తెలుగు తెరపై
మరో చిచ్చర పిడుగు
చరణ్ సాయి
"చరణ్ సాయి"
ప్రస్తుతానికి కొంతమందికి మాత్రమే పరిచితమైన ఈ పేరు త్వరలోనే చాలా గట్టిగా వినిపించనుంది. ఒక "సూపర్ హీరో"కి కావలసిన లక్షణాలన్నీ ఈ కుర్రాడిలో పుష్కలంగా ఉండడమే అందుకు కారణం. రవిబాబు "క్రష్" చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసిన ఈ చిచ్చర పిడుగు... తొలి చిత్రంతోనే తన కెరీర్ కి తిరుగులేని పునాది వేసుకున్నాడు. ఆ సినిమా షూట్ లో ఉండగానే... "వాలెంటైన్స్ నైట్" చిత్రంలో నటించే అవకాశం సొంతం చేసుకుని తన కెరీర్ కి ద్వితీయ విఘ్నం లేకుండా చేసుకుని... ముచ్చటగా మూడో చిత్రం "అన్ ఎక్స్పెక్టెడ్" (unexpected) లోనూ నటించి మెప్పించాడు. తాజాగా "ఐ.ఓ.జి" అనే నెక్ట్స్ జనరేషన్ సినిమాలో నటిస్తున్నాడు!!
పవన్ కల్యాణ్, ప్రభాస్ వంటి స్టార్స్ ను సానబెట్టిన వైజాగ్ సత్యానంద్ శిష్యుడైన చరణ్ సాయి... తమిళ స్టార్ మేకర్ సారథ్యంలో రూపొందుతున్న "ఇరుళి" అనే తమిళ చిత్రంలోనూ నటిస్తూ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. చూడగానే కట్టి పడేసే చక్కని పర్సనాలిటీ కలిగిన ఈ "కత్తి లాంటి కొత్త కుర్రాడు"... డాన్సులు, ఫైట్స్ లో మంచి ఎక్స్పర్ట్ కావడం గమనార్హం.
ప్రతిభతో పాటు... "క్రమశిక్షణ, అంకిత భావం, సమయపాలన" జీవితంలో ఎదగాలనుకునేవారికి, మరీ ముఖ్యంగా సినిమా రంగంలో రాణిoచాలనుకునే చాలా ముఖ్యమని గుర్తెరిగిన చరణ్ సాయి... "కథాబలం" కలిగిన సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. నిడివితో నిమిత్తం లేకుండా... తనదైన ముద్ర వేయడానికి వీలు కల్పించే పాత్రలు చిన్నవైనా చేయడానికి సైతం తాను సిద్ధమేనని సవినయంగా చెబుతున్నాడు ఈ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్!!
Post a Comment