Mama Mascheendra First Single Gaalullona Unveiled

 నైట్రో స్టార్ సుధీర్ బాబు, హర్షవర్ధన్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ 'మామా మశ్చీంద్ర' ఫస్ట్ సింగిల్ గాలుల్లోన పాట విడుదల



నైట్రో స్టార్ సుధీర్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ 'మామా మశ్చీంద్ర' లో త్రిపాత్రాభినయం లో కనిపించనున్నారు. యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.


ఈ రోజు మేకర్స్ మొదటి సింగిల్ గాలుల్లోన లిరికల్ వీడియో విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ ఈ పాటని మెస్మరైజ్ మెలోడిగా కంపోజ్ చేశారు. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది. కపిల్ కపిలన్, నూతన మోహన్ అద్భుతంగా అలపించారు. ఈ పాటలో సుధీర్ బాబు దుర్గా, డిజే పాత్రలలో ఆకట్టుకున్నారు. మిర్నాలిని రవి, ఈషా రెబ్బా బ్యూటీఫుల్ గా కనిపించారు.


పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు.


తారాగణం: సుధీర్ బాబు,  మిర్నాలిని రవి, ఈషా రెబ్బా, హర్షవర్ధన్


సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: హర్షవర్ధన్

నిర్మాతలు: సునీల్ నారంగ్,  పుస్కూర్ రామ్ మోహన్ రావు

సమర్పణ: సోనాలి నారంగ్, సృష్టి (సృష్టి సెల్యులాయిడ్)

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి

సంగీతం: చైతన్ భరద్వాజ్

డీవోపీ: పీజీ విందా

ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్

పీఆర్వో: వంశీ-శేఖర్

Post a Comment

Previous Post Next Post