Home » » Chitralayam Studios Collaborate With People Media Factory- Gopichand32

Chitralayam Studios Collaborate With People Media Factory- Gopichand32

 పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో చిత్రాలయం స్టూడియోస్ కొలాబరేషన్- మాచో స్టార్ గోపీచంద్, శ్రీను వైట్ల క్రేజీ ప్రాజెక్ట్ #గోపీచంద్32



మాచో స్టార్ గోపీచంద్, శ్రీను వైట్ల, వేణు దోనేపూడి, TG విశ్వ ప్రసాద్, చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ  #Gopichand32 కొత్త షెడ్యూల్ మార్చి 27 నుండి ప్రారంభం


మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల  హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #గోపీచంద్32 ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి యొక్క తొలి ప్రొడక్షన్ వెంచర్. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై అత్యున్నత స్థాయి ప్రొడక్షన్ , సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా కోసం చిత్రాలయం స్టూడియోస్‌తో కలిసి పని చేస్తుంది. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా చేరారు.


ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ రేపు (మార్చి 27న) ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో, ప్రధాన తారాగణంతో  కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది.


నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ - ''పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద బ్యానర్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. విశ్వప్రసాద్ గారికి ధన్యవాదాలు. సినిమా చాలా అద్భుతంగా వస్తోంది. 27 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఈ సినిమాకి ఒక యూనిక్ పాయింట్ వుంది. ఈ సినిమాతో శ్రీను వైట్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. గోపీచంద్, శ్రీనువైట్ల కాంబోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది'' అన్నారు


ఈ సినిమాలో గోపీచంద్‌ని కొత్త అవతార్ లో శ్రీను వైట్ల ప్రెజెంట్ చేస్తున్నారు. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. కెవి గుహన్ డీవోపీగా చేస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.  ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.


నటీనటులు: 'మాచో స్టార్' గోపీచంద్


సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: శ్రీను వైట్ల

నిర్మాతలు: వేణు దోనేపూడి, టీజీ విశ్వ ప్రసాద్

బ్యానర్లు: చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

స్క్రీన్ ప్లే: గోపీ మోహన్

సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్

సంగీతం: చైతన్ భరద్వాజ్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో



Share this article :