ఎఫ్3 మూవీ ని ఫ్యామిలీ అంతా కలసి చూసి హాయిగా నవ్వుకోండి: 'ఫన్'టాస్టిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎఫ్3 టీమ్
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. డబుల్ బ్లాక్‌బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఎఫ్3 'ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న ఈ చిత్రం .. 'ఫన్'టాస్టిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పాకళావేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో చాలా స్పెషల్ హైలెట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. విక్టరీ వెంకటేష్ ఎఫ్ 3లో తన పాత్రని అనుకరిస్తూ రేచీకటి వున్నట్లు వేడుకలో ఎంట్రీ ఇవ్వడంలో ఆకట్టుకుంది. అలాగే ఎఫ్ 2 వెర్సస్ ఎఫ్ 3 టీమ్స్ మధ్య వేదికపై జరిగిన పోటి కూడా అభిమానులని అలరించింది. అలాగే సునీల్ మూకీ యాక్ట్ కూడా అలరించింది.
ఈ 'ఫన్'టాస్టిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. మూడేళ్ళ తర్వాత ఎఫ్ 3 రూపంలో నా సినిమా మే 27 థియేటర్ లోకి వస్తుంది. అంతకుముందు చేసిన నారప్ప దృశ్యం ఓటీటీలో విడుదలయ్యాయి. మళ్ళీ ఎఫ్ 3లో మీ అందరినీ థియేటర్ లో కలవడం చాలా ఆనందంగా వుంది. ఎఫ్ 3ని ప్రేక్షకులంతా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతమైన స్క్రిప్ట్ చేశారు. దిల్ రాజు గారితో పని చేయడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. వరుణ్ తేజ్ అద్భుతంగా చేశాడు. ఈ సినిమాలో పని చేసిన నటీనటులకు, టెక్నిషియన్ల అందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రంలో నటించిన సినియర్ నటులు అన్నపూర్ణమ్మ గారు, విజయ గారు నాపై ఎంతో ప్రేమతో మద్రాస్ నుండి భోజనం తీసుకొచ్చేవారు. వారు నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. ఈ ఈవెంట్ సూపర్ ఎక్స్ ట్రార్డినరీ అదిరిపోయింది. ఎఫ్ 3 కూడా అదిరిపోతుంది. మీరంతా థియేటర్ లో సినిమా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను'' అన్నారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఎఫ్ 3 అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాలో నటించిన నటీనటులకి, టెక్నికల్ టీం కి థ్యాంక్స్. ఈ సినిమాలో సునీల్ గారితో నా కాంబినేషన్ చాలా చక్కగా వచ్చింది. మళ్ళీ పాత సునీల్ ని చూస్తారు. దిల్ రాజు, శిరీష్ గారి సినిమా అంటే నా హోం ప్రొడక్షన్ లా ఫీలౌతా. ఫిదా, ఎఫ్ 2 లాంటి సూపర్ హిట్స్ దిల్ రాజు గారి బ్యానర్ లో చేశాను. ఎఫ్ 3తో హ్యాట్రిక్ కోడతామనే నమ్మకం వుంది. ప్రొడక్షన్ టీం అద్భుతంగా పని చేసింది. దేవిశ్రీ ప్రసాద్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి నా బ్రదర్ , అద్భుతమైన వ్యక్తి. ప్రస్తుత కాలంలో అనిల్ అంత కామెడీ ఎవరూ పండించలేరని నా నమ్మకం. ఎఫ్ 3తో మళ్ళీ అది ప్రూవ్ చేస్తారు. వెంకటేష్ గారితో రెండోసారి చేసే అదృష్టం నాకు దక్కింది. ఆయనతో నా ప్రయాణం మర్చిపోలేను. