Latest Post

Pushpa Pushpa Song From Pushpa 2 The rule is Releasing Tomorrow

 'పుష్ప-2' ది రూల్‌ నుంచి రేపు విడుదల కానున్న సన్సేషనల్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌  పుష్ప..... పుష్ప... పుష్ప... పుష్పరాజ్‌



ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇక ప్ర‌స్తుతం నిర్మాణంలో వున్న సీక్వెల్ పుష్ప‌-2 ది రూల్ గురించి ఎటువంటి అప్‌డేట్ అయినా స‌న్పేష‌న్‌. తాజాగా చిత్ర యూనిట్ ఇచ్చిన అప్‌డేట్‌తో అటు ఐకాన్‌స్టార్ అభిమానులు, ఇటు పుష్ప ప్రేమికులు సంబ‌రాల్లో వున్నారు. 'పుష్ప-2' దిరూల్‌ నుంచి రేపు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు  తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ  భాషల్లో

పుష్ప..... పుష్ప... పుష్ప... పుష్పరాజ్‌ అనే తొలి లిరికల్ వీడియోను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్‌. ఈ అప్‌డేట్‌తో ఐకాన్‌స్టార్‌ అభిమానులు సంబరాల్లో వున్నారు. ఇందుక సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఐకాన్‌స్టార్‌  పూర్తి మాస్‌గెటప్‌లో నడుస్తూ కనిపిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప-2  ద రూల్ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి.

 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

నటీనటులు:

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు


టెక్నికల్ టీం: కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి

నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్

సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే

లిరిసిస్ట్: చంద్రబోస్

సీఈఓ: చెర్రీ

బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్

పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు


Premikudu Re Relese Postponed to May End

 ప్రేమికుడు రీ-రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా మే చివరిన 300 థియేటర్లలో రాబోతుంది



మెగా ప్రొడ్యూసర్ కే. టి.  కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవ, అందాల నటి నగ్మ నటించిన ప్రేమికుడు సినిమా రీ-రిలీజ్ అవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ రిలీజ్ కి సంబంధించిన వేడుక నేడు చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్ మరియు శోభారాణి గారు పాల్గొన్నారు.


30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ మే 1న 300 కు పైగా థియేటర్లలో ఘనంగా రి రిలీజ్ అవబోతుంది అని రీసెంట్ గా విడుదల చేశారు. బుకింగ్స్ ఓపెన్ అయి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సర్రిగా ఇదే తరుణంలో నిర్మాతల నుండి మరో అప్డేట్ వచ్చింది. కొన్ని సాంకేతిక అంతారాయం వలన ఈ సినిమాని మే 1న కాకుండా మే నెల చివరి వారంలో విడుదల చేస్తున్నాట్లు చెప్పారు.


 ఎస్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా జంటగా 30 సంవత్సరాల క్రితం వచ్చి యువతను ఆకట్టుకున్న సినిమా. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని పాటలు యువతనే కాకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభుదేవా తండ్రిగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారు నటించడం సినిమాకే పెద్ద ప్లస్ అయింది. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటలో ప్రభుదేవా తో సమానంగా ఎస్. పి. బాలు గారు డాన్స్ చేయడం విశేషం. టేకిట్ ఈజీ పాలసీ, ఓ చెలియా నా ప్రియ సఖియా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ సాంగ్స్. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.


నటీనటులు : ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా, ఎస్. పి. బాలసుబ్రమణ్యం, గిరీష్ కర్నాడ్, వడివేలు, రఘువరన్ తదితరులు.


టెక్నీషియన్స్ :

నిర్మాణం : జెంటిల్మెన్ ఫిలిం ఇంటర్నేషనల్

నిర్మాతలు : మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్

మ్యూజిక్ : ఆస్కార్ విన్నర్ ఏ. ఆర్. రెహమాన్

దర్శకుడు : సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్

వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ : మురళీధర్ రెడ్డి, రమణ

డిస్ట్రిబ్యూషన్ కంపెనీ : సి ఎం ఆర్ ప్రొడక్షన్స్

పి ఆర్ ఓ : మధు VR

Naveen Chandra Wins Best Actor at Dada Saheb Phalke Film Festival

 హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం



యువ హీరో, ఇంపాక్ట్ స్టార్ నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. ఈ ఏడాది నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే  ఫిలిం ఫెస్టివల్ లో నవీన్ చంద్ర ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. గత ఏడాది విడుదలైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రం మంత్ ఆఫ్ మధు సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ఆయన అద్భుతమైన నటనకు ఈ పురస్కారం లభించింది. సినిమా పరిశ్రమలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంతో ప్రత్యేకత ఉంటుందో అందరికీ తెలుసు. అంతటి గొప్ప అవార్డు ఆయనకు లభించడం అంటే నవీన్ చంద్రకు సినిమా పట్ల, ఆయన నటన పట్ల ఉన్న అంకితభావం ఎలాంటిదో అర్థం అవుతుంది.


భారతీయ చిత్ర పరిశ్రమకు పితామహుడుగా చెప్పుకోదగిన దాదాసాహెబ్ ఫాల్కే పుట్టినరోజు ఏప్రిల్ 30వ తేదీన ఈ పురస్కారాలను అందిస్తారు. ఈ పురస్కారాల కోసం దేశవ్యాప్తంగా అనేకమంది కళాకారులు పోటీ పడుతూ ఉంటారు. మనదేశంలో ప్రతి ఏడాది విడుదలయ్యే  చిత్రాలు, వివిధ విభాగాలలో పోటీపడుతాయి. అందులో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి నిర్వాహకులు ఈ పురస్కారాలను అందిస్తారు.  2024 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా నవీన్ చంద్రకు ఈ అవార్డు దక్కడం విశేషం అనే చెప్పాలి.


ఇంపాక్ట్ స్టార్ నవీన్ చంద్ర ఇప్పటి వరకు అనేక తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలలో నటించారు. ఆయన హీరోగా 2011లో అందాల రాక్షసి సినిమా ద్వారా పరిచయం అయ్యారు. ఆ తరువాత వరుసగా మంచి సబ్జెక్ట్ ఉన్న కథలను ఎంచుకొని తెలుగు చిత్ర పరిశ్రమలో నవీన్ చంద్ర తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన గేమ్ ఛేంజర్ వంటి పాన్ ఇండియా చిత్రంతో పాటు అనేక చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన ఇన్స్పెక్టర్ రుషి వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో సంచలనం సృష్టిస్తోంది.


Yemayyinde First Single From Devaki Nandana Vasudeva is on May 3rd

 అశోక్ గల్లా అర్జున్ జంధ్యాల, లలితాంబిక ప్రొడక్షన్స్ 'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగిల్ ఏమయ్యిందే మే3న విడుదల  



'హీరో' చిత్రంతో సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ప్రస్తుతం గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో 'దేవకీ నందన వాసుదేవ'చేస్తున్నారు. హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.


గతంలో కథానాయకుడి పాత్రను పరిచయం చేసిన టీజర్‌  సినిమా ప్రిమైజ్ ని ప్రజెంట్ చేసింది. టీజర్ కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ చేశారు మేకర్స్. ఫస్ట్ సింగిల్ ఏమయ్యిందే ప్రోమోను విడుదల చేశారు. ఇటీవలి కాలంలో అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఆకట్టుకునే బీట్‌లతో అద్భుతమైన పాటని అందించారు.


 ఈ పాట అశోక్ గల్లా తన లవ్ వారణాసి మానస పట్ల ఆరాధనని చూపుతుంది. ఈ పాటలో అశోక్ గల్లా ఆనందంగా కనిపించగా, వారణాసి మానస అందంగా ఉంది. వీరి జోడి తెరపై ఆకర్షణీయంగా కనిపించింది. పూర్తి సాంగ్ మే3 న విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.


గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్‌తో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల డీవోపీగా పని చేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్.


నటీనటులు: అశోక్ గల్లా, వారణాసి మానస


సాంకేతిక సిబ్బంది:

కథ: ప్రశాంత్ వర్మ

దర్శకత్వం: అర్జున్ జంధ్యాల

నిర్మాత: సోమినేని బాలకృష్ణ

బ్యానర్: లలితాంబిక ప్రొడక్షన్స్

సమర్పణ: నల్లపనేని యామిని

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

డీవోపీ: ప్రసాద్ మూరెళ్ల

ఎడిటర్: తమ్మిరాజు

డైలాగ్స్: బుర్రా సాయి మాధవ్

పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే

పీఆర్వో: వంశీ-శేఖర్


Tindibothu Dayyam Movie Launched

'తిండిబోతు దెయ్యం' ప్రారంభం



నరసింహ బోదాసు దర్శకత్వంలో 'తిండిబోతు దెయ్యం' ప్రారంభం

కామెడీ, హర్రర్ తో  'తిండిబోతు దెయ్యం'. 


నూతన చిత్రనిర్మాణ సంస్థ శ్రీ శౌర్య క్రియేషన్స్ తన ప్రొడక్షన్ నెం.1గా 'తిండిబోతు దెయ్యం' అనే చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది.  నరసింహ బోదాసు, మోనికా సమత్తార్, తన్నీరు వాసవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తన స్వీయ దర్శకత్వంలో నరసింహ బోదాసు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మంగళవారం ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ముహూర్తపు సన్నివేశానికి సూపర్ హిట్ కామెడీ చిత్రాల  దర్శకులు, నంది అవార్డు గ్రహీత  రేలంగి నరసింహారావు క్లాప్ నివ్వగా.. నిర్మాత శిరీష నరసింహ బోదాసు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్బంగా... 


ప్రఖ్యాత దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ... కామెడీ అనేది ఎప్పుడూ ఎవర్ గ్రీన్ అంశమే. చలనచిత్ర సీమలో  కామెడీకి తిరుగులేదు. ఉండదుకూడా. అయితే.. దీనిని చక్కగా డీల్ చేసి తీస్తే విజయభావుటా ఖాయం. కామెడీ టచ్ తో కూడిన చిత్రానికి హర్రర్ మిళితం చేస్తే.. ఇక చెప్పేదేముంటుంది? ప్రేక్షకుల మనసులను ఇట్టే దోచేయొచ్చు. ఇప్పుడు సినిమాల్లో నడుస్తున్న ట్రెండ్ కూడా  ఇదే. నాకు తెలిసి దర్శకులు  నరసింహ బోదాసు ఈ చిత్రానికి ఎంతో మంచి స్క్రిప్ట్ ను సమకూర్చుకుని ఉంటారు. కామెడీతో కూడిన హర్రర్ అంటున్నారు కాబట్టి ప్రేక్షకుల మనసులను గెలుచుకునే విధంగానే ఉంటుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే నరసింహ బోదాసు అందులో నేర్పరి. ఎలాంటి చిత్రాలకు ప్రేక్షకాదరణ ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. అలాగే ఈ చిత్రానికి కథానాయికలు కూడా చక్కగా కుదిరారు. హీరోయిన్స్ ను చూస్తూంటే ముచ్చెటేస్తుంది. ఈ సినిమా వంద శాతం హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది. ముఖ్యంగా ఏ సినిమాకైనా ప్లానింగ్ ఎంతో అవసరం. ఈ సినిమాలో  నరసింహ బోదాసు కు తోడు నందుటి అశోక్ గౌడ్  ఉన్నారు కాబట్టి చక్కటి  ప్లానింగ్ తోనే ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని ఆశిస్తున్నాను. విడుదలకు ముందు సినిమాకు మంచి ప్రమోషన్ ఇచ్చుకుంటూ ..సోషల్ మీడియాను బాగా వాడుకుని ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఈ 'తిండిబోతు దెయ్యం' కనిపించాలని... వినిపించాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది  బెస్ట్ చెప్పారు. 


