Home » » Tremendous Response for NaVenta Paduthunna Chinnadevadamma Teaser

Tremendous Response for NaVenta Paduthunna Chinnadevadamma Teaser

 నా వెంటే ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా  టీజ‌ర్ కి యూత్ లో అనూహ్య స్పంద‌న‌



హుషారు లాంటి సూప‌ర్‌హిట్ చిత్రం లో న‌టించిన తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ జంట‌గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వం లో జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మిస్తున్న‌చిత్రం నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా . ఈ చిత్రానికి సంభందించిన టీజ‌ర్ ని ప్ర‌ముఖ గేయ‌ర‌చ‌యిత అనంత శ్రీరామ్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు


ఈ సంద‌ర్బంగా అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈ టీజ‌ర్ ని చూసాను,  వెంక‌ట్ చాలా బాగా తీసారు. యూత్ కి ఏమి కావాలో అన్ని అంశాలు ఈ చిత్రం లో వుంటాయానేది తెలుస్తుంది. హీరో తేజ‌, అఖిల చాలా బాగా న‌టించారు. ఈ చిత్రం ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మల్లేటి నాగేశ్వ‌రావు, నిర్మాతలు ముల్లెటి కమలాక్షి గుబ్బల వెంకటేశ్వరరావు గారికి నా ప్ర‌త్యేఖ‌మైన శుభాకాంక్ష‌లు. ఈ సినిమా కూడా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని కొరుకుంటున్నాను. అని అన్నారు 


ద‌ర్శ‌కుడు వెంక‌ట్ వందెల మాట్లాడుతూ.. ప‌ల్లెటూరి నేప‌ధ్యం లో సాగే చ‌క్క‌టి ప్రేమ‌క‌థ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాము. ఈ చిత్రం లో యూత్  కి ఏమి కావాలో అన్ని వుంటాయి. చ‌క్క‌టి ప్రేమ‌క‌థ కూడా ఈ చిత్రం లో చూపించాము. ప్రేమ క‌థ తో వినొదాన్ని మిక్స్ చేసి ఈ క‌థ‌ని తెర‌క్కించాము. ఇది మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ గా మంచి విజ‌యాన్ని సాధిస్తుంది.ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత అనంత్ శ్రీరామ్ చేతుల మీదుగా ఈ చిత్రం యొక్క టీజ‌ర్ ని విడుద‌ల చేసాము. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్నిఆక‌ట్ట‌కుంటుంది. అని అన్నారు.


నిర్మాత ముల్లేటి నాగేశ్వ‌రావు మాట్లాడుతూ.. తేజ్ కూర‌పాటి, ఆఖిల ఆక‌ర్షణ  ఎంత బాగా న‌టించారో ఈ టీజ‌ర్ చూస్తేనే తెలుస్తుంది. ఈ జంట అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. మా చిత్రం టీజ‌ర్ ని ప్ర‌ముఖ గేయ‌ర‌చ‌యిత అనంత్ శ్రీరామ్ చేతుల మీదుగా విడుద‌ల చేశాము. ఆయ‌న‌కి మా చిత్ర యూనిట్ తరుపున ప్ర‌త్యేఖ ద‌న్య‌వాదాలు తెలుపుతున్నాము. అని అన్నారు


న‌టీన‌టులు


తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ , త‌ణికెళ్ళ భ‌ర‌ణి, క‌ల్ప‌నా రెడ్డి, జీవా, జొగి బ్ర‌ద‌ర్స్‌, అనంత్‌, బ‌స్టాప్ కోటేశ్వ‌రావు, డాక్ట‌ర్ ప్ర‌సాద్‌, మాధ‌వి ప్ర‌సాద్‌, సునీత మ‌నోహ‌ర్ త‌దిత‌లురు న‌టించ‌గా


సాంకేతిక‌నిపుణులు


ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. ముల్లేటి నాగేశ్వ‌రావు

నిర్మాత‌లు.. ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బుల వెంక‌టేశ్వ‌రావు

క‌థ‌-స్క్రీన్‌ప్లే- మాటలు ద‌ర్శ‌క‌త్వం.. వెంక‌ట్ వందెల‌

సినిమాటోగ్ర‌ఫి.. పి.వంశి ప్ర‌కాష్‌

సంగీతం.. సందీప్ కుమార్‌

స్క్రీన్‌ప్లే- పాట‌లు.. డాక్ట‌ర్ భ‌వ్య ధీప్తి రెడ్డి

ఎడిట‌ర్‌.. నంద‌మూరి హరి

స్టంట్స్‌.. రామ కృష్ణ‌

కొరియోగ్ర‌ఫి.. గ‌ణేష్‌ మాస్టర్, నండిపు రమేష్


Share this article :