Latest Post

Gam Gam Ganesha second single 'Pichiga Nachavashave' will be Releasing Tomorrow

హీరో ఆనంద్ దేవరకొండ "గం..గం..గణేశా" సినిమా నుంచి సెకండ్ సింగిల్ 'పిచ్చిగా నచ్చాశావే' రేపు రిలీజ్



"బేబి" వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా "గం..గం..గణేశా". ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం. ఈ నెల 31న "గం..గం..గణేశా" సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.


రేపు మద్యాహ్నం 12.06 నిమిషాలకు "గం..గం..గణేశా" సెకండ్ సింగిల్ 'పిచ్చిగా నచ్చాశావే'  ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. హీరో హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ,‌ ప్రగతి శ్రీవాస్తవ మద్య రొమాంటిక్ లవ్ సాంగ్ గా ఈ పాట రూపొందించారు. ఈ సమ్మర్ లో టాలీవుడ్ నుంచి వస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీగా "గం..గం..గణేశా" పై అంచనాలు ఏర్పడుతున్నాయి.

 


నటీనటులు :

ఆనంద్ దేవరకొండ,ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులు.


టెక్నికల్ టీమ్ :


పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

కాస్ట్యూమ్ డిజైనర్ : పూజిత తాడికొండ

ఆర్ట్: కిరణ్ మామిడి

ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి

సంగీతం - చేతన్ భరద్వాజ్

బ్యానర్ - హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్

కొరియోగ్రఫీ: పొలాకి విజయ్

కో-ప్రొడ్యూసర్ -అనురాగ్ పర్వతనేని

నిర్మాతలు - కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి

రచన, దర్శకత్వం - ఉదయ్ శెట్టి 

Patang' Teaser unveiled by Sensational Director Buchi Babu Sana

 యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప‌తంగ్ అంద‌ర్ని మ‌న‌సుల‌కు హ‌త్తుకుంటుంది



ఇప్ప‌టి వ‌ర‌కు భార‌తీయ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్ష‌కులు చూసి వుంటారు. కాని తొలిసారిగా ప‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి ద‌ర్శ‌కుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు. మ‌రికొంత మంది నూత‌న న‌టీన‌టుల‌తో పాటు ప్ర‌ముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం వేస‌విలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం టీజ‌ర్‌ను గురువారం ప్ర‌సాద్ ఐమ్యాక్స్‌లో జ‌రిగిన వేడుక‌లో గ్రాండ్‌గా విడుద‌ల చేశారు. ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు ప్ర‌స్తుతం గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో పాన్ ఇండియా సినిమాను తెర‌కెక్కిస్తున్న బుచ్చిబాబు సానా టీజ‌ర్‌ను విడుదల చేశారు. మ‌రో అతిథి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ‌య్య ఈ సినిమా కాంటెస్ట్‌లో విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో

ప్ర‌ణ‌వ్ కౌశిక్‌, ప్రీతి ప‌గ‌డాల‌, వంశీ పూజిత్ ప్ర‌ణీత్ ప‌త్తిపాటి, ఆటా సందీప్ మాస్ట‌ర్‌, మాజీ ప్లార్ల‌మెంట్ సిరిసిల్ల రాజ‌య్య, న‌టి శాన్వి, ర‌విప్ర‌కాష్‌, చైత‌న్య త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా


బుచ్బిబాబు మాట్లాడుతూ కంటెంట్ చూస్తుంటే సినిమా షూర్ షాట్ హిట్ అనిపిస్తుంది. ఈ సినిమాకు ఆ

 యూత్‌ఫుల్ వైబ్ క‌నిపిస్తుంది. మ‌రో హ్య‌పీడేస్‌లా ఘ‌న‌విజయం సాధిస్తుంద‌న్న అనిపిస్తుంది. నాని నేను మా గురువు గారు సుకుమార్ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న‌ప్పుడు నాకు తెలుసు. మంచి టెక్నిక‌ల్ నాలెడ్జ్ వుంది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించి అంద‌రికి మంచి పేరును తీసుక‌రావాలి అన్నారు.



ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్ మాట్లాడుతూ సినిమా టీజ‌ర్ న‌చ్చితే అంద‌రికి సినిమా న‌చ్చిన‌ట్టే. ఒక తెలుగు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో వున్న ఎలిమెంట్స్ వున్నాయి. త‌ప్ప‌కుండ సినిమా న‌చ్చుతుంది. టీజ‌ర్ లో చెప్పిన‌ట్లుగా మ్యాచ్‌లో క‌లుద్డాం అన్నారు.


నిర్మాత సంప‌త్ మ‌క మాట్లాడుతూ ఈ సినిమా చాలా వ్య‌య ప్ర‌యాసాల‌తో జ‌రిగింది. ఈ గాలిప‌టం దారం తెగ‌కుండా చూసుకున్నాడు నాని. ఈ రోజు సినిమా బాగా రావ‌డానికి టీమ్ అంతా కృషి చేశారు. టీజ‌ర్‌లో వున్న‌ట్లు అంద‌రూ మ్యాచ్ కోసం ఈసినిమా మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తారు.



క్రియేటివ్ నిర్మాత నాని బండెడ్డ్రి మాట్లాడుతూ ఎంతో బిజీగా రెహ‌మాన్ గారితో మ్యూజిక్ సిట్టింగ్ష్‌లో వున్న బుచ్చిబాబు గారు మా మీద ప్రేమ‌తో వ‌చ్చినందుకు కృత‌జ‌జ్క్షత‌లు తెలియ‌జేస్తున్నాను. త‌ప్ప‌కుండా ఈ సినిమా అంద‌ర్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఈ సినిమా థియేట‌ర్స్‌లో యూత్‌ఫెస్టివ‌ల్స్ జ‌రుగుతాయి.



సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ ఈ సినిమా విజ‌యం సాధించి మ‌రెంతో మందికి ప్రేర‌ణ‌గా నిల‌వాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. 


Political Satire "Lakshmi Kataksham" Set to Hit Theaters on May 10

 మే 10న రిలీజ్ అవుతున్న ’లక్ష్మీ కటాక్షం’



మహతి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుండి యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి నిర్మించిన ‘లక్ష్మీ కటాక్షం’ డైలాగ్ పోస్టర్ & ట్రైలర్ విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందిన సంగతి అందరికీ తెలిసిందే. పొలిటికల్ సేటైరికల్ డ్రామా తో వచ్చిన ఈ ‘లక్ష్మీ కటాక్షం’ కాన్సెప్ట్ తనకంటూ ఒక మార్క్ క్రీయేట్ చేసుకుంది. ఓటర్లే వారి ఓటుకు ఒక రేటు ఫిక్స్ చేసుకుని నాయకులని ముప్పు తిప్పలు పెడుతూ డ్రామా తో పాటు, హాస్యం రెండు కలగలిపిన కథ 'లక్ష్మీ కటాక్షం'. 


ఒక పక్క రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హోరు ఇంకో పక్క ఆ ఎన్నికలకే సెటైరికల్ గా వస్తున్న 'లక్ష్మీ కటాక్షం' U/A సర్టిఫికెటును తెచ్చుకొని మే 10న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. 


నటీ నటులు:

వినయ్

అరుణ్

దీప్తి వర్మ

చరిస్మా శ్రీకర్

హరి ప్రసాద్

సాయి కిరణ్ ఏడిద

ఆమనీ


సాంకేతిక నిపుణులు:

బ్యానర్: మహతి ఎంటర్టైన్మెంట్

నిర్మాతలు: యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి

రచన, డైరెక్టర్: సూర్య

మ్యూజిక్: అభిషేక్ రుఫుస్

డి ఓ పి: నని ఐనవెల్లి

ఎడిటర్: ప్రదీప్ జే

సౌండ్ డిజైన్: మురళీధర్ రాజు

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఆర్. రంగనాథ్ బాబు

పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను , ధీరజ్- ప్రసాద్

Akshay Kumar Wraps Up His Part For Vishnu Manchu’s Kannappa

విష్ణు మంచు ‘కన్నప్ప’ షూట్ పూర్తి చేసిన అక్షయ్ కుమార్ 



డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో డా.మోహన బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం వంటి వారు నటిస్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అక్షయ్ కుమార్ తన సీన్లకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ మేరకు అక్షయ్ కుమార్‌తో పని చేసిన ఎక్స్‌పీరియెన్స్ గురించి విష్ణు మంచు తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.


