Unanimous Election of New Executive Committee Members of Telugu Television, Digital and OTT Producers Council

 తెలుగు టెలివిజన్‌ డిజిటల్‌ అండ్‌ ఓటిటి ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ నూతన కార్యవర్గ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక...

2025– 2027వ సంవత్సరానికి ‘‘తెలుగు టెలివిజన్‌ డిజిటల్‌ అండ్‌ ఓటిటి ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌’’ నూతన కార్యవర్గం సారధులు ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్‌గా ఏ.ప్రసాదరావు (సోనోపిక్స్‌ ప్రసాద్‌) వైస్‌ ప్రెసిడెంట్‌గా పి.ప్రభాకర్, యన్‌.అశోక్‌లు ఎన్నికవ్వగా జనరల్‌ సెక్రటరీగా యం.వినోద్‌బాల జాయింట్‌ సెక్రటరీలుగా నటుడు–నిర్మాత కె.వి శ్రీరామ్, గుత్తా వెంకటేశ్వరరావు, ట్రెజరర్‌గా డి.వై చౌదరి ఎన్నికయ్యారు. గత 14 ఏళ్లుగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా తమ సభ్యులకు ఉపయోగపడే విధంగా వాలంటీర్గా ‌గా పనులు చేసి అందరితో శహభాష్‌ అనిపించుకునే ఏకైక యూనియన్ మాది అని ప్రెసిడెంట్‌ ప్రసాద్‌రావు అన్నారు. ఎటువంటి ఎన్నికల హడావిడి లేకుండా, రాగద్వేషాలు లేకుండా ఏకగ్రీవంగా తమ సభ్యులను ఎన్నుకుంటున్న ఏకైక యూనియన్ మా టిటిడిఓపిసి సంస్థ అన్నారు జనరల్‌ సెక్రటరీ వినోద్‌బాల. ఈ కౌన్సిల్‌లో దాదాపు 200 మంది నిర్మాతలు ఉన్నారు. అందరూ యాక్టివ్‌గా ఉంటూ వందలమందికి ఉపాధి కల్పించటంలో అనేక యూనియన్ల కంటే సౌతిండియాలోనే అతి పెద్ద సంస్థ మాది అన్నారు నటుడు–నిర్మాత ఈటీవి ప్రభాకర్‌. మా యూనియన్‌కి సొంత భవనంతో మరి కొన్ని స్థిరాస్తులు ఉండటంతో మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు మా యూనియన్‌ సభ్యులు అన్నారు ట్రెజరర్‌ డి.వి చౌదరి. మా యూనియన్‌ సభ్యులకి ఎటువంటి ఆపద వచ్చిన మేమందరం కలిసి కట్టుగా మాట్లాడుకుని డెసిషన్‌ తీసుకుంటామని అందుకే మాలో మాకు పెద్దగా వివాదాలు ఉండవని అన్నారు నటుడు– నిర్మాత కె.వి శ్రీరామ్‌. వీరితో పాటు హానరబుల్‌ ఎడ్వైజర్‌గా కె.రమేష్‌ బాబుని నియమించటం జరిగింది. నూతన కార్యవర్గంలో ఆర్గనైజింగ్‌ సెక్రటరీస్‌గా కెవి.కిరణ్‌ కుమార్, స్వాతి కె బాలినేని, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌గా యాటా. సత్యనారాయణ, వి.వెంకటేశ్వరరావు, జి.తాండవకృష్ణ, అనిల్‌ కడియాల, పి.ప్రేమ్‌సాగర్, పద్మిని నాదెళ్ల, కో–ఆపరేటడ్‌ మెంబర్స్‌గా హెచ్‌.శ్రీనివాస్, ఎస్‌.సర్వేశ్వర్‌ రెడ్డి, కొల్లి ప్రవీణ్‌ చంద్ర, కె.భరత్‌కుమార్‌లు ఎన్నికయ్యారు. మన టీవి సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి విపత్తులు సంభవించిన మేమందరం కలిసి పనిచేస్తామని 2011లో ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉంటూ ఎంతోమందికి మేలు చేసిన దాసరి నారాయణరావు గారి సమక్షంలో ఏర్పడిన యూనియన్‌ మాది. ఆయన గుర్తుగా మరిన్ని మంచి కార్యక్రమాలతో మా కార్యవర్గం ముందుకు సాగేవిధంగా ఉంటుందని మేమందరం మాట ఇస్తున్నాం అని మీడియా సమావేశంలో మాట్లాడారు ‘‘తెలుగు టెలివిజన్‌ డిజిటల్‌ అండ్‌ ఓటిటి ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌’’ సభ్యులు. తెలిపారు..

Post a Comment

Previous Post Next Post