కరడుగట్టిన "కాశ్మీర్ క్రిమినల్స్"
త్వరలో వచ్చేస్తున్నారు!!
ట్రైలర్ రిలీజ్ చేసి ప్రచారానికి
శ్రీకారం చుట్టిన దర్శకసంచలనం
రాంగోపాల్ వర్మ!!
పూర్తిగా కాశ్మీర్ లో తీసిన
మొట్టమొదటి తెలుగు చిత్రం!!
అంజని క్రియేషన్స్-ఆరేటి క్రియేషన్స్-వడ్లపట్ల క్రియేషన్స్ పతాకాలపై... "రావణ లంక" ఫేమ్ యువప్రతిభాశాలి బి.ఎన్.ఎస్. దర్శకత్వంలో జి.ఎ. రామారావు-హర్ష ఆరేటి-మోహన్ వడ్లపట్ల (యు.ఎస్.ఎ) సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "కాశ్మీర్ క్రిమినల్స్". నాగప్రసాద్-శివన్య జంటగా నటించిన "కాశ్మీర్ క్రిమినల్స్"... షూటింగ్ మొత్తం కాశ్మీర్ లో జరుపుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రం కావడం విశేషం.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం దాదాపు తుది దశలో ఉన్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలకు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ శ్రీకారం చుట్టారు. "కాశ్మీర్ క్రిమినల్స్" ట్రైలర్ విడుదల చేసి, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. "కాశ్మీర్ ఫైల్స్" కోవలో ఇంటెన్స్ స్క్రీన్ ప్లేతో రూపొందిన "కాశ్మీర్ క్రిమినల్స్" మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
తమ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసిన రాంగోపాల్ వర్మకు నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు. షూటింగ్ మొత్తం కాశ్మీర్ లో జరుపుకున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు!!
ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, డి.ఐ: భాను, విజువల్ ఎఫెక్ట్స్: చందు ఆది, కాశ్మీర్ షూటింగ్ కో-ఆర్డినేటర్: సన్నీ, కో-డైరెక్టర్: తేజ్ కుమార్, ఆర్.ఆర్: సుకుమార్, సినిమాటోగ్రఫీ: శివకృష్ణ, లైన్ ప్రొడ్యూసర్: నాగప్రియ, నిర్మాతలు:
జి.ఎ. రామారావు-హర్ష ఆరేటి-మోహన్ వడ్లపట్ల (యు.ఎస్.ఎ), కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బి.ఎన్.ఎస్.రాజు!!
Post a Comment