నిర్మాత, దర్శకులు, హీరో 'నరసింహ బోదాసు' మాట్లాడుతూ.. కొన్ని ఏళ్ల పాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకుని మంచి చిత్రాలు నిర్మించాలని ఈ నూతన చిత్రనిర్మాణ సంస్థ శ్రీ శౌర్య క్రియేషన్స్ ను స్థాపించాం. ప్రొడక్షన్ నెం.1గా మా 'తిండిబోతు దెయ్యం' ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఈ సినిమాలో కొత్తదనం ఉంటుంది. అందరూ ఆదరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. 


కథానాయికలు మౌనిక, వాసవి మాట్లాడుతూ.. ఈ కామెడీ.. హర్రర్ సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ తమ పాత్రలను చక్కగా పోషించి అందరి అభిమానాన్ని చాటుకుంటామని, ఈ సినిమా గొప్ప సక్సెస్ కావాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. 


కో – డైరెక్టర్ నందుటి అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. కామెడీ హర్రర్ తో వస్తున్న ఈ 'తిండిబోతు దెయ్యం'  ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడం ఖాయం. కొత్త జోనర్ లో, సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా సక్సెస్ ని త్వరలోనే చూస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. 


ఇంకా ఈ సమావేశంలో  డైలాగ్ రైటర్ శ్రీకాంత్ సాయి మాట్లాడుతూ  సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని, శ్రీ శౌర్య క్రియేషన్స్ ద్వారా మరిన్ని చిత్రాలు రావాలని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 


ఈ చిత్రానికి....హీరో: నరసింహ బోదాసు, హీరోయిన్స్: కుమారి మోనికా సమత్తార్, కుమారి తన్నీరు వాసవి


బ్యానర్ నేమ్ : శ్రీ శౌర్య క్రియేషన్స్ 

స్టోరి, స్క్రీన్ ప్లే & డైరెక్షన్ : నరసింహ బోదాసు 

ప్రొడ్యూసర్ : శిరీష నరసింహ బోదాసు 

డైలాగ్స్ : శ్రీకాంత్ సాయి 

డి.ఓ.పి : మహేందర్. ఎం 

కో – డైరెక్టర్ : నందుటి అశోక్ గౌడ్ 

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : బాలమురుగన్ గరిమెళ్ళ 

పీఆర్వో : తిరుమలశెట్టి వెంకటేష్ 

Director Karuna Kumar launches second song Alasina Oopiri from Varalaxmi Sarathkumar’s Sabari

 వరలక్ష్మీ శరత్ కుమార్ 'శబరి' సినిమాలో 'అలిసిన ఊపిరి...' సాంగ్ రిలీజ్ చేసిన దర్శకుడు కరుణ కుమార్



  

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి'. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదలవుతోంది. 


తాజాగా సినిమాలోని 'అలిసిన ఊపిరి...' పాటను ప్రముఖ దర్శకుడు, ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా 'మట్కా' తెరకెక్కిస్తున్న కరుణ కుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు. గోపీసుందర్ సంగీతంలో రెహమాన్ రాసిన 'అలిసిన ఊపిరి...' పాటను ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు.


''అలిసిన ఊపిరి

కణకణ మండే ఆయుధమల్లే మారే...

తరిమిన చీకటి

మృగమున చీల్చగా సరసరమంటూ సాగే...

భయమే వదిలి

ఇక ఈ క్షణమే ఎదురే తిరిగే ఒంటరి సైనం...

తనకు తానై బలం గెలవదా ఈ రణం...

కసిగా అవుతుంది సంసిద్ధమే'' అంటూ సాగిందీ గీతం!


'శబరి' నుంచి ఇప్పటి వరకు విడుదలైన గీతాలు తల్లి కూతుళ్ల మధ్య అనుబంధం, ప్రేమను చూపిస్తే... 'అలిసిన ఊపిరి' పాటలో పోరాటానికి సిద్ధమవుతున్న మెయిన్ లీడ్ వరలక్ష్మిని చూపించారు. మధ్యలో కుమార్తె కోసం అన్వేషణలో పడిన తల్లి మనసును సైతం స్పృశించారు. గోపీసుందర్ బాణీ, అనురాగ్ కులకర్ణి గాత్రం, రెహమాన్ సాహిత్యం దీనినొక మోటివేషనల్ సాంగ్ తరహాలో మార్చాయి.


పాట విడుదల చేసిన అనంతరం దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ... ''అందరికీ నమస్తే. ఇప్పుడే మహేంద్రనాథ్ గారు నిర్మించిన 'శబరి' సినిమాలోని 'అలిసిన ఊపిరి' సాంగ్ విడుదల చేశా. రెహమాన్ గారు అద్భుతమైన లిరిక్స్ అందించారు. పాట చాలా బావుంది. విజువలైజేషన్ కూడా బాగా చేశారు. మదర్ అండ్ డాటర్ ఎమోషన్ తీసుకుని థ్రిల్లర్ సినిమా చేశామని చెప్పారు. సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు మహేంద్రనాథ్ గారితో మంచి అనుబంధం ఉంది. వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి వర్సటైల్ యాక్టర్ ఈ సినిమా చేశారు. ఫిమేల్ ఓరియెంటెడ్ కథలు తక్కువగా వస్తున్న ఈ రోజుల్లో మంచి కథతో సినిమా తీశారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 


నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ... ''సాంగ్ రిలీజ్ చేసిన కరుణ కుమార్ గారికి థాంక్స్. ఆయన సపోర్ట్ మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. మా 'శబరి' సినిమాను మే 3న పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. ట్రైలర్, ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. తల్లి కూతుళ్ల నేపథ్యంలో స్ట్రాంగ్ ఎమోషన్స్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తీసిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది'' అని చెప్పారు.   


నటీనటులు:

వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఈ చిత్రంలో తారాగణం.


సాంకేతిక బృందం:

ఈ చిత్రానికి రచనా సహకారం: సన్నీ నాగబాబు, పాటలు: రహమాన్, మిట్టపల్లి సురేందర్, మేకప్: చిత్తూరు శ్రీను, కాస్ట్యూమ్స్: అయ్యప్ప, కాస్ట్యూమ్ డిజైనర్: మానస, స్టిల్స్: ఈశ్వర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: లక్ష్మీపతి కంటిపూడి, కో- డైరెక్టర్: వంశీ, ఫైట్స్: నందు - నూర్, కొరియోగ్రాఫర్స్: సుచిత్ర చంద్రబోస్ - రాజ్ కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పూలాల, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, సంగీతం: గోపి సుందర్, సమర్పణ: మహర్షి కూండ్ల, ప్రొడ్యూసర్: మహేంద్ర నాథ్ కూండ్ల, కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అనిల్ కాట్జ్.

The Family Star Received Great Response in OTT

 "ఫ్యామిలీ స్టార్" పై తేలిపోయిన దుష్ప్రచారం, సినిమాను ప్రైమ్ వీడియోలో ఎంజాయ్ చేస్తున్న ఆడియెన్స్



విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "ఫ్యామిలీ స్టార్" రీసెంట్ గా అమోజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నామంటూ పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ టైమ్ లో సినిమా మీద కొందరు చేసిన నెగిటివ్ ప్రచారం నిజమేననుకుని సినిమాను థియేటర్ లో చూడలేదని, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నామంటూ వాళ్లు ట్వీట్స్ చేస్తున్నారు. విజయ్, మృణాల్ ఫర్ ఫార్మెన్స్ బాగుందని, హీరో తన గురించి ఆలోచించుకోకుండా ఫ్యామిలీ కోసం నిలబడటం ఇన్ స్పైరింగ్ గా ఉందంటూ వారు పోస్ట్స్ చేస్తున్నారు. 


కొందరు కావాలని చేసిన నెగిటివ్ ప్రచారంలోనూ విజయ్ క్రేజ్ తో ఫ్యామిలీ స్టార్ సినిమా మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ తో ఆ దుష్ప్రచారం అంతా తేలిపోయింది. ఇండియాలోనే కాదు అమెరికాలోనూ ఫ్యామిలీ స్టార్ సినిమాను ప్రైమ్ వీడియోలో చూస్తున్నవారు సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మిగతా సినిమాల్లాగే ఫ్యామిలీ స్టార్ లోనూ కొన్ని మిస్టేక్స్ ఉన్నా సినిమా అన్ని అంశాల్లో బాగుందని చెబుతున్నారు. ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రెస్పాన్స్ తో సోషల్ మీడియా నెగిటివ్ ప్రాపగండా నమ్మొద్దనే రియలైజేషన్ ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఇది విజయ్ దేవరకొండ నెక్ట్ సినిమాలకు తప్పకుండా ఉపయోగపడనుంది.

Art Makers Production No1 Movie Launched

 పూజా కార్యక్రమాలతో ఆర్ట్ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 ఘనంగా ప్రారంభం



తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన దర్శకులు, నిర్మాతలు తీస్తోన్న చిత్రాలు విజయాన్ని సాధిస్తున్నాయి. కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్ట్ మేకర్స్ సమర్పణలో మద్దుల మదన్ కుమార్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సౌజన్య కావూరి నిర్మిస్తున్న ఈ మొదటి ప్రాజెక్ట్ ప్రొడక్షన్ నెం.1కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలె మణికొండలోని శివాలయంలో జరిగాయి. 


ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ గారు, విరాజ్ అశ్విన్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో పురాణపండ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. ‘సినీ రంగంలోకి  వస్తోన్న కొత్త తరంలో కూడా ఎందరో ప్రతిభా సామర్ధ్యాలతో అద్భుతాల్ని ఆవిష్కరిస్తున్నారని, ఏ విత్తనంలో ఎంతటి అద్భుత మహా వృక్షం దాగుందో తెలియకుండా విశ్లేషించకూడద’ని అన్నారు.


ముహూర్తపు సన్నివేశానికి హీరో  రవితేజ మహాదాస్యంపై ‘బేబీ’ ఫేమ్ విరాజ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రానికి దియా, సంజీవ్ కోనేరు, వెంకట్ రమణారెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫర్‌గా నితిన్ రెడ్డి చిమ్ముల , ఎడిటర్‌గా అఖిల్ దేశ్‌పాండే పని చేస్తున్నారు.


