Latest Post

Bhimadevarapalli Branch in Second Schedule

 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న భీమదేవరపల్లి బ్రాంచి రెండో షెడ్యూల్...



"భీమదేవరపల్లి బ్రాంచి " ఇది పూర్తి ఆర్గానిక్ గ్రామీణ జీవన చిత్రం.రెండు గంటల పాటు ప్రేక్షకుడిని నవ్వించడమే లక్ష్యంగా తెరకెక్కుతున్న సహజ చిత్రమిది. ఒక మారుమూల గ్రామంలో జరిగిన  సంఘటన దేశవ్యాప్తంగా  సెన్సేషనల్ అయ్యింది. ఆ హాట్ టాపిక్  ఆధారంగా ఈ సినిమాను"Neorealism" జానర్లో మేకింగ్ చేస్తున్నారు.ఈ జానర్లో వస్తున్న మొదటి తెలుగు చిత్రం"భీమదేవరపల్లి బ్రాంచి" కావడం విశేషం. కథలోని నేటివిటీ పోకూడదని పూర్తిగా ఆర్గానిక్ నటీనటులనే ఎంపిక చేసుకుని, చాలా రియాలిటీగా నిర్మిస్తున్న కంటెంట్ ఓరియంటెడ్ చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి. 

గత ఇరవై రోజులుగా కరీంనగర్ జిల్లాలోని మల్లాపూర్ గ్రామంలో మరియు పరిసర ప్రాంతాల్లో కంటిన్యూగా రెండవ  షెడ్యూల్  షూటింగ్  జరుగుతోంది....

 సుధాకర్ రెడ్డి,కీర్తి లత, అభిరామ్, రూప, అంజి బాబు,రాజవ్వ,CSR, శుభోదయం సుబ్బారావు, 

 పద్మ, ప్రసన్న,మానుకోట ప్రసాద్,గడ్డం నవీన్,  మల్లికార్జున్, మహి, వల్లి సత్య ప్రకాష్, మహేష్ వంటి పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

AB CINEMASS & NIHAL PRODUCTIONS  నిర్మిస్తోన్న  ఈ చిత్రానికి "మీ శ్రేయోభిలాషి"చిత్రంతో రచయితగా ఎన్నో  అవార్డులు అందుకుని అనేక విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన  

రమేశ్ చెప్పాల ఈ సినిమాకు కథ ,మాటలు, దర్శకత్వం వహిస్తున్నారు.

రచన-దర్శకత్వం: రమేశ్ చెప్పాల. నిర్మాత : బత్తిని కీర్తిలత గౌడ్. సహ నిర్మాత: రాజా నరేందర్ చెట్లపెల్లి

 కెమెరా: చిట్టి బాబు. సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ.ఎడిటర్: బొంతుల నాగేశ్వర్ రెడ్డి. పబ్లిసిటీ 

డిజైనర్: ధని ఏలే  ఆర్ట్: మోహన్. 

పీఆర్ఒ: శ్రీధర్


GA2 Pictures Production No 8 Launched Grandly

 మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బ‌న్నివాస్, విద్య మాధురి నిర్మాత‌లుగా తేజ మ‌ర్ని ద‌ర్శ‌క‌త్వంలో GA2 పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 8 ప్రారంభం..



విలక్షణ కథలతో కంటెంట్ ఓరియంటెడ్ గా సినిమాలు నిర్మిస్తూ భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి సంచలన విజయాలతో దూసుకుపోతూ పక్కా కమర్షియల్ లాంటి కమర్షియల్ సినిమాతో మ‌రో మారు ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్న ప్రతిష్ఠాత్మక బ్యానర్ GA2 పిక్చర్స్.  జోహార్, అర్జున ఫల్గుణ లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలు తెరకెక్కించిన తేజ మర్ని దర్శకత్వంలో సంచలన నిర్మాత బన్నీ వాస్ నిర్మాణంలో పూర్తిగా కథ ప్రధానంగా సాగే చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు మొద‌లుపెట్టారు. నేడు హైద‌రాబాద్ ఫిల్మ్ న‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న‌ ఈ సినిమాకు బన్నీ వాస్ త‌న‌య‌ బేబీ హన్విక క్లాప్ కొట్టారు. ఈ సినిమాకు బ‌న్నివాసుతో పాటు విద్య మాధురి మ‌రో నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూర్తిగా కంటెంట్ ప్రధానంగానే ఈ సినిమా కథ సాగుతుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. భాను ప్ర‌తాప్ సహ నిర్మాత‌, ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.


నటీనటులు:


శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, మురళీ శర్మ, బెనర్జీ, పవన్ తేజ్ కొణిదెల..


టెక్నికల్ టీం:


దర్శకుడు: తేజ మర్ని

నిర్మాతలు: బన్నీ వాస్, విద్య మాధురి

బ్యానర్: GA2 పిక్చర్స్

సమర్పణ: అల్లు అరవింద్

కో ప్రొడ్యూసర్: భాను ప్రతాప

రైటర్: నాగేంద్ర కాశీ

సినిమాటోగ్రాఫర్: జగదీష్ చీకటి

సంగీతం: శక్తికాంత్ కార్తీక్

ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్

కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి ఎరమల

పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Marvel Studios’ Thor: Love and Thunder will release in India on 7th July

 GOOD NEWS FOR INDIAN FANS!



The fans have spoken and Marvel has heard you! Due to unprecedented demand and love from fans, Thor: Love and Thunder is here with yet another massive news for India.


A MARVEL JACKPOT! DOUBLE THE GOOD NEWS & TWICE THE THUNDER!


Apart from releasing in India a day before the US, Marvel Studios’ Thor: Love and Thunder will also have shows running 96 hours straight for 4 days starting 7 July! The movie will run across select theatres DAY & NIGHT for 4 days i.e., 96 hours continuously, starting 12:15 AM on July 7 to 23:59 on July 10!


So, gear up for the biggest MCU blockbuster this year with Marvel Studios’ big ticket cosmic adventure ‘Thor: Love and Thunder’ releasing in the Indian theatres on July 7.  


Directed by Oscar winner Taika Waititi, the film stars our favourite Avenger Thor aka Chris Hemsworth along with a stellar ensemble cast: Tessa Thompson, Natalie Portman and Christian Bale who makes his BIG MCU debut!


Book your tickets soon!


*Marvel Studios’ Thor: Love and Thunder will release in India on 7th July (a day before US release) in 6 languages English, Hindi, Tamil, Telugu, Malayalam and Kannada.*

Hero Abhijeet, Heroine komalee prasad photo opp at Charminar

హైదరాబాద్‌కు మోడ్రన్ లవ్ వచ్చింది(వాస్తవానికి!)




ప్రచార కార్యక్రమాలలో భాగంగా, రాబోయే అమెజాన్ ఒరిజినల్ సిరీస్ మోడ్రన్ లవ్ హైదరాబాద్ యొక్క కొంతమంది తారాగణం సభ్యులు మరియు సృష్టికర్తలు, వారు చారిత్రాత్మక చార్మినార్‌ను సందర్శించినప్పుడు పగటిపూట కనిపించారు. వారు, కొత్త తెలుగు అమెజాన్ ఒరిజినల్ సిరీస్ మోడ్రన్ లవ్ హైదరాబాద్ విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తుండగా, నిర్మాత ఎలాహె హిప్టూలా, నటులు అభిజీత్ దుద్దాల, నరేష్ అగస్త్య, కోమలీ ప్రసాద్ మరియు దర్శకుడు ఉదయ్ గుర్రాల భవనం ముందు ఫోటోలకు పోజులిస్తున్నగా కనిపించారు. ఈ సందర్భంగా అమెజాన్‌ ఒరిజినల్‌ సిరీస్‌ మోడరన్‌ లవ్‌ హైదరాబాద్‌ నిర్మాత ఎలాహె హిప్టూలా మాట్లాడుతూ.. 'హైదరాబాద్‌కు ప్రతీకగా నిలిచిన చార్మినార్‌ భవనం ముందు నిలబడటం చాలా గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. నా బాల్యమంతా ఈ అద్భుతమైన నగరంలో గడిపిన నేను హైదరాబాద్ బ్లూస్‌తో నా కథా వృత్తిని ప్రారంభించాను, ఇది ఈ నగరం యొక్క ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేసింది. మోడ్రన్ లవ్ హైదరాబాద్‌తో, మేము వీక్షకులను సాధారణ ప్రజలు, సంస్కృతి మరియు ఆహారాన్ని బహిర్గతం చేస్తూనే ఉన్నాము. జూలై 8, 2022న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ ప్రీమియర్ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు మా ఆహ్లాదకరమైన స్ప్రెడ్‌ను ఆస్వాదించాలని మరియు ఈ హృద్యమైన ఆభరణాలతో ప్రేమను పొందాలని మేము కోరుకుంటున్నాము."

Shikaru Pre Release Event Held Grandly

 ఆహ్లాద‌క‌రంగా జ‌రిగిన సాయిధ‌న్సిక `షికారు` చిత్రం ప్రీ రిలీజ్ వేడుక‌



సాయిధ‌న్సిక‌, తేజ్ కూర‌పాటి, అభిన‌వ్ మేడిశెట్టి, కె.వి. ధీర‌జ్‌, న‌వ‌కాంత్‌, చ‌మ్మ‌క్ చంద్ర ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన చిత్రం `షికారు`  శ్రీ‌స‌త్య‌సాయిబాబాగారి ఆశీస్సుల‌తో నాగేశ్వ‌రి (ప‌ద్మ‌) స‌మ‌ర్ప‌ణ‌లో పి.ఎస్‌.ఆర్‌. కుమార్ (బాబ్జీ, వైజాగ్‌) నిర్మాత‌గా శ్రీ‌సాయి ల‌క్ష్మీ క్రియేష‌న్స్ బేన‌ర్‌మీద హ‌రి కొల‌గాని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. (యాన్ అన్‌లిమిటెడ్ ఫ‌న్ రైడ్‌) అనేది ట్యాగ్‌లైన్‌. శేఖ‌ర్ చంద్ర సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల‌యి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాయి.


ఈ సినిమా జులై 1న విడుద‌ల‌కాబోతుంది. సినిమాపై న‌మ్మ‌కంతో చిత్ర‌యూనిట్ ముందుగానే సినిమాను నెల్లూరులోని సిరీ థియేట‌ర్‌లో నారాయ‌ణ ఇంజ‌నీరింగ్ కాలేజీ విద్యార్థుల‌కు చూపించారు. అనంత‌రం వారు ఇచ్చిన అమేజింగ్ రెస్పాన్స్ చిత్ర‌యూనిట్‌కు ఎన‌ర్జీ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్‌లో షికారు ప్రీ రిలీజ్ వేడుక నిర్వ‌హించారు.


సాయి ధ‌న్సిక  మాట్లాడుతూ, షికారు సినిమాలో మొద‌టినుంచి పోస్ట‌ర్‌లో అంద‌రిని చూపించారు. ఇందులో క‌నిపిస్తున్న అంద‌రూ స్టార్సే. ఇలా డిజైన్ చేసిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. ఈరోజు ఇంత ఆద‌ర‌ణ పొందేలా వుండ‌డానికి కార‌ణం టెక్నీషియ‌న్స్ కృషి. న‌టీన‌టుల అభినయం. వారంద‌రినీ న‌డిపించిన ద‌ర్శ‌క నిర్మాత‌లు. న‌లుగు కుర్రాళ్ళ బాగా న‌టించారు. ర‌చ‌యిత క‌ర‌ణ్ నా బాడీ లాగ్వేజ్ ఎలా వుండాలో కూడా తెలియ‌జేస్తూ ఎంక‌రేజ్ చేశారు. అదేవిధంగా ప్రస‌న్న‌కుమార్‌, బెక్కెం వేణుగోపాల్‌, డి.ఎస్‌.రావు ఎంత‌గానో పాజిటివ్‌తో మొద‌టి నుంచీ స్పందించారు. మొద‌టి నుంచి షికారు చిత్రంపై బాబ్జీగారు పూర్తి న‌మ్మ‌కంతో వున్నారు. ఇందులో కంటెంట్‌తోపాటు కామెడీ ఎక్కువ‌గా వుంటుంది. అంద‌రూ చూసి ఎంజాయ్ చేయండి అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కుడు హ‌రి మాట్లాడుతూ, నా టీమ్ ఎంతో స‌హ‌క‌రించింది. నెల్లూరులో కాలేజీ స్టూడెంట్స్ స్పందించిన తీరు మేం అనుకున్న‌ట్లుగా వుండ‌డం చాలా ఆనందంగా వుంది. వారి జ‌డ్జిమెంట్ మాకు మ‌రింత ఎన‌ర్జీ ఇచ్చింది.  ఎడిట‌ర్‌, సుభాష్ మాస్ట‌ర్‌. అంద‌రూ స‌హ‌క‌రించారు.  శేఖ‌ర్ చంద్ర ఓపిగ్గా బాణీలు ఇచ్చాడు. భాస్క‌భ‌ట్ల పాట‌లు చాలా బాగా రాశాడు. న‌టీన‌టులు ఎంత‌గానో స‌హ‌క‌రించారు. నిర్మాత బాబ్జీగారు నాకు చాలా ఫ్రీడం ఇచ్చారు. అభి, తేజ‌, ధీర‌జ్‌, న‌వ‌కాంత్ అంద‌రూ బాగా చేశారు. అంద‌రికీ మంచి పేరు వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాన‌ని అన్నారు.


చిత్ర నిర్మాత బాబ్జీ మాట్లాడుతూ, ఈరోజు చాలా ఆనందంగా వుంది. ట్రైల‌ర్ నుంచి పెద్ద హిట్ అని చెబుతున్నా. అలాగే జ‌రుగుతుంది. ఈ సినిమాకు అన్నీ స‌రిగ్గా కుదిరాయి. క‌రోనా టైంలో నేను డిప్రెష‌న్‌లో వున్న‌ప్పుడు లైన్ ప్రొడ్యూస‌ర్‌ శివ‌కుమార్ ఎంతో  ధైర్యం ఇచ్చారు. నెల్లూరులో జ‌రిగిన ప్రీమియ‌ర్ షో  అద్బుతంగా వుంద‌ని టాక్ వ‌చ్చింది. స్టూడెంట్స్ కేరితం మాకు ఆనందాన్నిచ్చాయి.  సాయిధ‌న్సిక సినిమాకు వెన్నెముక‌. సినిమాను న‌డించింది ఆమెనే. అభిన‌యం అద్భుతంగా చేసింది. ఆమెను తెలుగులో ప‌రిచ‌యం చేస్తున్నందుకు గ‌ర్వంగా వుంది. మా సినిమాలో వ‌ల్గారిటీ లేదు. ఈ క‌థ అంద‌రికి తెలిసిన క‌థే. అహ‌ల్య గురించి అంద‌రికీ తెలుసు. షికారు క‌థ కూడా అటువంటి క‌థే. అంద‌రికీ న‌చ్చే సినిమా ఇది అని తెలిపారు.


