"Launch of 'Venkata Ramayya Gari Taluka' Film in Visakhapatnam"

 వైజాగ్ లో " వెంకటరామయ్య గారి తాలూకా" చిత్రం ప్రారంభం



 
ఎస్ వి కే బ్యానర్ , కోమలి క్రియేషన్స్ పతాకం పై విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే, నిర్మాత సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్,కోమలి, నిర్మాతలుగా, సతీష్ ఆవాలా దర్శకత్వంలో  దినేష్, దివిజా ప్రభాకర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘వెంకట రామయ్యగారి తాలూకా, కేరాఫ్ సీతారాంపురం’ చిత్రం బుధవారం విశాఖపట్నం రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది.

హీరో హీరోయిన్లపై చిత్రించిన ముహూర్తపు సన్నివేశానికి ఈటీవీ  ప్రభాకర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాత  మరియు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ క్లాప్ కొట్టి ప్రారంభించారు.
సుధ, మురళీధర్ గౌడ్, సత్య, మిర్చి మాధవి, సత్య శ్రీ .. తదితరులు నటిస్తున్న ఈ  సినిమాకు 
సంగీతం చరణ్ అర్జున్, 
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనిల్ కుమార్,
పిఆర్వో:  బి. వీరబాబు
నిర్మాతలు:  సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్,కోమలి
దర్శకత్వం:  సతీష్ ఆవాలా   

Post a Comment

Previous Post Next Post