ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలసి కృతజ్ఞతలు తెలిపిన టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్
ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) ధర్మకర్తల మండలి సభ్యునిగా నియమితులైన నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారితో కలసి తాడేపల్లి లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
టిటిడి బోర్డ్ సభ్యునిగా నియమించి, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవ చేసుకొనే గొప్ప అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు దాసరి కిరణ్‌కుమార్.
Post a Comment