మాట‌ల ర‌చ‌యిత విశ్వ‌క‌ర‌ణ్  మాట్లాడుతూ, ఐదేళ్లుగా హ‌రి తెలుసు. హ‌రి ద‌గ్గ‌ర పెద్ద క‌థ‌లున్నాయి. తొలిసినిమా రానా వంటి పెద్ద‌న‌టులతో చేద్దామ‌నుకున్నాడు. సాధ్య‌ప‌డ‌క‌పోవ‌డంతో ఆ టైంలో చిన్న సినిమా చేద్దామ‌ని సూచించా. అప్పుడు ఓ క‌థ చెప్పాడు. న‌లుగు కుర్రాళ్ళు, ఓ అమ్మాయికి క‌నెక్ట్ అవుతాడ‌న్నాడు. ఈ క‌థ‌ను త‌న స్వీయానుభ‌వాల్లోంచి తీసుకుని రాశాడు. ఆ క‌థ తీసుకుని బెక్కెం వేణుగారికి చెప్పాను. ఇది నా జీవితంలో జ‌రిగింది  క‌దా అన్నాడు. ఆ త‌ర్వాత బాబ్జీగారిని క‌లిశాం. ఇది ఎప్పుడో నాకు జ‌రిగింది అన్నారు. ఆ త‌ర్వాత న‌టీన‌టుల‌కు క‌లిసి క‌థ చెప్పాం. అంద‌రూ ఇది మా క‌థ అన్నారు. అలా చేసిన ప్ర‌యాణం జులై1న విడుద‌ల వ‌ర‌కు వ‌చ్చింది. ఇందులో ఏదీ త‌ప్పుగా వుండ‌దు. వున్నా ప‌రిష్కారం  వుంటుంది అని తెలిపారు.


న‌టుడు, నిర్మాత డి.ఎస్‌. రావు  మాట్లాడుతూ, సాయి ధ‌న్సిక అభిన‌యం అద్భుతం. జై బాల‌య్య ఫ్యాన్స్ అనేవారు చాలా డీసెంట్‌గా వుండాల‌ని చెప్పే పోలీస్‌గా న‌టించాను. ఈ సినిమాలో అండ‌ర్ క‌రెంట్ డైలాగ్స్ ర‌చ‌యిత చాలా చ‌మ‌త్కారంగా రాశాడు. న‌వ్విస్తూ క‌వ్విస్తూ వుండేలా వుంటాయి. ద‌ర్శ‌కుడు క‌థను డీల్ చేసే విధానం బాగుంది. ఫొటోగ్ర‌ఫీ, సంగీతం చాలా బాగున్నాయి. నిర్మాత‌కు మంచి లాభాలు రావాల‌ని ఆశిస్తున్నాన‌ని అన్నారు.


ప్ర‌స‌న్న‌కుమార్  మాట్లాడుతూ, అంద‌రూ సినిమాను ప్రేమిస్తూ ప్ర‌మోష‌న్ చేయ‌డం అనేది గ‌తంలో జ‌రిగేది. అలా షికారుకు వ‌చ్చారంటేనే స‌క్సెస్ కింద లెక్క‌. ఈ సినిమాకు అలా కుదిరింది. నెల్లూరులో  ప‌బ్లిక్‌గా షో వేసి మంచి రెస్సాన్ తీసుకున్నారు.. సాయిధ‌న్సిక‌లో అందంతోపాటు మంచి క్యారెక్ట‌ర్ వుంది. ఆమెకు మంచి భ‌విష్య‌త్ వుంటుంది అన్నారు.


నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, నెల్లూరు స్టూడెంట్స్‌తోపాటు డిస్ట్రిబ్యూట‌ర్ కూడా సినిమా చూశారు. ఇది మంచి హిట్ సినిమా. ఓపెనింగ్స్ వ‌స్తాయి. హిట్ అవుతుంది అని చెప్పాడు. నిర్మాత‌తోపాటు ద‌ర్శ‌కుడికి కూడా ప్రాధాన్య‌త గ‌ల సినిమా. ఆయ‌న ద‌గ్గ‌ర చాలా పెద్ద క‌థ‌లు వున్నాయి. ద‌ర్శ‌కుడు 8 ఏల్ళ ప్ర‌యాణంలో చిన్న సినిమాతో ముందుకు వ‌చ్చి స‌క్సెస్ ఇవ్వ‌బోతున్నాడ‌ని అన్నారు.


ర‌చ్చ ర‌వి  మాట్లాడుతూ, ప్ర‌మోష‌న్‌లో భాగంగా నెల్లూరు, వైజాగ్ వెళ్ళాను. భాస్క‌ర‌భ‌ట్ల పాట‌లతోపాటు శేఖ‌ర్ చంద్ర సంగీతానికి యూత్ క‌నెక్ట్ అయ్యారు. వారితోపాటు ధ‌న్సిక‌ను అంద‌రూ రిసీవ్ చేసుకున్నారు. పోసాని నుంచి అన్న‌పూర్ణ‌మ్మ వ‌ర‌కు అంద‌రం ఫ‌న్ చేశాం.  నిర్మాత‌గారు లాక్‌డౌన్‌లో కూడా క‌థ‌పై న‌మ్మ‌కంతో క‌ష్ట‌ప‌డి ఈ సినిమా తీశారు.   ధ‌న్సిక తెలుగులో మంచి హీరోయిన్‌గా అవుతుంది అన్నారు.


న‌టుడు ధీర‌జ్  మాట్లాడుతూ, నాకు భ‌యమేస్తే  బాల‌య్య‌ను త‌ల‌చుకుంటాను. నా పాత్ర కూడా సినిమాలో అలా వుంటుంది. నేను ఇంత‌కుముందు షార్ట్ ఫిలింస్ చేశాను. ఇప్పుడు షికారు సినిమా చేశాను. ఇంత‌కంటే మంచి డెబ్యూ ఊహించ‌లేదు. `మేం వ‌య‌స్సుకు వ‌చ్చాం` నాకు న‌చ్చిన ఆల్బ‌మ్‌. దానికి సంగీతం ఇచ్చిన శేఖ‌ర్ చంద్ర ఈ సినిమాకు ప‌నిచేయ‌డం ఆనందంగా వుంది.  ఆర్.ఆర్‌. అద్భుతంగా వుంది. `నేనింతే`లో భాస్క‌ర‌భ‌ట్ల‌ సాంగ్ అంటే ఇష్టం. దాన్ని ప‌దే ప‌దే వినేవాడిని. ఆయ‌న మా సినిమాకు రాయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.


న‌టుడు న‌వ‌కాంత్  మాట్లాడుతూ, మిడిల్ క్లాస్ అబ్బాయి అయిన నేను సినిమా కోసం టికెట్ దొరికితే ఆనంద‌ప‌డేవాడిని. అలాంటి న‌న్ను ఏకంగా హీరో చేశారు. ఇందుకు మాట‌లు రావ‌డంలేదు. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎంతో ఎంక‌రేజ్ చేశారు. మీడియాకూడా ప్రేక్ష‌కుల‌కు రీచ్ అయ్యేలా చేసింది. ఈ సినిమాను చూసి న‌వ్వండి ఆయుష్ పెంచుకోండ‌ని అని తెలిపారు.


కొరియోగ్రాఫ‌ర్ సుభాష్ మాస్ట‌ర్  మాట్లాడుతూ,  హుషారు సినిమాకు కొరియోగ్రాఫ‌ర్ గా చేశాను.  యాదృశ్చికంగా షికారుకు చేశాను. సిద్ద్ శ్రీ‌రామ్ అందులో పాట పాటారు. ఇప్పుడు ఇందులోనూ పాడారు.  హాట్రిక్ అవుతుంద‌నిపిస్తుంది. నెల్లూరు స్టూడెండ్స్ రెస్పాన్స్  చూశాక ఇది స‌క్సెస్‌మీట్‌గా అనిపిస్తుంది.  మీ అంద‌రికీ ఈ సినిమా న‌చ్చుతుందని అన్నారు.


ఇంకా ఈ వేడుక‌లో లైన్ ప్రొడ్ఊస‌ర్ శివ‌కుమార్, ఆదిత్య‌మ్యూజిక్ నిరంజ‌న్‌, మాధ‌వ్‌, `ఆద్య` ద‌ర్శ‌కుడు కృష్ణ మాట్లాడారు.

Vadu Evadu Movie First Look Poster And Teaser Launched By Telanga Cinematography Minister Thalasani Srinivas Yadav

 తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా విడుదలైన " వాడు ఎవడు " మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్                       


                                                                                      రాజేశ్వరి సినీ క్రియేషన్స్ పతాకంపై మాధురి, పూజిత సమర్పణలో కార్తికేయ, అఖిల నాయర్ హీరో హీరోయిన్లుగా ఎన్.శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సస్పెన్స్ త్రిల్లర్ " వాడు ఎవడు " చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసారు.                                                                        ఈ సందర్భంగా  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ... టీజర్ చూసాను బాగుంది, ఇలాంటి యదార్ధ సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని, ఇందులో నటించిన నటీనటులకు , సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలని ఈ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశారు.                                                       కథ,మాటలు,స్రీన్ ప్లే రాజేశ్వరి పాణిగ్రహి మాట్లాడుతూ ... సమాజంలో జరుగుతున్న కొన్ని అసాంఘిక శక్తులను మహిళలు ఎదుర్కోలేక వాళ్ళ అందమైన జీవితాలు ఎలా  అర్ధాంతరంగా ముగుస్తున్నాయి వైజాగ్ లో జరిగిన ఇలాంటి కొన్ని సంఘటనల ను తీసుకోని దాని ఆధారంగా తీసిన సినిమా ఇది అని అన్నారు .                                                                                 దర్శక నిర్మాత మాట్లాడుతూ ... ఈ చిత్రంలో మూడు పాటలు, మూడు ఫైట్లు ఉన్నాయి అని తెలియ జేశారు. ప్రమోద్ కుమార్ సంగీత దర్శకత్వంలోని  మూడు పాటలు వైజాగ్ పరిసర ప్రాంతాలలోని, ఒరిస్సా  అందమైన లొకేషన్లలో చిత్రీకరించామని, ఈ మూవీ ద్వారా సమాజానికి ఒక మంచి మెసెజ్ ఇస్తున్నామన్నారు.                                                                                                              ఇంకా ఈ చిత్రంలో శివ్ యువన్ ,ఆంజనేయులు , రాజ్ కుమార్ , బాబు దేవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ,మాటలు,స్రీన్ ప్లే : రాజేశ్వరి పాణిగ్రహి ,కెమెరా : విజయ్ గండ్రకోటి , సంగీతం : ప్రమోద్ కుమార్ ,బ్యాగ్రౌండ్ మ్యూజిక్ :రాజేష్ ,ఎడిటర్ : సాయి ఆకుల,నరేష్ , ఫైట్స్ : రాము , నిర్మాత, దర్శకత్వం : ఎన్.శ్రీనివాసరావు

Itlu Maredumilli Prajaneekam official Teaser Launched on the occasion of Naresh Birthday

అల్లరి నరేష్ బర్త్ డే స్పెషల్..  ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ టీజర్ విడుదల




అభివృద్ధికి దూరంగా ఉండే గిరిజ‌న గ్రామాలు.. జీవితంలో ఓసారి కూడా ఓటు వేయ‌ని ప్ర‌జ‌లు.. సాయం కోసం ఎదురు చూసే అమ‌యాకులు.. అలాంటి వారిని ఓటు వేయ‌మ‌ని చెప్ప‌డానికి కొంద‌రు అధికారులు వెళ‌తారు. ఈ క్ర‌మంలో వారికి అక్క‌డ ఎదుర‌య్యే ప‌రిస్థితులు ఏంటి?


గిరిజ‌నుల‌కు జ‌రిగిన అన్యాయం ఏంటి?  న్యాయం కోసం వారేం చేశారు?  గిరిజ‌నుల‌కు అండ‌గా నిల‌బ‌డిన అధికారి ఎలాంటి ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాడు?


ఈ విష‌యాల‌ను తెలుసుకోవాలంటే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. గురువారం (జూన్ 30) అల్లరి నరేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా నుంచి టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ గమనిస్తే అందులో అమాయకులైన గిరిజనులకు న్యాం చేయటం కోసం అల్లరి నరేష్ ఎలాంటి కష్టాలు పడ్డాడనేదే సినిమా అని తెలుస్తోంది. మన దేశం అభివృద్ధి చెందుతుంద‌ని అందరం అనుకుంటున్నాం. అయితే చిన్న ఆరోగ్య స‌మ‌స్య వ‌స్తే .. మైళ్ల దూరాలు కాలి న‌డ‌క‌న వెళ్లాల్సిన ఊళ్లు ఇంకా ఉన్నాయి. అలాంటి ఊళ్ల‌లోని ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను ఆవిష్క‌రించే ప్ర‌య‌త్న‌మే ఈ చిత్రం అని అర్థ‌మ‌వుతుంది.


సాధారణంగా అల్లరి నరేష్ అంటే కామెడీ చిత్రాలే కాదు..విశాఖ ఎక్స్‌ప్రెస్‌, గమ్యం, నాంది వంటి వైవిధ్య‌మైన క‌థాంశాలున్న చిత్రాల్లోనూ న‌టించి న‌టుడిగా మెప్పించారాయ‌న‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’.


సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌, రిప‌బ్లిక్‌, బంగార్రాజు వంటి వ‌రుస స‌క్సెస్‌ఫుల్ మూవీస్‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌, నిర్మాణంలో, మ‌రో నిర్మాణ‌ హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎ.ఆర్‌.మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి రాజేష్ దండ నిర్మాత‌. బాలాజీ గుత్త స‌హ నిర్మాత‌. ఆనంది హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియజేశారు

Promo Of Third Single Naa Peru Seesa From Ramarao On Duty Out

 Promo Of Third Single Naa Peru Seesa From Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty Out



Mass Maharaja Ravi Teja’s unique action thriller Ramarao On Duty is done with its shooting and the movie is gearing up for its theatrical release on July 29th. Post-production works are underway for the movie directed by debutant Sarath Mandava and produced grandly by Sudhakar Cherukuri under SLV Cinemas LLP and RT Teamworks.


As part of musical promotions, third single Naa Peru Seesa will be released on July 2nd. Interim, promo of the song has been launched. The promo of this special number alone creates great impact among masses and make everyone anticipate keenly for the lyrical video. Sam CS rendered this song that has lyrics by Chandrabose. Shreya Ghoshal and Sam CS lent vocals for the song that featured Anveshi Jain who looked super-hot and glamorous.


Based on real incidents, Ramarao On Duty features two heroines- Divyansha Kaushik and Rajisha Vijayan. Venu Thottempudi will be seen in a vital role.


Sam CS rendered soundtracks and first two songs of the movie enthused melody song lovers. While cinematography of the film was done by Sathyan Sooryan ISC, Praveen KL is the editor.


Cast: Ravi Teja, Divyasha Kaushik, Rajisha Vijayan, Venu Thottempudi, Nasser, Sr Naresh, Pavitra Lokesh, ‘Sarpatta’ John Vijay, Chaitanya Krishna, Tanikella Bharani, Rahul Rama Krishna, Eerojullo Sree, Madhu Sudan Rao, Surekha Vani and more.


