Home » » O Manchi Roju Chusi Cheptha Releasing on March 19

O Manchi Roju Chusi Cheptha Releasing on March 19




 విజయ్ సేతుపతి నిహారిక కొణిదెల జంటగా నటించిన చిత్రం "ఓ మంచి రోజు చూసి చెప్తా", మార్చ్ 19న విడుదల 


విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయినా తమిళ చిత్రం "ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్". మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో "ఓ మంచి రోజు చూసి చెప్తా" అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హాక్కులను భారి  ధరకి సొంతం చేస్తున్నారు. ఈ చిత్రానికి  "ఓ మంచి రోజు చూసి చెప్తా" అనే పేరుతో మార్చ్ 19న విడుదల చేస్తున్నారు. 


ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ "ఓ మంచి రోజు చూసి చెప్తా" చిత్రం తమిళం లో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి గారి నటన ఈ చిత్రానికే ఒక హై లైట్. విలక్షణ నటనతో ప్రేక్షకులని అలరిస్తాడు. నిహారిక కొణిదెల గారు ఎప్పుడు చేయని పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగు ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని మార్చ్ 19 న భారీగా విడుదల చేస్తున్నాము" అని తెలిపారు. 



చిత్రం పేరు : ఓ మంచి రోజు చూసి చెప్తా


బ్యానర్ : అపోలో ప్రొడక్షన్స్


నటి నటులు : విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల, గౌతమ్ కార్తీక్, గాయత్రీ శంకర్, విజి చంద్ర శేఖర్, రమేష్ తిలక్ మరియు తదితరులు 


సంగీతం : జస్టిన్ ప్రభాకరన్ 


కెమెరా : శ్రీ శరవణన్ 


ఎడిటర్ : అర్ గోవింద్ రాజ్ 


పి అర్ ఓ : పాల్ పవన్


Share this article :