ప్రొడ్యూసర్ గా ఈ పదహారు సంవత్సరాల జర్నీ కి చాల సంతోషం గా ఉంది, ముందు ముందు మరి కొన్ని ఇంటరెస్టింగ్ సబ్జక్ట్స్ తో వస్తున్నాం - బెక్కెం వేణు గోపాల్ బర్త్ డే స్పెషల్ ఇంటర్వ్యూ
అందరకి నమస్కారం ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం, సోషల్ మీడియా మిత్రుల కి అందరికి నమస్కారం, నా పుట్టినరోజు సందర్బంగా మీతో కలిసి మాట్లాడటం అనేది ఆనవాయితీ అది కొనసాగుతూనే వుంది, లక్కీ మీడియా స్థాపించి నిర్మాత గా ఇది నా పదహారో సంవత్సరం,2006 అక్టోబర్ 12న నా మొదటి సినిమా రిలీజ్ అయింది, ఈ పదహారు సంవత్సరాలు జర్నీలో నా మొదటి సినిమా టాటా బిర్లా సినిమా ఎంకరేజ్ మెంట్ తో ప్రతి ఇయర్ సినిమా లు తీస్తూ ప్రొడ్యూసర్ గా ఇబ్బందులు వున్నా కొనసాగటం గ్రేట్ అని అందరు చెప్తున్నారు, మేజర్ గా నా ఫ్యామిలీ సపోర్ట్ మరియు నా ఫ్రెండ్స్ సపోర్ట్ తో ఈ జర్నీ కొనసాగుతుంది, పాండమిక్ టైం లో కూడా పాగల్ అనే సినిమా రిలీజ్ చేయటం జరిగింది, ఇప్పుడు అల్లూరి సినిమా కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చింది, బూట్ కట్ బాలరాజు అనే సినిమా ప్రొడక్షన్ లో వుంది, ముందు ముందు కొన్ని సినిమాలు కథలు ఓకే చేసి ప్రీ ప్రొడక్షన్ లో వున్నాయి, థ్రిల్లింగ్ సబ్జక్ట్స్ వున్నాయి వాటి వివరాలు తరువాత చెప్తాను,మీ అందరి సపోర్ట్ తో నెక్స్ట్ బర్త్ డే కల్లా మంచి సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నాను.ప్రొడక్షన్ మేనేజర్ గా వచ్చి ప్రొడ్యూసర్ అవ్వటం జరిగింది, హీరో శివాజీ గారు మేము ఫ్రెండ్స్ ఆయన వల్ల నే టాటా బిర్లా సినిమా ఇచ్చారు, ఆర్టిస్టులు ఎంపిక, సినిమా బిజినెస్ అన్నిటిలో అనుభవం ఉంటేనే అతను పర్ఫెక్ట్ నిర్మాత అవుతాడు, నాకు మీడియా మీద చాలా గొప్ప గౌరవం వుంది, నేను మొదట జాబ్ చేసింది జెమినీ టీవీ లోనే, ఇంకా డైరెక్షన్ ఎప్పటికి చేయను.