Technical Crew:

Story, Screenplay, Dialogues & Direction: Sarath Mandava

Producer: Sudhakar Cherukuri

Banner: SLV Cinemas LLP, RT Teamworks

Music Director: Sam CS

DOP: Sathyan Sooryan ISC

Editor: Praveen KL

Art Director: Sahi Suresh

PRO: Vamsi-Shekar

Yedo Yedo Lyrical video From Maayon Launched

 హీరో సిబిరాజ్ ప్రతిష్ఠాత్మక  “మాయోన్” చిత్రానికి మ్యూజిక్ చేసిన మాస్ట్రో ఇళయరాజా నుండి వస్తున్న "ఎదో ఎదో ఏదో వెతికే నయనం..చేతికి అందేదాకా ఆగదు పయనం" పాట విడుదల 




“కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం “మాయోన్” ఈ చిత్ర హక్కులను మూవీమ్యాక్స్  అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. “మాయోన్” చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ రోజు ఈ చిత్రం నుండి 'ఎదో ఎదో ఏదో వెతికే నయనం చేతికి అందేదాకా ఆగదు పయనం" అను పాటను విడుదల చేశారు..ఈ సందర్బంగా 


 

చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ..నాకు మాస్ట్రో ఇళయరాజా పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన పాటలకు సంగీత ప్రియుల నుండి మంచి స్పందన లభించింది.ఈ చిత్రం ద్వారా ఆయనను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయన అభిమానినైన నేను అయన సంగీతం సారద్యంలో సత్య ప్రకాష్ ధర్మార్, శ్రీనిషా జయశీలన్ పాడిన "ఎదో ఎదో ఏదో వెతికే నయనం చేతికి అందేదాకా ఆగదు పయనం" పాటకు విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా  పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో  హై టెక్నికల్‌ వాల్యూస్‌ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్‌ “మాయోన్” చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందు కు చాలా సంతోషంగా ఉంది. గాడ్‌ వెర్సస్‌ సైన్స్‌ మెయిన్‌ థీమ్‌గా మిస్టరీ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత అరుణ్ మోజి మాణికం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆయనే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడం విశేషం. కిషోర్ ఎన్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ‘U’ సర్టిఫికేట్ మంజూరు చేసింది . ఈ సర్టిఫికేట్ మంజూరు చేసేటప్పుడు CBFC చిత్రానికి ఎలాంటి కట్‌లను సూచించ లేదు. హై టెక్నికల్‌ వాల్యూస్‌ తో రూపొందిన ఈ చిత్రానికి ఫోటోగ్రాఫీ స్పెష్ ఎస్సెట్ గా నిలుస్తుంది.ప్రముఖ కెమెరామ్యాన్‌ రాంప్రసాద్ “మాయోన్”  చిత్రాన్ని సెల్యూలాయిడ్ వండర్ గా మలిచారు.ఈ చిత్రంలో హీరో సిబిరాజ్ ‘అర్జున్’ అనే ఆర్కియాలజిస్ట్ గా నటిస్తుండగా, తాన్య రవిచంద్రన్ ఎపిగ్రాఫిస్ట్ పాత్రలో కనువిందు చేయనుంది. ఇందులో నటించిన సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ కు మంచి భవిష్యత్త్ ఉంటుంది. “మాయోన్” చిత్రాన్ని జూలై 7 న తెలుగు రాష్ట్రాలలో ధియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని అన్నారు.




నటీ నటులు 

సిబిరాజ్, తాన్య రవిచంద్రన్,రాధా రవి, KS రవికుమార్, SA చంద్రశేఖర్, భగవతి పెరుమాళ్ (బక్స్), హరీష్ పెరడి,  అరాష్ షా తదితరులు 


సాంకేతిక నిపుణులు 

దర్శకత్వం : కిషోర్ ఎన్ 

నిర్మాత : మామిడాల శ్రీనివాస్,అరుణ్ మోజి మాణికం

పి. ఆర్. ఓ : మధు వి. ఆర్

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Completes 50 Days

 Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Completes 50 Days



Superstar Mahesh Babu’s family and action entertainer Sarkaru Vaari Paata completes its 50 days run today. The film directed by Parasuram Petla is still running successfully in major centres.


Sarkaru Vaari Paata presented Mahesh Babu in a lively and action-packed role. The movie has turned out to be the Biggest Grosser of 2022 in TFI (Regional Film). Worldwide gross of the movie for 50 days is 230Cr gross with 126Cr Share. This is fourth consecutive blockbuster for the Superstar.


The film’s non-theatrical rights were sold for a record price and it is presently streaming on Amazon Prime Video. Like in theatres, the movie got massive views thus far on the OTT platform.


Keerthy Suresh played the leading lady in the movie produced jointly by Mythri Movie Makers, 14 Reels Plus Entertainment and GMB Entertainment. S Thaman provided chartbuster album for the movie.

Team Liger’s Heartfelt Birthday Wishes To Legend Mike Tyson

 Team Liger’s Heartfelt Birthday Wishes To Legend Mike Tyson



Marking Legend Mike Tyson’s birthday, the makers of his debut Indian cinema LIGER (Saala Crossbreed) starring Vijay Deverakonda in the titular role and directed by ace director Puri Jagannadh unleashed a special video sending heartfelt birthday wishes to the international icon.


Starting from Karan Johar, Vijay Deverakonda, Charmme Kaur, Vishnu, Ananya Pandey and Puri Jagannadh wished Tyson on his birthday. What’s more, we also get to see the making visuals of the film’s USA schedule. As is known, the scenes of Mike Tyson were filmed in the USA.


Mike Tyson’s simplicity and his humble attitude is observable in the video where he is seen chilling out with the entire team. He indeed warmly hugged and then kissed Vijay on his cheeks. This shows the kind of rapport Mike shared with Vijay and others.


Ananya Pandey will be seen as the leading lady opposite Vijay Deverakonda. In association with Puri connects, the film is being produced jointly by Bollywood's leading production house Dharma Productions. Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta together are bankrolling the film on a grand scale.


Vishnu Sarma is the cinematographer, while Kecha from Thailand is the stunt director.


Liger is currently in post-production phase. Being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages, the Pan India Movie is scheduled for release in theatres worldwide on 25th August, 2022.


Cast: Vijay Deverakonda, Ananya Pandey, Ramya Krishnan, Ronit Roy, Vishu Reddy, Ali, Makarand Desh Pandey and Getup Srinu.


Technical Crew:

Director: Puri Jagannadh

Producers: Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta

Banners: Puri Connects and Dharma Productions

DOP: Vishnu Sarma

Art Director: Jonny Shaik Basha

Editor: Junaid Siddiqui

Stunt Director: Kecha

Shivani Rajasekhar withdraws from Femina Miss India 2022

 Shivani Rajasekhar withdraws from Femina Miss India 2022



Grand finale falls on the same day as her Medical exam


Actress Shivani Rajasekhar, who recently became one of the finalists at the Femina Miss India 2022 beauty pageant, was supposed to represent Tamil Nadu in the soon-to-be-held grand finale. It is hereby declared that the beauty has withdrawn from the race due to inevitable circumstances. 


The actress is a Medical student and is slated to give her practical exams on July 3, the same date on which the Miss India Grand Finale is scheduled to be held. "It was very unfortunate that I missed out on a majority of training and grooming sessions and all the sub-contests, first because of my medical theory exams and then because I was down with Malaria. I was hoping to bounce back soon. But nothing seems to work my way. My practical exams have been pre-poned to July 3," Shivani today said, explaining her decision. 


She has bid goodbye to the competition with a "heavy heart". Shivani also thanked her "wonderful team" at Miss India Org for constantly supporting her in every possible way. She hopes to make a big comeback next year. 


Shivani wished the "super-talented and beautiful finalists" all the best. She also thanked her friends, well-wishers and supporters for always wishing her the best. "And sorry for not being able to go ahead in the contest. I am shattered too. And regarding my health, I am doing much better," Shivani added. 


The actress is currently in Guntur for the upcoming exam. 


Shivani is doing 'Aha Naa Pellanta', an 8-episode ZEE5 web series. A rom-com, the same is directed by Sanjeev Reddy. Raj Tarun is its hero.

Happy Birthday Looks Better Quality Than Mathu Vadalara: SS Rajamouli

 Happy Birthday Looks Better Quality Than Mathu Vadalara: SS Rajamouli 



Telugu Director Ritesh Rana who delivered a blockbuster with his debut film, Mathu Vadalara is coming up with Happy Birthday starring Lavanya Tripathi as his Second Project. The movie is releasing on July 8th. SS Rajamouli released the trailer on Wednesday at AMB Cinemas, Hyderabad and the trailer has got a superb response. Entire team attended the trailer launch event. 


Speaking at the event, Rajamouli said, "Mythri Movie Makers are Gold diggers. They got a gold mine with Happy Birthday and Clap Entertainments. Cherry is some one who is a master in problem solving. Director Ritesh Rana has utmost belief in himself, in his story, and also has amazing sarcasm. I liked Lavanya very much in the teaser and she is equally amazing here. Heroines get chances like this very rarely. She looked confident and I hope it will reflect the same in the movie".


"Vennela Kishore and Satya are my favorite comedy actors. They rocked the show. Ritesh achieved a perfect blend of comedy and thriller which is very difficult. He got a fantastic team and the team trusts him so much. As a result, they delivered better Quality than Mathu Vadalara. There are many apprehensions about audience not coming to the theaters. Audience will not come to theaters if a movie is not a half-hearted effort. But if you do some full-fledged effort like complete comedy or complete action. They will come. I guess Happy Birthday is one. Ritesh Rana confidently says this is a surreal comedy. This is a honest attempt and I am sure it will work with the audience," Rajamouli added.


Producer Cherry sounded very confident about the film. "This is a surreal action comedy film. Each character is introduced in one chapter and they all meet at the end. You will get to see a thrilling comedy. Ritesh and his team worked hard on this," he said.


Mythri Movie Makers Ravi Shankar said," We are teaming up with Clap Entertainments once again after Mathu Vadalara. The same team worked for the movie. Like how audience enjoyed Jathi Rathanalu with their families, they will enjoy this movie as well. 


Director Ritesh Rana promised double fun and double action when compared to his first film, Mathu Vadalara. "Watch Mathu Vadalara with your families in theaters," he said.


Lavanya Tripathi, the protagonist of the film sounded very excited about the film. "By watching the film you already know it is a different film. I never expected to get such a different subject. My character is completely new and fresh. Come and enjoy our party on July 8th," she said.

Rajamouli Launched Trailer Of Lavanya Tripathi 'Happy Birthday'

 Rajamouli Launched Trailer Of Lavanya Tripathi, Ritesh Rana, Mythri Movie Makers, Clap Entertainment’s 'Happy Birthday'



Director Ritesh Rana’s upcoming movie Happy Birthday starring the gorgeous Lavanya Tripathi in the lead role is gearing up for its worldwide release in Pan Telugu on July 8th. The film's teaser got overwhelming response. Today, ace director SS Rajamouli who is pride of India has released theatrical trailer of the movie and wished the team all the luck.


"@RiteshRana’s surreal comedy and @kaalabhairava7’s intoxicating music. A potent combination for a box office success. Ritesh is creating a niche for himself. Fantastic trailer. My best wishes to @Itslavanya @ClapEntrtmnt @MythriOfficial.  #HappyBirthday ," tweeted Rajamouli.


True to Rajamouli's words, Ritesh Rana created a niche for himself with innovative concepts. While he spellbound with his first move Mathu Vadalara, the second movie Happy Birthday seems to be another different movie.


Happy Birthday falls under the genre of surreal comedy which is still new to Tollywood. In a fantasy world, where gun bill was passed, there are celebrations everywhere. In terim, at a birthday party, where carrying gun is must, different people  arrive on a purpose. The trailer filled with hilarity promises double the action and double the fun that of Mathu Vadalara. Kaala Bhairava's intoxicating original score is other big asset. Production design is lavish and they claim to have spent double the budget.


Naresh Agastya, Satya, Vennela Kishore and other prominent actors appeared in entertaining roles. Lavanya Tripathi looked glamorous and is astounding in the lead role. The trailer sets the expectations bar high on the movie.



The coming-of-age content will largely appeal to youth. Produced by Chiranjeevi (Cherry) and Hemalatha Pedamallu of Clap Entertainment, Naveen Yerneni and Ravi Shankar Yalamanchili of Mythri Movie Makers present the movie.


Kaala Bhairava has helmed the music department, while Suresh Sarangam cranked the camera. Ritesh Rana himself provided the dialogues. Srinivas is the art director.


Happy Birthday will be arriving in cinemas on July 8th.


Cast: Lavanya Tripati, Naresh Agastya, Satya, Vennela Kishore, Gundu Sudarshan, and others.

 

Technical Crew:

Dialogues, Story, Screenplay & Direction: Ritesh Rana

Producers: Chiranjeevi (Cherry), Hemalatha Pedamallu

Presenters: Naveen Yereneni, Ravi Shankar Yalamanchili

Banner: Clap Entertainment in association with Mythri Movie Makers

Music Director: Kaala Bhairava

DOP: Suresh Sarangam

Production Designer: Narni Srinivas

Dialogues: Ritesh Rana

Fights: Shankar Uyyala

Line Producer: Alekhya Pedamallu

Executive Producer: Baba Sai

Chief Executive Producer: Bala Subramanyam KVV

Production Controller: Patsa Suman Naga Shekar

Publicity: Baba Sai Kumar

Marketing: First Show

PRO: Vamsi-Shekar, Madhu Maduri

Kamal Haasan starrer blockbuster “Vikram” to have its worldwide OTT premiere on Disney+ Hotstar from July 8th onwards

 Kamal Haasan starrer blockbuster “Vikram” to have its worldwide OTT premiere on Disney+ Hotstar from July 8th onwards

Hyderabad (June 29, 2022):



 Kamal Hassan starrer “Vikram”, which has grossed a worldwide box office collection of Rs. 400Cr till date, will have its OTT premiere on Disney+ Hotstar from July 8, 2022. 

Disney+ Hotstar has topped the domain of OTT platforms in the Telugu region for its consistency in delivering back-to-back blockbuster entertainers. Now it's all set to gift the year's Biggest Blockbuster hit "Vikram” to  the diehard South Indian movie audience.

“High-Octane Thriller”, “The power-packed spell of Aandavar”, “The acting exhibition of South India’s Power House Talents”, “A film with a Hollywood standard”, the heavy downpour of praises and critical acclaim upon Kamal Haasan’s ever-biggest magnum opus ‘Vikram’ continues to capture the spotlight. The movie hasn’t just surprised and enthralled the Indian trade circles alone, but has left the International markets awe-stricken as well. 

Written and directed by Lokesh Kanagaraj, Kamal Haasan-Vijay Sethupathi-Fahadh Faasil-Suriya starrer “Vikram” had its worldwide theatrical release on June 3, 2022. From the single word ‘Aarambikkalaangala’ uttered by Kamal Haasan in the curtain-raiser teaser to the ‘Paathukalaam’ in the trailer, every single punch word has became the chants of his hard-core fans. 

The movie had a blockbuster opening with 100% positive reviews from critics, and general audiences ‘Vikram’ has broken several box office blockbuster records, and has become the No. 1 Top Grosser in Tamil Nadu, which is officially confirmed by the producers, distributors, and exhibitors. 

And now it’s time for every single home to turn into a movie carnival with the OTT premiere of Vikram on Disney+ Hotstar, from July 8, 2022, onwards. Kamal Haasan’s rejuvenated looks and herculean charisma, Fahadh Faasil’s sparkling performance, Vijay Sethupathi’s terrorizing antagonist act, and Suriya’s overpowering cameo together left the fans in ultimate enthrallment. Besides, Filmmaker Lokesh Kanagaraj’s proficiency in building LCU (Lokesh Cinematic Universe), by bringing in a few characters from ‘Kaithi’ and extending them for the future instalments excited fans to the core. The emblazoning visuals of Girish Gangadharan and spellbinding musical score by Anirudh Ravichander turned out to be the ultimate icing on the cake. 

