Naga Chaitanya’s Voiceover For Trailer Of GV Prakash Kumar Dear which is out now

 హీరో నాగ చైతన్య వాయిస్ ఓవర్ తో జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్, నట్మెగ్ ప్రొడక్షన్స్ ప్రై.లి. అన్నపూర్ణ స్టూడియోస్, ఏషియన్ సినిమాస్ 'డియర్' ట్రైలర్ విడుదల


జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా 'డియర్' తమిళంలో ఏప్రిల్ 11న, తెలుగులో ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.  నట్మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు.  


నాగ చైతన్య వాయిస్ ఓవర్ అందించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రయిలర్  నూతన వధూవరుల  పాత్రల్లో జివి ప్రకాష్ కుమార్ , ఐశ్వర్య రాజేష్ లైఫ్ లో స్నీక్ పీక్ ఇస్తుంది. భార్య యొక్క గురక అలవాటు కారణంగా రిలేషన్ షిప్ కాంప్లికేటెడ్ గా మారిన కథాంశం యూనిక్ గా వుంది. నాగ చైతన్య వాయిస్ ఓవర్ ప్రధాన ఆకర్షణలలో ఒకటి.


జగదీష్ సుందరమూర్తి కెమెరా బ్రిలియంట్ గా వుంది. జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కామిక్ కోణాన్ని ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.


అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రా ప్రాంతంలో విడుదల చేయనుండగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణ ప్రాంతంలో విడుదల చేయనుంది. డియర్‌లో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని కీలక పాత్రలలో  నటించారు.


Post a Comment

Previous Post Next Post