‘సింబా’ థీమ్ సాంగ్ రిలీజ్.. ప్రకృతి బలాన్ని, ప్రకోపాన్ని తెలియజేస్తున్న పాట
సింబా - ది ఫారెస్ట్ మ్యాన్ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. విలక్షణ నటుడు జగపతి బాబు, అనసూయ, వశిష్ట ఎన్.సింహ, కబీర్ దుహాన్ సింగ్, బిగ్ బాస్ ఫేమ్ దివి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అటవీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథను అందించారు.
ఇటీవల విడుదలైన ‘సింబా’ ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. గురువారం ఈ సినిమా నుంచి థీమ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగే సినిమాకు హార్ట్ ఆఫ్ ది సాంగ్. పవర్‌ఫుల్ బీట్, భీకరమైన సన్నివేశాలను వెంటనే సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది.
జగపతి బాబు అడవులు, పర్యావరణాన్ని రక్షించే రక్షకుడిగా కనిపించారు. సినిమాలోని ఇతర నటీనటులు.. వారి క్యారెక్టర్స్‌ను కూడా పరిచయం చేశారు. యదు కృష్ణన్ ఈ సాంగ్‌ను ఆలపించారు.
పాటలో లిరిక్స్ చాలా ఇంపాక్ట్‌ను కలిగించేలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఈ పాటలో ‘తందనాన అహి తందనానాపురే తందనాన భల తందనాన’ అనే లైన్‌ను అన్నమయ్య కీర్తన నుంచి తీసుకున్నారు. కృష్ణ సౌరభ్ ఎక్స్‌ట్రార్డినరీ సంగీతాన్ని అందించారు.
ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే సింబా - ది ఫారెస్ట్ మ్యాన్ సినిమా కోసం సంపత్ నంది, అతని టీమ్ వర్క్ చేస్తున్నారు. మురళీ మనోహార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృష్ణ ప్రసాద్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రాన్నిరాజేంద్ర రెడ్డి.డి, సంపత్ నంది నిర్మిస్తున్నారు.