One of the noteworthy facts is that Disney+ Hotstar was the first to kick-start the Vikram carnival even before its theatrical release. The hard-core movie buffs watched Karthi starrer ‘Kaithi’ on the reputed OTT platform before watching the maverick action-packed thriller ‘Vikram’ in theatres, which contributed a lot to understanding the connection between the two worlds. 

Kamal Haasan’s Vikram will be available on Disney+ Hotstar in Tamil, Telugu, Kannada,Malayalam & Hindi from July 8, 2022, onwards.

Superstar Mahesh Babu Meets The Legendary Bill Gates In The USA

 Superstar Mahesh Babu Meets The Legendary Bill Gates In The USA



Superstar Mahesh Babu had delivered a Blockbuster with Sarkaru Vaari Paata and is cooling his heels with his family. After a holiday in Europe, they shifted to the United States recently.


This morning they met the Legendary Bill Gates. Mahesh Babu is a big fan of Bill Gates and got thrilled upon meeting the legend. 


While millions of fans ask and take pictures with Mahesh, the Superstar became a fanboy and got a pic with the Microsoft founder.


"Had the pleasure of meeting Mr. @BillGates! One of the greatest visionaries this world has seen... and yet the most humble! Truly an inspiration!!," Mahesh Babu wrote posting the picture of himself and Namratha with Bill Gates.


Mahesh Babu will be next seen in #SSMB28 with Trivikram Srinivas.

Minister Sabitha Indra Reddy Launched Female Poster

 మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి 

విడుదల చేసిన

ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ "ఫిమేల్"

టైటిల్ రివీలింగ్ పోస్టర్!!



       వి పి ఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి "నాని తిక్కిశెట్టి"ని దర్శకుడిగా పరిచయం చేస్తూ... సాఫ్ట్వేర్ ఇంజనీర్ "వెలిచర్ల ప్రదీప్ రెడ్డి" తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం "ఫిమేల్". షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టైటిల్ రివేలింగ్ పోస్టర్ ను తెలంగాణ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడి... మగాళ్లలో మార్పు తీసుకువచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నానని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. దర్శకుడు నాని తిక్కిశెట్టి, నిర్మాత వెలిచర్ల ప్రదీప్ రెడ్డి మరియు చిత్రబృందానికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. 

     శుభాంగి తంభాలే టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ బేబీ దీవెన, దీపిక, తమన్నా సింహాద్రి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహిళల పట్ల జరుగుతున్న దారుణాలపై విప్లవాత్మకమైన పరిష్కారాన్ని సూచిస్తూ రూపొందిన ఈ విభిన్న కథాచిత్రం త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్- అప్పాజీ, లిరిక్స్: గాంధీ కాకర్ల, సంగీతం: వంశీకాంత్ రేఖన, చాయాగ్రహణం: జగదీష్ కొమరి, ఎడిటింగ్: క్రాంతి, నిర్మాత: వెలిచర్ల ప్రదీప్ రెడ్డి, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: నాని తిక్కిశెట్టి!!

Prabhas 20years Celebrations With Krishnam Raju Garu

 ప్రభాస్ ఇంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు : ప్రముఖ నటుడు కృష్ణం రాజు

నటుడిగా ప్రభాస్ ప్రస్థానానికి 20 ఏళ్ళు !



డార్లింగ్ గా తెలుగు ప్రేక్షకుల చే పిలిపించుకునే ప్రభాస్ కేవలం ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఎవరు అనుకోలేదు.. కానీ బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులకు సంపాదించుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ హీరోగా పరిచయం అయి అంటే హీరోగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చి సరిగ్గా నేటితో 20 ఏళ్ళు పూర్తయింది. 2002 జులై 28 న రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ హీరోగా పరిచయం అవుతూ ఈశ్వర్ అనే సినిమాని మొదలుపెట్టారు. ప్రభాస్ పై అయన పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణం రాజు క్లాప్ కొట్టి సూపర్ స్టార్ గా ఎదగమని దీవించారు.. కానీ ప్రభాస్ మాత్రం పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడని అప్పుడు ఆయనా ఊహించలేదు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి హీరోగా పరిచయం అవ్వడం అన్నది మొదటి సినిమా వరకే ఉపయోగపడుతుంది, కానీ ఆ తరువాత సినిమాలతో హీరోగా సత్తా చాటి పోటీకి తట్టుకుని ఎదగడం అన్నది వాళ్ళ వాళ్ళ సొంత టాలెంట్ పై ఉంటుంది. అలా భిన్నమైన సినిమాలతో మాస్ ఇమేజ్ అందుకున్న ప్రభాస్ ఒక్కో సినిమాతో ఎదుగుతూ ఈ రోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక అయన నటిస్తున్న ఆదిపురుష్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా మారబోతున్నాడు. ఎందుకంటే ఆదిపురుష్ సినిమాను అటు హాలీవుడ్ లోకూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.


ప్రభాస్ హీరోగా అడుగుపెట్టి నేటికీ 20 ఏళ్ళు పూర్తవడంతో అయన అభిమానులు ఈ ఇరవై ఏళ్ల ఆనందాన్ని సంబరంగా జరుపుకున్నారు. ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షడు జె ఎస్ ఆర్ శాస్త్రి ( గుంటూరు ) ఆధ్వర్యంలో మంగళవారం రోజు హైద్రాబాద్ లో కృష్ణం రాజు ఇంట్లో ఈ సెలెబ్రేషన్స్ జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొందరు అభిమానులతో పాటు ఈశ్వర్ సినిమాను తెరకెక్కించి, ప్రభాస్ ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ లతో పాటు రెబెల్ స్టార్ కృష్ణం రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్బంగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు మాట్లాడుతూ ..  ప్రభాస్ హీరోగా పరిచయం అయి అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయాయా అన్న సందేహం కలుగుతుంది . నిజంగా ఆ రోజు ప్రభాస్ ని హీరోగా పరిచయం చేద్దామని ముందు మేమె అనుకున్నాం. మా గోపి కృష్ణ బ్యానర్ లో ప్రభాస్ ని పరిచయం చేయాలనీ అనుకున్న తరువాత ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్ ని పరిచయం చేసే అవకాశం మాకు ఇవ్వమని అడిగారు. ఈశ్వర్ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథ, తప్పకుండా అందరికి బాగా నచ్చుతుందన్న నమ్మకంతో అశోక్ కుమార్ కు ఓకే చెప్పాము. జయంత్, అశోక్ ఇద్దరు కలిసి ఎంతో బాధ్యతగా తీసిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుని ప్రభాస్ ని హీరోగా నిలబెట్టింది. పైగా ఆ సినిమాలో అశోక్ కుమార్ చెడ్డ తండ్రి పాత్రలో నటించడం గొప్ప విషయం . ఒక నిర్మాత అయి ఉండి ఆ సినిమాలో విలన్ గా నటించాడంటే అయన గట్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ప్రభాస్ మొదటి సినిమా చూసాకా తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ ఎవరు ఊహించని విధంగా ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడంటే అతని శ్రమ, పట్టుదల ముఖ్యంగా మా అభిమానుల అండదండలు ఉన్నాయి. ప్రభాస్ ని చుస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక నటుడిగానే కాకుండా సాటివారి పట్ల సహాయం చేసే గొప్ప గుణం ఉంది. ప్రభాస్ ఇంకా ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలని మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.


ఈశ్వర్ చిత్ర దర్శకుడు జయంత్ సి పరాన్జీ మాట్లాడుతూ .. నిజంగా నేను పరిచయం చేసిన హీరో ఈ రోజు ఒక పాన్ ఇండియా స్టార్ గా అవుతాడని ఎప్పుడు అనుకోలేదు . ప్రభాస్ నిజంగా గొప్ప వ్యక్తి . ఈ మధ్య కూడా తనను కలిసాను, ఈశ్వర్ సమయంలో ఎలా ఉండేవాడో అదే అభిమానాన్ని కలిగి ఉన్నాడు. అంత పెద్ద హీరో అన్న గర్వం ఏ కోశానా లేదు. నిజంగా నా హీరో ఈ రేంజ్ కి వెళ్లడం మరచిపోలేని అనుభూతి. ఇక ఈశ్వర్ సమయంలో ప్రభాస్ తో ఉన్న రోజులు కూడా మరచిపోలేము. ఈ సినిమా సమయంలో కథ అనుకున్న తరువాత చాలా మంది హీరోలను పరిశీలించాను, అయితే ఓ కాఫీ షాప్ లో ప్రభాస్ ని చూసి ఈ అబ్బాయి బాగా ఉన్నాడు. మన కథకు సరిపోతాడని చెప్పగానే అశోక్ వెళ్లి కృష్ణం రాజునూ కలవడం అయన మేమె పరిచయం చేస్తామని కాకుండా మమ్మల్ని నమ్మి హీరోని ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. మాకు సపోర్ట్ అందించిన కృష్ణం రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.


ఈశ్వర్ నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ .. ఈశ్వర్ సినిమా కథ అనుకున్నాకా నిజానికి మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలనీ అనుకున్నాను. కానీ అపుడు మా అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు.. అప్పుడే సినిమాల్లోకి లాగడం కరెక్ట్ కాదేమో అనిపించి మరో హీరో కోసం చూసాం.. చాలా మందిని పరిశీలించాకా ప్రభాస్ నచ్చడంతో వెంటనే కృష్ణం రాజు గారిని కలవడం అయన కూడా ఓకే అనడంతో ఈశ్వర్ తెరకెక్కింది. నిజంగా ప్రభాస్ అప్పటికి ఇప్పటికి అతని యాటిట్యూడ్ లో ఎలాంటి మార్పు లేదు. ప్రభాస్ అంత పెద్ద హీరో అయినా కూడా అందరితో కలివిడిగా ఉంటారు. ఈశ్వర్ సినిమా అప్పుడే 20 ఏళ్ళు పూర్తీ చేసుకుందా అని అనిపించింది. మొన్నే తీసినట్టుగా ఉంది. సినిమా సినిమాతో ఎదిగిన మా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను అన్నారు.


కృష్ణం రాజు భార్య శ్యామల మాట్లాడుతూ .. ప్రభాస్ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి నేటికీ 20 ఏళ్ళు అయిందంటే నమ్మకం కలగడం లేదు.. మొన్ననే అయినట్టు ఉంది. ప్రభాస్ ని హీరోగా పరిచయం చేస్తున్నామని తెలిసి రామానాయుడు స్టూడియో నుండి హైదరాబాద్ రోడ్లన్నీ నిండిపోయాయి. మేము స్టూడియోకి రావాలని కూడా ట్రాఫిక్ లో చిక్కుకుని వెనక్కి వెళ్లిపోయాం. అంతమంది అభిమానులు వచ్చారు. వాళ్ళ ఆశీర్వాదంతోనే ప్రభాస్ నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడం చాలా ఆనందంగా ఉంది. ప్రభాస్ కు నేనే పెద్ద అభిమానిని, ఈ విషయం తనతో చెబితే అవును అంటాడు. హీరోగా అంత పెద్ద స్టార్ ఇమేజ్ వచ్చినా కూడా అందరితో చాలా చక్కగా ఉంటాడు. నిజంగా ప్రభాస్ ని చూస్తుంటే పెద్దమ్మ గా చాలా గర్వాంగా ఉంది. ప్రభాస్ ఇలాగే మరిన్ని విజయాలు అందుకుంటూ ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను అన్నారు.  


ఆలిండియా రెబల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షుడు జె ఎస్ ఆర్ శాస్త్రి ( గుంటూరు ) మాట్లాడుతూ.. నేను మొదటి నుండి కూడా మా రెబెల్ స్టార్ అభిమానులుగానే ఉన్నాం. ఉంటాం కూడా. మాకు ఆయనే దేవుడు. ఇక ప్రభాస్ హీరోగా పరిచయం అయి నేటికీ ఇరవై ఏళ్ళు పూర్తవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఇరవై  ఏళ్లలో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రభాస్ ని హీరోగా పరిచయం చేయాలనీ వైజాగ్ లో సత్యానంద్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ ఇప్పించారు. అప్పుడు ప్రభాస్ ఎలా యాక్టింగ్ చేస్తున్నాడో తెలుసుకోమని సూర్య నారాయణ రాజు గారు నన్ను వైజాగ్ ఇనిస్టిట్యూట్ కి పంపించారు. నాపై అంత నమ్మకం ఉంది వాళ్లకు. ప్రభాస్ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి ఇరవై ఏళ్ళు పూర్తయిన సందర్బంగా అయన కు మా అభిమానుల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అయితే ఈ కోవిడ్ సమస్య వల్ల ఈ వేడుకను చాలా మంది అభిమానుల సమక్షంలో జరపాలని అనుకున్నాం కానీ కుదరలేదు అన్నారు .



Director Gopinadh Reddy Interview About Sammathame

ప్రేక్షకులు సంపూర్ణంగా 'సమ్మతమే'నని చాటిన విజయమిది: సమ్మతమే దర్శకుడు గోపీనాథ్ రెడ్డి ఇంటర్వ్యూ


 



యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌ టైనర్‌ "సమ్మతమే". చాందిని చౌదరి కథానాయిక. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పీపుల్స్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి హౌస్ ఫుల్  కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న  నేపధ్యంలో దర్శకుడు గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న సమ్మతమే సక్సెస్ విశేషాలివి.  


 


ప్రేక్షకుల నుండి వస్తున్న ఆదరణ మీకు ఎంతవరకు సమ్మతం  ?


ప్రేక్షకుల నుండి వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ప్రేక్షకుల రెస్పాన్స్ పూర్తిగా సమ్మతమే.


 


సమ్మతమే కథ ఆలోచన ఎలా వచ్చింది ?


ఏ కథ చెప్పినా బలమైన పాయింట్ వుండాలని అనుకున్నాను. సమ్మతమే పాయింట్ బావుంటుందని మొదట ఈ లైన్ అనుకోని తర్వాత పూర్తి స్థాయిలో బిల్డ్ చేశా.


మీ నేపధ్యం ?


నేను ఎంబీఏ చేశాను. ఇంటర్ తర్వాత అన్నపూర్ణలో మూడు నెలల ఫిల్మ్ క్రాష్ కోర్స్ చేశాను. డిగ్రీ చేస్తూ షార్ట్ ఫిల్మ్ చేసి, ఎంబీఏ చేస్తూ కథ రాసుకొని ఎంబీఏ పూర్తవ్వగానే సినిమా మొదలుపెట్టాను.


 


షార్ట్ ఫిలిమ్స్ కి బిగ్ స్క్రీన్ కి తేడా వుంది కదా.. మొదటి సినిమాకే కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది?


 


మొదట ఒక గంట కంటెంట్ ని యంగేజింగా చేస్తున్నానలేదా అని చెక్ చేసుకున్నాను. ఒక మంచి ప్రోడక్ట్ ని బయటికి తీసుకోస్తాననే నమ్మకం కుదురిన తర్వాతే సమ్మతమే మొదలుపెట్టాను.