మహాశివరాత్రి పర్వదినాన విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప మీద అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అనేక మంది పాన్ ఇండియా స్టార్స్ ఉండటం వల్ల అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ మీద పడింది.


అక్షయ్ కుమార్ కొద్ది రోజుల క్రితం కన్నప్ప షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ తన షూటింగ్‌ను ముగించుకున్నాడు. విష్ణు మంచు ఈ మేరకు వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.  ‘అక్షయ్‌కుమార్‌ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైంది. ఇంకా ఇలా ఎన్నో సార్లు కలవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. 


"కన్నప్ప" సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోంది.  ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మల్చుతున్నారు. కన్నప్ప అచంచలమైన విశ్వాసం తరతరాలుగా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉంది.  ఎంతో అంకితభావంతో విష్ణు మంచు ఈ పాత్రను పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు.  ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలను పెంచనున్నారు. 

Anshu Reddy Look From Yevam is Unveiled

 నా బాడీ సూప‌ర్‌డీల‌క్స్ అంటున్న ఆషురెడ్డి యేవమ్ ,చిత్రంలో ఆషురెడ్డి బోల్డ్ అండో హాట్ లుక్‌ విడుదల



 రోటిన్ పాత్ర‌ల‌కు భిన్నంగా కొత్త పాత్ర‌ల్లో న‌టించిన‌ప్పుడే కెరీర్‌లో కిక్ వుంటుంది. స‌రిగ్గా అలాంటి ఓ డిఫ‌రెంట్ అండ్ బోల్డ్, హాట్ పాత్ర‌లో త్వ‌ర‌లో యేవ‌మ్ చిత్రంలో క‌నిపించ‌బోతున్నారు ఆషు రెడ్డి. హారిక అనే ముఖ్య‌పాత్ర‌లో ఆమె న‌టిస్తున్న చిత్రం యేవ‌మ్‌.. ఈ చిత్రంలోని నా బాడీ సూప‌ర్‌డీల‌క్స్ అంటూ ఆఘ‌రెడ్డి కిక్ ఇచ్చే పాత్ర‌లో ఎందుకు క‌నిపించ‌బోతున్నారు తెలియాలంటే యేవ‌మ్ విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. చాందిని చైద‌రి, వ‌శిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రకాష్‌ దంతులూరి దర్శకుడు. నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. శుక్ర‌వారం ఆషు రెడ్డి పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్ మహిళా సాధికారికతను చాటి చెప్పే నేప‌థ్యంలో ఈ సినిమా వుంటుంది. 


దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఇటీవ‌ల విడుద‌ల చేసిన చాందిని చౌద‌రి పోస్ట‌ర్‌లో వున్న 'ఆడపిల్లని అయితే ఏంటంటా? అనే రైట‌ప్ అంద‌ర్ని ఆలోచింప‌జేసింది. ఇప్పుడు ఆషు రెడ్డి నా బాడీ సూప‌ర్ డీల‌క్స్ అని ఎందుకు అంటుంది. ఇలా ప్ర‌తి పాత్ర‌కు ఒక మార్క్ వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది' అన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌క్ష్మ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు

The First Single Yemayyinde From Devaki Nandana Vasudeva Unveiled

 అశోక్ గల్లా, అర్జున్ జంధ్యాల, లలితాంబిక ప్రొడక్షన్స్ 'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగిల్ ఏమయ్యిందే విడుదల  



సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన రెండవ చిత్రం 'దేవకి నందన వాసుదేవ' లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆధ్యాత్మిక అంశాలతో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్. హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.


ఫస్ట్ సింగిల్ ఏమయ్యిందే ప్రోమోతో టీజ్ చేసిన తర్వాత, మేకర్స్ ఈ రోజు లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఆదిత్య మ్యూజిక్ లేబుల్ ద్వారా ఈ పాట మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది.


భీమ్స్ సిసిరోలియో ఫుట్ టాపింగ్  బీట్‌లతో మ్యాజికల్ మెలోడీని అందించారు. సురేష్ గంగుల రాసిన ఈ పాట హీరోయిన్  పై హీరోకి వున్న ప్రేమని చాలా అందంగా అద్భుతంగా చూపించింది. ఈశ్వర్ దాతు వాయిస్ ప్రత్యేకంగా నిలిచింది. లిరిక్స్ మరింత అద్భుతంగా అలపించారు. అశోక్ గల్లా ఆనందంగా కనిపించారు. అతని డ్యాన్స్ కూల్ గా ఉన్నాయి. లవ్ ట్రాక్ అందంగా ఉంది, పాటలో వారి కెమిస్ట్రీ ప్లజెంట్ గా వుంది. రసూల్ ఎల్లోర్ తీసిన విజువల్స్ చాలా రిఫ్రెష్‌గా ఉన్నాయి. ఏమయ్యిందే ఇన్స్టంట్ హిట్.  


రసూల్ ఎల్లోర్‌తో పాటు, ప్రసాద్ మూరెళ్ల ఈ చిత్రానికి కెమరామ్యాన్. గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్‌తో భారీగా సినిమాని నిర్మిస్తున్నారు. తమ్మిరాజు ఈ చిత్రానికి ఎడిటర్.


నటీనటులు: అశోక్ గల్లా, వారణాసి మానస


సాంకేతిక సిబ్బంది:

కథ: ప్రశాంత్ వర్మ

దర్శకత్వం: అర్జున్ జంధ్యాల

నిర్మాత: సోమినేని బాలకృష్ణ

బ్యానర్: లలితాంబిక ప్రొడక్షన్స్

సమర్పణ: నల్లపనేని యామిని

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

డీవోపీ: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్

ఎడిటర్: తమ్మిరాజు

డైలాగ్స్: బుర్రా సాయి మాధవ్

పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే

పీఆర్వో: వంశీ-శేఖర్


Stupid Love Lyric Song from Ashish and Vaishnavi Chaitanya's Love Me - If You Dare is out now


 ఆశిష్, వైష్ణవి చైతన్య చిత్రం ‘లవ్ మీ.. ఇఫ్ యు డేర్’ నుంచి ‘స్టుపిడ్ హార్ట్..’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్

 

 మే 25 భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న సినిమా


మనం వద్దని చెప్పిన పనిచేస్తే వారిని స్టుపిడ్ అని తిడుతుంటాం.. మరి మన గుండె మన కంట్రోల్ లేక మరొకరి వశం అవుతుంటే ఏమంటాం.. స్టుపిడ్ హార్ట్ అంటాం. ఇప్పుడు ఓ అందమైన అమ్మాయి.. తన గుండెను కూడా అలాగే తిడుతుంది. అందుకు కారణం.. నచ్చిన అబ్బాయి కనపడగానే, అమ్మాయి గుండె లయ తప్పుతోంది మరి. అసలు ఇంతకీ ఆ అమ్మాయి అంతలా అబ్బాయిన ఎందుకు ఇష్టపడిందనే విషయం తెలియాలంటే ‘లవ్ మీ.. ఇఫ్ యు డేర్’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.


టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. . ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ శుక్రవారం రోజున ఓ లవ్ మెలోడిని విడుదల చేశారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలోని ‘స్టుపిడ్ హార్ట్’ అనే సాంగ్‌ను ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ రాయటం విశేషం.


రానున్న వేసవిలో వెన్నులో వణుకు పుట్టించేలా ఓ ఆత్మ ప్రేమకథతో బ్లాక్ బస్టర్ సాధిస్తామని దర్శక, నిర్మాతలు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచుతున్నారు. ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా, అవినాష్ కొల్ల ఆర్ట్, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.


