Home » » 1996 Dharmapuri Team Met Cinematography Minister Talasani Srinivas Yadav

1996 Dharmapuri Team Met Cinematography Minister Talasani Srinivas Yadav

 మంత్రి తలసాని గారిని కలిసిన '1996 ధర్మపురి' చిత్రబృందం



గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా విశ్వ జగత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం '1996 ధర్మపురి'. భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తున్నారు. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై తెరకెక్కుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని... టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ సమర్పకులు. ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.


గౌరవనీయులైన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని '1996 ధర్మపురి' చిత్ర బృందం గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది.  మంత్రిని కలిసిన బృందంలో చిత్ర నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి, హీరో గగన్ విహారి, హీరోయిన్ అపర్ణా దేవి, దర్శకుడు జగత్, సంగీత దర్శకుడు ఓషో వెంకట్, నటుడు శంకర్ తదితరులు ఉన్నారు. 


మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ "1996 ధర్మపురి' టీజర్, పాటలు బాగున్నాయి. సినిమాలోని 'నల్లరేణి కల్లదనా' పాటను రెండుకోట్ల మంది వీక్షించడం సంతోషంగా ఉంది. పాటలా సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి. తెలంగాణలో సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సినిమా నిర్మించారు. నిర్మాతలు మరిన్ని సినిమాలు నిర్మించి చిత్ర పరిశ్రమలోని కళాకారులకు చేయూత ఇవ్వాలి" అన్నారు. 


శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన అనంతరం '1996 ధర్మపురి' నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి, హీరో గగన్ విహారి మాట్లాడుతూ "తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ఎంతో ప్రోత్సహిస్తోంది. చిన్న సినిమాలకు సహాయ సహకారాలు అందిస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చిత్ర పరిశ్రమకు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను, నిర్మాతలను ప్రోత్సహిస్తున్నారు" అన్నారు. 



నటీనటులు:

గగన్ విహారి, అపర్ణ దేవి, నాగ మహేష్, జనార్దన్, కేశవ, బస్టాప్ కోటేశ్వరరావు, రాగిని తదితరులు..


టెక్నికల్ టీమ్:

రచన, దర్శకత్వం: విశ్వజగత్

సమర్పణ: శేఖర్ మాస్టర్

బ్యానర్: భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా

నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి

ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్

కొరియోగ్రాఫర్: శేఖర్ మాస్టర్

సంగీతం: ఓషో వెంకట్

PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్


Share this article :