Home » » Hero Trigun interview about Katha Kanchiki Manam Intiki

Hero Trigun interview about Katha Kanchiki Manam Intiki

 హర్రర్‌ కామెడీ, సూపర్‌ నాచురల్‌, ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ 

‘కథ కంచికి మనం ఇంటికి’ ` హీరో త్రిగున్‌ మొదటి సినిమా తమిళ్ హ్యాపీ డేస్,  ఆ తరువాత

జెనీలియా తో కథ’, 24 కిస్సెస్‌, తుంగభద్ర, గరుడవేగ, నవ మన్మధుడు, 11th అవర్‌, డబ్ల్యు,డబ్ల్యు,డబ్ల్యు, డియర్‌ మేఘ, చీకటి గదిలో చితక్కొట్టుడుతో ఇప్పటి వరకు 17 సినిమాలలో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు త్రిగున్‌. తాజాగా తను యమ్‌.పి. ఆర్ట్స్‌ పతాకంపై తిృగున్‌, పూజిత పొన్నాడ జంటగా చాణిక్య చిన్న దర్శకత్వంలో మోనిష్‌ పత్తిపాటి నిర్మించిన సినిమా ‘కథ కంచికి మనం ఇంటికి’. ఏప్రిల్‌ 8న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా 


తిృగున్‌ పాత్రికేయులతో మాట్లాడుతూ...లాక్‌ డౌన్‌లో చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా విడుదల అయ్యింది.సెక్స్ కామెడీ సినిమా చేసి హిట్ కొట్టావ్ అన్నారు. నేను ప్రతి సినిమాను కూడా ఒక కొత్త సినిమా అనుకోని కష్టపడినట్టే ఈ సినిమాకు కష్టపడ్డాను. నన్ను అలా అన్నందుకు ఒక మంచి క్లీన్‌ ఫ్యామిలీ హారర్‌ కామెడీ సినిమా చేయాలన్న ప్రయత్నమే ‘‘కథ కంచికి మనం ఇంటికి’’ నేను లక్‌ను నమ్ముతాను.  నా 15 సంవత్సరాల వయసులో ప్రకాష్‌ రాజ్‌ ప్రొడక్షన్లో తమిళ్‌ హ్యాపీ డేస్‌కు 4,000 మందిని ఆడిషన్స్‌ చేస్తే అందులో నేను సెలెక్ట్‌ అయ్యాను. అలా నాకు లక్‌ కలిసి వచ్చింది. ఆ తర్వాత ఇండస్ట్రీ నిలబడాలంటే కష్టపడాలి, ఎక్స్పీరియన్స్‌ కావాలని కొన్ని ఎక్స్‌పరిమెంట్స్‌ చేశాను. ఈ సినిమాకు మంచి ప్యాడిరగ్‌ ఆర్టిస్ట్‌లు ఉన్నారు. ఫ్యామిలీస్‌ ఆకట్టుకునేలా అన్ని అంశాలు ఉంటాయి. ఎక్కువగా గ్రాఫిక్స్‌, భారీ సెట్స్‌ ఉన్నాయి. భీమ్స్‌ మ్యూజిక్‌ అద్భుతం. థియేటర్‌లో ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురి చేస్తుంది. సాంగ్స్‌ కూడా ప్రేక్ష్‌కుల్ని ఇప్పటికే ఆకట్టుకున్నాయి. .తెరమీద మాత్రమే చూసి ఎంజాయ్‌ చేసే సినిమా ఈ ‘కథ కంచికి.. మనం ఇంటికి’. ముఖ్యంగా క్లైమాక్స్‌ చాలా భారీగా ఖర్చుపెట్టి చేయడం జరిగింది. ప్రేక్షకులకు సంతృప్తినిచ్చే సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను అన్నారు.ఈ సినిమా తర్వాత .ఇప్పటివరకు లవ్ సబ్జెక్టు మాత్రమే చేయగలడు అనుకొనే వారికి భిన్నంగా  ఆర్జీవీ గారి ‘కొండా’ సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ రోల్‌ చేస్తున్నానుమా ఇంట్లో అందరిపేరులో  శివుడి పేరు ఉంటుంది అందుకే నాకు కూడా శివుని పేరు వచ్చేలా త్రిగున్ అని పేరు మార్చుకోవడం జరిగింది.ప్రతిసారి నా సినిమా రిలీజ్ ఆప్పుడు  4,5 th స్లాట్స్ లో నా సినిమా ఉండేది. ఈసారి మాత్రం నా సినిమా సెకండ్ స్లాట్ లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.ప్రేక్షకులు నాకు  నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా మంచి సినిమాలు చేయడానికి ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను  అన్నారు. రేపు విడుదల అవుతున్న మా సినిమాను ప్రేక్షకుడు థియేటర్ లో  కూర్చొని నవ్వుతూ ఎంజాయ్ చేసే సినిమా "కథ కంచికి మనం ఇంటికి' అని కచ్చితంగా చెప్పగలను. ప్రస్తుతం "కొండా'  సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.. డియర్ మేఘ కాంబినేషన్ లో ప్రేమదేశం’ పేరుతో మరో సినిమా చేయబోతున్నా.ఇలా ఇంకా కొన్ని స్క్రిప్ట్స్ రెడీ గా ఉన్నాయి వాటి వివరాలు త్వరలో తెలియజేస్తా అన్నారు.


Share this article :