సాంకేతిక బృందం

కెమెరామెన్ : నితిన్ రెడ్డి చిమ్ముల 

ఎడిటింగ్ : అఖిల్ దేశ్పాండే

సహా నిర్మాతలు : దియా, సంజీవ్ కోనేరు, వెంకట్ రమణారెడ్డి

సంభాషణలు,  పాటలు : జక్క రాజశేఖర్ రెడ్డి

ఆర్ట్ డైరెక్టర్  : మక్కెన విజయ్

పీఆర్వో  : సాయి సతీష్ (SR PROMOTIONS)

Star Writer Abburi Ravi Interview About Aa Okkati Adakku

'ఆ ఒక్కటీ అడక్కు' కంటెంట్ అందరికీ కనెక్ట్ వుంది. సిట్యువేషనల్ కామెడీ హిలేరియస్ గా వుంటుంది. ఎమోషన్ ప్రేక్షకులని హత్తుకుంటుంది: స్టార్ రైటర్ అబ్బూరి రవి



కామెడీ కింగ్ అల్లరి నరేష్  ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు' తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా  హీరోయిన్ గా నటిస్తున్నారు. స్టార్ రైటర్ అబ్బూరి రవి చిత్రానికి డైలాగ్స్ అందించారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో డైలాగ్ రైటర్ అబ్బూరి రవి విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


'ఆ ఒక్కటీ అడక్కు' లాంటి కథ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన అంశాలు ఏమిటి ?

-ఈ కథ దర్శకుడు మల్లి గారిది. ప్రతి ఒక్కరి జీవితంలో సెటిల్ అవ్వడం అంటే ఉద్యోగం రావడం, పెళ్లి కావడం. అయితే ఇప్పుడు పెళ్లి విషయంలో యావరేజ్ ఏజ్ మారిపోతుంది. ఒకప్పుడు ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత చేసుకునేవారు. ఇప్పుడు ఎప్పుడు చేసుకుంటారో ఎవరికీ తెలీదు. అందరూ సెటిల్మెంట్ గురించే మాట్లాడతారు. ఈ సినిమాలో ఒక మాట వుంటుంది. 'సెటిల్మెంట్ అంటే ఉద్యోగం, పెళ్లి కాదు.. మనకి ఒక అవసరం వచ్చినపుడు పక్కవాడి దగ్గర చేయి చాచకపోవడం''. ఇప్పుడు కొన్నిటికి అర్ధాలు మారిపోయాయి. పెళ్లి అనేది పూర్తిగా శాస్త్రోక్తమైనది. పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టడం వెనుక సైన్స్ వుంది. జీలకర్ర బెల్లంలో ఎలక్ట్రసిటీ ప్రవహిస్తుంది. ఇద్దరి ఎనర్జీని బ్యాలెన్స్ చేసే ప్రక్రియ అది. ఆ సమయంలో ఆత్మ స్థానాన్ని చూడామని చెబుతారు. ఇంత శాస్త్రం వున్న పెళ్లిని లెక్కలేకుండా చేసుకునే పరిస్థితులు చూస్తున్నాం. పైగా పెళ్లి ఆలస్యంగా జరుగుతుంటే.. మనకి ఎంత లేట్ అయితే అంత ఆనందపడేవారు వుంటారు(నవ్వుతూ). అలాగే పెళ్లి ఆలస్యమైతే మానసికంగా క్రుంగుబాటుకి గురైనవారు కూడా వుంటారు. నిజానికి ఇది సీరియస్ ఇష్యూ. ఇలాంటి సబ్జెక్ట్ ని వినోదాత్మకంగా చెబుతూనే ఎమోషనల్ కనెక్ట్ చేసేలా చూపించడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా సందేశం ఇవ్వడం లాంటిది వుండదు. కానీ ఒక జీవిత అనుభవాన్ని పంచుకునేలా ఆలోజింపచేసేలా వుంటుంది.  


ఈ కథకు 'ఆ ఒక్కటీ అడక్కు' లాంటి క్లాసిక్ టైటిల్ తీసుకోవడం ఎలా అనిపించింది ?

-నిజానికి భయం వేసింది. ఈవీవీ గారి క్లాసిక్ సినిమా అది. అయితే ఈ టైటిల్ ని నరేష్ గారే ప్రతిపాదించారు. ఈ కథకు ఈ టైటిల్ సరిపొతుందని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకున్నాకే పెట్టడం జరిగింది.


ఇందులో పెళ్లి గురించి ఎలాంటి అంశాలు చెప్పబోతున్నారు?

-పెళ్లి పవిత్రమైనది. ఒకప్పుడు ఇంట్లో పెళ్లి చూపులు జరిగేవి. అప్పుడు ఇంట్లో సాంఘిక పరిస్థితులు తెలిసేవి. కుటుంబం గురించి అర్ధమైయింది. ఇప్పుడు చాలా వరకూ హోటల్స్ లో పెళ్లి చూపులు జరగడం, సోషల్ మీడియా, రీల్స్ చూసి పెళ్లి చూపులు చూసుకునే సందర్భాలు రావడంతో అసలు పరిస్థితులు అర్ధం కావడం లేదు. పెళ్లి అనేది అంత తేలిగ్గా వుండకూడదు కదా. ఒక బంధం బలంగా నిలబడాలంటే చాలా జాగ్రత్తగా వుండాలి. ఇలాంటి చాలా ఆసక్తికరమైన అంశాలని ఇందులో ప్రేక్షకులని ఆకట్టుకునే చూపించడం జరిగింది.


కామెడీ,  ఎమోషన్ ని ఎలా బ్యాలెన్స్ చేశారు ?

-ఇందులో క్యారెక్టర్, సిట్యువేషన్ లో కామెడీ వుంది. సిట్యువేషన్, కంటెంట్ లో మేటర్ వుంటే కామెడీ అద్భుతంగా రాయొచ్చు. ఇందులో సహజంగానే కామెడీ వుంది. ప్రేక్షకుల మొహంలో సహజంగానే నవ్వు విచ్చుకుంటుంది. ఇందులో నరేష్ గారికి జామి లివర్ కి మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ హిలేరియస్ గా వుంటాయి. సిట్యువేషన్ వుంటే ఆటోమేటిక్ గా ఫన్ రాయొచ్చు. ఇది పెళ్లికాని ప్రతి వారు కోరుకునే కంటెంట్. క్లీన్ ఎంటర్ టైనర్.


నరేష్ గారు కామెడీ రోల్స్ తో పాటు ఇంటెన్స్ ఎమోషనల్ రోల్స్ కూడా చేశారు.. అప్పటికి ఇప్పటికి ఆయనకి ఏది బాగా నప్పుతుందని భావిస్తున్నారు ?

-నరేష్ గారు అన్నీ అద్భుతంగా చేయగలరు. కాకపొతే మనం ఎక్కువ ఆయనలో అల్లరిని ఇష్టపడ్డాం. ఇప్పటికీ ఎవరిని నడిగినా 'గాలి శీను' అంటారు, 'నేను' సినిమా గురించి చెప్తారు. ఆయన అన్నీ చేయగలరు. దర్శకుడు కోరుకునే పాత్ర కోసం ఆయన ఏం కావో అది చేస్తారు. ఈ సినిమా నరేష్ గారి జోనర్. ఆయన క్యారెక్టరైజేషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. టైమింగ్ అద్భుతంగా వుంటుంది. తప్పకుండా వర్క్ అవుట్ అవుతుంది.  


ఫస్ట్ కాపీ చుసుకున్నప్పుడు ఎలా అనిపించింది ?

-చాలా హ్యాపీగా అనిపించింది. ఇంటర్వెల్ అద్భుతంగా అనిపించింది. అలాగే ఈ సినిమాకి సోల్ అయిన క్లైమాక్స్ అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యింది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం.


ఒక కొత్త దర్శకుడు కథతో మీ దగ్గరికి వచ్చినపుడు వారికి ఎలాంటి కంఫర్ట్ ఇస్తారు ?

-ఒక దర్శకుడు హీరోకి, నిర్మాతకి కథ చెప్పి ఒప్పిస్తాడు. అంటే తను ప్రూవ్ చేసుకున్నట్లే. ఎవరొచ్చినా ఇదే మాట చెబుతా. మన మధ్య ఒక కథ వుంది. ఆ కథకు ఎలాంటి న్యాయం చేయాలో దాని గురించే చర్చిద్దామని స్పష్టంగా చెబుతా. కొత్త, పాత అని వుండదు. ఏ దర్శకుడితోనైనా పని చేసే విధానం ఒకేలా వుంటుంది. దర్శకుడు తీసుకొచ్చిన కథని గొప్పగా ఎలా చెప్పాలన్నదే ఆలోచిస్తాను.


ఇందులో లవ్ ట్రాక్ ఎలా వుంటుంది ?

-ఇందులో లవ్ ట్రాక్ ఫన్నీగా వుంటుంది. చాలా ఆసక్తికరంగా వుంటుంది. రెగ్యులర్ కి భిన్నంగా వుంటుంది.

వెన్నెల కిషోర్, వైవా హర్ష పాత్రలు కూడా హిలేరియస్ గా వుంటాయి. ఫన్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.


మీరు దర్శకత్వం ఎప్పుడు చేస్తారు ?

-చేస్తాను. నా ప్రయత్నాల్లో నేను వున్నాను. తప్పకుండా చేస్తాను.


ఈ సినిమా నిర్మాత గురించి ?  

-రాజీవ్ గారికి పెద్ద యానిమేషన్ కంపెనీ వుంది. దాదాపు ఆరువందలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఆయన ఆఫీస్ కి వెళ్లి చూశాను. చాలా సింపుల్ గా వుంటారు. ఆయన బ్యానర్ కి మంచి జరగాలని ఎప్పుడూ కోరుకుంటాను. ఆయన మనిషిని మనిషిలా ట్రీట్ చేస్తారు. అలాంటి వ్యక్తులు పరిశ్రమలో నిలబడాలని కోరుకుంటున్నాను.  


పరిశ్రమలో ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు కదా.. ఈ జర్నీ ఎలా వుంది ?

-చాలా బావుంది. నిజానికి ఎన్ని సినిమాలు రాశానో కూడా తెలీదు.(నవ్వుతూ).


గోపి సుందర్ మ్యూజిక్ గురించి ?

-ఇందులో ఒక పాటకు తప్పించి మిగతా పాటల మ్యూజిక్ సిట్టింగ్ లో కూర్చున్నాను. కథకు కావాల్సిన పాటలు ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఒకసారి కథపై పట్టుదొరికాక ఇంక ఆయన చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు మనసులో వున్న ట్యూన్ ని ఇస్తారు. ఇందులో పాటలు, నేపధ్య సంగీతం హత్తుకునేలా వుంటాయి.


కొత్తగా రాస్తున్న సినిమాలు ?

-గూఢచారి2, డెకాయిట్ జరుగుతున్నాయి.


మళ్ళీ నటించే అవకాశం ఉందా ? మీకు ఎలాంటి జానర్స్ ఇష్టం ?

-ప్రస్తుతానికి నటనపై ద్రుష్టి లేదు. యాక్షన్ థ్రిల్లర్స్ ని ఇష్టపడతాను.


ఆల్ ది బెస్ట్

-థాంక్ యూ


Aa Okkati Adakku Censor Completed

 Allari Naresh, Faria Abdullah, Malli Ankam, Rajiv Chilaka, Chilaka Productions Aa Okkati Adakku Bestowed With U/A Censor Certificate, A Crisp Runtime Locked



Comedy King Allari Naresh is going to offer limitless amusement in the upcoming wholesome entertainer Aa Okkati Adakku directed by Malli Ankam and produced by Rajiv Chilaka on Chilaka Productions. Bharath Laxmipati is the co-producer. Faria Abdullah is the leading lady opposite Allari Naresh.