 


సమ్మతమే పై వచ్చిన విమర్శ ఏంటి ?


ఫ్లాట్ నేరేషన్ అని అన్నారు. అయితే ఫ్లాట్ నేరేషన్ కూడా ఒక నేరేషన్ స్టయిలే. నాన్ లీనియర్ గా అక్కడిది ఇక్కడ కట్ చేసి జంప్స్ చేసి చెప్పొచ్చు. ఇలా ఐతే  కథానాయకుడితో కనెక్షన్ మిస్ అయిపోతుంది. అతడి ఎమోషన్ ని ఆడియన్ ఫీల్ అవ్వలేడు. అందుకే చాలా వరకూ ఫ్లాట్ నేరేషన్ స్టయిల్ ని ఫాలో అయ్యా.


 


ఈ సినిమాని మీ అమ్మగారు నిర్మించారు కదా.. సినిమా అన్నప్పుడు మీ ఇంట్లో ఎలాంటి చర్చ జరిగింది ?


ఈ రోజు కీ మా నాన్న మనకి సినిమాలు ఎందుకు, అక్కడ ఎవరూ తెలీదు కదా అని అంటారు. నేనే ఇంట్లో కన్విన్స్ చేసి మొదలుపెట్టా. 


 


బిజినెస్ పరంగా హ్యాపీనా ?   


చాలా హ్యాపీ. ఎక్కువ లాభాలు వచ్చాయని చెప్పను గానీ పెట్టిన ప్రతి రుపాయీ వచ్చింది.


 


'సొసైటీ బాలేన్నప్పుడు మారాల్సింది సొసైటీ గానీ అమ్మాయిలు కాదు' సినిమాలో ఈ డైలాగ్ హంట్ చేసింది. ఇది మంచి పాయింట్ కదా .,.దిన్ని ఎందుకు బలంగా చెప్పే ప్రయత్నం చేయలేదు ?


 


ఒక విషయాన్ని పాత్ర చెప్పినట్లు ఉంటేనే బావుంటుంది. దాన్ని బలవంతంగా హైలెట్ చేస్తూ చెబితే రుద్దుతున్నట్లు వుంటుంది. కొన్ని డైలాగులు బలంగా ఉంటాయని నాకు ముందే తెలుసు. అయితే క్యాజువల్ గా చెబితేనే దాని ఇంపాక్ట్ వుంటుంది. ఈ రోజు దాని గురించి మనం మాట్లాడుతున్నామంటే కారణం అదే.


 


మరీ లైటర్ వెయిన్ లో చెప్పారనే భావన కలుగుతుంది కదా ?


బేసిగ్గా సినిమా కథలు డబ్బులు, హత్యలు, కుట్రలు, పగలు, మోసాలు చుట్టే ఎక్కువగా తిరుగుతాయి. వర్షం పడే ముందు చల్లగాలికి రైడ్ మీద వెళ్లే ఒక ఆహ్లాదకరమైన సినిమా తీయాలని అనుకున్నా. లైటర్ వెయిన్ ఎమోషన్స్ అందరిలోనూ వుంటాయి. వాటిని ద్రుష్టి లో పెట్టుకొని కథ చేయాలనేది నా ఆలోచన.


 


పెళ్లి చూపుల్లో అవమానించిన అబ్బాయి,,. తర్వాత సీన్ లోనే ఆ అబ్బాయి ప్రేమలో అమ్మాయి పడినట్లు చూపించడానికి కారణం?


నిజంగా ప్రేమించడానికి కారణాలు వుండవు. ఒక అమ్మాయి ఎందుకిష్టం అంటే అప్పుడు కారణాలు వెదుక్కుంటారు కానీ ప్రేమించడానికి కారణాలు వుండవు. కారణం కంటే ముందు పుట్టేదే ప్రేమ.


 


ఈ కథ ముందు ఎవరికైనా చెప్పారా ?


లేదండీ. నేను,కిరణ్ అన్నదమ్ముల్లా వుంటాం. తనతో ఎప్పటి నుండో ట్రావెల్ అవుతున్నా. రాజా వారు రాణి గారు తర్వాత ఈ సినిమా చేయాలి. అయితే స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదు. ఈ గ్యాప్ లో తను ఎస్ఆర్ కళ్యాణ మండపం చేశారు. దీని తర్వాత సమ్మతమే మొదలుపెట్టాం.


 


కిరణ్ కూడా రైటర్ కదా.. కథ విషయంలో ఎలాంటి చర్చలు జరుగుతాయి ?


రైటింగ్ పరంగా మా ద్రుష్టి కోణాలు వేరువేరు. రచయితలుగా పరస్పరం గౌరవించుకుంటాం.


 


రాజాగారు రాణి వారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత కిరణ్ అబ్బవరం ఇమేజ్ మారింది కదా.. దానికి తగ్గట్టు కథలో ఏమైనా మార్పులు చేశారా ? 


దాన్ని ద్రుష్టిలో పెట్టుకొని భారీ స్కేల్ లో ఓ సాంగ్ చేశాం. కానీ ఎడిట్ లో తీసేశాను. ఫ్లో కి అస్సలు మ్యాచ్ కాలేదు. సినిమా అంతా ఆర్గానిక్ గా వుంది కానీ ఈ పాట మాత్రం చాలా ఫోర్స్ద్ గా అనిపించింది. అందుకే మరో ఆలోచన లేకుండా తీసేశాం.


 


సాంగ్ ని ఎడిట్ లో తీసేసినప్పుడు ఒక నిర్మాతగా ఎలా అనిపించింది ?


బడ్జెట్ పెట్టాం, కష్టపడ్డాం. అయితే ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకూడదు. సినిమాకి అనవసరం అనుకుంటే తీసేయడమే ఉత్తమం.లేదంటే అదే ఒక వైరస్ గా మారి సినిమా అంతా తినేస్తుంది.


 


బడ్జెట్ పెరిగిందని వినిపించింది ?


మేము అనుకున్న దాని కంటే ఎక్కువే అయ్యింది.


 


శేఖర్ చంద్ర మ్యూజిక్ గురించి ?


శేఖర్ గారు చాలా సపోర్ట్ చేశారు. కొత్త వారమని ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు. మంచి ఆల్బమ్ ఇచ్చారు.


 


ఎలాంటి స్పందన వస్తుంది ?


యూత్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన స్పందన రావడం సర్ప్రైజ్ గా వుంది. ఇండస్ట్రీ నుండి కూడా చాలా అభినందించారు. రెండు మూడు అవకాశాలు కూడా వచ్చాయి.


 


కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?


సబ్జెక్ట్లు రెడీగా వున్నాయి. ఒక ఫీమేల్ ఓరియంటెడ్ కథ కూడా వుంది. హీరోలంతా బిజీగా వున్నారు. వారి వీలు చూసుకొని మొదలుపెట్టాలి.


 


మీ నిర్మాణం లో చేస్తారా ?


ఏ ప్రాజెక్ట్ చేసిన నా వైపు నుండి కొంత పెట్టుబడి వుంటుంది.


 


ఎలాంటి కథలు చేయాలని వుంది?


అందరూ ఎంజాయ్ చేసేలా వుండే కథలు, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని వుంది


 


ఆల్ ది బెస్ట్


థాంక్స్ 

Kaduva Releasing World Wide on July 7th

పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్త మీనన్, వివేక్ ఒబెరాయ్, షాజీ కైలాస్ 'కడువా' మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో జూలై7 ప్రపంచవ్యాప్తంగా విడుదల



మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ కడువా. పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న  జూన్ 30న ఈ చిత్రాన్ని  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తొలుత ప్రకటించారు నిర్మాతలు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన సినిమా విడుదల వారం రోజులు వాయిదా పడింది. జూలై 7న సినిమాని విడుదల చేస్తున్నట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రకటించారు  ''అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యజమానులందరికీ క్షమాపణలు. అనుకోని పరిస్థితుల వలన 'కడువా' చిత్రం విడుదల జూలై7 కి వారం రోజుల వాయిదా పడింది. ప్రచార కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం కొనసాగిస్తాము. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కి మీఅందరి ప్రేమ, మద్దతు కొనసాగాలి'' అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు పృథ్వీరాజ్.


ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, 'భీమ్లా నాయక్' ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా కనిపించనున్నారు.


ఇటివలే విడుదలైన కడువా టీజర్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి సినిమాపై భారీ అంచనాలు పెంచింది.


మ్యాజిక్ ఫ్రేమ్స్ & పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.


తారాగణం: పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్త మీనన్, వివేక్ ఒబెరాయ్, అర్జున్ అశోక్, సిద్ధిక్, అజు వర్గీస్, దిలీష్ పోతన్ తదితరులు.


సాంకేతిక విభాగం :

దర్శకత్వం: షాజీ కైలాస్

నిర్మాతలు: సుప్రియా మీనన్ & లిస్టిన్ స్టీఫెన్

రచన: జిను వి అబ్రహం

డీవోపీ: అభినందన్ రామానుజం

ఎడిటర్: షమీర్ మహమ్మద్

ఆర్ట్: మోహన్ దాస్

వీఎఫ్ఎక్స్  : కోకోనట్ బంచ్

సంగీతం: జేక్స్ బిజోయ్

లైన్ ప్రొడ్యూసర్ - సంతోష్ కృష్ణన్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - నవీన్ పి థామస్

ప్రమోషన్ కన్సల్టెంట్: విపిన్ కుమార్

మార్కెటింగ్: పోఫాక్టియో

డిజిటల్ పీఆర్: తనయ్ సూర్య

పీఆర్వో : వంశీ-శేఖర్

Maya Ganga Song Launched by Director Sukumar From Banaras Movie

 ‘బనారస్’ చిత్రం నుంచి స్టార్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా విడుదలైన ‘మాయ గంగ’ సాంగ్ రిలీజ్



జైద్ ఖాన్, సోనాల్ మోన్‌టైరో హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘బనారస్’ . త్వ‌ర‌లోనే ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో సినిమా రిలీజ్ కానుంది.  జ‌య‌తీర్థ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి తిల‌క్‌రాజ్ బ‌ల్లాల్ నిర్మాత‌. అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ సినిమా నుంచి ‘మాయ గంగ’  పాటను మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో..


స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ మాట్లాడుతూ ‘‘నిర్మాత తిలక్‌గారి మ‌న‌సు చాలా మంచి మ‌న‌సు. ఫ్రెండ్ కోసం.. జైద్ ఖాన్‌ కోసం మీరు ఓ సినిమా చేయ‌డం గొప్ప విష‌యం. మంచి ప్ర‌య‌త్నం కోసం ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తున్నాను. మాయ గంగ పాట బ్యూటీ ఫుల్ మెలోడి. కె.కె. బ్యూటీఫుల్‌గా పాట‌ను రాశాడు. జ‌య‌తీర్థ డైరెక్ట్ చేసిన బెల్ బాట‌మ్ గురించి నేను చాలా విన్నాను. ఆహాలో  త‌ప్ప‌కుండా చూస్తాను. అన్నం ఉడ‌కిందా లేదా అని చూడ‌టానికి ఒక మెతుకు ప‌ట్ట‌కుంటే చాలన్నట్లు బెనార‌స్ మూవీ గురించి ఈ మాయ గంగ సాంగ్ చెప్పేస్తుంది. చాలా చాలా బావుంది. ఎంటైర్ యూనిట్‌కి అభినంద‌న‌లు. జైద్‌గారి నాన్న‌గారు క‌న్న‌డ‌లో చాలా పెద్ద పొలిటీషియ‌న్‌. కానీ సినిమాల‌పై ఆస‌క్తితో జైద్ సినిమాల్లోకి వ‌చ్చాడు. త‌న‌కు సినిమాలంటే చాలా ప్యాష‌న్‌. చాలా బాగా చేశాడ‌ని పాట చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. త‌న‌కు విష్ యు ఆల్ ది బెస్ట్‌. పాన్ ఇండియా లెవ‌ల్లో సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోర‌కుంటున్నాను. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు.


నిర్మాత తిలరాజ్ బల్లాల్ మాట్లాడుతూ ‘‘మా పాటను రిలీజ్ చేయడానికి సుకుమార్‌గారు రావ‌టం మాకు గ‌ర్వంగా ఉంది. ఇక ‘బనారస్’  సినిమా గురించి చెప్పాలంటే ముందు హీరో జైద్ ఖాన్ గురించి చెప్పాలి. త‌నకు సినిమాలంటే ఎంతో ప్యాష‌న్‌. అది నేను గ‌మ‌నించాను. బిజినెస్ చేసుకోమ‌ని తండ్రి చెబుతున్నా.. సినిమా రంగంలోకి ఆస‌క్తిగా వ‌చ్చాడు. త‌న‌ని నేను ముంబైకి తీసుకొచ్చాను. త‌ను డేడికేష‌న్‌, హార్డ్ వ‌ర్క్‌తో అన్నివిష‌యాల‌ను తెలుసుకుని సినిమా చేశాడు. పాజిటివ్ వైబ్స్‌తో చేసిన ఈ సినిమాకు అంద‌రూ స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చారు. పుష్ప సినిమా ఇచ్చిన స్ఫూర్తితో మా సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.


చిత్ర దర్శకుడు జయతీర్థ మాట్లాడుతూ ‘‘నేను చిన్నప్పుడే స్కూల్ మానేశాను. అయితే వీధి నాటకాలు చేస్తూ పెరిగాను. నేను డైరక్ట్ చేసిన బెల్ బాటమ్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆద‌రించారు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్‌లో ప‌ల‌క‌రించ‌బోతున్నాను. సినిమాలంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మో నాకు తెలుసు. సినిమాను వారిలా మ‌రెవ‌రూ ప్రేమించ‌లేరు. భాష  ఏదైనా మంచి సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల్లా ఎవ‌రూ ఆద‌రించ‌లేరు. మా సినిమాను కూడా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


హీరో జైద్ ఖాన్ మాట్లాడుతూ ‘‘మా పాటను విడుదల చేసిన సుకుమార్‌గారికి థాంక్స్‌. తెలుగు సినిమాల‌కు నేను పెద్ద అభిమానిని. హీరోగా నేను వేస్తున్న తొలి అడుగు ఇది. ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


హీరోయిన్ సోనాల్ మోన్‌టైరో మాట్లాడుతూ ‘‘నాకే కాదు.. మా అందరి హృద‌యాల‌కు ఎంతో ద‌గ్గ‌రైన సినిమా ఇది. క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలో ఇప్ప‌టికే విడుద‌లైన మాయ గంగ అనే పాట సూప‌ర్  హిట్ అయ్యింది. తెలుగులో రిలీజ్ అవుతుండ‌టం ఎంతో ఎగ్జ‌యింట్‌మెంట్‌నిచ్చింది. అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను. సినిమా కూడా అంద‌రికీ న‌చ్చ‌తుంది’’ అన్నారు.


