నేను నిత్య విద్యార్థిని నా జీవితంలో తారసపడే ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ప్రతి ఒక్కరిని “ఆచార్య” గానే భావిస్తాను అన్నాడు మెగాస్టార్ చిరంజీవి.శ్రీమతి సురేఖ కొనిదల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మెగాస్టార్ చిరంజీవి ,కాజల్ అగర్వాల్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,పూజా హెగ్డే హీరో హీరోయిన్లు గా కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి,అన్వేష్ రెడ్డిలు నిర్మించిన “ఆచార్య” చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 29న గ్రాండ్ విడుదల చేస్తున్నారు .ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ప్రి రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..ఇందులో నేను నక్సలైట్ పాత్ర పోషిస్తున్నాను. ధర్మానికి అండగా నిలబడే వ్యక్తి కనుక “ఆచార్య” టైటిల్ కు జస్టిఫై అయ్యిందని అనుకుంటున్నాను. “రక్తసింధూరం” లో కూడా నేను నక్సలైట్ గా నటించాను .కానీ.. అందులో అగ్రెసివ్ గా ఉందే క్యారెక్టర్ కాగా ఇందులో నాయకత్వ లక్షణాలు ఉండే పాత్ర లో నటిస్తున్నాను. లోపల ఎంత ఆవేశం వున్నా పైకి చూపించలేడు. ఇక చరణ్ ది చాలా కీలకమైన పాత్ర కథను కథనాన్ని నా పాత్రను ప్రేక్షకుల్ని కూడా కదిలించే కారెక్టర్.ఈ పాత్ర చేయడం చరణ్ కు వీలు కాకపోతే పవన్ కళ్యాణ్ మరో బెస్ట్ ఆప్షన్ అయి ఉండేవాడు. నటన విషయంలో నేనెప్పుడూ చరణ్ కు సలహాలు ఇవ్వలేదు, ఇవ్వను ఎందుకంటే? నేను సలహాలు ఇస్తే నాలా అవుతాడు. తనకు తానుగా ఇంప్రూవ్ అవ్వడం తోనే ఒరిజినాలిటీ ఉంటుంది. ఈ సినిమాలో ఓక సీన్ లో కలిసి నటించినప్పుడు చరణ్ ఎక్స్ ప్రెషన్స్ చూసి నాకు గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్ళు వచ్చాయి. డైరెక్టర్ సీన్ ఓకే అని చెప్పిన తర్వాత కెమెరా ముందు నుంచి సంతృప్తిగా పక్కకు వస్తాడు. సీన్ అయిపోయిన తర్వాత కార్వాన్ లోకి వెళ్లకుండా సెట్లో అందరితోనూ కలివిడిగా ఉండటం భోజనం చేయడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సెట్స్ లో నేను కూడా అలాగే ఉండేవాన్నిచరణ్ ప్రవర్తన చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది.,
మారేడుమిల్లి షూటింగ్లో ఉన్నప్పుడు సెట్స్ దగ్గరికి సురేఖను రమ్మని నేను చెబితే.. చరణ్ రావద్దంటూ రాకుండా చేశాడు(నవ్వుతూ..) అమ్మ వస్తే నీతో.. నేను కలిసి ఉండే సమయం తగ్గిపోతుంది. మనం ఇలా షూటింగ్ లో ఇన్ని రోజులు గడిపే అవకాశం మళ్లీ రావచ్చు.. రాక పోవచ్చు ఇక్కడ నీతో.. కలిసి ఉండటం మధురానుభూతి అంటూ సురేఖను రానివ్వకుండా చేశాడు. నేను నిత్య విద్యార్థిని నా జీవితంలో తారసపడే ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ప్రతి ఒక్కరిని ఆచార్య లా గానే భావిస్తాను నేను నటనను ఆ ..ఆ.. లతో ప్రారంభిస్తే చరణ్ ఏకంగా యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. తను ఈ సినిమాకు తను మనసుపెట్టి నటించాడు.అందువల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. పాత దర్శకులతో వర్క్ చేయకుండా ఈ మధ్య కొత్త దర్శకులతోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారని ఒక పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. నేను ఎలాగో పాత వాడిని పాత పాత కలిసి చేస్తే మోత తప్ప ఏమీ ఉండదు. అందుకే కొత్త దర్శకులతో వర్క్ చేస్తే కొత్త ఐడియాస్ కొత్త థాట్స్ ను బయటకు తీసురావడమే కాక వాళ్ళు నన్ను నటుడిగా కొత్తగా ఆవిష్కరిస్తారు. ప్రపంచంలో ప్రతి రంగం కుంటుపడింది. సినిమారంగం కూడా ఈ ఒక్క సినిమాకు 50 కోట్ల ఇంట్రెస్ట్ చెల్లించాము.మేము కూడా ప్రభుత్వాలకు 42% టాక్స్ కడుతున్నాము.అందుకే మేము రిక్వెస్ట్ చేసుకుంటే ప్రభుత్వాలు కనికరించి టికెట్ రేట్లు పెంచుతూ జీవో ఇవ్వడం మేము అందించిన వినోదానికి ప్రేక్షకులు కొంత ఎక్కువ మొత్తం చెల్లించడం అనేది నష్టాలను భర్తీ చేయడానికే తప్ప మరొకటి కాదు అన్నారు.
