Home » » Balagam will Create A Magic which you all Experience on March 3rd -Mamidi Harikrishna

Balagam will Create A Magic which you all Experience on March 3rd -Mamidi Harikrishna

బలగం' సినిమాలో అద్భుతం జరిగింది.. అదేంటో మార్చి 3న చూస్తారు.. మామిడి హరికృష్ణ



దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని  ‘యు’ స‌ర్టిఫికేట్ పొందిది. ఇప్పుడు మేక‌ర్స్ బ‌ల‌గం సినిమాను మార్చి 3న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్రకటించారు. ఈ క్రమంలో సినిమా నుంచి మూడో పాటను నేడు రిలీజ్ చేశారు. ఈ పాటను మామిడి హరికృష్ణ రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ..


మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. 'ఇప్పటి వరకు సినీ ప్రపంచంలో ఎన్నో రకాల చిత్రాలు వచ్చాయి. మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఫార్మాట్‌లో ఓ చక్కటి బతుకు చిత్రాన్ని తీయొచ్చని నిర్మించారు. ఇది గేమ్ చేంజర్ సినిమా అవుతుంది. ఇది అందరికీ డెబ్యూ సినిమా. దిల్ రాజు తన ఇరవై ఏళ్ల కెరీర్‌లో యాభైకి పైగా అద్భుతమైన సినిమాలు తీశారు. ఇవన్నీ ఒక వైపు అయితే.. బలగం ఇంకో వైపు మార్క్ క్రియేట్ చేయబోతోంది. కొత్త ఆలోచనలతో ఈ సినిమాను తీశారు. మన మూలలు, మానవ సంబంధాలు చూపించేలా ఉంటాయి. హన్సిత అండ్ హర్షిత వంటి ఈ తరం వాళ్లకు ఇంత మంచి టేస్ట్ ఉందా? అని బలగం సినిమా చూశాకా? అనిపిస్తుంది. ఈ సినిమా చూశాక మారుతుంది తమ్ముడు వేణు మీదున్న అభిప్రాయం. ఇంత వరకు మిమ్మల్ని నవ్వించాడు. ఈ సినిమాతో మిమ్మల్ని కడుపారా ఏడిపిస్తాడు. ఈ సినిమాను చూశాక కుటుంబానికి దూరంగా ఉండే వాళ్లంతా కూడా వారి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. భీమ్స్ అద్భుతమైన సంగీతాన్ని, ఆర్ఆర్‌ను అందించారు. కారెక్టర్ లేకుండా కారెక్టర్ మీద నడిచే చిత్రాలు వస్తాయా? అని అనుకుంటుంటే బలగం సినిమా వచ్చింది. కొమురయ్య పాత్ర చుట్టూ ఈ కథ అంతా నడుస్తుంది. కనిపించేది పదిహేను నిమిషాలే అయినా.. సినిమా అంతా ఫీలింగ్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. మల్లేశం, మెయిల్ వంటి సినిమాలతో అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ప్రియదర్శి. ఈ సినిమాతో ఆయన ఏడిపిస్తారు.. నవ్విస్తారు. హీరోయిన్ కావ్యా చక్కటి పాత్రలో నటించారు. జానపదాన్ని సినిమాలను కలిపి అద్భుతంగా తీశారు. బలగం సినిమాలో అద్భుతం జరిగింది. దాన్ని మార్చి 3న చూస్తారు. ఈ సినిమాకు కనిపించకుండా నడిపించింది మాత్రం దిల్ రాజు. ఆయన జడ్జ్‌మెంట్‌ ఎప్పుడూ తప్పలేదు. ఈ సినిమా విషయంలోనూ ఆడియెన్స్‌ అలాంటి తీర్పే ఇస్తారు. చావు అనే అశుభ అంశాన్ని తీసుకుని శుభాల వైపు తీసుకెళ్లే గొప్ప ప్రయోగమే బలగం. ఆడియెన్స్‌ను కదిలించే చిత్రంగా బలగం ఉంటుంది. తెలంగాణ సినిమాకు దిద్దిన తిలకమే బలగం. ఈ తరహా సినిమాలు భవిష్యత్తులో ఇంకా వస్తాయి' అని అన్నారు.


దిల్ రాజు మాట్లాడుతూ.. 'ఇప్పటి వరకు నాలుగు షోలు వేశాం. హరికృష్ణ మామిడి గారు కూడా చూశారు. అందుకే ఈ రోజు ఆయన్ను కూడా పిలిచాం. నిజామాబాద్, మహబూబాబాద్‌లోనూ షోను వేశాం. మా కుటుంబాన్ని మేం చూసుకుంటున్నట్టుగా ఉందని అన్నారు. సెన్సార్ వాళ్లు కూడా ఎమోషనల్ అయ్యారు. ఇది సినిమా కాదు జీవితం అని ప్రశంసించారు. బొమ్మరిల్లు, శతమానంభవతి వంటి సినిమాలు తీశాం. ఇప్పుడు మా బలగంకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంటే.. సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను. ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా? అని చూస్తున్నాను. ఇప్పుడు మూడో పాట బలరామయ్య నర్సయ్య రిలీజ్ అయింది. మంచి సినిమా తీశాం కాబట్టి మంచి సినిమా తీశామని చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది చిన్న సినిమా. దిల్ రాజు వెనకాల ఉన్నాడు కాబట్టి పెద్దగా అనిపిస్తుంది. కానీ ఇది చాలా చిన్న సినిమా. ఈ సినిమాను ఇంతగా జనాలకు రీచ్ అయ్యేలా చేస్తున్న మీడియాకు థాంక్స్.


మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ.. 'బలగం అనే సినిమాను చేయడం అదృష్టం. అద్భుతమైన సినిమాలు తీస్తాం. కానీ అత్యద్భుతమైన సినిమాలు అరుదుగా వస్తాయి. అలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఆడియెన్స్ ఆధరిస్తారని అనుకుంటున్నాను' అని అన్నారు.


డైరెక్టర్ వేణు మాట్లాడుతూ.. 'బలగం అనే చిన్న కథను.. దిల్ రాజు గారి బలగం అంతా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారు, హన్సిత హర్షిత గారికి థాంక్స్. ఇంత సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. మార్చి 3 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను' అని అన్నారు.


ప్రియదర్శి మాట్లాడుతూ.. 'నిజామాబాద్, మహబూబాబాద్‌లో ఆడియెన్స్ చూపించిన ప్రేమను మరిచిపోలేకపోతోన్నాను. నా బలగం దిల్ రాజు గారు, హన్సిత, హర్షిత, వేణు అన్నలే. వారి వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. మా టీం అంతా కలిసి మంచి సినిమాను తీశాం. ఇలాంటి చిన్న సినిమాలు ఓటీటీలోనే చూడాలని అనుకుంటే.. మాలాంటి వాళ్లు ప్రయోగాలు చేసేందుకు వెనుకడుగు వేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సినిమాలను థియేటర్లోనే చూడాలి. మీకు గొప్ప అనుభూతిని కలిగించే సినిమా ఇది. నేను నమ్మకంగా చెబుతున్నాను. మార్చి 3న ఆడియెన్స్‌ అందరూ కూడా థియేటర్‌లో ఈ సినిమాను చూడండి. అన్ని రకాల ఎమోషన్స్‌ను ఈ సినిమాలో చూపించాం' అని అన్నారు.

 


Share this article :