లిరిక్ రైట‌ర్ కె.కె. మాట్లాడుతూ ‘‘సుకుమార్‌గారు మా పాట‌ను రిలీజ్‌చేయ‌డం మాకెంతో హ్యపీగా అనిపించింది. మాట‌ల ర‌చ‌యిత హ‌నుమాన్ చౌద‌రి ‘బనారస్’  మూవీ గురించి చెప్పిన‌ప్పుడు ట్యూన్ విన్నాను, ఎంతో బాగా న‌చ్చింది. డ‌బ్బింగ్ పాట‌లు రాయ‌టం చాలా క‌ష్టం. అందులోనూ లిప్ లేదు. దాంతో కాస్త కష్టమైనా చ‌క్క‌గా కుదిరింది. జ‌య‌తీర్థ గారికి ఇది ఏడో సినిమా. కొత్త హీరో హీరోయిన్ల‌ను, జ‌య‌తీర్థ‌గారిని అండ్ టీమ్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు.

Rocketry: The Nambi Effect Based by the life of ISRO Scientist Nambi Narayanan:R Madhavan


రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్ వంటి సినిమాలో నంబి నారాయణన్ వంటి రియ‌ల్ లైఫ్ జేమ్స్ బాండ్‌ను చూపించ‌బోతున్నాం :   హీరో ఆర్‌. మాధ‌వ‌న్‌




ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లతో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానాన్ని సంపాదించుకున్న హీరో ఆర్‌.మాధ‌వ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ . హీరోగా న‌టిస్తూ సినిమాను డైరెక్ట్ చేశారు. ట్రై క‌ల‌ర్ ఫిలింస్‌, వ‌ర్గీస్ మూలన్ పిక్చ‌ర్స్‌, 27 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్‌పై ఆర్‌.మాధ‌వ‌న్‌, స‌రితా మాధ‌వ‌న్‌, వ‌ర్గీస్ మూల‌న్‌, విజ‌య్ మూల‌న్ ఈ  చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం జూలై 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా


హీరో, దర్శ‌కుడు ఆర్‌.మాధ‌వ‌న్ మాట్లాడుతూ ‘‘నంబి నారాయణన్‌గారిని నేను నంబి సార్ అని పిలుస్తుంటాను. నేను విక్ర‌మ్ వేద సినిమా చేసిన త‌ర్వాత ఇస్రో సైంటిస్ట్‌కి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన క‌థ ఉంది. ఆయ‌న మాల్దీవుల‌కు సంబంధించిన అమ్మాయితో సంబంధాన్ని క‌లిగి ఉన్నాడు. పాకిస్థాన్‌కు మ‌న దేశానికి చెందిన రాకెట్రీ సీక్రెట్స్‌ను అమ్మేశాడు. ఆ నేరం కింద ఆయ‌న్ని అరెస్ట్ చేసి చిత్ర హింస‌లు పెట్టారు. దాదాపు చంపినంత ప‌ని చేశారు. కానీ సీబీఐ చేసిన ద‌ర్యాప్తులో ఆయ‌న నిర‌ప‌రాధిగా నిరూపించ‌బ‌డ్డారు అనేదే క‌థ అన్నారు. నాకు చాలా బాగా న‌చ్చింది. పేద‌వాడి జేమ్స్ బాండ్ స్టోరి అనిపించింది.


2016-2017లో త్రివేండ్రంలో నంబి సార్‌ను క‌లిశాను. ఆయ‌న క‌ళ్లు చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉన్నాయి. కానీ బాధ‌తో క‌నిపించాయి. జైలులో ఉన్న సింహంలా అనిపించారు. ఆయ‌న నన్ను చాలా మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. ‘హాయ్ మాధవన్ నేను మీకు పెద్ద ఫ్యాన్. మీ సినిమాలను చూస్తుంటాను’ అని అన్నారు. కానీ కేసు గురించి మాట్లాడే సంద‌ర్భంలో న‌న్ను దేశ ద్రోహి అని ఎలా అంటారంటూ చాలా కోపంగా మాట్లాడారు. అప్పుడు నేను మాట్లాడుతూ ‘సార్.. ఈ కేసులో మీరు నిర్దోషి అని నిరూపించబడ్డారు కదా. ఇంకా కోప‌మెందుకు?’ అని అన్నాను. దానికాయ‌న ‘ఆ విషయం నీకు, నాకు, కోర్టుకి తెలుసు. కానీ గూగుల్‌కి వెళ్లి నా పేరు కొట్టి చూడు’ అన్నారు. నేను గూగుల్‌లో నంబి నారాయ‌ణ‌న్ అని కొట్ట‌గానే ఆయ‌న మ‌న‌దేశ ర‌హ‌స్యాల‌ను ప‌క్క దేశానికి చేర్చిన ర‌హ‌స్య గూఢ‌చారి అని ఉంది. ఆయ‌న బాధ‌లో నిజ‌ముంద‌నిపించింది. త‌ర్వాత నేను స్క్రిప్ట్ రాయ‌డానికి ఏడు నెల‌ల స‌మ‌యం తీసుకున్నాను. ఆయ‌న్ని వెళ్లి క‌ల‌వ‌గానే నేను ప్రిన్స్‌టిన్‌లో చ‌దువుకున్నాన‌ని అన్నారు. అక్క‌డా అంద‌రూ ఐదారేళ్లు తీసుకునే రీసెర్చ్‌ను కేవ‌లం ప‌ది నెల‌ల్లోనే పూర్తి చేశార‌ని చెప్పారు. ఆయ‌న ఇస్రో, నాసాల‌కు సంబంధించిన విష‌యాల‌ను గురించి చెబుతున్న‌ప్పుడు జేమ్స్ బాండ్ బాబులాగా అనిపించాడు. నిజ‌మైన రాక్ స్టార్‌. ఆయ‌న సాధించిన విజ‌యాల‌ను గురించి తెలుసుకుని ఆశ్చ‌ర్య‌పోయాను. కానీ ఆయ‌నెప్పుడూ వాటి గురించి బ‌య‌ట‌కు చెప్పుకోలేదు. నేను చాలా ఎమోష‌న‌ల్ అయ్యాను.


నిజానికి రెండు ర‌కాలైన దేశ భ‌క్తులుంటార‌ని నాకు అప్పుడే తెలిసింది. ఒక‌రేమో దేశం స‌రిహ‌ద్దుల్లో ఉంటూ శ‌త్రువుల బుల్లెట్స్‌కువ ఎదురెళ్లి ప్రాణ త్యాగం చేస్తుంటారు. వారికెప్పుడూ మ‌నం రుణ ప‌డి ఉంటాం. మ‌రొక‌రు వారి జీవితాన్ని విధి నిర్వ‌హ‌ణ కోస‌మే కేటాయిస్తుంటారు. త‌మ కుటుంబం గురించి కూడా ప‌ట్టించుకోరు. వారికెలాంటి గుర్తింపు కూడా ఉండ‌దు. కానీ వారు చాలా ప్యాష‌న్‌తో త‌న డ్యూటీ చేస్తుంటారు. అప్పుడే సినిమా చేయాల‌ని అనుకున్నారు. ఏడాదిన్న‌ర పాటు క‌థ‌ను త‌యారు చేశాను. ప్ర‌పంచంలో ఏ సైంటిస్ట్ ఎదుర్కొని ప‌రిస్థితుల‌ను నంబి నారాయ‌ణ‌న్ గారు ఫేస్ చేశారు. ఆయ‌న గురించి మ‌నం తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అలాగే సినీ ఇండ‌స్ట్రీలో స్వాతంత్య్ర వీరులపై, పౌరాణిక పాత్ర‌ల‌పై ఇలా చాలా వాటిపై సినిమాలు తీస్తుంటాం. కానీ వీటికి సంబంధం లేకుండా సైన్స్‌, టెక్నాల‌జీ అనే రంగంలో చాలా మంది మేధావులున్నారు. వారి గురించి ఈ ప్ర‌పంచానికి తెలియజేయాల‌నే కార‌ణంగా ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’  అనే సినిమా చేశాను. ఎన్నో గొప్ప గొప్ప కంపెనీల‌కు మ‌న దేశానికి చెందిన ఇంజ‌నీర్స్ సి.ఇ.ఓలుగా ప‌ని చేస్తున్నారు. చాలా మంది ఇండియాలో లేరు. అలాంటి వారంద‌రూ మ‌న దేశానికి తిరిగి రావాలి.



‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’  మూవీ చేయ‌డానికి ఆరేళ్ల స‌మ‌యం తీసుకున్నాను. ఎవరూ చూపించ‌ని కొత్త విష‌యాల‌ను చూపించ‌బోతున్నాం. సాధార‌ణంగా రాకెట్స్‌ను, స్పేస్ షిప్స్‌ను చూసుంటాం. కానీ ఏ సినిమాలో రాకెట్ ఇంజ‌న్‌ను చూపించి ఉండ‌రు. కానీ తొలిసారి ఆ రాకెంట్ ఇంజ‌న్‌ను ఈ సినిమాలో చూపించ‌బోతున్నాం. సినిమాలో ప్రాస్థ‌టిక్ మేక‌ప్స్ ఉప‌యోగించ‌లేదు. నంబి నారాయ‌ణ‌న్‌గారిలా క‌నిపించ‌టానికి నా దంతాల అమ‌రిక‌ను మార్చాను. అలాగే బ‌రువు పెరిగాను, త‌గ్గాను. బాహుబ‌లి వంటి గొప్ప సినిమాను చేయ‌డానికి ఆ టీమ్ ఎంత క‌ష్ట‌ప‌డ్డారో మా టీమ్ కూడా అంతే క‌ష్ట‌ప‌డ్డారు’’ అని తెలిపారు.

 

Rajamouli To Launch Trailer Of Lavanya Tripathi 'Happy Birthday'

 Rajamouli To Launch Trailer Of Lavanya Tripathi, Ritesh Rana, Mythri Movie Makers, Clap Entertainment’s 'Happy Birthday'



Director Ritesh Rana’s upcoming movie Happy Birthday starring the gorgeous Lavanya Tripathi in the lead role is gearing up for its Pan Telugu release. The team is coming up with unique strategies in promoting the movie. Recently released teaser that enthralled large sections has got massive response.


The very innovative promotional material too generated enthusiasm. Falls under the genre of new age entertainer, the out of the box storyline and hilarious story-telling are going to amaze families as well as youth.


Naresh Agastya, Satya and Vennela Kishore who played crucial roles are also promoting the movie vigorously. Character introduction posters and videos of these actors went viral on social media. The funny TV debate video of these actors- Happy Birthday Movie Lo Evaru Hero, didn’t conclude who the male lead of the movie, though it hinted the trailer that will be out soon may give some hints.


Here's the update on trailer. Happy Birthday’s trailer will be launched by none other than the ace director SS Rajamouli who is Pride Of Indian Cinema and delivered the biggest blockbuster with his lats outing RRR. The trailer launch event will take place tomorrow from 4PM onwards at AMB Cinemas with Rajamouli gracing it as the chief guest. This is going to help the movie to have bigger reach.


The film’s story takes place in a fantasy world and the coming-of-age content will largely appeal to youth. Produced by Chiranjeevi (Cherry) and Hemalatha Pedamallu of Clap Entertainment, Naveen Yerneni and Ravi Shankar Yalamanchili of Mythri Movie Makers present the movie.


Kaala Bhairava has helmed the music department, while Suresh Sarangam cranked the camera. Ritesh Rana himself provided the dialogues. Srinivas is the art director.


Happy Birthday will be arriving in cinemas on July 8th.


Cast: Lavanya Tripati, Naresh Agastya, Satya, Vennela Kishore, Gundu Sudarshan, and others.

 

Technical Crew:

Dialogues, Story, Screenplay & Direction: Ritesh Rana

Producers: Chiranjeevi (Cherry), Hemalatha Pedamallu

Presenters: Naveen Yereneni, Ravi Shankar Yalamanchili

Banner: Clap Entertainment in association with Mythri Movie Makers

Music Director: Kaala Bhairava

DOP: Suresh Sarangam

Production Designer: Narni Srinivas

Dialogues: Ritesh Rana

Fights: Shankar Uyyala

Line Producer: Alekhya Pedamallu

Executive Producer: Baba Sai

Chief Executive Producer: Bala Subramanyam KVV

Production Controller: Patsa Suman Naga Shekar

Publicity: Baba Sai Kumar

Marketing: First Show

PRO: Vamsi-Shekar, Madhu Maduri

Avika Gor Interview About 10th Class Dairies

 నా క్యారెక్టర్ చుట్టూ 'టెన్త్ క్లాస్ డైరీస్' తిరుగుతుంది, చాందినికి ఏమైందనేది థియేటర్లలో చూడండి - అవికా గోర్ ఇంటర్వ్యూ 



అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖ ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూలై 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అవికా గోర్‌తో ఇంటర్వ్యూ...


*ప్రశ్న: హాయ్ అవికా గోర్! ఎలా ఉన్నారు?*

అవికా గోర్: ఐయామ్ గుడ్. చాలా బావున్నాను. త్వరలో 'టెన్త్ క్లాస్ డైరీస్'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. 


*ప్రశ్న: 'టెన్త్ క్లాస్ డైరీస్' గురించి చెప్పండి... సినిమా ఎలా ఉండబోతోంది?*

అవికా గోర్: ఇదొక స్వీట్ మూవీ. మీ టెన్త్ క్లాస్ సభ్యులు అందరూ కలిస్తే... రీ యూనియన్ అయితే... ఎలా ఉంటుందనేది చూపించారు. రీ యూనియన్ ఒక్కటే కాదు. సాంగ్స్, ట్రైలర్‌లో చూపించని ఒక ఎమోషన్ ఉంది. ఇంకా ఇందులో లిటిల్ బిట్ డ్రామా, ఫ్లాష్‌బ్యాక్‌, కామెడీ ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా, చాలా వినోదాత్మకంగా దర్శకుడు అంజి తెరకెక్కించారు. నేను ఎంపిక చేసుకునే కథలను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ కథను కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను. ఇంతకు ముందు నేను చేసిన సినిమాలకు డిఫరెంట్ స్క్రిప్ట్ ఇది. 


*ప్రశ్న: టెన్త్ క్లాస్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి?*

అవికా గోర్: సినిమా షూటింగ్స్! ఒకవైపు ఎగ్జామ్స్ రాస్తూ... మరో వైపు షూటింగ్స్ చేశా. నేను స్కూల్‌కు వెళ్ళింది తక్కువ. లొకేషన్స్‌లో, సెట్స్‌లో ఉన్నది ఎక్కువ. 


*ప్రశ్న: మీ క్యారెక్టర్‌లో రెండు షేడ్స్ ఉంటాయా? ఒక్కటేనా?*

అవికా గోర్: ఐ డోంట్ నో! నాకు తెలియదు. మీరు సినిమా చూసి తెలుసుకోవాలి (నవ్వులు). సినిమా నా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. అందులో చాలా సస్పెన్స్ ఉంది. సినిమాలో నా పాత్ర పేరు చాందిని. ఆమె ఎక్కడ ఉంది? చాందిని ఏం చేస్తుంది? బతికుందా? లేదా? అని తెలుసుకోవాలని క్లాస్‌మేట్స్‌ ప్రయత్నిస్తారు. చాలా సస్పెన్స్ అన్నమాట. మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. 


*ప్రశ్న: నిర్మాతలు అచ్యుత రామారావు, రవితేజ మన్యం, అజయ్ మైసూర్ గురించి...* 

అవికా గోర్: వెరీ నైస్ పీపుల్. వాళ్ళ నిర్మాణంలో కంఫ‌ర్ట్‌బుల్‌గా ఫీలయ్యాను. మేం చాలా లొకేషన్స్‌లో షూటింగ్ చేశారు. నేను చిక్ మంగుళూరులో చేశా. అయితే, సినిమాను శ్రీలంక, రాజమండ్రి, ఇంకా చాలా లొకేషన్స్‌లో చేశారు. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అంత మందితో సినిమా తీయడం ఎంత కష్టమో నిర్మాతగా నాకు తెలుసు. 