Sabari Movie Review




Check out the Review of  Sabari movie  Starring Varalaxmi Sarathkumar, Shashank, Ganesh Venkatraman,  Baby Krithika Mime Gopi Gemini Suresh, Madhu Nandan Directed by Anil Katz Produced by Mahendra Nath Kondla under Maha Movies Gopi Sundar composed Music 


 Story:

Sabari is the story which revolves around Sanjana (Varalaxmi Sarathkumar) and Riya (Baby Krithika) sanjana is a Single Mother she takes care of her Daughter suddenly she comes to know about the strange thing about Riya what is that thing ? How thier life changes after that forms the Rest of the story 


Performance 

In this segment we must appreciate Varalaxmi Sarathkumar for her performance as we all know she has done various roles in Telugu and other Languages we can easily find her versatile acting in this film her combination scenes with her daughter role came out very well she has given her best and done justice to her role. Baby Krithika has done decent work .Mime Gopi has done fabulous work as usual. Shashank who played her friend role has given his best. Madhu Nandan, Gemini Suresh,  Ganesh Venkatraman, harshini, pramodhini ,Archana anant ,bhadram Prabhu and rest of the cast has done well in their respective roles 

Technical Aspects 

In this segment we must appreciate producers for thier Production values Director Anil Katz has chosen a good point and he tried his best to make it a interesting narrative but some where he lost the pulse of the core point he tried his best to engage audiences on whole Music is okay Cinematography is decent .Editing can be better dialogues are good 


Verdict 

On whole Sabari is a decent attempt with good point give a try this weekend 


Telugucinemas.in Rating 3/5



Satya Releasing Grandly on May 10th

 మే 10న భారీఎత్తున  విడుదలవుతున్న ‘‘సత్య’’



ప్రతినాన్న కొడుక్కి ఏమిద్దామా అని ఆలోచించే సొసైటి మనది. అలాంటి సొసైటిలో నా వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదు అని ఆలోచించే కొడుకు కథతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’. హమరేశ్, ప్రార్ధనా సందీప్‌లు జంటగా నటించిన ఈ చిత్రానికి వాలీ మోహన్‌దాస్‌ దర్శకుడు. శివమ్‌ మీడియా బ్యానర్‌లో శివమల్లాల నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 10 విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ తెలియచేసింది. థింక్‌ మ్యూజిక్‌ద్వారా ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని మొదటిపాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న  ‘సత్య’ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ వారు ‘యు’ సర్టిఫికెట్‌ను అందచేశారు. 


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివమల్లాల మాట్లాడుతూ–‘‘ సినిమాకు సంబంధించిన అన్నిపనులు శరవేగంగా జరిగాయి. మే 10న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు పూర్తయ్యాయి’’ అన్నారు. 


దర్శకుడు వాలీ మాట్లాడుతూ– ‘‘ ‘సత్య’ సినిమా తెలుగులో పెద్ద విజయం సాధిస్తుందని నాకు ఎంతో మంచి పేరు తీసుకువస్తుందని నమ్మకంతో ఉన్నాను’’ అన్నారు. 


హమరేశ్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ,  ఈ చిత్రానికి సంగీతం– సుందరమూర్తి కె.యస్, ఎడిటింగ్‌– ఆర్‌.సత్యనారాయణ,  కెమెరా– ఐ. మరుదనాయగం, మాటలు– విజయ్‌కుమార్‌ పాటలు– రాంబాబు గోసాల, పీఆర్‌వో–వి.ఆర్‌ మధు, మూర్తి మల్లాల, లైన్‌ ప్రొడ్యూసర్‌– పవన్‌ తాత,  నిర్మాత– శివమల్లాల, రచన–దర్శకత్వం– వాలీ మోహన్‌దాస్

Tremendous Response for Jithender Reddy Trailer

 జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల

జితేందర్ రెడ్డి ట్రైలర్ కు అనూహ్య స్పందన



ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్  సినిమా పైన అంచనాలను పెంచేసాయి. కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. 


చిన్నప్పటినుండే సమాజం పట్ల అంకితభావం ఉన్న జితేందర్ రెడ్డి, సమాజానికి ఏదో ఒక మంచి చెయ్యాలి అనే భావంతో పెరుగుతాడు. ఆ లక్షణాలు జితేందర్ రెడ్డితో పాటు పెరిగి, కాలేజీ ఎలక్షన్స్ లో లీడర్ గా ఎదిగి, ఆ తరవాత పోలీసు వ్యవస్థకే దీటుగా, సమాజంలో నక్సలైట్లు చేసే దోర్జన్యాలకు ఎదురు వెళ్తాడు, ట్రైలర్ మద్యలో హిందుత్వం వంటి డైలాగ్ లు మరింత ఆశక్తి పెంచేలా ఉన్నాయి. 1980’s ఒక వ్యక్తి జీవితంలో జరిగే కాలేజీ పాలిటిక్స్, ఆ తరవాత నిజమైన రాజకీయాలు నేపధ్యంలో ఈ కథ సాగుతున్నట్టు ఉంది. మొత్తానికి కంటెంట్ మాత్రం ప్రోమిసింగ్ గా ఉంది, మే 10న ‘జితేందర్ రెడ్డి విడుదల కాబోతుంది అని చిత్ర యూనిట్ ట్రైలర్ ద్వారా తెలిపారు. 


లవ్ స్టోరీస్ డైరెక్ట్ చేసిన విరించి వర్మ ఇలాంటి ఒక ఆక్షన్ సినిమా చేసారా అంటే అస్సలు నమ్మేలా లేదు, విరించి దర్శకత్వంలో మరో కోణం ఈ జితేందర్ రెడ్డితో భయటకి వస్తుందేమో చూడాలి. 


నటీ నటులు : రాకేష్ వర్రే, రియా సుమన్, వైశాలి రాజ్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్



టెక్నికల్ టీం :

డైరెక్టర్ : విరించి వర్మ

నిర్మాత :  ముదుగంటి రవీందర్ రెడ్డి

కో - ప్రొడ్యూసర్ : ఉమ రవీందర్

ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వాణిశ్రీ పొడుగు

డి ఓ పి : వి. ఎస్. జ్ఞాన శేఖర్

మ్యూజిక్ డైరెక్టర్ : గోపి సుందర్

పి ఆర్ ఓ : మధు VR

Baahubali: Crown of Blood' trailer Released

‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ ట్రైలర్ రిలీజ్, మే 17 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న యానిమేషన్ సిరీస్




ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లలో కొత్త చరిత్ర సృష్టించిన సినిమా బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో ఈ కథలో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేషన్ సిరీస్ ను గ్రాఫిక్ ఇండియా, అర్క మీడియా బ్యానర్స్ పై దర్శకుడు S.S. రాజమౌళి, శరద్ దేవరాజన్, శోభు యార్లగడ్డ నిర్మించగా..జీవన్ జె. కాంగ్,  నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ మే 17వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.


‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ ట్రైలర్ ను ఈరోజు రిలీజ్ చేశారు. మాహిష్మతి రాజ్యాన్ని ప్రపంచపటం నుంచి తుడిచేయాలని యుద్ధానికి దిగిన రక్త్ దేవ్ ను బాహుబలి, భల్లాలదేవుడు కలిసి వీరోచితంగా ఎదుర్కోవడం ట్రైలర్ లో ఆకట్టుకుంది. ప్రతి పాత్ర ఎమోషన్, యాక్షన్ సీక్వెన్సులు సిల్వర్ స్క్రీన్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేలా రూపొందించారు.


డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ కంటెంట్ హెడ్  గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ - బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్‌తో ఐకానిక్ ఫ్రాంచైజీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది. పిల్లలతో పాటు పెద్దలను కూడా ఈ సిరీస్ తో ఆకర్షించబోతున్నాం. ఈ సిరీస్ తో గ్రాఫిక్ ఇండియాతో హాట్ స్టార్ రిలేషన్ మరింత బలోపేతం కానుంది.’’ అన్నారు.


దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ -బాహుబలి ప్రపంచం చాలా విశాలమైంది.  ఈ ఫిల్మ్ ఫ్రాంచైజీ ఆ ప్రపంచాన్ని సరైన విధంగా పరిచయం చేస్తుంది. ఈ కథలో తెలుసుకునేందుకు చాలా విషయాలు ఉన్నాయి. ఈ కథ మొదటిసారిగా బాహుబలి, భల్లాలదేవ జీవితాలలో తెలియని అనేక మలుపులను తెలియజేస్తుంది. ఈ ఇద్దరు సోదరులు మాహిష్మతిని రక్షించడానికి చేసిన వీరోచిత పోరాటం ఈ సిరీస్ తో తెలుస్తుంది. బాహుబలి అభిమానులకు ఈ కొత్త అధ్యాయాన్ని పరిచయం చేస్తున్నందుకు, ఈ కథను యానిమేషన్ ఫార్మాట్‌లో తీసుకు రావడానికి మేం చాలా సంతోషిస్తున్నాం. అన్నారు.


హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ - ఈ సిరీస్ తో బాహుబలి ఫిల్మ్ ఫ్రాంచైజీ తన స్క్రీన్ మ్యాజిక్ కొనసాగిస్తోంది. యానిమేషన్ లో బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ రూపొందడం సంతోషాన్ని ఇస్తోంది. బాహుబలి, భల్లాలదేవ్ జీవితం యొక్క ఈ కొత్త అధ్యాయం బాహుబలి ప్రపంచంలోని మరెన్నో రహస్యాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. అని అన్నారు.

