Home » » Director Vijay Kanakamedala Interview About Ugram

Director Vijay Kanakamedala Interview About Ugram

 ‘ఉగ్రం’ హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్..చాలా సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ వుంటాయి: డైరెక్టర్ విజయ్ కనకమేడల‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్ గా నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటిచింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో ఉగ్రంపై అంచనాలని పెంచాయి. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో ‘ఉగ్రం’ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు దర్శకుడు విజయ్ కనకమేడల. 


ఉగ్రం ఎలా మొదలైయింది ? 

‘నాంది’ మొదటి షెడ్యుల్ అయిన తర్వాత లాక్ డౌన్ వచ్చింది. ఆరు నెలలు ఖాళీగా కూర్చున్న సమయంలో ఉగ్రం కథ చేసుకున్నాను. ఈ కథ నరేష్ గారికి  అయితే బావుంటుందనిపించింది. ఆయన ఎమోషన్స్ చేశారు కానీ పూర్తి రౌద్ర రసంతో చేయలేదు. ఇది ఆయనకి కొత్తగా ఉంటుదనిపించింది. ఆయనకి కథ చెబితే నచ్చింది. తర్వాత కథపై ఆరు నెలలు పరిశోధన చేశాం. నరేష్ గారి ఇట్లు మారేడుమిల్లీ ప్రజానీకం తర్వాత ఉగ్రం మొదలుపెట్టడం జరిగింది.  


మిస్సింగ్ సబ్జెక్ట్ పై కథ చేయడానికి కారణం ?

నాంది సమయంలోనే దీనిపై ఆలోచన వుంది. నిత్యం మిస్సింగ్ వార్తలు కనిపిస్తూనే వున్నాయి. తెలంగాణ హైకోర్టు కోర్టు కూడా మిస్ అవుతున్న వారు ఏమౌతున్నారో నివేదిక ఇవ్వమని పోలీసు డిపార్ట్మెంట్ ని కోరినట్లు ఒక ఆర్టికల్ చదివాను. ఈ అంశంపై, తప్పిపోతున్న వారి కుటుంబ సభ్యుల్లో బాధ ఎలా వుంటుందనేదానిపై కథ చేస్తే బావుంటుదనిపించింది. 


ఈ చిత్రానికి తూమ్ వెంకట్ కథ అందించారు కదా.. ఆయన గురించి ? 

మేం ఇద్దరం మంచి స్నేహితులం. ఇండిపెండెంట్ గా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత తనది కథ, నాది స్క్రీన్ ప్లే, డైరెక్షన్ క్రెడిట్స్ అనుకున్నాం. మా కోర్దినేషన్ చాలా బావుంటుంది. అంతకుముందు హరీష్ శంకర్ గారి దగ్గర పని చేశాము.  


నాంది సినిమానే నరేష్ గారి ఇమేజ్ కి పూర్తి భిన్నంగా వుంటుంది. ఇప్పుడు ఉగ్రంలో కూడా పూర్తి మాస్ ఎలిమెంట్స్ తో చేయాలనే నమ్మకం ఎలా వచ్చింది? 

ఇందులో నాంది కంటే ఎక్కువ ఎమోషన్స్, మాస్ , ఇంటెన్స్ వుంటుంది.  ఒక పోలీస్ అధికారి పాత్ర తీసుకున్నాం కాబట్టి యాక్షన్ లోకి వెళ్ళాల్సివచ్చింది. ఉగ్రం మాంచి యాక్షన్ థ్రిల్లర్. కథలో చాలా కొత్త ఎలిమెంట్స్ వుంటాయి. 


మిర్నా మీనన్ ని హీరోయిన్ గా ఎంపిక చేయడానికి కారణం ? 

ఇందులో హీరోయిన్ కాలేజ్ అమ్మాయిగా, భార్యగా, తల్లిగా మూడు భిన్నమైన కోణాల్లో కనిపించాలి. మిర్నా చేసిన గత సినిమాలు చూశాను. ఆడిషన్స్ కి పిలిచి సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశాన్ని ఇచ్చి నటించమని చెప్పాం. తను చాలా చక్కగా చేసింది. ఆ పాత్రకు సరైన ఎంపిక అని భావించి ఆమెను సెలక్ట్ చేశాం. 


నరేష్ గారు ఇది వరకు కామెడీ పోలీసు గెటప్ లో చూశాం.. మొదటి సారి సీరియస్ రోల్ చేయడానికి ఎలాంటి ప్రిపరేషన్ తీసుకున్నారు ? 