*ప్రశ్న: మీ మీద ఒక పాట తెరకెక్కించారు. సినిమాలో పాటల గురించి...*

అవికా గోర్: ఏ సినిమాకు అయినా సరే పాటలు చాలా ముఖ్యం. ఎంతో వేల్యూ యాడ్ చేస్తాయి. సురేష్ బొబ్బిలి మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆల్రెడీ పాటలు ప్రేక్షకులు నచ్చాయి. నార్త్ ఇండియాలో నా ఫ్రెండ్స్ కూడా 'టెన్త్ క్లాస్ డైరీస్' పాటలు వింటున్నారు. హార్ట్ టచింగ్ సాంగ్స్ అని చెబుతున్నారు. 


*ప్రశ్న: నటుడు శ్రీరామ్ గురించి...*

అవికా గోర్: అమేజింగ్ యాక్టర్. మా మధ్య ఎక్కువ సీన్స్ లేవు. అయితే... ఆయనతో నటించినప్పుడు ఎంతో నేర్చుకున్నాను. ఆయన ఎక్స్‌పీరియ‌న్స్‌లు చెప్పారు. 


*ప్రశ్న: ఎవరితో ఎక్కువ సీన్స్ ఉన్నాయి?*

అవికా గోర్: నా తండ్రి పాత్రలో నాజర్ గారు నటించారు. ఆయనతో ఎక్కువ సీన్స్ ఉన్నాయి. సినిమాపై ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉంది. ఆయనతో మాట్లాడేటప్పుడు ఎంతో నేర్చుకున్నాను. 


*ప్రశ్న: దర్శకుడు అంజి గురించి...*

అవికా గోర్: అంజి గారు చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. నటీనటుల నుంచి ఏం తీసుకోవాలో బాగా తెలుసు. సినిమాటోగ్రాఫర్ కావడంతో విజువల్స్ పరంగా బాగా తీశారు.


*ప్రశ్న: సినిమాలు పక్కన పెట్టి... మీ వ్యక్తిగత జీవితానికి వస్తే మిళింద్‌తో మీరు ప్రేమలో ఉన్న విషయం తెలుసు. ఆయన పరిచయం తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి?*

అవికా గోర్: నేను మరింత కాన్ఫిడెంట్‌గా  అయ్యాను. నా కేపబిలిటీ ఏంటి అనేది నాకు తెలిసింది. నేను ఏం చేయగలనో తెలిసింది. నేను ఆలోచిస్తున్న దానికంటే ఇంకా చాలా చేయగలని తెలుసుకునేలా చేశాడు. నేను బరువు తగ్గడం నుంచి నిర్మాతగా మారడం వరకూ... నా ప్రతి అడుగులో మిళింద్ ఉన్నాడు. నా ప్రయాణంలో నాకు అండగా నిలబడ్డాడు. అతడు లేకుండా నేను ఇదంతా చేయలేను.


*ప్రశ్న: తెలుగు సినిమాలకు మధ్యలో గ్యాప్ రావడానికి కారణం ఏదో ఉందని రూమర్స్ వచ్చాయి. మీరేమంటారు?*

అవికా గోర్: నేను హిందీ సీరియల్స్ చేస్తుండటం వల్ల తెలుగు సినిమాలు చేయలేకపోయా. అంతకు మించి ఏమీ లేదు. డేట్స్ లేక తెలుగు సినిమాలు చేయలేయకపోయా. 


*ప్రశ్న: జూన్ 30న మీ పుట్టినరోజు. బర్త్ డే ప్లానింగ్స్ ఏంటి?*

అవికా గోర్: ప్రస్తుతానికి ఏమీ లేవు. జూలై 1న 'టెన్త్ క్లాస్ డైరీస్' విడుదలవుతోంది కదా! వీలైతే ఒక్క రోజు ముందు... నా పుట్టిన రోజున అది చూడాలనుకుంటున్నా. వచ్చే నెలలో నేను నటించిన 'థాంక్యూ' విడుదల కానుంది. ఇంకా తెలుగులో సినిమా చేస్తున్నాను. ఆ సినిమాల గురించి మీకు చెప్పాలనుంది. పుట్టినరోజున అప్‌డేట్స్‌ రావచ్చు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్!

Pakka Commercial Pre Release Event Held Grandly

పక్కా కమర్షియల్ పక్కాగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను - పక్కా కమర్షియల్ మెగా మ్యాచో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి గారు 



వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్‌తో చేస్తున్న పక్కా కమర్షియల్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్ప కళావేదికలో జరిగింది. 

మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా ఈ వేడుకలో పాల్గొన్నారు. 


నిర్మాత బన్నీవాస్, మెగాస్టార్ చిరంజీవి గారును ఉద్దేశిస్తూ మాట్లాడుతూ

"మా కుటుంబాలన్నిటికి మీరొక మహాగణపతి లాంటివారు. ఎందుకంటే మా కుటుంబాలు కానీ, ఈ గీతా ఆర్ట్స్ తో మిగతా సంస్థలు కానీ ఈస్థాయిలో ఉన్నాయంటే దీనికి కారణం మీరు" అని చెప్తూ... గీతా ఆర్ట్స్ టీం కి , పక్కా కమర్షియల్ టీం కి కృతజ్ఞతలు తెలిపారు. 


దర్శకుడు మారుతి మాట్లాడుతూ..

బందరులో బొమ్మలేసుకునే ఒక చిరంజీవి గారి అభిమానినైన నాకు ఒక పది సినిమాలు చేసే అవకాశం రావడం, చిరంజీవి గారు ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా రావడం నా అదృష్టం. నేను బందరులో ఉన్నప్పుడు చిరంజీవి గారితో మెట్లపై మాట్లాడుతూ దిగుతున్నట్లు ఒక కల వచ్చింది. ఆ కల ప్రజా రాజ్యం పార్టీ టైం లో నెరవేరింది. ఆ టైంలోనే నేను సినిమాలు ఏవి చెయ్యకు ముందు నేను ఫస్ట్ యాక్షన్ చెప్పిన హీరో చిరంజీవి గారు. ఇటువంటి అదృష్టం ఇంకెవరికి రాదు. నీలో ఒక డైరెక్టర్ ఉన్నారయ్యా అనే చిరంజీవి గారి మాటతో నేను దర్శకుడినయ్యాను అంటూ తన కృతజ్ఞత భావాన్ని తెలిపారు. 

పక్కా కమర్షియల్ సినిమా గురించి మాట్లాడుతూ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కు , నిర్మాత బన్నీ వాస్ తో తన టీం కు కృతజ్ఞతలు తెలిపారు. 


రాశిఖన్నా మాట్లాడుతూ.. 

ముందుగా చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఇప్పటివరకు నేను చేసిన అన్ని కేరక్టర్ లో బెస్ట్ కేరక్టర్ ఇది,

మునుపెన్నడూ చూడని విధంగా గోపీచంద్ ఈ సినిమాలో కనిపిస్తారు.దర్శకుడు మారుతి గురించి మాటల్లో చెప్పలేము 

కానీ నేను పనిచేసిన దర్శకులలో ఒన్ అఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అని చెప్తూ , నిర్మాత బన్నీ వాస్ తో పాటు పలువురికి కృతజ్ఞతలు తెలిపారు.  


అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 

అడిగినవెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకి హాజరైన చిరంజీవిగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. హీరో గోపీచంద్ ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ప్రతిఘటన సినిమా చూసిన తరువాత మీ నాన్నగారిని మా బ్యానర్ లో సినిమాను చేయమని అడిగాం, 

కానీ అది కుదర్లేదు, ఇప్పుడు మా బ్యానర్ లో మీరొక మంచి సినిమా చేసారు. మారుతికి ఆడియన్స్ ప్లస్ తెలుసు కథనుంచి బయటకు వచ్చి కూడా ఆడియన్స్ ను నవ్వించగలరు ఇదివరకు ఈవివి. సత్యనారాయణ గారి సినిమాల్లో అలా చూసేవాళ్ళం అని చెప్తూ తన టీం కు పక్కా కమర్షియల్ టీం కృతజ్ఞతలు తెలిపారు. 


మ్యాచో స్టార్ గోపీచంద్ మాట్లాడుతూ.. 

చిరంజీవి గారు నా సినిమా ఫంక్షన్ కి గెస్ట్ గా రావడం ఇదే మొదటిసారి. నాలాంటి ఎంతోమందికి ఇన్స్పరేషన్ మీరు, మీ సినిమాలు చూసి ఎంతో నేర్చుకున్నాం. ఏ సపోర్ట్ లేకున్నా ఈరోజు ఒక మహావృక్షంలా ఎదిగారు అని చెప్తూ, ఈ సినిమాను నేను చేయడానికి మొదటికారణం యూవీ క్రియేషన్స్ వంశీ,

వంశీ వలన నాకు పరిచయమైన మంచి వ్యక్తి మారుతి. తనకున్నా టాలెంట్ కి ఇంకా పెద్ద దర్శకుడు అవుతాడు. ఈ సినిమాను చాలా బాగా చేసారు అంటూ పక్కా కమర్షియల్ సినిమా నటులకు, సాంకేతిక నిపుణులుకు కృతజ్ఞతలు తెలిపారు. 


మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... 

గోపీచంద్ నాన్నగారితో నాకు మంచి పరిచయం ఉంది, కాలేజీ రోజుల్లోనే నాలాంటి యంగ్ స్టార్స్ కి మంచి భరోసా ఇచ్చేవారు. 

తరువాత నేను ఇండస్ట్రీ కి రావడం, ఆయన కూడా ఇండస్ట్రీ కి వచ్చి విప్లవాత్మక,సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించి అనతికాలంలోనే అత్యద్భుతమైన పేరును సంపాదించారు. 

ఆ పేరు ఈరోజు గోపీచంద్ తో కొనసాగుతుంది. 

గోపీచంద్ విలక్షణ నటుడిగా తన కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు. 

గోపీచంద్ సినిమాల్లో సాహసం నాకు చాలా ఇష్టమైన సినిమా అని చెబుతూ, గోపీచంద్ చేసిన పలు సినిమాల గురించి ప్రస్తావించారు. దర్శకుడు మారుతి గురించి మాట్లాడుతూ ప్రజారాజ్యంలో టైం లో ఒక పాటను షూట్ చెయ్యమని మారుతికి చెప్పాను , చాలా అద్భుతంగా ఆ పాటను చేసాడు. అప్పుడే మారుతిని అడిగాను డైరెక్షన్ చెయ్యాలనే గోల్ ఏమైనా ఉందా అని. అప్పుడు మారుతి అలా లేదండి అని చెప్తూ చిన్న చిన్న కథలు అనుకుంటున్నాను అని చెప్పారు. ఈరోజు మంచి కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు. మారుతి సినిమాల్లో ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివే తనకిష్టం అని చెప్తూ పక్కా కమర్షియల్ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలుపుతూ మారుతి తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. నిర్మాత బన్నీ వాస్ గురించి మాట్లాడుతూ నేను చూస్తుండగానే అతను అంచలంచెలుగా ఎదిగాడు, గీతా ఆర్ట్స్ కి బన్నీవాసు ఒక రామబంటు అని చెప్పుకొచ్చారు. రావు రమేష్ గురించి ప్రస్తావిస్తూ వాళ్ళ నాన్నగారు రావు గోపాలరావు తో ఉన్న జ్ఞాపకాలను పంచుకుని ఇమిటేట్ చేసారు. ప్రస్తుతం ఆయన లేని స్థానాన్ని రావు రమేష్ భర్తీ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ "పక్కా కమర్షియల్" సినిమా హిట్ అవ్వాలని ఆశీర్వదించారు. 


ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 


నటీనటులు:


గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు


టెక్నికల్ టీం: 


స‌మ‌ర్ప‌ణ - అల్లు అరవింద్

బ్యాన‌ర్ - జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్

నిర్మాత‌ - బ‌న్నీ వాస్

ద‌ర్శ‌కుడు - మారుతి

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ర‌వీంద‌ర్

మ్యూజిక్ - జేక్స్ బీజోయ్ 

స‌హ నిర్మాత - ఎస్ కే ఎన్

లైన్ ప్రొడ్యూసర్ - బాబు

ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ - సత్య గమిడి

ఎడిటింగ్ - ఎన్ పి ఉద్భ‌వ్

సినిమాటోగ్ర‌ఫి - క‌ర‌మ్ చావ్ల‌

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌ శ్యామ్



Director Maruthi About Pakka Commercial

 టైటిల్ కు జస్టిఫై చేసే సినిమా "పక్కా కమర్షియల్"...స్టార్ డైరెక్టర్ మారుతి



భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందిస్తూ వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా "పక్కా కమర్షియల్". మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్‌తో చేస్తున్న "పక్కా కమర్షియల్" సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా రాసారు. అలాగే రాశీ ఖన్నా పాత్రను హిలేరియస్‌గా డిజైన్ చేసారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన  ప్రీ రిలీజ్ వేడుక శిల్ప కళావేదికలో ఎంతో గ్రాండ్ గా జరిగింది.ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిలుగా హాజరయ్యి  చిత్ర యూనిట్ ను బ్లెస్స్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని జులై 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు మారుతి పాత్రికేయ మిత్రులతో  మాట్లాడుతూ..



నిన్న ప్రి రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తి నాతో సినిమా చేస్తాను అని చెప్పడం నాకు పెర్సనల్ గా గొప్ప ఎనర్జీ నిచ్చినట్టు అనిపించడమే గాక నా లాంటి డైరెక్టర్ కు గొప్ప  ఎంకరేజ్మెంట్. అలాగే తరువాత దర్శకులకు ఆయన వ్యాఖ్యలు ఒక ఇన్స్పిరేషన్.



చిరంజీవి గారిని ఎలా చూయించాలో ఒక డైరెక్టర్ గా కాకుండా ఒక ఆడియన్ గా అలోచించి చూపిస్తాను.అయన ఏదిచ్చినా చేస్తారు. కానీ నా స్ట్రెంత్ ఏంటి ఆయనను ఎలా చూపిస్తే బాగుంటుంది అనేది నాకు ఒక వ్యూ ఉంటుంది.


పక్కా కమర్షియల్ సినిమాతో గోపీచంద్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా హీరో గోపీచంద్ చాలా స్టైలిష్ గా ఈ సినిమాలో కనిపిస్తున్నారు.ఈ సినిమా తనకు మంచి పేరు తెస్తుందని ఆయన కూడా బాగా నమ్మారు. పక్కా కమర్షియల్ అని ఈ సినిమాకు పేరు పెట్టినప్పుడే ఇందులో కావాల్సిన క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకునే అవకాశం దొరికింది.