King Nagarjuna Akkineni unleashes First look of Kubera

Watch: King Nagarjuna Akkineni unleashes intriguing first look from ‘Sekhar Kammula’s Kubera’ amid IPL 2024 broadcast



The highly anticipated social drama, ‘Sekhar Kammula’s Kubera’ by the acclaimed national award-winning filmmaker Sekhar Kammula, is being touted as one of the most awaited upcoming mythological pan-Indian films. Taking global television screens by storm tonight, King Nagarjuna Akkineni’s official first look from the film was unveiled exclusively on Star Sports, heightening anticipation for the magnum opus. 


Premiered during the Sunrisers Hyderabad vs. Rajasthan Royals IPL game, King Nagarjuna Akkineni’s first look showcases him in a powerful stance with an air of mystery. He is seen walking under an umbrella in heavy pouring rain, surrounded by trucks of liquid cash, symbolising the film’s title Kubera, which is known to be the god of wealth. Dressed sharply in a shirt, trousers and sporting glasses, the actor has immensely elevated expectations from the social drama.


Check out his first look here:





Meanwhile, earlier, the first look of actor Dhanush from 'Sekhar Kammula’s Kubera' was unveiled, earning a thrilling response from audiences nationwide.


‘Sekhar Kammula’s 'Kubera’ boasts an ensemble cast including Dhanush, King Nagarjuna Akkineni, Rashmika Mandanna, and Jim Sarbh. The film is jointly produced by Suniel Narang and Puskur Ram Mohan Rao under the Sri Venkateswara Cinemas LLP and Amigos Creations Pvt Ltd banner. ‘Sekhar Kammula's Kubera’ is a pan-India multilingual film, being shot simultaneously in Tamil, Telugu, and Hindi. 

Allu Arjun Creates All Time Record-Pushpa 2 The Rule First Single

 ALLU ARJUN CREATES ALL-TIME INDIA RECORD 



'Pushpa: The Rule', with its grand scale and pan-Indian appeal, is fronted by National Award-winning actor Allu Arjun. Director Sukumar is readying the project for a theatrical release on August 15. Mythri Movie Makers and Sukumar Writings are happy to announce that the First Single from the movie has a rare distinction. 


'Pushpa Pushpa' has become the country's most-viewed lyrical song in the first 24 hours across six languages in which it was released. The Devi Sri Prasad composition has amassed 40 million real-time views. Its updated views are 26.6 million in number. 


The song, which has the Icon Star delivering a hook step with utmost precision, has mounted 1.27 million likes. It continues to trend in 15 countries. 


Needless to say, this is an all-time record. Dance choreographers Vijay Polaki and Srashti Verma have worked under the aegis of Prem Rakshit on the song. Every single talent associated with the song deserves applause. 


Action directors Peter Hein, Kecha Kamphakdee, Dragon Prakash, and Nabakanta are associated with the project.

Sarpanch Movie Launched Grandly

ఫిలిం ఛాంబర్ లో లో నేడు ఘనంగా సర్పంచ్ మూవీ ప్రారంభోత్సవ వేడుకలు



జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్ పై జట్టి రవికుమార్ M.A. దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న చిత్రం సర్పంచ్ ప్రారంభోత్సవ వేడుకలు నేడు ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోయినపల్లి హనుమంతరావు గారు (జాతీయ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల జాతీయ అధ్యక్షుడు), సీతారామస్వామి ఉపాసకులు శ్రీశ్రీశ్రీ పెండ్యాల సత్యనారాయణ గారు, హైకోర్టు అడ్వకేట్ కుడికాల ఆంజనేయులు గారు,  బి. రమేష్, అంజనీ, జట్టి రజిత, అక్షర జ్ఞాన, అనోగ్న, జ్ఞాన సిద్ధార్థ, అంబేద్కర్ శాస్త్రి, బంటు ప్రవీణ్, పోతరాజు, ప్రశాంత్, సంపత్, బంటు ఆశ్రిత, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


బోయినపల్లి హనుమంతరావు మాట్లాడుతూ : మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు. కరీంనగర్ గాంధీగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ సినిమా రంగ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు జట్టి రవికుమార్ గారికి ధన్యవాదాలు. ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్ ద్వారా వస్తున్నాయి సినిమా మంచి విజయం సాధించాలని. ముందు ముందు ఈ బ్యానర్ ద్వారా ఇంకా మంచి సినిమాలు వచ్చి దిన దినాభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత, దర్శకుడు జట్టి రవికుమార్ మాట్లాడుతూ : మనిషిని ముందుండి నడిపించేది జ్ఞానం అందుకని జ్ఞాన ఆర్ట్స్ అని అదేవిధంగా సినిమా సక్సెస్ కి కారణం ప్రేక్షకుడు అందుకని జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలింస్ అని పెట్టాం. ఈ సినిమాని జూన్ 20న మొదలు పెట్టి 2025 కి పూర్తి చేస్తాం. ప్రేక్షకులందరికీ ఆదరణ సపోర్ట్ మాపై ఈ సినిమాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాణం : జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలిమ్స్

నిర్మాత మరియు దర్శకుడు : జట్టి రవికుమార్

పి ఆర్ ఓ : మధు VR 

Kamakshi Bhaskarla wins Best Actress Award at the prestigious 14th Dada Saheb Phalke Film Festival

 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్న కామాక్షి భాస్కర్ల



ప్రతిష్టాత్మకంగా న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకోవటంపై హీరోయిన్ డా.కామాక్షి భాస్కర్ల సంతోషంగా ఉన్నారు. గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన ‘మా ఊరి పొలిమేర 2’లో లక్ష్మీ అనే పాత్రలో ఆమె చూపించిన ఇన్‌టెన్స్ నటనకుగానూ ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా కామాక్షి భాస్కర్ల ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు సినీ ప్రేక్షకులకు, అవకాశం ఇచ్చిన చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలను తెలియజేశారు.  అలాగే అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంపిక కావటం విశేషం. 


‘‘మా ఊరి పొలిమేర 2’ సినిమాలో నటనకుగానూ నాకు ఉత్తమ నటిగా అవార్డు రావటం నాకు థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన జ్యూరీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ అవార్డు నటిగా నా బాధ్యతను మరింతగా పెంచింది. ఈ సందర్భంగా సమహార థియేటర్ లో నాకు నటనను నేర్పించిన నా గురువుగారు రత్న శేఖర్‌గారికి, నీజర్ కబిగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపించిన ప్రేక్షకులకు థాంక్స్. నాకు సపోర్ట్ చేసి, ఈ అవార్డు రావటానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ దీన్ని అంకితమిస్తున్నాను’’ అని పేర్కొన్నారు కామాక్షి భాస్కర్ల. 


ఇదే సందర్భంలో ‘మా ఊరి పొలిమేర 2’లో తను చేసిన పాత్ర గురించి, సినిమా గురించి కామాక్షి మాట్లాడుతూ ‘‘సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం మాకుంది. అయితే అవార్డులు వస్తాయని మేం ఊహించలేదు. ఎంటైర్ టీమ్ ఇచ్చిన సపోర్ట్ తో సినిమా అవార్డులను సొంతం చేసుకుంది. ఓ టీమ్‌గా మేం ఇంత వరకు చేసిన ప్రయాణంతో పాటు ఇతర భాషా ప్రేమికులు సినిమా కంటెంట్‌ను ఎలా ఆదరిస్తున్నారో చూడటం ఆనందంగా ఉంది. 


‘‘‘మా ఊరి పొలిమేర 2’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించటమే కాకుండా ప్రేక్షకుల, విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. అందుకనే ఈ ప్రతిష్టాత్మక అవార్డు నా మనసులోప్రత్యేకంగా నిలిచిపోతుంది’’ అని పేర్కొంది కామాక్షి భాస్కర్ల.