చిత్ర దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. ధర్మం కోసం పాటుపడే రెండు బలమైన వ్యక్తుల కథే ఆచార్య.చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు మానిటర్ లో ఎవరిని చూడాలా అని కన్ఫ్యూజన్ అయ్యేవాన్ని ఏ సన్నివేశంలోనూ వీరిద్దరూ రీ..టేక్, రీ..షూట్స్ చెయ్యడానికి అవకాశం ఇవ్వలేదు. నక్సల్స్, టెంపుల్ టౌన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా చేశామే తప్ప ఆ రెండింటికీ సంబంధించిన ఫిలాసఫీలు, ఐడియాలజీ లు ఏమి సినిమాలో లేవు. టెంపుల్ టౌన్ లో ఉండే సిద్ధ అడవి ఎందుకు వెళ్ళాడు. అడవిలో ఉండే ఆచార్య టెంపుల్ లోకి ఎందుకు వచ్చాడు అనేది ప్రేక్షకులను కట్టుకుంటుంది. వీరిద్దరి జర్నీ నే తప్ప దేవాలయాల సంరక్షణ, నక్సలిజం సిద్ధాంతాలు ఉండవు. ఇది పూర్తిగా నా ఆలోచనల నుంచి వచ్చిన కల్పిత కథ. ప్రచారంలో ఉన్నట్టు దేవాదాయ భూములు గురించి కథ కూడా కాదు. చరణ్ నటించిన సిద్ధ పాత్ర కోసం మహేష్ గారిని ఎప్పుడు అనుకోలేదు అని అన్నాడు.
హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.. కథ విన్నప్పుడే నాకు క్యారెక్టర్ చాలా నచ్చేసింది. అటు ఆర్ ఆర్ ఆర్ చేస్తుండటం ఇటు నాన్న తో కలిసి నటించడం వల్ల కొంత ప్రెజర్ వుంది అది నాకు మంచిదే అయ్యింది ప్రెజర్ ఉంటేనే నేను బెటర్ గా వర్క్ చేస్తాను. రాజమౌళి గారు చెప్పినట్టు సెట్లోకి నేనెప్పుడూ తెల్లకాగితం లో వెళ్తాను పాత్రను అర్థం చేసుకొని డైరెక్టర్స్ కి తగ్గట్టు మౌల్డ్ అవుతాను.ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ గారికి నా ధన్యవాదాలు. ఏదేమైనా ఆచార్య కి నాది ఉడుత సాయమే అని అన్నారు.
హీరోయిన్ పూజ హెగ్డే మాట్లాడుతూ..చిరంజీవి గారు చరణ్ తో కలిసి డాన్స్ చేసిన సాంగ్ చూసా చరణ్ చాలా గ్రేస్ తో డ్యాన్స్ చేశాడు అయితే చిరంజీవి గారు ఫేషియల్ ఎక్స్ప్రెస్ తోనూ డాన్స్ చేస్తారు.స్టెప్స్ ఆటోమేటిక్ గా పడుతుంటాయంతే ఆ హావభావాల కోసమే మళ్ళీ మళ్ళీ ఆ పాట చూడాలనుకుంటారు.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.