The movie completed its censor formalities and it was bestowed with a U/A certificate. Aa Okkati Adakku is a clean family entertainer which is going to create a laughing riot in theatres, this summer. The crisp runtime of 2:14 hours ensures there will be no boring scenes in the movie.


Aa Okkati Adakku has a universal point that will connect to the youth. It will see Allari Naresh in the role of a central govt job holder as a registrar who struggles to get married. It’s a first-of-its-kind subject in Telugu cinema till now. Faria will be seen as Siddi and she is a perfect match for Allari Naresh. While the pairing looks fresh on screen, both will enthrall with their comic timings.


In the first half, the Pelli Choopulu scene, the marriage reception scene, the marriage bureau scene with Allari Naresh and Vennela Kishore, Jamie Lever's performance and Swayamvar song will be the best parts, wherein Viva Harsha comedy episodes, Shakalaka Shankar scene, and Court scene featuring hero, heroine, Murali Sharma, and Gouthami will be the highlights in the second half.


After a long time, Allari Naresh has done an out-and-out entertainer, and movie buffs are waiting eagerly to see him in a humorous character. So, get ready for unlimited fun in theatres.

TRAILER FOR DISNEY’S “MUFASA: THE LION KING” ARRIVES

 అడవికి రాజు గర్జించే సమయం ఆసన్నమైంది



బ్లాక్ బస్టర్ లెగసీ మళ్ళీ ప్రారంభం అయ్యింది: డిస్నీ యొక్క ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ఈ డిసెంబర్ 20న విడుదల కానుంది.


 ప్రైడ్ లాండ్స్ లో ముఫాసా ఎదుగుదల ఎలా జరిగింది అనేది ఎక్స్ప్లోర్ చెయ్యడమే ఈ కథాంశం.


ప్రపంచ వ్యాప్తంగా ‘ది లయన్ కింగ్’ సినిమాకి అభిమానులు ఉన్నారు. 1994లో వచ్చిన యానిమేషన్ సినిమా నుండి ఈ పరంపర మొదలైంది. ఆ మానియా ఎన్నాళ్ళైనా తగ్గకపోయేసరికి మేకర్స్ రియలిస్టిక్ 3D యానిమేషన్ లో ఇంకో సారి చిత్రీకరించి 2019లో విడుదల చేశారు. అది కుడా పెద్ద సక్సెస్ అయ్యింది. 


ఇప్పుడు ‘కింగ్: ముఫాసా’ కథని బేస్ చేసుకుని ప్రైడ్ లాండ్స్ లో ముఫాసా ఒక రాజుగా ఎలా ఎదిగాడు అనే కథాంశం మీద ఈ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ని ఈ డిసెంబర్ 20న విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉన్న సినిమా కాబట్టి ప్రేక్షకుల నుండి ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో విశేష స్పంధన ట్రైలర్ కు లభించింది.


ఈ చిత్రాన్ని బ్యారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్నారు, ప్రేక్షకులకి రియలిస్టిక్ ఫీలింగ్ కలిగేలా లైవ్ యాక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్స్ని ఫోటో రియల్ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెరీలో తీస్తున్నారు. ఈ మానియాని ఎంజాయ్ చెయ్యడానికి dec 20 కోసం ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ఫాన్స్ ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

Family Hero Srikanth Inaugurated Babai Hotel in Nallagandla

 నల్లగండ్లలో బాబాయ్ హోటల్‌ను ప్రారంభించిన హీరో శ్రీకాంత్ 



బాబాయ్ హోటల్ తెలుగు రాష్ట్రాల్లోని ఫుడ్ లవర్స్‌కు అడ్డాగా మారింది. అద్భుతమైన రుచులతో అన్ని రకాల టిఫిన్స్‌ను అందిస్తోంది. ఈ ఐకానిక్ రెస్టారెంట్ ప్రస్తుతం అన్ని ఏరియాల్లోకి విస్తరిస్తోంది. 2022లో బాబాయ్ హోటల్ హైదరాబాద్‌కు వచ్చింది. గత నెలలో మాదాపూర్‌లో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో తమ ఐదవ బ్రాంచ్‌ను కూడా ప్రారంభించేశారు.


 కెవి దినేష్ రెడ్డి, శ్రేష్ఠ రెడ్డి కలిసి మదీనా గూడ, మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన రెండు బ్రాంచ్‌లు విజయ వంతంగా దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో లింగంపల్లిలోని నల్లగండ్లలో ఇప్పుడు బాబాయి హోటల్ మూడో బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ రెస్టారెంట్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. బాబాయ్ హోటల్ నిర్వాహకులు కెవి దినేష్ రెడ్డి, శ్రేష్ఠ రెడ్డి, మరికొందరు అతిథులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించడం పట్ల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేస్తూ నల్లగండ్లలో న్యూ బ్రాంచ్‌ను ప్రారంభించిన హీరో శ్రీకాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Guttu Chappudu Teaser Launched

సాయి దుర్గాతేజ్‌, బ్రహ్మాజీల చేతుల మీదుగా

‘గుట్టు చప్పుడు’ టీజర్‌ లాంచ్‌



డాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్‌`ఆయేషాఖాన్‌ జంటగా, హను`మేన్‌ చిత్రంతో పాన్‌ ఇండియా సంగీత దర్శకుడిగా మారిన గౌర హరి సంగీత సారధ్యంలో మణీంద్రన్‌ దర్శకత్వంలో డా॥ లివింగ్‌స్టన్‌ నిర్మిస్తున్న రొమాంటిక్‌ మాస్‌ యాక్షన్‌ లవ్‌, ఎంటర్‌టైనర్‌ ‘గుట్టు చప్పుడు’. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ను తాజాగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్‌ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. అనంతరం ప్రసాద్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్‌ నటులు బ్రహ్మాజీ తన చేతుల మీదుగా విడుదల చేశారు. 


అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో బ్రహ్మాజీ మాట్లాడుతూ...

టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్‌ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకూ పూర్తయినట్టు ఉంది. టీజర్‌ను సాయి దుర్గాతేజ్‌ ఆన్‌లైన్‌లోను, నేను ఆఫ్‌లైన్‌లోను విడుదల చేయడం సంతోషంగా ఉంది. మా అబ్బాయి నటిస్తున్న 3వ సినిమా ఇది. మంచి నిర్మాత, టెక్నీషియన్స్‌ను కుదిరారు. భారీ బడ్జెట్‌తో తీశారు. దర్శకుడు కూడా తీసిన కంటెంట్‌ను మళ్లీ చెక్‌ చేసుకుంటూ జాగ్రత్తగా ఈ సినిమా చేశారు. ఈ టీజర్‌ చూసిన తర్వాత సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడిరది. ఇందులో ఎందుకో గానీ నాకు మాత్రం క్యారెక్టర్‌ ఇవ్వలేదు అని నవ్వుతూ అన్నారు.


నిర్మాత లివింగ్‌స్టన్‌ మాట్లాడుతూ... 

డైరెక్టర్‌ మణీంద్రన్‌ కథ చెప్పినప్పుడు ఎగ్జైట్‌గా ఫీలయ్యా. ఆయనతో నాకు 12 సంవత్సరాల అనుబంధం. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు మంచి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌తోనే చేయాలని ముందే డిసైడ్‌ అయ్యాము. అందుకే పాన్‌ ఇండియా రేంజ్‌కు ఎదిగిన సంగీత దర్శకులు హరి గారితో పాటు ఇతర టెక్నీషియన్స్‌ను కూడా మంచి వారిని ఎంచుకున్నాం. ఇదొక ప్రేమ, యాక్షన్‌, రొమాంటిక్‌తో పాటు మంచి మెసేజ్‌తో కూడిన సినిమా. హీరో సంజయ్‌ రెండు రకాల షేడ్స్‌ను అద్భుతంగా చేశారు. టీజర్‌లో మీరు చూసింది కొద్దిగానే. సినిమాలో ఇంకా మంచి స్టఫ్‌ ఉంది. క్లైమాక్స్‌ ఫైట్‌ను ముందుగా 15 లక్షలతో అనుకున్నప్పటికీ, క్వాలిటీ కోసం దాదాపు 75 లక్షల రూపాయలతో జహీరాబాద్‌ షుగర్‌ ఫ్యాక్టరీలో తీశాం. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ అందరికీ థ్యాంక్స్‌. ముఖ్యంగా సాయిదుర్గా తేజ్‌ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం అన్నారు.


సంగీత దర్శకుడు గౌర హరి మాట్లాడుతూ...

నేను మండుటెండలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ప్రయాణం మొదలు పెట్టిన తరుణంలో ఈ సినిమా నాకు చెప్పులు దొరికినట్లు దొరికిన అద్భుత అవకాశం. మణీంద్రన్‌ గారు నన్ను చాలా నమ్మారు. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయలేదని భావిస్తున్నాను. సినిమాలో మంచి కంటెంట్‌ ఉంది. సంగీతానికి మంచి స్కోప్‌ ఉండేలా దర్శకుడు కథను రాసుకోవడం నాకు బాగా ప్లస్‌ అయ్యింది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌ అన్నారు. 


దర్శకుడు మణీంద్రన్‌ మాట్లాడుతూ...

ముందుగా నేను చెప్పిన బడ్జెట్‌కన్నా ఎక్కువ అవుతున్నా.. నా వర్క్‌ చూసిన నిర్మాత లివింగ్‌స్టన్‌ గారు ఎక్కడా అడ్డు చెప్పకుండా సహకరించిన విధానం హేట్సాఫ్‌. అలాగే హీరో గారు కూడా బాగా సహకరించారు. అందుకే సినిమా ఇంత గ్రాండ్‌గా వచ్చింది. ప్రతి టెక్నీషియన్‌ నేను ఏది ఆశిస్తున్నానో.. అంతకుమించి అవుట్‌పుట్‌ ఇచ్చారు. ఆర్టిస్ట్‌లు కూడా చక్కటి సహకారం అందించారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ గౌర హరి గారితో నాకు 10 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆయన సంగీతం ఈ సినిమాకు హైలైట్‌. డబ్బులు పెట్టి టిక్కెట్‌ కొనుక్కుని థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుణ్ణి డబ్బుకు మించిన ఆనందాన్ని ఇచ్చే సినిమా ఇది.


హీరో సంజయ్‌రావు మాట్లాడుతూ...

ఇది నాకు 3వ సినిమా. ప్రతి టెక్నీషియన్‌ వారి బెస్ట్‌ అవుట్‌పుట్‌ 100 శాతం ఇచ్చారు. అలాగే ఆర్టిస్ట్‌లు కూడా. సంగీత దర్శకుడు గౌర హరిగారు నన్ను కలిసి వినిపించిన తొలి ట్యూన్‌తోనే ఆయన్నే పెట్టుకోవాల్సిందిగా నేను రికమెండ్‌ చేశాను. దర్శకుడు మణీంద్రన్‌ నాకు మంచి మిత్రుడు కూడా. అలాగే నిర్మాత లివింగ్‌స్టన్‌ గారు కూడా అంతే. వీరిద్దరి వల్లే నా జీవితభాగస్వామిని కలవడం జరిగింది. లింగ్‌స్టన్‌ గారు అనుకున్న దానికన్నా బడ్జెట్‌ను భారీగానే పెంచుకుంటూ వస్తున్నారు. కేవలం సినిమా వస్తున్న క్వాలిటీ విధానం ఆయనకు నచ్చే ఇలా జరిగింది. ఇది నాకు మంచి టర్నింగ్‌పాయింట్‌ ఇచ్చే సినిమా. అన్ని వర్గాలను ఆకట్టుకునే అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయి. టీం అందరికీ సూపర్‌ సక్సెస్‌ ఇచ్చే సినిమా ఇది అన్నారు. 

అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనిట్‌ సభ్యులు ఈ సినిమా ఘన విజయం సాధించి తమకు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ప్రసంగించారు. 

ఈ చిత్రానికి సంగీతం: గౌర హరి, కెమెరా: శ్రీకాంత్‌ గేదెల, ఎడిటర్‌: తలారి సాయిబాబు, మాటలు: వై. సురేష్‌ కుమార్‌, ఆర్ట్‌: నాగు Ê కల్యాణ్‌, ఫైట్స్‌ : శంకర్‌, మేకప్‌: వెంకట్‌, సీజీ: చందు ఆది Ê టీం, కాస్ట్యూమ్స్‌: శ్రీ గణేష్‌, డాన్స్‌: ప్రశాంత్‌ మాస్టర్‌, పి.ఆర్‌.ఓ: సురేష్‌ కొండేటి, నిర్మాత: లివింగ్‌స్టన్‌, రచన, దర్శకత్వం: మణీంద్రన్‌. 

Jhanvi Narang Announces A Complete Entertainer With Priyadarshi

 With The Blessings Of Narayan Das Narang, Suniel Narang, Bharat Narang Of SVCLLP, Rana Daggubati’s Spirit Media, Jhanvi Narang Announces A Complete Entertainer With Priyadarshi, Navaneeth Sriram



With the blessings of Narayan Das Narang announced Production No. 9 of Sree Venkateswara Cinemas LLP (SVCLLP). Rana Daggubati’s Spirit Media presents the movie starring the in-form Priyadarshi who is enjoying the best phase of his career. Navneeth Sriram is making his directorial debut with the movie which marks the maiden production venture for Jhanvi Narang who was awarded the Prestigious TIMES POWER WOMEN 2024 Award.


Priyadarshi who attained big success with Balagam scored a blockbuster this year with Om Bheem Bush. While the Save The Tigers franchise is one of the biggest hit Telugu originals of all time, Priyadarshi has a wonderful line-up of films.


This new movie is a quirky romantic tale with a fresh concept, where Priyadarshi will be seen in a different yet hilarious role. The movie gets a catchy tagline “Thrill-u Praptirasthu”, which indicates the kind of experience it is going to give in cinemas.


Jhanvi Narang, under guidance of Suniel and Bharat Narang, is planning to make some content-rich movies and this out-and-out-entertainer that will appeal to all sections will be a first attempt. She is fortunate to have the patronage of a star like Rana Daggubati who has vast experience in production and a virtuoso in selecting scripts.


The script work of the movie is complete and pre-production will kick start soon. The movie is set to go on floors in January, 2025. The film’s title will be revealed soon along with cast and crew details.


Cast: Priyadarshi


Technical Crew:

Writer, Director: Navaneeth Sriram

Producer: Jhanvi Narang

Presenters: Sree Venkateshwara Asian Cinemas LLP and Rana Daggubati 

Banners:SVCLLP and Spirit Media 

PRO: Vamsi-Shekar

Heroine Faria Abdullah Interview About Aa Okkati Adakku

‘ఆ ఒక్కటీ అడక్కు' కథ, కాన్సెప్ట్ బ్యూటీఫుల్ గా వుంటుంది. ఇందులో అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ వుంది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు: హీరోయిన్ ఫరియా అబ్దుల్లా    



కామెడీ కింగ్ అల్లరి నరేష్  ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు' తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా  హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


'ఆ ఒక్కటీ అడక్కు' లో మీ పాత్ర ఎలా వుండబోతుంది? ఈ కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?

-ఇందులో నా పాత్ర పేరు సిద్ధి. నా పాత్ర చాలా స్వేఛ్చగా వుటుంది. అన్ని ప్లాన్ చేసి, నిబంధనలు పెట్టుకొని అందులోనే బ్రతకడం తనకి ఇష్టం వుండదు. హీరో పాత్ర నా పాత్రకు భిన్నంగా వుంటుంది. తను అన్నీ ప్లాన్ ప్రకారం వుంటారు. ఈ రెండు పాత్రల మధ్య మంచి కాన్ఫ్లిక్ట్ వుంటుంది. అదే సమయంలో మంచి ఎట్రాక్షన్ వుంటుంది. కథ పెళ్లి అనే అంశం చుట్టూ ఉంటూ అందరినీ ఆకట్టుకునేలా వుంటుంది. ‘ఆ ఒక్కటీ అడక్కు' కథ, కాన్సెప్ట్ బ్యూటీఫుల్ గా వుంటుంది.


ఈ పాత్ర చేయడం సవాల్ గా అనిపించిందా ?

-సవాల్ గా అనిపించలేదు. ఎందుకంటే..నేను కూడా ఫ్రీ ఫ్లో లోనే వుంటాను. నాకు చాలా కనెక్ట్ అయిన పాత్ర ఇది. దర్శకుడు కథ చెప్పినపుడు కంటెంట్ చాలా నచ్చింది. ఈ రోజుల్లో అందరికీ అవసరమయ్యే కంటెంట్ ఇది.  


జాతిరత్నాలులో మంచి హ్యుమర్ వున్న పాత్ర చేశారు కదా.. ఇందులో కామెడీ ఎలా వుంటుంది ?

-ఇందులో కామెడీ చాలా డిఫరెంట్ గా వుంటుంది. పరిస్థితుల నుంచే పుట్టే హాస్యం వుంటుంది. ఇందులో కామెడీ చాలా నేచురల్ గా పుడుతుంది. ఇందులో కంటెంట్ ప్రేక్షకులని సహజంగా నవ్విస్తుంది.


నరేష్ గారు లాంటి అద్భుతమైన కామెడీ టైమింగ్ వున్న హీరోతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

-నరేష్ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్. షూటింగ్ చాలా సరదాగా జరిగింది. నరేష్ గారి కామెడీ టైమింగ్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంటుంది. ఈ సినిమాతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తారు. ఇందులో చాలా హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ వుంటుంది.  


దర్శకుడు మల్లి అంకంతో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

-దర్శకుడు మల్లి గారు నాకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారు. అది నాకు చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. అలాగే కథ గురించి చాలా చర్చించేవారు. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన అందరి సలహాలు తీసుకుంటారు. ఎప్పుడూ నవ్వుతూనే వుంటారు. సినిమా షూటింగ్ అంతా ఫన్ గా జరిగింది.


ఇందులో పెళ్లి గురించి ఎలాంటి అంశాలు చర్చించారు ?

-పెర్ఫెక్ట్ వైఫ్, పెర్ఫెక్ట్ హుస్బెండ్ ..అంటూ చాలా సెలెక్టివ్ గా అమారిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక. ఒకప్పుడు పెళ్లిలకి, ఇప్పటి పెళ్లిలకి చాలా మార్పులు వచ్చేశాయి. మ్యాట్రీమొనీ సైట్స్ లో ఎలా డీల్ చేస్తారనే అంశంతో పాటు పెళ్లికి సంబధించిన అనేక అంశాలు ఇందులో చాలా ఆసక్తికరంగా చూపించాం.


నిర్మాతల గురించి ?

-రాజీవ్ చిలక గారు చాలా పాషన్ వున్న నిర్మాత. సినిమాని ఎక్కడా రాజీపడకుండా చాలా గ్రాండ్ గా నిర్మించారు. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. వారి నిర్మాణంలో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది.


ఒక పాత్ర ఎంపిక చేసుకున్నపుడు ఏ అంశాలు చూస్తారు ?

-పాత్ర ప్రాధాన్యత, నిడివి అన్నీ చూస్తాను. కొన్ని క్యామియో రోల్స్ కూడా చేశాను. రవితేజ గారితో వర్క్ చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. రావణాసురలో అవకాశం వచ్చింది. అది హీరోయిన్ పాత్ర అని చెప్పలేను కానీ ఆ పాత్ర చేయడం చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది.


భవిష్యత్ ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు ?

-టిపికల్ హీరోయిన్ గా మాస్ మసాలా సినిమా చేయాలని వుంది. అలాగే హారర్ థ్రిల్లర్ చేయాలని వుంది. అలాగే కామెడీ సినిమా చేయాలని వుంది. ఇప్పుడు పరిశ్రమలో యాక్షన్ సినిమాలు చేసే హీరోయిన్స్ తక్కువగా వున్నారు. ఆ ఖాళీని భర్తీ చేయాలని వుంది. యాక్షన్ సినిమాలు నాకు బాగా నప్పుతాయని భావిస్తున్నాను.


జాతిరత్నాలు 2 ఎప్పుడు ?

-ప్రస్తుతం నిర్మాతలు ‘ప్రాజెక్ట్ కె’ లో బిజీగా వున్నారు. అది చాలా పెద్ద ప్రాజెక్ట్.  కల్కి కోసం నేనూ ఎదురుచూస్తున్నాను. కల్కి విడుదల తర్వాత జాతిరత్నాలు 2 కోసం ఆలోచిస్తారేమో అనుకుంటున్నాను.  


కొత్తగా చేస్తున్న చిత్రాలు ?

-'మత్తువదలరా 2' చేస్తున్నాను. గోపి దర్శకత్వంలో భగవంతుడు అనే సినిమా చేస్తున్నాను. అలాగే ఓ తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. కొన్ని తమిళ. మలయాళం కథలు కూడా వింటున్నాను.  


ఆల్ ది బెస్ట్

-థాంక్ యూ 

Baak Censor Completed

సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా, అవ్నీ సినిమాక్స్, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP క్రేజీ థ్రిల్లర్ 'బాక్' సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్- మే3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్



అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాల్గవ చిత్రం అరణ్మనై 4 తెలుగులో 'బాక్' పేరుతో వస్తోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్.  


తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.  మే 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  


ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన  'పంచుకో' పాట అద్భుతమైన రెస్పాన్స్ తో చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.


అవ్నీ సినిమాక్స్  P Ltd పతాకంపై ఖుష్బు సుందర్, ACS అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.


ఈ చిత్రానికి కృష్ణమూర్తి డీవోపీగా పని చేస్తుండగా, ఎడిటింగ్‌ను ఫెన్నీ ఆలివర్‌ పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్.  


తారాగణం: సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా, వై వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్,  కోవై సరళ


సాంకేతిక సిబ్బంది:

కథ & దర్శకత్వం: సుందర్ సి

నిర్మాతలు: ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్

బ్యానర్: అవ్నీ సినిమాక్స్క్స్ P Ltd.