కథ చెప్పినప్పుడే అందులో సీరియస్ నెస్ ఆయనకి అర్ధమైపోయింది. ఆయన గెటప్, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో క్లారిటీ వచ్చింది. దీనికి సిక్స్ ప్యాక్ బాడీ పెంచాల్సిన అవసరం లేదు. అయితే స్టిఫ్ గా ఉండటానికి కొన్ని వర్క్ అవుట్స్ చేయడం, కాన్ఫిడెంట్ గా మాట్లాడటం ఇవన్నీ షూటింగ్ కి ముందే చర్చించుకున్నాం. ఇక యాక్షన్ సీన్స్ విషయానికి వస్తే ముందే రిహార్సల్స్ చేశాం. యాక్షన్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. 


ఉగ్రంలో యాక్షన్ సీన్స్ ఎలా వుంటాయి ? 

ఉగ్రంలో యాక్షన్స్ సీక్వెన్స్ ఎక్కువే వుంటాయి. అన్నీ చాలా బాగా వచ్చాయి. ప్రతి సీక్వెన్స్ లో ఎమోషన్ వుంటుంది. హీరో ఫైట్ చేస్తే దానికి ఒక కారణం వుంటుంది. ఆ ఎమోషన్ ని ప్రేక్షకులు కూడా ఫీలౌతారు. కథ ఎక్కువ భాగం రాత్రి వేళల్లో జరగడం వలన నైట్ షూట్ ఎక్కువగా చేయాల్సివచ్చింది. 


ఉగ్రంలో సోషల్ ఎలిమెంట్స్ ప్రస్తావన ఉంటుందా ? 

సినిమాలో కొంత సోషల్ ఎలిమెంట్స్ గురించి చెప్పడం నాకు ఇష్టం. అయితే ఇది కూడా కమర్షియల్ గానే వుంటుంది.   


పోలీసు కథలపై మీకు ప్రత్యేకమైన శ్రద్ద ఉందా ? 

నాంది పోలీసు కథ కాదండీ. అందులో ఒక పాత్రగానే వుంటుంది. సామాజిక అంశాలు తీసుకోవడం వలన పోలీసులు, లాయర్లు, రాజకీయ నేతలు భాగమవ్వడం వలన ఆ పాత్రలు  వస్తుంటాయి కానీ ప్రత్యేకంగా ఏమీ కాదు. 


మొదటి సినిమా నాంది చాలా అనుభవం వున్న దర్శకుడిలా తీశారు. ఉగ్రంలో ఎలాంటి పనితీరు వుంటుంది? 

నాంది, ఉగ్రం కు సంబంధం లేదు. ఆ కథ ప్రజంటేషన్ వేరు. ఉగ్రం ప్రజంటేషన్ వేరు. అది కోర్టు రూమ్ డ్రామా. ఉగ్రం యాక్షన్ థ్రిల్లర్.. స్పీడ్ గా పరిగెడుతుంది. ఏదైనా స్క్రిప్ట్ ప్రకారమే వుంటుంది. కథలో హీరో సెంట్రిక్ గా వుండే సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. 


ఉగ్రంలో ఎన్ని పాటలు వున్నాయి ? 

మొత్తం మూడు పాటలు. లవ్, ఫ్యామిలీ,  టైటిల్ సాంగ్. ఈ మూడు పాటలు కూడా కథలో భాగంగానే వుంటాయి.

 

షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ లో పని చేయడం ఎలా అనిపించిది ? 

నిర్మాతల గురించి ఎంత చెప్పినా తక్కువే. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా క్యాలిటీ కోసం చాలా సపోర్ట్ చేశారు. బాగా ఖర్చు పెట్టారు, బాగా ప్రమోట్ చేస్తున్నారు. 


హిట్ కాంబినేషన్ లో సినిమా వస్తున్నపుడు అంచనాలు వుంటాయి .. ఉగ్రం అంచనాలని అందుకుంటుందా ? 

ఉగ్రం టీజర్ రిలీజ్ నుంచి ఇప్పటి వరకూ చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.  ట్రైలర్ కి ఆర్గానిక్ గా దాదాపు 6 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. ప్రేక్షకుల్లో అంచనాలు వున్నాయి. ఆ అంచనాలని అందుకుంటాం. థియేటర్ లో చాలా సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ వుంటాయి. 


నాందితో నరేష్ గారిని సక్సెస్ ట్రాక్ ఎక్కించారు.. ఉగ్రం టార్గెట్ ఏమిటి? 

నరేష్  గారు ఇప్పటికే ఆల్ రౌండర్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఉగ్రంతో యాక్షన్ లో కూడా యాక్సప్ట్ చేస్తారని నమ్మకంగా వుంది.


కొత్త కథలపై పని చేస్తున్నారా ? 

నాగచైతన్య గారి కోసం ఓ కథ అనుకుంటున్నాం. చాలా మంచి సోషల్ డ్రామా.


Share this article :