రామ్ లక్ష్మణ్ ల శిష్యుడు కృష్ణ భారత హీరోగా తెరకెక్కుతున్న బర్బరీకుడు ద సన్నాఫ్ ఘటోత్కచ మూవీ గ్రాండ్ ఓపెనింగ్
పీపీ మూవీ మేకర్స్, రేణుక ఎల్లమ్మ క్రియేషన్స్ బ్యానర్ లపై టి. మల్లేశ్వరుడు, అంతటి నరేష్ కుమార్, అంతటి రాజేష్ కుమార్ నిర్మాతలుగా శివఝాన్సీరేగాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం బర్బరీకుడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బర్బరీకుడు చిత్రం ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమం జరుపుకుంది. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలోని ఒక యోధుడి కథతో ఈ చిత్రం తెరక్కబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తండ్రి శివ శక్తి దత్త శిష్యుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, అలాగే పాటల రచయితగా పనిచేసిన శివఝాన్సిరేగాల ఈ చిత్రంతో దర్శకుడుగా అరంగేట్రం చేస్తున్నారు. తెలుగు ప్రజల హృదయాలను కొల్లగొట్టేందుకు భారతీయ అతిపెద్ద ఇతిహాసం మహాభారతంలోని ఒక యోధుడి కథను తెరకెక్కించబోతున్నారు. ఈ విషయంలో దర్శకుడు తో పాటు నిర్మాతల అభిరుచిని కూడా అభినందించాల్సిందే. సినిమా అంటే అభిమానం, ప్రేమ ఉంటే తప్ప ఇలాంటి కథలను నిర్మించరు. ఈ విషయంలో చిత్ర నిర్మాతలు టి. మల్లేశ్వవరుడు, అంతటి నరేష్ కుమార్, అంతటి రాజేష్ కుమార్ లు ఆదిలోనే విజయం సాధించారు. తాము రూపొందిస్తున్న బర్బరీకుడు చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. చాలామందికి బర్బరీకుడు చరిత్ర గురించి తక్కువగా తెలుసని.. ఈ చిత్రంతో ఆయన ఎంతటి గొప్పయోధుడో అందరికీ తెలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఫైట్స్ కొరియోగ్రఫీ చేసిన రామ్ లక్ష్మణ్ ల శిష్యుడు, స్టంట్ మాస్టర్ బద్రి మాస్టర్ అల్లుడు అయినా కృష్ణ భారత ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. అయనతో పాటు అద్భుతమైన వాయిస్ తో ఒప్పించి, తెరపై విలనుగా మెప్పించిన రవిశంకర్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. ఆయనతోపాటు సమ్మెట గాంధీ, జబర్దస్త్ చిట్టిబాబు, ఆనంద్ భారతి తదితరులు నటిస్తున్నారు. ఎన్నో చిత్రాలకు మంచి సినిమాటోగ్రఫీను అందించిన శ్యామ్ కే నాయుడు ఈ చిత్రానికి డిఓపిగా పనిచేస్తున్నారు. అలాగే ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ జి.ఎం సతీష్, వీరితోపాటు ఇటీవల సూపర్ హిట్ పాటలను ఇచ్చిన భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తామని మేకర్స్ తెలిపారు.
నటీనటులు: కృష్ణ భారత, రవిశంకర్, సమ్మెట గాంధీ, జబర్దస్త్ చిట్టిబాబు, ఆనంద్ భారతి తదితరులు
దర్శకత్వం: శివఝాన్సిరేగాల
బ్యానర్: పీపీ మూవీ మేకర్స్, రేణుక ఎల్లమ్మ క్రియేషన్స్
నిర్మాత: టి. మల్లేశ్వవరుడు, అంతటి నరేష్ కుమార్, అంతటి రాజేష్ కుమార్
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ : అనిల్ రెడ్డి
సంగీత దర్శకుడు: జీఎమ్ సతీష్
సినిమాటోగ్రాఫర్: శ్యామ్ కే నాయుడు
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
లిరిసిస్ట్ : మద్దెల నారాయణ, శివఝాన్సిరేగాల
స్టంట్స్ : రామ్-లక్ష్మణ్
కొరియోగ్రాఫర్: భాను మాస్టర్
పీఆర్ఓ: హరీష్


Post a Comment