Home » » Naveen Polishetty Anushka Shetty UV Creations Shooting From April 4th

Naveen Polishetty Anushka Shetty UV Creations Shooting From April 4th

ఏప్రిల్ 4 నుంచి అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి, యు.వి.క్రియేషన్స్ చిత్రం కొత్త షెడ్యూల్ ప్రారంభం..



సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, లేటెస్ట్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో ప్రతిష్ఠాత్మక యు.వి.క్రియేషన్స్ ఓ సినిమా అనౌన్స్ చేశారు. సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా యు.వి.క్రియేషన్స్ కు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థలో అనుష్క శెట్టి హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు. ఇది అనుష్కకు 48వ సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేశారు అనుష్క శెట్టి. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలను యు.వి.క్రియేషన్స్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

భాగమతి సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఒకేసారి విడుదలై అద్భుతమైన విజయం అందుకుంది. ఇందులో తనదైన నటనతో అందరినీ మెప్పించారు అనుష్క శెట్టి. ఇప్పుడు మూడోసారి అనుష్క యు.వి.క్రియేషన్స్ కలిసి సినిమా చేస్తున్నారు. నవీన్ పొలిశెట్టి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు మహేష్ బాబు న్యూ ఇమేజ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 4 నుంచి కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. అనుష్క అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఏ మాత్రం హడావిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు అనుష్క శెట్టి. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. త్వరలోనే దీనిపై దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. భాగమతి సినిమా తెలుగుతో పాటు సౌతిండియన్ భాషల్లో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాను కూడా మహేష్ బాబు అన్ని భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.


నటీనటులు:

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి తదితరులు


టెక్నికల్ టీం:

దర్శకుడు: మహేష్ బాబు

నిర్మాణ సంస్థ: యు.వి.క్రియేషన్స్

నిర్మాతలు: వంశీ, ప్రమోద్

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్




Share this article :