ధ్వని మోషన్ పోస్టర్ ప్రయోగాత్మకంగా ఉంది గెటప్ శ్రీను !!!
వినయ పాణిగ్రాహి, స్వాతి మండాది ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ధ్వని. నాగ దుర్గారావు సానా దర్శకత్వం వహిస్తున్నారు. పరమకృష్ణ మరియు సాధన నన్నపనేని నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఇటీవల కథానాయకుడు నవదీప్ విడుదల చేశారు. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను నటుడు గెటప్ శ్రీను విడుదల చేశారు.
ఈ సందర్భంగా గెటప్ శ్రీను మాట్లాడుతూ...
ధ్వని మోషన్ పోస్టర్ బాగుంది. కంటెంట్ బేస్డ్ సినిమాలను బాగా ఇష్టపడతారు. మంచి ప్రయత్నం తో చేసిన ధ్వని సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఆర్టిస్ట్ టెక్నీషియన్ కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.
శబ్ధానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వ్యాధితో బాధపడే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్‍గా రూపొందింది. ఇందులో కాన్సెప్ట్ ఆకట్టుకునేలా ఉంటుందని సినీ దర్శకుడు నాగ దుర్గారావు సానా తెలిపారు.
నటీనటులు:
త్రినాథ్ వర్మ, రవీందర్ రెడ్డి, భానవ సాగి తదితరులు
దర్శకత్వం: నాగ దుర్గారావు సానా
కెమెరామెన్: శశాంక్ శ్రీరామ్
నిర్మాత: పి.కె.పి క్రియేషన్స్
సంగీతం: ప్రతీక్, ఆనంద్ నంబియార్.