Polimera 2 wins big at prestigious 14th Dada Saheb Phalke Film Festival

ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్'లో మెరిసిన "మా ఊరి పొలిమేర 2".  ఈ సినిమాకు ఉత్తమ నటిగా జ్యూరీ అవార్డ్ గెల్చుకున్న డాక్టర్ కామాక్షి భాస్కర్ల




టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ "మా ఊరి పొలిమేర 2" ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్'లో మెరిసింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన డాక్టర్ కామాక్షి భాస్కర్లకు ఉత్తమ నటిగా జ్యూరీ అవార్డ్ దక్కింది. ఆమె తరుపున దర్శకుడు అనిల్ విశ్వనాథ్, నిర్మాత గౌరు కృష్ణ, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి అవార్డును స్వీకరించారు. ఈ అవార్డ్ తో పాటు "మా ఊరి పొలిమేర 2" దర్శక నిర్మాతలకు 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్' నిర్వాహకులు సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను అందించారు. మంగళవారం ఢిల్లీలో ఈ ఫిలిం ఫెస్టివల్ జరిగింది. తమ సినిమాకు ఈ ప్రతిష్టాత్మక అవార్డ్స్ లో దక్కిన గుర్తింపు సంతోషాన్నిస్తోందని, డాక్టర్ కామాక్షి భాస్కర్ల "మా ఊరి పొలిమేర 2" సినిమాలో అద్భుతంగా నటించిందని ప్రశంసించారు దర్శకుడు అనిల్ విశ్వనాథ్.


లాక్ డౌన్ టైమ్ లో "మా ఊరి పొలిమేర" డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో నేరుగా స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో సీక్వెల్ "మా ఊరి పొలిమేర 2" రూపొందించారు. ఈ సినిమా 2023 నవంబర్ 3న  ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను ప్రముఖ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూట్ చేశారు. మా ఊరి పొలిమేర 2 సినిమాను గౌరు గ‌ణ‌బాబు సమర్పణలో శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరు కృష్ణ నిర్మించారు. డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, చిత్రం శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్, ఓటీటీ లో ప్రేక్షకుల రివార్డ్ తో పాటు 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్' లో అవార్డ్స్ దక్కడంపై "మా ఊరి పొలిమేర 2" మూవీ టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. 

Hero Suhas Interview About Prasanna Vadanam

 'ప్రసన్న వదనం' యూనిక్ కాన్సెప్ట్ తో సీట్ ఎడ్జ్ థ్రిల్ అనుభూతిని ఇస్తుంది. చాలా సీన్స్ షాకింగా వుంటాయి. ఆడియన్స్  ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు: హీరో సుహాస్  

 


యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి  ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ నేపధ్యంలో హీరో సుహాస్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


సుహాస్ గారు ఈ కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?

-దర్శకుడు చెప్పిన ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఆయన అనుకున్న స్క్రీన్ ప్లే, సర్వైవల్ డ్రామా, క్లైమాక్స్ అదిరిపోయాయి. కథ విన్న వెంటనే చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను.    


ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా వుండబోతుంది ?

-ఇందులో ఆర్జే గా పని చేస్తాను. మామూలు కుర్రాడి పాత్రే. అయితే తనకున్న పేస్ బ్లైండ్ నెస్ కారణంగా ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటాడు? ఆ సమస్యలని ఎలా పరిష్కరించుకుంటాడనేది క్యారెక్టర్.  


-ఈ పాత్ర కోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు?

ఈ పాత్ర కోసం పది రోజులు వర్క్ షాప్ చేశాం. దర్శకుడితో కూర్చుని పాత్ర ఎలా వుండాలి, ఎలా ప్రవర్తించాలి? ఆ పాత్ర బౌండరీలు ఏమిటి ? ఇవన్నీ వర్క్ షాప్ లో ప్రిపేర్ ఆయన తర్వాత షూట్ కి వెళ్లాం.


షూటింగ్ సమయంలో మీరు ఎదుర్కొన్న ఛాలెంజ్స్ ఏమిటి ?

-ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు వున్నాయి. అవి చేయడం కాస్త సవాల్ గా అనిపించింది. అలాగే నాది ఫేస్ బ్లైండ్ నెస్ వున్న పాత్ర. దానికి ఎలాంటి ఎక్స్ ప్రెస్షన్స్ ఇవ్వాలనేది ఛాలెంజింగా అనిపించింది. అయితే వాటిని అచీవ్ చేశాననే అనుకుంటున్నాను.


కొత్త దర్శకుడు అర్జున్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? తన పనితీరు గురించి చెప్పండి ?

-అర్జున్ తో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. తనకి దర్శకుడిగా ఇది తొలి సినిమానే కానీ సుకుమార్ గారితో ఆయన పెద్దపెద్ద సినిమాలకి పని చేశారు. తనకి చాలా అనుభవం వుంది. చాలా అనుభవం వున్న దర్శకుడిలానే ఈ సినిమాని అద్భుతంగా చేశారు.  


ఈ నిర్మాణ సంస్థలో పని చేయడం ఎలా అనిపించింది ?

-ఇది నాకు హోమ్ బ్యానర్ లాంటిదే. మణికంఠ కలర్ ఫోటో ఫ్యామిలీ డ్రామాకి సహా నిర్మాత గా చేశారు. అప్పటినుంచి నాకు మంచి ఫ్రెండ్ అయిపోయారు. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని వుంది.


ఇద్దరు హీరోయిన్స్ వున్నారు కదా... వాళ్ళ పాత్రలకు కథలో ఎలాంటి ప్రాధాన్యత వుంటుంది ?

-పాయల్ రాధాకృష్ణ నాకు జోడిగా కనిపిస్తారు. రాశి సింగ్ మరో కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో ఇద్దరికీ చాల ప్రాధాన్యత వుంటుంది. లాగే నితిన్, నందు, హర్ష పాత్రలు కూడా చాలా కీలకంగా వుంటాయి.  


ఫస్ట్ కాపీ చూసే వుంటారు. ఎలా అనిపించింది ?  

-ఫస్ట్ కాపీ అన్నపూర్ణలో ఒక్కడినే చూశాను. సినిమా పూర్తయిన తర్వాత చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఆనందంతో దర్శకుడిని హత్తుకున్నాను.  సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది.  


మీ కథల ఎంపిక చాలా యూనిక్ వుంటుంది. ఒక కథని ఎంచుకున్నపుడు ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటారు?

-పర్టిక్యులర్ గా ఏమీ వుండదండీ. మామూలు ప్రేక్షకుడిలానే బ్లాంక్ మైండ్ తో కథ వింటాను. విన్నప్పుడు ఎక్సయిటింగ్, క్లాప్స్ కొట్టేలా అనిపిస్తే వెంటనే ఓకే చెప్పేస్తాను.  


ఇప్పటివరకూ మీరు చేసిన పాత్రల్లో... మీకు ఇష్టమైన మూడు పాత్రలు అంటే ఏం చెప్తారు?

-కలర్ ఫోటో లో క్యారెక్టర్ ఇష్టం. అలాగే ఫ్యామిలీ డ్రామా కూడా ఇష్టం. అందులోచాలా వేరియేషన్స్  వుంటాయి. అలాగే అంబాజీ పేటలో చేసిన పాత్ర. వీటితో పాటు నేను చేసిన అన్ని పాత్రలు ఇష్టపడే చేశాను.


భవిష్యత్ లో ఎలాంటి కథలు చేయడానికి ఇష్టపడతారు?

-పర్టిక్యులర్ గా ప్లాన్ అంటూ ఏమీ లేదు. వచ్చిన కథల్లో నచ్చిన కథలు చేసుకుంటూవెళ్తున్నాను.


మీ చేతిలో దాదాపు ఎనిమిది సినిమాలు వున్నాయని విన్నాం. ఇన్ని సినిమాలు బ్యాలెన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. వర్క్ ని బ్యాలెన్స్ చేయడానికి వ్యక్తిగతంగా ఎలాంటి క్రమశిక్షణని పాటిస్తారు?

-అవునండీ, ఎనిమిది సినిమాలు వున్నాయి. ఎనిమిది సినిమాలు బ్యాలెన్స్ చేయాలంటే నిజంగానే కష్టం. అయితే మా మ్యానేజర్స్, నేను చర్చించుకొని చాలా సమన్వయంతో చేస్తున్నాం. క్రమశిక్షణ విషయానికి వస్తే షూటింగ్ పూర్తయిన వెంటనే ఇంటికి వచ్చేస్తాను. రాత్రి పదింటికి నిద్రపోతాను. మళ్ళీ ఉదయం ఐదింటికి షూటింగ్ కి వెళ్ళిపోతాను. గ్యాప్ వచ్చిన రోజు కథలు వింటాను.


మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి ?