తెలుగు రిలీజ్: ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి

సంగీతం: హిప్హాప్ తమిళా

సినిమాటోగ్రాఫర్: ఇ కృష్ణమూర్తి అకా కిచ్చ

ఎడిటర్: ఫెన్నీ ఆలివర్

ఆర్ట్: గురురాజ్

కొరియోగ్రఫీ: బృందా మాస్టర్

స్టంట్స్: రాజశేఖర్

పీఆర్వో: వంశీ-శేఖర్

 

Harom Hara Worldwide Theatrical Release On May 31st

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న సుధీర్ బాబు, జ్ఞానసాగర్ ద్వారక, సుమంత్ జి నాయుడు, ఎస్‌ఎస్‌సి 'హరోం హర' ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్



సుధీర్‌బాబుకు తన మామగారు సూపర్‌స్టార్ కృష్ణ అంటే చాలా గౌరవం. కృష్ణ పుట్టినరోజు నాడు తన సినిమాల కంటెంట్ ఏదైనా విడుదల చేస్తుంటారు. ఈసారి తన అప్ కమింగ్ మూవీ 'హరోం హర' చిత్రాన్ని ఇండియన్ ఫస్ట్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న విడుదల చేయనున్నట్లు యూనిట్ అనౌన్స్ చేసింది. ఇది పర్ఫెక్ట్ డేట్. వేసవి సెలవుల దృష్ట్యా జూన్ రెండవ వారంలో పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరవడానికి కొన్ని వారాల కంటే ఎక్కువ సమయం ఉంటుంది.


రిలీజ్ డేట్ పోస్టర్  పోస్టర్‌లో సుధీర్ బాబు చేతిలో వేలాయుధం ఉంది, అతని వెనుక ఉన్న వ్యక్తులు గౌరవ సూచకంగా చేతులు ఊపుతున్నారు. సూపర్ బాబు ఫెరోషియస్ గా కనిపిస్తున్న పోస్టర్ అదిరిపోయింది.


ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌కు సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక శర్మ కథానాయికగా నటిస్తుండగా, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.


హరోం హర 1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్. ఈ సినిమా కోసం కంప్లీట్ గా మేకోవరైన సుధీర్ బాబు కుప్పం స్లాంగ్‌లో డైలాగులు చెప్పనున్నారు. ది రివోల్ట్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  


చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మొదటి పాట ఇంటెన్స్‌గా ఉండగా, ఇటీవల విడుదలైన సెకండ్ సింగిల్ సోల్‌ఫుల్ మెలోడీగా ఉంది. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.


ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.


తారాగణం: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం - జ్ఞానసాగర్ ద్వారక

నిర్మాత - సుమంత్ జి నాయుడు

సంగీతం - చైతన్ భరద్వాజ్

డీవోపీ - అరవింద్ విశ్వనాథన్

ఎడిటర్ - రవితేజ గిరిజాల

బ్యానర్ - శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్

పీఆర్వో - వంశీ శేఖర్

 

'Kalki 2898 AD' to hit theatres on 27th June 2024

 రెబల్ స్టార్ ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్, సి. అశ్విని దత్ వైజయంతీ మూవీస్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’ జూన్ 27, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల  



ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' జూన్ 27, 2024న ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ వంటి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ తో సహా  దీపికా పదుకొణె, దిశా పటాని లాంటి ప్రముఖ తారాగణంతో రూపొందతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


విడుదల తేదీకి సరిగ్గా రెండు నెలల ముందు ఈరోజు చేసిన అనౌన్స్మెంట్ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఎక్సయిట్మెంట్ మరింత పెంచింది. సోషల్ మీడియా ద్వారా, మేకర్స్ ఈ బిగ్గెస్ట్ న్యూస్ ను అనౌన్స్ చేశారు.


https://x.com/vyjayanthifilms/status/1784189849282761177?s=46&t=td36fd1VqvQ20yDywt6_9Q


అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ పాత్రను ఇటీవలి విడుదల చేసిన గ్లింప్స్ ద్వారా ప్రేక్షకులని 'కల్కి 2898 AD' వరల్డ్ లోకి తీసుకెళ్ళి ఆశ్చర్యపరిచారు.  ముఖ్యంగా లెజెండరీ యాక్టర్ అద్భుతమైన డి-ఏజింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ సర్ ప్రైజ్ చేసింది. ఈ ట్రూ పాన్-ఇండియా టీజర్ తెలుగు, తమిళం,  మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ సహా భాషల సమ్మేళనాన్ని ప్రజెంట్ చేసింది.


నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన 'కల్కి 2898 AD' ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్ గా అలరించనుంది. అన్ బిలివబుల్ తారాగణంతో వైజయంతీ మూవీస్ నిర్మాణంలో జూన్ 27, 2024న చాలా గ్రాండ్ గా విడుదల కానుంది.

Roti Kapada Romance" Team Celebrates Bekkam Venu Gopal's Birthday and Lucky Media's 18th Anniversary"

 రోటి కపడా రొమాన్స్ అందరికీ  నచ్చుతుంది



ప్రముఖ నిర్మాత బెక్కం వేణు గోపాల్ పుట్టినరోజు వేడుకను ‘రోటి కపడా రొమాన్స్’ చిత్ర బృదం ఘనంగా నిర్వహించారు. బెక్కం వేణు గోపాల్ ప్రారంభించిన లక్కీ మీడియా 18 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కూడా విశేషం.  


నిర్మాత సృజన కుమార్ బోజ్జం మాట్లాడుతూ: ఈ సినిమాతో నిర్మాతగా నా జర్నీ మొదలుపెట్టాను. బెక్కం వేణు గోపాల్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడూ ఇలానే సపోర్ట్ చెయ్యాలను కోరుకుంటున్నాను


హీరో హర్ష నర్రా మాట్లాడుతూ: మనం పుట్టినప్పుడు మన జీవితం మొదలవుతుంది కాని పది మందికి ఉపయోగపడినప్పుడే అసలైన జీవితం మొదలవుతుంది. లక్కీ మీడియా ద్వారా గత 18 సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపయోగపడిన బెక్కం గారికి 18వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈయన జీవితం మాకు చాలా స్పోర్తి దాయకం. మా సినిమా రోటి కాపాడ రొమాన్స్ అందరికీ నచ్చే యూత్ ఫుల్ సినిమా అండి. అందరూ చూడండి.


హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ: బెక్కం సర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా సినిమా డేట్ కూడా త్వరలోనే చెప్తాము.


హీరో తరుణ్ పొనుగోటి మాట్లాడుతూ: ఒక హీరో ఎంత మందితో వర్క్ చేసినా కూడా తనకి ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ని మర్చిపోలేము. బెక్కంగారు నాకు చాలా స్పెషల్, నా ఫస్ట్ సినిమా ఆయనతోనే చేస్తున్నాను.


హీరో సుప్రజ్ రంగా మాట్లాడుతూ: బెక్కం సర్ పుట్టినరోజు సందర్భంగా మా సినిమాకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఇవ్వండి సర్.


హర్ష ఖడియాలా మాట్లాడుతూ: నేను ఖూర్మ నాయకీ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాను, గత పదిహేనేళ్ళుగా నేను బెక్కం వేణు గోపాల్ గారి లక్కీ మీడియాలోనే పెరిగాను. ఆయనని చూసి , అయన దగ్గర పని నేర్చుకుని ఇప్పుడు నేను సొంతంగా చేసుకుంటున్నాను. ఈరోజు ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం చాలా ఆనందంగా ఉంది.


డైరెక్టర్ విక్రం రెడ్డి మాట్లాడుతూ: యంగ్ టాలెంట్ కి ముందు గుర్తొచ్చేది లక్కీ మీడియా, కొత్తగా డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ అవ్వాలి అంటే లక్కీ మీడియానే కేర్ అఫ్ అడ్రస్, నేను అలానే ఇక్కడి వరుకు వచ్చాను. మా సినిమాతో సర్ కి డబ్బులు బాగా రావాలని కోరుకుంటున్నాను


బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ: అందరికీ థాంక్స్. నేను నా సంస్థని 18 ఏళ్ళ ముందు మొదలుపెట్టినప్పటి నుండి నాతో ఉండి నాకు సపోర్ట్ చేసిన మీడియాకి చాలా థాంక్స్. ఒక్కొక్క సినిమా తీసుకుంటూ, ఎప్పుడు 18 ఏళ్ళు గడిచాయో కూడా తెలియలేదు. నేను ఈరోజు ఇక్కడ ఇలా ఉండడానికి ముఖ్య కారణం నా ఫ్యామిలీ, అలాగే నా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ లేకపోతే నేను ఈ పోసిషన్ లో నేను. నేను తీసిన ప్రతి సినిమాని నా ఫ్రెండ్స్ ఏ కొన్నారు. ఇప్పుడు వచ్చే రోటి కాపడా రొమాన్స్ కూడా మంచి హిట్ అవుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాని కొనుక్కుంటుంది, వాళ్ళే త్వరలో అనౌన్స్ చేస్తారు. చాలా మంచి సినిమా తీసాం అని మంచి సాటిస్ఫ్యాక్షన్  ఉంది.



టీం.

నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం

దర్శకుడు: విక్రమ్ రెడ్డి

డీఓపి: సంతోష్ రెడ్డి

హీరోలు : హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్ పొనుగోటి, సుప్రజ్ రంగా

హీరోయిన్స్ : సోనూ ఠాకూర్, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి, నువేక్ష

Premikudu Grand Re-Release on 1st May in 300+ Theaters Worldwide

ప్రభుదేవ నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమికుడు ప్రపంచవ్యాప్తంగా మే 1న 300 థియేటర్లలో అద్భుతమైన బుకింగ్స్ తో గ్రాండ్ రీ రిలీజ్



మెగా ప్రొడ్యూసర్ కే. టి.  కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవ, అందాల నటి నగ్మ నటించిన ప్రేమికుడు సినిమా రీ-రిలీజ్ అవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ రిలీజ్ కి సంబంధించిన వేడుక నేడు చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్ మరియు శోభారాణి గారు పాల్గొన్నారు.


30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ మే 1న 300 కు పైగా థియేటర్లలో ఘనంగా రి రిలీజ్ అవుతోంది. బుకింగ్స్ ఓపెన్ అయి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎస్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా జంటగా 30 సంవత్సరాల క్రితం వచ్చి యువతను ఆకట్టుకున్న సినిమా. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని పాటలు యువతనే కాకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభుదేవా తండ్రిగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారు నటించడం సినిమాకే పెద్ద ప్లస్ అయింది. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటలో ప్రభుదేవా తో సమానంగా ఎస్. పి. బాలు గారు డాన్స్ చేయడం విశేషం. టేకిట్ ఈజీ పాలసీ, ఓ చెలియా నా ప్రియ సఖియా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ సాంగ్స్. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.


నిర్మాత మురళీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ : ప్రేమికుడు సినిమాని 30 సంవత్సరాల తర్వాత మళ్లీ సీ ఎం ఆర్ సంస్థ పైన మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము. బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు వారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సినిమా రిలీస్ కి అంగీకరించి మాకు సహకరిస్తున్న మా మెగా ప్రొడ్యూసర్ కొంచెం మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అన్నారు.