ఒక వ్యక్తి డైరెక్టర్ అవ్వాలి అంటే తనకు ట్యాలెంట్ కంటే ముందు తను ఒక ఆడియన్ అయ్యుంటే ద బెస్ట్ సినిమా తియ్యగలుగుతాడు. నాకు ఈ కమర్సియల్ యాంగిల్ లో బడ్జెట్ లో చేయడం ఎందుకు వచ్చిందంటే నేను డిస్ట్రిబ్యూషన్ చేయడం. ఆడియన్స్ ఏ సినిమాలు చూస్తున్నారు దేనికి లేచి వెళ్లిపోతున్నారు అనేది తెలుసు కోగలగాలి . ఇప్పుడు మనం ఏమి ఆ నుకుంటున్నామంటే నేను చాలా గొప్ప సినిమా తీశాను అనుకుంటాడు. కానీ ఆడియన్స్ కు నచ్చదు. వారెందుకు రిజెక్ట్  చేశాడో తెలియదు అలాంటప్పుడు ఆడియన్ కు మనకు సింక్ పోతుంది.మనము ఏ జోనర్ సినిమా తీసినా ఆడియన్ ఎం కోరుకుంటాడు వారికీ ఎం కావాలో ఇస్తూ సినిమా సినిమాకు  మనం ఎలా ఎదుగుతున్నాం అని చెక్ చేసుకుంటూ కంపారిజన్ చేసుకోవాలి. ఎందుకంటే సినిమా అనేది ఫైనాన్సియల్ యాక్సెప్ట్ తో కూడుకొని ఉంటుంది. ఇందులో క్రొర్స్  బిజినెస్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఆడియన్ కు ఎం కావాలో ఇచ్చి వారి దగ్గర డబ్బులు తీసుకొని  ప్రొడ్యూసర్ కు ఇవ్వాల్సిన మీడియేషన్ బాధ్యత ఒక డైరెక్టర్ దే.. ఈ మీడియేషన్ కరెక్ట్ గా చెయ్యకపోతే ఇటు నిర్మాతలు పోతారు, అటు ఆడియన్స్  పోతారు. అందుకని డైరెక్టర్ మీడియేషన్ జాబ్ ను ప్రాపర్ గా హ్యాండిల్ చెయ్యాలి అంటాను.లేకపోతె నేను మంచి సినిమా తీశాను ఆడియన్ కు చూడడానికి రాలేదని ఇలా రకరకాల కారణాలు చెపుతూ బ్లేమ్ వేరే వాళ్లమీద తోసేసి తను సేఫ్ జోన్ ఆడుతుంటాడు



ప్రతి ఒక్కరూ స్క్రిప్ట్ ను బాగా రాసుకోవాలి.అవసరం అయితే  నెల, రెన్నళ్ళు ఎక్కువ కష్టపడి స్క్రిప్ట్స్  ను మన టేబుల్ మీదే ఎడిట్ చేసుకోగలిగితే చాలా వేస్టేజ్ పోయి నిర్మాతకు చాలా  డబ్బులు మిగులుతాయి..దీనికి తోడు మంచి మంచి సబ్జెక్టులు వస్తాయి. ఇప్పుడున్న ఇండస్ట్రీ క్రైసస్ లో బడ్జెట్ , రోజులు తగ్గిస్తూ మంచి మంచి కథలను  సెలెక్ట్ చేసుకుని ఆడియన్స్ కు నచ్చేవిదంగా మంచి సబ్జెక్ట్స్ తియ్యాలి.అంతేకాని మనకు ఇష్టమొచ్చినట్లుగా సినిమా తీస్తే ఆడియన్స్ చూడరు.మరోవైపు నిర్మాతను, థియేటర్ వ్యవస్థను కాపాడుకోకపోతే చాలా ప్రమాదం. కాబట్టి ప్రస్తుతం డైరెక్టర్ ఎంత రెస్పాన్సబుల్ గా ఉన్నాడంటే నిర్మాతను ఒప్పించాలి, థియేటర్ ను కాపాడుకోవాలి, ఆడియన్స్ ను సినిమాకు రప్పించాలి. ఒక వేల ఓటిటి కు పొతే అక్కడ ఆడియన్స్ కన్నును పక్కకు తిప్పుకోకుండా చూయించగలగాలి ,అప్పుడే ఒక డైరెక్టర్ సక్సెస్ అయ్యినట్టు.



ఈ బ్యాన‌ర్స్ నుంచే భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ సినిమాలు నాకు చాలా మంచి పేరును తీసుకు వచ్చాయి. దానికి కారణం మంచి కథ, నటీ నటులు, టెక్నిషియన్స్ సెట్ అవ్వడం.మనకు చాలా మంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్లకు తగిన క్యారెక్టర్స్ రాస్తే మిగతా భాషల నటీనటులను తెచ్చుకోవాల్సిన పని ఉండదు. ఈ సినిమాలో సత్యరాజ్, రావు రమేష్ లాంటి ఆర్టిస్టులు తీసుకోవడానికి కారణం వాళ్లు చేయాల్సిన మంచి పాత్రలు కథలో ఉన్నాయి.



దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సంగీత దర్శకుడు జ‌కేస్ బీజాయ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు



సినిమా రేట్లు ఎక్కువగా ఉండడం వలన ప్రేక్షకులు పెద్ద సినిమాలకు ఎక్కువగా థియేటర్స్ కు రావడంలేదు.అందుకే మేము తక్కువ రేట్ కే మా సినిమా టికెట్స్ ఉంటాయని ప్రచారం చేస్తున్నాము. అయితే మా సినిమాను చాలామంది ఓటిటి లో చూద్దాం అనుకున్నారేమో కానీ ఇప్పట్లో ఈ సినిమా ఓటిటి లో రాదు.



మంచి కథతో తెరకెక్కించిన "పక్కా కమర్షియల్" సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.మీరు హ్యాపీగా కాలర్ ఎగరేసుకునే చూసే సినిమా ఇది, ఒక మంచి ఎంటర్టైనర్ గా  తీసిన ఈ సినిమా చూసిన వారందరినీ కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా తీయడానికి నాకు అవకాశం ఇచ్చిన యూవీ క్రియేషన్స్ కి ,గీతా ఆర్ట్స్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులకి, టెక్నీషియన్స్ అందరికి చాలా థాంక్స్



యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో చిరంజీవి గారితో సినిమా అనుకున్నాం. ఆయనకు ఒక లైన్ చెప్పాను నచ్చింది. మెగాస్టార్ డేట్స్ ను బట్టి ఆ సినిమా చేస్తాను. ప్రభాస్ సినిమా కూడా ఆయన స్థాయికి తగినట్లే గ్రాండ్ గా చేయబోతున్నాను అని ముగించారు

Ranga Ranga Vaibhavamga Teaser Launched Grandly

వైష్ణవ్, కేతికా శర్మలతో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌గారు నిర్మించిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమా చూసి ఫ్యాన్స్, ప్రేక్షకులు నా సామి రంగా అని అనుకుంటారు - టీజర్ విడుదల కార్యక్రమంలో డైరెక్టర్ గిరీశాయ



‘ఉప్పెన’ సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యువ క‌థానాయ‌కుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో..  తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ ద‌ర్శ‌కుడిగా ప్రముఖ సీనియర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభ‌వంగా’. కేతికా శ‌ర్మ హీరోయిన్‌. సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. సోమ‌వారం ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. త్వ‌ర‌లోనే సినిమాను రిలీజ్ చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో...


నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘మెగా హీరోలందరితోనూ సినిమాలు చేశాను. ఇప్పుడు వైష్ణ‌వ్ తేజ్‌తో రంగ రంగ వైభ‌వంగా సినిమా చేశాను. సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అన్ని సినిమాలు హిట్ అయిన‌ట్లే ఈ సినిమా కూడా హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాను’’ అన్నారు.


హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ ‘‘టీజర్ అందరికీ నచ్చే ఉంటుంది. సినిమా కూడా నచ్చుతుంది. సపోర్ట్ చేసిన టీమ్ మెంబర్స్ సహా అందరికీ థాంక్స్’’ అన్నారు.


చిత్ర దర్శ‌కుడు గిరీశాయ మాట్లాడుతూ ‘‘మా సినిమా ప్రతి కంటెంట్‌ను ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఆద‌రించారు. ఈ సినిమా ఇక్క‌డ‌కు వ‌చ్చిందంటే ముఖ్య కార‌ణం.. వైష్ణ‌వ్ తేజ్‌గారే. ఓ హీరోను క‌లిసి క‌థ చెప్ప‌ట‌మంటే చాలా క‌ష్టం. కానీ ఒక్క ఫోన్ కాల్‌తోనే ఆయ‌న నన్ను క‌లిసి నా క‌థ‌ను విన్నారు. నేను తిరిగి వెళ్లే ట‌ప్పుడు ఆయ‌న నాకు చాక్లెట్ బాక్స్ గిఫ్ట్‌గా ఇచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి నాకు వ‌చ్చిన మొద‌టి గిఫ్ట్ అదే. నేనే కాదు.. మా ఫ్యామిలీ అంతా మెగాస్టార్‌చిరంజీవిగారి వీరాభిమానులం. దాంతో ఆరోజు రాత్రి మేం ఎవ‌రం నిద్ర కూడా పోలేదు. మ‌ర‌చిపోలేని ఫీల్ ఇచ్చిన‌, గొప్ప అవ‌కాశం ఇచ్చిన వైష్ణ‌వ్ తేజ్‌కి థాంక్స్‌. పాట‌లు రిలీజ్ అయిన‌ప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి వైష్ణ‌వ్‌గారి లుఖ్ అదిరిపోయింద‌ని, చించేశార‌ని అన్నారు. నిజంగానే మా సినిమాలో వైష్ణ‌వ్‌గారు కొత్త‌గా క‌నిపిస్తారు. ఆయ‌న ఎన‌ర్జీ నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉంటుంది. ఆయ‌న ఎన‌ర్జీయే మా రంగ రంగ వైభ‌వంగా సినిమా. మా సినిమాను చాలా హ్యాపీగా పూర్తి చేశామంటే నిర్మాత ప్ర‌సాద్‌గారు, బాపినీడుగారే కార‌ణం. మేం రాధ పాత్ర‌కు చాలా మంది హీరోయిన్స్‌ని అనుకున్నాం. చాలా మందిని లుక్ టెస్ట్ చేశాం. ఓరోజు కేతికా శ‌ర్మ‌ను లుక్ చేసిన‌ప్పుడు ఆమె క‌ళ్లు చూడ‌గానే ఆమె నా రాధ అని ఫిక్స్ అయిపోయాను. త‌ను అద్భుతంగా ఆ పాత్ర‌ను క్యారీ చేసింది. అందుకు థాంక్స్‌. దేవిశ్రీప్ర‌సాద్‌గారితో ఓ సినిమా అయినా ప‌ని చేయాల‌ని అనుకునేవాడిని. నా తొలి సినిమానే ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్‌గారు మంచి విజువ‌ల్స్ ఇచ్చారు. అవినాష్ కొల్ల‌గారు మంచి ఎఫ‌ర్ట్ పెట్టి వ‌ర్క్ చేశారు. ఈ సినిమాకు మెయిన్ పిల్ల‌ర్ వంటి అర్జున్ ప్ర‌సాద్ క్యారెక్ట‌ర్‌ను నవీన్ చంద్ర‌గారు చేశారు. మా ఎంటైర్ టీమ్‌కి థాంక్స్‌. ఈ సినిమా చూసిన త‌ర్వాత నా సామి రంగా.. రంగ రంగ వైభ‌వంగా అని మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు’’ అన్నారు.


న‌వీన్ చంద్ర మాట్లాడుతూ ‘‘రంగ రంగ వైభవంగా’ మూవీలో చాలా మంచి పాత్ర చేశాను. అంద‌రికీ న‌చ్చుతుంది. ముఖ్యంగా వైష్ణ‌వ్‌, కేతికా శ‌ర్మ చాలా బాగా చేశారు. దేవిశ్రీ ప్ర‌సాద్‌గారు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా త‌ర్వాత అబ్బాయిలంద‌రూ కేతికా శర్మ‌తో ల‌వ్‌లో ప‌డ‌తారు. మంచి సినిమా చేశాం. ఆద‌రించాలి’’ అన్నారు.


హీరోయిన్ కేతికా శ‌ర్మ మాట్లాడుతూ  ‘‘‘రంగ రంగ వైభవంగా’ మంచి ఫీల్ గుడ్ మూవీ. కచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుంది. మంచి టీమ్‌తో క‌లిసి వ‌ర్క్ చేశాను. ఈ సినిమాలో వైష్ణ‌వ్ రిషి పాత్ర‌లో న‌టిస్తే.. నేను రాధ అనే పాత్ర‌లో న‌టించాను. మంచి పాత్ర ఇచ్చినందుకు డైరెక్ట‌ర్ గిరిశౄయ‌గారికి, నిర్మాతలు ప్ర‌సాద్‌గారు, బాపినీడుగారికి థాంక్స్‌. వైష్ణ‌వ్ నిజంగా డైన‌మిక్ ప‌ర్స‌న్‌. న‌వీన్ చంద్ర‌కు నేను పెద్ద ఫ్యాన్‌. త‌న నుంచి చాలా విష‌యాలు నేర్చుకున్నాను’’ అన్నారు.


Swathimuthyam - Nee Chaaredu Kalle Song Out Now

Nee Chaaredu Kalle, the first single of Swathi Muthyam, starring Ganesh, Varsha Bollamma, captures the bliss of first love



Swathi Muthyam, a feel-good family entertainer produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments, marks the acting debut of Ganesh and features Varsha Bollamma as the female lead. Directed by Lakshman K Krishna, the film has music by Mahathi Swara Sagar. Nee Chaaredu Kalle, the first single from the film, was launched today.


Nee Chaaredu Kalle is a musical journey through the bliss of first love and the many moments that make it a magical experience. Lyricised by Krishna Kanth (KK) and sung by Butta Bomma sensation Armaan Malik and Sanjana Kalmanje, the breezy number captures how the protagonists Ganesh and Varsha Bollamma are gradually smitten by one another. 


The melody is easy on the ears and brims with a universal appeal that could resonate with music buffs across all age groups. Director Lakshman K Krishna says Nee Chaaredu Kalle has been the cynosure of all eyes on social media after the launch and that listeners just can’t have enough of it. 


Like every other work of art, it took a lot of effort to bring this together according to the producer's tastes and the situation specified by the director. The stanza with the words ‘O Taaralni Moota Kadatha...Nee Kaali Mundu Pedatha..Are...Chandamamaki Neeku Theda Leduga..Mabbulani Tecchi Kudatha’ holds a special place in my heart, shares lyricist KK.


The film’s glimpse, first-look posters received impressive responses from crowds recently. The situations between an innocent young man and a straightforward girl promise a heart-warming entertainer.Swathi Muthyam touches upon themes like life, love, and marriage and looks at modern-day relationships in a newer light. 


Swathi Muthyam releases in theatres on August 13. The shoot is complete and the post-production formalities are progressing at a brisk pace. The supporting cast includes senior actors Naresh, Rao Ramesh, Subbaraju, Vennela Kishore, Harshavardhan, Pammi Sai, Sapthagiri, Goparaju Ramana, Siva Narayana, Pragathi, Surekha Vani, Sunaina, Divya Sripada.


Crew Details :


Music: Mahathi Swara Sagar

Cinematography: Suryaa

Editor: Navin Nooli

Art: Avinash Kolla

Pro: Lakshmi Venu Gopal

Presents: PDV Prasad

Producer: Suryadevara Naga Vamsi

Written and Directed by Lakshman K Krishna