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది''అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ఎఫ్ 3 లాంగ్ జర్నీ, ప్యాండమిక్ ని దాటి వచ్చాం. మీకు వినోదాన్ని పంచాలని, ఎఫ్ 2కి మించి నవ్వించాలని చాలా కష్టపడి పని చేశాం. నా స్క్రిప్ట్ టీం కు చాలా థ్యాంక్స్. నవ్వడం ఈజీ కానీ కామెడీ క్రియేట్ చేయడం అంత తేలిక కాదు. నిర్మాత దిల్ రాజు గారు నాకు ప్రొడ్యుసర్ కంటే ఫ్యామిలీ అని చెప్పాలి. మా కాంబినేషన్ లో సినిమాలు వస్తూనే వుంటాయి, నిర్మాత శిరీష్ గారు నాకు గొప్ప ఎనర్జీ ఇస్తుంటారు. తమన్నా, మెహరీన్, సోనాల్, అలీ, రాజేంద్ర ప్రసాద్ , ఇలా సినిమాలో నటించిన నటీనటులు లందరికీ కృతజ్ఞతలు. అందరూ చక్కగా చేశారు. స్పెషల్ సాంగ్ చేసిన పూజా హెగ్డేకి కూడా కృతజ్ఞతలు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. వరుణ్ తేజ్ నా బ్రదర్ లాంటి వారు. ఈ సినిమాలో కొత్త వరుణ్ ని చూస్తారు. ఆయన టైమింగ్ అదిరిపోతుంది. వెంకటేష్ గారు నా ఆల్ టైం ఫేవరేట్ హీరో. కామెడీ టైమింగ్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటేష్ గారు గ్రేట్ ఇమేజ్ వున్న హీరో, కానీ కామెడీ చేసేటప్పుడు ఇమేజ్ ని పక్కన పెట్టి చేస్తారు. ఇలా చేయాలంటే లోపల చాలా పాజిటివ్ వుండాలి. ఎఫ్ 2కంటే ఎఫ్ 3 లో ఆయన మరింత హిలేరియస్ గా చేశారు. ఈ రెండేళ్ళ లో చాలా ఒత్తిళ్ళు అనుభవించాం, మే 27కి ఏమీ అలోచించకుండా ఎఫ్ 3ఆడుతున్న థియేటర్ లోకి వెళ్లి సరదాగా నవ్వుకోండి... నవ్వుకోండి.. నవ్వుకోండి.. '' అన్నారు
దిల్ రాజు మాట్లాడుతూ.. ఎఫ్ 3 రెండున్నర గంటల పాటు మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. అనిల్ రావిపూడి ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ గా డిజైన్ చేశారు. వెంకటేష్, వరుణ్ లాంటి గొప్ప నటులు మాకు హీరోలుగా దొరికారు. తమన్నా , మేహారీన్ సోనాల్ , రాజేంద్ర ప్రసాద్ గారు అలీ ,సునీల్ ఇలా చాల మంది మంచి నటులు ఈ సినిమాలో పూర్తి వినోదాన్ని పంచుతారు. ఈ సినిమాలో టెక్నిషిన్లందరు చక్కగా చేశారు. ఎఫ్ 2ని ఎంత చక్కగా ఎంజాయ్ చేశారో దాని కంటే గొప్పగా ఎఫ్3 ని ఎంజాయ్ చేస్తారు. ఎఫ్ 2లో వెంకటేష్ గారు వరుణ్ తేజ్ గారు ఎంత కెమిస్ట్రీ పండించారో ఎఫ్ 3లో దానికి మించి వుంటుందని ట్రైలర్ చూస్తే మీకు అర్ధమైవుంటుంది. ఎఫ్ 2లో ఇద్దరు హీరోయిన్ లు వుంటే ఎఫ్ 3కి వచ్చేసరికి నలుగురు అయ్యారు.సెన్సార్ వాళ్ళు ఆల్రెడీ సినిమా చూసి చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా ఫుల్ మీల్స్ లా వుంటుందని చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ తో మాది నాన్ స్టాప్ సక్సెస్ జర్నీ, ఎఫ్ 3కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. వరుణ్ తేజ్ ఫిదా,,ఎఫ్ 2.. ఇప్పుడు ఎఫ్ 3తో హ్యాట్రిక్. అలాగే వెంకటేష్ గారితో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2. ఎఫ్ 3 హ్యాట్రిక్. అనిల్ రావిపూడితో సుప్రీమ్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2, ఎఫ్ 3.. తర్వాత ఆరో సినిమాతో డబుల్ హ్యాట్రిక్. మే 27న ఎఫ్ 3వస్తుంది. మీ అందరినీ తప్పకుండా అలరిస్తుంది'' అన్నారు.
మెహరీన్ మాట్లాడుతూ : ఈ సినిమా కోసం అందరం చాలా ఆనందంగా పని చేశాం, సినిమా చూస్తున్నపుడు మీకు ఆ ఆనందం కలుగుతుంది. దిల్ రాజు, అనిల్ రావిపూడి గారి పెద్ద థ్యాంక్స్. హానీ లాంటి మంచి పాత్ర ఇచ్చారు. వెంకటేష్ గారు వరుణ్ తేజ్ చాలా ప్రోత్సహం అందించారు. ఈ సినిమా మీకు చాలా వినోదాన్ని పంచుతుంది'' అన్నారు.
సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. నిర్మాత దిల్ రాజు గారికి, అనిల్ రావిపూడిగారికి కృతజ్ఞతలు. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. రామానాయుడిగారి తర్వాత మూవీ మొఘల్ అని పిలిచుకునే నిర్మాత దిల్ రాజు గారు. ఈ సినిమా నిర్మాత శిరీష్ కూడా అద్భుతమైన వ్యక్తి. నేటి పరిస్థితి వందశాతం అవసరమైన సినిమా ఎఫ్ 3. దీనికి కారణం నవ్వు. ఒక మనిషి జీవితంలో నవ్వుకి ఎంత ప్రాధాన్యత వుందో చెప్పే సినిమా ఎఫ్ 3. సమాజంలో ఎన్ని సమస్యలు అన్నిటికి పరిష్కారం నవ్వు. నలఫై ఏళ్ళుగా నేను నమ్మింది ఇదే. ఎఫ్ 3 లో పాత్రలన్నీ నవ్వులు పంచుతాయి. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు అనిల్ రావిపూడికి దక్కుతుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది, ఈ సినిమా హిట్ కాకపొతే మళ్ళీ మీ ముందు ఎప్పుడూ నిలబడను. ఈ సినిమాలో ప్రతి పాత్ర అద్భుతంగా పడుతుంది. ఈ సినిమా ఎంత గొప్ప వినోదాన్ని అందిస్తుందో మే 27 ప్రేక్షకులు చూస్తారు.
అలీ మాట్లాడుతూ.. దర్శకుడు అనిల్ రావిపూడి చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. దిల్ రాజు గారు అనిల్ రావిపూడి అనే మొక్కకి నీళ్ళు పోశారు. ఈ రోజు అనిల్ రావిపూడి మహా వృక్షంగా ఎదిగి మాలాంటి ఎందరికో నీడని ఇస్తున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ అద్భుతమైన నటులు. మిగతా నటులంతా ఇందులో అద్భుతంగా చేశారు. ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి' అని కోరుకున్నారు.
సునీల్ మాట్లాడుతూ... ఎఫ్ 2 కంటే ఎఫ్ 3 అదిరిపోతుంది. ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు. ఆరోగ్యకరమైన నవ్వుతో ప్రేక్షకుల ఇమ్యునిటీ పెంచే సినిమా ఎఫ్ 3.'' అన్నారు
నటుడు వడ్లమాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. మ్యాన్ మేకింగ్ నేషన్ బిల్డింగ్' అని స్వామి వివేకనంద చెప్పారు. అంటే మనుషుల్ని నిర్మించడం ద్వారా బలమైన దేశాన్ని నిర్మించడం సాధ్యపడుతుంది. ఐతే దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి, శిరీష్ గారు మాత్రం ఫన్ మేకింగ్ సొసైటీ బిల్డింగ్ ని కొత్త థియరీ చెప్పారు. అంటే మంచి హాస్యభరిత చిత్రాల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడం వారి ఉద్దేశం. ఎఫ్ 3లో ఆరోగ్య కరమైన హాస్య వుంది. ఈ సినిమా చూసిన తర్వాత మీ ఒత్తిడ్లన్నీ తగ్గిపోతాయి'' అన్నారు
సీనియర్ నటి తులసి మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. ఇందులో వెంకటేష్ గారికి తల్లిగా కనిపించడం ఇంకా ఆనందంగా వుంది. దిల్ రాజు గారు, శిరీష్ గారు అద్భుతమైన నిర్మాతలు. దర్శకుడు అనిల్ గారు గొప్పగా తీశారు, వరుణ్ తేజ్ తో పాటు మిగతా నటులందరూ అద్భుతంగా చేశారు. ఎఫ్ 3ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని అన్నారు.
వై విజయ మాట్లాడుతూ.. దిల్ రాజు గారు ఎంతో పెద్ద మనసుతో చెన్నై లో వున్న నన్ను ఈ సినిమాలో నటింపచేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి చక్కని దర్శకుడు. ఎంతో గౌరవిస్తారు. ఎఫ్ 3తప్పకుండా గొప్ప విజయం సాధిస్తుంది'' అన్నారు.
రచయిత బాస్కరబట్ల మాట్లాడుతూ.. ఈ సినిమాలో లబ్ డబ్ పాట రాశాను అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దిల్ రాజు, అనిల్ రావిపూడిగారితో పని చేయడం మంచి అనుభవం. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది.
రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ ,.. ఈ సినిమాలో రెండు పాటలు రాశాను. రెండు హిట్స్ గా నిలిచాయి. ఎఫ్ 3 పెద్ద విజయం సాధిస్తుంది.'' అన్నారు.