శోభారాణి గారు మాట్లాడుతూ : మురళీధర్ రెడ్డి గారు, రమణ గారు, ప్రేమికుడు సినిమాని మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎంత సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రేమికుడు సినిమాని 4K క్వాలిటీలో విడుదల చేస్తున్నాము. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ ప్లే చేస్తున్నప్పుడు చాలా మంచి స్పందన లభించింది. ఒక మంచి లవ్ స్టోరీ అదేవిధంగా పొలిటికల్ డ్రామా కూడా ఈ ప్రేమికుడు సినిమాలో ఉన్నాయి. ఇందులో లెజెండరీ సింగర్ ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారి నటన అదే విధంగా ఆయన చేసిన డాన్స్ సినిమాకి పెద్ద ప్లస్ గా నిలిచాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ఈ సినిమాకి పాటలకి ఇదే స్పందన ఉంటుంది. ఈ ప్రేమికుడు సినిమా రీ రిలీజ్ కి సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.


నటీనటులు : ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా, ఎస్. పి. బాలసుబ్రమణ్యం, గిరీష్ కర్నాడ్, వడివేలు, రఘువరన్ తదితరులు.


టెక్నీషియన్స్ :

నిర్మాణం : జెంటిల్మెన్ ఫిలిం ఇంటర్నేషనల్

నిర్మాతలు : మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్

మ్యూజిక్ : ఆస్కార్ విన్నర్ ఏ. ఆర్. రెహమాన్

దర్శకుడు : సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్

వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ : మురళీధర్ రెడ్డి, రమణ

డిస్ట్రిబ్యూషన్ కంపెనీ : సి ఎం ఆర్ ప్రొడక్షన్స్

పి ఆర్ ఓ : మధు VR 

Gangs of Godavari Teaser Unveiled in Style

 ఆకట్టుకుంటున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" టీజర్



తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభ గల యువ కథానాయకులలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు. కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ, ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. త్వరలో విశ్వక్ సేన్, మరో విభిన్న చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి"తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయన "లంకల రత్న" అనే శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయనున్నారు.



సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.


"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఏప్రిల్ 27న సాయంత్రం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో జరిగిన కార్యక్రమంలో టీజర్ ను విడుదల చేశారు నిర్మాతలు. 


ఈ సందర్భంగా కథానాయకుడు, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. "ఈ సినిమా మా టీమ్ అందరికీ ఎంతో ముఖ్యమైన సినిమా. ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డాం. ఏడాదిలో సినిమాని పూర్తి చేసి, అద్భుతమైన అవుట్ పుట్ తో మీ ముందుకు వస్తున్నాం. టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. టీజర్ లో మీరు చూసింది ఒక్క శాతమే. సినిమా మీ అంచనాలకు మించేలా ఉంటుంది. ఇది నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా.. అందుకేనేమో భయంతో పెద్దగా మాటలు రావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ సినిమా తరువాత.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ముందు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి తరువాత అనేలా నా కెరీర్ ఉంటుంది. ఇంత మంచి సినిమాని నాతో చేసిన నిర్మాత నాగ వంశీ గారికి నా కృతజ్ఞతలు. అలాగే వెంకట్ గారు, గోపీచంద్ గారు చిత్రీకరణ సమయంలో ఎంతో సపోర్ట్ చేశారు. దర్శకుడు కృష్ణ చైతన్య గురించి సినిమా విడుదలకు మాట్లాడతాను. అందమైన కథానాయికలు నేహా శెట్టి, అంజలి గారితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. చివరిగా ఈ సినిమా గురించి ఒక్కటే చెప్తాను.. ఈసారి శివాలెత్తిపోద్ది. అలాగే మన పేరుకి న్యాయం చేసే సమయం వచ్చింది. అదే ఈ సినిమా. మే 17న థియేటర్లలో కలుద్దాం." అన్నారు.


నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ.. "ఇది చాలా రోజుల తర్వాత విశ్వక్ నటించిన పక్కా మాస్ సినిమా. ఈ మూవీ ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది మొదటి షో కి తెలిసిపోతుంది. ఈ ఎన్నికల హడావుడి ముగిశాక ట్రైలర్ ను విడుదల చేసి ప్రమోషన్స్ జోరు పెంచుతాం. టిల్లు స్క్వేర్ స్థాయిలో బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాం." అన్నారు.


కథానాయిక నేహా శెట్టి మాట్లాడుతూ.. "ఇప్పటినుంచి నేను రాధికను కాదు.. బుజ్జి. మీ అందరికీ టీజర్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. టీజర్ లో మీకు కొంచెం చూపించాము. సినిమాలో దీనికి వంద రెట్లు ఉంటుంది.  మీ అందరికీ ఈ సినిమా చాలా నచ్చుతుంది." అన్నారు.


ప్రముఖ నటి అంజలి మాట్లాడుతూ.. "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది నా కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది. నేను రత్నమాల అనే అద్భుతమైన పాత్ర పోషించాను. ఈ పాత్ర నాకు ఎంతగానో నచ్చింది. దర్శకుడు కృష్ణ చైతన్య గారు సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాత నాగవంశీ గారికి కృతజ్ఞతలు. విశ్వక్ సేన్, నేహా శెట్టితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను." అన్నారు.


చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. "టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. సినిమా కూడా ఖచ్చితంగా బాగుంటుందని హామీ ఇస్తున్నాను. విశ్వక్ విశ్వరూపం చూస్తారు. నేహా శెట్టి, అంజలి గారి పాత్రలు కూడా చాలా బాగుంటాయి." అన్నారు.


"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" టీజర్ ఆకట్టుకుంటోంది. సినిమాలోని పాత్రకి తగ్గట్టుగా ఆహార్యం మార్చుకునే అలవాటున్న విశ్వక్ సేన్, "లంకల రత్న" పాత్ర కోసం తనని తాను మలుచుకున్న తీరు కట్టిపడేస్తోంది. ఆ పాత్ర కోసం ఆయన పడిన కష్టం తెరమీద కనిపిస్తోంది. తాను ఇప్పటివరకు పోషించిన పాత్రలను మైమరపింప చేసేలా, "లంకల రత్న" పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయారు.


టీజర్‌లోని ప్రతి షాట్ "లంకల రత్న" పాత్ర తీరుని ప్రతిబింబించేలా ఉంది. లైటింగ్, నీడలు, చీకటి, కథానాయకుడి బాడీ లాంగ్వేజ్‌ ద్వారా ఆ పాత్ర గురించి చెప్పడానికి ప్రయత్నించిన తీరు అమోఘం. టీజర్ లో ఆ పాత్ర గురించి, అక్కడి ప్రాంతం గురించి రాసిన సంభాషణలు.. ఈ చిత్రం యొక్క చీకటి ప్రపంచాన్ని మనకు పరిచయం చేశాయి.


ఈ చిత్రంలో గోదావరి యాసలో మాట్లాడటంపై విశ్వక్ సేన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా "అమ్మోరు పూనేసిందిరా.. ఈ రాత్రికి ఒక్కోడికి శివాలెత్తిపోద్ది అంతే.", "నేను మంచోడినో చెడ్డోడినో నాకు తెలియదు.. కానీ మంచోడిని అన్న చెడ్డ పేరొద్దు" వంటి సంభాషణలు విశ్వక్ సేన్ పోషించిన పాత్ర తీరుతో పాటు, యాసపై ఆయనకున్న పట్టుని తెలియచేస్తున్నాయి.


సొంత మనుషుల నుంచే అవరోధాలను ఎదుర్కొంటూ, చీకటి సామ్రాజ్యంలో ఒక సాధారణ వ్యక్తి, అసాధారణ స్థాయికి ఎలా చేరుకున్నాడు అనేది ఈ చిత్రంలో చూడబోతున్నాం. చిత్ర కథను, కథానాయకుడి పాత్రను టీజర్ లో అద్భుతంగా చూపించి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచారు.


దర్శకుడు కృష్ణ చైతన్య రచనకు, అనిత్ మధాడి కెమెరా పనితనం తోడై.. ఈ టీజర్‌ను మరింత ప్రత్యేకం చేశాయి. ఇక యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం కూడా టీజర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మొత్తానికి టీజర్ సాంకేతికంగా ఉన్నతంగా ఉంది.


"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'సుట్టంలా సూసి' పాట యూట్యూబ్‌లో 30 మిలియన్లకు పైగా వీక్షణలతో వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది అనడంలో సందేహం లేదు.


యువ అందాల నటి నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో, ప్రముఖ నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు.


శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రానికి వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం మే 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Acclaimed Director Trivikram Srinivas Visits Usha Parinayam Sets, Wishes Team Well

 ఉషాప‌రిణ‌యం సెట్‌ను సంద‌ర్శించి టీమ్‌కు ఆల్‌ద‌బెస్ట్ చెప్పిన స్టార్ రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్

ఉషా ప‌రిణ‌యం షూటింగ్ పూర్తి



తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన కె.విజ‌య్‌భాస్క‌ర్ మ‌ళ్లీ ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు. నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఉషా ప‌రిణ‌యం  బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. విజ‌య్‌భాస్క‌ర్ క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపైకె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో విజ‌య్‌భాస్క‌ర్ త‌న‌యుడు  శ్రీ‌క‌మ‌ల్ హీరోగా న‌టిస్తుండ‌గా,   తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ‌తెలుగ‌మ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంది. గ‌త కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఐటెమ్‌సాంగ్‌ను హీరో శ్రీ‌క‌మ‌ల్‌, ప్ర‌ముఖ క‌థానాయిక సీర‌త్‌క‌పూర్‌పై చిత్రీక‌రిస్తున్నారు. ఘ‌ల్లు.. ఘ‌ల్లు అనే ఈ సాంగ్‌కు విజ‌య్ పొల్లంకి కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఆర్‌.ఆర్‌. ధ్రువ‌న్ సంగీతం అందించారు. అయితే ఈ సాంగ్ చివ‌రి రోజు, చిత్రీక‌ర‌ణ‌కు చివ‌రి రోజు  శుక్ర‌వారం ఈ చిత్రం షూటింగ్ జ‌రుగుతున్న సెట్‌కు స్టార్ రైట‌ర్ అండ్ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ విచ్చేసి టీమ్‌కు ఆల్ ద‌బెస్ట్ చెప్పారు.  త్రివిక్ర‌మ్‌, విజ‌య్‌భాస్క‌ర్ క‌ల‌యిక‌లో ఎన్ని సూప‌ర్‌హిట్ సినిమాలు వ‌చ్చాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సూప‌ర్‌హిట్ కాంబినేష‌న్ చాలా రోజుల త‌రువాత క‌ల‌వ‌డం కూడా ఒక శుభ‌సూచ‌కం అని చెప్పాలి. ఈ ఐట‌మ్ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌తో షూటింగ్ పూర్త‌యిన‌ట్లుగా మేక‌ర్స్ ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల వారిని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది* అనే నమ్మ‌కం వుంద‌ని చిత్ర‌మేకర్స్ తెలియ‌జేశారు.

