Hero Poorvaj Character First Look Unveiled from Killer

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ "కిల్లర్" మూవీ నుంచి హీరో పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్



"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.


ఈ రోజు "కిల్లర్" పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్  రిలీజ్ చేశారు. "కిల్లర్" మూవీలో పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ కొత్తగా ఉండి ఆకట్టుకుంటోంది. చేతిలో రివాల్వర్ తో పూర్వాజ్ కనిపిస్తున్నారు. రిలీజ్ చేస్తున్న ప్రతి పోస్టర్ తో  "కిల్లర్" మూవీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.



నటీనటులు - జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ - జగదీశ్ బొమ్మిశెట్టి

మ్యూజిక్ - అషీర్ ల్యూక్, సుమన్ జీవరత్నం

వీఎఫ్ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్ - మెర్జ్ ఎక్స్ఆర్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

బ్యానర్స్ - థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్ఆర్, ఏయు అండ్ ఐ.

నిర్మాతలు - పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి.

రచన దర్శకత్వం - పూర్వాజ్ 

Post a Comment

Previous Post Next Post