-దిల్ రాజు గారి నిర్మాణంలో జులైలో ఓ సినిమా విడుదల కానుంది. అది చాలా కొత్త కామెడీ ఎంటర్ టైనర్.  కేబుల్ రెడ్డి షూట్ జరుగుతోంది.  అమెజాన్ ప్రైమ్ లో కీర్తి సురేష్ గారితో చేస్తున్న ప్రాజెక్ట్ షూట్ స్టార్ట్ అవ్వాలి. కార్తిక్ సుబ్బరాజ్ గారితో ఒక సినిమా వుంది. అలాగే ఆనందరావు అడ్వంచర్స్ తో పాటు పాటు మరికొన్ని కథలు వున్నాయి.

 

ఫైనల్ గా ప్రసన్న వదనం గురించి ప్రేక్షకులు ఏం చెబుతారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతోంది ?

-అందరినీ అలరించే సినిమా ఇది. చాలా మంది నా కథల ఎంపిక బావుందని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా ఎక్కువ మెచ్చుకుంటారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా థ్రిల్ ఫీలౌతారు. సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూస్తారు. కొన్ని సీన్స్ కి షాక్ అవుతారు. చాలా మంచి ఎక్స్ పీరియన్స్ తో వెళ్తారు.


-ఆల్ ది బెస్ట్

థాంక్ యూ

Director Sundar C Interview About Baak

 ‘బాక్’ కంటెంట్ ఆడియన్స్ కు విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. తమన్నా, రాశిఖన్నా సర్ ప్రైజ్ చేస్తారు. చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వున్నాయి: హీరో, డైరెక్టర్ సుందర్ సి



అత్యంత విజయవంతమైన హార్రర్ కామెడీ సిరీస్ 'అరణ్మనై' నుంచి సుందర్ సి, తమన్నా భాటియా, రాశీ ఖన్నా నటించిన 'అరణ్మనై 4' థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో బాక్ అనే టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు. ఖుష్బు సుందర్, ACS అరుణ్ కుమార్‌లు Avni Cinemax P Ltd పతాకంపై నిర్మించారు.  ఇప్పటికే విడుదలై ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో హీరో, దర్శకుడు సుందర్ సి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


బాక్ సినిమా ఎలా ఉండబోతోంది ?

-అరణ్మనై సిరిస్ లో నాలుగో చిత్రమిది. మొదటి మూడు సినిమాలు తెలుగు, తమిళ్ లో చాలా పెద్ద విజయాన్ని సాధించాయి. ‘బాక్’ విషయానికి వస్తే ఈ కథ కోసం రీసెర్చ్ చేసే క్రమంలో చరిత్రతో ముడిపడిన ఓ ఆశ్చర్యకరమైన సంఘటన గురించి తెలిసింది. అస్సామీ జానపదంలో బాక్ అనే ఘోస్ట్ వుండేదని అక్కడి ప్రజల నమ్మకం. తమ ప్రాంతానంతా చేతబడి చేశారనేది వారి విశ్వాసం. ఇది నన్ను చాలా సర్ ప్రైజ్ చేసింది. అదే ఈ బాక్ కథకు బీజం వేసింది. అస్సామీ, బ్రహ్మపుత్ర ప్రాంతంలో వుండే బాక్ అనే దెయ్యం..సౌత్ కి వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆలోచనతో అరణ్మనై 4' కథ రాయడం జరిగింది. ప్రేక్షకులని థ్రిల్, సర్ ప్రైజ్ చేసే సినిమా ఇది.


అరణ్మనై3 కి 4 కి ఎలాంటి తేడా వుంటుంది ?

-అరణ్మనై సిరిస్ లో వచ్చిన సినిమాలన్నీ వ్యక్తిగత పగ, ప్రతీకారం కేంద్ర బిందువుగా వుంటాయి. అరణ్మనై 4 ఇందుకు భిన్నంగా వుంటుంది. ఒక ఎక్స్ ట్రనల్ ఎలిమెంట్ కథలో భాగం అవుతుంది. అది చాలా కొత్తగా వుంటుంది. విజువల్స్, మ్యూజిక్, లొకేషన్స్ అన్నీ డిఫరెంట్ గా వుంటాయి.  


తమన్నా, రాశిఖన్నా లని ఎంపిక చేసుకోవడానికి కారణం?

-అరణ్మనై సిరిస్ లో వచ్చే అన్ని సినిమాలో స్త్రీ పాత్రలు బలంగా వుంటాయి. గత చిత్రాలలో త్రిష, హన్సిక ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకి వస్తే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కావాలి. ఎమోషన్స్ ని చక్కగా పలికించాలి.  ఈ పాత్రల కోసం తమన్నా, రాశిఖన్నాలు యాప్ట్ ఛాయిస్. ఇందులో కొత్త తమన్నాని చూస్తారు. రాశిఖాన్నా పాత్ర కూడా అదిరిపోతుంది. వారి నటన చూసి చాలా సర్ ప్రైజ్ అయ్యాను.


ఈ సినిమా ప్రయాణంలో మీకు సవాల్ గా అనిపించిన అంశం?

-ఈ సినిమా సిజీ ఛాలెంజ్ గా అనిపించింది. ఏడాదిన్నర పాటు సిజీ వర్క్ చేశాం. క్లైమాక్స్ షూటింగ్ చాలా సవాల్ గా అనిపించింది. అది మీరు తెరపైనే చూడాలి. ఇందులో సిజీ వర్క్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నాం. మూడు వారాల తర్వాత హిందీ విడుదలకు ప్లాన్ చేస్తున్నాం.


నటుడిగా, దర్శకుడి కొనసాగడం ఛాలెంజ్ గా అనిపించడం లేదా ?

నటుడిగా ఇది నా ఇరవై ఒకటో చిత్రం. దర్శకుడన్నప్పుడు బోలెడు భాద్యతలు వుంటాయి. నటుడికి కూడా చాలా బాధ్యతలు. నటుడిగా దర్శకుడిగా కొనసాగడం కష్టమైనపనే. అయితే నాకున్న ఇష్టం, నా టీం సపోర్ట్,  ప్రేక్షకుల ఆదరణతో రెండిని చేస్తున్నా. కానీ మొదట పాషన్ మాత్రం దర్శకత్వమే.


ఖుష్బూ గారితో కథలని పంచుకుంటారా?

 స్టొరీ ఐడియాని డెవలప్ చేయకముందు.. ఐడియా ఎలా వుందని అడుగుతాను. తనకి నచ్చకా ఇంక కథని డెవలప్ చేస్తాను. మళ్ళీ కథ చెప్పడం వుండదు. ఫైనల్ ప్రోడక్ట్ చూపిస్తాను.


హిప్‌హాప్ తమిళ మ్యూజిక్ గురించి ?

తను సెన్సేషనల్ కంపోజర్. ఈ సినిమా కోసం అద్భుతమైన పాటలు చేశారు. క్లైమాక్స్ సాంగ్ అదిరిపోతుంది. క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

 

సురేష్ ప్రొడక్షన్, ఏసియన్ పిక్చర్స్ మీ సినిమాని విడుదల చేయడం ఎలా అనిపించింది ?

-సురేష్ ప్రొడక్షన్, ఏసియన్ పిక్చర్స్ లాంటి ప్రముఖ సంస్థలు మా సినిమాని విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నాను. తెలుగులో చాలా గ్రాండ్ గా విడుదల చేయడం ఆనందాన్ని ఇస్తోంది. మా గత చిత్రాలకు ప్రేక్షకులు అందించిన ఆదరణే ఈ సినిమాకి అందిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులని గొప్పగా అలరిస్తుంది.


 'అరణ్మనై 'నుంచి ఇంకా ఎన్ని సినిమాలు ఆశించవచ్చు ?

-అది ఇప్పుడే చెప్పలేను. 'అరణ్మనై' విజయం రెండో భాగం తీయడానికి బలాన్ని ఇచ్చింది అలాగే 'అరణ్మనై 4' విజయం ఇందులో మరో సినిమా చేయడానికి ఎనర్జీ ఇస్తుందని భావిస్తున్నాను.


దర్శకుడిగా మీకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా?

సంఘమిత్ర అనే పెద్ద ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాం. కొన్ని కారణాల వలన అది ఆగింది. అది మళ్ళీ మొదలుపెట్టె ప్లాన్స్ జరుగుతున్నాయి. అది దేశం గర్వించదగ్గ సినిమా అవుతుంది.


నేరుగా తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారు?

తెలుగ పరిశ్రమ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటినుంచో నేరుగా తెలుగు సినిమా చేయాలని వుంది. అది తొందరలోనే జరుగుతుందని భావిస్తున్నాను.