 శ్రీ‌క‌మ‌ల్, తాన్వి ఆకాంక్ష‌, సూర్య‌, ర‌వి, శివ‌తేజ‌, అలీ,  వెన్నెల‌కిషోర్‌, శివాజీ రాజా, ఆమ‌ని, సుధ‌, ఆనంద్ చ‌క్ర‌పాణి, ర‌జిత‌, బాల‌క్రిష్ణ‌, సూర్య, మ‌ధుమ‌ణి ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంగీతం : ఆర్ ఆర్ ధ్రువ‌న్‌, డీఓపీ: స‌తీష్ ముత్యాల‌, ఎడిటింగ్‌: ఎమ్ ఆర్ వ‌ర్మ‌, ద‌ర్శ‌క‌త్వం-నిర్మాత :కె.విజ‌య్‌భాస్క‌ర్

Jhanvi Narang Receives The Prestigious Times Power 2024 Award

Jhanvi Narang Receives The Prestigious Times Power 2024 Award



Jhanvi Narang plays a pivotal role in all business activities of her family. Following the footsteps of her grandfather Narayan Das Narang and father Suniel Narang, Jhanvi Narang entered the entertainment industry at a very young age, driving the creation and execution of films.


Jhanvi Narang is the mastermind behind many innovations in Asian Cinemas. Besides expanding their multiplex chain business, they have also become very active in the production and exhibition business. The budding entrepreneur has won many laurels for her achievements.


Freshly, Jhanvi Narang added another feather to her cap. She has been awarded the Prestigious TIMES POWER WOMEN 2024 Award. Her achievements at this very young age are a testament to the determination she put in to take forward the Family Legacy.


Jhanvi’s responsibilities encompass various tasks, from assembling creative teams to overseeing the production process and ensuring the final product aligns with the intended vision.


Currently, Sekhar Kammula’s Kubera starring Dhanush and Nagarjuna made under Sree Venkateswara Cinemas LLP is in the production phase. 

‘Anaganaga Oka Kathala’ from ‘Sabari’ launched by Oscar winner Chandrabose

 వరలక్ష్మీ శరత్ కుమార్‌ 'శబరి'లో 'అనగనగా ఒక కథలా...' పాట విడుదల చేసిన ఆస్కార్ విన్నర్ చంద్రబోస్



విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శబరి'. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఆల్రెడీ విడుదల చేసిన 'నా చెయ్యి పట్టుకోవే...' పాటకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు 'అనగనగా ఒక కథలా...' పాటను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ విడుదల చేశారు.


'అనగనగా ఒక కథలా...' పాటకు సుచిత్రా చంద్రబోస్ నృత్య రీతులు సమకూర్చారు. తన సతీమణి కొరియోగ్రఫీ చేసిన పాటను చంద్రబోస్ తన చేతుల మీదుగా విడుదల చేయడం ఇదే తొలిసారి.


పాటను విడుదల చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ... ''ఇప్పుడే నేను 'శబరి' సినిమాలోని 'అనగనగా ఒక కథలా...' పాటను విడుదల చేశా. గోపీసుందర్ గారి సంగీతంలో రెహమాన్ గారు రాశారు. ఈ పాట చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ సాంగ్ విడుదల కంటే ముందు నేను విన్నాను. నా భార్య సుచిత్ర కొరియోగ్రఫీ చేయడం కోసం ఇంటికి సాంగ్ తీసుకు వచ్చింది. సాంగ్ విని సాహిత్యం చదువుతానని తీసుకున్నా. చదువుతుంటే నాకు చాలా చాలా సంతోషం కలిగింది. ఈ పాట ఎవరు రాశారు? కథ ఏమిటి? అని ఫోన్ చేసి మాట్లాడాను. చాలా మంచి బాణీకి అంతే అందమైన భావాలతో కూడిన సాహిత్యం రాశారు. నా చేతుల మీదుగా విడుదల చేయించారని మంచిగా చెప్పడం కాదు... పాట విడుదలకు ముందే విని ఎంతో నచ్చే నిర్మాతను, గేయ రచయితను అభినందించా. ఈ పాట తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది. చిత్ర గారు ఈ పాటకు తన గాత్రంతో జీవం పోశారు. తల్లి ప్రేమలోని మాధుర్యాన్ని ప్రతి పదంలో చూపించారు. తల్లి కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించాలి. నిర్మాత మహేంద్రనాథ్ గారితో పాటు చిత్ర బృందం అందరికీ పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు.


సుచిత్రా చంద్రబోస్ మాట్లాడుతూ... ''నేను కొరియోగ్రఫీ అందించిన పాటను మా ఆయన ఇదే తొలిసారి. చాలా సంతోషంగా ఉంది. 'శబరి' సినిమాలో చక్కటి సందర్భంలో వచ్చే గీతమిది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేంద్రనాథ్ గారికి థాంక్స్'' అని‌ చెప్పారు.


'అనగనగా ఒక కథలా...' పాట విడుదలైన సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ''తల్లి ప్రేమ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో మా 'శబరి' ప్రత్యేకంగా నిలుస్తుంది. కన్న బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఎంత దూరం వెళుతుందనేది చెప్పే చిత్రమిది. బరువైన భావోద్వేగాలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది. వరలక్ష్మి గారి నటన ఈ సినిమాకు హైలైట్ అవుతుంది. తల్లీ కూతుళ్లు సరదాగా విహారయాత్రకు వెళ్లే పాట 'నా చెయ్యి పట్టుకోవే'కు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడీ 'అనగనగా ఓ కథలా...' విడుదల చేశాం. రెండు పాటలకు రెహమాన్ గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. చిత్ర గారు మా సినిమాలో ఈ 'అనగనగా ఒక కథలా...' పాట పాడటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సుచిత్రా చంద్రబోస్ గారు ఎంతో సీనియర్. నంది అవార్డ్స్ విన్నర్. నేను కొత్త నిర్మాత అయినా సరే... ఎంతో అంకిత భావంతో సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. ఆవిడ డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయా. గోపీసుందర్ గారు పాటలే కాదు, నేపథ్య సంగీతం కూడా సూపర్బ్ చేశారు. మే 3న ప్రేక్షకులకు థియేటర్లలో 'శబరి' థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది'' అని చెప్పారు.


'శబరి' చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన బాణీకి 'అనగనగా ఒక కథలా...' అంటూ రెహమాన్ సాహిత్యం అందించగా... లెజెండరీ సింగర్ కెఎస్ చిత్ర ఆలపించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాటను విడుదల చేశారు. 


బిడ్డ మీద తల్లి ప్రేమ ఎప్పటికీ కరగదని చెప్పే గీతం 'అనగనగా ఒక కథలా'. తల్లికి బిడ్డే ప్రపంచం అని చెప్పే గీతమిది. చిన్నారి పిలుపునకు బదులు తల్లి, చిన్నారి అడుగులకు గొడుగు తల్లి, చిన్నారి కలలకు రంగులు తల్లి అంటూ కన్నపేగుతో అమ్మకు ఉండే బంధాన్ని రెహమాన్ అద్భుతంగా రాయగా... చిత్ర గాత్రం ఆ పాటలో భావం ప్రేక్షకులకు చేరువ అయ్యేలా అంతే గొప్పగా పాడారు.


''అనగనగా ఒక కథలా

ఓ చందమామా

కడవరకు కరగదులే

ఈ అమ్మ ప్రేమ


పిలుపులు నీవైతే

బదులును నేనౌతూ

ఎదురుగ ఉంటాలే కదలక


అడుగులు నీవైతే

గొడుగును నేనౌతూ

చకచక వస్తాలే వదలక..అనగనగా


తడబడుతూనే నిలబడుతుంటే

కళ్లకు ఆనందమే

గడపను దాటి కదిలితే నువ్వు

గుండెకు ఆరాటమే


నువ్వేకదా ప్రపంచం

నువ్వంటే నా సంతోషం''అంటూ సాగిందీ గీతం. శబరి మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదలైంది.


నటీనటులు:

వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఈ చిత్రంలో తారాగణం.


సాంకేతిక బృందం:

ఈ చిత్రానికి రచనా సహకారం: సన్నీ నాగబాబు, పాటలు: రెహమాన్, మిట్టపల్లి సురేందర్, మేకప్: చిత్తూరు శ్రీను, కాస్ట్యూమ్స్: అయ్యప్ప, కాస్ట్యూమ్ డిజైనర్: మానస, స్టిల్స్: ఈశ్వర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: లక్ష్మీపతి కంటిపూడి, కో- డైరెక్టర్: వంశీ, ఫైట్స్: నందు - నూర్, కొరియోగ్రాఫర్స్: సుచిత్ర చంద్రబోస్ - రాజ్ కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పూలాల, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, సంగీతం: గోపి సుందర్, సమర్పణ: మహర్షి కూండ్ల, ప్రొడ్యూసర్: మహేంద్ర నాథ్ కూండ్ల, కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అనిల్ కాట్జ్.

Adah Sharma Terrifies In The Trailer Of C.D (Criminal Or Devil)

 ‘C.D’ ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ



అదా శర్మ ప్రస్తుతం పాన్ ఇండియన్ నటిగా ఫుల్ ఫేమస్ అయ్యారు. వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో అదా శర్మ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చి అందరినీ మెప్పిస్తున్నారు. హారర్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల కాన్సెప్ట్‌లతో అదా శర్మ ప్రయోగాలు చేస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత అదా శర్మ తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు  ప్రేక్షకుల ముందుకు అదా శర్మ ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ అనే సినిమాతో రాబోతున్నారు. ది కేర‌ళ స్టోరీ మూవీతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న అదా శర్మ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండటం విశేషం. 


C.D (క్రిమినల్ ఆర్ డెవిల్) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు కృష్ణ అన్నం దర్శకత్వం వహిస్తున్నారు. SSCM ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీకి గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. RR ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మే 10న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.


‘చీకటి, వెలుతురు మధ్య కనిపించని శత్రువు ఎవరో ఉన్నారు..  ఎవరు చేస్తున్నారు ఇదంతా?.. నా చుట్టూ ఏదో జరుగుతోంది.. నాతో పాటు ఇంట్లో ఉంటోంది దెయ్యమా?.. మరణంతో పాటు యుద్దం తప్పదా?.. నన్ను చంపడానికి వచ్చింది ఎవరు క్రిమినల్? ఆర్ డెవిల్?’ అంటూ హీరో విశ్వంత్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ సాగుతుంది. ఇక ఈ ట్రైలర్‌లో అదా శర్మ యాక్షన్ సీక్వెన్స్, భయపెట్టేలా చూసే చూపులతో ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇక ఈ ట్రైలర్‌ను చూస్తుంటే విజువల్స్, ఆర్ఆర్ అన్నీ కూడా టాప్ నాచ్‌లో ఉన్నాయనిపిస్తోంది.


ఈ మూవీలో రీసెంట్ సెన్సేషన్ అదా శర్మ కీలక పాత్ర పోషిస్తుండగా.. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏ.ముద్దు కృష్ణ డైలాగ్స్ అందించగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. సత్య గిడుతూరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలే చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాను మే 10న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.


నటీనటులు

అదా శర్మ, విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా 


టెక్నీషియన్స్

బ్యానర్ : SSCM ప్రొడక్షన్స్

డైరెక్టర్ : కృష్ణ అన్నం

స్టోరీ డైలాగ్స్ :  ఏ ముద్దు కృష్ణ

DOP : సతీష్ ముత్యాల

మ్యూజిక్ : RR ధృవన్

ఎడిటర్ : సత్య గిడుతూర్ 

యాక్షన్స్ : రామ కృష్ణ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గిరిధర్

PRO : సాయి సతీష్