One by 4 Releasing on January 30

 ‘వన్ బై ఫోర్’ (One/4) జనవరి ౩౦న విడుదల 

తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ పతాకంపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్స్‌గా నటిస్తున్న యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం వన్ బై ఫోర్(One/4). బ్లాక్ బస్టర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి ౩౦న 200 థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధం గా ఉంది. 

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ .. ‘‘వన్ బై ఫోర్’ (One/4) ఒక క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఒక్కో సందర్భంలో మనం టంగ్ స్లిప్ అయితే జరిగే పరిణామాలు ఊహించలేం. అలాగే ఈ చిత్రం లో కూడా టంగ్ స్లిప్ అయితే ఏమి జరుగుతుందో ఒక యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్ చిత్రం గా రూపొందించాం. యాక్షన్ ఎపిసోడ్స్, సుభాష్ ఆనంద్ సంగీతం, పాటలు, నటి నటులు పెర్ఫార్మన్స్ సాగర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందరినీ ఆకట్టుకుంటుంది. బాహుబలికి పని చేసిన పళని గారి టేకింగ్‌కు అందరూ ఫిదా అవుతారు. రాజమౌళి గారి స్టైల్లో ఈ మూవీని తీశారు. ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టించుకుండా సినిమాను నిర్మించాం. జనవరి ౩౦న 200 థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం" అని తెలిపారు.

నటీనటులు: వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని, టెంపర్ వంశీ, ఆర్ ఎక్స్ 100 కరణ్, నరేంద్ర వర్మ, రాజు, అపర్ణ శెట్టి, మధుసూదన్ రావు, సునీత మనోహర్, శ్రీనివాస్ భోగిరెడ్డి, వేడిష్ జవేరి, కుష్బూ, సుజాత, ఎస్ ఆర్ ఎస్ వర్మ, సుహాని వ్యాస్ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్

నిర్మాతలు: రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్

దర్శకుడు: బాహుబలి పళని కె

సంగీతం: సుభాష్ ఆనంద్

డి ఓ పి: గుణ శేఖర్

లిరిక్స్: సాగర్ నారాయణ ఎమ్. నాగేంద్ర గోపు

డాన్స్: సాగర్ వేలూరు

స్టంట్ మాస్టర్: కుంగ్ ఫు చంద్ర, జాషువా

వి ఎఫ్ ఎక్స్: నవీన్ ఏ, పవన్ నారావా

ఎస్ ఎఫ్ ఎక్స్: పురుషోత్తం రాజు

మిక్సింగ్: జయంతం సురేష్

డిజిటల్ మార్కెటింగ్: వంశి కృష్ణ (సినీ డిజిటల్)

Post a Comment

Previous Post Next Post