ఆల్ ది బెస్ట్

-థాంక్ యు


Prasanth Varma Calls Out Talents To Join His PVCU

తన PVCUలో చేరడానికి ప్రతిభావంతులకు పిలుపునిచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ  



క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'హనుమాన్‌'తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన తర్వాత సీక్వెల్ 'జై హనుమాన్‌తో ప్రేక్షకులకు గ్లోబల్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు. ఈ సినిమా పోస్టర్‌ని రామ నవమి రోజున విడుదల చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. ప్రీక్వెల్ అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో, అతని నెక్స్ట్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి, ప్రశాంత్ వర్మ తన తదుపరి ప్రణాళికలను రివిల్ చేశారు. తన నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ వర్మ, బిగ్ స్టార్‌తో కలిసి పని చేయనున్నారు. జై హనుమాన్ ఫ్లోర్ పైకి వెళ్లే ముందు ఇది ప్రారంభమవుతుంది.


తెలుగు సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిభావంతులందరినీ తన పీవీసీయూలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. యువకులు,  ఔత్సాహిక సాంకేతిక నిపుణులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇదొక పెద్ద అవకాశం.


దర్శకుడు ఒక నోట్ ని రాశారు  "కాలింగ్ ఆల్ ఆర్టిస్ట్, సూపర్ పవర్స్ మాట్లాడుకుందాం! మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ ప్రత్యేక నైపుణ్యం ఏమిటి? కథలు రూపొందించే నేర్పు, ఎడిటింగ్, మంత్రముగ్ధులను చేసే నైపుణ్యం కలిగిన గ్రాఫిక్స్, మార్కెటింగ్ మేవెన్.. మీ కళాత్మక నైపుణ్యాలతో యూనివర్స్ లోకి ప్రవేశించాలా? మీ పోర్ట్‌ఫోలియోలను మాకు చేరవేయడానికి "talent@thepvcu.com"కి పంపండి!


ప్రశాంత్ వర్మ తన PVCU ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలను అందించడం గురించి యూనివర్స్ బిగినింగ్ కి ముందే చెప్పారు . మునుపెన్నడూ లేని విధంగా వర్క్ ఫోర్స్ ని నిర్మించాలని ఆయన సంకల్పించారు.


PVCU నుండి నెక్స్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి బ్యాక్-టు-బ్యాక్ అప్‌డేట్‌ల కోసం గెట్ రెడీ.


Aa Okkati Adakku Pre Release Event Held Grandly



'ఆ ఒక్కటీ అడక్కు' ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇందులో కామెడీ ఆర్గానిక్ గా వుంటుంది. ఎమోషన్ హత్తుకుంటుంది. ఇది ఈ వేసవిలో అందరూ హాయిగా ఎంజాయ్ చేసే సినిమా: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్


- మే3న అందరం 'ఆ ఒక్కటీ అడక్కు' థియేటర్స్ లో చూద్దాం. హాయిగా నవ్వుకుందాం: హీరో అడివి శేష్



కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు' తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. స్టార్ రైటర్ అబ్బూరి రవి చిత్రానికి డైలాగ్స్ అందించారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. హీరో అడివి శేష్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.


ప్రీరిలీజ్ ఈవెంట్ హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను ఈ స్టేజ్ లో, ఇన్ని సంవత్సరాలు పరిశ్రమలో ఉన్నానంటే కారణం మా నాన్నగారు. ఆయన వున్నన్ని రోజులు నాతో సినిమాలు చేసి, హిట్లు ఇచ్చి, నన్ను సక్సెస్ ఫుల్ యాక్టర్ ని చేశారు. ఆయన లేనప్పుడు కూడా ఆయన టైటిల్ ఇచ్చి ఈ సినిమాతో బ్లెస్ చేస్తున్నారు. ఇది బరువుగా, భాద్యతగా ఫీలౌతున్నాను. తప్పకుండా ఆ మంచి పేరుని కాపాడతానని మాటిస్తున్నాను. ఈ వేడుకు వచ్చిన శేష్ గారికి, రవిగారికి, విజయ్ కనకమేడల, విజయ్ బిన్నీ, దేవాకట్టా గారికి పేరుపేరునా ధన్యవాదాలు. దర్శకుడిగా మల్లి అంకంకు ఇది మొదటి సినిమా. చాలా కాలంగా దర్శకుడు కావాలనే కలగని, ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశారు. చాలా మంది కొత్త దర్శకులతో పని చేశాను. దాదాపు 32 మంది కొత్త దర్శకులని పరిచయం చేశాను. 31 మంది రిలీజ్ కి ముందు టెన్షన్ పడ్డారు. ఒక్క మల్లి గారు మాత్రం చాలా కూల్ గా నవ్వుతూ వున్నారు( నవ్వుతూ). అసలు టెన్షన్ అనే మాటే ఆయన డిక్షనరీలో లేదు. నిజంగా అది గ్రేట్ గిఫ్ట్. ఈ సినిమాతో పరిశ్రమకి రాజీవ్ గారు లాంటి మంచి నిర్మాత పరిచయం అవుతున్నారు. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. ఈ సినిమా పెద్ద విజయం సాధించి, ఆయన మరో పది చిత్రాలు నిర్మించి, మరో పదిమందికి పని ఇవ్వాలని కోరుకుంటున్నాను. గోపిసుందర్ గారు నాలుగు బ్యూటీఫుల్ సాంగ్స్ ఇచ్చారు. అబ్బూరి రవి గారు, చోటా ప్రసాద్ గారు దాదాపు ఐదారు సినిమాల నుంచి ఒక ఫ్యామిలీలా వర్క్ చేస్తున్నాం. ఈ సినిమాలో సాంగ్స్ చేసిన భాను మాస్టర్, రాజుసుందరం మాస్టర్, విజయ్ బిన్నీ మాస్టర్, రఘు మాస్టర్ అందరికీ థాంక్స్. భాస్కర భట్ల, రామజోగయ్యశాస్త్రీ గారికి ధన్యవాదాలు. ఫారియా వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. తనలో పెక్యులర్ కామెడీ టైమింగ్ వుంది. అది చాలా తక్కువ మందిలో వుంటుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి మా జోడి మరో రెండు మూడు సినిమాలకు కొనసాగాలని కోరుకుంటున్నాను. జామి లివర్ యంగ్ వెర్షన్ అఫ్ కోవై సరళ లాంటి పాత్ర చేశారు. తన పాత్ర చాలా బావుటుంది. తనకి టాలీవుడ్ కి స్వాగతం. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా మే3న విడుదల కాబోతుంది. ఈ మండు వేసవి మీ బాధలు మర్చిపోయి ఒక రెండు గంటలు హాయిగా ఈ సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. ఈ సినిమా పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి అయినవారు, పెళ్లి సంబంధాలు చూస్తున్నవారు, ప్రతిఒక్కరూ చూడాలి. కామెడీ సినిమా చేసిన, సీరియస్ సినిమా చేసినా కంటెంట్ వున్న సినిమా చేస్తాను. ఈ సినిమా ఆర్గానిక్ కామెడీ. ఇందులో పెళ్లిపేరుతో జరుగుతున్న మోసాలని అందరికీ తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. మే3న థియేటర్స్ రండి అందరూ సరదాగా నవ్వుకోండి. అందరికీ ధన్యవాదాలు' తెలిపారు.


హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. నరేష్ గారితో నాకు చాలా గొప్ప అనుబంధం వుంది. నా ఫస్ట్ ఆడియో లాంచ్ కి నరేష్ గారు ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ రోజు ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవడానికి రావడం చాలా ఆనందంగా వుంది. నా మనసులో నరేష్ గారు అంటే ఇంట్లో మనిషి. ఆయన ఎప్పుడూ ఇతరుల ఆనందాన్ని కోరుకుంటారు. ఆయన్ని ఎప్పుడూ కలసి చాలా ఆత్మీయంగా వుంటుంది. అబ్బూరి రవి గారు నా కెరీర్ కి బ్యాక్ బోన్. కలసి ఏడు సినిమాలు చేశాం. రాజీవ్ గారు ఐకానిక్ యానిమేషన్ మూవీస్ పిల్లల్ని ఎలా ఇన్స్పైర్ చేశారో అలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఫారియా ని ఫస్ట్ టైం కలిశాను. చాలా అమాయకంగా కనిపించారు. అదే ఇన్నోసెన్స్ కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తారు. మల్లికి నా బెస్ట్ విశేష్. మా అన్నయ్య టీంలో ఆయన పని చేశారు.మే3న అందరం థియేటర్స్ లో సినిమా చూద్దాం . హాయిగా నవ్వుకుందాం' అన్నారు.


