజు, 

రచన-దర్శకత్వం - బి. జీవన్

రెడ్డి.


Share this article :