హీరోయిన్ ఫారియా అబ్దుల్లా మాట్లాడుతూ.. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ బిగ్ థాంక్స్. నిర్మాత రాజీవ్ గారికి ధన్యవాదాలు. చాలా క్యాలిటీగా సినిమాని తీశారు. నరేష్ గారి ఎంత పెద్ద థాంక్స్ చెప్పినా తక్కువే. కో యాక్టర్ గా చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాతో నరేష్ గారి రూపంలో ఒక మంచి ఫ్రెండ్ దొరికారు. ఈ విషయంలో చాలా ఆనందంగా వుంది. దర్శకుడు మల్లిగారి ధన్యవాదాలు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరు ధన్యవాదాలు. ఈ హోల్సమ్ ఎంటర్ టైనర్ ని తెరపై చూడటానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అన్నారు.


సహా నిర్మాత భరత్ మాట్లాడుతూ.. నరేష్, ఫారియా తో వర్క్ చేయడం చాలా అనందంగా వుంది. రాజీవ్ తో కలసి అద్భుతమైన చిత్రాలు చేయడానికి ఎదరుచూస్తున్నాం. ఈ బ్యానర్ పరిశ్రమలో బలంగా నిలబడాలని కోరుకుంటున్నాను'అన్నారు.


దర్శకుడు మల్లి అంకం మాట్లాడుతూ.. ముందుగా ఈవీవీ సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా జర్నీలో అమ్మిరాజు గారి ద్వారా నరేష్ గారిని కలిశాను. ఈ సందర్భంగా అమ్మిరాజు గారికి ధన్యవాదాలు. భాను మాస్టర్ రఘు మాస్టర్ రాజు సుందరం మాస్టర్ పాటని అద్భుతంగా తీశారు. భాస్కర భట్ల, రామజోగయ్యశాస్త్రీ గారికి ధన్యవాదాలు. చాలా ప్రేమతో లిరిక్స్ రాశారు. ఆర్ట్ డైరెక్టర్, డీవోపీ సూర్య , ఎడిటర్ చోటాకే ప్రసాద్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ టీంకి ధన్యవాదాలు. అబ్బూరి రవి గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మాటలు అద్భుతంగా రాశారు. నటీనటులందరికీ థాంక్స్. ఇందులో జామి లివర్ పాత్ర అందరినీ ఆకట్టుకునేలా వుంటుంది. ఫారియా ఈ సినిమాకి రావడం వలన సిద్దిగా పాత్ర చాలా హైలెట్ అయ్యింది. అడివి శేష్ మా వేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది. నా ఫస్ట్ లవర్ నరేష్ గారు. దర్శకుడిగా అవకాశం రావడానికి చాలా స్ట్రగుల్ చేయాలి. కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వడానికి చాలా ఆలోచిస్తుంటారు. కానీ నరేష్ గారు ఇప్పటికే ముఫ్ఫై కి పైగా దర్శకులని పరిచయం చేశారు. ఆయన ఇలానే చేస్తూ మా లాంటి వారికి అండగా వుండాలి. రాజీవ్ గారు చాలా క్యాలిటీతో ఈ సినిమాని తీశారు. అందరినీ అలరించే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. తప్పకుండా ఆడియన్స్ ని అలరిస్తుంది' అన్నారు.


రచయిత దర్శకుడు బివిఎస్ రవి మాట్లాడుతూ.. అల్లరి నరేష్ ప్రతి తెలుగింట్లో కుర్రాడి లాంటి యాక్టర్. నరేష్ అభిమాని కాని ఇల్లు వుండదు. అంత ఇష్టం నరేష్ అంటే. ఎవరికి ఏ ఎమోషన్ వచ్చిన సరదాగా నవ్వుకోవడానికి నరేష్ సినిమాలు చూస్తుంటారు. ఫారియా తెలుగమ్మాయి. తన కామెడీ టైమింగ్ అద్భుతంగా వుంది. మల్లికి ఆల్ ది బెస్ట్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి' అని కోరారు


చిత్ర నిర్మాత రాజీవ్ మాట్లాడుతూ.. నా ప్రయాణంలో నన్ను సపోర్ట్ చేసిన నా కుటుంబానికి ధన్యవాదాలు. మల్లిగారు కథ చెప్పినప్పుడు నా మైండ్ లో నరేష్ గారే వచ్చారు. ఈ సినిమా ఆయన చేయడం మా అదృష్టం. ఈ సినిమాని చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అబ్బూరి రవిగారు రైటింగ్ తో పాటు ఎమోషనల్ గా చాలా సపోర్ట్ చేశారు. ఫారియా చాలా అద్భుతంగా నటించారు. వెన్నెల కిశోర్, హర్ష, జామి లివర్ ఇలా నటీనటులంతా చాలా చక్కని ప్రతిభ కనబరిచారు. ఈ సినిమాకి పని చేసిన టెక్నికల్ టీం అందరికీ ధన్యవాదాలు. ఇది మా మొదటి సినిమా. ఎక్కడా రాజీపడకుండా చాలా క్యాలిటీగా నిర్మించాం. కామెడీ లో నరేష్ గారిని మించి ఎవరూ లేరు. నరేష్ గారి చాలా ఐడియాలు సినిమాలో వున్నాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు. ఈ వేడుకకు అతిధులుగా వచ్చిన అందరికీ ధన్యవాదాలు. సునీల్ నారంగ్ గారు, సురేష్ బాబు గారు చాలా సపోర్ట్ చేశారు. అందరినీ అలరించే సినిమా ఇది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి' అని కోరారు


జామి లివర్ మాట్లాడుతూ.. అందరినీ నమస్కారం. ఒక తెలుగు సినిమా చేయాలనేది నా డ్రీం. ఆ కల ఈ సినిమాతో తీరినందుకు ఆనందంగా వుంది. ఇలాంటి మంచి కామెడీ ఎంటర్ టైనర్ తో తెలుగులో లాంచ్ కావడం సంతోషంగా వుంది. నరేష్ గారి ధన్యవాదాలు. మల్లి గారు, రాజీవ్ గారికి, టీం అందరికీ ధన్యవాదాలు' తెలిపారు.


డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. రాజీవ్ గారు చాలా పాషన్ తో క్యాలిటీగా ఈ సినిమా చేశారు. నరేష్ ఫారియా జోడి చూడటానికి చాలా బావుంది. విజువల్స్ చాలా బ్యూటీఫుల్ గా వున్నాయి. మల్లి క్యాలిటీ ఫిల్మ్ తీశాడు. నాంది సినిమాతో నరేష్ గారు నన్ను దర్శకుడిగా నిలబెట్టారు. ఈ వేడుకకు రావడం చాలా అనందంగా వుంది. ఈ సినిమాతో 'అల్లరి' నరేష్ గారు ఈజ్ బ్యాక్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.  


డైరెక్టర్ విజయ్ బిన్నీ మాట్లాడుతూ.. రాజీవ్ గారు చాలా పాషన్ వున్న నిర్మాత. మల్లి గారు చాలా అద్భుతంగా ఈ సినిమా చేశారు. నరేష్ నాగు నా అంజి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.  


డైరెక్టర్ దేవాకట్టా మాట్లాడుతూ.. నరేష్ నా మనసు చాలా దగ్గరైన స్నేహితుడు. నేను గౌరవించే విలక్షణ నటుడు నరేష్. తన ప్రయాణం ఇలానే వెర్సటైల్ గా సాగాలి. ఫారియా చాలా పెద్ద స్టార్ అవుతుంది. ఈ సినిమా సుడిగాడు లాంటి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు.  


రైటర్ అబ్బూరి రవి మాట్లాడుతూ.. పెళ్లి అనేది పవిత్రమైనది. జీవితాన్ని ఆనందంగా వుంచేది. అలాంటి పెళ్లి చుట్టూ ఎన్ని మోసాలు జరుగుతున్నాయో చూపించే ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేశాం. కొందరి కారణంగా పెళ్లి ఆనందానికి చిల్లు పడుతుంది. అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సరదా గా చెప్పే ప్రయత్నం ఈ సినిమా. నవ్వు ఎమోషన్ రెండూ ప్రేక్షకులు ఎక్స్ పీరియన్స్ చేస్తారు. అందరికీ నచ్చే సినిమా ఇది. కుర్రాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా' అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.